వాషింగ్టన్: అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ నిర్వహించిన చివరి విలేకరుల సమావేశంలో గందరగోళం నెలకొంది. గాజా వివాదంపై బైడెన్ పరిపాలన విధానాలను ఆయన సమర్థిస్తున్న సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గాజా యుద్ధాన్ని కవర్ చేసిన జర్నలిస్టు బ్లింకెన్‌ను విమర్శించారు. దీంతో, వారిని సమావేశం నుంచి బయటకు లాకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అమెరికాలో విదేశాంగ శాఖలో ఆంటోనీ బ్లింకెన్ నిర్వహించిన చివరి సమావేశంలో రసాభాస చోటుచేసుకుంది. సమావేశంలో భాగంగా బ్లింకెన్ మాట్లాడుతూ.. బైడెన్ నిర్ణయాలను సమర్ధించారు. బైడెన్ మంచి పరిపాలన అందించారని అన్నారు. ఇదే సమయంలో ఇజ్రాయెల్, గాజా విషయంలో బైడెన్ చొరవతోనే కాల్పులు విరమణ ఒప్పందం జరిగిందని చెప్పారు. ఈ సమయంలో గాజా యుద్ధాన్ని కవర్ చేసిన జర్నలిస్టు సామ్ హుస్సేనీ.. బ్లింకెన్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు.
ఈ క్రమంలో జర్నలిస్టులు.. గాజా మారణహోమానికి మంత్రివి అంటూ ఘాటు విమర్శలు చేశారు. బైడెన్ పాలనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ మొదలు అంతర్జాతీయ నేర న్యాయస్థానం దాకా ఇజ్రాయెల్ నరమేధం జరుపుతోందని, నాశనం చేస్తోందని చెప్పాయి. మీరు ఆ ప్రక్రియను గౌరవించమని చెబుతున్నారు. గాజా విషయంలో ఇన్ని రోజులు మారణహోమం జరుగుతున్నా ఎందుకు పట్టించుకోలేదు అంటూ ప్రశ్నలు సంధించారు. మీరంతా నేరస్థులు. జర్నలిస్టుల చావులకు మీరే కారణం. మీరు ఎందుకు అంతర్జాతీయ న్యాయస్థానం దిహేగ్‌లో ఉండకూడదు అంటూ విమర్శించారు.
దీంతో, బ్లింకెన్ ఆగ్రహంతో ఊగిపోయారు. అనంతరం.. సమావేశంలో ఉన్న సిబ్బంది సదరు జర్నలిస్టులను అక్కడి నుంచి లాక్కెళ్లారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ నినాదాలు చేశారు. గాజా మారణహోమానికి మంత్రి బ్లింకెన్ అంటూ నినాదం చేశారు. దీంతో, సమావేశంలో గందరగోళం నెలకొంది. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
The goodbye he deserves!
Secretary of State, Antony Blinken was confronted about America’s action in enabling genocide in Gaza.
“Why aren’t you in The Hague?!”
“300 reporters were on the receiving end of your bombs”
“Why did you allow the holocaust of our time to happen?!” pic.twitter.com/f09fyThjDV— OnePath Network (@OnePathNetwork) January 17, 2025
Comments
Please login to add a commentAdd a comment