Antony Blinken
-
సిరియాతో టచ్‌లోనే అమెరికా.. బ్లింకెన్ కీలక వ్యాఖ్యలు
జోర్డాన్: సిరియాలో తిరుగుబాటుదారుల మొహమ్మద్ అల్ బషీర్ ప్రభుత్వంతో అమెరికా ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్నట్టు విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చెప్పుకొచ్చారు. సిరియా ప్రజల కోసం ఇతర పార్టీలతో కూడా అమెరికా చర్చలు జరుపుతున్నట్టు ఆయన వెల్లడించారు.ఆంటోని బ్లింకెన్ జోర్డాన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. సిరియాతో కొత్త ప్రభుత్వంతో బైడెన్ టచ్‌లో ఉన్నారు. బషీర్ ప్రభుత్వం సహా ఇతర పార్టీలతో మేము చర్చలు జరుపుతున్నాం. సిరియా ప్రజలకు సాయం చేసేందుకు అమెరికా సిద్దంగా ఉంది. పాలనలో బషీర్ ప్రభుత్వం విజయవంతం కావాలని కోరుకుంటున్నాం అని చెప్పారు. ఇదే సమయంలో తాము సిరియా అంతర్గత విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశారు.మరోవైపు.. జోర్డాన్ విదేశాంగ మంత్రి అమాన్ సఫాది మాట్లాడుతూ.. సిరియాలో గందరగోళ పరిస్థితులు సృష్టించడం మాకు ఇష్టం లేదు. బషీర్ పాలనలో సిరియా ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.ఇదిలా ఉండగా.. సిరియాలో తిరుగుబాటుదారుల కారణంగా అధ్యక్షుడు అసద్.. దేశం విడిచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అసద్ కుటుంబంతో సహా రష్యాలో తలదాచుకున్నారు. అసద్‌కు రష్యా ఆశ్రయం కల్పించింది. అసద్ సిరియాను వదిలివెళ్లిన తర్వాత అక్కడ కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం, తిరుగుబాటుదారుల మద్దతుతో అల్ బషీర్ తాత్కాలిక ప్రధానిగా ఎన్నికయ్యారు. -
బ్లింకెన్ ‘కొత్త ఒప్పంద’ వ్యాఖ్యలపై హమాస్ విమర్శలు
గాజా కాల్పుల విరమణ ఒప్పంద చర్చలపై అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్ చేసిన వ్యాఖ్యపై హమాస్ విమర్శలు చేసింది. ఆయన వ్యాఖ్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యంగా లేవని పేర్కొంది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు నవీకరించిన ఒప్పంద ప్రతిపాదనను ఆమోదించారని ఆంటోని బ్లింకెన్ చేసిన వాఖ్యలపై హమాస్ సీనియర్ అధికారి ఒసామా హమ్దాన్ స్పందించారు.‘నవీకరించిన గాజా కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పటం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆ ఒప్పందం మాకు సమర్పించింది (లేదా) అంగీకరించినది కాదు. మాకు కొత్త గాజా కాల్పుల విరమణ చర్చలు అవసరం లేదు. అమలు యంత్రాంగాన్ని మేము అంగీకరించము’అని అన్నారు.సోమవారం బ్లింకెన్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో సమావేశమయ్యారు. నెతన్యాహుతో సమావేశం అనంతరం.. ‘ఇది చాలా కీలమైన దశ.. ఒప్పందానికి ఆఖరి అత్యుత్తమ అవకాశం. అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందానికి నెతన్యాహు మద్దతు తెలిపారు. హమాస్ కూడా ఈ ప్రతిపాదనకు అంగీకరించాలి. కొత్త గాజా కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరిస్తున్నట్లు నెతన్యాహు చెప్పారు’అని అన్నారు.అమెరికా, ఈజిప్టు, ఖతార్‌ల మధ్యవర్తిత్వంతో గురువారం ప్రారంభమైన గాజా కాల్పుల విరమణ చర్చలు ఎలాంటి పురోగతి లేకుండానే శుక్రవారం ముగిసిన విషయం తెలిసిందే. ఈ వారంలో మళ్లీ చర్చలు ప్రారంభం కానున్నాయి. -
కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ఒప్పుకుంది
టెల్ అవీవ్: గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదలపై ఉన్న విభేదాలను తగ్గించే ప్రతిపాదనకు ఇజ్రాయెల్ ఆమోదం తెలిపిందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు. ఇదేవిధమైన సానుకూలతతో స్పందించాలని ఆయన హమాస్‌ను కోరారు. హమాస్ సంస్థ పెడుతున్న షరతులపై మాత్రం ఆయన ఎటువంటి వ్యాఖ్యా చేయలేదు. అలాగే, గాజా గుండా వెళ్లే ప్రధాన రహదారిపై పెత్తనం తమకే ఉండాలని ఇజ్రాయెల్ చేస్తున్న డిమాండ్‌పైనా ఆయన స్పందించలేదు. గతేడాది అక్టోబర్ నుంచి హమాస్ చెరలో ఉన్న బందీలందరినీ విడుదల చేయడం, బదులుగా గాజా నుంచి ఇజ్రాయెల్ ఆర్మీ ఉపసంహరణ, ఇజ్రాయెల్‌లోని పాలస్తీనా ఖైదీల విడుదల వంటి కీలకాంశాలు మూడు దశల్లో అమలవుతాయి. బ్లింకెన్ సోమవారం టెల్అవీవ్లో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో రెండున్నర గంటలపాటు విస్తృతస్థాయి చర్చలు జరిపారు. అనంతరం బ్లింకెన్ మీడియాతో మాట్లాడారు. యుద్ధం కారణంగా పడుతున్న కడగండ్ల నుంచి పాలస్తీనియన్లకు విముక్తిని, హమాస్ చెరలో మగ్గుతున్న బందీలకు స్వేచ్ఛను ప్రసాదించే కాల్పుల విరమణ ఒప్పందం ఖరారుకు ఇదే సరైన సమయమని వ్యాఖ్యానించారు. ‘ఇది నిర్ణయాత్మకంగా వ్యవహరించేందుకు ఎంతో అనువైన సమయం. శాంతిని, సుస్థిరతను సాధించేందుకు బహుశా ఇదే చివరి అవకాశం కావచ్చు’అని వ్యాఖ్యానించారు. ఈ ప్రక్రియను పక్కదారి పట్టించేందుకు ఎవరూ ప్రయతి్నంచకుండా చూసుకోవడం కూడా అవసరమని ఇరాన్‌ను ఉద్దేశించి ఆయన పరోక్షంగా పేర్కొన్నారు. ఈ ఉద్రిక్తతలు మరిన్ని ప్రాంతాలకు వ్యాపిస్తే ఆ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. బ్లింకెన్ మంగళవారం కైరో చేరుకుంటారు. ఈజిప్టు, అమెరికా తదితర దేశాల మధ్యవర్తిత్వంతో కైరోలో చర్చలు జరుగుతున్నాయి. -
నెతన్యాహుపై హమాస్ సంచలన ఆరోపణలు
గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఆదివారం ఇజ్రాయెల్ ఆర్మీ చేసిన వైమానిక దాడుల్లో 29 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు.. గాజాలో ఉద్రిక్తతలు తగ్గించటంతో పాటు, కాల్పుల విరమణ ఒప్పందం ప్రయత్నాల కోసం అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకన్ ఇజ్రాయెల్‌కు వెళ్లారు.ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం.. అమెరికా, ఈజిప్ట్, ఖతార్ దేశాల మధ్యవర్తిత్వంతో దోహాలో రెండు రోజుల చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ చర్చల్లో ఇజ్రాయెల్ అధికారులు కాల్పుల విరమణపై కొంత సానుకూలంగా వ్యవహరించినట్లు తెలిపారు. మరోవైపు.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కొత్త షరతులు విధించారని గాజా నుంచి పూర్తిగా బలగాల ఉపసంహరణను తిరస్కరించారని హమాస్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘మధ్యవర్తుల ప్రయత్నాలను, ఒప్పందాన్ని అడ్డుకోవాలని ప్రధాని నెతన్యాహు చూస్తున్నారు. గాజాలో బంధీల జీవితాలకు పూర్తి బాధ్యత ఆయనదే’ అని హమాస్ ఆరోపించింది.ఇక.. ఇప్పటివరకు ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 40 వేల మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు. 2.3 మిలియన్ ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. భీకరమైన ఇజ్రాయెల్ దాడులతో గాజాలో ఆహార ఇబ్బందులు, పోలీయో వంటి వ్యాధలు ప్రబలుతున్నాయని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. -
ఇజ్రాయెల్- హమాస్ యుద్దం.. ఆంటోని బ్లింకెన్ హెచ్చరికలు
గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు కొనసాగుతునే ఉన్నాయి. ఆదివారం దక్షిణ గాజాపై ఇజ్రాయెల్ బలగాలు దాడులతో విరుచుకుపడ్డాయి. అయితే ఈ క్రమంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆదివారం ఖతర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై బ్లింకెన్ హెచ్చరించారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్దం ఇలాగే కొనసాగితే.. గాజాతో మరిన్ని ప్రాంతాలకు యుద్ధ తీవ్రత విస్తరించనుందని తెలిపారు. దీని వల్ల మధ్య ప్రాచ్యంలో భద్రతకు ముప్పు ఉండనుందని అన్నారు. గాజా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు మరింతగా పెరుగతాయిని అన్నారు. హమాస్- ఇజ్రాయెల్ ఘర్షణలు ఇలాగానే కొనసాగితే.. ఇక్కడ ప్రజలు అభద్రతతో మరిన్ని బాధలు ఎదుర్కొవల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల తీవ్రత తగ్గిన అనంతరం వలస వెళ్లిన ప్రజలు మళ్లీ తిరిగి రావాలన్నారు. ఘర్షణను తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. అక్టోబర్7న నుంచి హమాస్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలో వేల మంది పాలస్తీనియన్లు పలు దేశాలు వలస వెళ్లారు. ఇక.. గాజాలో హమాస్‌ను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులతో విచురుకుపడుతోంది. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటివరకు 22,722 మంది పాలస్తీనియన్లు మృత్యువాత పడ్డారు. చదవండి: ఇజ్రాయెల్ దాడుల్లో జర్నలిస్టుల మృతి -
Israel-Hamas war: ఇజ్రాయెల్–హమాస్ ఒప్పందం పొడిగింపు
గాజా్రస్టిప్/జెరూసలేం: కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరొక రోజు పొడిగించేందుకు ఇజ్రాయెల్–హమాస్ గురువారం అంగీక రించాయి. వాస్తవానికి గురువారం ఉదయం 7 గంటలకు ఒప్పందం ముగిసింది. బందీలంతా ఇంకా విడుదల కాకపోవడం, గాజాలోని పాలస్తీనియన్లకు మరింత మానవతా సాయం అందాల్సి ఉండడంతో ఒప్పందం పొడిగింపునకే ఇరుపక్షాలు మొగ్గుచూపాయి. గాజాలోని శాంతి కోసం ఇజ్రాయెల్, హమాస్‌పై అంతర్జాతీయ సమా జం నుంచి ఒత్తిడి పెరుగుతోంది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ బుధవారం రాత్రి ఇజ్రాయెల్ చేరుకున్నారు. ఇజ్రాయెల్–హమాస్ మధ్య ఘర్షణలకు తెరదించే దిశగా ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేయనున్నట్లు తెలిసింది. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ మిలిటెంట్లు ఇప్పటిదాకా 73 మంది ఇజ్రాయెలీలను, 24 మంది ఇతర దేశస్తులను విడుదల చేశారు. ఇంకా 126 మంది హమాస్ చెరలో బందీలుగా ఉన్నట్లు అంచనా. జెరూసలేంలో కాల్పులు.. ముగ్గురి మృతి జెరూసలేంలో ఉద్రిక్తత పరిస్థితుల నెలకొన్నాయి. బుధవారం ఉదయం 7.40 గంటలకు వీచ్మ్యాన్ వీధిలో బస్‌స్టాప్‌లో నిల్చున్న ప్రయాణికులపై ఇద్దరు సాయుధ పాలస్తీనియన్ దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఇజ్రాయెలీలు మృతిచెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు. భద్రతా సిబ్బంది జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు దుండుగులు హతమయ్యారు. వారిద్దరూ తూర్పు జెరూసలేంకు చెందిన సోదరులని తెలిసింది. గతంలో ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొని జైలుకు వెళ్లొచ్చారు. -
US-India Relations: బలమైన రక్షణ బంధం
న్యూఢిల్లీ: భారత్, అమెరికా మధ్య అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ఇరుదేశాల రక్షణ, విదేశాంగ మంత్రులు శుక్రవారం ఢిల్లీలో విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ అస్టిన్, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వీటిలో పాలుపంచుకున్నారు. రక్షణ ఉత్పత్తుల తయారీ, అరుదైన ఖనిజాల అన్వేషణ, అత్యున్నత సాంకేతికత వంటి రంగాల్లో కలిసి పని చేయాలని నిర్ణయించారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం, పశ్చిమాసియాలో పరిణామాలు, ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా సైనిక దూకుడుకు అడ్డుకట్ట వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఉక్రెయిన్–రష్యా యుద్ధం, తాజా పరిణామాలపై మంత్రులు చర్చించుకున్నారు. అనంతరం చర్చల వివరాలను వెల్లడిస్తూ మంత్రులు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ముంబైలో 26/11 ఉగ్ర దాడులకు, పఠాన్‌కోట్ దాడులకు పాల్పడ్డ ముష్కరులకు శిక్ష పడి తీరాల్సిందేనని ప్రకటన స్పష్టం చేసింది. ఈ మేరకు పాకిస్థాన్‌కు మంత్రుల భేటీ స్పష్టమైన హెచ్చరికలు చేసిందని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడంతో పాటు ఐసిస్ సహా ఉగ్ర సంస్థలన్నింటినీ నిర్మూలించేందుకు అన్ని దేశాలూ కలసికట్టుగా ప్రయత్నించాలని పిలుపునిచి్చనట్టు వివరించింది. ఫలప్రదం: జై శంకర్ అమెరికా మంత్రులతో చర్చ లు ఫలప్రదంగా సాగాయని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ సంతృప్తి వ్యక్తం చేశారు. రక్షణ సంబంధాలను మెరుగుపర్చుకోవడం, అంతరిక్ష పరిశోధనలు, సాంకేతికత రంగాల్లో పరస్పరం సహకరించుకోవడంతోపాటు రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలపై చర్చించుకున్నామని తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేశారు. అంతకముందు చర్చల ప్రారంభ కార్యక్రమంలో ఎస్.జైశంకర్ మాట్లాడారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉమ్మడి లక్ష్యాన్ని సాధించడానికి ఈ చర్చలు ఒక అద్భుత అవకాశమని అభివరి్ణంచారు. భారత్–అమెరికా మరింత సన్నిహితం కావడంతోపాటు ఉమ్మడి నిర్మాణాత్మక గ్లోబల్ అజెండాను రూపొందించుకోవాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లక్ష్యమని గుర్తుచేశారు. ఇరు దేశాల సంబంధాలు ఇతోధికంగా వృద్ధి చెందుతున్నాయన్నారు. ఇండో–పసిఫిక్‌ను స్వేచ్ఛాయుత, వృద్ధిశీల, భద్రతాయుతమైన ప్రాంతంగా తీర్చిదిద్దడానికి ప్రాధాన్యమిస్తున్నట్టు బ్లింకెన్ తెలిపారు. అంతేగాక అంతర్జాతీయ శాంతి, భద్రత తదితరాల సాధనకు కూడా ఇరు దేశాలూ కలసికట్టుగా కృషి చేస్తున్నాయన్నారు. భారత్–అమెరికా సంబంధాలకు రక్షణ ఒప్పందాలు మూలస్తంభంగా నిలుస్తున్నాయని రాజ్‌నాథ్ అభిప్రాయపడ్డారు. చైనా దూకుడుకు సంయుక్తంగా అడ్డుకట్ట వేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. సంయుక్తంగా సాయుధ సైనిక వాహనాల తయారీ: ఆస్టిన్ ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న కీలకమైన సాయుధ సైనిక వాహనాల సంయుక్త తయారీ విషయంలో తక్షణం ముందుకు వెళ్లాలని భారత్–అమెరికా నిర్ణయించినట్టు లాయిడ్ ఆస్టిన్ తెలిపారు. ఇరు దేశాల సైనిక దళాల మధ్య సమాచార వ్యవస్థను అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. అలాగే ద్వైపాక్షిక రక్షణ పారిశ్రామిక వ్యవస్థల మధ్య సాన్నిహిత్యాన్ని మరింత పెంచేందుకు ఉద్దేశించిన సెక్యూరిటీ ఆఫ్ సప్లై అరేంజ్మెంట్ (ఎస్ఓఎస్ఏ) ఒప్పందం ఖరారు తుది దశకు చేరిందని మంత్రి చెప్పారు. జీఈ ఎఫ్–414 జెట్ ఇంజన్లను భారత్‌లో తయారు చేసేలా జనరల్ ఎలక్ట్రిక్ ఏరో స్పేస్, హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు ఊపందుకున్నాయన్నారు. అలాగే భారత్‌కు వీలైనంత త్వరగా అత్యాధునిక ఎంక్యూ–9బి డ్రోన్లను సరఫరా చేయనున్నట్టు వెల్లడించారు. ఇది 300 కోట్ల డాలర్ల ఒప్పందం. ఆగడాలకు అడ్డుకట్ట పడాల్సిందే: భారత్ కెనడాలో ఖలిస్తానీ శక్తుల ఆగడాలు పెరిగిపోతుండటం ఆందోళనకరమని అమెరికాకు భారత్ స్పష్టం చేసింది. మంత్రుల చర్చల సందర్భంగా ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించినట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వట్రా మీడియాకు వెల్లడించారు. వాటికి అడ్డుకట్ట పడాల్సిందేనని బ్లింకెన్, లాయిడ్లకు రాజ్‌నాథ్ స్పష్టం చేశారన్నారు. ఈ విషయంలో భారత ఆందోళనను అర్థం చేసుకోగలమని వారు చెప్పారన్నారు. ప్రధానితో మంత్రుల భేటీ భారత్–అమెరికా ద్వైపాక్షిక బంధం ప్రపంచ శాంతికి, ప్రగతికి అతి పెద్ద చోదక శక్తిగా మారుతోందని ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వెలిబుచ్చారు. మంత్రుల స్థాయి భేటీ అనంతరం అమెరికా విదేశాంగ, రక్షణ మంత్రులు బ్లింకెన్, ఆస్టిన్ ఇరువురు శుక్రవారం రాత్రి ఆయనతో సమావేశమయ్యారు. విదేశంగ మంత్రి జై శంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కూడా భేటీలో పాల్గొన్నారు. సదస్సు జరిగిన తీరును, తీసుకున్న నిర్ణయాలను వారు మోదీకి వివరించారు. ‘‘ప్రజాస్వామ్యం, బహుళత్వ విలువలపై భారత్, అమెరికాలకున్న ఉమ్మడి విశ్వాసం తిరుగులేనివి. ఇరు దేశాల మధ్య జరిగిన మంత్రుల స్థాయి చర్చలు ఆశించిన ఫలితాలు సాధించినందుకు ఆనందంగా ఉంది’’ అంటూ భేటీ అనంతరం మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. బ్రెజిల్ అధ్యక్షుడు లులా డ సిల్వా శుక్రవారం మోదీకి ఫోన్ చేశారు. పశి్చమాసియా ఉద్రిక్తత తదితరాలపై నేతలు ఆందోళన వెలిబుచ్చారు. అక్కడ యుద్ధ మేఘాలు తీవ్ర రూపు దాలుస్తుండటం, ఉగ్రవాదం, మతి లేని హింస భారీ జన నష్టానికి దారి తీస్తుండటం దారుణమన్నారు. బ్రెజిల్ జీ20 సారథ్యం సఫలం కావాలని ఈ సందర్భంగా మోదీ ఆకాంక్షించారు. -
భారత వ్యతిరేక కార్యకలాపాల అడ్డాగా కెనడా
వాషింగ్టన్: కెనడాలో ఖలిస్తాన్ వేర్పాటువాద నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ మృతి, దానికి సంబంధించిన రగడపై అమెరికాతో లోతుగా చర్చించినట్టు విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన గురువారం ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో భేటీ అయ్యారు. హత్యపై కెనడా జరుపుతున్న దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలని బ్లింకెన్ ఈ సందర్భంగా సూచించినట్టు విదేశాంగ శాఖ ఉన్నతాధికారి ఒకరు శుక్రవారం పేర్కొన్నారు. అనంతరం దీనిపై జై శంకర్ స్పందించారు. భారత్ లక్ష్యంగా వేర్పాటువాదం, హింస, వ్యవస్థీకృత నేరాలు, మనుషుల అక్రమ రవాణా వంటివాటికి కెనడా కొన్నేళ్లుగా అడ్డాగా మారుతోందని మండిపడ్డారు. ‘పైగా అక్కడి ప్రభుత్వం కూడా కొన్నేళ్లుగా అలాంటి వాటిని అనుమతిస్తున్న ధోరణి కనబరుస్తోంది. ట్రూడో సర్కారు రాజకీయ అనివార్యతలే ఇందుకు కారణం‘ అని ఆరోపించారు. ‘కెనడాలో భారత దౌత్యవేత్తలను బాహాటంగా బెదిరించే దుస్థితి నెలకొంది! కార్యాలయాలకు వెళ్లడం కూడా రిసు్కగా మారింది. అందుకే ఆ దేశానికి వీసా సేవలను కూడా ఆపేయాల్సి వచి్చంది‘ అని జైశంకర్ వివరించారు. బ్లింకెన్‌తో జైశంకర్ -
ఎట్టకేలకు ఒక ముందడుగు!
ప్రపంచంలోని రెండు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు... ఒకదానిపై మరొకదానికి ఒంటి నిండా అనేక అనుమానాలు, అపనమ్మకాలు. అలాంటి దేశాలు కూర్చొని చర్చించుకుంటే అది పెద్ద విశేషమే. అమెరికా, చైనాల మధ్య ఈ వారం అదే జరిగింది. అస్తుబిస్తుగా ఉన్న తమ సంబంధాలను చక్కదిద్దు కొనేందుకు అవసరమైన ఒక అడుగు ముందుకు వేశాయవి. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తాజా చైనా పర్యటన అనేక విధాల గుర్తుండిపోయేది అందుకే. 2018 తర్వాత గడచిన అయిదేళ్ళలో అమెరికా విదేశాంగ మంత్రి ఒకరు చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి. పర్యటనలో భాగంగా చివరిరోజైన సోమవారం సాక్షాత్తూ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో సైతం బ్లింకెన్ సమావేశమై, ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ కోసం ప్రయత్నించడం ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి రేపింది. అరుదైన ఈ పర్యటనలో కళ్ళు చెదిరే కీలక ప్రకటనలేవీ లేకపోవచ్చు. కానీ, అసలంటూ ఘర్షణ వాతావరణాన్ని ఉపశమింపజేసి, తమ మధ్య సంబంధాలను సమస్థితికి తీసుకురావాలని రెండు దేశాలూ అంగీకరించడమే అతి పెద్ద వార్త అయింది. పరస్పరం నిష్కర్షగా అభిప్రాయాలు పంచు కొన్న ఈ చర్చలు భవిష్యత్తు పట్ల ఆశలు రేపాయి. నిజానికి, మునుపటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాం నుంచి కొన్నేళ్ళుగా అమెరికా తన దూకుడు చర్యలతో డ్రాగన్‌కు కోపం తెప్పించింది. ఫలితంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. మళ్ళీ గాడిన పెట్టాలనుకున్నా, ఫిబ్రవరిలో గగనతలంలో పయనిస్తూ భారీ బెలూన్ అమెరికాలో కనిపించేసరికి వ్యవహారం ముదిరింది. చైనా బెలూన్ గూఢచర్యానికి పాల్పడుతోందంటూ ఆరోపణలు మిన్నంటాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బాహాటంగానే చైనాను తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో బ్లింకెన్ తాజా చైనా పర్యటన, సత్సంబంధాల పునరుద్ధరణ ప్రయత్నం ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఒక విధంగా– బీజింగ్‌తో సంభాషణ వాషింగ్టన్ ఏరికోరి ఎంచుకున్నది కాదు. తప్పనిసరి అనివార్యత. తాజా సంభాషణల్లో సైతం బీజింగ్ తన మూతి బిగింపు పూర్తిగా వీడినట్టు లేదు. ఆ దేశం కాస్తంత నిష్ఠురంగానే ఉన్నా వైట్‌హౌస్ వర్గం తమ పని తాము కొనసాగించక తప్పదు. స్వీయ ప్రయోజనాల రీత్యా డ్రాగన్‌తో మాటామంతీ కొనసాగింపే అమెరికాకు ఉన్న మార్గం. కొద్ది వారాలుగా ఈ ప్రయత్నాలు కాస్త ముమ్మరించాయి. చైనాకు చెందిన అగ్ర దౌత్యవేత్త వాంగ్ యీతో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివాన్ గత నెల వియన్నాలో రెండు రోజులు ‘‘నిర్మాణాత్మక’’ సమావేశాలు జరపడాన్ని ఈ దృష్టితోనే చూడాలి. ఫలితంగా అమెరికా వాణిజ్య కార్యదర్శి, చైనా వాణిజ్య శాఖ మంత్రితో అమెరికాలో మాట కలిపేందుకు తలుపులు తెరుచుకు న్నాయి. ఇక, మధ్యశ్రేణి అమెరికన్ అధికారులు బీజింగ్‌లో పర్యటించారు. అమెరికా గూఢచారి విభాగం సీఐఏ డైరెక్టర్ సైతం సద్దు లేకుండా చైనా సందర్శించిన సంగతి మర్చిపోలేం. దీన్నిబట్టి భౌగోళిక రాజకీయాలకు అతీతంగా డ్రాగన్‌తో దోస్తీకి అగ్రరాజ్యం చేయిచాస్తోందని అర్థమవుతోంది. బంధాలు మెరుగుపడడం దేవుడెరుగు, కనీసం మరింత క్షీణించకుండా ఆపడానికి బ్లింకెన్ పర్య టన ఉపకరిస్తుంది. తక్షణ ప్రయోజనాలు ఆశించలేం కానీ, చైనా విదేశాంగ మంత్రితో, అగ్ర దౌత్య వేత్తతో ‘నిక్కచ్చిగా’ సంభాషణలు సాగడంతో, ఆఖరి రోజున డ్రాగన్ దేశాధినేతతో బ్లింకెన్ భేటీకి మార్గం సుగమం అయింది. రానున్న రోజుల్లో ఇది రెండు అగ్రరాజ్యాల అధినేతల మధ్య భేటీకి దారి తీయగలదని ఆశించడానికి వీలు కలిగింది. సైనిక ఘర్షణ ముప్పును తగ్గించుకోవాలని రెండు దేశాలూ ఒకే ఆలోచనకైతే వచ్చాయి. ఈ దిగ్గజ దేశాల మధ్య బంధం సుస్థిరంగా ఉండడం ప్రపంచ శాంతికి సైతం అవసరం. నిజానికి, చైనా ఆశలు, ఆకాంక్షలు అపరిమితమే అయినా, షీ మాత్రం విశ్వనేతగా అమెరికా స్థానంలోకి రావాలనే ఆలోచన, వ్యూహం తమకు లేదని చెబుతున్నారు. చైనా తనదిగా ప్రకటించుకొనే స్వయంపాలిత ద్వీపం తైవాన్‌కు వచ్చే ఏడాది ప్రథమార్ధంలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. తైవాన్‌పై డ్రాగన్ వేసే అడుగులను గ్రహించడంలో అంచనాలు తప్పితే ప్రమాదం తప్పదన్న తెలివిడి అమెరికాకు ఉంది. అందుకే, సంబంధాల మెరుగుదలకు, మరీ ముఖ్యంగా సైనిక చర్చల పునరుద్ధరణకు వాషింగ్టన్ తహతహలాడింది. కానీ, తమ రక్షణ మంత్రిపైన అమెరికా ఆంక్షలు కొనసాగుతున్న వేళ బీజింగ్ అందుకు ఇష్టపడలేదు. అమెరికా మరింత స్పష్టమైన చర్యలతో, సంకల్పంలో నిజాయతీ ఉందని నిరూపించుకొనేలా ముందుకు రావాలని చూస్తోంది. ఆ మాటకొస్తే, గతంలో తనకూ, బైడెన్‌కూ మధ్య కుదిరిన ఒప్పందాల పైనే ఇరుపక్షాలూ ఇంకా చర్యలు చేపట్టాల్సి ఉందని బ్లింకెన్‌కు షీ గుర్తు చేశారు. రానున్న నెలల్లో పరిణామాల్ని బట్టి, షీ– బైడెన్ల శిఖరాగ్ర సమావేశానికి అవకాశాలుంటాయి. సొంతగడ్డపై రాజకీయ ఒత్తిళ్ళ రీత్యా చైనాపై కఠిన వైఖరిని బైడెన్ సర్కార్ ఏ మేరకు మార్చుకో గలుగుతుందన్నది సందేహమే. అధ్యక్ష పదవికి ఎన్నికల ప్రచారం దగ్గరవుతున్న వేళ బైడెన్‌కు అది మరీ కష్టం. అయితే, భౌగోళిక రాజకీయాల్లో పొరపొచ్చాలెన్ని ఉన్నా, ప్రపంచ కుగ్రామంలో ఆర్థిక అనివార్యతలే కీలకమనే స్పృహ ఈ అగ్రశక్తులు రెంటికీ పుష్కలం. అదే ఇప్పుడు ఇరు పక్షాల మధ్య అపనమ్మకాన్ని వదిలించుకొనే మాటలకు దృశ్యాదృశ్య హేతువు. పరిమిత సహకారం, ఉద్రిక్తతల్లో కొంత ఉపశమనం సరిపోతాయా? చెప్పలేం. కానీ, నిరంతర సంభాషణలకు సిద్ధంగా ఉన్నామన్న ఈ సంకేతమే గనక ఇవ్వకుంటే, విశ్వశాంతికి కీలకమైన బంధాన్ని చేతులారా చెడగొడుతున్న బాధ్యతారహిత పెద్దన్నలనే ముద్ర మిగిలిపోతుంది. ఆ ఎరుక అమెరికా, చైనాలకు దండిగా ఉంది. -
నిర్దిష్టమైన అంశాలపై ఒప్పందం
బీజింగ్: దాదాపు ఐదేళ్ల తర్వాత చైనాలో పర్యటిస్తున్న అమెరికా విదేశాంగ మంత్రితో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య కొన్ని నిర్దిష్టమైన అంశాలపై ఒప్పందం కుదిరిందని జిన్‌పింగ్ ప్రకటించారు. అయితే ఆ ఒప్పందాల వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. ఇటీవల అమెరికా గగనతలంలో చైనా నిఘా భారీ బెలూన్లు చక్కర్లు కొట్టడం, వాటిని అమెరికా వాయుసేన కూల్చేయడం వంటి ఘటనలతో ఇరుదేశాల మధ్య సత్సంబంధాల్లో సందిగ్ధత నెలకొన్న విషయం తెల్సిందే. ‘‘ఇటీవల బాలీలో బైడెన్‌తో కుదిరిన ‘కనీస అవగాహన’కు కొనసాగింపుగా చైనా తన వైఖరిని స్పష్టంచేసింది. ప్రత్యేకంగా కొన్ని అంశాల్లో ఒప్పందాలు కుదిరాయి. ఇరు దేశాలు ఉమ్మడిగా పురోగతి సాధించాయి. పరస్పర గౌరవం, నమ్మకాల మీదనే చర్చలు సఫలమవుతాయి’’ అని భేటీ తర్వాత జిన్‌పింగ్ వ్యాఖ్యానించారని చైనా అధికార వార్తాసంస్థ సీజీటీఎన్. ‘ బ్లింకెన్ పర్యటనతో ఇరుదేశాల బంధం కీలక కూడలికి చేరుకుంది. అయితే చైనాపై అమెరికా విధిస్తున్న ఏకపక్ష ఆంక్షలను ఎత్తేయాల్సిన అవసరం ఉంది’ అని చైనా విదేశాంగ మంత్రి క్విన్ చెప్పారు. చైనాతో దౌత్య ద్వారాలు ఎప్పటికీ తెరిచే ఉండాలనే లక్ష్యంతో∙బ్లింకెన్ పర్యటన సాగిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అయిదేళ్ల తర్వాత బీజింగ్‌కు బ్లింకెన్
బీజింగ్: అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఆదివారం ఉదయం చైనా రాజధాని బీజింగ్‌కు చేరుకున్నారు. చైనా విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్‌తో ఆయన భేటీ అయ్యారు. తైవాన్ అంశం, ఉక్రెయిన్ యుద్ధం తదితర కీలక అంశాలపై వారు చర్చలు జరిపారు. అనంతరం అధికార విందులో పాల్గొన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా బ్లింకెన్ అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కూడా కలుస్తారని సమాచారం. రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న సమయంలో బ్లింకెన్ చేపట్టిన ఈ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సాధారణ సంబంధాలపై ఇరుపక్షాలు ఆసక్తితో ఉన్నప్పటికీ, బ్లింకెన్ పర్యటనతో కీలక పరిణామాలకు అవకాశాలు తక్కువని ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ వ్యాఖ్యానించడం గమనార్హం. -
Sudan Crisis: 72 గంటలపాటు కాల్పుల విరమణ!
ఖార్తోమ్: సూడాన్‌లో సాయుధ బలగాల నడుమ కొనసాగుతున్న అంతర్యుద్ధంపై అమెరికా కీలక ప్రకటన చేసింది. ఇరు వర్గాల జనరల్స్.. మూడు రోజుల పాటు కాల్పుల విమరణపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిపింది. ఈ విషయాన్ని విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ వెల్లడించారు. గత పదిరోజులుగా సూడాన్ ఆర్మీకి, పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్‌కు నడుమ అక్కడ పోరు జరుగుతోంది. నడుమ 400 మందికి పైగా సాధారణ పౌరులు మరణించగా.. దాదాపు నాలుగు వేల మంది గాయపడ్డారు. భారీ ఎత్తున్న విదేశీయులు తమ తమ స్వస్థలాలకు వెళ్తున్నారు. అయితే.. 48 గంటల పాటు జరిగిన తీవ్ర చర్చల తర్వాత.. సుడానీస్ సాయుధ దళాలు (SAF) - ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) కాల్పుల విరమణకు ముందుకు వచ్చాయని బ్లింకెన్ వెల్లడించారు. ఏప్రిల్ 24 అర్ధరాత్రి నుండి దేశవ్యాప్తంగా 72 గంటల పాటు కాల్పుల విరమణను అమలు చేయడానికి అంగీకరించాయని తెలుస్తోంది. సంధి అమలు కావడానికి రెండు గంటల ముందే బ్లింకెన్ ప్రకటన వెలువడడం విశేషం. ఈ మూడు రోజుల్లో పౌరుల తరలింపు ప్రక్రియ వేగవంతం కానుంది. శనివారం నుంచి విదేశీయుల తరలింపు ప్రారంభం కాగా, ఇప్పటిదాకా సుమారు నాలుగు వేల మందికి పైగా స్వస్థలాలకు చేరుకున్నారు. అయితే లక్షల మంది సూడాన్ పౌరులు మాత్రం అక్కడి దీనపరిస్థితుల్లో మగ్గిపోతున్నారు. ప్రస్తుతం అక్కడ తాగునీరు, ఆహారం, మందులు, ఇంధన వనరుల కొరత, విద్యుత్ కోత కొనసాగుతోంది. అలాగే ఇంటర్నెట్ వినియోగంపై ఆంక్షలు విధించారు. ఈ తరుణంలో ఎటు పోవాలో పాలుపోని అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అగాధంలోకి సూడాన్.. సాయుధ బలగాల నడుమ జరుగుతున్న ఆ ఆధిపత్య పోరును.. ఐక్యరాజ్య సమితి తీవ్రంగా తప్పుబట్టింది. అత్యంత పేద దేశమైన సూడాన్ ఈ పోరుతో అగాధంలోకి కూరుకుపోతోందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ హెచ్చరించారు. అంతేకాదు కాల్పుల విరమణకు ఆయన పిలుపు ఇచ్చారు. ఐరాస తరపున పలు విభాగాలు సూడాన్ పౌరులను సరిహద్దులకు దేశాలకు సురక్షితంగా తరలించే యత్నంలో ఉన్నాయి. మరోవైపు సూడాన్ అంశంపై ఐరాస భద్రతా మండలి అత్యవసర సమావేశానికి బ్రిటన్ విజ్ఞప్తి చేస్తోంది. మంగళవారం ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. పారామిలిటరీ ర్యాపిడ్ ఫోర్స్‌ను ఆర్మీలో విలీనం చేయాలనే ప్రతిపాదన.. ఈ రెండు వర్గాల నడుమ ఘర్షణలకు దారి తీసింది. సూడాన్ రాజధాని ఖార్తోమ్తో పాటు దేశంలో పలు చోట్ల ఈ ఘర్షణలు కొనసాగుతుండగా.. సాధారణ పౌరులు ఇబ్బంది పడుతున్నారు. ఇదీ చదవండి: ఆపరేషన్ కావేరీ.. మనోళ్ల కోసమే! -
ఢిల్లీలోని ఆటో రిక్షాలో యూఎస్ సెక్రటరీ: వీడియో వైరల్
న్యూఢిల్లీ మార్చి1న జీ20 విదేశాంగ మంత్రుల సదస్సు జరిగిన సంగతి తెలిసింది. ఆ సదస్సు కోసం అని భారత పర్యటనకు వచ్చిన యూఎస్ సెక్రటరీ ఆంటోని బ్లింకెన్ ఆటో రైడ్ చేశారు. ఈ మేరకు న్యూఢిల్లీలోని అమెరికా రాయబారి కార్యాలయంలో సుదీర్ఘ కాలం పనిచేస్తున్న స్థానిక సిబ్బంది సాయంతో సమీపంలోని ఓ స్థానిక ఆటోలో సరదాగా కాసేపు చక్కెర్లు కొట్టారు. అందుకు సంబంధించని వీడియోని అమెరికా రాయబారి కార్యాలయం ఇది మా ప్రసిద్ధ ఆటోగ్యాంగ్ అనే క్యాప్షన్‌ని జోడించి మరీ ట్వీట్టర్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది. Who says official motorcades have to be boring? Watch @SecBlinken cruise in style with the longest-serving locally employed staff at the U.S. Embassy in New Delhi. Our famous #AutoGang 🛺 and their signature "autocade" followed close behind. What an entrance! pic.twitter.com/KbhZPybLy8 — U.S. Embassy India (@USAndIndia) March 3, 2023 (చదవండి: చైనా బెదిరింపులు విదేశాంగ మంత్రికి అర్థం కావడం లేదు:: రాహుల్) -
రష్యాకు సహకరిస్తే ఆంక్షలు తప్పవు
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై యుద్ధం సాగిస్తున్న రష్యాకు చైనా ఆయుధపరమైన సాయం అందించడం, అమెరికా భూభాగంపైకి నిఘా బెలూన్ను పంపించడంపై అమెరికా తీవ్ర నిరసన తెలిపింది. రష్యాకు సాయమందిస్తే ఆంక్షలు తప్పవని హెచ్చరించింది. జర్మనీలోని మ్యూనిక్‌లో జరుగుతున్న సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, చైనా ఉన్నతస్థాయి దౌత్యవేత్త వాంగ్ యీతో శనివారం భేటీ అయ్యారు. ‘మా గగనతలంలోకి నిఘా బెలూన్ను పంపించడం అంతర్జాతీయ చట్టాలకు, మా సార్వభౌమత్వానికి భంగం కలిగించడమే. ఇలాంటి బాధ్యతారాహిత్య ఘటన పునరావృతం కారాదు’ అని బ్లింకెన్ స్పష్టం చేశారని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ చెప్పారు. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు ఆయుధ, ఇతరత్రా సాయం అందజేస్తే తీవ్ర ఆంక్షలు విధిస్తామని కూడా బ్లింకెన్ చెప్పారు. అయితే ఇలాంటి చర్యలతో అమెరికా తన బలం చూపాలనుకుంటే విరుద్ధ ఫలితాలే వస్తాయని వాంగ్ యీ బదులిచ్చారు. -
Turkey-Syria earthquakes: శిథిలాల కింద 12 రోజులు...
అన్‌టాకియా: తుర్కియే, సిరియాను భూకంపం కుదిపేసి 12 రోజులు గడుస్తున్నా ఇంకా కొందరు శిథిలాల కింద నుంచి మృత్యుంజయులుగా బయట పడుతున్నారు. హతాయ్ ప్రావిన్స్‌లోని అన్‌టాకియా నగరంలో కుప్పకూలిన అపార్ట్మెంట్ శిథిలాల కింద 296 గంటలుగా ఇరుక్కున్న ఒక కుటుంబంలో ముగ్గురిని బయటకు తీసుకువచ్చారు. సిమెంట్ పెళ్లల కింద క్షణమొక యుగంలా గడిపిన ఒక కుటుంబంలోని ముగ్గురి మూలుగులు ఉన్న సహాయ సిబ్బంది వారిని బయటకి తీశారు. వీరిలో భార్యాభర్తలిద్దరికీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తూ ఉంటే వారి 12 ఏళ్ల కుమారుడి ప్రాణాలు మాత్రం వైద్యులు కాపాడలేకపోయారు. రెండు దేశాల్లోనే భూకంప మృతుల సంఖ్య 44 వేలు దాటింది. తుర్కియేలో మొత్తం 11 ప్రావిన్స్‌లకు గాను రెండు తప్ప తొమ్మిది ప్రావిన్స్‌లలో సహాయ చర్యలు నిలిపివేసినట్టు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. భూకంప బాధితుల కోసం అమెరికా నుంచి వచ్చిన సహాయ సామగ్రిని టర్కీలోని అడెనా ఎయిర్ బేస్ వద్ద ట్రక్కుల్లోకి చేరేయడంలో యూఎస్ సైనిక సిబ్బందికి సాయం చేస్తున్న ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంథోనీ బ్లింకెన్. భూకంప ప్రభావిత ప్రాంతాలను ఆదివారం ఆయన ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. -
అమెరికా అణుస్థావరంపై చైనా బెలూన్
వాషింగ్టన్/బీజింగ్: చైనాకు చెందిన నిఘా బెలూన్ అమెరికా గగనతలంపై, అదీ అణు స్థావ రం వద్ద తచ్చాడటం కలకలం రేపింది. దీనిపై అమెరికా తీవ్రంగా స్పందించింది. విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చైనా పర్యటనను వాయిదా వేసుకున్నారు. మూడు బస్సుల పరిమాణంలో ఉన్న ఈ బెలూన్ కొన్ని రోజులుగా తమ గగనతలంలో అగుపిస్తోందని, అది గురువారం మోంటానాలో ప్రత్యక్షమైందని పెంటగాన్ పేర్కొంది. అది అత్యంత ఎత్తులో ఎగురుతున్నందున వాణిజ్య విమానాల రాకపోకలకు అంతరాయమేమీ లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో సున్నిత సమాచారం లీకవకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించింది. బెలూన్ను కూల్చేస్తే దాని శకలాల వల్ల ప్రజలకు హాని కలగవచ్చని ఆర్మీ భావిస్తోంది. అన్ని అంశాలను అధ్యక్షుడు బైడెన్‌కు వివరించినట్లు పెంటగాన్ ప్రకటించింది. అమెరికాలోని మూడు భూగర్భ అణు క్షిపణి కేంద్రాల్లో ఒకటి మోంటానాలోనే ఉంది. దాంతో ఈ పరిణామం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోసినట్లయింది. చైనాతో చర్చల నిమిత్తం శుక్రవారం రాత్రి బయల్దేరాల్సిన విదేశాంగ మంత్రి బ్లింకెన్ పర్యటన వాయిదా పడింది. వాతావరణ పరిశోధన కోసం ప్రయోగించిన బెలూన్ దారి తప్పి అమెరికా గగనతలంలోకి ప్రవేశించిందని చైనా పేర్కొంది. ఈ అనుకోని పరిణామానికి చింతిస్తున్నట్టు చెప్పింది. ఈ వివరణతో అమెరికా సంతృప్తి చెందలేదు. ‘‘మా గగనతలంలోకి చైనా బెలూన్ రావడం మా సార్వభౌమత్వాన్ని, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే. చైనా చర్య ఆమోదయోగ్యం కాదు. ఈ సమయంలో బ్లింకెన్ పర్యటన సరికాదని భావిస్తున్నాం’’ అని అమెరికా అధికారి ఒకరన్నారు. పరిస్థితులు అనుకూలించాక బ్లింకెన్ చైనా పర్యటన ఉంటుందన్నారు. -
జీ20 పాలన పగ్గాలు చేపట్టనున్న భారత్...బ్లింకన్‌తో జై శంకర్ భేటీ
డిసెంబర్1 న జరగనున్న జీ20 శిఖరాగ్ర సదస్సుకు భారత్ అధ్యక్షత వహించనుంది. భారత్ ప్రెసిడెన్సీకి యూఎస్ మద్దుతిస్తోంది కూడా. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ వారం ప్రారంభంలో జీ20 లోగో, థీమ్‌ని ఆవిష్కరించారు. ఈ ఏషియన్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా యూఎస్ విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ కాంబోడియాలో సమావేశమై కీలకాంశాలు చర్చించారు. అంతేగాదు ఈ సదస్సులో చర్చించాల్సిన విషయాలను కూడా పంచుకున్నారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్ యుద్ధం, యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్‌తో సమావేశం, ఉక్రెయిన్-ఇండో పసిఫిక్, ఇంధనం, జీ20 ద్వైపాక్షిక సంబంధాలు తదితరాలపై చర్చించనున్నారని జైశంకర్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ కూడా ట్విట్టర్లో...భారత జీ20 ప్రెసిడెన్సీకి అమెరికా మద్దతిస్తోంది. జీ20 లోగో సార్వత్రిక సోదరభావాన్ని ప్రతిబింబిస్తోంది. జీ20 లోగో కమలం కష్ట సమయాల్లో ఆశకు చిహ్నం. G20 ప్రెసిడెన్సీ భారతదేశానికి కేవలం దౌత్యపరమైన సమావేశం కాదు, ఇది ఒక కొత్త బాధ్యత తోపాటు భారతదేశంపై ప్రపంచ విశ్వాసానికి కొలమానం అని బ్లింకెన్ అన్నారు. (చదవండి: పుతిన్ ఓడిపోతాడు...చైనా బలపడుతుంది: బ్రిటన్ ప్రధాని షాకింగ్ వ్యాఖ్యలు) -
అమెరికా వీసాల వేగవంతానికి చర్యలు
వాషింగ్టన్: అమెరికా వీసాల కోసం భారతీయులు దీర్ఘకాలం వేచి ఉండే పరిస్థితులకు కరోనా మహమ్మారియే కారణమని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ నిందించారు. కొద్ది నెలల్లోనే సమస్యను పరిష్కరిస్తామని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు హామీ ఇచ్చారు. వాషింగ్టన్లో మంగళవారం బ్లింకెన్‌తో జై శంకర్ భేటీ అయ్యారు. వీసా అపాయింట్మెంట్ల కోసం రెండేళ్లకు పైగా ఎదురు చూడాల్సిన పరిస్థితులున్నట్టు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. కరోనా సంక్షోభంతో 2020 మార్చి నుంచి కొద్ది నెలల పాటు వీసా ప్రక్రియ నిలిపివేయడంతో వేచి చూసే సమయం పెరిగిపోయిందని, వీసాల త్వరితగతి మంజూరు కోసం ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని బ్లింకెన్ స్పష్టం చేశారు. ‘‘కరోనా కారణంగా మా దౌత్య కార్యాలయాల్లో సిబ్బందిని తగ్గించాం. ఇప్పుడు మళ్లీ సిబ్బందిని పెంచడానికి ఒక ప్రణాళిక ప్రకారం చర్యలు చేపడతాం. మరి కొద్ది నెలల్లోనే వీసాల జారీ వేగవంతం అవుతుంది’’ అని బ్లింకెన్ స్పష్టం చేశారు. వీసా ప్రక్రియ వేగవంతం చేయడం ఇరుదేశాలకూ ప్రయోజనకరమని జైశంకర్ అన్నారు. వీసాల జారీలో అడ్డంకుల్ని అధిగమించాలన్నారు. -
శ్రీలంక సంక్షోభానికి అదే కారణమై ఉండొచ్చు!: యూఎస్
Russian Aggression May Have Contributed To Sri Lanka Crisis: శ్రీలంక సంక్షోభానికి గల కారణం రష్యా 'దురాక్రమణ యుద్ధమే' అని యూఎస్ విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అదీగాక ఇటీవలే ఆంటోని బ్లింకెన్ ఉక్రెయిన్ నుంచి దాదాపు 20 మిలియన్ టన్నుల ధాన్యాన్ని విడిచిపెట్టాలని రష్యాకు పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై రష్యా విధించిన ఆంక్షలే.. ఒకరకంగా శ్రీలంక సంక్షోభానికి కారణమై ఉండోచ్చని ఆంటోని బ్లింకెన్ అన్నారు. ప్రస్తుతం శ్రీలంక ఆహారం, ఇంధన కొరత, విదేశీ మారక నిల్వలు వంటి సంక్షోభాలతో అతలాకుతలమౌతున్న సంగతి తెలిసిందే. ఈ రష్యా ఉక్రెయిన్‌పై సాగిస్తున్న దురాక్రమణ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపుతోందంటూ.. బ్లింకెన్ ఆందోళన వ్యక్తం చేశారు. అంతేగాదు ఇంతవరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆహార అభద్రత ఇప్పుడు మరింత పెరుగుతోందన్నారు. ఈ యుద్ధం కారణంగా అదికాస్త గణనీయంగా పెరిగిందని చెప్పారు. ముఖ్యంగా థాయ్‌లాండ్ వంటి శక్తిమంతమైన దేశం పై కూడా ఈ యుద్ధం ప్రభావం మరింతగా ఉంటుందన్నారు. మాస్కో ఆక్రమిత ఉక్రెయిన్ నుంచి 20 మిలియన్ టన్నుల ధాన్యాన్ని ఎగుమతి చేసే నౌకలను అడ్డుకోవద్దని రష్యాకి పదేపదే బ్లింకెన్ విజ్ఞప్తి చేశాడు. ఐతే రష్యా మాత్రం నౌకాశ్రయాల్లో ఉక్రెయిన్ పెట్టిన మందుపాతరలను తీసివేస్తే... ఆహార ఉత్పత్తులతో కూడిన ఉక్రేనియన్ నౌకలను విడిచిపెట్టడానికి అనుమతిస్తామని రష్యా చెప్పింది. అందుకు కీవ్ తిరస్కరించడం గమనార్హం. (చదవండి: అధ్యక్షుడి భవనంలో కరెన్సీ కట్టల గుట్టలు.. ఆశ్చర్యంలో లంకేయులు) -
యుద్ధం ముగించండి.. ససేమిరా అంటున్న రష్యా!
ఇండోనేషియాలో జరిగిన జీ20 సదస్సులో యూఎస్, పాశ్చాత్య మిత్రదేశాలు యుద్ధానికి ముగింపు పలకమంటూ రష్యా పై ఒత్తిడి తెచ్చాయి. ఐతే రష్యా రాయబారి మాత్రం ససేమిరా తగ్గేదేలే అని తేల్చి చెప్పారు. ఈ మేరకు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత జరిగిన తొలి జీ20 సమావేశంలో యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్, రష్యా రాయబారి సెర్గీ లావ్రోవ్లు సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ సమావేశానికి కంటే ముందే బ్లింకెన్ ఫ్రెంచ్, జర్మన్ సహచరులు, ఒక సీనియర్ బ్రిటీష్ అధికారితో కలిసి రష్యా ఉక్రెయిన్‌పై సాగిస్తున్న దురాక్రమణ గురించి చర్చించినట్లు యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ పేర్కొంది. ఐతే ఈ జీ 20 సమావేశంలో... రష్యా ఉద్దేశ పూర్వకంగానే ఉక్రెయన్ వ్యవసాయాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడిందని, అందువల్లే ప్రపంచ ఆహార భద్రత సమస్య ఏర్పడిందన్నారు.ఈ సమస్యకు చెక్‌పెట్టేలా పరిష్కార మార్గాల కోసం కూడా చర్చించారు. అదీగాక బ్లింకెన్ రష్యా రాయబారి లావ్రోవ్తో చర్చించడానికి దూరంగా ఉండటం వల్లే రష్యా ప్రపంచ ఆహార సంక్షోభాన్ని ప్రేరేపించందంటూ విమర్శలు వెలువెత్తాయి. అంతేకాదు రష్యా యుద్ధంలో దెబ్బతిన్న ఉక్రెయిన్ ఎగుమతులను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ యూఎస్ సెక్రటరీ బ్లింకెన్.. రష్యా రాయబారిని ప్రశ్నించారు. అంతేకాదు ఉక్రెయిన్ ఎగుమతులను అనుమతించమని రష్యాని డిమాండ్ చేశారు. మధ్యాహ్న సమయానికి జరిగిన జీ20 సెషన్లో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా ప్రసంగించడంతోనే లావ్రోవ్ గైర్హాజరయ్యారని దౌత్య వర్గాలు పేర్కొన్నాయి. కాగా, మాస్కో రాయబారి లావ్రోవ్ మాత్రం తాను హజరయ్యానని విలేకరుల సమావేశంలో చెప్పడం విశేషం. ఇదిలా ఉండగా.. జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పులు జరగాయనే వార్తలు హల్చల్ చేయడంతో ఆ సమావేశం కాస్త ఉద్విగ్నంగా మారింది. ఇది చాలా విచారకరమైన క్షణమని అమెరికా కార్యదర్శి బ్లింకెన్ పేర్కొన్నారు. ఈ జీ20 సమావేశంలో యుద్ధాన్ని సాధ్యమైనంత మేర త్వరగా ముగించడం, చర్చల ద్వారా విభేదాలను పరిష్కరించడం పై దృష్టి సారించడం వంటివి మాత్రమే తమ బాధ్యత అని ఇండోనేషియా విదేశాంగ మంత్రి రెట్నో మార్సుడి అన్నారు. (చదవండి: పైశాచికం.. షింజో అబే మృతిపై చైనాలో సంబురాలు!) -
Shehbaz Sharif: షరీఫ్‌కు అమెరికా అభినందనలు
వాషింగ్టన్: పాకిస్తాన్ నూతన ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌కు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అభినందనలు తెలియజేశారు. పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సంబంధాలకు తాము తగిన ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ఇరు దేశాల మధ్య సహాయ సహకారాలు యథాతథంగా కొనసాగాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. షరీఫ్ హయాంలో పాక్–అమెరికా మధ్య సంబంధాలు మరింత బలపడాలని బ్లింకెన్ ఆకాంక్షించారు. తాజా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హయాంలో ఇరు దేశాల నడుమ భేదాభిప్రాయాలు తలెత్తాయి. బ్లింకెన్ ప్రకటన పట్ల పాకిస్తాన్ ప్రధానమంత్రి కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది. చదవండి: (Russia Warns: ఆ దేశాలకు రష్యా న్యూక్లియర్ వార్నింగ్) -
అఫ్ఘాన్ బాలికలు విద్యనభ్యసించేలా బలమైన యూఎస్ మద్దతు కావాలి!
Malala Yousafzai Calls US And UN To Support Of Afghan Women Education: నోబ్‌ల్ శాంతి బహుమతి గ్రహిత, మానవ హక్కుల న్యాయవాది మలాలా యూసఫ్‌జాయ్ వాషింగ్టన్ పర్యటన సందర్భంగా అఫ్గాన్ బాలికలకు, మహిళలకు బలమైన యూఎస్ మద్దతు కావాలని తెలిపారు. అంతేకాదు ప్రస్తుతం బాలికలకు సెకండరీ విద్య అందుబాటులో లేని ఏకైక దేశం అఫ్ఘనిస్తాన్ అని, పైగా వారు విద్యనభ్యసించకుండా నిషేధించారంటూ యూఎస్ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో జరిగిన సమావేశంలో మలాలా తన ఆవేదనను వ్యక్తం చేశారు. (చదవండి: పట్టి తెచ్చాడులే.. నిండు సూర్యుడినే..) ఈ మేరకు ఈ సమావేశంలో మలాల సోటోడా అనే అఫ్గాన్ అమ్మాయి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కి రాసిన లేఖను ప్రస్తావిస్తూ ‘ఇది అఫ్గాన్ బాలికల సందేశం. బాలికలందరికీ సురక్షితమైన మరియు నాణ్యమైన విద్యను పొందగలిగే ప్రపంచాన్ని మేము చూడాలనుకుంటున్నాం’ అని రాసిన లేఖను బ్లింకెన్కి అందజేశారు. అంతేకాదు తమను ఎంతకాలం పాఠశాలలకు, విశ్వవిద్యాలయాలకు దూరం చేస్తారో అంతలా తమ భవిష్యత్తుపై ఆశ చిగురిస్తూనే ఉంటుందని సోటోడా లేఖలో ప్రస్తావించిన విషయాన్ని మలాలా పేర్కొన్నారు. ఈ మేరకు దేశంలో శాంతి భద్రతలను తీసుకురాగలిగే అతి ముఖ్యమైన సాధనం బాలికల విద్య అని, అమ్మాయిలు చదువుకోకపోతే అఫ్ఘాన్ నష్టపోతుందంటూ ఆవేదనగా పేర్కొంది. అయితే అఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బాలికలు విద్యనభ్యసించకూడదంటూ పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మలాలా యునైటెడ్ స్టేట్స్, యుఎన్‌తో కలిసి అఫ్ఘాన్‌లోని బాలికలు వీలైనంత త్వరగా తమ పాఠశాలలకు తిరిగి వెళ్లేలా చూసేందుకు తక్షణ చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. (చదవండి: అప్పుడే పుట్టిన నవజాత శిశువు పేరు ‘బోర్డర్’..ఎందుకో తెలుసా?) -
భారత్ ఆందోళనలపై తాలిబన్లు సానుకూలం!
వాషింగ్టన్: అఫ్గాన్ తాజా పరిణామాల నేపథ్యంలో భారత్ లేవనెత్తుతున్న ఆందోళనల పట్ల సానుకూలంగా స్పందిస్తామని తాలిబన్లు సంకేతాలిచ్చారని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా తెలిపారు. తాలిబన్ల అ«దీనంలోకి వెళ్లిన అఫ్గానిస్తాన్‌లో పాక్ చర్యల్ని భారత్, అమెరికా నిశితంగా గమనిస్తున్నాయని చెప్పారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా వెళ్లిన ఆయన ఆ దేశ విదేశాంగ మంత్రి బ్లింకెన్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు.అఫ్గాన్‌లో పరిస్థితులు ఇంకా అస్థిరంగానే ఉన్నాయని శ్రింగ్లా తెలిపారు. (చదవండి: Kodanad Case: వీడని మిస్టరీ.. అంతులేని ‘కొడనాడు’ కథ) అఫ్గాన్‌పై అమెరికా వేచి చూసే ధోరణిని అవలంబిస్తోందని, భారత్ సైతం ఇదే విధానాన్ని కొనసాగిస్తోందని చెప్పారు. వేగంగా మారుతున్న పరిణామాలు ఎలా రూపుదిద్దుకుంటాయో గమనిస్తున్నామన్నారు.తాలిబన్లతో భారత్ సంబంధాలు పరిమితమని, ఇటీవలి భేటీలో ఏ విషయంపైనా విస్తృత స్థాయిలో చర్చలు జరగలేదన్నారు. అయితే, అఫ్గాన్ గడ్డను ఉగ్ర అడ్డాగా మారుతుందేమోనన్న భారత ఆందోళనపై సానుకూలంగా స్పందిస్తామని తాలిబన్లు సంకేతాలిచ్చారని తెలిపారు. అఫ్గాన్ భూభాగంలోని అనేక శక్తులకు పాక్ అండగా నిలిచిందని చెప్పారు. ఐరాస ఆంక్షల జాబితాలోని జైషే మహమ్మద్, లష్కరే తోయిబా వంటి సంస్థలు అఫ్గాన్‌లోకి స్వేచ్ఛగా ప్రవేశిస్తున్నాయని, వీరి కదలికలపై కన్నేసి ఉంచామని తెలిపారు. అఫ్గాన్ నుంచి ఎలాంటి ఉగ్ర కార్యకలాపాలు సాగినా తాలిబన్లదే బాధ్యతన్నారు. నవంబర్‌లో అమెరికాతో చర్చలు భారత్, అమెరికా మధ్య నాలుగో వార్షిక 2+2 చర్చలు నవంబర్‌లో వాషింగ్టన్లో జరుగుతాయని హర్షవర్ధన్ చెప్పారు. ఈదఫా చర్చల్లో భారత రక్షణ, విదేశాంగ మంత్రులు రాజ్‌నాధ్ సింగ్, జైశంకర్‌లు తొలిసారి బైడెన్ ప్రభుత్వంలోని రక్షణ, విదేశాంగ మంత్రులతో సమావేశం కానున్నారు. (చదవండి: బీజేపీ నేత సువేందుకు సమన్లు) -
అఫ్గనిస్తాన్‌తో దౌత్య సంబంధాలు.. అమెరికా కీలక ప్రకటన
వాషింగ్టన్: అఫ్గనిస్తాన్ నుంచి తమ సేనల ఉపసంహరణతో దౌత్యపరంగా తాము అక్కడి నుంచి నిష్క్రమించినట్లైందని, ఇక నుంచి దౌత్య సంబంధాలను ఖతార్ నుంచి నిర్వహిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ అన్నారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా ఏఎఫ్‌పీతో మాట్లాడుతూ.. ‘‘మిలిటరీ ఆపరేషన్ ముగిసింది. ఇక డిప్లొమాటిక్ మిషన్ మొదలుకానుంది. అమెరికా- అఫ్గనిస్తాన్ సరికొత్త అధ్యాయం ప్రారంభంకానుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక మానవతా దృక్పథంతో అఫ్గన్ ప్రజలకు సహాయం చేస్తూనే ఉంటామని బ్లింకెన్ స్పష్టం చేశారు. అయితే, తాలిబన్ ప్రభుత్వం ద్వారా కాకుండా, ఐక్యరాజ్యసమితి, ఎన్జీవోల వంటి స్వతంత్ర స్వచ్ఛంద సంస్థల ద్వారా ఈ సహాయం అందుతుందని పేర్కొన్నారు. అదే విధంగా... అఫ్గన్‌ను వీడాలనుకున్న ప్రతి అమెరికన్, అఫ్గన్, ఇతర పౌరులను సురక్షితంగా తరలించామని తెలిపారు. కాగా కొద్ది మంది అమెరికా పౌరులు అక్కడే చిక్కుకుపోయారన్న బ్లింకెన్.. త్వరలోనే వారిని మాతృదేశానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అంతర్జాతీయ ప్రయాణాలపై తాలిబన్లు ఆంక్షలు విధించవద్దని, మహిళలు, మైనార్టీ హక్కులను కాలరాసేలా వ్యవహరించకూడదని హితవు పలికారు. అలాగే ఉగ్రవాదాన్ని పెంచి పోషించే చర్యలకు తావివ్వకూడదని విజ్ఞప్తి చేశారు. చదవండి: Joe Biden: అఫ్గనిస్తాన్ నుంచి ఎందుకు వెనక్కి రావాల్సి వచ్చిందో చెప్తా! -
భిన్నత్వమే మన బలం
న్యూఢిల్లీ: భిన్నత్వమే భారత్, అమెరికా సమాజాల బలమని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అన్నారు. ఇరు దేశాల చర్యలే 21వ శతాబ్దాన్ని నిర్దేశించబోతున్నాయని చెప్పారు. భారత్‌తో మైత్రి బలోపేతానికి అమెరికా అత్యంత ప్రాధాన్యం ఇవ్వడానికి ఇదే కారణమని పేర్కొన్నారు. భారత్, అమెరికాలు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలని, భిన్నత్వమే ఇరు దేశాల బలమని ఉద్ఘాటించారు. ఆయన బుధవారం ఢిల్లీలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో సమావేశమయ్యారు. అఫ్గానిస్తాన్‌లో తాజా పరిస్థితి, ఇండో–పసిఫిక్ ప్రాంతంలో పరిణామాలు, కోవిడ్‌పై పోరాటం తదితర కీలక అంశాలపై ఇరువురూ చర్చించుకున్నారు. పలు అంశాలపై బ్లింకెన్‌తో ఫలవంతమైన చర్చలు జరిగాయని జైశంకర్ ట్వీట్ చేశారు. శాంతియుత, సుస్థిర అఫ్గాన్‌ను భారత్, అమెరికా కాంక్షిస్తున్నాయని బ్లింకెన్ వ్యాఖ్యానించారు. బ్లింకెన్ భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తోనూ సంప్రదింపులు జరిపారు. భద్రత, రక్షణ, ఆర్థికం, సాంకేతిక రంగాలకు సంబంధించిన అంశాలపై ఇరువురూ మాట్లాడుకున్నట్లు సమాచారం. దలైలామా ప్రతినిధి డాంగ్‌చుంగ్‌తో భేటీ టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా తరఫు సీనియర్ ప్రతినిధి గాడప్ డాంగ్‌చుంగ్‌తో బ్లింకెన్ సమావేశమయ్యారు. తద్వారా టిబెట్‌కు అమెరికా మద్దతు కొనసాగిస్తోందనే సందేశాన్నిచ్చారు. పౌర సమాజం సభ్యులతో బ్లింకెన్ జరిపిన చర్చల్లో టిబెట్ ప్రతినిధి గెషీ డోర్జీ డామ్‌దుల్ పాల్గొన్నారు. మరో 25 మిలియన్ డాలర్లు భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్ విజయవంతానికి సహకరిస్తామంటూ బ్లింకెన్ ట్వీట్ చేశారు. వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అమెరికా ప్రభుత్వం నుంచి యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్(యూఎస్ఎయిడ్) ద్వారా మరో 25 మిలియన్ డాలర్ల సాయం అందించనున్నట్లు తెలిపారు. ఆగస్టు మాసాంతానికికల్లా ఇండియాలో 68,000 విద్యా వీసా ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కరోనా ప్రారంభ దశలో ఇండియా సహకారం మర్చిపోలేనిదని వ్యాఖ్యానించారు. క్రియాశీలకంగా పౌర సమాజాలు దేశంలో తమ గళం వినిపించే అర్హత ప్రతి ఒక్కరికీ ఉందని బ్లింకెన్ ఉద్ఘాటించారు. వారు ఎవరన్న దానితో సంబంధం లేకుండా తగిన గౌరవం ఇవ్వాలన్నారు. భారతీయులు, అమెరికన్లు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు, మత స్వేచ్ఛకు ప్రాధాన్యం ఇస్తారని గుర్తుచేశారు. ఏడుగురు పౌర సమాజం సభ్యులతో సమావేశం నిర్వహించారు. ప్రజాస్వామ్య విలువలకు భారత్, అమెరికా కట్టుబడి ఉన్నాయని గుర్తుచేశారు. ద్వైపాక్షిక సంబంధాలకు ఇదే కీలక ఆధారమని వెల్లడించారు. పౌర సమాజాలు క్రియాశీలకంగా పనిచేస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ విజయవంతమవుతుందని బ్లింకెన్ అన్నారు. బైడెన్ అంకితభావం భేష్: మోదీ భారత్–అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే విషయంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రదర్శిస్తున్న అంకితభావం, పట్టుదల అభినందనీయమని మోదీ పేర్కొన్నారు. బ్లింకెన్‌తో మోదీ భేటీ అయ్యారు. ‘బ్లింకెన్‌తో భేటీ ఆనందంగా ఉంది. భారత్–అమెరికా సంబంధ బాంధవ్యాలను, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా బైడెన్ చూపుతున్న అంకితభావాన్ని స్వాగతిస్తున్నాం. ఇరు దేశాల నడుమ ప్రజాస్వామ్య విలువలను పంచుకోవడానికే కాదు అంతర్జాతీయంగానూ మన వ్యూహాత్మక భాగస్వామ్యం కీలకం’అని మోదీ ట్వీట్ చేశారు. అమెరికాలో ఉంటున్న భారతీయులు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాను బలోపేతం చేసే విషయంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు.