గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు కొనసాగుతునే ఉన్నాయి. ఆదివారం దక్షిణ గాజాపై ఇజ్రాయెల్ బలగాలు దాడులతో విరుచుకుపడ్డాయి. అయితే ఈ క్రమంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆదివారం ఖతర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై బ్లింకెన్ హెచ్చరించారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్దం ఇలాగే కొనసాగితే.. గాజాతో మరిన్ని ప్రాంతాలకు యుద్ధ తీవ్రత విస్తరించనుందని తెలిపారు.
దీని వల్ల మధ్య ప్రాచ్యంలో భద్రతకు ముప్పు ఉండనుందని అన్నారు. గాజా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు మరింతగా పెరుగతాయిని అన్నారు. హమాస్- ఇజ్రాయెల్ ఘర్షణలు ఇలాగానే కొనసాగితే.. ఇక్కడ ప్రజలు అభద్రతతో మరిన్ని బాధలు ఎదుర్కొవల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల తీవ్రత తగ్గిన అనంతరం వలస వెళ్లిన ప్రజలు మళ్లీ తిరిగి రావాలన్నారు. ఘర్షణను తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.
అక్టోబర్7న నుంచి హమాస్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలో వేల మంది పాలస్తీనియన్లు పలు దేశాలు వలస వెళ్లారు. ఇక.. గాజాలో హమాస్‌ను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులతో విచురుకుపడుతోంది. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటివరకు 22,722 మంది పాలస్తీనియన్లు మృత్యువాత పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment