గాజాలో ఇజ్రాయెల్ సైన్యం భారీగా దాడులకు పాల్పడటానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దక్షిణ గాజాలోని రెండో అతిపెద్ద నగం అయిన ఖాన్ యూనిస్‌లో దాడుల స్థాయిని పెంచనున్నట్ల సమాచారం. ఈ మేరకు ఖాన్ యూనిస్‌లో ఉండే పాలస్తీనియన్లు వెంటనే ఖాళీ చేయాలని సోమవారం ఇజ్రాయెల్ ఆర్మీ ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది పాస్తీనియన్లు ఇతర ప్రాంతాకు తరలివెళ్తుతున్నారు. దీంతో ఖాన్ యూనిస్‌లోని యూరోపియన్ ఆస్పత్రిలోని పేషెంట్లను సైతం ఇతర ప్రాంతాలకు బలవంతంగా తరలిస్తున్నారు. గతవారం ఉత్తర గాజాలోని షెజాయా నగరంలో ప్రజలకును ఖాళీ చేయమన్న ఇజ్రాయెల్ ఆర్మీ.. ఐదో రోజు కూడా దాడులు కొనసాగిస్తోంది. మరోవైపు.. దక్షిణ రఫా ప్రాంతంలో జరిగన దాడుల్లో ఇజ్రాయెల్ సైనికుడు ఒకరు మృతి చెందాడు.
హమాస్‌ను అంతం చేసే దశలో ఇజ్రాయెల్ పురోగతి సాధింస్తోందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అన్నాడు. అయితే ఇతర ప్రాంతాల్లో కూడా దాడుల తీవ్రత పెంచాలని ఆర్మీకి సూచించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఖాన్ యూనిస్‌లో మళ్లీ దాడులకు ఇజ్రాయెల్ ఆర్మీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ఆర్మీ హమాస్ మిలిటెంట్లను అంతం చేయటంలో భాగంగా ఈ ఏడాది మొదట్లో ఖాన్ యూనిస్ నగరంపై ఇజ్రాయెల్ ఆర్మీ భీకర దాడులు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇక్కడ ఉండే పాలస్తీనా ప్రజలు దక్షిణ గాజా నగరమైన రఫాకు తరలివెళ్లారు.
అక్టోబర్ 7న హమాస్ బలగాలు ఇజ్రాయెల్‌పై చేసిన మెరుపు దాడిలో 1200 మృతి చెందగా.. 251 మందిని బంధీలుగా తీసుకువెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్ హామాస్‌ను అంతం చేయటమే లక్ష్యంగా గాజాపై విరచుకుపడుతూనే ఉంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పవరకు 37,900 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు.
చదవండి: ట్రంప్ విషయంలో కోర్టు తీర్పు ఎంతో ప్రమాదకరం: బైడెన్
Comments
Please login to add a commentAdd a comment