
వాషింగ్టన్: పాకిస్తాన్ నూతన ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌కు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అభినందనలు తెలియజేశారు. పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సంబంధాలకు తాము తగిన ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ఇరు దేశాల మధ్య సహాయ సహకారాలు యథాతథంగా కొనసాగాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.
షరీఫ్ హయాంలో పాక్–అమెరికా మధ్య సంబంధాలు మరింత బలపడాలని బ్లింకెన్ ఆకాంక్షించారు. తాజా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హయాంలో ఇరు దేశాల నడుమ భేదాభిప్రాయాలు తలెత్తాయి. బ్లింకెన్ ప్రకటన పట్ల పాకిస్తాన్ ప్రధానమంత్రి కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది.
చదవండి: (Russia Warns: ఆ దేశాలకు రష్యా న్యూక్లియర్ వార్నింగ్)