
బీజింగ్: అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఆదివారం ఉదయం చైనా రాజధాని బీజింగ్‌కు చేరుకున్నారు. చైనా విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్‌తో ఆయన భేటీ అయ్యారు. తైవాన్ అంశం, ఉక్రెయిన్ యుద్ధం తదితర కీలక అంశాలపై వారు చర్చలు జరిపారు. అనంతరం అధికార విందులో పాల్గొన్నారు.
రెండు రోజుల పర్యటనలో భాగంగా బ్లింకెన్ అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కూడా కలుస్తారని సమాచారం. రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న సమయంలో బ్లింకెన్ చేపట్టిన ఈ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సాధారణ సంబంధాలపై ఇరుపక్షాలు ఆసక్తితో ఉన్నప్పటికీ, బ్లింకెన్ పర్యటనతో కీలక పరిణామాలకు అవకాశాలు తక్కువని ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ వ్యాఖ్యానించడం గమనార్హం.