
కశ్మీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్(General Asim Munir) భారత్ వ్యతిరేక వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. భారత్, పాకిస్థాన్‌లు సిద్ధాంతాల పరంగా వేర్వేరు దేశాలేనన్న ఆయన.. కశ్మీర్‌ను ఇస్లామాబాద్‌కు గళ సిరగా అభివర్ణించారు. ఈ క్రమంలో పాక్ ఎట్టి పరిస్థితుల్లోనూ కశ్మీర్‌ను మరిచిపోదని, ఏ శక్తీ దానిని పాక్ నుంచి వేరు చేయలేదని వ్యాఖ్యానించారు. అలాగే దేశ విభజనకు కారణమైన రెండు దేశాల విభజనను సమర్థిస్తూ తీవ్ర వ్యాఖ్యలూ చేశారు.
పాక్ మీడియా హౌజ్ డాన్(dawn) కథనం ప్రకారం.. తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన జనరల్ మునీర్ మాట్లాడారు. ఉగ్రకార్యకలాపాలతో పాక్ నిధులు రావనే భయాలు నెలకొన్నాయని.. కానీ, ఆ భయాలను తొలగించే ప్రయత్నాల్లో పాక్ సైన్యం ఉందని అన్నారు. ఉదాహరణగా.. బెలూచిస్తాన్, కశ్మీర్ అంశాలను(Kashmir Issue) ప్రస్తావించారు.
పాక్‌కు బెలూచిస్తాన్ ఎంతో గర్వకారణమైంది. అలాంటి ప్రాంతంలో వేర్పాటువాద ఉద్యమాలను పాక్ సైన్యం సమర్థవంతంగా అణచివేసింది. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాల కారణంగా పెట్టుబడులు రాకపోవచ్చనే భయాలు ఉన్నాయి. కానీ, ఉగ్రవాదులు దేశ భవిష్యత్తును మార్చగలరా?. త్వరలో పూర్తి విజయం సాధిస్తాం. ఇంకో పది జన్మలెత్తినా ఆ ప్రాంతాన్ని మనకు ఎవరూ దూరం చేయలేరు. ఇక.. కశ్మీర్‌పై తమ ఆశ చావదన్న పాక్ ఆర్మీ చీఫ్(Pak Army Chief).. అది మాకు గళ సిర(జగ్యులర్ సిర) అని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మరిచిపోలేమని, కశ్మీరీ సోదరుల వీరోచిత పోరాటాలను అంత సులువుగా వదిలిపెట్టబోమని, ఏ శక్తీ దానిని పాక్ నుంచి వేరు చేయలేదని వ్యాఖ్యానించారు.
పాక్ గురించి తర్వాతి తరాలకు ఎంతో చెప్పాల్సిన అవసరం ఉందన్న జనరల్ మునీర్.. మతం, సంప్రదాయాలు, ఆలోచనలు, లక్ష్యాలు.. ఇలా ప్రతీ విషయంలోనూ హిందువులతో మనం(ముస్లిం) వేరనే విషయం తెలియజేయాల్సిన బాధ్యత ఉందంటూ పాక్ పౌరులకు సూచించారు. ఇదే రెండు దేశాల సిద్ధాంతానికి పునాది వేసింది అని అన్నారాయన. ఏరకంగా ఈ రెండు దేశాలు ఒక్కటి కాదని.. అందుకే తమ పూర్వీకులు పాక్ కోసం పోరాడారని వ్యాఖ్యానించారు. ఇలాంటి దేశాన్ని ఎలా రక్షించుకోవాలనే దానిపైనే దృష్టిసారించాలని అన్నారు. ఈ వ్యాఖ్యలకు భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి!.
Ugh! I thought General Musharraf was the worst, but this COAS takes the cake. The whole bakery. General Asim Munir. pic.twitter.com/t8eVYukQqG
— Smita Prakash (@smitaprakash) April 16, 2025