Kashmir issue
-
పాక్ నోట మళ్లీ పాతపాట
యునైటెడ్ నేషన్స్: ఐక్యరాజ్యసమతి సర్వసభ్య సమావేశంలో పాకిస్తాన్ మరోసారి కశీ్మర్ ప్రస్తావన తెచి్చంది. దీర్ఘకాలిక శాంతి కోసం భారత్ ఆరి్టకల్ 370ని పునరుద్ధరించాలని, జమ్మూకశీ్మర్ సమస్యకు శాంతియుత పరిష్కారం కోసం చర్చలకు రావాలని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. భారత్ తన సైనిక సంపత్తిని భారీగా పెంచుకుంటోందని ఆరోపించారు. ఐరాస సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి షరీఫ్ శుక్రవారం ప్రసంగించారు. ఆరి్టకల్ 370, హిజ్బుల్ ముజాహిదిన్ ఉగ్రవాది బుర్హాన్ వనీల ప్రస్తావన తెచ్చారు. ‘పాలస్తీనియన్ల లాగే జమ్మూకశ్మీర్ ప్రజలు కూడా తమ స్వాతంత్య్రం, స్వీయ నిర్ణయాధికారం కోసం శతాబ్దకాలంగా పోరాడుతున్నారు’ అని షహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. కశ్మీరీల అభిమతానికి అనుగుణంగా, ఐరాస భద్రతా మండలి తీర్మానాలకు అనుగుణంగా జమ్మూకశీ్మర్పై భారత్ చర్చలకు రావాలన్నారు. శాంతి ప్రయత్నాలకు భారత్ దూరంగా జరిగిందని ఆరోపించారు. స్వీయ నిర్ణయాధికారం జమ్మూకశీ్మర్ ప్రజల ప్రాథమిక హక్కని, దానిపై ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని భద్రతా మండలి తీర్మానాలు చెబుతున్నాయని అన్నారు. భారత్‌కు బ్రిటన్ మద్దతు ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వముండాలనే ప్రతిపాదనకు బ్రిటన్ ప్రధానమంత్రి కియర్ స్టార్మర్ మద్దతు పలికారు. భారత్ డిమాండ్‌కు అమెరికా, ఫ్రాన్స్‌లు ఇదివరకే మద్దతు పలికిన విషయం తెలిసిందే. ప్రపంచ ఐక్యవేదిక మరింత ప్రాతినిధ్యంతో, మరింత స్పందనతో కూడి ఉండాలని స్టార్మర్ ఐరాస సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశిస్తూ అన్నారు. -
NEW YEAR 2024: న్యూ ఇయర్ దశకం
మరో సంవత్సరం కనుమరుగవనుంది. మంచీ చెడుల మిశ్రమంగా ఎన్నెన్నో అనుభూతులు మిగిల్చి కాలగర్భంలో కలిసిపోనుంది. సరికొత్త ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రపంచమంతా సిద్ధమవుతోంది. 2024లో జరగనున్న ఆసక్తికర ఘటనలు, మిగల్చనున్న ఓ పది మైలురాళ్లను ఓసారి చూస్తే... నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ ఈ దశాబ్దంలోనే భారత్ కచి్చతంగా ప్రపంచంలో నాలుగో ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్నది అందరూ చెబుతున్న మాటే. అది 2026లో, లేదంటే 2027లో జరగవచ్చని ఇప్పటిదాకా అంచనా వేస్తూ వచ్చారు. కానీ అన్నీ కుదిరితే 2024 చివరికల్లా జర్మనీని వెనక్కు నెట్టి మనం నాలుగో స్థానానికి చేరడం కష్టమేమీ కాదన్నది ఆర్థికవేత్తల అభిప్రాయం. 2024 తొలి అర్ధభాగం చివరికి జర్మనీ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 4.4 లక్షల కోట్ల డాలర్లకు చేరవచ్చని అంచనా. అప్పటికి భారత ఆర్థిక వ్యవస్థ 4 లక్షల కోట్ల డాలర్ల మార్కును సులువుగా దాటేయనుంది. మన వృద్ధి రేటు, జర్మనీ మాంద్యం ఇప్పట్లాగే కొనసాగితే సంవత్సరాంతానికల్లా మనది పై చేయి కావచ్చు. 2.దూసుకుపోనున్న యూపీ ఉత్తరప్రదేశ్ కొన్నేళ్లుగా వృద్ధి బాటన పరుగులు పెడుతోంది. ఆ లెక్కన ఈ ఏడాది అది కర్ణాటకను పక్కకు నెట్టి దేశంలో నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశముంది. 2023–24కు కర్ణాటక జీఎస్డీపీ అంచనా రూ.25 లక్షల కోట్లు కాగా యూపీ రూ.24.4 లక్షల కోట్లుగా ఉంది. అయితే 20 శాతం వృద్ధి రేటుతో దూసుకుపోతున్న యూపీ సంవత్సరాంతానికల్లా కర్ణాటకను దాటేసేలా కని్పస్తోంది. 3. బీజేపీ ‘సంకీర్ణ ధర్మ’ బాట 2024 అక్టోబర్‌లో మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి అగి్నపరీక్షగా నిలవనున్నాయి. ఆ రాష్ట్రాల్లో ఏ ఒక్క పారీ్టకీ సొంతంగా మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు. కనుక ఆ రాష్ట్రాల్లో బీజేపీ విధిగా సంకీర్ణ ధర్మాన్ని పాటించాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు. ప్రస్తుత పరిస్థితులే కొనసాగే పక్షంలో వాటిలో రెండు రాష్ట్రాలు ఇండియా కూటమి ఖాతాలో పడ్డా ఆశ్చర్యం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ మూడు రాష్ట్రాల్లో ప్రత్యర్థి పక్షాలకు గట్టి పోటీ ఇవ్వాలంటే మిత్రులతో పొత్తులపై ముందస్తుగానే స్పష్టతకు వచ్చి సమైక్యంగా బరిలో దిగడం బీజేపీకి తప్పనిసరి కానుంది. 4. ‘సుదీర్ఘ సీఎం’గా నవీన్ అత్యధిక కాలం పాటు పదవిలో ఉన్న ముఖ్యమంత్రిగా పవన్‌కుమార్ చామ్లింగ్ నెలకొలి్పన రికార్డును ఒడిశా సీఎం నవీన్ 2024లో అధిగమించేలా ఉన్నారు. ఎందుకంటే మే లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన వరుసగా ఆరోసారి గెలవడం లాంఛనమేనని భావిస్తున్నారు. చామ్లింగ్ 1994 డిసెంబర్ నుంచి 2019 మే దాకా 24 ఏళ్లకు పైగా సిక్కిం సీఎంగా చేశారు. నవీన్ 2000 మార్చి నుంచి ఒడిశా సీఎంగా కొనసాగుతున్నారు. 5. మెగా మార్కెట్ క్యాప్ భారత మార్కెట్ క్యాపిటలైజేషన్ 2024లో 5 లక్షల కోట్ల డాలర్లను దాటేయనుంది. 2023లో మన మార్కెట్ క్యాప్ ఏకంగా 26 శాతం వృద్ధి రేటుతో పరుగులు తీసి 4.2 లక్షల కోట్ల డాలర్లకు చేరింది! ఇది పాశ్చాత్య ఆర్థికవేత్తలనూ ఆశ్చర్యపరిచింది. కొత్త ఏడాదిలో హీనపక్షం 20 శాతం వృద్ధి రేటునే తీసుకున్నా తేలిగ్గా 5 ట్రిలియన్ డాలర్ల మార్కును దాటడం లాంఛనమే. సెన్సెక్స్ కూడా ఈ ఏడాది ఆల్‌టైం రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్లడం తెలిసిందే. 2024లోనూ ఇదే ధోరణి కొనసాగడం ఖాయమేనని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. 6. 20 కోట్ల మంది పేదలు ఆర్థిక వృద్ధికి సమాంతరంగా దేశంలో పేదలూ పెరుగుతున్నారు. ప్రపంచంలోకెల్లా అత్యధిక సంఖ్యలో పేదలున్న దేశం మనమేనన్నది తెలిసిందే. 2024లో ఈ సంఖ్య 20 కోట్లను మించనుంది. ఇది బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీల మొత్తం జనాభా కంటే ఎక్కువ! ప్రపంచబ్యాంకు నిర్వచనం ప్రకారం భారత్‌లో 14 కోట్ల మంది పేదలున్నారు. నీతీఆయోగ్ లెక్కలను బట్టి ఆ సంఖ్య ఇప్పటికే 21 కోట్లు దాటింది. 7. వ్యవసాయోత్పత్తుల రికార్డు భారత ఆహార, ఉద్యానోత్పత్తుల పరిమాణం 2024లో 70 కోట్ల టన్నులు దాటనుంది. అందుకు అనుగుణంగా ఆహారోత్పత్తుల ఎగుమతి కూడా ఇతోధికంగా పెరుగుతుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. 2021లో కేంద్రం రద్దు చేసిన వివాదాస్పద సాగు చట్టాల భవితవ్యం 2024లో తేలిపోవచ్చంటున్నారు. 8. కశ్మీర్‌పై చర్చలకు డిమాండ్లు కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించేందుకు పాకిస్థాన్‌తో చర్చలను పునఃప్రారంభించాలని స్థానికంగా డిమాండ్లు ఊపందుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ ఈ మేరకు గళమెత్తే అవకాశాలు పుష్కలంగా కని్పస్తున్నాయి. అలాగే సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో జమ్మూ కశ్మీ ర్ తక్షణం రాష్ట్ర హోదా పునరుద్ధరించడంతో పాటు సెపె్టంబర్ కల్లా అసెంబ్లీకి ఎన్నికలూ జరపాల్సి ఉంది. 9. విదేశీ వాణిజ్యం పైపైకి... భారత విదేశీ వాణిజ్యం 2024లో 2 లక్షల కోట్ల డాలర్లను తాకవచ్చు. 2023లో యుద్ధాలు తదితర అంతర్జాతీయ పరిణామాలు ప్రపంచ ఎగుమతులు, దిగుమతుల మార్కెట్‌ను విపరీతంగా ప్రభావితం చేశాయి. అంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ మన విదేశీ వాణిజ్యం కళకళలాడింది. మొత్తం జీడీపీలో 40 శాతంగా నిలిచింది. 10. బీజేపీ వర్సెస్ ‘ఇండియా’ విపక్షాలకు, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు జీవన్మరణ సమస్యగా చెప్పదగ్గ కీలకమైన లోక్‌సభ ఎన్నికలకు 2024 వేదిక కానుంది. హ్యాట్రిక్ విజయం కోసం బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి ఉరకలేస్తోంది. పదేళ్లుగా కేంద్రంలో అధికారానికి దూరంగా ఉండటమే గాక అసెంబ్లీ ఎన్నికల్లో వరుస ఓటముల పాలవుతున్న కాంగ్రెస్ ఇంకా కాలూ చేయీ కూడదీసుకునే దశలోనే ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చరిత్ర తెలియక ఊరకే తిరగరాస్తున్నారు
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ)బిల్లు, జమ్మూకశ్మీర్ రిజర్వేషన్(సవరణ)బిల్లులపై చర్చ సందర్భంగా మాజీ ప్రధాని నెహ్రూపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపణలు గుప్పించడాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘ జమ్మూకశ్మీర్‌లోకి పూర్తిగా భారత బలగాలు వెళ్లేలోపే కాల్పుల విరమణకు నెహ్రూ ఆదేశాలిచ్చారు. అనవసరంగా కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లారు. నెహ్రూ చారిత్రక తప్పిదాల కారణంగానే కశ్మీర్ సమస్య అపరిష్కృతంగా తయారై అక్కడి ప్రజలు కష్టాలపాలయ్యారు’’ అని సోమవారం రాజ్యసభలో ఆరోపణలుచేయడం తెల్సిందే. దీనిపై మంగళవారం రాహుల్ పార్లమెంట్ ప్రాంగణంలో ఘాటుగా స్పందించారు. ‘‘ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఈ దేశం కోసం తన జీవితం మొత్తాన్నీ ధారపోశారు. స్వాత్రంత్య్ర పోరాటంలో చాలా సంవత్సరాలు జైలు జీవితం గడిపారు. ఇంకా ఇలాంటి చరిత్ర అంతా అమిత్ షాకు తెలీదనుకుంటా. అందుకే పదేపదే చరిత్రను తిరగరాస్తున్నారు. ఇదంతా అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే. కుల గణన వంటి సమస్యల సంగతేంటి? అసలు ప్రజాధనం ఎవరి చేతుల్లోకి వెళ్తోంది?. ఈ అంశాలను బీజేపీ అస్సలు చర్చకు స్వీకరించదు. భయంతో పారిపోతోంది. బీసీలను పట్టించుకోవట్లేదు’ అని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఓబీసీల ప్రాధాన్యం పెరగాలి గిరిజన వ్యక్తిని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా, ఓబీసీ నేతను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రకటించిందికదా ? అన్న మీడియా ప్రశ్నకు రాహుల్ బదులిచ్చారు. ‘‘మేం కూడా ఛత్తీస్‌గఢ్‌లో ఓబీసీ నేతను ముఖ్యమంత్రిని చేశాం. వాళ్లు కూడా మధ్యప్రదేశ్‌లో ఓబీసీ నేతను సీఎంగానే చేశారు. బీసీలకు ఒకే ఒక్క కీలక పదవి ఇస్తే సరిపోదు. ఇక్కడ పదవి ముఖ్యం కాదు. మరింత మంది ఓబీసీలకు ప్రాధాన్యత దక్కాలి. వారి ప్రాతినిధ్యం మరింత పెరగాలి. మోదీ సర్కార్ ప్రధానాంశాలను పక్కనబెట్టి ప్రజల దృష్టికి మరల్చుతోంది’’ అని రాహుల్ ఆరోపించారు. -
ఐరాసలో పాక్ నోట మళ్లీ ‘కశ్మీర్’ మాట
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్ అంశాన్ని మరోసారి పాకిస్తాన్ ప్రస్తావించింది. భారత్‌తో సంబంధాలు సజావుగా కొనసాగేందుకు కశ్మీరే కీలకమని పాక్ ఆపద్ధర్మ ప్రధాని అన్వరుల్ హక్ కకర్ పేర్కొన్నారు. శుక్రవారం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఆయన ప్రసంగించారు. భారత్ సహా అన్ని పొరుగు దేశాలతో సత్సంబంధాలు కొనసాగించాలని పాకిస్తాన్ కోరుకుంటోందని చెప్పారు. అయితే, భారత్‌తో సంబంధాల విషయంలో మాత్రం కశ్మీరే కీలకమన్నారు. కశ్మీర్‌కు సంబంధించి భద్రతా మండలి చేసిన తీర్మానాలన్నిటినీ అమలయ్యేలా చూడాలని కోరారు. ఐరాస మిలటరీ అబ్జర్వర్ గ్రూప్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్(యూఎన్‌ఎంవోజీఐపీ)ని తిరిగి అమల్లోకి తేవాలని కకర్ అన్నారు. వ్యూహాత్మక, సంప్రదాయ ఆయుధాలపై పరస్పర నియంత్రణకు సంబంధించిన పాక్ ప్రతిపాదనను అంగీకరించేలా భారత్‌పై ఒత్తిడి తేవాలన్నారు. -
ఐరాసలో కశ్మీర్ అంశంపై తుర్కియే వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూయార్క్: ఐక్యరాజ్య సమితి వేదికగా తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ మరోసారి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. యూఎన్ 78వ సర్వ సభ్య సమావేశాల్లో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడం వివాదాస్పదంగా మారింది. భారత్- పాక్ మధ్య కశ్మీర్ వివాదం ఇంకా కొనసాగుతుండటం దక్షిణాసియా ఉద్రిక్తతలకు కారణమైతుందని ఆయన అన్నారు. ఈ అంశాన్ని మరోసారి చర్చించి పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తుర్కియే ఈ అంశంపై మద్దతునిస్తుందని పేర్కొన్నారు. ' ఇండియా, పాకిస్థాన్‌లు స్వాతంత్య్రం తెచ్చుకుని 75 ఏళ్లు పూర్తయింది. అయినప్పటికీ ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనకపోవడం దురదృష్టకరం. కశ్మీర్లో ఇప్పటికైన శాంతి నెలకొనే విధంగా ఇరు దేశాలు చర్యలు తీసుకోవాలి.' అని ఐక్యరాజ్య సమితి వేదికగా ఎర్డోగాన్ అన్నారు. ఢిల్లీలో జరిగిన జీ20కి హాజరైన తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్ ప్రధాని మోదీతో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలను బలోపేతం చేసుకోవాలని నిర్ణయం కూడా తీసుకున్నారు. వారం రోజులకే ఎర్డోగాన్ కశ్మీర్ అంశాన్ని యూఎన్‌లో మాట్లాడటం చర్చనీయాశంగా మారింది. సభ్య దేశాల సంఖ్య పెంచాలి: ఐక్యరాజ్య సమితిలో భారత్ కీలక పాత్ర పోషించడంపై ఎర్డోగాన్ శుభపరిణామం అని అన్నారు. ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్య దేశాల సంఖ్యను పెంచాలని కోరారు. ప్రపంచంలో చాలా దేశాలు ఉండగా.. కేవలం ఐదు దేశాలు మాత్రమే శాశ్వత స్థానంలో ఉండటం సరికాదని అన్నారు. భద్రతా మండలిలో ఉన్న 20 దేశాలను విడతలవారిగా శాశ్వత సభ్యులుగా మార్చాలని కోరారు. ఇదీ చదవండి: జాగ్రత్త.. కెనడాలోని భారతీయులకు కేంద్రం హెచ్చరికలు -
మళ్లీ కశ్మీర్‌పై పాక్ ఏడుపు
ఐక్యరాజ్య సమితి: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో జరిగిన ఒక చర్చాకార్యక్రమంలోనూ కశ్మీర్ అంశాన్ని లేవదీసి పాకిస్తాన్ భారత్‌పై తన అక్కసును మరోసారి వెళ్లబోసుకుంది. దీంతో భారత్ ఘాటుగా స్పందించింది. పాకిస్తాన్ చేసే ద్వేషపూరిత, తప్పుడు ప్రచారాలకు కనీసం స్పందించాల్సిన అవసరం తమకు లేదని భారత్ తేల్చిచెప్పింది. నెలపాటు మొజాంబిక్ దేశ అధ్యక్షతన ఐరాస భద్రతా మండలిలో సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులోభాగంగానే ‘ మహిళలు, శాంతి, భద్రత’ అంశంపై చర్చలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ అసంబద్ధంగా జమ్మూకశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రసంగించారు. ఆ తర్వాత ఐరాస భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంభోజ్ మాట్లాడారు. ‘ బిలావల్ వ్యాఖ్యానాలు పూర్తిగా నిరాధారం. పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో చేసిన ప్రసంగమిది. మహిళలకు భద్రతపై చర్చాకార్యక్రమాన్ని మేం గౌరవిస్తున్నాం. మహిళా దినోత్సవ కాల విలువకు గుర్తించాం. ఈ అంశంపైనే మనం దృష్టిసారిద్దాం. అసందర్భంగా పాక్ విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలపై కనీసం స్పందించాల్సిన అగత్యం భారత్‌కు లేదు. గతంలో చెప్పాం. ఇప్పుడూ, ఇకమీదటా చెప్పేది ఒక్కటే. కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లు భారత్‌లో అంతర్భాగమే. దాయాదిదేశం పాక్‌తో పొరుగుదేశ సంబంధాలను సాధారణస్థాయిలో కొనసాగించాలని భారత్ మొదట్నుంచీ ఆశిస్తోంది. అలాంటి వాతావరణం నెలకొనేలా చూడాల్సిన బాధ్యత పాక్‌పై ఉంది. కానీ ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారి శత్రుత్వాన్ని పెంచుకుంటోంది’ అని రుచిరా ఘాటుగా వ్యాఖ్యానించారు. పుల్వామాలో సీఆర్పీఎఫ్ బలగాలపై దారుణ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని బాలాకోట్‌లో కొనసాగుతున్న జైషే మొహమ్మద్ ఉగ్ర శిబిరంపై భారత వాయుసేన మెరుపుదాడి తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. జమ్మూకశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతాలుగా విడదీశాక భారత్‌పై పాక్ ఆక్రోశం మరింతగా ఎగసింది. -
అమెరికా హౌస్ విదేశీ వ్యవహారాల కమిటీ నుంచి ఇల్హాన్ ఒమర్ తొలగింపు
వాషింగ్టన్: ‘కశ్మీర్‌పై అమెరికా మరింత శ్రద్ధ పెట్టాలి’ అని వ్యాఖ్యానించి భారత్ ఆగ్రహానికి గురైన అమెరికా ప్రతినిధుల సభ సభ్యురాలు ఇల్హాన్ ఒమర్‌కు షాక్ తగిలింది. శక్తిమంతమైన హౌస్ విదేశీ వ్యవహారాల కమిటీ నుంచి ఆమెను తొలగించారు. డెమొక్రటిక్ సభ్యురాలైన ఒమర్ తీరుపై రిపబ్లికన్ సభ్యులు చాలా రోజులుగా మండిపడుతున్నారు. ఇజ్రాయెల్, యూదులకు వ్యతిరేకంగా ఇష్టారాజ్యంగా ప్రకటనలు చేసిన ఆమె విదేశీ వ్యవహారాల కమిటీలో ఉండడానికి అర్హురాలు కాదని వారు వాదిస్తూ వచ్చారు. ఓటింగ్ నిర్వహించగా కమిటీ నుంచి ఆమె తొలగింపుకు అనుకూలంగా 218 ఓట్లు, వ్యతిరేకంగా 211 ఓట్లు వచ్చాయి. కమిటీలో లేనంత మాత్రాన తన గళాన్ని ఎవరూ అణచివేయలేరని, తాను మరింతగా రాటుదేలుతానని ఒమర్ వ్యాఖ్యానించారు. ఆమె గతంలో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లో పర్యటించారు. అప్పటి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌తో సమావేశమయ్యారు. -
Gaurav Yatra: నెహ్రూ వల్లే కశ్మీర్ సమస్య
జంజార్కా/ఉనాయ్(గుజరాత్): కశ్మీర్ సమస్యకు దేశ ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూయే కారణమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. నెహ్రూ రాజ్యాంగంలో చేర్చిన ఆర్టికల్ 370ను రద్దు చేయడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించిన ఘనత ప్రధాని మోదీకే దక్కిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసినప్పటికీ అయోధ్యలో రామమందిర నిర్మాణం పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. త్వరలో ఎన్నికలు జరగనున్న గుజరాత్లో ఆయన గురువారం అహ్మదాబాద్ జిల్లా జంజర్కా, ఉనాయ్లలో బీజేపీ ‘గౌరవ్ యాత్ర’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా పైవ్యాఖ్యలు చేశారు. ‘కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించేందుకు ఉద్దేశించిన ఆర్టికల్ 370ను రాజ్యాంగంలో చేర్చుతూ నెహ్రూ చేసిన తప్పిదం వల్లే కశ్మీర్ పెద్ద సమస్య అయి కూర్చుంది. ఆ ప్రాంతం దేశంతో సరిగ్గా విలీనం కాలేదు. దీంతో ప్రతి ఒక్కరూ ఆర్టికల్ 370ను తొలగించాలని కోరుకున్నారు. ప్రధాని మోదీ 2019లో ఒక్క వేటుతో 370ను రద్దు చేసి, కశ్మీర్‌ను దేశంతో విలీనం చేశారు’అని అమిత్ షా చెప్పారు. ‘అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామంటూ బీజేపీ చేసిన వాగ్దానాన్ని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. కానీ, మందిరం ఇప్పుడు వాస్తవ రూపం దాల్చుతోంది’అని అన్నారు. 2016 సర్జికల్ స్ట్రైక్స్, 2019 ఎయిర్ స్ట్రైక్స్‌ను ఆయన ప్రస్తావిస్తూ.. సీమాంతర ఉగ్రవాదంపై మోదీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిందన్నారు. గతంలో యూపీఏ హయాంలో పాక్ ఆర్మీ మన సైనికుల తలలను నరికి, వెంట తీసుకెళ్లింది. 2014లో మన ప్రభుత్వం వచ్చాక కూడా అలాగే చేయాలని చూసింది. కానీ, ఇది మౌని బాబా (మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఉద్దేశిస్తూ) ప్రభుత్వం కాదన్న విషయం వాళ్లు మరిచారు. ఉగ్రదాడులకు సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా మోదీ ప్రభుత్వం గుణపాఠం చెప్పింది’అని అమిత్ షా అన్నారు. ‘గుజరాత్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ఏడాదిలో 365 రోజులకు గాను 200 రోజులు కర్ఫ్యూయే అమలయ్యేది. కానీ, నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక గత 20 ఏళ్లలో అలాంటి పరిస్థితులు లేవు’అని చెప్పారు. దేశానికి భద్రత కల్పించడం, దేశాన్ని అభివృద్ధి చేసే సామర్థ్యం కాంగ్రెస్‌కు లేవని విమర్శించారు. ఇదీ చదవండి: ఉద్ధవ్ థాక్రే వర్గానికి భారీ ఊరట -
భారత్‌తో శాంతినే కోరుకుంటున్నాం కానీ.. కశ్మీర్‌తో ముడిపెట్టిన పాకిస్తాన్ ప్రధాని
ఇస్లామాబాద్: భారత్‌తో శాంతియుత సంబంధాలకు సిద్ధమని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చెప్పారు. ఐక్యరాజ్య సమితి తీర్మానాలకు లోబడి కశ్మీర్ సమస్య పరిష్కారంతోనే ఈ ప్రాంతంలో సుస్థిర శాంతి నెలకొంటుందని అన్నారు. ‘యుద్ధం రెండు దేశాలకు ఎంతమాత్రం మంచిది కాదు. భారత్‌తో చర్చల ద్వారా శాశ్వత శాంతి స్థాపన జరగాలని కోరుకుంటున్నాం. అయితే, ఐక్యరాజ్యసమితి తీర్మానాలకు లోబడి కశ్మీర్ సమస్యకు పరిష్కారం లభించినప్పుడే ఈ ప్రాంతంలో శాంతి స్థాపన సాధ్యం’అని హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చిన విద్యార్థుల బృందంతో ఆయన పేర్కొన్నట్లు ‘ది న్యూస్ ఇంటర్నేషనల్’ తెలిపింది. వాణిజ్యం, ఆర్థిక రంగాలతోపాటు ప్రజల జీవన స్థితిగతులను పెరుగుపరచడంలో ఇరు దేశాల మధ్య పోటీ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ‘పాక్ దురాక్రమణదారు కాదు. మా రక్షణ వ్యయం సరిహద్దుల రక్షణ కోసమే తప్ప దురాక్రమణ కోసం కాదు’అని అన్నారు. ‘పాక్ ఆవిర్భావం తర్వాత మొదట్లో ఆర్థికంగా అన్ని రంగాల్లో అద్భుతమైన వృద్ధిని సాధించింది. అనంతరం రాజకీయ అస్థిరత, సంస్థాపరమైన లోపాల కారణంగా ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయింది’అని ఆయన చెప్పారు. కశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు చేసిన అనంతరం భారత్, పాక్ సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. చదవండి: అరుదైన ఘటన.. కవలలే.. కానీ కంప్లీట్ డిఫరెంట్! -
మళ్లీ మొదటికొచ్చిన కశ్మీర్ సమస్య
ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ లోయలో శాంతిని పునఃస్థాపించగలిగామని రెండేళ్లుగా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. ఈ చర్యల కారణంగానే కశ్మీరీ పండిట్లు మళ్లీ తమ మాతృభూమికి వెళ్లగలిగారనీ, ఉద్యోగాలు పొందగలిగారనీ కూడా కేంద్రం చెబుతూ వస్తోంది. కానీ... తాజాగా జరుగుతున్నదేమిటి? పండిట్లు నిస్సహాయులుగా మళ్లీ కశ్మీర్‌ను వదిలి వెళ్లిపోతున్నారు. కశ్మీర్‌లోని ఉగ్రవాదులతో పాటు ప్రజలూ, మీడియాను కూడా ప్రభుత్వం తొక్కిపెట్టింది. ఫలితంగా ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూల దృక్పథం కొరవడి, మిలిటెంట్లు మళ్లీ రెచ్చిపోయేందుకు కారణమైంది. కాబట్టి, కశ్మీర్ రాజకీయాల్లో తుపాకీ పాత్ర లేకుండా జాగ్రత్త పడినప్పుడే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఇదేమీ అసాధ్యమైన విషయం కాదు. మిజోరం, పంజాబ్‌లలో కేంద్రం ఇప్పటికే ఈ ఘనతను సాధించింది. గ్రీకు పురాణాల్లో ‘హుబ్రిస్’ అని పిలుస్తారు దాన్ని. ఇంగ్లిష్ నిర్వచనం ప్రకారం అధిక గర్వం లేదా మితిమీరిన అహంకారం అనవచ్చు. గ్రీకుల పురాతన మత బోధనల్లో ‘హుబ్రిస్’కు గురైన వారు... నెమిసిస్ అనే దేవత చేతిలో హతమవుతారు. కశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం అలాంటి పరిస్థితే ఎదుర్కొం టున్నట్లు కనిపిస్తోంది! తిరిగి వెళ్తున్న పండిట్లు ఆర్టికల్ 370, 35ఏ రద్దు తరువాత కశ్మీర్ లోయలో శాంతిని పునః స్థాపించగలిగామని రెండేళ్లుగా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. ఈ చర్యల కారణంగానే కశ్మీరీ పండిట్లు మళ్లీ తమ మాతృభూమికి వెళ్లగలిగారనీ, ఉద్యోగాలు పొందగలిగారనీ కూడా కేంద్రం చెబుతూ వస్తోంది. కానీ... తాజాగా జరుగుతున్నదేమిటి? పండిట్లు నిస్సహా యులుగా మళ్లీ కశ్మీర్‌ను వదిలి వెళ్లిపోతున్నారు. తమను తాము కాపాడుకునేందుకు వెళుతున్న పండిట్లను నిలువరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అనధికారిక అంచనాల ప్రకారం ఇప్పటికే కొన్ని వందల మంది పండిట్లు కశ్మీర్‌ను వదిలి జమ్మూ చేరుకున్నారు. అంతేకాదు... ఉద్యోగం కోసం తప్పనిసరి చేస్తూ తమతో రాయించు కున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని కూడా వీరు డిమాండ్ చేస్తున్నారు. ప్రధానమంత్రి ప్యాకేజీ కింద గత ఏడాది కాలంలో దాదాపు ఆరు వేల మంది పండిట్లకు ఉద్యోగాలు, నివాస సదుపాయం లభించాయి. ప్రభుత్వం వీరి కోసం వేర్వేరు జిల్లాల్లో తాత్కాలిక ఇళ్ల నిర్మాణమూ చేపట్టి పూర్తి చేసింది. పండిట్ల తిరుగు వలస నేపథ్యంలో అధికారులు ఇప్పుడు ఉద్యోగ ఒప్పందాలను చూపి వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే... ప్రచార పటాటోపానికి మాత్రమే పనికొచ్చే నిర్మాణాలు కొన్ని చూపి అంతా బాగానే ఉందనే భ్రమను కల్పిస్తోంది ప్రభుత్వం. కానీ ట్రాన్సిట్ క్యాంపుల వద్ద కనీస భద్రతా సౌకర్యాలు, సిబ్బంది కూడా లేకపోవడం మాత్రమే వాస్తవం. అణిచివేతే విధానం కశ్మీర్ విషయంలో ప్రభుత్వం అణచివేత ధోరణినే ప్రదర్శించింది. కశ్మీర్‌లోని మిలిటెంట్లూ, ఉగ్రవాదులతో పాటు అన్ని వర్గాల ప్రజలూ, మీడియాను కూడా అనూహ్య రీతిలో తొక్కిపెట్టే ప్రయత్నం చేసింది. ఫలితంగా ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూల దృక్పథం కొరవడి మిలిటెంట్లు మళ్లీ రెచ్చిపోయేందుకు కారణమైంది. అటు ఉగ్ర వాదులు, ఇటు ప్రభుత్వం మధ్యలో బలవుతున్నది మాత్రం నిరా యుధులైన అమాయకులు. మరీ ముఖ్యంగా కశ్మీరీ పండిట్లు. వీరితో పాటు ప్రభుత్వ విధాన అమలుకు సహకరించారన్న అంచనాతో స్థానిక పోలీసు సిబ్బంది మీద కూడా ఉగ్రవాదుల దాడులు జరుగు తున్నాయి. పోలీసులను పరిస్థితులకు బందీలుగా కాకుండా ప్రభుత్వ ఉపకరణాలుగా ఉగ్రవాదులు చూస్తున్నారు. 2019 తరువాత నరేంద్ర మోదీ ప్రభుత్వం కశ్మీర్ విషయంలో వివాదాస్పద విధానాన్ని అవలంబించిందంటే అతిశయోక్తి కాదు. ఆర్టికల్ 370 కారణంగా కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు లభిస్తున్నాయన్న భ్రమలో దాన్ని రద్దు చేయడం మాత్రమే కాకుండా, రాష్ట్రాన్ని కాస్తా కేంద్ర పాలిత ప్రాంత స్థాయికి తగ్గించారు. జమ్మూ కశ్మీర్‌కు ముఖ్య మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా పనిచేసిన రాజకీయ నేతలను నిర్బంధంలో ఉంచారు. పరిపాలన మొత్తం నేరుగా ఢిల్లీ నుంచే నడిచేది. వీటన్నింటికి తోడుగా ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు నిర్వ హించిన ‘ఆపరేష¯Œ ఆలౌట్’ను మనం మరచిపోకూడదు. ఉగ్రవాద అణచివేతలో విజయం సాధించామన్న ప్రభుత్వ ప్రచారార్భాటాన్నీ గుర్తుంచుకోవాలి. వాస్తవిక పరిస్థితులు వేరే... 2021 డిసెంబరులో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి, కశ్మీర్ పాలనా వ్యవస్థకు అనధికార నేత అయిన అమిత్ షా మాట్లా డుతూ – ఆర్టికల్ 370 తొలగింపు ద్వారా కశ్మీర్లో శాంతి స్థాపనకు మార్గం ఏర్పడిందనీ, అభివృద్ధి సుసాధ్యమైందనీ మరోసారి వ్యాఖ్యా నించారు. అలాగే ఈ ఏడాది మార్చిలోనూ కశ్మీర్లో హింస తగ్గి పోయిందని నిరూపించేందుకు బోలెడన్ని గణాంకాలు వల్లెవేశారు. గణాంకాలు కాగితంపై బాగానే కనిపిస్తాయి కానీ... వాస్తవ పరిస్థి తులు పరిశీలిస్తేనే అసలు విషయం తెలుస్తుంది. తుదముట్టించిన మిలిటెంట్ల సంఖ్య, అరెస్ట్ అయినవారు, స్వాధీనం చేసుకున్న ఆయు ధాలు, పునరావాసం పొందిన పండిట్లు, కుదుర్చుకున్న ఒప్పందాల వంటివన్నీ అమిత్ షా మాటల్లో వినిపించాయి అయితే వీటన్నింటి మధ్య జన సామాన్యుల భావనలెలా ఉన్నాయన్నది మాత్రం ప్రభుత్వం అంచనా వేయలేకపోయింది. ఆరేళ్ల అణచివేత ధోరణుల ఫలితంగా ప్రజలు అప్పటికే విసుగెత్తి ఉన్నారు. తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసేందుకు నిరసన ప్రదర్శనలు నిర్వహించే అవకాశమూ లేకపోయిన నేపథ్యంలో వారు ప్రభుత్వ చర్యలకు మద్దతిస్తారని ఆశించలేము. ఉగ్రవాదం తీరు మారింది! ఈ పరిస్థితుల నేపథ్యంలోనే సైనిక చర్యల కారణంగా గణనీయంగా తగ్గిపోయిన ఉగ్రవాద కార్యకలాపాలు కాస్తా మళ్లీ తీవ్రవాదం స్థాయికి చేరుకున్నాయి. ఇప్పుడు అక్కడ యుద్ధం ఏకే 47, ఆర్‌పీజీలతో జరగడం లేదు కానీ... వ్యక్తులను ఎంచుకుని మరీ తుపాకులు, గ్రెనేడ్లతో దాడులు మొదలుపెట్టారు. లక్ష్యితులు నిరాయుధులు కావడం, ఆయుధాలను దుస్తుల్లో దాచుకుని వెళ్లగలగడం ఉగ్రవాదుల పనిని మరింత సులువు చేస్తోంది. అతి సాధారణ జీవితం గడుపుతూ అవసరమైనప్పుడు పండిట్ల వంటి నిరాయుధులను, లేదంటే విధి నిర్వహణలో లేని పోలీసు సిబ్బందిపై కాల్పులు జరపడం ఈ హైబ్రిడ్ మిలిటెన్సీ తీరుతెన్నులుగా మారాయి. పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి చొరబడుతున్న ఉగ్రవాదుల సంఖ్య తగ్గిపోయిందని సైన్యం స్వయంగా గత ఏడాది జూ¯Œ లో ప్రకటించింది కాబట్టి... ఈ తాజా దాడులు, హైబ్రిడ్ మిలిటెన్సీ పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ కనుసన్నలలోనే జరుగుతోందని మనం కచ్చితంగా అను కోవచ్చు. ఇంకోలా చెప్పాలంటే... మోదీ ప్రభుత్వ చర్యల వల్ల ఏర్పడ్డ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుని మిలిటెంట్లు పని చేస్తున్నారని చెప్పాలి. తుపాకులకు చోటు లేదు! కశ్మీర్ లోయలో ఉగ్రవాదుల అణచివేతలో నిఘా సంస్థలు, కేంద్ర ప్రభుత్వ బలగాలు ఎంతో సమర్థతతో వ్యవహరించాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. గడచిన రెండు దశాబ్దాల్లో ఇలాంటి పరిస్థితులు అనేకమార్లు ఏర్పడ్డాయి కూడా! అయితే ఒక మిలిటెంట్ హతమైతే... అతడి స్థానంలో ఇంకొకరు పుట్టుకొస్తున్నారు. అంటే... ఎంత మంది మిలిటెంట్లను చంపాం? ఎన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాం? అన్నవి ముఖ్యం కాదన్నమాట. కశ్మీర్ రాజకీయాల్లో తుపాకీ పాత్ర లేకుండా జాగ్రత్తపడినప్పుడే సమస్యకు పరిష్కారం లభించినట్లు. ఇదేమీ అసాధ్యమైన విషయం కాదు. మిజోరం, పంజాబ్‌లలో కేంద్రం ఇప్పటికే ఈ ఘనతను సాధించింది. ఈ రెండు రాష్ట్రాల అనుభవాలేమిటన్నది బీజేపీ సహా అన్ని పార్టీల రాజకీయ నాయకులకూ బాగా తెలుసు. కానీ ప్రస్తుతం వారు వాటిని విస్మరి స్తున్నారు. ఇదీ రాజకీయం ప్రత్యేకత. పాకిస్తాన్ కారణంగా కశ్మీర్ విషయంలో దౌత్యమూ అత్యవసరం. కానీ అవేవీ చేయకుండా మనం అణచివేత రాజకీయాలకు పాల్పడతూ, ఉడికీ ఉడకని జాతీయత అనే భావన ఆధారిత విధానాలను అవలంబిస్తున్నాం. వ్యాసకర్త: మనోజ్ జోషీ, జాతీయ, అంతర్జాతీయ రాజకీయ వ్యవహారాల నిపుణుడు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
'అందరూ నీలా ఉండరు'.. అఫ్రిదిని ఏకిపారేసిన టీమిండియా వెటరన్ క్రికెటర్
టీమిండియా వెటరన్ క్రికెటర్ అమిత్ మిశ్రా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. యాసిన్ మాలిక్ వ్యవహారంలో వెటకారంగా మాట్లాడిన అఫ్రిదికి అమిత్ మిశ్రా అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. యాసిన్ మాలిక్ నేరాన్ని ఒప్పుకున్నాడని.. నీలాగా అబద్దపు బర్త్ డేట్స్ చెప్పరని దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు. విషయంలోకి వెళితే కాశ్మీర్ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్ నేరాన్ని అంగీకరించడంతో అతన్ని ఢిల్లీ ఎన్ఐఏ కోర్టు బుధవారం దోషిగా నిర్దారించింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న నేరానికి సంబంధించి యాసిన్‌పై అభియోగాలు వచ్చాయి. విచారణలో అవన్నీ నిజమని తేలాయి. దీంతో యాసిన్ మాలికు జీవితకాల జైలుశిక్షతోపాటు రూ. పది లక్షల జరిమానా విధిస్తూ ఢిల్లీ ఎన్ఐఏ కోర్టు తీర్పునిచ్చింది. అంతకముందు యాసిన్ మాలిక్ వ్యవహారంతో పాటు కాశ్మీర్ అంశంపై అఫ్రిది ట్వీట్ చేస్తూ.. ‘భారత్ లో మానవ హక్కుల మీద గొంతెత్తుతున్నవారి గొంతు నొక్కడం కొనసాగుతూనే ఉంది. యాసిన్ మాలిక్ మీద నేరం మోపినంత మాత్రానా కాశ్మీర్ స్వేచ్ఛ కోసం చేసే పోరు ఆగేది కాదు. కాశ్మీరీ లీడర్ల మీద చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోమని ఐక్యరాజ్యసమితిని కోరుతున్నా.’ అంటూ ట్వీట్ చేశాడు. అఫ్రిది ట్వీట్ కు అమిత్ మిశ్రా స్పందిస్తూ.. ‘డియర్ షాహిద్ అఫ్రిది.. అతడు (యాసిన్ మాలిక్) స్వయంగా నేరాన్ని అంగీకరించాడు. అందరూ నీలాగా బర్త్ డేట్ ను తప్పు చెప్పి ప్రజలను తప్పుదారి పట్టించరు.'' అంటూ ట్వీట్ చేశాడు. అఫ్రిది బర్త్ డేట్ వివాదం విషయానికొస్తే.. గతంలో అతడు తన బర్త్ డే ను తప్పుగా రాసి క్రికెట్ టోర్నీలలో పాల్గొన్నాడని వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఐసీసీ అధికారులనే అఫ్రిది తప్పుదారి పట్టించాడని అఫ్రిదిపై ఆరోపణలున్నాయి. ఆ తర్వాత ఐసీసీ అధికారులే తన పుట్టినతేదీని తప్పుగా రాసుకున్నారని మాటమార్చాడు. కానీ అతడి మాటలు ఎవరూ నమ్మలేదు. చదవండి: Mohammad Hafeez: చెత్త రాజకీయాలకు సామాన్యులు బలవ్వాలా?.. మాజీ క్రికెటర్ ఆగ్రహం PAK-W Vs SL-W: డెబ్యూ మ్యాచ్‌లోనే ఇరగదీసింది.. టి20 క్రికెట్లో పాక్ బౌలర్ కొత్త చరిత్ర Dear @safridiofficial he himself has pleaded guilty in court on record. Not everything is misleading like your birthdate. 🇮🇳🙏https://t.co/eSnFLiEd0z — Amit Mishra (@MishiAmit) May 25, 2022 India's continued attempts to silence critical voices against its blatant human right abuses are futile. Fabricated charges against #YasinMalik will not put a hold to #Kashmir's struggle to freedom. Urging the #UN to take notice of unfair & illegal trails against Kashmir leaders. pic.twitter.com/EEJV5jyzmN — Shahid Afridi (@SAfridiOfficial) May 25, 2022 -
కశ్మీర్‌పై షహబాజ్ కారుకూతలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానిగా ఎన్నికైన వెంటనే షహబాజ్ షరీఫ్ తన వక్రబుద్ధి బయటపెట్టుకున్నారు. కశ్మీర్ అంశాన్ని, భారత్ 370 ఆర్టికల్‌ను రద్దుచేయడాన్ని తన తొలి ప్రసంగంలో ప్రస్తావించారు. కశ్మీర్ లోయలో ప్రజలు రక్తమోడుతున్నారని, కశ్మీర్ ప్రజలకు పాకిస్తాన్ దౌత్య, నైతిక మద్దతిస్తుందని చెప్పారు. కశ్మీర్ విషయాన్ని ప్రతి అంతర్జాతీయ సమావేశంలో ప్రస్తావిస్తామన్నారు. భారత్‌తో సత్సంబంధాలనే తాను కోరుకుంటున్నానని, కానీ కశ్మీర్ సమస్య పరిష్కారం కాకుండా అది సాధ్యం కాదని చెప్పారు. పొరుగుదేశాలను ఎవరం ఎంచుకోలేమని, వాటితో కలిసి జీవించాలని, దురదృష్టవశాత్తు దేశ విభజన సమయం నుంచి భారత్‌తో పాక్‌కు సత్సంబంధాలు లేవని చెప్పారు. 2019లో అధికరణ 370 రద్దు సహా పలు సీరియస్ చర్యలను భారత్ చేపట్టిందని, దీంతో కశ్మీర్ లోయలో, రోడ్లపై కశ్మీరీల రక్తం చిందుతోందని విషం కక్కారు. కశ్మీర్ విషయంపై చర్చకు మోదీ ముందుకురావాలని, ఆ సమస్య పరిష్కారమైతే ఇరుదేశాలు పేదరికం, నిరుద్యోగంలాంటి ఇతర కీలకాంశాలపై దృష్టి పెట్టవచ్చని సూచించారు. రాబోయే తరాలు ఎందుకు బాధలు పడాలని, ఐరాస తీర్మానాలకు, కశ్మీరీల ఆంక్షాలకు అనుగుణంగా కశ్మీర్ సమస్యను పరిష్కరిద్దామని ఆహ్వానించారు. పఠాన్‌కోట్ దాడి తర్వాత ఇండో–పాక్ సంబంధాలు దిగజారాయి. 2019లో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా తొలగించడం, అధికరణ 370ని రద్దు చేయడంతో పాక్‌లోని భారత హైకమిషనర్‌ను పాక్ బహిష్కరించింది. అనంతరం భారత్‌తో వాయు, భూమార్గాలను మూసివేసింది. వాణిజ్యాన్ని, రైల్వే సేవలను నిలిపివేసింది. ఉగ్రవాదులకు పాక్ మద్దతు నిలిపివేస్తే చర్చలు జరుపుతామని భారత్ తేల్చిచెబుతోంది. -
తెలుసా..! స్వతంత్ర పాకిస్తాన్ కావాలని మొదట కోరింది అతనేనట!
‘పాక్స్తాన్’ ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జ్.. 3, హంబర్‌స్టోన్ ఇంటిలోని ఒకగది గోడమీద రాసున్నాయి ఆ అక్షరాలు (పాకిస్తాన్ కాదు). రాసినవాడు జిన్నా కాదు, చౌధురి రహమత్ అలీ. ఆ పద సృష్టికర్త అలీయే. భారత స్వాతంత్య్రోద్యమానికి సమాంతరంగా ముస్లిం జాతీయోద్యమం నడపాలని ఆశించినవాడు, స్వతంత్ర పాకిస్తాన్ కావాలని మొదట కోరినవాడు ఇతడే. ఎవరీ అలీ? తూర్పు పంజాబ్, హోషియార్‌పూర్‌లోని కామేలియా అతడి స్వస్థలం. 1897 నవంబర్ 16న బాలాచౌర్లో పుట్టాడు. 1930లో ఇంగ్లండ్ వెళ్లి 1931లో కేంబ్రిడ్జ్ పరిధిలోని ఇమ్మాన్యుయేల్ కళాశాలలో చేరాడు. అలీ మిత్రుడు అబ్దుల్ కరీం కథనం ప్రకారం తన మిత్రులు పీర్ అహసనుద్దీన్, ఖ్వాజా అబ్దుల్లతో కలసి థేమ్స్ ఒడ్డున నడుస్తుండగా అలీకి ఆ పేరు స్ఫురణకు వచ్చింది. అలీ కార్యదర్శి ఫ్రాస్ట్ మాటలలో అయితే, ఒక రోజున బస్సు టాప్ మీద ప్రయాణిస్తున్నప్పుడు ఆ పేరు స్ఫురించింది. ఆ హ్రస్వనామమే (పి.ఎ.కె. స్తాన్) తరువాత ‘ఐ’ చేరి పాకిస్తాన్ అయింది. పాకిస్తాన్ అంటే పర్షియన్లో పవిత్రభూమి. బహుశా భారత్, పాక్ చరిత్రలలో అలీ అంతటి వివాదాస్పద వ్యక్తి కనిపించడు. భారత్‌లో సరే, పాకిస్తాన్ చరిత్రలో కూడా ఇతడికి కొద్దిపాటి స్థానం కూడా కనిపించనిది అందుకే కాబోలు. కానీ పాక్స్తాన్ జాతీయోద్యమ నిర్మాతగా ఇతడు తనను తాను ప్రకటించుకున్నాడు. నిజానికి బొంబాయి కేంద్రంగా ‘పాకిస్తాన్’ పేరుతో పత్రికను ప్రచురించడానికి 1928లో ఒక పత్రికా రచయిత దరఖాస్తు చేశాడు. అతడు కశ్మీర్‌కు చెందిన గులాం హసన్ షా కాజ్మీ. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఫలితాలు రహమత్‌ను బాగా నిరాశపరచాయి. ఆ సమావేశాలకు వెళ్లిన భారతీయ బృందాన్ని క్షమించకూడదన్నాడు. ఆ సమావేశాలకు డాక్టర్ ఇక్బాల్ కూడా హాజరయ్యారు. అప్పుడే రహమత్ ఆయనను ఇంగ్లండ్‌లో కలుసుకున్నాడు. తరువాత 1932 నాటి అలహాబాద్ ముస్లింలీగ్ సమావేశాలలో డాక్టర్ ఇక్బాల్ చేసిన ప్రతిపాదన కూడా అలీకి నిరాశ కలిగించింది. వాయవ్య ప్రాంతంలో ముస్లింలు అధికంగా ఉన్న ఐదు ప్రాంతాలను కలిపి ఒక సమాఖ్యను ఏర్పాటు చేసి, బ్రిటిష్ ఇండియాలో అంతర్భాగంగా ఉంచాలని ఇక్బాల్, లీగ్ కోరడం అలీకి నచ్చలేదు. దక్షిణాసియాలో ముస్లింలకో స్వతంత్ర దేశం అన్నది అతడి నినాదం. అసలు పరమతానికి చెందిన ఏ పేరూ ఆసియాలో మిగిలి ఉండకూడదని అతడి నిశ్చితాభిప్రాయం. రహమత్ అలీ ప్రతిపాదించిన పిఎకెలో, పి అంటే పంజాబ్, ఎ అంటే అఫ్గానిస్తాన్ (మొత్తం వాయవ్య సరిహద్దు), కె అంటే కశ్మీర్, ఎస్ అంటే సింధ్, స్తాన్ అంటే బలూచిస్తాన్‌కు సంకేతాక్షరాలు. బ్రిటిష్ ఇండియా పటంలోని బెంగాల్, అస్సాంలకు బంగిస్తాన్ అన్న పేరూ పెట్టాడు. ఉస్మాన్స్తాన్ (నిజాం రాజ్యం), ముస్లింలు అధికంగా ఉండే ఇంకొన్ని ప్రాంతాల మీద ఆకుపచ్చ రంగు పులిమి ఒక సరికొత్త భౌగోళిక పటాన్ని అతడు రచించాడు. ఆ పచ్చరంగు ప్రాంతాలే పాక్స్తాన్. ఈ ఊహనంతటినీ 1933 జనవరి 28న విడుదల చేసిన చరిత్ర ప్రసిద్ధ ‘నౌ ఆర్ నెవర్’ కరపత్రంలో అలీ వివరించాడు. దీనర్థం ‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?’ అని. దీనికే ‘మనం బతికేందుకా! నశించిపోతూ ఉండడానికా?’ అన్న ఉపశీర్షిక కూడా ఉంది. మూడో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌కు హాజరైన భారతీయ బృందాన్ని దృష్టిలో ఉంచుకునే అతడు ఈ కరపత్రం రాశాడని చెబుతారు. దీనికే ‘పాకిస్తాన్ ప్రకటన’ అంటూ పాకిస్తాన్ పత్రిక ‘డాన్’ పేరు పెట్టడం గమనార్హం. ఈ కరపత్రం బహిర్గతమైన సంవత్సరం తరువాత 1934 జనవరి 28న ఇంగ్లండ్‌లోనే ఉన్న జిన్నాను రహమత్ అలీ తన నివాసానికి పిలిచి వివరించాడని కోలిన్స్, లాపిరే (‘ఫ్రీడవ్‌ు ఎట్ మిడ్నైట్’), రషీదా మాలిక్ (‘ఇక్బాల్: స్పిరిచ్యువల్ ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్’) వంటి రచయితలు వేర్వేరు రీతులలో తెలియచేశారు. లండన్‌లోని వాల్డెర్ఫ్ హోటల్లో జిన్నా కోసం బ్లాక్‌టై పార్టీ ఏర్పాటు చేసి.. అలీ ఇవన్నీ చెప్పినట్టు కోలిన్స్, లాపిరే రాశారు. 3, హంబర్‌స్టోన్ ఇంటికే జిన్నా వచ్చారని ఎక్కువమంది రాశారు. చిత్రంగా ‘పాకిస్తాన్ ఆలోచనే అసాధ్యం’ అంటూ ఆ క్షణంలోనే జిన్నా చెప్పారని కోలిన్స్, లాపిరే చెబితే, ‘కాలం గడవనీ! వాళ్ల సంగతి వాళ్లే (భారతీయ ముస్లింలు) చూసుకుంటారు’ అని సర్ది చెప్పినట్టు ఇతర రచయితలు రాశారు. ఏమైనా 1934 వరకు కూడా పాకిస్తాన్ ఆలోచనకు ఎవరూ సానుకూలంగా లేరన్నది నిజం. ఇది కాలేజీ కుర్రాళ్ల రగడ అనే మూడో రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్లిన పెద్దలు భావించారు. రహమత్ అలీ మరికొన్ని కరపత్రాలు కూడా వెలువరించాడు. ‘పాక్స్తాన్: ది ఫాదర్ల్యాండ్ ఆఫ్ పాక్స్తానీ నేషన్’ అన్న పుస్తకం కూడా రాశాడు. ఇస్లాంను ఆవిష్కరించే క్రమంలో ప్రవక్త అరబ్ తెగలను ఏకం చేసిన క్రమమే దక్షిణాసియాలో ముస్లింలకో దేశం అన్న తన లక్ష్యానికి ప్రేరణ అని అలీ చెప్పుకున్నాడు. తమ పూర్వికులు ఆరంభించిన స్థలాలు, పట్టణాలు, కొండల పేర్ల మార్పు ఉద్యమం కొనసాగాలనీ ఆశించాడు. హిమాలయాలను ‘జబాలియా’ అని, బంగాళాఖాతాన్ని ‘బంగి ఇ ఇస్లాం’ అని, ఆసియా ఖండాన్ని ‘దినియా’అని పిలిస్తేనే సార్థకమని భావించాడు. బుందేల్‌ఖండ్ మాల్వాలను సిద్దిఖిస్తాన్ అని, బిహార్, ఒడిశాలను ఫారూకిస్తాన్ అని, రాజస్థాన్‌ను ముయిస్తాన్ అని, మొత్తం హిందూస్థాన్‌ను హైదర్స్తాన్ అని, దక్షిణ భారతదేశాన్ని మాప్లిస్తాన్ అని పిలవడం సరైనదని వాదించాడు. పశ్చిమ సింహళానికి షఫిస్తాన్ అని, తూర్పు సింహళానికి నాసరిస్తాన్ అని కూడా పేర్లు పెట్టాడు. వీటిలో మొదట సాధించవలసినది మాత్రం పాక్స్తాన్ అని అనుకున్నాడు. జాతీయోద్యమానికి సమాంతరంగా ముస్లిం జాతీయోద్యమం సాగించడానికి రహమత్ అలీ ప్రయత్నించాడు. 1940 నాటి లాహోర్ సమావేశంలో మొదటిసారిగా ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలన్న డిమాండ్ చేశాడు జిన్నా. ఆ సమావేశానికి రహమత్ కూడా హాజరయ్యాడు. దేశ విభజన తరువాత 1948 ఏప్రిల్ 6న అలీ లాహోర్ చేరుకున్నాడు. యమునా నదే హిందుస్థాన్‌కు, పాకిస్తాన్‌కు మధ్య సహజ సరిహద్దు అని, ఢిల్లీ, ఆగ్రాలు లేని పాకిస్తాన్‌ను ఎలా అంగీకరించారని ధ్వజమెత్తడం ఆరంభించాడు. తను పచ్చరంగు పూసి, సూచించిన ప్రాంతాలతో పాకిస్తాన్ ఎందుకు సాధించలేదన్నదే అతడి ప్రశ్న. జిన్నా ‘ఖాయిద్ ఏ ఆజమ్’ (మహా నాయకుడు జిన్నా బిరుదు) కాదు, ‘క్విస్లింగ్ ఏ ఆజమ్’(మహా ద్రోహి) అని విమర్శలు ఆరంభించాడు. దీనితో ప్రధాని లియాఖత్ అలీఖాన్ పాక్ నుంచి రహమత్‌ను బహిష్కరించాడు. అతడి ఆస్తులను జప్తు చేయించాడు. తిరిగి కేంబ్రిడ్జ్ చేరుకున్న అలీ 1951 ఫిబ్రవరి 3న దాదాపు అనాథగా చనిపోయాడు. కేంబ్రిడ్జ్‌లో అతడి ఆచార్యుడు ఎడ్వర్డ్ వెల్బోర్న్ డబ్బు ఇచ్చి అంత్యక్రియలు జరిపించాడు (ఈ ఖర్చులను తరువాత పాకిస్తాన్ హైకమిషన్ చెల్లించింది). మరణానంతరమైనా తన అవశేషాలు స్వస్థలం కామేలియాకు పంపించాలని తన న్యాయవాదిని అలీ కోరినట్టు చెబుతారు. కానీ 2006లో జరిగిన ఈ ప్రయత్నం కూడా చిత్తశుద్ధితో సాగలేదు. 1947లో మౌంట్‌బాటన్‌తో జిన్నా చెప్పిన ‘మాత్ ఈటెన్ పాకిస్తాన్’ (అసంపూర్ణ పాకిస్తాన్) అన్నమాటకీ, ‘కశ్మీర్ లేని పాకిస్తాన్ ఏమిటీ?’ అన్న రహమత్ వాదనకీ ఏమైనా వ్యత్యాసం ఉందా? - డా. గోపరాజు నారాయణరావు చదవండి: సస్పెన్స్ థ్రిల్లర్ క్రైం స్టోరీ: 37 కోట్ల బీమా కోసం పాముకాటుతో చంపించి.. -
కశ్మీర్ సమస్య పరిష్కారమైతే... అణ్వాయుధాలే అవసరం లేదు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ వద్ద ఉన్న అణ్వాయుధాలు కేవలం తమను తాము రక్షించుకోవడానికే అని, కశ్మీర్ అంశం పరిష్కారమైతే అణ్వాయుధాల అవసరం ఉండబోదని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ స్పష్టం చేశారు. ఈ ఏడాది జనవరి నాటికి పాకిస్తాన్ వద్ద 165 అణ్వాయుధాలు ఉన్నాయని స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిప్రి) ఇటీవల తెలిపింది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ఖాన్ ఓ న్యూస్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. పాక్ అణ్వాయుధాల సంఖ్య పెరుగుతోందా? అడి అడగ్గా... ఆ విషయం తనకు తెలియదని సమాధానం ఇచ్చారు. పక్క దేశం తమకంటే ఏడు రెట్లు పెద్దదైనప్పుడు చిన్న దేశం తప్పకుండా జాగ్రత్తపడుతుందని ఇమ్రాన్ అన్నారు. అందులో తప్పేమీ లేదన్నారు. అయితే తాను మాత్రం అణ్వాయుధాలకు వ్యతిరేకమని పేర్కొన్నారు. కశ్మీర్ అంశాన్ని పరిష్కరించడంలో అమెరికాకు బాధ్యత ఉందని అన్నారు. వారు తలచుకుంటే దాన్ని పరిష్కరించగలరని కూడా చెప్పారు. అయితే సిమ్లా ఒప్పందం ప్రకారం ఈ అంశంపై మూడో దేశం మధ్యవర్తిత్వం ఉండరాదని భారత్ చెబుతోంది. -
కోరితే.. కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం!
న్యూఢిల్లీ: ఈ పర్యటనలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయాలనుకోవడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) భారత్ అంతర్గత వ్యవహారమని, ఆ విషయమై తాను ఏమీ వ్యాఖ్యానించబోనని తేల్చిచెప్పారు. భారత పర్యటన సందర్భంగా మంగళవారం ట్రంప్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. భారత్‌లో ప్రజలకు మతస్వేచ్ఛ ఉండాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారనే తాను భావిస్తున్నానన్నారు. ‘వివాదాస్పద అంశాల జోలికి వెళ్లాలనుకోవడం లేదు. వివాదాస్పద అంశాలకు సంబంధించిన ఒక చిన్న సమాధానం నా మొత్తం పర్యటన సానుకూలతను ముంచేస్తుంది.(అమెరికాకు బయల్దేరిన ట్రంప్ బృందం) ఆ జవాబును మాత్రమే మీరు పట్టించుకుంటారు. నా పర్యటన అంతా పక్కనబెడ్తారు’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. వివాదాస్పద అంశాల జోలికి వెళ్లనంటూనే.. అంతా కోరుకుంటే కశ్మీర్‌పై మధ్యవర్తిత్వానికి సిద్ధమంటూ ట్రంప్ వ్యాఖ్యానించడం గమనార్హం. కశ్మీర్‌ను భారత్, పాకిస్తాన్ల మధ్య నెలకొన్న అతి పెద్ద సమస్యగా ట్రంప్ అభివర్ణించారు. ‘ఉద్రిక్తతలు తొలగేలా మధ్యవర్తితం చేయమంటే.. అందుకు నేను సిద్దం’అన్నారు. మోదీ, ఇమ్రాన్‌ఖాన్.. ఇద్దరితో తనకు సత్సంబంధాలున్నాయన్నారు. ప్రతీ విషయానికి రెండు వాదనలుంటాయని వ్యాఖ్యానించారు. గతంలోనూ పలు సందర్భాల్లో కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వానికి తాను సిద్ధమంటూ ట్రంప్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ‘పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో నాకు మంచి సంబంధాలున్నాయి. సీమాంతర ఉగ్రవాదాన్ని నియంత్రించేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. కశ్మీర్ సమస్యపై కృషి చేస్తున్నారు’అని ట్రంప్ పేర్కొన్నారు. భారత ప్రధాని మోదీతో జరిగిన చర్చల్లో పాకిస్తాన్ అంశం ప్రస్తావనకు వచ్చిందన్నారు. పాక్ నుంచి తలెత్తుతున్న ఉగ్రవాదంపై కూడా చర్చించామన్నారు. ఈ సందర్భంగా మోదీపై మరోసారి ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోదీ సరళంగా వ్యవహరించే, చాలా శక్తిమంతమైన నేత అని వ్యాఖ్యానించారు. ‘మోదీ గట్టి మనిషి. తానేమనుకుంటాడో అది చేస్తారు. ఉగ్రవాదాన్ని అడ్డుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటారు’అన్నారు. ట్రంప్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి వాణిజ్యంపై.. దిగుమతుల సుంకాలు అధికంగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటన్నారు. భారత్ దిగుమతి చేసుకుంటున్న హార్లీ డేవిడ్సన్ బైక్‌పై విధిస్తున్న భారీ సంకాల విషయాన్ని ట్రంప్ ప్రస్తావించారు. ఈ టారిఫ్‌ల విషయంలో అమెరికాతో సానుకూలంగా వ్యవహరించాల్సి ఉందన్నారు. అమెరికా నుంచి భారత్ భారీగా మిలటరీ హార్డ్‌వేర్‌ను కొనుగోలు చేస్తోందన్నారు. తాలిబన్‌తో అమెరికా శాంతి ఒప్పందాన్ని భారత్ సమర్ధిస్తుందనే తాను భావిస్తున్నానన్నారు. అమెరికాలో త్వరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేందుకు రష్యా ప్రయత్నిస్తోందా? అన్న ప్రశ్నకు.. అలాంటి సమాచారమేదీ తనకు నిఘా వర్గాల నుంచి రాలేదన్నారు. ((సీఎన్ఎన్ X ట్రంప్) ఢిల్లీ అల్లర్లు అంతర్గతం ఢిల్లీలో ప్రస్తుతం జరుగుతున్న అల్లర్లపై మోదీతో చర్చించారా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. వ్యక్తిగత దాడుల గురించి చర్చించబోనన్నారు. అది భారత్ సొంత విషయమని స్పష్టం చేశారు. సీఏఏపై తాను ఏమీ మాట్లాడబోనని ట్రంప్ స్పష్టం చేశారు. భారత్ తన దేశ ప్రజల కోసం సరైన నిర్ణయాలే తీసుకుంటుందని భావిస్తున్నానన్నారు. భారత్‌లో ముస్లింలు వివక్షకు గురవుతున్నారని, వారిపై ద్వేషపూరిత దాడులు జరుగుతున్నాయన్న వార్తలపై స్పందించాలన్న ప్రశ్నకు.. ‘మోదీతో చర్చల్లో ముస్లింల ప్రస్తావన కూడా వచ్చింది. క్రిస్టియన్ల గురించి కూడా చర్చించాం’అన్నారు. ఈ విషయమై ప్రధాని మోదీ నుంచి తనకు శక్తిమంతమైన సమాధానం లభించిందన్నారు. కాగా, మోదీ, ట్రంప్‌ల మధ్య చర్చల్లో సీఏఏ అంశం చర్చకు రాలేదని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా పేర్కొన్నారు. మత సామరస్యంపై ఇరువురు నేతలు సానుకూల భావాలను వ్యక్తం చేశారన్నారు. మత స్వేచ్ఛపై మాట్లాడా... ప్రధాని మోదీతో చర్చల సందర్భంగా.. భారత్‌లో మత స్వేచ్ఛ విషయమై సుదీర్ఘంగా చర్చించానని ట్రంప్ తెలిపారు. ‘భారత్‌లో మత స్వేచ్ఛపై చర్చించాం. భారత్‌లో ప్రజలందరికీ మత స్వేచ్ఛ ఉండాలనే మోదీ కోరుకుంటున్నారు. ముస్లింలతో కలిసి పనిచేస్తున్నామని మోదీ నాకు చెప్పారు. గతంలోనూ పౌరులకు మతస్వేచ్ఛను అందించేందుకు భారత్ కృషి చేసింది’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. మోదీ అద్బుతమైన నేత అని, భారత్ గొప్ప దేశమని పేర్కొన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే.. పౌరులకు మతస్వేచ్ఛ అందించేందుకు భారత్ గొప్పగా కృషి చేసిందన్నారు. -
కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం వహిస్తా
దావోస్: కశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌కి సాయపడతానంటూ మరోమారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించేందుకు.. అవసరమైతే బాసటగా ఉంటానంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో సమావేశంలో ట్రంప్ బుధవారం తెలిపారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాల్లో పాల్గొన్న ట్రంప్.. పాక్ ప్రధాని ఇమ్రాన్‌తో వేరుగా సమావేశం అయ్యారు. కశ్మీర్ వివాదంపై భారత ప్రధాని మోదీతో మాట్లాడతానని ఇమ్రాన్‌కు హామీ ఇచ్చారు. కాగా, కశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘కశ్మీర్ అంశం భారత్–పాక్‌కు సంబంధించింది. దీంట్లో ఎవ్వరి ప్రమేయాన్ని అంగీకరించే ప్రశ్నే లేదు’ అని పేర్కొంది. పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌ని కలుసుకోవడం తనకు చాలా ఇష్టమనీ, అయితే ఆమె తన కోపాన్ని అమెరికాపై ప్రదర్శించవద్దంటూ ట్రంప్ సూచించారు. అనేక దేశాలు అమెరికా కంటే ఎక్కువ కాలుష్యంతో నిండిఉన్నాయనీ గ్రెటా ఆ ప్రాంతాలపై దృష్టిసారించడం మంచిదని హితవు పలికారు. ట్రంప్ ఉపన్యాసాన్ని ప్రశాంతంగా కూర్చుని విన్న గ్రెటా ‘‘మా ఇళ్లు ఇంకా మంటల్లో కాలుతున్నాయి’’ అని వ్యాఖ్యానించింది. -
ఐరాసలో పాక్‌కు మళ్లీ భంగపాటు
ఐక్యరాజ్యసమితి: భద్రతామండలిలో కశ్మీర్ అంశాన్ని మరోసారి లేవనెత్తేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్‌కు భంగపాటు ఎదురైంది. చైనా సాయంతో వివాదాస్పద అంశాన్ని ప్రస్తావించేందుకు పాక్ ప్రయత్నించగా మండలిలో మిగిలిన సభ్యులెవరూ మద్దతివ్వక పోవడంతో ఏకాకిగా మిగిలిపోయింది. కశ్మీర్ అంశం ద్వైపాక్షికమైనందున దానిపై చర్చించడం కుదరదని, మండలిలోని ఇతర సభ్యులు స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు సాధారణ స్థితికి రావాలంటే పాకిస్తాన్ తనకు కష్టమైన చర్యలు చేపట్టాల్సిందేనని భారత్ స్పష్టం చేసింది. ‘పాక్ ప్రతినిధులు ఐక్యరాజ్య సమితి వేదికగా పదేపదే చేసిన నిరాధార ఆరోపణలకు మద్దతు లభించలేదు’’అని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు. ‘పాక్ ప్రయత్నమంతా దృష్టి మరల్చేందుకేనని మిగిలిన సభ్యులు గుర్తించడం సంతోషకరం. సమస్యల పరిష్కారానికి ద్వైపాక్షిక పద్ధతులు ఉన్నాయని భద్రత సమితి సభ్యులు పాక్‌కు గుర్తు చేశారు’అని ఆయన వివరించారు. దురుద్దేశపూర్వక ఆరోపణలు చేయడం పాక్‌కు అలవాటేనని, సమితి సభ్యులు సూచించినట్టుగా సమస్యల పరిష్కారానికి కొన్ని కష్టమైన చర్యలు తీసుకోవడమే ఆ దేశానికి మేలని ఆయన అన్నారు. చైనా దౌత్యవేత్త ఝాంగ్ జున్ మాట్లాడుతూ ‘కశ్మీర్‌పై సమావేశం జరిగింది. భారత, పాక్ అంశం ప్రతి సమావేశంలోనూ ఉంటుంది. దీంతో భద్రతామండలి దీనిపై కొంత సమాచారం తెలుసుకుంది’అని పేర్కొనడం గమనార్హం. ఎస్సీఓ భేటీకి ఇమ్రాన్‌కూ ఆహ్వానం న్యూఢిల్లీ: ఈ ఏడాది చివర్లో ఢిల్లీలో జరగనున్న షాంఘై సహకార సంఘం(ఎస్సీవో) వార్షికభేటీకి పాక్ ప్రధాని ఇమ్రాన్ సహా పలువురు నేతలకు భారత్ ఆహ్వానం పంపనుంది. ఎస్సీవోలోని పాకిస్తాన్ సహా 8 సభ్య దేశాలు, నాలుగు పరిశీలక హోదా దేశాలనూ ఆహ్వానిస్తామని విదేశాంగ శాఖ మంత్రి రవీశ్ కుమార్ వెల్లడించారు. ‘గతం’ నుంచి భారత్ బయటపడాలి గత అనుభవాలు, ఆలోచనల చట్రంలో బందీగా ఉన్న భారత్, వాటి నుంచి బయటకు రావాల్సి ఉందని విదేశాంగ మంత్రి జై శంకర్ అన్నారు. కీలక సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో దేశం ప్రస్తుతం కొత్త వైఖరిని అనుసరించేందుకు ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. అయితే, తనను తాను స్వతంత్రంగా నిర్వచించుకుంటుందా లేక ఆ అవకాశాన్ని ఇతరులకు ఇస్తుందా అనేదే అసలైన ప్రశ్న అన్నారు. ఇందులో స్వతంత్ర వైఖరికే తనతోపాటు తమ పార్టీ మొగ్గుచూపు తాయని పేర్కొన్నారు. పలు అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంలో జరుగుతున్న ‘రైజినా డైలాగ్’ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మాట్లాడుతూ.. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాలపై అంతర్జాతీయ సమాజం కలిసికట్టుగా పోరాటం సాగించాలన్నారు. ఈ పోరులో ఉగ్రవాదానికి ఊతమిచ్చే దేశాలను భాగస్వాములను కానీయరాదని పేర్కొన్నారు. కార్యక్రమానికి హాజరైన ఇరాన్ విదేశాంగ మంత్రి జావెద్ జరీఫ్ మాట్లాడుతూ.. అమెరికాతో తమ దేశం దౌత్యా నికి సిద్ధమే కానీ, చర్చలకు మాత్రం కాదన్నారు. తమ సైనిక జనరల్ సులేమానీని చంపడం అమెరికా చేసిన క్షమించరాని తప్పిదమని వ్యాఖ్యానించారు. ఇరాన్ మంత్రి జరీఫ్ అనంతరం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ‘రైజినా డైలాగ్’లో విదేశాంగ మంత్రి జై శంకర్ -
'ఉగ్రవాదం పాక్ డీఎన్ఏలోనే ఉంది'
పారిస్ : కశ్మీర్ విషయంలో రాజకీయాలు చేయాలని చూస్తున్న పాకిస్తాన్‌కు అంతర్జాతీయ వేదికలపై భారత్ దీటుగా సమాధానం చెబుతుంది. తాజాగా ప్యారిస్‌లో జరుగుతున్న యూనెస్కో జనరల్ సమావేశంలో పాక్ లేవనెత్తిన కశ్మీర్ అంశాన్ని భారత్ తిప్పికొట్టింది. ఉగ్రవాదం అనేది పాక్ డీఎన్ఏలోనే ఉందంటూ భారత్ తరపున హాజరైన అనన్య అగర్వాల్ స్పష్టం చేశారు. పాక్ అనుసరిస్తున్న విధానాలతో ఆ దేశ ఆర్థిక వ్యవస్తను దారుణంగా కుంగదీశాయన్నారు. యూనెస్కో వేదికగా భారత్‌పై బురద జల్లేందుకు ప్రయతించిన పాక్ వైఖరిని ఆమె ఖండించారు. ఉగ్రవాద సిద్ధాంతాలు, తీవ్రవాద భావజాలం వంటి చీకటి కోణాలకు పాక్ అడ్డాగా మారందని అగర్వాల్ ఆరోపించారు. అణు యుద్దం, ఇతర దేశాలపై ఆయుధాలను ప్రయోగించడం లాంటి వ్యాఖ్యలు చేసి ఐక్యరాజ్యసమితి వేదికను అవమానించడం పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కే చెల్లిందని ఎద్దేవా చేశారు. అంతర్జాతీయ ఉగ్రవాదులుగా పేరు మోసిన ఒసామా బిన్ లాడెన్, హక్కానీ నెట్వర్క్ లాంటి వారిని పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ పాకిస్తాన్ హీరోలుగా అభివర్ణించడాన్ని చూస్తేనే వారి నిజం స్వరూపం బయటపడిందని పేర్కొన్నారు.అలాగే పాక్ మైనారిటీ వర్గాలు, మహిళలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. మళ్లీ పాక్ ఇటువంటి ఆరోపణలు చేస్తే సహించేది లేదని అనన్య తేల్చి చెప్పారు. -
పాక్‌ను పీడించేవి ద్రవ్యోల్బణం, నిరుద్యోగమే!
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రజలను పట్టి పీడిస్తోంది ద్రవ్యోల్బణమే తప్ప కశ్మీర్ సమస్య కాదని గల్లప్ ఇంటర్నేషనల్ నిర్వహించిన తాజా అధ్యయనం తేల్చి చెప్పింది. పాకిస్తాన్లో గల్లప్ అండ్ గిలానీ ప్రచురించిన ఈ అధ్యయనంలో ప్రతిస్పందించిన వారిలో 53 శాతం మంది దేశ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. మరో తీవ్రమైన సమస్య నిరుద్యోగమని 23 శాతం మంది వెల్లడించారు. అవినీతి, నీటిసమస్య తీవ్రమైందని 4 శాతం మంది అభిప్రాయపడుతున్నట్లు తేలింది. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం భావిస్తున్నట్టు కశ్మీర్ సమస్య తీవ్రమైన సమస్య అని అక్కడి ప్రజలు అనుకోవడంలేదని పేర్కొంది. ప్రజల్లో కేవలం 8 శాతం మంది మాత్రమే కశ్మీర్ అంశం దేశానికి తీవ్రమైన విషయమని అభిప్రాయ పడుతున్నారని సర్వే తెలిపింది. -
18 నుంచి డిసెంబర్ 13 వరకు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్ 18 నుంచి డిసెంబర్ 13 వరకు జరగనున్నాయి. పార్లమెంటు ఉభయ సభల సెక్రటేరియట్లకు సోమవారం ఈ సమాచారాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ పంపించింది. గత రెండేళ్లుగా శీతాకాల సమావేశాలు నవంబర్ 21న ప్రారంభమై.. జనవరి మొదటివారం వరకు కొనసాగాయి. ఈ సమావేశాల్లో రెండు ఆర్డినెన్సులు, పలు కీలక బిల్లులు పార్లమెంటు ముందుకు రానున్నాయి. నూతన, దేశీ తయారీ సంస్థలకు కార్పొరేట్ పన్నును తగ్గిస్తూ జారీ అయిన ఆర్డినెన్స్, ఈ–సిగరెట్ల తయారీ, అమ్మకం, నిల్వను నిషేధిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌లకు చట్టరూపం ఇవ్వాల్సి ఉంది. ఆర్థిక వృద్ధిలో వైఫల్యం, కశ్మీర్లో స్థానికుల పరిస్థితి, ఎన్నార్సీ, పౌరసత్వ బిల్లు.. మొదలైన అంశాలపై విపక్ష సభ్యులు లేవనెత్తేవీలుంది. పార్లమెంటు సమావేశాలను మరో వారం పాటు పొడగించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇటీవలి వర్షాకాల సమావేశాల్లో 28 బిల్లులు పార్లమెంటు ఆమోదం పొందాయి. ఈ సమావేశాల్లోనే కార్మిక సంస్కరణలకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందే అవకాశముంది. -
సిగ్గుతో చావండి
అకోలా/జల్నా: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకోవడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాటల్లో పదును పెంచారు. కశ్మీర్ 370 ఆర్టికల్ రద్దుని మోదీ, షాలు ప్రచార ఎత్తుగడగా మార్చుకోవడంపై విమర్శలు వెల్లువెత్తడంతో విపక్షాల నోరు మూయించే క్రమంలో మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాడు అకోలా, జల్నా జిల్లాల్లో ప్రధాని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ‘కశ్మీర్‌కు, మహారాష్ట్రకి ఏమిటి సంబంధమని ఎలా అంటారు ? వారికెంత ధైర్యం ? ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నందుకు వాళ్లకు సిగ్గు అనిపించడం లేదా ? డూబ్ మరో డూబ్ మరో (సిగ్గుతో చావండి) అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పరివార్ భక్తినే (ఒక కుటుంబానికి విధేయత చూపించడం) రాష్ట్ర భక్తిగా (జాతీయభావం) భావిస్తోందని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని కొనఊపిరితో కొట్టు మిట్టాడుతోందని తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీ పొత్తుపైన కూడా ప్రధాని తీవ్ర విమర్శలు చేశారు. ఆ రెండు పార్టీలది అవినీతి పొత్తు అని నిందించారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రం కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్లిపోయిందని విమర్శించారు. ఆ రెండు పార్టీల ఓటు బ్యాంకు రాజకీయాలతో సామాన్య ప్రజలకే నష్టం జరిగిందని అన్నారు. -
వాళ్లిద్దరూ కలిసి పనిచేయాలి
న్యూయార్క్: కశ్మీర్ సమస్య పరిష్కారంలో భారత్, పాక్ ప్రధానులిద్దరూ కలిసి ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే, పాక్‌తో చర్చలు జరపాలంటే ముందుగా ఆ దేశం నిర్ధిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. ఐరాస సమావేశాల అనంతరం మంగళవారం ట్రంప్, భారత ప్రధాని మోదీ మరోసారి భేటీ అయ్యారు. అనంతరం మోదీతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. భారత్, పాక్‌లు అంగీకరిస్తే మధ్యవర్తిత్వానికి సిద్ధమంటూ సోమవారం పాక్ ప్రధాని ఇమ్రాన్‌తో భేటీ అనంతరం ప్రకటించిన ట్రంప్ ఈ విషయమై అడిగిన ప్రశ్నకు స్పందించారు.. ‘కశ్మీర్ విషయంలో పొరుగుదేశాల నేతలిద్దరూ కలిసి చర్చించుకుంటే బాగుంటుంది. వారు చాలా మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశముందని భావిస్తున్నా’ అని అన్నారు. పాక్ గడ్డపై ఉగ్ర స్థావరాలు, సైన్యానికి ఉగ్ర లింకులపై భారత విలేకరి అడిగిన ప్రశ్నపై ట్రంప్.. ‘మీకు చాలా సమర్థుడైన ప్రధాని ఉన్నారు. అవన్నీ ఆయన చూసుకుంటారు’ అని బదులిచ్చారు. భారత్– అమెరికాల మధ్య ఆర్థిక సంబంధాల బలోపేతానికి త్వరలోనే వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నామన్నారు. ‘మోదీ అంటే నాకు చాలా ఇష్టం. ప్రజలకు మోదీ ఎంతో అభిమానం. భారతీయులకు ఎల్విస్ ప్రెస్లీ లాంటి వారు’ అని హ్యూస్టన్‌లో ఆహూతులు చూపిన అభిమానాన్ని ఉద్దేశించి ట్రంప్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మోదీ ఆయనకు హౌడీ మోదీ కార్యక్రమం ఫొటోను బహూకరించారు. భారత్‌కు రండి! ట్రంప్‌ను ఆహ్వానించిన మోదీ కశ్మీర్ విషయంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ తో చర్చలు జరగాలంటే ముందుగా ఆ దేశం నిర్దిష్ట చర్యలు తీసుకోవాల్సి ఉందని భారత ప్రధాని మోదీ స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉగ్రవాదం కారణంగా ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు వివరించారు. కుటుంబంతో భారత్‌కు రావాలని ట్రంప్‌ను మోదీ మరోసారి ఆహ్వానించారు. వాణిజ్యం, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం తదితర అంశాలపై ఇద్దరు నేతలు 40 నిమిషాల పాటు చర్చించారు. కశ్మీర్లో ఉగ్రవాదం కారణంగా గత 30 ఏళ్లలో 42వేల మందికి పైగా చనిపోయారని ట్రంప్‌కు ప్రధాని వివరిం చారని విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే ఢిల్లీలో మీడియాకు తెలిపారు. కనీస భద్రత మధ్య మోదీ 2015లో లాహోర్‌లో పర్యటించారనీ, ఆ వెంటనే పఠాన్‌కోట్‌పై సైనిక స్థావరంపై ఉగ్ర దాడి జరిగిందని వివరించారన్నారు. ఉగ్రదాడులన్నీ ఒకటే! మంచి, చెడు.. చిన్న, పెద్ద ఉండదు: మోదీ మంచి, చెడు.. చిన్న, పెద్ద.. అంటూ ఉగ్రవాద దాడులను వర్గీకరించడం సరికాదని మోదీ అన్నారు. ప్రపంచంలో ఎక్కడ జరిగినా, ఏ స్థాయి దాడైనా.. ఉగ్రదాడిని ఉగ్రవాద చర్యగానే పరిగణించాలని ప్రపంచదేశాలకు స్పష్టం చేశారు. ‘ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదంపై నాయకుల వ్యూహాత్మక స్పందన’ అంశంపై ఐక్యరాజ్యసమితిలో మంగళవారం జరిగిన శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని పాల్గొని ప్రసంగించారు. ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో ప్రపంచదేశాలు పరస్పర సహకారాన్ని వివిధ స్థాయిల్లో వ్యవస్థీకృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో మిత్ర దేశాలతో కలిసి పనిచేసేందుకు, ఆయా దేశాల సామర్ధ్య పెంపులో సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. అలాగే, ఉగ్రవాదులు నిధులు, ఆయుధాలు సమకూర్చుకోకుండా చూడాల్సి ఉందన్నారు. ఉగ్రవాదంపై పోరులో ప్రపంచ దేశాలు సహకారం, సమాచార పంపిణీ.. తదితరాలపై ద్వైపాక్షిక, ప్రాంతీయ ఒప్పందాలను ఏర్పర్చుకోవాల్సి ఉందన్నారు. ఉగ్రవాద, తీవ్రవాద భావజాలాల్ని ఎదుర్కొనేందుకు భారత్ ప్రజాస్వామ్య విలువలు, భిన్నత్వంపై గౌరవం, సమ్మిళిత అభివృద్ధి మొదలైన కీలక ఆయుధాలను ఉపయోగిస్తోందని మోదీ వివరించారు. ఉగ్రవాదంపై పోరుకు సంబంధించి ఐరాస ఆంక్షలు, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్.. మొదలైన వాటిని రాజకీయం చేయొద్దని సూచించారు. ఆన్లైన్లోని ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే, సమర్ధించే సమాచారాన్ని తొలగించేందుకు ఉద్దేశించిన క్రైస్ట్‌చర్చ్ పిలుపునకు మోదీ మద్దతు పలికారు. -
కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం చేస్తా: ట్రంప్
న్యూయార్క్: కశ్మీర్ చాన్నాళ్లుగా సాగుతున్న అత్యంత సంక్లిష్టమైన సమస్య అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం మధ్యవర్తిత్వం చేయడానికి తాను సిద్ధమేనని పునరుద్ఘాటించారు. అయితే, అందుకు భారత్, పాక్‌లు రెండూ ఒప్పుకోవాలన్నారు. తాను చాలా గొప్ప మధ్యవర్తినని ట్రంప్ ఈ సందర్భంగా చెప్పుకున్నారు. పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌తో భేటీ సందర్భంగా సోమవారం ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘భారత్, పాక్‌లు ఒప్పుకుంటే మధ్యవర్తిత్వానికి నేను సిద్ధమే’ అన్నారు. భారత ప్రధాని పాల్గొన్న హౌడీ మోదీ కార్యక్రమంపై ఇమ్రాన్ ఖాన్ సమక్షంలోనే ట్రంప్ ప్రశంసలు కురిపించడం విశేషం. ‘ఉగ్రవాదంపై ఇక యుద్ధమేనని, కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడం సొంత దేశాలనే సరిగ్గా నడుపుకోలేని కొందరికి నచ్చడం లేదు. ఉగ్రవాద మూలాలు ఎక్కడున్నాయో అందరికీ తెలుసు’ అని పాక్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ మోదీ పేర్కొన్న విషయం తెలిసిందే. కశ్మీర్ ద్వైపాక్షిక సమస్య అని, మూడో దేశం జోక్యం ఇందులో అవసరం లేదని ఇప్పటికే పలు సందర్భాల్లో భారత్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. గత నెలలో జీ7 సదస్సు సందర్భంలోనూ ట్రంప్ తో మోదీ ఇదే విషయాన్ని చెప్పారు. -
ఐరాసలో కశ్మీర్ ప్రస్తావన!
యునైటెడ్ నేషన్స్: ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సమావేశాల్లో చర్చల సందర్భంగా కశ్మీర్ అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశముందని ఐరాస ప్రధాన కార్యదర్శి అంటానియొ గ్యుటెరిస్ అధికార ప్రతినిధి స్టీఫానె డ్యుజారిక్ వెల్లడించారు. కశ్మీర్‌లోయలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, మానవహక్కుల ఉల్లంఘన తదితర అంశాలను వచ్చేవారం నుంచి ప్రారంభమయ్యే సమావేశాల్లో ప్రధాన కార్యదర్శి గ్యుటెరిస్ లేవనెత్తవచ్చని పేర్కొన్నారు. కశ్మీర్ సమస్య పరిష్కారానికి ఏకైక మార్గం చర్చలేనన్న విషయాన్ని గ్యుటెరస్ బలంగా విశ్వసిస్తున్నారని తెలిపారు. ‘ప్రస్తుత కశ్మీర్ సమస్య పరిష్కారంలో.. లోయలో మానవహక్కుల ఉల్లంఘన అంశాన్ని ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది’ అని గ్యుటెరస్ అభిప్రాయపడ్డారని స్టీఫానె తెలిపారు. సాధారణ సభ సమావేశాలను ఈ అంశాన్ని లేవనెత్తేందుకు ప్రధాన కార్యదర్శి ఉపయోగించుకోవచ్చన్నారు. అయితే, కశ్మీర్ పరిష్కారానికి భారత్ పాక్ ల మధ్య చర్చలే మార్గమని, వారు కోరితే ఇరువర్గాలకు ఐరాస కార్యాలయం అందుబాటులో ఉంటుందని, అదే సమయంలో మానవహక్కులకు సముచిత గౌరవం ఇవ్వాల్సిందేనని బుధవారం గ్యుటెరస్ అభిప్రాయపడిన విషయం ఇక్కడ గమనార్హం. ‘అక్కడ మానవ హక్కులను కచ్చితంగా గౌరవించాల్సిందే. అయితే, భారత్– పాక్‌ల మధ్య చర్చలే కశ్మీర్ సమస్యకు పరిష్కారమని నా విశ్వాసం’ అని నాడు పాక్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు గ్యుటెరస్ సమాధానమిచ్చారు. కాగా, జమ్మూకశ్మీర్ భారత్ భూభాగం. దీనికి సంబంధించిన ఏ సమస్యలోనైనా.. ఐరాస లేదా అమెరికా.. ఎవరైనా సరే మూడో శక్తి ప్రమేయాన్ని అంగీకరించబోం’ అని ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలపై భారత్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. భారత్, పాక్‌లు కోరితేనే ఇందులో జోక్యం చేసుకుంటామని కూడా ఐరాస ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసిన అనంతరం భారత్, పాక్‌ల సంబంధాలు కనిష్ట స్థాయికి దిగజారిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 27న న్యూయార్క్‌లో జరగనున్న ఐరాస సాధారణ సభ సమావేశాల్లో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతానని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ స్పష్టం చేసిన విషయమూ విదితమే. అయితే, అదే సెప్టెంబర్ 27న భారత ప్రధాని మోదీ కూడా ఐరాస వేదికగా ప్రసంగించనుండటం విశేషం. దీటుగా సమాధానమిస్తాం ఐరాస వేదికపై కశ్మీర్ అంశాన్ని లేవనెత్తే అధమ స్థాయికి పాకిస్తాన్ దిగజారితే.. అందుకు భారత్ అత్యున్నత స్థాయిలో జవాబిస్తుందని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తేల్చి చెప్పారు. గతంలోనూ ఇలా అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తిన సందర్భాల్లో భారత్ తిరుగులేని విధంగా వారికి జవాబిచ్చామన్నారు. ఇప్పటివరకు ఉగ్రవాద వ్యాప్తిలో పెరెన్నికగన్న పాకిస్తాన్.. ఇప్పుడు భారత్‌పై ద్వేష భావజాల ప్రచారాన్ని కూడా తలకెత్తుకుందని విమర్శించారు. -
హౌడీ మోదీ కలిసొచ్చేదెవరికి
వాషింగ్టన్: అమెరికాలోని టెక్సాస్‌లో జరగనున్న హౌడీ మోదీ కార్యక్రమానికి అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ హాజరవడానికి అంగీకరించడంతో మోదీ ప్రభుత్వం దౌత్యపరంగా సక్సెస్ అయ్యింది. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాల అధినేతలు ఇద్దరూ ఒకే కార్యక్రమంలో పాల్గొంటూ ఉండడంతో అందరిలోనూ ఆసక్తి పెరుగుతోంది. హ్యూస్టన్ ర్యాలీలో కీలక ప్రకటనకు అవకాశం ఉందంటూ ట్రంప్ సంకేతాలిచ్చారు. గురువారం కాలిఫోర్నియా నుంచి వాషింగ్టన్ వెళుతుండగా ప్రత్యేక విమానంలో విలేకరుల హ్యూస్టన్ ర్యాలీలో ఏదైనా ప్రకటన ఉంటుందా అన్న ప్రశ్నకు ఉండొచ్చునని బదులిచ్చారు. భారత్, పాక్‌ల మధ్య కశ్మీర్ అంశం ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో ట్రంప్ ఇలా మాట్లాడడంతో అమెరికా భారత్ పక్షమే వహిస్తోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రవాస భారతీయులనుద్దేశించి టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్‌లో ఈ నెల 22న మోదీ ప్రసంగించనున్నారు. వాణిజ్య బంధాల బలోపేతమే మోదీ లక్ష్యం గత కొద్ది నెలలుగా భారత్, అమెరికా మధ్య వాణిజ్యపరంగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇటీవల అమెరికా వాణిజ్య ప్రతినిధి రోబర్ట్ లైటింగర్ భారత్ ఎగుమతులపై కొన్ని ప్రయోజనాలను రద్దు చేశారు. దీనికి ప్రతిగా అమెరికాకు చెందిన 28 ఉత్పత్తులపై భారత్ సుంకాలను పెంచింది. ఇలాంటి సమయంలో రెండు దేశాల అధినేతలు ఒకే వేదికను పంచుకోవడం వల్ల రెండు దేశాల మ«ధ్య వాణిజ్య రంగంలో విభేదాలు సమసిపోతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ట్రంప్ రాకతో అమెరికా సమాజ ఆర్థిక పురోగతికి ప్రవాస భారతీయులు చేస్తున్న కృషికి గుర్తింపు లభిస్తోందని మోదీ భావిస్తున్నారు. ఇంధన, వాణిజ్య రంగాల్లో సంబంధాలు బలోపేతం అయ్యే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఓటు బ్యాంకు కోసం ట్రంప్ అమెరికాలో నివసించే భారతీయులు ఏర్పాటు చేసిన ఒక ప్రైవేటు కార్యక్రమానికి ట్రంప్ హాజరుకావడం ఇదే తొలిసారి. 2020 అధ్యక్ష ఎన్నికల కోసం ఇప్పటికే సన్నాహాలు చేస్తున్న ట్రంప్ ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే హాజరవుతున్నారని భావిస్తున్నారు. ఇక్కడ స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న ఆసియన్ అమెరికన్లలో అయిదో వంతు మంది భారతీయులే. అందులోనూ టెక్సాస్‌లో భారతీయుల ఓటుబ్యాంకు బలంగా ఉంది. 2 లక్షల 70 వేల మందికిపైగా ఓటర్లు టెక్సాస్‌లో ఉన్నారు. హౌడీ మోదీ కార్యక్రమానికి 50 వేల మందికిపైగా ప్రవాస భారతీయులు హాజరుకానున్నారు. అమెరికా ఎన్నికల్లో భారతీయులు సంప్రదాయంగా డెమొక్రాట్లకే మద్దతుగా ఉంటూ వస్తున్నారు. టెక్సాస్ రాష్ట్రంపై రాజకీయంగా రిపబ్లికన్ల ఆధిపత్యమే కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో డెమోక్రాట్లు పట్టుకు యత్నిస్తున్నారు.