విదేశీ జోక్యంతో కశ్మీర్‌లో కల్లోలమే: ముఫ్తీ
న్యూఢిల్లీ: కశ్మీర్ సమస్య పరిష్కారానికి విదేశీ మధ్యవర్తిత్వం అవసరమంటూ నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్‌సీ) అధినేత ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తీవ్రంగా మండిపడ్డారు. చైనా, అమెరికా లాంటి విదేశీ శక్తులు జోక్యం చేసుకుంటే కశ్మీర్ మరో సిరియా, అఫ్గానిస్తాన్, ఇరాక్‌లా మారుతుందని హెచ్చరించారు.
విదేశీ జోక్యం కోరుతున్న ఫరూక్‌కు అసలు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసా? అని ముఫ్తీ ప్రశ్నించారు. సిరియా, ఇరాక్‌లోని పరిస్థితులను కశ్మీర్‌లో ఫరూక్ కోరుకుంటున్నారేమో అని ఎద్దేవా చేశారు. అమెరికా, చైనాలు తమ అంతర్గత విషయాలపై దృష్టి సారిస్తే మంచిదని ముఫ్తీ అన్నారు.