Foreign Services
-
అమెరికాలో అన్నింటా తెలుగువారే!
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. 2010 నుంచి 2017 సంవత్సరం వరకు వీరి సంఖ్య ఊహించనంతగా భారీగా పెరిగి నేడు నాలుగు లక్షలను దాటిందని ‘సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ స్టడీస్’ నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడయింది. దేశంలో ఉంటూ విదేశీ భాష మాట్లాడే వారిలో 86 శాతం మంది తెలుగువారేనని ఆ సర్వే పేర్కొంది. తెలుగు తర్వాత అరబిక్ మాట్లాడే వారి శాతం 42, హిందీ మాట్లాడే వారి శాతం 42, ఉర్దూ మాట్లాడే వారి శాతం 30, చైనీస్ 23 శాతం, గుజరాతీ 22 శాతం, హైతీ మాట్లాడే వారి శాతం 19 అని అధ్యయనంలో తేలింది. తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల మాతృ భాషయిన తెలుగు మాట్లాడే వారి సంఖ్య అమెరికాలో 2000 సంవత్సరం నాటికి 87,543 మంది మాత్రమే ఉండగా, వారి సంఖ్య 2010 సంవత్సరం నాటికి 2,22,977కి చేరుకుంది. వీరి సంఖ్య 2017, జూలై నాటికి 4,15,414కు చేరుకుంది. తెలుగు రాష్ట్రా నుంచి టెక్, ఇంజనీరింగ్ అభ్యర్థులు ఎక్కువగా అమెరికాకు రావడం వల్లనే అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి 2008 నుంచి 2012 మధ్య 26 వేల మంది విద్యార్థులు వచ్చారని, వారిలో ఎక్కువగా సైన్స్, ఇంజనీరింగ్, మాథ్స్ చదవేవారు ఉన్నారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెండ్ల, అడోబ్ సిస్టమ్స్ సీఈవో శంతను నారాయణ్‌లు కూడా హైదరాబాదీలవడం విశేషమని అధ్యయనం పేర్కొంది. ఒక్క సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లోనే కాకుండా ఇతర తొమ్మిది ఉద్యోగాల్లో ఐదుగురు ఉద్యోగులు తెలుగువారే ఉంటున్నారు. రెండో తెలుగుతరం కుటుంబానికి చెందిన నైనా దవులూరి 2013లో మిస్ ఇండో–అమెరికన్‌గా ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నుంచి 1980లో అమెరికా డాక్టర్ దంపతుల కూతురు నైనా. స్పెల్లింగ్ బీ పోటీల్లో కూడా ఎక్కువగా తెలుగు విద్యార్థులే ఉంటున్నారు. ప్రతిష్టాకరమైన ‘స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ’లో కూడా తెలుగు విద్యార్థులు టాప్‌లో నిలవడం విశేషం. తెలుగు సంస్కృతిని నిలబెట్టడం కోసం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడంలోను తెలుగువారు ముందుంటున్నారు. కొందరు తమ పిల్లలకు సంప్రదాయ సంగీతం, నృత్యంలోనూ శిక్షణ ఇప్పిస్తున్నారు. అమెరికాలో నివసిస్తున్న తెలుగువారి విషయంలో చీకటి కోణం కూడా ఉంది. జాతి విద్వేషాలకు, దోపిడీలకు తెలుగువారే ఎక్కువగా బలవుతున్నారు. బెంగాలీ, తమిళయన్లు తక్కువే! అమెరికాలో బెంగాలీ మాట్లాడేవారు మూడున్నర లక్షల మంది ఉండగా, తమిళం మాట్లాడే వారి సంఖ్య 2,80,000 మాత్రమే. అయితే ఇటీవలి కాలంలో వారు బాగా పెరుగుతున్నారు. బెంగాలీల్లో పెరుగుదల 57 శాతం కాగా, తమిళయన్లలో 55 శాతం ఉంది. తెలుగు మాట్లాడే వారి సంఖ్య ఎక్కువే అయినప్పటికీ వివిధ భాషల వారు విస్తృతంగా హిందీ మాట్లాడతారు. దాదాపు 8,63.000 మంది అమెరికాలో హిందీ మాట్లాడతారు. మొత్తంలో అమెరికా జనాభాలో ఇళ్ల వద్ద విదేశీ భాష మాట్లాడే వారి సంఖ్య 21.8 శాతం మందని అధ్యయనంలో తేలింది. -
కలగా అంతర్జాతీయ విమానయానం
తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం... పేరుకే అంతర్జాతీయం... కనీసం దేశంలో ఉన్న ప్రధాన నగరాలకు కూడా విమానాలు తిరగని పరిస్థితి. అంతర్జాతీయ ప్రమాణాలతో నూతన టెర్మినల్ ఏర్పాటు చేసి మూడేళ్లు దాటుతున్నా విమానాలు భాగ్యనగరాన్ని దాటి బయటకు వెళ్లడంలేదు. ఫలితంగా ఇతర దేశాలకు వెళ్లాల్సిన వారు పక్క రాష్ట్రాల్లో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. రేణిగుంట: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోవడానికి దేశ, విదేశాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తిరుపతికి వస్తుంటారు. భక్తుల సౌకర్యార్థం తిరుపతి సమీపంలోని రేణిగుంటను అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూపకల్పన జరిగింది. 2015లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా గరుడ పక్షి ఆకారంలో రూ.175 కోట్లతో నూతన టెర్మినల్‌ను ప్రారంభించారు. టెర్మినల్ ప్రాంగణంలో రూ.5కోట్లకు పైగా వెచ్చించి తుడా అధికారులతో సుందరీకరణ పనులు కూడా చేయించారు. 2017 జూన్‌లో అధికారికంగా అంతర్జాతీయ విమానాశ్రయంగా కేంద్ర విమానయాన శాఖ ప్రకటించింది. ఇక్కడ నుంచి కువైట్, దుబాయ్, శ్రీలంక వంటి దేశాలకు కనెక్టింగ్ ఫ్లెట్లను నడుపుతామని మూడు నెలల కిందట సాక్షాత్తూ అప్పటి కేంద్ర విమానయాన శాఖామంత్రి అశోక్‌గజపతిరాజు ప్రకటించినా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. గణనీయంగా పెరిగిన ప్రయాణికుల సంఖ్య.. గతంలో కేవలం హైదరాబాద్ నగరానికి మాత్రమే పరిమితమైన విమాన సేవలు ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ఢిల్లీ, ముంబైలకు విస్తరించాయి. ఎయిర్ ఇండియాతో పాటు స్పైస్‌జెట్, ట్రూజెట్, ఇండిగో, ఎయిర్ కోస్తా తమ సర్వీసులను ఇక్కడ నుంచి నడుపుతున్నాయి. ప్రస్తుతం రోజుకు 15 వరకు విమాన సర్వీసులు రాకపోకలను సాగిస్తున్నాయి. దీంతో గత ఏడాది ఏప్రిల్ నుంచి 2018 మార్చి వరకు 5,48,732మంది ప్రయాణికులు ఇక్కడ నుంచి విమాన ప్రయాణం చేసినట్లు అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2015–16 ఏడాదికిగాను రేణిగుంట విమానాశ్రయం ‘బెస్ట్ టూరిస్ట్ ఫ్రెండ్లీ ఎయిర్‌పోర్టు’ అవార్డును సొంతం చేసుకుంది. అంతర్జాతీయానికి రాని అనుమతులు ఇప్పటికిప్పుడు అంతర్జాతీయ విమాన సర్వీసులను ఇక్కడి నుంచి ప్రారంభిస్తే 200మంది అంతర్జాతీయ, 55మంది డొమెస్టిక్ ప్రయాణికులకు సౌకర్యాలను కల్పించే సామర్థ్యం నూతన టెర్మినల్‌కు ఉంది. అయితే ఎయిర్పోర్ట్ అథారిటీ అంతర్జాతీయ సర్వీసులను నడిపేందుకు అనుమతులివ్వకపోవడంతో ప్రస్తుతం దేశీయ సర్వీసులే నడుస్తున్నాయి. అంతర్జాతీయ సర్వీసులను నడపాలి.. చిత్తూరు, వైఎస్సార్ కడప, నెల్లూరు జిల్లాల నుంచి ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు అనేక మంది వెళుతున్నారు. వీరికి అనువుగా రేణిగుంట నుంచి కనీసం వారానికి ఒక్క కనెక్టింగ్ ఫ్లైట్‌ను నడిపితే ప్రయోజనకరంగా ఉంటుం ది. తిరుపతి పుణ్యక్షేత్రానికి దేశ, విదేశాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అంతర్జాతీయ విమానం ఇక్కడి నుంచి ఎగిరితే పేరుకు సార్థకత ఉంటుంది. – శ్రీనివాసులు రెడ్డి, ప్రయాణికుడు సౌకర్యాల కల్పనలో సఫలీకృతమయ్యాం.. రెండేళ్లలో నూతన టెర్మినల్‌లో ప్రయాణికుల అభిరుచికి అనుగుణంగా సౌకర్యాల కల్పనలో సఫలీకృతమయ్యాం. రూ.కోట్లు వెచ్చించి ఎయిర్‌పోర్టు ప్రాంగణమంతా సుందరీకరణ పనులు చేపట్టాం. విమాన సర్వీసులను విస్తరించాం. 2015–16 ఏడాదికి గాను ‘బెస్ట్ ఫ్రెండ్లీ టూరిస్ట్ ఎయిర్‌పోర్టు’గా అవార్డును అందుకున్నందుకు సంతోషంగా ఉంది. ఉన్నతాధికారుల అనుమతులతో అంతర్జాతీయ విమానయాన సేవలను త్వరితగతిన ప్రారంభిస్తాం. – హెచ్.పుల్లా, ఎయిర్పోర్ట్ డైరెక్టర్, తిరుపతి -
మరో 9 విదేశీ బ్రాంచ్‌లను మూసివేయనున్న ఎస్బీఐ
న్యూఢిల్లీ: దేశీ అతిపెద్ద ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మరో తొమ్మిది విదేశీ బ్రాంచ్‌లను మూసివేయనుంది. ఇప్పటికే బ్యాంక్ గత రెండేళ్ల కాలంలో విదేశాల్లోని ఆరు బ్రాంచ్‌లలో కార్యకలాపాలకు స్వస్తి పలికింది. విదేశీ కార్యకలాపాల హేతుబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ (రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్) ప్రవీణ్ కుమార్ గుప్తా తెలిపారు. కాగా ఎస్బీఐ 36 దేశాల్లో 190 బ్రాంచ్‌లతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ‘విదేశీ భూభాగాల్లోని అన్ని బ్రాంచ్‌లు పూర్తిస్థాయి కార్యాలయాలు కాదు. బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో చిన్న బ్రాంచ్‌లతోపాటు రిటైల్ బ్రాంచ్‌లు కూడా ఉన్నాయి. వీటిని హేతుబద్ధీకరించాల్సిన అవసరముంది’ అని గుప్తా వివరించారు. ‘బ్రాంచ్‌ల హేతుబద్ధీకరణ కొనసాగుతున్న ప్రక్రియ. వాణిజ్యపరంగా అనవసరం అయితే ఆ బ్రాంచ్‌లలో సేవలు కొనసాగించడం అవివేకం అవుతుంది’ అన్నారు. బ్రాంచ్‌లను మూసివేయడమంటే కార్యకలాపాల నుంచి పూర్తిగా వైదొలగినట్లేనా? అనే ప్రశ్నకు.. తాము ఆ దేశాల నుంచి తప్పకున్నట్లు కాదని, అయితే చిన్న బ్రాంచ్‌లను మూసివేస్తామని, లేకపోతే రెండు లేదా మూడు బ్రాంచ్‌లను కలిపి ఒకటిగా చేస్తామని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం దేశీయంగా దాదాపు 300–350 బ్రాంచ్‌లను ఏర్పాటు చేస్తామని, వీటిల్లో ఎక్కువ భాగం గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభిస్తామని గుప్తా తెలిపారు. కాగా, ఈ ఏడాది మార్చి నాటికి ప్రభుత్వ బ్యాంకులు 35 విదేశీ బ్రాంచ్‌లను మూసివేశాయి. -
ఐపీఎల్-12వ సీజన్ మార్చిలోనే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018 (ఐపీఎల్ ) సంబరం అయిపోయింది. కానీ, ప్రేక్షకులు మాత్రం అప్పుడే వచ్చే ఐపీఎల్ గురించి చర్చలు మొదలుపెట్టారు. ఈసారి ఐపీఎల్-12వ సీజన్ ముందుగానే జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే అభిమానులు ఎంతగానో ఎదురుచూసే వరల్డ్ కప్ కూడా 2019లోనే జరగనుంది. వచ్చే ఏడాది వరల్డ్ కప్‌తో పాటు.. సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మార్చిలోనే ఐపీఎల్‌ను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్ కప్ మే 30 నుంచి ప్రారంభమవుతుంది. ఇండియా ప్లేయర్స్ నిబంధనల ప్రకారం ఒక టోర్ని అయిపోయినత తర్వాత మరో టోర్నీలో మ్యాచ్ ఆడటానికి కనీసం 15 రోజుల విరామం ఉండాలి. దీనిలో భాగంగానే ఐపీఎల్-12వ సీజన్ త్వరగానే నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇంగ్లాండ్‌లోని వేల్స్ వేదికగా 2019 మే 30 నుంచి జూలై 14 వరకు వరల్డ్ కప్ జరగనుంది. అయితే ప్రతి సంవత్సరం ఐపీఎల్ ఏప్రిల్ మొదటి లేదా రెండో వారంలో ప్రారంభమై మే నెల చివరి వారంలో ముగుస్తుంది. కానీ, ఈసారి మాత్రం ఐపీఎల్ మే మూడో వారంలోనే ముగించాలి. అలా అయితేనే ఇండియన్ ప్లేయర్స్‌కు వరల్డ్ కప్‌లో ఆడేందుకు 15 రోజుల గ్యాప్ లభిస్తుంది. ఈ విధంగా చూస్తే 2019లో మార్చి 29న ఐపీఎల్ -12వ సీజన్ ప్రారంభమతుందని సమాచారం. అంతేకాక ఐపీఎల్-12ను విదేశాల్లో నిర్వహించే అవకాశం ఉందన్నారు. ఎలక్షన్ సమయంలో మ్యాచ్‌లు నిర్వహిస్తే భద్రత కష్టమవతుంది. గతంలో కూడా 2009లో ఎన్నికల సమయంలో ఐపీఎల్‌ను సౌతాఫ్రికాలో నిర్వహించిన విషయం తెలిసిందే. ఐపీఎల్-11వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కప్ కైవసం చేసుకున్న విషయం విదితమే. -
విదేశీ జంట ప్రైవేట్ వీడియో కలకలం!
సాక్షి, ఉదయ్‌పూర్: విదేశీ జంట ఏకాంత వీడియోపై దుమారం రేగుతోంది. పోలీస్ స్టేషన్‌పై వీరు ఏకాంతంలో ఉండగా గుర్తుతెలియని వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. ఈ ఘటన రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఇటీవల చోటుచేసుకుంది. ఈ ఒక్క వీడియోతో స్థానిక పోలీసులు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు అయి ఉండి ఇలాంటి పనులకు చోటు ఇస్తారా అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ గోయల్ కథనం ప్రకారం.. ఉదయ్‌పూర్ పరిధిలోని ఘంటానగర్ పోలీస్ స్టేషన్ మీద కొన్ని రోజుల కిందట విదేశానికి చెందిన ఓ జంట శృంగారంలో పాల్గొన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మాట నిజమేనని, అయితే ఇది ఎక్కడ జరిగింది? ఎవరైనా మార్ఫింగ్ చేసి లీక్ చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. పీఎస్ మీద ఇలాంటి పనులు జరిగినట్లు తాను నమ్మడం లేదన్నారు. పోలీస్ స్టేషన్‌పైనే ఈ అసాంఘీక కార్యకలాపాలు జరిగాయని, స్థానికులు చెబుతున్నారు. పోలీస్ స్టేషన్ లోపలి నుంచే టెర్రస్ మీదకు ఎక్కేందుకు వీలుండటం గమనార్హం. అంటే.. పోలీసుల సహకారంతోనే విదేశీ జంట పోలీస్ స్టేషన్ టెర్రస్ మీద ఏకాంతంగా గడిపారని, వీడియో ఆధారంగా పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఘంటానగర్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
గ్రేటర్‌కు ‘విదేశీ’ కిక్కు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో నెలకు సుమారు రూ.400 కోట్ల విలువైన మద్యం అమ్ముడవుతుండగా.. ఇందులో ఏకంగా రూ.75 కోట్లు విదేశీ మద్య మేనని ఆబ్కారీ శాఖ లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తు తం నగరంలో ఉన్న 500 బార్లు, 400 మద్యం దుకాణాల్లో విదేశీ మద్యం లభించేవి దాదాపు 100 వరకు ఉన్నాయి. ప్రధానంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో ఉన్న బార్లలో వినియోగదారుల అభిరుచి మేరకు విదేశీ మద్యం సరఫరా చేస్తున్నారు. ఫారిన్ సరుకుకు విని యోగదారుల నుంచి డిమాండ్ పెరుగుతుండటంతో పలు బార్ల యజమానులు ఆబ్కారీ శాఖ నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకుంటున్నట్లు నగర ఆబ్కారీ శాఖ అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. నగరం లో రోజుకు సుమారు 10 లక్షల లీటర్ల బీరు.. 5 లక్షల లీటర్ల దేశ, విదేశీ రకాల మద్యాన్ని కుమ్మేస్తున్నట్లు ఆబ్కారీశాఖ లెక్కలు చెబుతున్నాయి. రోజువారీ అమ్మకాలతో పోలిస్తే వీకెండ్లలో రెట్టింపు స్థాయిలో అమ్మకాలుంటున్నాయని అధికారులు చెబుతున్నారు. రూ.లక్షల విలువ చేసే బ్రాండ్లు... జూబ్లీహిల్స్ రోడ్ నం.36లోని ‘టానిక్’ బడా లిక్కర్ మాల్ మందుబాబులను, గ్రేటర్ సిటిజన్లు విశేషంగా ఆకర్షిస్తోంది. సుమారు 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ లిక్కర్ మాల్ ఆసియాలోనే అత్యంత పెద్దది కావడం గమనార్హం. ఇక్కడ నెలకు రూ.5 కోట్ల మేర అమ్మకాలు జరుగుతున్నాయని, ఇందులో సింహభాగం విదేశీ మద్యానిదేనని నిర్వాహకులు తెలిపారు. ఇక బంజారాహిల్స్‌లోని లిక్కర్ బ్యాంక్‌లోనూ విదేశీ మద్యం విరివిగా అమ్ముడవుతోంది. నెలకు సుమారు రూ.3 కోట్ల మేర అమ్మకాలు జరుగుతున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఇక్కడ కూడా దేశ, విదేశాలకు చెందిన పలు లిక్కర్ బ్రాండ్లు గ్రేటర్ సిటిజన్లను ఆకర్షిస్తున్నాయి. జానీవాకర్, చివాస్రీగల్ వంటి బ్రాండ్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
అభాగ్య మహిళలపై గురి..దుబాయ్‌లో అమ్మకం
సాక్షి, బెంగళూరు: అభాగ్య వనితలను మభ్యపెట్టి దుబాయ్‌లో ఉద్యోగాల పేరిట అమ్మేస్తున్న ముఠా బాగోతం బెళగావిలో వెలుగులోకి వచ్చింది. ఒక బాధితురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభమైంది. వివరాలు... బెళగావిలోని నిరుపేద మహిళలు, వితంతువులకు విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని బెళగావికి చెందిన వహీదా మకందార్, షంషుద్దీన్ మకందార్‌లు మభ్యపెట్టేవారు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉంటున్న షానవాజ్‌ను ,ఆమె కుటుంబ సభ్యులను ఒప్పించి ఆమెను దుబాయ్‌కు పంపించారు. అక్కడైతే జీతం దండిగా వస్తుందని, సమస్యలన్నీ తీరిపోతాయని ఆమెకు ఆశలు చూపించారు. అయితే అక్కడ ఆమెను ఉద్యోగానికి కాకుండా, దుబాయ్ సేఠ్‌లకు అమ్మేశారని కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. దుబాయ్‌లో చిత్రహింసలు దుబాయ్‌కు వెళ్లిన షానవాజ్ అక్కడ తనను చిత్రహింసలకు గురి చేస్తున్నారని, తిరిగి దేశానికి వెళ్తానంటే తనను తీవ్రంగా కొట్టి చెయ్యి విరగ్గొట్టారని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తెలిపింది. తనను అక్కడి వారికి రూ.10 లక్షలకు అమ్మేశారని, ఎలాగైనా తనను ఈ నరకం నుండి తప్పించాలని మొరపెట్టుకుంది. దీంతో షానవాజ్ కుటుంబ సభ్యులు బెళగావి పోలీసులను ఆశ్రయించారు. తమ తల్లిని దుబాయ్‌కి తీసుకెళ్లి అమ్మేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఆమెను తిరిగి భారత్‌కు రప్పించాలని ఫిర్యాదులో షానవాజ్ కూతురు కోరారు. కేసు దర్యాప్తు చేస్తున్నాం: పోలీస్ కమిషనర్ ఈ విషయంపై బెళగావి కమిషనర్ కె.రామచంద్రరావు మాట్లాడుతూ.... డబ్బు ఆశ చూపి మహిళలను విదేశాలకు అమ్ముతున్న ఘటనలు తమ దృష్టికి వచ్చాయన్నారు. ముంబైలో ఉన్న ముఠాతో కలిసి కొంతమంది స్థానికులు ఇలా మహిళలను విదేశాలకు అమ్మేస్తున్నారని చెప్పారు. షానవాజ్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. -
ఎంత తాగినా.. వాసన రాదట!
సాక్షి, హైదరాబాద్: బీరు, విస్కీ, బ్రాందీ.. ఇలా మద్యం ఏదైనా ఓ రకమైన వాసన వస్తుంది.. అదోరకమైన చేదు రుచితో ఉంటుంది. కాస్త మందెక్కువైతే... తలపోటు, వికారం దగ్గరి నుంచి ఒళ్లు నొప్పులు, మగతగా ఉండటం దాకా ఎన్నో సైడ్ ఎఫెక్టులు. అయితే త్వరలో రాష్ట్ర మార్కెట్లోకి రానున్న విదేశీ ‘బయో మద్యం’ఇలాంటి సైడ్ ఎఫెక్టులన్నింటికీ అతీతమట. వాసన కూడా రాకపోవడం దాని ప్రత్యేకత అని, పలు రకాల ఔషధ ఉత్పత్తులను కలిపి దీనిని తయారు చేస్తున్నామని తయారీదారులు చెబుతున్నారు. తెలంగాణలో ఈ మద్యాన్ని విక్రయించేందుకు ప్రభుత్వం ఇటీవలే అనుమతించింది. అయితే ఈ బయో మద్యంలోనూ సాధారణ మద్యంలో ఉండే స్థాయిలోనే ఆల్కాహాల్ ఉంటుంది. వాసన రాకపోవడం, సైడ్ ఎఫెక్టులు లేకపోవడం తప్ప మిగతా అంతా సాధారణ మద్యం లాగానే ఉంటుంది. తాగేసి వాహనం నడిపితే ‘డ్రంకెన్ డ్రైవ్’లో దొరికిపోవడం ఖాయమే. తెలుగువారి కంపెనీయే వాస్తవానికి గుంటూరుకు చెందిన సింధూరా హెర్బల్స్ సంస్థ వ్యవస్థాపకుడు అమర్నాథ్ బయో మద్యాన్ని తయారు చేశారు. దీనిని ఇక్కడి మార్కెట్లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. అయితే కొన్ని శాస్త్రీయపరమైన సందేహాలను నివృత్తి చేయలేకవటంతో... బయో మద్యం ఇక్కడి మార్కెట్లోకి రాలేదు. తరువాత ఈ బయో మద్యానికి విదేశీ హంగులు జోడించి అమెరికా, నేపాల్ మార్కెట్లలో ప్రవేశపెట్టారు. తాజాగా రాష్ట్రంలో విదేశీ మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం, జీఈఎస్ సదస్సు నేపథ్యంలో ఇక్కడి మార్కెట్‌పై దృష్టి పెట్టారు. ఇక్కడ మద్యం మార్కెట్ తీరు, వినియోగంపై ఒక సర్వే చేయించినట్లు తెలిసింది. వాసన లేని, తలపట్టేయడం, వికారం వంటి సైడ్ ఎఫెక్టులు లేని మద్యానికి మంచి మార్కెట్ ఉన్నట్లు గుర్తించి.. తెలంగాణలో విక్రయాల కోసం కేఎస్ బయో నాచురల్స్ మార్కెటింగ్ సంస్థ పేరుతో దరఖాస్తు చేసుకున్నారు. ఈ మద్యం తాగితే నిషా వస్తుందిగానీ.. తలపట్టడం వంటి సైడ్ ఎఫెక్టులు ఉండవని, వాసన రాదని ఆ సంస్థ ప్రభుత్వానికి నివేదించి అనుమతి పొందింది. ప్రస్తుతం బయో బీరు, బయో విస్కీలకు అనుమతి వచ్చింది. త్వరలోనే బయో ఓడ్కా, బ్రాందీ, రమ్లను కూడా తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఏం కలుపుతారు? విదేశాల్లో మొక్కజొన్నలు, బార్లీ, జొన్నలు వంటి ధాన్యం ఆధారంగా తయారు చేసిన ఆల్కాహాల్ ఈఎన్ఏ (ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్)కు చక్కెరను మండించి తయారు చేసిన ‘బరంట్ షుగర్’ను, ప్రత్యేక కృత్రిమ (సింథటిక్) ఫ్లేవర్లను కలిపి మద్యాన్ని తయారు చేస్తారు. మన దేశంలో మొలాసిస్ ఆధారిత ఈఎన్ఏను వాడుతారు. అదే బయో మద్యంలో బరంట్ షుగర్ స్థానంలో తేనె ఆధారిత చక్కెరను, అశ్వగంధ లాంటి 16 రకాల మూలికలను కలిపి సహజ ఫ్లేవర్లతో మద్యాన్ని ఉత్పత్తి చేస్తామని కంపెనీ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్‌కు సమర్పించిన బ్రాండ్ లేబుల్ రిజిస్ట్రేషన్ దరఖాస్తులో పేర్కొంది. విదేశీ మద్యం అమ్మకాలు పెరిగే అవకాశం ప్రస్తుతం రాష్ట్రంలో 500 రకాల విదేశీ మద్యం బ్రాండ్లు ఉన్నాయి. ఏటా 280 లక్షల కేసుల దేశీ మద్యం అమ్ముడుపోతుండగా.. లక్ష కేసుల మేర విదేశీ మద్యం విక్రయిస్తున్నారు. విదేశీ మద్యం నుంచి సుమారు రూ.2,890 కోట్ల మేర రాబడి వస్తోంది. తాజాగా బయో మద్యంతో విదేశీ మద్యం అమ్మకాలు పెరుగుతాయని.. రాబడి మరో వెయ్యి కోట్ల వరకు పెరుగుతుందని ఎక్సైజ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రత్యేకత ఏమీ లేదు హైదరాబాద్‌లో తరచుగా అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలు జరుగుతున్నందున విదేశీ మద్యానికి డిమాండ్ పెరుగుతోంది. ఆ క్రమంలోనే ఇటీవల 58 విదేశీ మద్యం బ్రాండ్లకు అనుమతించాం. అందులో బయో మద్యం ఉత్పత్తులు కూడా ఉన్నాయి. అంతేగానీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏ మద్యాన్ని ప్రోత్సహించడం లేదు.. – టీఎస్‌బీసీఎల్ చైర్మన్ దేవీప్రసాద్ -
మద్యంతో భాషా ప్రావీణ్యం
వాషింగ్టన్ : మద్యం వల్ల ఆరోగ్యం పాడవుతుందని మన అందరికీ తెలుసు. మద్యాన్ని అధికంగా తీసుకోవడం వల్ల మనసు, శరీరం, మొదడు మొద్దువారిపోతాయని పెద్దలు చెబుతారు. అయితే తాజాగా వెలువడిన ఒక రీసెర్చ్ మద్యపానం గురించిన ఆసక్తిక విషయాలు వెల్లడించింది. ముఖ్యంగా రెండుమూడు భాషలు మాట్లాడేవారికి మద్యం తీసుకోవడం చాలా మేలు చేస్తుందని రీసెర్చ్చెబుతోంది. తగితన మోతాదులో తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి పెరగడంతో పాటు, చేసే పనులలో శ్రద్ద, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని రీసెర్చ్ స్పష్టం చేస్తోంది. చాలామందిలో కనిపించే యాంగ్జయిటీ (ఆత్రుత సమస్య) మద్యం వల్ల తగ్గుతుందని రీసెర్చ్ ప్రకటించింది. మద్యం తాగే అలవాటున్న 50 మందిపై డచ్ యూనివర్సిటీ ర్యాండమ్‌గా ఒక పరిశోధన చేసింది. అందరికీ వారివారి బరువులో 5 శాతం బీరు తాగించి.. ఇతర భాషా ప్రావీణ్యతపై పరిశోధకులు పలు ప్రశ్నలు అడిగారు. ఇందులో మద్యం తాగిన వారు ఇతర భాషలపై తమకున్న పట్టును నిరూపించుకున్నారు. వారు మాట్లాడే మాటలను ఆడియో రికార్డ్ కూడా చేసినట్లు పరిశోధకులు ప్రకటించారు. -
బ్రాండ్ విదేశీ.. మందు దేశీ..!
సాక్షి, హైదరాబాద్: ఖరీదైన విదేశీ మద్యం బ్రాండ్ల ఖాళీ సీసాలను సేకరించడం.. దానిలో లోకల్ విస్కీ, వోడ్కా నింపేసి విదేశీ మద్యం పేరిట అమ్మేయడం.. అంతర్జాతీయ మార్కెట్లో రూ.42 వేల ధర పలికే బ్రాండ్ సీసాలో రూ.వెయ్యి విలువైన లోకల్ మద్యం.. రూ.3,600 విలువైన బ్రాండ్ ఖాళీ సీసాల్లో రూ.300కు దొరికే వోడ్కా నింపడం.. వాటిని విలాసవంతమైన ప్రాంతాల్లో అమ్మేయడం.. హైదరాబాద్‌లో ముంబై నకిలీ మద్యం ముఠా సాగిస్తున్న అక్రమ వ్యాపారమిదీ. గత రెండేళ్లుగా ఈ గ్యాంగ్ దందా కొనసాగిస్తున్నా ఎౖMð్సజ్ పోలీసులు పసిగట్టలేక పోయారు. ముంబై ఎక్సైజ్ పోలీసులు అందిం చిన సమాచారంతో చివరికి నిందితుల్ని పట్టుకు న్నారు. వారి నుంచి విదేశీ బ్రాండ్లకు చెందిన 142 నకిలీ మద్యం సీసాలను, మరో 183 ఖాళీ సీసాలను స్వాధీనం చేసుకున్నారు. దందా సాగుతోందిలా.. ముంబై నగరానికి చెందిన అంతర్జాతీయ మద్యం స్మగ్లర్లు ఘాంజీభాయి, ముఖేశ్ కనుసన్నల్లోనే ఈ అక్రమ వ్యాపారం సాగుతున్నట్లు తెలుస్తోంది. వీరికి చెందిన ఓ ముఠా 10 రోజుల క్రితం ముంబైలో అక్కడి ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్‌కు పట్టుబ డింది. వారిని విచారించగా.. హైదరాబాద్‌లోనూ ఒక ముఠా నకిలీ మద్యం వ్యాపారం చేస్తున్నట్లు తేలింది. స్టేషనరీ వ్యాపారం ముసుగులో ముంబై నుంచి వివిధ రకాల విదేశీ బ్రాండ్లకు చెందిన లేబుల్స్, మూతలు, సీల్స్, కార్టర్లు తెప్పించే వారు. స్టార్ హోటళ్లలో తాగి పడేసిన విదేశీ మద్యం ఖాళీ సీసాలను సేకరించి, స్థానిక మద్యం దుకాణాల్లో చౌక ధరకు దొరికే బ్రాండ్ల మద్యాన్ని ఆ బాటిల్స్‌లో పోసి మూతపెట్టి, లేబుల్ అతి కించి విక్రయించేస్తున్నారు. లేబుల్ చెదరకుం డా.. సులభంగా మద్యం సీసాల మీద మూతలు ఊడ దీయటం, తిరిగి పెట్టడంలో తర్ఫీదు ఉన్న వ్యక్తులే ఈ వ్యాపారానికి కీలకం. ఇందుకోసం స్మగ్లింగ్ గ్యాంగ్ గుజరాత్‌కు చెందిన మహేశ్ అంబావి అనే నిçపుణుడిని పంపింది. అతన్ని కూడా టాస్క్‌ఫోర్స్ అరెస్టు చేసింది. నిఘా లోపంతోనే వ్యాపారం.. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్,మాదాపూర్ లాంటి ప్రాంతాల్లో జరిగే ఈవెంట్ పర్మిట్ ఫంక్షన్లలోనే ఈ నకిలీ విదేశీ మద్యం విక్రయిస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ ప్రాథమిక విచారణలో తేలింది. ఫోన్ కాల్ ద్వారా ఆర్డర్ తీసుకుని ఎమ్మార్పీ ధర మీద 20 నుంచి 30 శాతం తక్కువ ధరకే విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఫంక్షన్ హాళ్లలో మద్యం పార్టీ కోసం ఈవెంటు పర్మిట్ ఇస్తున్న అధికా రులు.. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం మద్యం డిపోల నుంచే కచ్చితంగా మద్యం తెచ్చుకునేలా కట్టుదిట్టం చేయాలి. కానీ మద్యం ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారనే అంశాన్ని అధికారులు విస్మరిస్తు న్నారు. దీంతో ఇలాంటి నకిలీ మద్యానికి అవకాశం చిక్కుతోంది. టోల్‌ఫ్రీకి కాల్ చేయండి తక్కువ ధరకే విదేశీ మద్యం విక్రయిస్తున్నారని తెలిసినా.. ఫోన్ కాల్ ద్వారా ఎవరైనా ఆర్డర్ అడిగినా 18004252523 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలని ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ కోరారు. టీఎస్‌బీసీఎల్ ద్వారా రాష్ట్రంలో దాదాపు 4,500 రకాల బ్రాండ్ల విదేశీ మద్యం అమ్ముతున్నామని, ప్రజలు కార్పొరేషన్ మద్యాన్నే తాగాలని ఆయన సూచించారు. మద్యం సీసాలపై త్రీడీ హోలోగ్రామ్ సీల్ ఉంటుందని, దీనికి నకిలీ తయారు చేయడం సాధ్యం కాదని, అందువల్ల హోలోగ్రామ్ సీల్ ఉన్న మద్యంనే కొనుగోలు చేయాలని చెప్పారు. -
దొంగ చిరునామాలతో ఎంత పని చేశారు !
న్యూఢిల్లీ: విదేశాల నుంచి దొడ్డిదారిన దేశంలోకి తరలిస్తున్న బంగారం భారీగా పట్టబడింది. ఇందుకు దేశ రాజధానిలోని ఫారిన్ పోస్టాఫీసు, ప్రధాన పోస్టాఫీసులు వేదిక కావటం గమనార్హం. థాయ్‌లాండ్, టర్కీ, దుబాయి, హాంగ్‌కాంగ్, ఇండోనేసియా, వంటి దేశాల నుంచి నిషేధిత వస్తువలను పోస్టు ద్వారా కొందరు తీసుకువస్తున్నారు. ఇలా వచ్చే పార్సిళ్లపై దొంగ చిరునామాలుంటాయి. అయితే ఇది ముందే పోస్టాఫీసు సిబ్బందికి తెలిసి ఉంటుంది. ఆ ప్రకారమే సంబంధిత వ్యక్తికి ఆ పార్శిల్ అందుతుంది. దీనిపై విశ్వసనీయ సమాచారం అందుకున్న రెవెన్యూ ఇంటలిజెన్స్ విభాగం అధికారులు గురువారం ఢిల్లీలోని ఫారిన్ పోస్టాఫీసుపై దాడి చేసి రూ.15 కోట్ల విలువైన బంగారం సహా నిషేధిత వస్తువులను పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఒక అధికారితో పాటు ఐదుగురిని అరెస్టు చేశారు. వారు చెప్పిన సమాచారం మేరకు రెండు ముఠాలకు చెందిన వ్యక్తులను పట్టుకుని రూ.8.5 కోట్ల విలువైన 28 కిలోల బంగారంతోపాటు రూ. 5 కోట్ల విలువైన డ్రగ్స్, ఇతర విలువైన వస్తువులను సీజ్ చేశారు. ఈ సిండికేట్ గుట్టురట్టు చేయటానికి తమకు నాలుగు రోజులు పట్టిందని అధికారులు తెలిపారు. అంతేకాక వారి నుంచి లెక్క చూపని రూ. 24 లక్షల నగదు కూడా దొరికిందని వివరించారు. -
విదేశీ జోక్యంతో కశ్మీర్లో కల్లోలమే: ముఫ్తీ
న్యూఢిల్లీ: కశ్మీర్ సమస్య పరిష్కారానికి విదేశీ మధ్యవర్తిత్వం అవసరమంటూ నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధినేత ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తీవ్రంగా మండిపడ్డారు. చైనా, అమెరికా లాంటి విదేశీ శక్తులు జోక్యం చేసుకుంటే కశ్మీర్ మరో సిరియా, అఫ్గానిస్తాన్, ఇరాక్‌లా మారుతుందని హెచ్చరించారు. విదేశీ జోక్యం కోరుతున్న ఫరూక్‌కు అసలు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసా? అని ముఫ్తీ ప్రశ్నించారు. సిరియా, ఇరాక్‌లోని పరిస్థితులను కశ్మీర్లో ఫరూక్ కోరుకుంటున్నారేమో అని ఎద్దేవా చేశారు. అమెరికా, చైనాలు తమ అంతర్గత విషయాలపై దృష్టి సారిస్తే మంచిదని ముఫ్తీ అన్నారు. -
వర్క్ ఫ్రమ్ హోమ్.. ఓ స్కామ్
విదేశీ పుస్తకాల స్కానింగ్ పేరుతో బెంగళూరులో రూ.150 కోట్ల వంచన సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ. లక్షల్లో వసూలు వలలో చిక్కిన బాధితులు వందల్లోనే పలు రాష్ట్రాల్లో ఇదే తరహాలో చీటింగ్ సాక్షి, బెంగళూరు: కాసేపు స్కానింగ్.. ఆనక ఇంటర్నెట్లో పీడీఎఫ్ కాపీలు పంపితే లక్షల్లోనే ఆదామయంటూ మోసగాళ్లు పన్నిన వలలో చిక్కుకున్న బాధితులు మోసపోయి విలవిల్లాడుతున్నారు. బెంగళూరులో రూ. వందల కోట్లలో సాగిన ఆన్లైన్ మోసం వెలుగులోకి వచ్చింది. ఇంటి నుంచే పనిచేయండి.. కాలు కాదల్చకుండా ప్రతి నెలా వేలు, లక్షలు సంపాదించండి! ఇటీవల ఎక్కడ చూసినా ఊరించే ఇలాంటి ప్రకటనలే. బస్టాండ్లు, బహిరంగ ప్రదేశాలు, సోషల్ మీడియాలో ఊదరగొడుతుంటాయి. ‘ఈ–బుక్’ ప్రాజెక్ట్ పేరుతో విదేశాలకు చెందిన పుస్తకాలను స్కానింగ్ చేసి పీడీఎఫ్‌లోకి మార్చి పంపిస్తే ప్రతి నెలా లక్షల్లో సంపాదించవచ్చంటూ గుజరాత్‌కు చెందిన ఓ కంపెనీ ప్రకటనలు ఇచ్చింది. దీన్ని చూసిన బెంగళూరు విజయనగర్‌కు చెందిన వినోద్‌కుమార్ ఈ–బుక్ ప్రాజెక్ట్ తీసుకున్న తన స్నేహితుడి ద్వారా కంపెనీ ప్రతినిధులను సంప్రదించారు. అయితే రూ.1.50 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలని వారు చెప్పటంతో ఇంట్లో నగలు అమ్మి కట్టేశాడు. అనంతరం రూ.45,000 వెచ్చించి స్కానింగ్ యంత్రం కొనుగోలు చేశాడు. పుస్తకాలను స్కానింగ్ చేసి పీడీఎఫ్‌లోకి మార్చి పంపించి నెలలు గడుస్తున్నా కంపెనీ పైసా కూడా ఇవ్వకపోవటంతో అనుమానంతో ఫోన్ చేయగా పనిచేయలేదు. దీంతో మోసపోయి నట్లు గ్రహించిన వినోద్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంపెనీ చేతిలో ఇలా మోసపోయిన బెంగళూరుకు చెందిన 40 మంది బాధితులు కూడా విజయనగర్, విల్సన్‌గార్డెన్ పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఒక్క కర్ణాటకలోనే ఆ కంపెనీకి వెయ్యి మందికిపైగా సభ్యులు ఉన్నట్లు గుర్తించారు. వారి దగ్గర రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేశారని, ఇలా రాష్ట్రంలో రూ.150 కోట్లు గుంజినట్లు సమాచారం. గుజరాత్, ఒడిశా, హర్యానా రాష్ట్రాల్లోనూ ఇదే తరహాలో రూ.300 కోట్ల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. స్టార్‌హోటళ్లలో మీటింగ్‌లు, ఒప్పందాల రిజిస్ట్రేషన్లు ఈ ముఠా మోసం చేసే తీరు పక్కాగా ఉంటుంది. అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లోని కాలేజీలు వారి గ్రంథాలయాల్లోని పుస్తకాలను ఈ–బుక్స్‌గా మార్చడానికి నిర్ణయించుకున్నాయని, ఆ పని తమకు అప్పగించినట్లు ప్రచారం చేస్తారు. పీడీఎఫ్‌లు కంపెనీ మెయిల్‌కు పంపితే చాలంటూ అమాయకులకు వల వేస్తారు. ప్రతి పేజీకి రూ.6 వరకు చెల్లిస్తామని, ఒక్కో ప్రాజెక్ట్‌లో కనీసం 15 వేల పేజీలు ఉంటాయని, లక్షల్లో ఆదాయం వచ్చి వాలుతుందని నమ్మిస్తారు. రకరకాల నిబంధనలు చూపి రూ.1.50 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ రాబడతారు. కంపెనీ ప్రతినిధులంటూ హర్యానా నుంచి సూటుబూటు వేసుకుని ఖరీదైన కార్లలో వచ్చినవారితో స్టార్ హోటళ్లలో సభ్యులతో సమావేశాలు ఏర్పాటు చేస్తారు. కొందరిని హర్యానాకు తీసుకెళ్లి అక్కడి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రాజెక్ట్ ఒప్పందాలను తయారు చేసి ఇస్తారు. ఇలా వందల కోట్ల రూపాయలు వసూలు చేసి కుచ్చుటోపి పెట్టారు. కాగా, కంపెనీ ప్రతినిధులు రాఘవేంద్రసింగ్, నిఖిల్ ప్రకాశ్, జై మన్వాని, అనికేత్, శ్రీవాస్తవ్, దివ్యాసింగ్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
పట్టుకోగానే ‘గంట’ కొట్టాడు!
-
పట్టుకోగానే ‘గంట’ కొట్టాడు!
ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్‌కు ఏపీ మంత్రి ఫోన్ సాక్షి, హైదరాబాద్: విదేశీ మద్యం బాటిళ్లను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తూ రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు పట్టుబడ్డ అధికారులను వదలిపెట్టా లంటూ ఏపీకి చెందిన మంత్రి ఒకరు తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చినట్టు తెలిసింది. ఈ అడ్డగోలు దందాలో పోలీసులకు చిక్కిన శంషాబాద్ ఎయిర్‌పోర్టు కస్టమ్స్ సూపరింటెండెంట్‌ను వదలిపెట్టాలని, అతడు తనకు మంచి మిత్రుడని చెబుతూ సదరు మంత్రి.. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్‌కు ఫోన్లో ‘గంట’కొట్టాడు. అయితే సబర్వాల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సూపరింటెండెంట్‌ను వదిలిపెట్టేది లేదని, అన్ని ఆధారాలు పక్కాగా ఉన్నాయని ఆ అమాత్యుడికి స్పష్టంచేశారు. దీంతో చేసేదేమి లేక ఆ మంత్రి తెలంగాణలోని పలువురు ప్రముఖులతో అకున్ సబర్వాల్‌కు ఫోన్ల మీద ఫోన్లు చేయించినట్టు తెలుస్తోంది. అరెస్టయిన కస్టమ్స్ అధికారులు అమాత్యుడికి సైతం ప్రతీనెల విదేశీ మద్యం బాటిళ్లను సరఫరా చేస్తారని ఎక్సైజ్ విచారణలో తేలినట్టు తెలుస్తోంది. అందుకే పదే పదే ఫోన్లు చేసి వారిని వదిలి వేయాలని ఒత్తిడి తెచ్చాడని అధికారులు తెలిపారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల పాస్‌పోర్టులను కొందరు కస్టమ్స్ అధికారులు స్కాన్ చేసి.. కస్టమ్స్ ఔట్లెట్ లిక్కర్‌ను పక్క దారిపట్టిస్తున్నారు. వారు బ్రోకర్లతో కలసి నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్‌లో బడాబాబులకు విదేశీ లిక్కర్ బాటిళ్లను అధిక ధరకు విక్రయిస్తున్నట్టు అకున్ సబర్వాల్ తెలిపారు. దీనివల్ల రాష్ట్ర ఎక్సైజ్‌కు భారీగా నష్టం వస్తోందని, ప్రతీ ఏటా రూ.45 కోట్ల మేర నష్టం వాటిల్లుతున్నట్టు ఆయన చెప్పారు. -
విదేశీ చెల్లింపుల్లో రూ.2200 కోట్ల అక్రమాలు
న్యూఢిల్లీ: విదేశీ చెల్లింపుల్లో రూ.2200 కోట్ల అక్రమాలపై సీబీఐ కేసు నమోదు చేసింది. విదేశాల నుంచి వస్తువులు దిగుమతి చేసుకుని రూ.24.34 కోట్ల విలువ జేసే బిల్లులకు గాను రూ.2200 కోట్లు చెల్లింపులు జరిపినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు స్టెల్కోన్ ఇన్ఫ్రాటెల్ లిమిటెడ్(ఎస్‌ఐపీఎల్)తో పాటు మరో 12 కంపెనీలపై కేసు నమోదు చేశారు. 2015–16 సంవత్సరంలో మోసపూరితంగా వస్తువులను దిగుమతి చేసుకోవడమే కాక.. పెద్దమొత్తంలో అక్రమ చెల్లింపులు జరిపినట్లు సీబీఐ పేర్కొంది. ఈ కంపెనీల బ్యాంకు ఖాతాలన్నీ పంజాబ్ నేషనల్ బ్యాంకులోనే ఉన్నాయని.. వాటి నుంచే లావాదేవీలు జరిగినట్లు ఆరోపించింది. 25 బిల్లులకుగాను రూ.3.14 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. కేవలం ఆరు బిల్లులకే రూ.680.12 కోట్లు చెల్లించారని వివరించింది. ఎస్‌ఐపీఎల్ చట్టవిరుద్ధంగా ఈ లావాదేవీలు జరిపినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. అదేవిధంగా మిగతా కంపెనీలు కూడా రూ.1572.7 కోట్ల మేర అక్రమాలకు పాల్పడడంతో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. -
అథ్లెటిక్స్‌లో విదేశీ కోచ్‌లు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ వేదికలపై భారత క్రీడాకారులు సత్తా చాటేందుకు అథ్లెటిక్స్ విభాగంలో విదేశీ కోచ్‌ల నియామకానికి కేంద్ర క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయెల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు రేస్‌వాకింగ్, 400మీ. పరుగు, 400మీ.రిలే విభాగాలకు విదేశీ కోచ్‌లతో పాటు సహాయక సిబ్బందిని నియమించారు. ఆస్ట్రేలియాకు చెందిన డేవ్ స్మిత్ రేస్ వాకింగ్ ఈవెంట్‌కు, గలీనా పి బుఖరీనా (అమెరికా) 400మీ. పరుగు విభాగాలకు కోచ్‌లుగా వ్యవహరిస్తారు. -
గత 12 ఏళ్లలో తొలిసారిగా...
కాలిఫోర్నియా వర్సిటికీ తగ్గిన విదేశీ దరఖాస్తులు శాన్ఫ్రాన్సిస్కో: గత 12 ఏళ్లలో తొలిసారిగా అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి విదేశీ విద్యార్థుల నుంచి వచ్చే దరఖాస్తుల సంఖ్య తగ్గింది. అంతకుముందు దాదాపు దశాబ్దకాలం పాటు ఈ యూనివర్సిటీకి వచ్చే విదేశీ విద్యార్థుల దరఖాస్తుల సంఖ్యలో ప్రతి ఏడాది సగటున 21 శాతం వృద్ధి నమోదయ్యేది. ఈ విశ్వవిద్యాలయంలో 2017లో కోర్సుల్లో చేరడానికి దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ నవంబరుతో ముగిసింది. ఆ నెలలోనే ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం తెలిసిందే. అత్యధికంగా మెక్సికో నుంచి వచ్చే దరఖాస్తుల్లో 30 శాతం తగ్గిపోగా, ముస్లిం ప్రజలు ఎక్కువగా ఉండే దేశాల నుంచి ఈసారి 10 శాతం తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. -
విదేశీ మద్యంపై భారీగా పన్నుల బాదుడు
-
మద్యంతో ముంచేద్దాం..!
⇒ ఎక్సైజ్ ద్వారా వచ్చే ఆదాయం పెంపుపై సర్కారు దృష్టి ⇒ మద్యం ధరలు, దుకాణాల సంఖ్య పెంచే యోచన ⇒ విదేశీ మద్యంపై భారీగా పన్నుల బాదుడు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడాది మద్యం పొంగి పొర్లనుంది. మద్యం ద్వారా ఏకంగా రూ.20 వేల కోట్లు రాబట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పుడున్న మద్యం దుకాణాల సంఖ్యను పెంచటంతో పాటు మద్యం రేట్లు, లైసెన్సు ఫీజులు, మద్యం అమ్మకాలపై పన్నుల మోత మోగించేందుకు నడుం బిగిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాలతో రాష్ట్ర ఖజానాకు రూ.13 వేల కోట్ల ఆదాయం సమకూరింది. కొత్త బడ్జెట్లో ఈ అంచనాలను అమాంతం 50 శాతానికి పైగా పెం చింది. అదనంగా రూ.7 వేల కోట్ల ఆదాయాన్ని రాబట్టాలని నిర్ణయించడం గమనార్హం. భారీగా పెరగనున్న దుకాణాలు.. రాష్ట్రంలో ప్రస్తుతం 2,144 మద్యం దుకాణాలు న్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 30తో వీటి లైసెన్స్ గడువు ముగియనుంది. ఆశించిన ఆదాయం రాబట్టా లంటే లైసెన్సు ఫీజులను పెంచడంతోపాటు ఇప్పు డున్న దుకాణాల సంఖ్యనూ పెంచాలని సర్కారు యోచిస్తోంది. విదేశీ మద్యం ద్వారా వీలైనంత ఎక్కు వ ఆదాయం సంపాదించాలని భావిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో విదేశీ మద్యం ద్వారా రూ.4,447 కోట్ల ఆదాయం సమకూరనుంది. విదేశీ మద్యం విక్రయాలను విస్తరించటంతో పాటు అదనపు ఫీజుల ను పెంచాలని సర్కారు నిర్ణయించింది. అందుకే విదేశీ మద్యం ద్వారా రూ.8,201 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసుకుంది. ఎక్సైజ్ ఆదాయమే పెద్ద దిక్కు అమ్మకపు పన్ను తర్వాత ఖజానాకు ఎక్సైజ్ ద్వారా వచ్చే ఆదాయమే పెద్ద దిక్కు. ఎక్సైజ్ డ్యూటీ, లీజు, లైసెన్సు ఫీజు, ఎక్సైజ్ వ్యాట్, ప్రివిలేజ్ ఫీజు ఇవన్నీ ఈ పద్దులో ఉంటాయి. మద్యం ఉత్పత్తులపై విధించే ఎక్సైజ్ డ్యూటీని ఈసారి గణనీయంగా పెంచే అవ కాశం ఉంది. తద్వారా మద్యం ధరలు పెరుగుతాయి. ప్రస్తుతం మద్యం అమ్మకాలపై 70 నుంచి 180 శాతం వరకు వ్యాట్ విధిస్తుండగా, ప్రీమియం, ఫారిన్ లిక్కర్‌పై వ్యాట్‌ను మరింత పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. వీటితో పాటు లైసెన్సు ఫీజులు ప్రస్తుతం జనాభా ప్రాతిపదికన సంవత్సరానికి రూ.40 లక్షల నుంచి రూ.1.08 లక్షల వరకు వివిధ స్లాబుల్లో ఉన్నాయి. వీటిని సవరించాలని నిర్ణయిం చింది. ప్రస్తుతం 13 వేల జనాభాకి ఓ మద్యం దుకా ణం ఉండగా, వీటిని విస్తరించే అవకాశాలున్నాయి. బార్ల లైసెన్సులను నగర పంచాయతీల నుంచి మం డల స్థాయి వరకు విస్తరించాలని యోచిస్తోంది. సుప్రీం ఆదేశాలతో వ్యాపారుల బెంబేలు.. జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల లోపు మద్యం అమ్మకాలను నిషేధించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 31 తర్వాత రహదారులకు ఆనుకుని మద్యం అమ్మకాలు ఉండరాదని స్పష్టం చేసింది. దీంతో మద్యం వ్యాపారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రహదారులకు దూరంగా వెళితే వ్యాపారాలు దెబ్బతింటాయని చెబుతున్నారు. అదే జరిగితే ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయం సైతం తగ్గిపోతుంది. -
తొలి భారత క్రికెటర్‌గా యూసఫ్ !
వడోదరా:ఒక విదేశీ లీగ్ లో ట్వంటీ 20 లీగ్ లో ఆడేందుకు భారత క్రికెటర్ యూసఫ్ పఠాన్ ఒప్పందం చేసుకున్నాడు. తద్వారా ఒక విదేశీ లీగ్ లో ఆడేందుకు ఒప్పందం చేసుకున్న తొలి భారత క్రికెటర్ గా గుర్తింపు పొందాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో కోల్ కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న యూసఫ్..తన ఫామ్ ను మరింత మెరుగుపరుచునే క్రమంలో విదేశీ లీగ్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. వచ్చే నెల 8 వ తేదీన ఆరంభమయ్యే ఈ లీగ్ లో తాను పాల్గొనబోతున్న విషయాన్ని యూసఫ్ స్వయంగా వెల్లడించాడు. 'హాంకాంగ్ ట్వంటీ 20 లో పాల్గొనేందుకు సంతకం చేశా. ఆ లీగ్ లో చాలా మంది ప్రముఖ క్రీడాకారులు ఆడుతున్నారనే విషయాన్ని తెలుసుకున్నా. దాంతో ఆ లీగ్ తో ఒప్పందం చేసుకోవడానికి ముందుకు వెళ్లా. ఇలా ఒక విదేశీ లీగ్ తో ఒప్పందం చేసుకోవడానికి ఐపీఎల్లే ప్రధాన కారణం. ఐపీఎల్ కు మంచి ప్రాక్టీస్ లభిస్తుందనే ఉద్దేశంతోనే విదేశీ లీగ్ తో ఒప్పందం చేసుకున్నా' అని యూసఫ్ తెలిపాడు. ఇదిలా ఉంచితే, ఈ లీగ్ లో పాల్గొనడం తన దేశవాళీ కెరీర్ పై ఎటువంటి ప్రభావం చూపదని యూసఫ్ పేర్కొన్నాడు. దాదాపు ఐదేళ్ల క్రితం భారత తరపున యూసఫ్ ఆడాడు. 2012లో చివరిసారి భారత్ కు యూసఫ్ ప్రాతినిథ్యం వహించాడు. ఆ తరువాత జాతీయ జట్టులో స్థానం సంపాదించలేకపోయిన యూసఫ్..కేవలం దేశవాళీ టోర్నీలకు మాత్రమే పరిమితమయ్యాడు. -
హైదరాబాద్‌లో విదేశీ భవన్
• కేంద్రానికి సీఎం కేసీఆర్ ప్రతిపాదన • సానుకూలంగా స్పందించిన విదేశాంగ శాఖ కార్యదర్శి మూలే • విదేశాలకు వెళ్లేవారి సంక్షేమానికి ఉమ్మడి విధానం ఉండాలి: కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు చెందిన ఎన్ఆర్ఐలకు సేవలందించేందుకోసం హైద రాబాద్‌లో విదేశీ భవన్ నిర్మించాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చేసిన ప్రతిపాదనకు విదేశాంగ శాఖ కార్యదర్శి దానేశ్వర్ మూలే సానుకూలంగా స్పందించారు. హైదరా బాద్‌లో విదేశీ భవన్‌ను నిర్మిస్తామని ప్రకటిం చారు. శనివారం ప్రగతి భవన్లో కేసీఆర్‌తో దానేశ్వర్ మూలే సమావేశమయ్యారు. విదేశా లకు వెళ్లి మోసపోయేవారి విషయంలో, ఆపదల్లో చిక్కుకున్న వారి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం స్పందించి సాయం అందించేలా తీసుకోవాల్సిన చర్యలపై వారు ఏకాభిప్రాయం వ్యక్తంచేశారు. విద్య, ఉద్యో గ, ఉపాధి అవకాశాల కోసం అన్ని రాష్ట్రాల నుంచి విదేశాలకు వెళ్లే వారి వ్యవహారాలను పర్యవేక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి కార్యాచరణ రూపొం దించి, అమలు చేయాల్సిన అవసరముం దని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. విదేశీ భవన్ ఎందుకంటే... ‘‘తెలంగాణ, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి విద్య, ఉపాధి, ఉద్యోగం, వ్యాపార అవసరాల కోసం పెద్ద ఎత్తున ప్రజలు విదేశాలకు వెళ్తున్నారు. వారికి అనేక విష యాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొన్ని సార్లు మోసాలు, ప్రమాదాలు, కిడ్నాప్‌లకు గురవుతున్నారు. కేసుల్లో ఇరుక్కుంటున్నారు. వారందరికీ తగిన సహాయం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. విదేశీ పెట్టుబడులు, సెజ్‌లకు అనుమతులు ఇస్తు న్నందున పెద్ద ఎత్తున విదేశీ పారిశ్రామిక వేత్తలు, వ్యాపార వేత్తలు దేశానికి వస్తున్నారు. వారికి కూడా తగిన విధంగా ప్రభుత్వం సహకరించాలి. అందుకోసం విదేశీ రాయ బార కార్యాలయాలను బలోపేతం చేయాలి. రాష్ట్రాల రాజధానుల్లో కూడా విదేశీ భవన్లు నిర్మించాలి. తెలంగాణలో విదేశీ భవన్‌కు స్థలం కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’ అని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో విదేశీ వ్యవహారాలు పర్యవేక్షించే కేంద్ర ప్రభుత్వ అధికారులకు తగిన సహకారం అందిస్తామ న్నారు. మంత్రి కేటీఆర్, ఇతర అధికారులతో తదుపరి కార్యాచరణపై చర్చలు జరపాలని కేంద్ర అధికారులకు సూచించారు. విస్తృతం కావాలి... ‘‘భారతదేశం గొప్ప ఆర్థిక శక్తిగా ఎదుగు తోంది. ఆరో∙అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉన్న భారత్ విదేశాలతో మంచి సంబంధాలు నెరుపుతోంది. ఎగుమతులు, దిగుమతులూ ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో విదేశీ వ్యవహారాల శాఖ ప్రాధాన్యం కూడా బాగా పెరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ శాఖ కార్యకలాపాలు కూడా పెరగాలి. ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లే వారికి, విద్య కోసం వివిధ దేశాలకు వెళ్లే వారికి తగిన అవగాహన కల్పిం చాలి. ప్రభుత్వమే మార్గదర్శకం చేసే విధంగా ఉంటే, మోసాలు తగ్గుతాయి’’అని సిఎం చెప్పారు. పదిహేనేళ్లుగా భారత ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర దేశాలతో సంబంధాలను మెరుగు పర్చుకుంటు న్నాయని మూలే అన్నారు. కేంద్ర ప్రభుత్వం విదేశీ వ్యవహారాల శాఖను బలోపేతం చేస్తోందని వివరించారు. వరంగల్‌లో పాస్‌పోర్టు కార్యాలయం: మూలే వరంగల్ నగరంలో పాస్‌పోర్టు సేవా కేంద్రం నెలకొల్పుతామని దానేశ్వర్ మూలే ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన మూలే, ఈ మేరకు హామీ ఇచ్చారు. పాస్ పోర్టు కేంద్రం ఏర్పాటుకు వరంగల్‌లో అవసరమైన స్థలం కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారు. పాస్‌పోర్టుల జారీలో జాప్యాన్ని నివారిస్తామని మూలే వెల్లడించారు. అత్యంత వేగంగా పాస్‌పోర్టులను జారీ చేసే రాష్ట్రంగా రికార్డు సృష్టించిన తెలంగాణ దేశానికే ఆదర్శమని మూలే ప్రశంసించారు. ఈ సమావేశంలో రీజనల్ పాస్‌పోర్టు అధికారి అశ్వని, తెలంగాణలో విదేశీ వ్యవహారాలను పర్యవేక్షించే అధికారి విష్ణు, సీఎంఓ అధికారులు నర్సింగ రావు, రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చెన్నై కేంద్రంగా విదేశీమద్యం రవాణా
జిల్లాలో జోరుగా విక్రయాలు నెల్లూరు (క్రైమ్) : చెన్నై కేంద్రంగా విదేశీ మద్యం జిల్లాకు గుట్టు చప్పుడు కాకుండా రవాణా జరుగుతుంది. రైళ్లు, ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా లక్షలాది రూపాయల విదేశీ మద్యం జిల్లాకు చేరుతుంది. జిల్లాకు చెందిన కొందరు ఈ వ్యాపారాన్ని చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. చెన్నైలోని బర్మాబజార్‌లో కొన్ని కస్టమ్స్ షాపుల్లో అనధికారికంగా విదేశీ మద్యంను విక్రయిస్తున్నారు. నెల్లూరు నుంచి చెన్నైకు వెళ్లే సీజన్బాయిస్ కస్టమ్స్ షాపుల్లో విదేశీ మద్యం(జానీవాకర్, గ్లాండ్ఫిచ్, హెన్నీస్సీ రెడ్‌వైన్, కూట్టిసార్ప్ బ్లెండెండ్ స్కాట్చ్ తదితరాల)ను కొనుగోలు చేసి అధిక ధరలకు జిల్లాలో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఏపీ బేవరేజస్‌లో జానీవాకర్ రెడ్‌లేబుల్ (750 ఎంఎల్) ఫుల్‌బాటిల్ రూ 2,145 ఉండగా అదే కంపెనీకి చెందిన లీటర్ బాటిల్ (12 ఏళ్ల పురాతనం) బర్మాబజార్‌లో రూ.1520లకే, జానీవాకర్ డబుల్బ్లాక్ రూ.4, 225 ఉండగా రూ.3,500కు, జానీవాకర్ బ్లాక్‌లేబుల్ రూ.4,290 ఉండగా రూ.3,525కు లభ్యమవుతున్నాయి. వాటిని తీసుకువచ్చి జిల్లాలో ఒక్కో బాటిల్‌పై రూ.500 నుంచి రూ.700 వరకు లాభంతో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అతి తక్కువ ధరకే విదేశీ మద్యం అందుబాటులోకి వస్తుండటంతో మందుబాబులు ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తున్నారు. జానీవాకర్ బ్రాండ్ 12 ఏళ్ల పురాతనమైనది కావడంతో కొనుగోళ్లు మరింతగా పెరుగుతున్నాయి. నెల్లూరుకు చెందిన కొందరు సీజనల్ బాయిస్ ప్రతి రోజు రైళ్లు, ప్రైవేటు ట్రావెల్స్‌ల్లో విదేశీ మద్యం బాటిళ్లను నెల్లూరుకు తెచ్చి విక్రయిస్తున్నారు. నెల్లూరులోని పలు కస్టమ్స్ షాపుల్లో సైతం విదేశీ మద్యం అందుబాటులో ఉంచి గోప్యంగా విక్రయిస్తున్నట్లు సమాచారం. మరికొందరు గోవా, పాండిచ్చేరి నుంచి పెద్ద సంఖ్యలో మద్యం బాటిళ్లను తీసుకువచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు డిఫెన్స్‌కు సంబంధించిన మద్యం బాటిళ్లను సైతం విక్రయిస్తున్నారు. డిఫెన్స్‌లో 50 శాతం తక్కువకే మద్యం దొరుకుతుంది. దీంతో వాటిని తమకు తెలిసిన వారి ద్వారా కొనుగోలు చేయించి బయట అధిక శాతం ధరలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోది. పెద్ద మొత్తంలో విదేశీ మద్యం సరిహద్దు దాటి జిల్లాకు వస్తున్నా.. ఎక్సైజ్ అధికారులు కనీస చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. అధికారుల తనిఖీల ఊసే లేకపోవడంతో జిల్లాలో విచ్చలవిడిగా విదేశీ మద్యం విక్రయాలు సాగుతున్నాయి. ఇతర జిల్లాలకు సైతం జిల్లా మీదుగానే విదేశీ మద్యం తరలుతుందని రెండురోజుల కిందట తడ చెక్‌పోస్టు వద్ద వాణిజ్య పన్నులశాఖ దాడుల్లో బహిర్గతమైంది. ఇప్పటికైనా ఎక్సైజ్‌శాఖ అధికారులు కళ్తు తెరిచి దాడులు నిర్వహిస్తే పెద్ద ఎత్తున్న విదేశీమద్యం దొరికే అవకాశం ఉంది. -
17,500కోట్ల విదేశీ అప్పునకు చాన్సివ్వండి
కేంద్ర ఆర్థిక మంత్రికి సీఎం చంద్రబాబు లేఖ సాక్షి, హైదరాబాద్: కేంద్ర సాయం కింద ఏడాదికి రూ.3,500 కోట్ల చొప్పున వచ్చే ఐదేళ్లలో రూ.17,500 కోట్ల మేర విదేశీ అప్పునకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అంతేగాక కేంద్ర సాయంతో నిమిత్తం లేకుండా నూటికి నూరు శాతం రాష్ట్రప్రభుత్వమే తీర్చుకునేలా మరో రూ.21,034 కోట్ల విలువగల ప్రాజెక్టులకోసం విదేశీ అప్పునకు అనుమతించాలని విన్నవించింది. మొత్తం రూ.32,573 కోట్ల మేర విదేశీ ఆర్థిక సంస్థల నుంచి అప్పు పొందేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టులకు అనుమతించాలని కోరింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు రెండు రోజులక్రితం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలోనే సీఎం ఈ లేఖ రాశారు. -
వాతావరణ కేంద్ర కంప్యూటర్లు హ్యాక్
కాన్ బెర్రా: ఆస్ట్రేలియా జాతీయ వాతావరణ బ్యూరో కంప్యూటర్లను అంతర్జాతీయ హ్యాకర్లు హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియన్ సైబర్ సెక్యూరిటీ సెంటర్(ఏసీఎస్సీ) అధికారికంగా బుధవారం ప్రకటించింది. నిబంధనలను ఉల్లంఘిస్తూ రహస్య సమాచారాన్ని హ్యాకర్లు తస్కరించారు. గత ఏడాది కూడా వాతావరణ కేంద్ర కంప్యూటర్లు హ్యాక్ కు గురైన విషయం తెలిసిందే. అయితే, హ్యాకింగ్ కు గల కారణాలు తెలియరాలేదు. కేవలం నష్టం కలిగించడానికి మాత్రమే హ్యాకర్లు ఈ పని చేసుంటారని నిపుణులు అంటున్నారు. ఏసీఎస్సీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వాతావరణ కేంద్రంలో గల రెండు కంప్యూటర్లలోకి వైరస్ చొరబడినట్లు గుర్తించామని చెప్పారు. పరిశీలించి చూడగా అంతర్జాతీయ హ్యాకర్లు ఉపయోగించే రిమోట్ యాక్సెస్ టూల్(ఆర్ఏటీ)గా తేలిందని వెల్లడించారు. ఈ టూల్ ను ఉపయోగించే గతంలో కొన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వ కంపూటర్లను హ్యాక్ చేసేందుకు హ్యాకర్లు యత్నించారని తెలిపారు. గత ఏడాదిన్నర కాలంలో 1,095సార్లు ప్రభుత్వ కంప్యూటర్లపై హ్యాకర్లు దాడులు చేశారని పేర్కొన్నారు. కాగా, గతంలో ఆస్ట్రేలియా అధికారులు హ్యాకింగ్ పై చైనాను దూషించిన విషయం తెలిసిందే.