మిర్యాలగూడ: మలేసియాలో హోటల్ మేనేజ్‌మెంట్ రంగంలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నిరుద్యోగిని ఓ వ్యక్తి నిండా ముంచాడు. దీనిపై బాధిత నిరుద్యోగి మిర్యాలగూడ డీఎస్పీ సందీప్‌గోనెకు శనివారం ఫిర్యాదు చేశారు.
మిర్యాలగూడ పట్టణానికి చెందిన సీహెచ్ పృథ్వీ (20) హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తి చేశాడు. కృష్ణా జిల్లాకు చెందిన గంప గణేష్ అనే వ్యక్తి మలేసియాలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి పృథ్వీ నుంచి రూ.1.60 లక్షలు తీసుకున్నాడు. విజిటింగ్ వీసాపై అక్కడికి పంపించాడు. మూడు నెలల పాటు నానా కష్టాలు పడి, రూ.లక్ష వరకు ఖర్చు పెట్టుకుని తాను తిరిగి వచ్చానని బాధితుడు పృథ్వీ పేర్కొన్నాడు. నిందితుడు గంప గణేష్ కృష్ణా జిల్లాకు చెందిన మరో ఐదుగురిని కూడా ఇలానే మోసగించాడని తెలిపాడు.
విదేశీ ఉద్యోగం పేరుతో మోసం
Published Sat, Jun 4 2016 12:02 PM | Last Updated on Thu, Oct 4 2018 8:09 PM
Advertisement
Advertisement