
భువనగిరి: రాబోవు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి ఉపాధ్యాయులు అండగా ఉన్నారన్నారు కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రజలకిచ్చిన హామీలను విస్మరించిందని, అన్ని వర్గాలను రేవంత్ సర్కార్ మోసం చేసిందని కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‍బీఆర్ఎస్ లు నాటకాలు ఆడుతున్నాయన్న కిషన్ రెడ్డి.. ఆ రెండు పార్టీలకు ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడిగే ధైర్యం లేదన్నారు. బీజేపీకి అన్ని వర్గాల మద్దతు ఉందని భువనగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.
కాగా, వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మొత్తం 23 మంది అభ్యర్థులు నామినేషన్ వేయగా19 మంది చివరకు బరిలో ఉన్నారు. ఈ నెల 3న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా 10వ తేదీ వరకూ ానామినేషన్ల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ నెల 27న పోలింగ్
ఈ నెల 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. సాయంత్రం ఓటింగ్ ముగిసే సమయంలో క్యూ లైన్‌లో ఉన్న వారికి టోకెన్ నంబర్లను ఇచ్చి, ఓటింగ్ వేసే ఏర్పాట్లు చేస్తున్నారు.

Comments
Please login to add a commentAdd a comment