ఆస్కార్ ఎంట్రీకి తమిళ సినిమా | 'Visaranai' is India's official entry for Oscars 2017 | Sakshi
Sakshi News home page

ఆస్కార్ ఎంట్రీకి దక్షిణాది సినిమా

Published Thu, Sep 22 2016 5:06 PM | Last Updated on Thu, Oct 4 2018 8:09 PM

ఆస్కార్ ఎంట్రీకి తమిళ సినిమా - Sakshi

ఆస్కార్ ఎంట్రీకి తమిళ సినిమా

జాతీయ అవార్డును గెలుచుకున్న తమిళ చిత్రం ’విరసణై’ ఆస్కార్ ఎంట్రీకి అవకాశం దక్కించుకుంది.

జాతీయ అవార్డును గెలుచుకున్న తమిళ చిత్రం ’విరసణై’ ఆస్కార్ ఎంట్రీకి అవకాశం దక్కించుకుంది. భారతదేశం నుంచి 'ఉత్తమ విదేశీ భాషా చిత్రం' కేటగిరీలో ఈ సినిమా అధికారికంగా ఎంట్రీ ఇచ్చింది.  మొత్తం 29 చిత్రాలు పోటీ పడగా, చివరకు విసరణై బరిలో నిలిచింది. ఈ మేరకు ఎఫ్ఎఫ్ఐ చైర్మన్ కేతన్ మెహతా ధ్రువీకరించారు.

రియాలిటీకి దగ్గరగా ఉండే కథలను భావోద్వేగాలతో తెరకెక్కిస్తాడనే పేరున్న తమిళ దర్శకుడు వెట్రిమాన్ రూపొందించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతోపాటు జాతీయ అవార్డులను అందుకుంది. ఖాకీల కర్కశత్వాన్ని ప్రధానంగా చూపించిన 'విసరణై'.. ఎం.చంద్రకుమార్ నవల 'లాకప్' ఆధారంగా తెరకెక్కింది.

థియేటర్లలో విడుదల కాకాముందే 72వ వెనీస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ధనుష్ సొంత నిర్మాణ సంస్థ వండర్బార్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించడం విశేషం. కాగా 89 వ ఆస్కార్ అవార్డు వేడుకలు 2017 ఫిబ్రవరిలో లాస్ ఏంజెలెస్లో జరుగనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement