Oscars 2017
-
తొలిసారిగా ఓ ముస్లిం నటుడికి ఆస్కార్
-
2017 ఆస్కార్ విజేతలు
లాస్ఏంజిల్స్: చలనచిత్ర రంగంలో ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం ప్రారంభమైంది. డాల్బీ థియెటర్లో జరుగుతున్న ఈ 89వ ఆస్కార్ అవార్డుల వేడుకకు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా హాజరయ్యారు. ఉత్తమ సహాయనటుడు విభాగంలో పోటీపడిన దేవ్ పటేల్‌కు నిరాశ ఎదురైంది. ఈ విభాగంలో మూన్లైట్ చిత్రంలో నటించిన మహేర్షాలా అలీని అవార్డు వరించింది. ఆస్కార్ అవార్డు పొందిన మొదటి ముస్లిం నటుడు మహేర్షాలా అలీనే కావడం విశేషం. ఏడు ముస్లిం దేశాలపై ట్రంప్ ట్రావెల్ బ్యాన్‌ను విధించిన నేపథ్యంలో.. మహేర్షాలా ఆస్కార్ గెలవడంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. 2017 ఆస్కార్ విజేతలు వీరే ఉత్తమ చిత్రం: మూన్లైట్ ఉత్తమ నటుడు: కేసీ అఫ్లెక్(మాంచెస్టర్ బై ద సీ) ఉత్తమ నటి: ఎమ్మా స్టోన్(లా లా లాండ్) ఉత్తమ దర్శకుడు: డామీన్ చాజెల్లె (లా లా లాండ్) ఉత్తమ సహాయ నటుడు: మహేర్షాల అలీ(మూన్లైట్) ఉత్తమ సహాయ నటి: వయోలా డేవిస్(ఫెన్సెస్) ఉత్తమ మేకప్ మరియు హెయిర్ స్టైల్: సూసైడ్ స్క్వాడ్ చిత్రం ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ చిత్రం: ఫెంటాస్టిక్ బీస్ట్స్ ఉత్తమ డాక్యుమెంటరీ: ఓ.జే.. మేడ్ ఇన్ అమెరికా ఉత్తమ సౌండ్ ఎడిటింగ్: అరైవల్ ఉత్తమ సౌండ్ మిక్సింగ్ చిత్రం: హాక్సారిడ్జ్ ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్: హాక్సారిడ్జ్ ఉత్తమ విదేశీ భాషా చిత్రం: ద సెల్స్మ్యాన్(ఇరాన్) బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్: జూటోపియా బెస్ట్ యానిమేటెడ్ షార్ట్: పైపర్ ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ చిత్రం: లా లా ల్యాండ్ బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్: ద జంగిల్ బుక్ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్: ద వైట్ హెల్మెట్స్ బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్: సింగ్ బెస్ట్ సినిమాటోగ్రఫి: లా లా ల్యాండ్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్: లా లా లాండ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్: సిటీ ఆఫ్ స్టార్స్( లా లా లాండ్) బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: మాంచెస్టర్ బై ద సీ బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: మూన్లైట్ మహేర్షాల అలీ -
ఆస్కార్ విలువెంతో తెలిస్తే షాక్!
బంగారం వర్ణంలో మెరిసిపోయే ఆస్కార్ కు వినోద రంగంలో ఉన్న గౌరవం అంతా ఇంతా కాదు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ గోల్డెన్ ఆస్కార్‌ను ఒక్కసారైనా ఇంటికి తీసుకెళ్లాలి అని ప్రతి ఒక్క ఆర్టిస్టూ ఎన్నో కలలు కంటూ ఉంటారు. కానీ ఆ అదృష్టం కొద్దిమందికే వరిస్తూ ఉంటోంది. బంగారు రంగుల్లో మెరిసిపోయే ఈ ఆస్కార్ విలువెంతో అసలు ఎప్పుడైనా, ఎవరైనా గెస్ చేశారా? ఈ ఆస్కార్ విలువ కేవలం 10 డాలర్లేనట అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ.666 మాత్రమే. అయితే ఈ విగ్రహం తయారుచేయడానికి అయ్యే ఖర్చు మాత్రం 400 డాలర్లు(రూ.26,655). ఒకవేళ దీన్ని ఆక్షన్‌కు పెట్టాలనుకుంటే రూల్స్ ప్రకారం ఈ ట్రోఫికి 10 డాలర్లను అకాడమీ ఆఫ్ మోషన్ ఫిక్చర్ ఆర్ట్ అండ్ సైన్సెస్(ఏఎమ్పీఏఎస్) కు చెల్లించాల్సి ఉంటుంది. 2015 నుంచి ఈ నిబంధనను కోర్టు అమలుచేస్తూ వస్తోంది. ఈ రూల్‌ను సమర్థిస్తూ వస్తున్న ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు, ఆస్కార్ విన్నర్ స్టీవెన్ స్పీల్ బర్గ్, బెట్ డేవిస్, క్లార్క్ గేబుల్కు చెందిన ఆస్కార్లపై 1.36 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. వీటిని తిరిగి అకాడమీకి విరాళంగా ఇవ్వడానికే ఆయన ఇంత ఖర్చు చేశారట. -
ఆస్కార్ ఎంట్రీకి తమిళ సినిమా
జాతీయ అవార్డును గెలుచుకున్న తమిళ చిత్రం ’విరసణై’ ఆస్కార్ ఎంట్రీకి అవకాశం దక్కించుకుంది. భారతదేశం నుంచి 'ఉత్తమ విదేశీ భాషా చిత్రం' కేటగిరీలో ఈ సినిమా అధికారికంగా ఎంట్రీ ఇచ్చింది. మొత్తం 29 చిత్రాలు పోటీ పడగా, చివరకు విసరణై బరిలో నిలిచింది. ఈ మేరకు ఎఫ్ఎఫ్ఐ చైర్మన్ కేతన్ మెహతా ధ్రువీకరించారు. రియాలిటీకి దగ్గరగా ఉండే కథలను భావోద్వేగాలతో తెరకెక్కిస్తాడనే పేరున్న తమిళ దర్శకుడు వెట్రిమాన్ రూపొందించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతోపాటు జాతీయ అవార్డులను అందుకుంది. ఖాకీల కర్కశత్వాన్ని ప్రధానంగా చూపించిన 'విసరణై'.. ఎం.చంద్రకుమార్ నవల 'లాకప్' ఆధారంగా తెరకెక్కింది. థియేటర్లలో విడుదల కాకాముందే 72వ వెనీస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ధనుష్ సొంత నిర్మాణ సంస్థ వండర్‌బార్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించడం విశేషం. కాగా 89 వ ఆస్కార్ అవార్డు వేడుకలు 2017 ఫిబ్రవరిలో లాస్ ఏంజెలెస్‌లో జరుగనున్నాయి.