
2017 ఆస్కార్ విజేతలు
లాస్‌ఏంజిల్స్: చలనచిత్ర రంగంలో ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం ప్రారంభమైంది. డాల్బీ థియెటర్‌లో జరుగుతున్న ఈ 89వ ఆస్కార్ అవార్డుల వేడుకకు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా హాజరయ్యారు. ఉత్తమ సహాయనటుడు విభాగంలో పోటీపడిన దేవ్ పటేల్‌కు నిరాశ ఎదురైంది. ఈ విభాగంలో మూన్‌లైట్ చిత్రంలో నటించిన మహేర్షాలా అలీని అవార్డు వరించింది. ఆస్కార్ అవార్డు పొందిన మొదటి ముస్లిం నటుడు మహేర్షాలా అలీనే కావడం విశేషం. ఏడు ముస్లిం దేశాలపై ట్రంప్ ట్రావెల్ బ్యాన్‌ను విధించిన నేపథ్యంలో.. మహేర్షాలా ఆస్కార్ గెలవడంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.
2017 ఆస్కార్ విజేతలు వీరే
ఉత్తమ చిత్రం: మూన్లైట్
ఉత్తమ నటుడు: కేసీ అఫ్లెక్(మాంచెస్టర్ బై ద సీ)
ఉత్తమ నటి: ఎమ్మా స్టోన్(లా లా లాండ్)
ఉత్తమ దర్శకుడు: డామీన్ చాజెల్లె (లా లా లాండ్)
ఉత్తమ సహాయ నటుడు: మహేర్షాల అలీ(మూన్‌లైట్)
ఉత్తమ సహాయ నటి: వయోలా డేవిస్(ఫెన్సెస్)
ఉత్తమ మేకప్ మరియు హెయిర్ స్టైల్: సూసైడ్ స్క్వాడ్ చిత్రం
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ చిత్రం: ఫెంటాస్టిక్ బీస్ట్స్
ఉత్తమ డాక్యుమెంటరీ: ఓ.జే.. మేడ్ ఇన్ అమెరికా
ఉత్తమ సౌండ్ ఎడిటింగ్: అరైవల్
ఉత్తమ సౌండ్ మిక్సింగ్ చిత్రం: హాక్సారిడ్జ్
ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్: హాక్సారిడ్జ్
ఉత్తమ విదేశీ భాషా చిత్రం: ద సెల్స్మ్యాన్(ఇరాన్)
బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్: జూటోపియా
బెస్ట్ యానిమేటెడ్ షార్ట్: పైపర్
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ చిత్రం: లా లా ల్యాండ్
బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్: ద జంగిల్ బుక్
బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్: ద వైట్ హెల్మెట్స్
బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్: సింగ్
బెస్ట్ సినిమాటోగ్రఫి: లా లా ల్యాండ్
బెస్ట్ ఒరిజినల్ స్కోర్: లా లా లాండ్
బెస్ట్ ఒరిజినల్ సాంగ్: సిటీ ఆఫ్ స్టార్స్( లా లా లాండ్)
బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ప్లే: మాంచెస్టర్ బై ద సీ
బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ప్లే: మూన్లైట్
మహేర్షాల అలీ