
సాక్షి, హైదరాబాద్: గత మూడు నెలల క్రితం డైరెక్టర్ రామానుజం తనకు చూపిన ఫోటో చూసి కనెక్ట్ అయ్యానని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. 2013 నుంచి తనలాంటి వ్యక్తి కోసం చూస్తున్నానని.. టైం ఇస్తారా అని డైరెక్టర్ అడగగానే... టైం ఇవ్వలేనేమోననుకున్నా.. కానీ ఆ తర్వాత డైరెక్టర్ చూపెట్టిన ఫోటో చూసి ఇది కచ్చితంగా చేయాలని డిసైడ్ అయ్యా’’ అని జగ్గారెడ్డి చెప్పారు.
‘‘ఏ వార్ ఆఫ్ లవ్’ క్యాప్షన్‌ను డైరెక్టర్ ముందే రాసుకున్నారు. నా కథకు, లవ్‌కు సంబంధం లేదు. కథ చెప్పే క్రమంలో స్టార్టింట్ అంతా డైరెక్టర్ చెప్పారు.. మిగతా అంతా నా లైఫ్‌లో జరిగిన కొన్ని విషయాలు చెప్పా. కొన్ని విషయాలలో డైరెక్టర్ కన్విన్స్ అయ్యారు. నేను సినిమాల్లోకి వెళ్లడానికి ఢిల్లీ టూర్ పనికొచ్చింది. నా రాజకీయానికి సంబంధం లేదు. నేను రాజకీయాల్లో ఉన్నా.. సినిమా ద్వారా కొత్త గా రాజకీయాల్లో అడ్వాంటేజ్ తీసుకునేదేమీలేదు’ అని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.
విద్యార్థి నేతగా, కౌన్సిలర్‌గా రోల్ ఉంటుంది. మున్సిపల్ ఛైర్మన్ ఎలా అయ్యాననేది ఇందులో చూపిస్తాం. లవ్, ఫ్యాక్షన్, ఎమోషన్ , పొలిటికల్‌గా సినిమా ఉంటుంది. ఢిల్లీ టూర్ నన్ను పూర్తి గా మార్చేసింది.. దీని పరిణామాలు ఎటు పోతాయో నాకు తెలియదు. సంగారెడ్డి అభివృద్ధిపై ఫోకస్ చేస్తూనే సినిమాపై దృష్టి పెడతా. మా ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఎక్కువ నిధులు సంగారెడ్డి తీసుకుపోయేందుకు ప్రయత్నం చేస్తా.. స్టేట్ పార్టీలో ఇప్పుడు నా అవసరం లేదు. ఉగాదికి నా సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. సంగారెడ్డికి చెందిన మొగిలయ్య 18 ఏళ్ల క్రితం రాసిన పాటను విడుదల చేస్తాం’’ అని జగ్గారెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment