silver screen
-
ఈ ఏడాదిలో 'జాతర' చూపించిన స్టార్స్
తెలుగు సినిమాల్లో జాతర ఎపిసోడ్స్ ప్రేక్షకులను థియేటర్స్‌కు వచ్చేలా ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది జాతర జోరు బాగా కనిపించింది. కొన్ని చిత్రాల్లో జాతర ఎపిసోడ్స్ కీలకంగా నిలవగా, కొన్ని చిత్రాలు జాతర నేపథ్యంలోనే సాగాయి. సినిమా హిట్‌కి జాతర ఓ కారణంగా నిలిచింది. ఇక 2024లో వెండితెరపై జాతర హైలైట్‌గా నిలిచిన తెలుగు చిత్రాల గురించి తెలుసుకుందాం.అల్లు అర్జున్ ‘పుష్ప: ది రూల్’ సినిమా ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగ రాస్తోంది. డిసెంబరు 5న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 1700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను మించిందని ఈ సినిమా మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా ఇంకా ప్రదర్శితమవుతోంది. దీంతో ‘పుష్ప: ది రూల్’ వసూళ్లు ఇంకాస్త పెరిగే అవకాశం ఉందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా ఈ సినిమా విజయానికి ఓ ముఖ్య కారణం జాతర ఎపిసోడ్ అన్నది కొందరి అభిప్రాయం.ఈ ఎపిసోడ్లో కొత్త గెటప్‌లో అల్లు అర్జున్ నటన, దర్శకుడు సుకుమార్ టేకింగ్, కొరియోగ్రాఫర్ విజయ్ నృత్యరీతులకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఈ జాతర ఎపిసోడ్ లుక్‌తోనే ఈ సినిమా క్లైమాక్స్‌లోనూ అల్లు అర్జున్ ఫైట్ ఉండటం విశేషం. ఈ ఎపిసోడ్‌ని దాదాపు మూడు నెలలు డిజైన్ చేసుకుని, నెల రోజుల పాటు, భారీ బడ్జెట్‌తో చిత్రీకరించారని తెలిసింది. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ స్వరకర్త. మరో సంగీత దర్శకుడు సామ్‌సీఎస్ ఈ జాతర ఎపిసోడ్‌కు ఆర్ఆర్ అందించారని తెలిసింది. ఇక ఎన్టీఆర్ టైటిల్ రోల్లో నటించిన ‘దేవర’లోనూ జాతర ఎపిసోడ్ హైలైట్ అయింది.కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీని రెండు భాగాలుగా ప్లాన్ చేశారు. ఎన్టీఆర్ తండ్రీ కొడుకుగా (తండ్రి దేవర, కొడుకు వర పాత్రల్లో ఎన్టీఆర్ నటించారు) నటించిన ఈ సినిమా తొలి భాగం ‘దేవర పార్టు 1’ సెప్టెంబరు 27న విడుదలైంది. ఈ సినిమాలో జాతర నేపథ్యంలో వచ్చే రెండు సన్నివేశాలు (ఒక సన్నివేశం దేవరతో, మరొక సీన్ వరతో) కథను మలుపు తిప్పుతాయి. ఇలా జాతర ఎపిసోడ్స్ ‘దేవర పార్టు 1’లో కీలకంగా కనిపిస్తాయి. అలాగే జాతర సమయంలో ‘వీరాధి వీరుల తిరునాళ్ల జరుపుకోవాల... రారా వీర’ అంటూ లిరిక్స్‌తో సాగే ‘ఆయుధ పూజ’ పాట కూడా ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది.‘దేవర’ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించారు. అలాగే ఈ ఏడాది వచ్చిన హిట్ మూవీస్‌లో ‘క’ చిత్రం ఒకటి. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ చిత్రంతో సుజీత్ – సందీప్ ద్వయం దర్శకులుగా పరిచయం అయ్యారు. ఈ చిత్రంలోని జాతర ఎపిసోడ్ కథకు కీలకంగా ఉంటుంది. అలాగే ‘ఆడు ఆడు ఆడు... అమ్మోరే మురిసేలా ఆడు’ అంటూ వచ్చే జాతర పాట ప్రేక్షకులను అలరించింది. ‘పుష్ప: ది రూల్’ సినిమా జాతర ఎపిసోడ్‌కు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన సంగీత దర్శకుడు సామ్ సీఎస్యే ‘క’ సినిమాకు స్వరకర్త. ఇలా జాతర ఎపిపోడ్స్‌తో కథ మలుపు తిరిగిన సినిమాలు కొన్నైతే, జాతర నేపథ్యంలోనే మరికొన్ని సినిమాలు తెలుగు తెరపైకి వచ్చాయి.యువ చంద్రకృష్ణ, అనన్య నాగళ్ల, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన పీరియాడికల్ ఫిల్మ్ ‘పొట్టేల్’ ఈ కోవలోకే వస్తుంది. తెలంగాణలోని ఓ ఊర్లో పుష్కరానికి ఒకసారి జరిగే జాతర నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. జాతర నేపథ్యమే కాకుండా చదువు ప్రాముఖ్యతను కూడా తెలిపేలా దర్శకుడు సాహిత్ మోత్ఖురి తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. అలాగే నూతన నటీనటులు సందీప్ సరోజ్, త్రినాథ్ వర్మ, ఈశ్వర్ రచిరాజు, పెండ్యాల యశ్వంత్ తదితరులు నటించిన ‘కమిటీ కుర్రోళ్ళు’ హిట్ ఫిల్మ్‌గా నిలిచింది.నూతన దర్శకుడు యదు వంశీ తెరకెక్కించిన ఈ సెమీ పీరియాడికల్ ఫిల్మ్ పురుషోత్తంపల్లి అనే గ్రామంలో జరిగే సంఘటనలు, రాజకీయాలు, స్నేహం నేపథ్యంలో ఉంటుంది. పన్నెండేళ్లకొకసారి పురుషోత్తంపల్లిలో జరిగే భరింకాళమ్మ తల్లి జాతర ఈ సినిమాకు కీలకంగా ఉంటుంది. ఈ జాతర ఎపిసోడ్ అలరించింది. ఇంకా ధ్రువ వాయు నటించి, దర్శకత్వం వహించిన ‘కళింగ’ సినిమాలో కూడా జాతర ప్రస్తావన, జాతర సాంగ్ ఉంటాయి. ఇలా జాతర టచ్‌తో ఈ ఏడాది వచ్చిన అన్ని సినిమాలూ ఆడియన్స్ మెప్పు పొందడం విశేషం. 2024తో ఈ జాతర ఆగడంలేదు... 2025లో రానున్న చిత్రాల్లో కొన్నింటిలో ‘జాతర’ సందడి కనిపించనుంది. – ముసిమి శివాంజనేయులు -
మిషన్ మేకోవర్
సినిమా కథకు తగ్గట్లుగా డైలాగ్స్, డ్యాన్స్, ఫైట్స్ చేయడమే కాదు... క్యారెక్టరైజేషన్‌కు సరిపోయేట్లు హీరోల ఆహార్యం కూడా ఉండాలి... గెటప్ కుదరాలి. అప్పుడే సిల్వర్ స్క్రీన్‌పై కథ ఆడియన్స్‌కు మరింత కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఇలా కనెక్ట్ కావడం కోసం కొందరు హీరోలు మేకోవర్ మిషన్‌ను స్టార్ట్ చేశారు. ఇప్పటికే ‘తండేల్’ కోసం నాగచైతన్య, ‘స్వయంభూ’కి నిఖిల్, ‘స్వాగ్’కి శ్రీవిష్ణు వంటి హీరోలు మేకోవర్ అయ్యారు. త్వరలో సెట్స్‌కి వెళ్లడానికి మిషన్ మేకోవర్ అంటూ రెడీ అవుతున్న హీరోల గురించి తెలుసుకుందాం.⇒ మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సిల్వర్ స్క్రీన్‌పై మహేశ్‌బాబును సరికొత్తగా చూపించాలని రాజమౌళి ఫిక్స్ అయిపోయారు. ఇందుకు తగ్గట్లుగానే మహేశ్ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. మేకోవర్ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది జనవరిలో మహేశ్ విదేశాలకు వెళ్లొచ్చారు. ఈ సినిమాలో మహేశ్ లుక్, గెటప్ కంప్లీట్ డిఫరెంట్‌గా ఉండేలా రాజమౌళి ప్లాన్ చేశారని తెలుస్తోంది.ఈ చిత్రకథను ఇప్పటికే పూర్తి చేశారు విజయేంద్రప్రసాద్. పాటల పని కూడా ఆరంభించారు సంగీతదర్శకుడు కీరవాణి. ఈ ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ చిత్రీకరణ ఈ ఏడాదిలోనేప్రారంభం కానుందనే టాక్ వినిపిస్తోంది. ఈ ఆగస్టు 9న మహేశ్‌బాబు బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమా చిత్రీకరణ గురించిన అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ సినిమాను రెండు భాగాలుగా తీయాలని అనుకుంటున్నారని ఫిల్మ్‌నగర్ భోగట్టా. కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు. ⇒ కొత్త సినిమా మేకోవర్ అంటే చాలు... ఎన్టీఆర్ రెడీ అనేస్తారు. ఈసారి దర్శకుడు ప్రశాంత్ నీల్‌కు ఎన్టీఆర్ ఓకే చెప్పారు. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణను ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభిస్తామని ఇటీవల మేకర్స్ వెల్లడించారు. అయితే ఈ గ్యాప్‌లో ఈ సినిమా కోసం మేకోవర్ అయ్యేలా ఎన్టీఆర్ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. వీలైనంత త్వరగా ఈ సినిమా తొలి భాగం షూట్‌ను పూర్తి చేసి, ‘డ్రాగన్’ మేకోవర్ మీద దృష్టి పెట్టాలనుకుంటున్నారట ఎన్టీఆర్. ఈ సినిమాలో హీరోయిన్గా రష్మికా మందన్నా, విలన్‌గా బాబీ డియోల్ల పేర్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ⇒ ‘గేమ్ చేంజర్’ సినిమా షూటింగ్‌తో రామ్‌చరణ్ ప్రస్తుతం బిజీ బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో తన వంతు షూటింగ్ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత రామ్‌చరణ్ ఆస్ట్రేలియా వెళ్తారు. హాలీడే కోసం కాదు.... బుచ్చిబాబు సన దర్శకత్వంలో హీరోగా నటించనున్న సినిమాలోని క్యారెక్టర్ మేకోవర్ కోసం వెళ్లనున్నారు. ఈ సినిమా చిత్రీకరణను ఆగస్టులోప్రారంభించనున్నట్లుగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు బుచ్చిబాబు. కాగా రూరల్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో సాగే ఈ మూవీలోని గెటప్స్ కోసం చరణ్ ప్రత్యేక్ష శిక్షణ తీసుకోనున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించనున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ⇒ విజయ్ దేవరకొండను ఇప్పటివరకు అర్బన్, సెమీ అర్బన్ కుర్రాడిగానే ఎక్కువగా సిల్వర్ స్క్రీన్‌పై చూశాం. కానీ తొలిసారి పక్కా పల్లెటూరి కుర్రాడిలా కనిపించేందుకు రెడీ అవుతున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో రూరల్ మాస్ డ్రామాగా ఓ మూవీ రానుంది. ఈ సినిమా కోసమే విజయ్ పల్లెటూరి మాస్ కుర్రాడిగా మేకోవర్ కానున్నారు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కాగానే తన కొత్త మేకోవర్ ఆరంభిస్తారట విజయ్. ⇒ అక్కినేని అఖిల్ హీరోగా నటించిన గత చిత్రం ‘ఏజెంట్’. ఈ స్పై మూవీ కోసం అఖిల్ స్పెషల్‌గా మేకోవర్ అయ్యారు. సిక్స్ ప్యాక్ బాడీని డెవలప్ చేశారు. ఈ సినిమా తర్వాత అఖిల్ నటించాల్సిన కొత్త సినిమా గురించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కానీ అఖిల్ అనే ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించనున్న ఫ్యాంటసీ అండ్ పీరియాడికల్ యాక్షన్ మూవీలో అఖిల్ హీరోగా నటిస్తారని, 11వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఓ ట్రైబల్ నాయకుడిగా అఖిల్ కనిపిస్తారనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ్రపోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.ఈ సినిమాలోని తన గెటప్ కోసమే అఖిల్ మేకోవర్ అవుతున్నారు. ఈ మధ్యకాలంలో కాస్త పోడవాటి జుట్టుతో, సరికొత్త ఫిజిక్‌తో అఖిల్ సరికొత్తగా కనిపించడం చర్చనీయాంశమైంది. ఈ మూవీ కోసమే అఖిల్ ఇలా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారట. దాదాపు రూ. వంద కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్, హోంబలే ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయనే ప్రచారం సాగుతోంది. ఈ హీరోలే కాదు... కథానుగుణంగా మేకోవర్ అవుతున్న హీరోలు మరికొందరు ఉన్నారు. -
ఇళయరాజా ముందు ధనుష్ భారీ డిమాండ్
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా జీవితం వెండితెరపైకి రానుంది. ధనుష్ లీడ్ రోల్లో నటిస్తున్న ‘ఇళయరాజా’ షూటింగ్ కార్యక్రమాన్ని కొద్దిరోజుల క్రితమే ప్రారంభించారు. ఈ మూవీకి అరుణ్మాథేశ్వరన్ దర్శకుడు. కనెక్ట్ మీడియా, పీకే ప్రైమ్ ప్రొడక్షన్, మెర్క్యూరీ మూవీస్ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. అయితే, ఈ సినిమాకు హీరో ధనుష్ భారీ రెమ్యునరేషన్ అందుకున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.ధనుష్ నటించిన 'కెప్టెన్ మిల్లర్' చిత్రం పట్ల భిన్న అభిప్రాయాలు వచ్చినప్పటికీ సినిమాపై మంచి టాక్ వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించినంతగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది.అయితే, ధనుష్ మాత్రం తన పారితోషికాన్ని తగ్గించకుండా మరింత పెంచాడని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా తర్వాత తెలుగులో డైరెక్ట్ సినిమా ఒకటి ఆయన తీస్తున్న విషయం తెలిసిందే. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో 'కుబేర' కోసం నాగార్జున, ధనుష్ కలిసి ఇందులో నటిస్తున్నారు. ఇదే వరుసలో రాయన్, ఇళయరాజా బయోపిక్ ఉంది. అయితే, ధనుష్ రెమ్యునరేషన్ భారీగా పెంచాడని తెలుస్తోంది. ఇళయరాజా సినిమా కోసం రూ. 50 కోట్ల రెమ్యునరేషన్ అడిగారని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతుంది. అయితే, సినిమా కోసం కేవలం 50 రోజులకు మించి కాల్షిట్స్ ఇవ్వలేనని కూడా ఆయన ముందే చెప్పారట. ధనుష్ పారితోషికం రోజుకు కోటి రూపాయలకు పెరిగిందని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా రజనీకాంత్, విజయ్, అజిత్ వంటి ప్రముఖ నటులు 100 కోట్ల రూపాయలకు పైగా పారితోషికం డిమాండ్ చేస్తున్నారు. అయితే వారు ఒక్కో సినిమాకు కనీసం 70 రోజులకు పైగా కేటాయిస్తారని టాక్ ఉంది. -
వెండితెర శ్రీరాముడిగా మెప్పించింది వీళ్లే (ఫొటోలు)
-
Tejaswini Gowda: సముద్రతీరాన ఏంజెల్లా తేజస్విని (ఫోటోలు)
-
Priyanka Jain HD Photos: తొలిసారి గ్లామర్ లుక్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ 'ప్రియాంక' (ఫోటోలు)
-
Ilaiyaraaja Biopic:వెండితెరకి ఇళయరాజా జీవితం
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా జీవితం వెండితెరపైకి వస్తోంది. ధనుష్ లీడ్ రోల్లో నటిస్తున్న ‘ఇళయరాజా’ చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ మూవీకి అరుణ్మాథేశ్వరన్ దర్శకుడు. కనెక్ట్ మీడియా, పీకే ప్రైమ్ ప్రొడక్షన్, మెర్క్యూరీ మూవీస్ సమర్పణలో రూ΄÷ందుతున్న ‘ఇళయరాజా’ షూటింగ్ బుధవారం చెన్నైలో ప్రారంభమైంది. ఈ వేడుకకి ఇళయరాజా, హీరోలు కమల్‌హాసన్, ధనుష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇళయరాజాతో తమకున్న అనుబంధాన్ని కమల్‌హాసన్, ధనుష్ పంచుకున్నారు. కాగా ఈ మూవీ ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు. తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కాగా ఈ మూవీకి ఇళయరాజా సంగీతం అందిస్తారని కోలీవుడ్ టాక్. -
ఊహా ప్రపంచాలు.. కొత్త కథలతో స్టార్ హీరోల ప్రయోగాలు
మంచి ఊహలు ఎప్పుడూ బాగుంటాయి. నేరుగా చూడలేని ప్రపంచాలను ఊహించుకున్నప్పుడు ఓ ఆనందం దక్కుతుంది. ఇక కొత్త ప్రపంచాలను సిల్వర్ స్క్రీన్‌పై చూసినప్పుడు కనువిందుగా ఉంటుంది. అలా ఊహా ప్రపంచం నేపథ్యంలోని కథలకు కొందరు స్టార్స్ ఊ అన్నారు. కొత్త ప్రపంచంలోకి ప్రేక్షకులను రా రమ్మంటున్న ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం... పది సెట్స్‌లో విశ్వంభర ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ (1990), ‘అంజి’ (2004) వంటివి చిరంజీవి కెరీర్‌లోని సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్స్. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ జానర్‌ను టచ్ చేశారు చిరంజీవి. ఈ కోవలో ‘విశ్వంభర’ అనే సినిమా చేస్తున్నారు. దర్శకుడిగా తొలి సినిమా ‘బింబిసార’ను సోషియో ఫ్యాంటసీ జానర్లో తీసిన వశిష్ఠ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమా మేజర్ షూటింగ్ అంతా ఓ కల్పిత ప్రాంతంలో జరుగుతుందట. చిత్రీకరణకు తగ్గట్లుగా పదికి పైగా సెట్స్ తయారు చేయిస్తున్నారట. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్‌లో జాయిన్ అవుతారట చిరంజీవి. ఈ చిత్రంలో హనుమంతుని భక్తుడు దొరబాబు పాత్రలో చిరంజీవి కనిపిస్తారని, త్రిష హీరోయిన్గా నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఓ చైల్డ్ ఎపిసోడ్ కూడా ఉంటుందట. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2025 సంక్రాంతికి విడుదల కానుంది. జనవరి 10న ఈ చిత్రం రిలీజ్ డేట్ అనే టాక్ ప్రచారంలోకి వచ్చింది. కల్కి లోకం భారతీయ ఇతిహాసాల ఆధారంగా సైంటిఫిక్ అంశాల మేళవింపుతో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ అండ్ ఫ్యూచరిస్ట్ ఫిల్మ్ ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమా కథలో ఇతిహాసాల ప్రస్తావన ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి కాబట్టి ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉంటాయని ఊహించవచ్చు. ఓ నాలుగు వందల సంవత్సరాల తర్వాత ఇండియా ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపిస్తాం అన్నట్లుగా ఈ చిత్రదర్శకుడు నాగ్ అశ్విన్ ఇటీవల సందర్భంలో పేర్కొన్నారు. ప్రభాస్ హీరోగా దీపికా పదుకోన్ హీరోయిన్గా రూపొందుతున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పటానీ కీ రోల్స్‌లో కనిపిస్తారు. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘సలార్’ తర్వాత హీరో ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ‘రావణం’ అనే మైథలాజికల్ ఫిల్మ్ రానుందని, ఈ సినిమాను ‘దిల్’ రాజు నిర్మిస్తారనే వార్తలు గతంలో వచ్చిన సంగతి తెలిసిందే. ఇది కూడా ఊహాజనిత ప్రపంచంలో జరిగే చిత్రం అని టాక్. ట్రాక్ మారింది ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల.. వైకుంఠపురములో’... హీరో అల్లు అర్జున్– దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఇవి. కమర్షియల్ అంశాలతో రూపొందిన ఈ సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ఈ మూడు సినిమాల తర్వాత అల్లు అర్జున్–త్రివిక్రమ్ కాంబినేషన్లో నాలుగో సినిమా గురించిన ప్రకటన వెల్లడైంది. కానీ ట్రాక్ మారింది. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లో ఈ చిత్రం ఉండదట. ఇది పూర్తి స్థాయి సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్ అని, మహాభారతం రిఫరెన్స్ ఈ సినిమాలో ఉంటుందనే టాక్ తెరపైకి వచ్చింది. అల్లు అరవింద్, సూర్యదేవర రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించనున్నారు. కాగా ఈ సినిమా ్రపారంభం కావడానికి కాస్త సమయం పట్టేలా ఉందని తెలిసింది. కంగువ ప్రపంచం ‘కంగువ’ టీజర్ చూస్తున్నప్పుడు ఏదో కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నట్లుగా ప్రేక్షకులకు అనిపిస్తుంటుంది. సూర్య హీరోగా నటించిన చిత్రం ఇది. పూర్తి స్థాయి ఫ్యాంటసీ ఫిల్మ్ కాకపోయినప్పటికీ ‘కంగువ’లో ఆడియన్స్ ఆశ్చర్యపోయే, అబ్బురపరచే విజువల్స్ చాలానే ఉన్నాయన్నది కోలీవుడ్ టాక్. కథ రీత్యా కాస్త సైంటిఫిక్ టచ్ ఉన్న ఈ సినిమాలో సూర్య పదికి పైగా గెటప్స్‌లో కనిపిస్తారని సమాచారం. దిశా పటానీ, బాబీ డియోల్, యోగిబాబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు శివ దర్శకుడు. కేఈ జ్ఞానవేల్ రాజాతో కలిసి ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించింది. రెండు భాగాలుగా ఈ సినిమా విడుదల కానుందట. తొలి భాగం ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది. కేరాఫ్ భైరవకోన గరుడ పురాణంలో మిస్ అయిన ఓ నాలుగు పేజీల కథే ‘భైరవకోన’ అట. మరి.. ఈ గరుడ పురాణం పూర్తి వివరాలు, ఈ నాలుగు పేజీల మిస్టరీ ఏంటో తెలుసుకోవాలంటే ఫిబ్రవరి 16న థియేటర్స్‌లో విడుదలయ్యే ‘ఊరు పేరు భైరవకోన’ సినిమా చూడాలి. సందీప్ కిషన్ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్ ఇది. అనిల్ సుంకర సమర్పణలో రాజేశ్ దండా నిర్మించిన ఈ చిత్రంలో వర్షా బొల్లమ్మ, కావ్యా థాపర్ హీరోయిన్లుగా నటించారు. అఘోరా శంకర్ యంగ్ హీరోల్లో ఒకరైన విశ్వక్ సేన్ చేస్తున్న తాజా చిత్రాల్లో ‘గామి’ ఒకటి. ఇందులో శంకర్ అనే అఘోరా పాత్రలో విశ్వక్ కనిపిస్తారు. కథ రీత్యా శంకర్‌కు మానవ స్పర్శ తెలియదు. కానీ ఆ స్పర్శను అనుభూతి చెందాలన్నది అతని ఆకాంక్ష. ఈ క్రమంలో ఏం జరగుతుంది? అనేదే ‘గామి’ కథ అట. ఈ సినిమాలో అఘోరా ట్రాక్ మాత్రమే కాకుండా మరో స్టోరీ ట్రాక్ కూడా ఉందని చిత్ర యూనిట్ చెబుతోంది. భారీ స్థాయిలో వీఎఫ్ఎక్స్ వర్క్స్ జరుగుతున్న ఈ చిత్రాన్ని దాదాపు నాలుగు సంవత్సరాలుగా తీస్తున్నారు. ఈ సినిమాలో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉంటాయని ఊహించవచ్చు. విద్యాధర కాగిత దర్శకత్వంలో కార్తీక్ శబరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జై హనుమాన్ ఈ సంక్రాంతికి ‘హను–మాన్’ సూపర్‌హిట్. అంజనాద్రి అనే ఊహాజనితప్రాంతం నేపథ్యంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తేజ సజ్జా హీరో. కె. నిరంజన్‌రెడ్డి నిర్మించారు. కాగా ‘హను–మాన్’ సినిమాకు సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ తీస్తున్నారు ప్రశాంత్ వర్మ. స్క్రిప్ట్ వర్క్ మొదలైంది. ‘జై హను–మాన్’ సినిమాలో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉండేట్లు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో నటించే నటీనటులపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. అఖిల్ నెక్ట్స్ సినిమా గురించిన ఓ వార్త అక్కినేని ఫ్యాన్స్‌లో ఆసక్తిని కలిగిస్తోంది. అఖిల్ హీరోగా యూవీ క్రియేషన్స్, హోంబలే ఫిలింస్ కలిసి ఓ సోషియో ఫ్యాంటసీ సినిమాను నిర్మించనున్నాయట. ప్రస్తుతం ప్రీప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని తెలిసింది. ఈ సినిమాతో అనిల్ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతారని భోగట్టా. ఈ మూవీపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇలా ఫ్యాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో మరికొన్ని సినిమాలు రానున్నాయి. -
Actress Sneha ‘సిల్వర్ స్క్రీన్’ అందాల నటి స్నేహ స్టైలిష్.. ఫొటోలు
-
వెండితెరపై కనిపించాలనేదే నా ఆశయం...
సాక్షి, పెద్దపల్లి: కొత్త సంవత్సరం–2024లో గతాన్ని త్యజించి కొంగొత్త ఆశలతో లక్ష్యాలు నిర్దేశించుకుని, వాటి సాధనకు ప్రయత్నిస్తాం. నూతన సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను నిరంతర సాధన, కఠోర శ్రమతో సాధిస్తామని జిల్లాలోని పలువురు ప్రముఖులు, యువతులు అంటున్నారు. వారి మనోగతం వారి మాటల్లోనే.. ఉద్యోగ సాధనే లక్ష్యం కొత్త సంవత్సరంలో ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నా. అందుకు అనుగుణంగా శక్తివంచన లేకుండా శ్రమిస్తున్న. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న. ఇప్పటికే కొన్ని పరీక్షలకు హాజరయ్యా. వాటి ఫలితాలు రావాల్సి ఉంది. కచ్చితంగా ఉద్యోగం సాధిస్తానని నమ్మకం ఉంది. – పుల్లూరి అరవింద్, అందుగులపల్లి వెండితెరపై కనిపించాలి 23 సంవత్సరంలోకి అడుగు పెట్టి ముందు తీసుకున్న నిర్ణయాలు దాదాపు అమలు చేశా. అందరూ మెచ్చుకునేలా నా అభినయంతో జనాల అభిమానం పొందాలనుకున్న. అనుకున్న దానికంటే అభిమానులకు ఎక్కువగా దగ్గరయ్యాను. 2024లో కచ్చితంగా వెండితెరపై కనిపించాలనేదే నా ఆశయం. – వర్శిణి, యూట్యూబ్ స్టార్, గోదావరిఖని అక్షరజ్ఞానం పెంచాలి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అర్హులకు ఫలాలు అందేలా చూడటం నా మెయిన్ జాబ్. ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్స్ ప్రమోట్ చేయాలనుకుంటున్న. యువతకు జాబ్స్ అండ్ కెరీర్‌పై అవగాహన కల్పించడం చాలా ఇంట్రెస్ట్. నేను టీచింగ్ ప్రొఫెషన్ నుంచి వచ్చా. మురికివాడల్లో ఉండే మహిళలు నిరక్షరాస్యులు. వారు కనీసం చదవడం, సంతకం చేయడం నేర్చుకునేలా చర్యలు తీసుకుంటా. – రజని, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ జాబ్ కొట్టడం లక్ష్యం గతేడాది ప్రభుత్వ నోటిఫికేషన్లు రాలేదు. సంవత్సరాలు గడుస్తున్నా నోటిఫికేషన్లు రావడంలేదు. ఈఏడాదైనా నోటిఫికేషన్లు విడుదలచేస్తే కచ్చితంగా జాజ్ కొట్టి జీవితంలో సెటిల్ అవ్వాలి. ఈ ఏడాదిలోనైనా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరగాలని కోరుకుంటున్నా. కొత్త ప్రభుత్వం నూతన సంవత్సరంలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు జారీచేస్తుందని నాతోపాటు నిరుద్యోగులు ఆశిస్తున్నారు. – పొరండ్ల అనిల్, నిరుద్యోగి, జూలపల్లి ప్రకృతి వైద్యం చేరువ చేస్తాం గతేడాది రేకుర్తి కంటి ఆస్పత్రి సాయంతో దాదాపు 100 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేశాం. ఉచితంగా అనేక వైద్య విబిరాలు నిర్వహించాం. ఈఏడాది ప్రకృతి వైద్య ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాం. మందులు, ఆపరేషన్ అవసరం లేకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాం. సింగరేణి కార్మికులు ఇలాంటి వ్యాధులతో బాధపడుతున్నారు. యాజమాన్యం అవకాశం ఇస్తే ప్రకృతి వైద్యం ద్వారా వారికి సేవలు అందిస్తాం. – శరణ్య, ప్రకృతి వైద్యనిపుణురాలు -
మురిసే మురిసే... తెర మెరిసే
2023 సిల్వర్ స్క్రీన్ మురిసేలా చేసింది. మరి.. పదికి పైగా కొత్త తారలు తెరపై మెరిస్తే మురిసిపోవడం సహజం కదా. తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళ్, హిందీ.. ఇలా పలు భాషలకు చెందిన కొత్తమ్మాయిలు ఈ ఏడాది తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆ కథానాయికల గురించి తెలుసుకుందాం. ► ‘ది సాఫ్ట్వేర్ డెవలప్పర్స్’ (2020) వెబ్ సిరీస్‌తో నటిగా కెరీర్‌ను డెవలప్ చేశారు యంగ్ బ్యూటీ వైష్ణవీ చైతన్య. అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురములో’, నాని ‘టక్ జగదీష్’, అజిత్ ‘వలిమై’ వంటి సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసే అవకాశాలు వచ్చినప్పుడు, అవి తన కెరీర్‌కు సపోర్ట్ చేస్తాయని నమ్మి, ఆ పాత్రల్లో నటించారు వైష్ణవి. ఆ నమ్మకమే ఆమెను హీరోయిన్ని చేసింది. లీడ్ హీరోయిన్గా ‘బేబీ’ సినిమా చేశారు వైష్ణవి. ఈ సినిమాలో ఎంత బాగా నటించారంటే.. ఇప్పుడు ‘బేబీ’ అంటే దాదాపు కుర్రకారు అంతా టక్కున వైష్ణవీ చైతన్య పేరునే గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఇక ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ ‘బేబీ’ సినిమాకు సాయి రాజేశ్ దర్శకత్వం వహించగా, ఎస్కేఎన్ నిర్మించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. వైష్ణవీ చైతన్య కెరీర్ కూడా బ్లాక్ బస్టర్ అనేలా మారింది. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ, ఆనంద్ దేవరకొండ హీరోలుగా నటిస్తున్న చిత్రాల్లో హీరోయిన్గా నటిస్తూ బిజీగా ఉన్నారీ సిల్వర్ స్క్రీన్ బేబీ. మామూలుగా తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావని అంటుంటారు. కానీ వరుస సినిమాలతో జోష్‌గా ఉన్నారు వైష్ణవీ చైతన్య. ► ఈ ఏడాది సూపర్ హిట్‌గా నిలిచిన తెలుగు సినిమాల్లో ‘సామజ వరగమన’ ఒకటి. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు మలయాళ బ్యూటీ రెబా మోనికా జాన్. సాయిధరమ్ తేజ్ ఓ హీరోగా నటించిన ‘బ్రో’ సినిమా లుక్ టెస్ట్‌కు వచ్చిన రెబా మోనికాకి ఆ అవకాశం దక్కలేదు. అదే టైమ్‌లో ‘సామజ వరగమన’ నిర్మాత రాజేశ్ దండాను కలవడం, ఆయన ద్వారా రెబాకి చిత్రదర్శకుడు రామ్ అబ్బరాజు కథ వినిపించడం, ఆమె ఓకే అనడం, ఈ సినిమా హిట్ కావడం అన్నీ చకా చకా జరిగిపోయాయి. నిజానికి ఈ సినిమాలో హీరోగా నటించిన శ్రీ విష్ణుతో అంతకు ముందే ఓ సినిమా చేయాల్సిందట రెబా. కానీ ఆ చాన్స్ చేజారినప్పటికీ ఫైనల్‌గా శ్రీవిష్ణు ‘సామజ వరగమన’ ద్వారానే టాలీవుడ్‌కి వచ్చారు రెబా. ► తెలుగు తెరపై ఈ ఏడాది మెరిసిన హరియాణా బ్యూటీ యుక్తీ తరేజ. ఢిల్లీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించారు. 2019లో సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్ పోటీల్లో పాల్గొని నాలుగో స్థానంలో నిలిచి, అందరి చూపూ తనవైపు తిప్పుకున్నారు యుక్తి. ఆ తర్వాత ఇమ్రాన్ హష్మితో కలిసి ఈ బ్యూటీ చేసిన ‘లుట్ గయే..’ సాంగ్ ఇంటర్నెట్లో సంచలనమైంది. అంతే.. వెండితెర అవకాశాలు వచ్చాయి. అలా ‘రంగబలి’ సినిమాతో తెలుగు తెరపై మెరిశారు యుక్తీ తరేజ. తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. నాగశౌర్య హీరోగా పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి ‘రంగ బలి’ చిత్రాన్ని నిర్మించారు. ► కేరళలో పుట్టి, తమిళనాడులో పెరిగిన అమ్మాయి ఐశ్వర్యా మీనన్. తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో పలు సినిమాలు చేసిన ఐశ్వర్య యాక్షన్ ఫిల్మ్ ‘స్పై’తో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఈ సినిమాలో చాలా బోల్డ్‌గా కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా చేశారు ఐశ్వర్యా మీనన్. ఈ చిత్రంలో నిఖిల్ హీరోగా నటించారు. రానా అతిథి పాత్ర చేశారు. ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో కె. రాజశేఖరరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ► రెండు చిత్రాలతో ఈ ఏడాది తెరపై మెరిశారు సాక్షీ వైద్య. ఈ ముంబై మోడల్ నాయికగా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన చిత్రం ‘ఏజెంట్’. అఖిల్ హీరోగా నటించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మించిన చిత్రం ఇది. అలాగే సాక్షీ వైద్య హీరోయిన్గా నటించిన మరో తెలుగు చిత్రం ‘గాంఢీవదారి అర్జున’ కూడా ఈ ఏడాదే రిలీజైంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు.వీరే కాదు.. కిరణ్ అబ్బవరం ‘మీటర్’ సినిమాతో తమిళ హీరోయిన్ అతుల్యా రవి, దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయమైన ‘అహింస’తో మధ్యప్రదేశ్ అమ్మాయి గీతికా తివారి, బెల్లంకొండ గణేశ్ ‘నేను స్టూడెంట్ సర్!’తో అలనాటి తార భాగ్య శ్రీ తనయ అవంతికలతో పాటు మరికొందరు హీరోయిన్లు ఈ ఏడాది తెలుగు తెరపై మెరిశారు. నూపుర్ సనన్ గాయత్రీ భరద్వాజ్ ► మ్యూజిక్ వీడియోల్లో అక్షయ్ కుమార్ సరసన నటించి, బాలీవుడ్‌ను ఆకట్టుకున్నారు నూపుర్ సనన్. అయితే హీరోయిన్గా తొలి సినిమాను మాత్రం తెలుగులో చేశారు. రవితేజ టైటిల్ రోల్ చేసిన ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంలో నూపుర్ సనన్ ఓ హీరోయిన్గా నటించారు. అలాగే ఈ చిత్రంలో మరో హీరోయిన్గా నటించిన ఢిల్లీ అమ్మాయి గాయత్రీ భరద్వాజ్‌కు సైతం తెలుగులో తొలి సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. అన్నట్లు మరో మాట.. మహేశ్‌బాబు, నాగచైతన్య, ప్రభాస్‌లతో సినిమాలు చేసిన హీరోయిన్ కృతీ సనన్ సోదరే నూపుర్ సనన్. ► బాల నటిగా, ఆ తర్వాత సహ నటిగా తమిళ, మలయాళం భాషల్లో సినిమాలు చేశారు అనిఖా సురేంద్రన్. గత ఏడాది విడుదలైన నాగార్జున ‘ది ఘెస్ట్’ చిత్రంలోనూ ఓ సపోర్టింగ్ రోల్ చేశారు. బాల నటిగా పేరు తెచ్చుకున్న అనిఖా హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైన సినిమా ‘బుట్టబోమ్మ’. అర్జున్ దాస్, సూర్య వశిష్ట ఇతర లీడ్ రోల్స్ చేశారు. మలయాళ హిట్ ఫిల్మ్ ‘కప్పెలా’కు తెలుగు రీమేక్‌గా రూపొందిన ఈ సినిమాకు చంద్రశేఖర్ టి. రమేశ్ దర్శకత్వం వహించగా, సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ► కన్నడ పరిశ్రమలో హీరోయిన్గా నిరూపించుకున్న ఆషికా రంగనాథ్ ‘అమిగోస్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఈ శాండిల్‌వుడ్ బ్యూటీ నటనకు ఆడియన్స్ ఓకే అన్నారు. ఆషికా కూడా తెలుగులో మరో అవకాశం తెచ్చుకోగలిగారు. ప్రస్తుతం నాగార్జున హీరోగా నటిస్తున్న ‘నా సామి రంగ’లో ఆషిక ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇక కల్యాణ్‌రామ్ హీరోగా రాజేందర్ రెడ్డి దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్∙‘అమిగోస్’ చిత్రాన్ని నిర్మించారు. ► బుల్లితెర నుంచి తమిళ వెండి తెరపై దర్శనమిచ్చి సక్సెస్ ట్రాక్‌లో కొనసాగుతున్న వారిలో ప్రియా భవానీ శంకర్ ఒకరు. తమిళంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న ఈ బ్యూటీ ‘కళ్యాణం కమనీయం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. సంతోష్ శోభన్ హీరోగా అనిల్ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ నిర్మించింది. జనవరిలో సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం విడుదలైంది. ఆ తర్వాత తెలుగులో ఒకట్రెండు సినిమాలు సైన్ చేశారు ప్రియా భవానీ శంకర్. -
ఇళయరాజా బయోపిక్‌లో ధనుష్
సంగీత జ్ఞాని ఇళయరాజా జీవితం వెండితెరపైకి రానుంది. ఇందులో ధనుష్ ఓ ప్రధాన పాత్రలో నటించనున్నారు. మెర్క్యూరీ గ్రూప్, కనెక్ట్ మీడియా సంస్థలు ఈ బయోపిక్‌ను నిర్మించనున్నాయి. వచ్చే ఏడాది అక్టోబరులో ఈ చిత్రం షూటింగ్ప్రారంభించి, 2025 ఏడాది మధ్యలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా మెర్క్యూరీ గ్రూప్ సీఈవో, ఎండీ శ్రీరామ్ భక్తి శరణ్ మాట్లాడుతూ –‘ప్రాంంతీయ కథలతో సినిమాలు తీస్తే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది. అందుకే లోకల్,ప్రాంతీయ కథలను అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘రాబోయే రెండు దశాబ్దాల్లో భారతీయ వినోద పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుంది. ప్రపంచ వినోద పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన మెర్క్యూరి సంస్థతో మెగా బడ్జెట్ సినిమాలను నిర్మించడానికి వారితో చేతులు కలపడం మాకు సంతోషంగా ఉంది’’ అని కనెక్ట్ మీడియా ప్రతినిధి వరుణ్ మాథుర్ అన్నారు. -
వెంకటేశ్ టు అల్లు అర్జున్.. ఈ ఏడాది ఒక్క సినిమా లేదు
ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్ కొందరు స్టార్స్‌ని మిస్సయింది. వెంకటేశ్, నాగార్జున, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్.. ఈ హీరోలు నటించిన చిత్రాలు 2023లో రిలీజ్ కాలేదు. ఈ స్టార్స్ వెండితెరపై కనిపించకపోవడం వారి అభిమానులను కాస్త నిరుత్సాహ పరిచే విషయం. మరి.. 2024లో ఈ స్టార్స్ ఏ చిత్రాలతో వెండితెరపై కనబడతారో తెలుసుకుందాం. ‘సైంధవ్’ రావాలి కానీ... ‘సైంధవ్’ రిలీజ్ ప్లాన్ మారడంతో ఈ ఏడాది తెలుగు తెరపై వెంకటేశ్ కనిపించే అవకాశం లేదు. వెంకటేశ్ కెరీర్లో రూపొందుతున్న 75వ సినిమా ‘సైంధవ్’. ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకుడు. నిజానికి ఈ చిత్రాన్ని డిసెంబరు 22న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అదే తేదీకి ప్రభాస్ ‘సలార్: సీజ్ ఫైర్’ చిత్రం రిలీజ్‌కు సిద్ధం కావడంతో ‘సైంధవ్’ రిలీజ్ జనవరి 13కు వాయిదా పడింది. ఇలా ఊహించని విధంగా వెంకటేశ్ ఈ ఏడాది తెలుగు తెరకు దూరంగా కావాల్సిన పరిస్థితి. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా హీరోయిన్లుగా, చైల్డ్ ఆర్టిస్ట్ సారా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ ఏడాది మార్చి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ మీడియాలో, సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ చిత్రంతో హిందీ తెరపై వెంకీ కనిపించడం ఈ స్టార్ ఫ్యాన్స్‌ను కాస్త ఆనందపరిచే విషయం. నా సామి రంగ.. వచ్చే ఏడాదే గత రెండేళ్లలో మూడు సినిమాలతో (2021లో ‘వైల్డ్ డాగ్’, 2022లో ‘బంగార్రాజు’, ‘ది ఘోస్ట్’) సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేసిన నాగార్జున ఈ ఏడాది మాత్రం గ్యాప్ ఇచ్చారు. నాగార్జున తాజా చిత్రం ‘నా సామి రంగ’ వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరిలో విడుదల కానుంది. సో.. ఈ ఏడాది అక్కినేని ఫ్యాన్స్‌కు నాగార్జున సిల్వర్ స్క్రీన్‌పై కనిపించరు. వచ్చే ఏడాది ఆరంభంలో నాగ్ స్టైల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ‘నా సామి రంగ’ రూపంలో ఉంటుందని చిత్ర యూనిట్ పేర్కొంది. విజయ్ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. వేసవి నుంచి సంక్రాంతికి.. ‘సర్కారువారి పాట’తో గత ఏడాది సూపర్ హిట్ అందుకున్నారు మహేశ్‌బాబు. అన్నీ సజావుగా సాగినట్లయితే ఈ ఏడాది కూడా వెండితెరపై మహేశ్‌బాబు సందడి ఉండేది. మహేశ్‌బాబు హీరోగా చేస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’ను ఈ ఏడాది వేసవిలోనే రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే వచ్చే ఏడాది జనవరి 12కి వాయిదా వేశారు. ఇలా మహేశ్ ఈ ఏడాది థియేటర్స్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో శ్రీలీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా ఈ చిత్రాన్ని సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. 2024 నుంచి నో గ్యాప్ 2018లో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం తర్వాత ఎన్టీఆర్ మళ్లీ స్క్రీన్‌పై కనిపించింది ‘ఆర్ఆర్ఆర్’ (2022) సినిమాలోనే. ఆ సినిమా కమిట్మెంట్ కారణంగా 2019, 2020, 2021లో ఎన్టీఆర్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించలేదు. ఇక 2023 నుంచి అయినా ఎన్టీఆర్ సినిమాలు వరుసగా విడుదలవుతాయనుకున్న ఆయన ఫ్యాన్స్ మరికొంత సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే... ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా యాక్షన్ ఫిల్మ్ ‘దేవర’ తొలి భాగాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సో.. ఈ ఏడాది ఎన్టీఆర్ స్క్రీన్‌పై కనపడరు. ‘దేవర’ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతోంది. ఇక ఎన్టీఆర్ ఓ లీడ్ రోల్లో నటించనున్న ‘వార్ 2’ (ఇందులో హృతిక్ రోషన్ మరో హీరో), ‘దేవర’ రెండు భాగాలు, ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మూవీ.. ఇలా వరుస సినిమాలతో ఈ స్టార్ 2024 నుంచి గ్యాప్ లేకుండా సిల్వర్ స్క్రీన్‌పై కనిపించే అవకాశం ఉంది. లేట్‌గా డ్యూటీ ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్న చిత్రం ‘గేమ్ చేంజర్’. శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తు న్నారు. ఈ ఏడాదిలోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని యూనిట్ ప్లాన్ చేసినా వీలుపడలేదు. వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ చిత్రంలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని, సామాజిక అంశాలకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి శంకర్ తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఇందులో కియారా అద్వానీ నాయిక. మరోవైపు ఈ ఏడాదే విడుదలైన సల్మాన్ ఖాన్ హిందీ చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’లోని ఓ పాటలో రామ్‌చరణ్ ఓ గెస్ట్ రోల్ చేశారు. ఇది చరణ్ ఫ్యాన్స్‌కు కాస్త ఊరట కలిగించింది. రెండేళ్ల తర్వాతే పుష్ప రూల్ ‘పుష్ప’ చిత్రంలోని తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ ఎంతటి ఘనవిజయాన్ని నమోదు చేసుకుందో తెలిసిందే. 2021లో విడుదలైన ఈ సినిమా అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డును కూడా తెచ్చిపెట్టింది. దీంతో ‘పుష్ప’ మలి భాగం ‘పుష్ప: ది రూల్’ పై అంచనాలు ఏర్పడ్డాయి. అయితే మేకర్స్ ప్లాన్ చేసినట్లుగా మలి భాగం 2023లో విడుదల కాలేదు. క్యాస్టింగ్, కథ విషయాల్లో ఈ సినిమా స్పాన్ మరింత పెరగడం, చిత్రీకరణ వాయిదా పడుతుండటంతో 2024 ఆగస్టు 15న ‘పుష్ప: ది రూల్’ను రిలీజ్ చేస్తామని యూనిట్ ప్రకటించింది. సో.. ఈ ఏడాది కూడా అల్లు అర్జున్ థియేటర్స్‌లో కనిపించరు. సుకుమార్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. జగపతిబాబు, సునీల్, అనసూయ, ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రధారులు.ఇలా మరికొందరు స్టార్స్‌ని 2023 సిల్వర్ స్క్రీన్ మిస్సయ్యింది. -
ప్రభాస్‌తో ఎప్పటికీ అలానే ఉంటాను: అనుష్క
ఐదేళ్ల తర్వాత అనుష్క వెండితెరపై కనిపించనున్నారు. ‘ఇక కెరీర్లో ఇంత లాంగ్ గ్యాప్ ఎప్పుడూ తీసుకోను’ అంటున్నారామె. మహేశ్‌బాబు పి. దర్శకత్వంలో అనుష్కా శెట్టి, నవీన్ పొలిశెట్టి ముఖ్య తారలుగా యూవీ క్రియేషన్స్ పై వంశీ, ప్రమోద్ నిర్మించిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. రేపు (సెప్టెంబర్ 7) ఈ చిత్రం విడుదల కానుంది. ‘భాగమతి’ (2018) తర్వాత అనుష్క సిల్వర్ స్క్రీన్‌పై కనిపించనున్న చిత్రం ఇది. ఇక ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అనుష్క చెప్పిన విశేషాలు తెలుసుకుందాం. ‘మిస్ శెట్టి..’లో చేసిన షెఫ్ అన్విత క్యారెక్టర్ గురించి... షెఫ్ క్యారెక్టర్ చేయడం నాకు ఇదే తొలిసారి. ఇది నా బెస్ట్ మూవీలా ఫీలవుతున్నాను. ఎందుకంటే ఐదున్నరేళ్ల థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఒక కొత్త పాత్ర, సరికొత్త కథాంశం ఉన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. ఈ చిత్రంలో మంచి భావోద్వేగాలు ఉన్నాయి. ట్రైలర్లో కామెడీ, ఎమోషన్ కనిపించాయి. మీరీ సినిమా ఒప్పుకోవడానికి కారణం ఇవేనా? నేను కథకి ప్రాధాన్యత ఇస్తాను. నాకు, నిర్మాతలకు వినయ్‌గారు అని కామన్ ఫ్రెండ్ ఉన్నారు. మహేశ్ వద్ద ఒక స్టోరీ ఉంది వింటారా? అని అడిగారు.. అయితే సినిమా చేయమని కాదు. మహేశ్‌గారు కథ చెప్పాక అన్విత పాత్ర ఎవరు చేస్తున్నారు? అని అడిగాను. ఇంకా ఎవర్నీ అనుకోలేదని తను చెప్పగానే నేను చేస్తానన్నాను. మహేశ్ ఓ మంచి కథని కొత్తగా, క్లీన్ వేలో చూపించారు. క్లీన్ వే అన్నారు. ట్రైలర్లో ‘తల్లవ్వాలంటే గర్భవతి కావాలి కానీ పెళ్లక్కర్లేదు’ అనే డైలాగ్ చెప్పారు.. అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందనేది సినిమా చూస్తే అర్థం అవుతుంది. ట్రైలర్ అన్నది జస్ట్ గ్లింప్స్ మాత్రమే. లైఫ్‌లో ఎలా ఉంటాం? మన మైండ్ ఎలా మాట్లాడుతుంది? అనేది చెప్పాం. మైండ్‌లో ఉన్నదాన్ని బయటకు చెబితే సమాజం ఒప్పుకోదు కదా? మన మైండ్ చాలా విషయాలు చెబుతుంది. కానీ, వాటిలోని సున్నితత్వాన్ని మనం అర్థం చేసుకొని మాట్లాడాలి. నా ఇష్టం వచ్చినది నేను చెబుతాను.. దాన్ని అర్థం చేసుకోకుంటే మీ సమస్య అనను. మనం ఏం చెప్పాలనుకుంటున్నామో దాన్ని సరైన విధానంలో చెప్పాలి. అంతేకానీ, ఎదుటి వారు హర్ట్ అయ్యేలా చెప్పడం సరికాదని నమ్ముతాను. మన మైండ్‌లో ఉన్నదాన్ని చెప్పే పద్ధతిలో చెప్పాలి. 18 ఏళ్ల కెరీర్లో నటిగా మీ గ్రాఫ్ పెరిగింది. వ్యక్తిగతంగానూ పెద్దంత వివాదాలు లేకుండా సాగిన ఇన్నేళ్ల ప్రయాణాన్ని విశ్లేషించుకుంటే.. యాక్చువల్లీ నేను కాంట్రవర్శీలను హ్యాండిల్ చేయలేను. ఎందుకంటే నేను చాలా సెన్సిటివ్. ఇలా నాలా సెన్సిటివ్‌గా ఉండేవాళ్లకు వేరేవాళ్ల ఎమోషన్స్ అర్థమవుతాయి. దాంతో హర్ట్ అయ్యేలా మాట్లాడలేం. నాకు ఇండస్ట్రీ, ప్రేక్షకుల నుంచి బోలెడంత ప్రేమ, గౌరవం దక్కాయి. అందుకే పెద్దగా వివాదాలు కూడా లేవు. అరుంధతి, దేవసేన (బాహుబలి), భాగమతి.. ఇలాంటి రేర్ క్యారెక్టర్స్ దక్కడం మీకో బ్లెస్సింగ్ అనొచ్చా.. కచ్చితంగా.. మనకి హార్డ్‌వర్క్ చేయాలని ఉన్నా రైట్ చాన్స్ కూడా రావాలంటాను. శ్యామ్‌గారు, కోడి రామకృష్ణగారు నన్ను ‘అరుంధతి’గా విజువలైజ్ చేసి, నమ్మి తీసుకున్నారు. దర్శక–నిర్మాతలు నన్ను నమ్మారు కాబట్టి నాకు హార్డ్ వర్క్ చేయడానికి చాన్స్ దొరికింది. నిరూపించుకునే స్కోప్ దక్కింది. ఈ మధ్య మీలో భక్తి భావం ఎక్కువయినట్టుంది.. పూజలు చేస్తున్నారు... ఆలయాలు సందర్శిస్తున్నారు.. ఇప్పుడనే కాదు.. నా చిన్నప్పటి నుంచి కూడా మా కుటుంబంలో గుడికి వెళ్లడం ఒక భాగం. ప్రతి సోమవారం, శుక్రవారం పూజలు చేస్తుంటాం. అయితే కంటిన్యూస్‌గా సినిమాలు చేయడంవల్ల ఆ మధ్య గుడికి వెళ్లడానికి కుదరలేదు. ఈ మధ్య వచ్చిన లాంగ్ గ్యాప్‌లో వెళ్లడానికి కుదిరింది. పెళ్లి కాని అమ్మాయిలు పూజలు చేస్తే.. పెళ్లి కోసమే అనే చర్చ జరుగుతుంటుంది... మీ గురించి కూడా అలాంటి ఒక చర్చ ఉంది.. ఇప్పుడనే కాదు.. నేను గుడికి వెళ్లిన ప్రతిసారీ ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంది. ఒక మంచి విషయం ఏంటంటే.. నా కూతురి గురించి అందరూ ఇంత కేర్ తీసుకుంటారని మా అమ్మానాన్న ఆనందపడతారు (నవ్వుతూ). మరి.. పెళ్లి కబురు ఎప్పుడు చెబుతారు? ఇప్పుడు ప్లాన్స్ లేవు. పెళ్లనేది మంచి విషయం కాబట్టి కుదిరినప్పుడు హ్యాపీగా షేర్ చేసుకుంటా. మీ కో–స్టార్స్‌కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చినప్పుడు మీకు సంతోషం అనిపించడం సహజం... అలా పాన్ ఇండియా స్థాయి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ గురించి... ప్రభాస్‌గారు నాకు 2005 నుంచే తెలుసు. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు ఈ స్థాయి గుర్తింపు వచ్చాక కూడా ప్రభాస్‌గారు అలానే ఉన్నారు. ఏ మార్పూ లేదు. తను నాకు ‘వెరీ వెరీ డియర్ ఫ్రెండ్’. అది ఎప్పటికీ అలానే ఉంటుంది. అలాగే రాజమౌళిగారి ఫ్యామిలీ కూడా నాకు క్లోజ్. భైరవ (కాలభైరవ)ని తన చిన్నప్పట్నుంచి చూస్తున్నాను. తనకు మంచి (‘కొమురం భీముడో..’కి సింగర్‌గా నేషనల్ అవార్డు వచ్చిన విషయాన్ని ఉద్దేశించి) గుర్తింపు రావడం హ్యాపీగా ఉంది. మనకు క్లోజ్‌గా ఉన్నవాళ్లు ఎదుగుతుంటే చూడ్డానికి చాలా ఆనందంగా ఉంటుంది. -
హీరోయిన్లా మజాకా.. యాక్షన్ తగ్గేదే లే!
ఒకరు తుపాకీ పట్టుకున్నారు.. ఇంకొకరు ఫ్లయిట్ ఎక్కారు... ఫైట్ చేయడానికి రెడీ అయ్యారు. ‘యాక్షన్‌కి సై’ అంటూ బరిలోకి దిగారు. ప్రత్యర్థులను రఫ్ఫాడారు. సుకుమారంగా కనిపించే కథానాయికలు రఫ్‌గా మారిపోయి, విలన్లను ఇరగదీశారు. సమంత, త్రిష, కీర్తీ సురేశ్, దీపికా పదుకోన్, కత్రినా కైఫ్, ఆలియా భట్, కృతీ సనన్ వంటి నాయికలు సినిమాల్లో, వెబ్ సిరీస్‌ల్లో యాక్షన్ రోల్స్ చేస్తున్నారు. ఆ విశేషాలు తెలుసుకుందాం. పవర్ఫుల్ రీటా ఓ వైపు హీరోయిన్గా అగ్రహీరోల సరసన నటిస్తూనే మరోవైపు కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలతో మెప్పిస్తున్నారు కీర్తీ సురేశ్. ప్రస్తుతం ఆమె లీడ్ రోల్లో నటిస్తున్న తమిళ చిత్రం ‘రివాల్వర్ రీటా’. చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ, థ్రిల్, యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో కీర్తీ సురేశ్ యాక్షన్ సీన్స్ చేస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌లో రెండు చేతుల్లో రెండు రివాల్వర్స్ పట్టుకుని ఉన్న కీర్తి పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా తెలుగులోనూ విడుదలకానుంది. కాగా ‘సైరన్, రఘు తాత, కన్ని వెడి’ వంటి చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు కీర్తీ సురేశ్. వీటిలో ‘కన్ని వెడి’ లేడీ ఓరియంటెడ్ మూవీ. ‘రఘు తాత’ కూడా దాదాపు ఇలాంటి సినిమానే. ఇక చిరంజీవి చెల్లెలిగా కీర్తి నటించిన ‘భోళా శంకర్’ ఈ 11న విడుదల కానున్న విషయం తెలిసిందే. బాలీ టు హాలీవుడ్ బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ ఈ మధ్య ఎక్కువగా యాక్షన్ సినిమాలకు పచ్చజెండా ఊపుతున్నారు. ఈ ఏడాది జనవరిలో విడుదలైన షారుక్ ఖాన్ ‘పఠాన్’ మూవీలో యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టిన దీపిక ప్రస్తుతం ‘ఫైటర్’, ‘సింగం 3’ వంటి చిత్రాల్లో యాక్షన్ రోల్స్‌కి సై అన్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ‘ఫైటర్’ కోసం ప్రత్యేకంగా స్టంట్స్‌లో శిక్షణ తీసుకున్నారు దీపిక. అలాగే ‘సింగం’ ఫ్రాంచైజీలో భాగంగా ‘సింగం 3’ రూపొందనుంది. ‘సింగం’, ‘సింగం 2’ చిత్రాలు తెరకెక్కించిన రోహిత్ శెట్టి దర్శకత్వంలోనే ‘సింగం 3’ తెరకెక్కనుంది. ఈ మూడో భాగం హీరోయిన్ ఓరియంటెడ్‌గా సాగనుందట. ఇందులో దీపికా పవర్ఫుల్ పోలీస్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. అలాగే ఓ హాలీవుడ్ మూవీలో ఏజెంట్‌గా కనిపించనున్నారట దీపిక. ఈ చిత్రంలోనూ ఆమె యాక్షన్ సీన్స్ చేయనున్నారని భోగట్టా. ఇలా బాలీవుడ్ టు హాలీవుడ్ యాక్షన్ రోల్స్ సైన్ చేసి జోరుగా దూçసుకెళుతున్నారు దీపికా పదుకోన్. టైగర్‌తో యాక్షన్ సల్మాన్ ఖాన్‌కి సమానంగా కాకపోయినా తనదైన శైలిలో ఫైట్స్ చేశారు కత్రినా కైఫ్. ‘టైగర్’ ఫ్రాంచైజీలో భాగంగా సల్మాన్ ఖాన్ టైటిల్ రోల్లో దర్శకుడు మనీష్ శర్మ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘టైగర్ 3’. ఇందులో కత్రినా కైఫ్ హీరోయిన్. హీరో హీరోయిన్లు ఇద్దరూ గూఢ చారుల పాత్రల్లో నటిస్తున్నారట. ఐఎస్ఐ ఏజెంట్ జోయా పాత్రలో కత్రినా కనిపించనున్నారని సమాచారం. ఈ హై ఓల్టేజ్ యాక్షన్ మూవీలో జోయాగా కత్రినా చేసిన ఫైట్స్ హైలైట్‌గా ఉంటాయని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ఈ ఫైట్స్ కోసం ప్రత్యేకించి సౌత్ కొరియాకు చెందిన స్టంట్ మాస్టర్ల దగ్గర 14 రోజులు శిక్షణ తీసుకున్నారట కత్రినా. ఈ చిత్రం నవంబర్ 10న రిలీజ్ కానుంది. యుద్ధ విమానం ఎక్కి.. దాదాపు లేడీ ఓరియంటెండ్ సినిమాలకే పరిమితమయ్యారు కంగనా రనౌత్. సర్వేష్ మేవారా దర్శకత్వంలో ఆమె లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘తేజస్’. ఈ చిత్రంలో ఆమె యుద్ధ విమానాలు నడిపే పైలెట్ పాత్ర చేశారు. కంప్లీట్ యాక్షన్ ఓరియంటెడ్‌గా రూపొందిన ఈ చిత్రం కోసం పలు యుద్ధ విద్యలు కూడా నేర్చుకున్నారు కంగన. ఇందుకోసం దాదాపు నాలుగు నెలల పాటు ఆమె శిక్షణ తీసుకున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంచితే.. కంగనా రనౌత్ లీడ్ రోల్లో నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో ‘ఎమర్జెన్సీ’ చిత్రం నిర్మించారు. భారత ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో ఎమర్జెన్సీ (1975–1977) ఎందుకు విధించారు? ఆ పరిస్థితి ఎందుకు ఏర్పడింది? అనే అంశంతో ‘ఎమర్జెన్సీ’ని తెరకెక్కించారు. ఇందిరా గాంధీగా కంగన నటించిన ఈ చిత్రం నవంబరు 24న విడుదల కానుంది. అలాగే పి. వాసు దర్శకత్వంలో లారెన్స్ హీరోగా కంగన టైటిల్ రోల్లో రూపొందిన ‘చంద్రముఖి 2’ సెప్టెంబరు 19న విడుదల కానుంది. హాలీవుడ్లో యాక్షన్ అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరోయిన్ ఆలియా భట్ కూడా యాక్షన్‌కి సై అన్నారు. టామ్ హార్పర్ దర్శకత్వం వహించిన హాలీవుడ్ చిత్రం ‘హార్ట్ ఆఫ్ స్టోన్’లో ఆలియా కీలక పాత్ర చేశారు. స్పై యాక్షన్ మూవీగా రూపొందిన ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు ఆలియా భట్. ఈ నెల 11న ఈ సినిమా విడుదల కానుంది. బైక్‌పై దూసుకెళుతూ... ఇటీవల విడుదలైన ‘ఆది పురుష్’లో సుకుమారి సీతగా కనిపించిన కృతీ సనన్ ఇప్పుడు అందుకు పూర్తి విభిన్నంగా రూడ్‌గా మారిపోయారు. వికాస్ బాల్ దర్శకత్వం వహించిన ‘గణ్పథ్: పార్ట్ 1’లో ఆమె పవర్ఫుల్ రోల్ చేశారు. ఈ సినిమా కోసం కృతి అద్భుతమైన బైక్ స్టంట్స్ చేశారు. ఇందుకోసం బైక్ స్టంట్స్ నేర్చుకున్నారామె. అమితాబ్ బచ్చన్, టైగర్ ష్రాఫ్ నటించిన ఈ చిత్రం అక్టోబర్ 20న విడుదల కానుంది. ఇంతేనా.. ఇంకొందరు కథానాయికలు యాక్షన్ రోల్స్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, తామేంటో నిరూపించుకోవడానికి రెడీ అవుతున్నారు. వెబ్‌లో యాక్షన్ కొందరు కథానాయికలు వెండితెరపై యాక్షన్ రోల్స్ చేస్తుంటే త్రిష, సమంత వంటి తారలు వెబ్ సిరీస్‌లో ఈ తరహా పాత్రలు చేస్తున్నారు. రెండు దశాబ్దాల కెరీర్లో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలను పోషించిన త్రిష తొలిసారి ‘బృందా’ అనే వెబ్ సిరీస్‌లో నటించారు. సూర్య వంగల్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్‌లో త్రిష ఓ పవర్ పోలీసాఫీసర్ పాత్ర చేశారు. త్రిషలోని మాస్ ఇమేజ్‌ని బలంగా చూపించే పాత్ర ఇది. త్వరలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు ఆ మధ్య వరుసగా హీరోల సరసన నటించిన సమంత ఇటీవల లేడీ ఓరియంటెడ్ చిత్రాలు ఎక్కువగా చేస్తున్నారు. ఈ బ్యూటీ నటించిన తొలి వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మేన్ 2’. దర్శక ద్వయం రాజ్–డీకే తెరకెక్కించిన ఈ సిరీస్‌లో సమంత యాక్షన్ రోల్లో అదరగొట్టారు. ప్రస్తుతం సమంతతోనే ఈ దర్శక–ద్వయం ‘సిటాడెల్’ అనే మరో వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు. ప్రియాంకా చో్రపా నటించిన అమెరికన్ సైన్స్ ఫిక్షన్ హిట్ డ్రామా ‘సిటాడెల్’ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. గూఢచారి సాహసాల నేపథ్యంలో పూర్తి స్థాయి యాక్షన్ సిరీస్‌గా రూపొందుతోంది. ఇందులో సమంత యాక్షన్ సీన్స్‌లో అలరించనున్నారు. సెప్టెంబర్ నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. -
రజనీ సినిమాలో నాని?
సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో నాని సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. రజనీకాంత్ హీరోగా ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. లైకా,ప్రోడక్షన్స్పై సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటించనున్నారని ప్రచారం జరిగింది. తాజాగా హీరో నాని పేరు తెరపైకి వచ్చింది. కథ రీత్యా ఈ సినిమాలోని ఓ కీలక పాత్రకు నానీని చిత్ర యూనిట్ సంప్రదించిందని కోలీవుడ్ టాక్. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సో.. ఈ సినిమాకి నానీని అడిగారా? లేదా అనేది త్వరలో తెలిసిపోతుంది. -
సైన్స్‌ఫిక్షన్ సినిమాలు చేస్తున్న స్టార్స్!
ప్రయోగం, పరిశోధన, భవిష్యత్ కాల ప్రయాణం, మరమనిషి, ఇలా సైంటిఫిక్ ఎలిమెంట్స్‌తో ముడిపడిపోయారు కొందరు నటీనటులు. సైన్స్‌ఫిక్షన్ చిత్రాలకు సై అంటూ సైన్ చేశారు. ఈ స్టార్స్ చేస్తున్న వెండితెర సైన్స్ ప్రాజెక్ట్ వివరాలు తెలుసుకుందాం.. 28వ శతాబ్దంలో... ఉన్నట్లుండి కొన్ని వందల సంవత్సరాలు ముందుకు వెళితే ఎలా ఉంటుంది? అసలు.. 28వ శతాబ్దంలో ప్రపంచం ఎలా ఉంటుంది? అనే ఓ ఊహాత్మక కథ వెండితెరపైకి వస్తే అదే ‘కల్కి 2898 ఏడీ’ చిత్రమట. ప్రభాస్, కమల్‌హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ అండ్ టైమ్ ట్రావెల్ ఫిల్మ్ ‘కల్కి 2898 ఏడీ’. ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 18వ శతాబ్దంలో మొదలై 28వ శతాబ్దంలోకి ఈ కథ వెళ్తుందని ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపి స్తోంది. ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజయ్యే చాన్స్ ఉందని టాక్. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. చారిత్రాత్మక కంగువా ఇటీవల విడుదలైన ‘కంగువా’ సినిమా వీడియో గ్లింప్స్‌ను బట్టి ఇది పూర్తి చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమా అనేది కొందరి ఊహ. కానీ చారిత్రాత్మక భాగం కొంతవరకే ఉంటుందని, ఎక్కువ శాతం సమకాలీన కాలంలోనే జరుగుతుందని తెలిసింది. అలాగే కొంత భాగం 18వ శతాబ్దంలో ఉంటుందని, పరాక్రమవంతుడైన ఓ యోధుడు అంతు చిక్కని వ్యాధితో మరణించి, అతనే మళ్లీ జన్మించి, గత జన్మలో తాను ఎలా మరణించాడో తెలుసుకునే అంశాల సమాహారంగా సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్‌తో ‘కంగువా’ కథనం ఉంటుందని భోగట్టా. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో దిశా పటానీ హీరోయిన్. కాగా ‘కంగువా’ సినిమాలోని తొలి భాగం 2024 ఏప్రిల్ 12న విడుదల కానున్నట్లు సమాచారం. ఫిక్షనల్ గ్యాంగ్‌స్టర్ సాధారణంగా సైన్స్ ఫిక్షన్ సినిమాలంటే.. విభిన్నమైన పేర్లతో ఆపరేషన్స్ చేయడం, పరిశోధనలు, ఆవిష్కరణలు వంటి అంశాలు మిళితమై ఉంటాయి. కానీ గ్యాంగ్‌స్టర్ యాక్షన్‌కు సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ అంశాలను జోడించి ఓ కొత్త ప్రయత్నం చేశారు అధిక్ రవిచంద్రన్. విశాల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మార్క్ ఆంటోనీ’ టైమ్‌ట్రావెల్ బేస్డ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా రూపొందింది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో విశాల్ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తారు. విశాల్‌కు జోడీగా రీతూ వర్మ నటించిన ఈ చిత్రం సెప్టెంబరు 15న రిలీజ్ కానుంది. ఓ గ్రహాంతరవాసి కథ ఓ గ్రహాంతరవాసి భూగ్రహంపై నివాసం ఉండాల్సి వస్తే ఏం జరుగుతుంది? అనే అంశం నేపథ్యంలో బాలీవుడ్లో గతంలో హృతిక్ రోషన్ ‘కోయీ.. మిల్ గయా’, ఆమిర్ ఖాన్ ‘పీకే’ వంటి సినిమాలు వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. కాస్త అటూ ఇటూగా ఈ చిత్రాల తరహాలోనే తమిళ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘అయలాన్’ ఉంటుందట. శివ కార్తికేయన్ హీరోగా ఆర్. రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్. ఈ సినిమాలో ఓ ఏలియన్ పాత్ర ఉన్నట్లు పోస్టర్స్ స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది దీపావళికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇండియాలో ఏలియన్స్ ఉంటే.. ఇండియాలో ఏలియన్స్ నివాసం ఏర్పాటు చేసుకోవాలను కుంటే ఏం జరుగుతుంది? అనే పాయింట్‌తో తమిళ చిత్రం ‘ఏలియన్’ రూపొందుతోందట. తాప్సీ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఇది. భరత్ నీలకంఠన్ దర్శకత్వం వహిస్తున్నారని తెలిసింది. ఆల్రెడీ షూటింగ్ జరుగుతోంది. రోబోలుగా హీరోయిన్లు ఓ మనిషిని రోబో ప్రేమిస్తే ఎలా ఉంటుంది? అనే పాయింట్ రజనీకాంత్ ‘రోబో’లో చూశాం. అయితే ఓ రోబోటిక్స్ ఎక్స్పర్ట్ రోబోతో ప్రేమలో పడితే, రోబోలు ప్రేమించుకుంటే.. అనే అంశాలతో హిందీలో ఓ సినిమా తెరకెక్కుతోందని టాక్. షాహిద్ కపూర్, కృతీ సనన్ జంటగా నటిస్తున్న ఓ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ కథ ఇది అని సమాచారం. అమిత్ జోషి, ఆరాధన షా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రోబోగా కృతీ సనన్, రోబోటిక్ ఎక్స్పర్ట్ పాత్రలో షాహిద్ కపూర్ నటిస్తున్నారట. మరోవైపు ‘ఎంవై 3’ అనే సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు హన్సిక. ఇందులో హన్సిక చేస్తున్న రెండు పాత్రల్లో రోబో పాత్ర ఒకటి. - శ్రీశ్రీ -
అంతం ఆరంభమవుతుంది!
వెండితెరపై ప్రభాస్ కల్కి అవతారం ఎత్తారు. ప్రభాస్, కమల్‌హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ముఖ్య తారలుగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ కె’ వర్కింగ్ టైటిల్‌తో ఓ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న ‘శాన్ డియాగో కామిక్ కాన్ – 2023’ వేడుకలో ఈ సినిమాకు ‘కల్కి 2898 ఏడీ’ టైటిల్‌ను ఖరారు చేసినట్లు శుక్రవారం వెల్లడించి, గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. ‘ప్రపంచాన్ని చీకటి కమ్మేసినప్పుడు ఒక శక్తి ఉద్భవిస్తుంది. అప్పుడు అంతం ఆరంభం అవుతుంది’ అన్నట్లుగా ఈ వీడియోలో ఉంది. ఈ వేడుకలో కమల్‌హాసన్ మాట్లాడుతూ– ‘‘మేం స్టోరీలు చేస్తుంటే వారు (ఆడియన్స్) మమ్మల్ని స్టార్స్ చేస్తున్నారు. ‘కల్కి 2898 ఏడీ’లో పెద్ద విజన్ ఉంది. ఈ సినిమాలో భాగం కావడం గౌరవంగా ఉంది’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో నాగ్ అశ్విన్ నా క్యారెక్టర్‌ను డిజైన్ చేసిన తీరు బాగా నచ్చింది. సినిమాలో స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉన్నాయి’’ అన్నారు ప్రభాస్. ‘‘ఈ సినిమా నాకో అద్భుతమైన అనుభవం. దీని వెనక గొప్ప పరిశోధన ఉంది’’ అని వర్చ్యువల్‌గా అమితాబ్ బచ్చన్ మాట్లాడారు. ‘‘నేను సైన్స్ ఫిక్షన్, పురాణాలను ఇష్టపడతాను. మహాభారతం, స్టార్ వార్స్... రెండింటినీ చూస్తూ, వింటూ పెరిగాను. ఈ రెండు ప్రపంచాలను కలిపే ఒక గొప్ప సినిమా చేయాలనుకున్నప్పుడు ‘కల్కి 2898 ఏడీ’ పుట్టింది’’ అన్నారు నాగ్ అశ్విన్. ‘‘ఈ సినిమా మాకు గర్వకారణం’’ అన్నారు నిర్మాత అశ్వనీదత్. ఈ వేడుకలో రానా, ప్రియాంకా దత్, స్వప్నా దత్ పాల్గొన్నారు. ‘కల్కి 2898 ఏడీ’ను 2024 జనవరి 12న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. రామ్‌చరణ్‌తో కలిసి నటిస్తా: ప్రభాస్ రామ్‌చరణ్‌తో కలిసి నటిస్తానని ప్రభాస్ ‘కామిక్ కాన్–2023’ వేడుకల్లో చెప్పారు. ఈ వేడుకల్లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రస్తావన రాగా... ‘‘భారతదేశంలో ఉన్న అద్భుతమైన దర్శకుల్లో రాజమౌళిగారు ఒకరు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని పాటకు ఆస్కార్ రావడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. అది దేశ ప్రజలందరికీ దక్కిన గౌరవంగా భావించాం. అలాగే రామ్‌చరణ్ నాకు మంచి మిత్రుడు. ఏదో ఒక రోజు మేం కచ్చితంగా కలిసి సినిమా చేస్తాం’’ అని చెప్పుకొచ్చారు ప్రభాస్. -
పడతారండి ప్రేమలో మళ్లీ..!
నిన్నమొన్నటివరకూ పాన్ ఇండియా ట్రెండ్‌లో యాక్షన్ సినిమాలొచ్చాయి. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో మళ్లీ లవ్ట్రెండ్ మొదలైంది. యాక్షన్ సినిమాలు చేస్తున్న హీరోలు మళ్లీ వెండితెరపై ప్రేమలో పడటానికి ప్రేమకథలు వింటున్నారు. కొందరి ప్రేమకథలు ఆల్రెడీ ఆన్ సెట్స్‌లో ఉన్నాయి. ఈ వెండితెర ప్రేమికుల ప్రేమకథా చిత్రాల గురించి తెలుసుకుందాం. ► ప్రభాస్ అనగానే సినిమా లవర్స్ ఎక్కువగా ‘బాహుబలి’, ‘ఛత్రపతి’, ‘మిర్చి’, ‘సాహో’ వంటి యాక్షన్ మూవీస్ గురించి మాట్లాడుకుంటారు. కాగా ప్రభాస్ కెరీర్లో మంచి హిట్స్ సాధించిన ‘వర్షం’, ‘డార్లింగ్’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’ వంటి ప్రేమకథా చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే గడచిన పదేళ్లల్లో ప్రభాస్ ‘రాధేశ్యామ్’ (2022) తప్ప అన్నీ యాక్షన్ చిత్రాలే చేశారు. ప్రస్తుతం ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కె’ సినిమాలతో యాక్షన్ మోడ్‌లోనే ఉన్నారు. మళ్లీ ఓ ప్రేమక£ý చేయాలని ప్రభాస్ భావిస్తున్నారట. ఇందులో భాగంగా లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ డైరెక్టర్ హను రాఘవపూడి రెడీ చేసిన ఓ ప్రేమ కథను ప్రభాస్ విన్నారని, ఇది పీరియాడికల్ లవ్‌స్టోరీ అనీ సమాచారం. ► ‘100 పర్సెంట్ లవ్’, ‘ఏ మాయ చేసావె’, ‘మనం’ , ‘ఒక లైలా కోసం’, ‘ప్రేమమ్’, ‘మజిలీ’, ‘లవ్‌స్టోరీ’.... ఇలా చెప్పుకుంటూ పోతే నాగచైతన్య కెరీర్‌లోని మేజర్ పార్ట్ అంతా ప్రేమతోనే నిండిపోయి ఉంటుంది. కాగా తన గత చిత్రం ‘కస్టడీ’లో నాగ చైతన్య ఎక్కువగా యాక్షన్ చేశారు. అయితే చైతూ తన ప్రేమతో మరోసారి ఆడియన్స్‌ను ప్రేమలో పడేయనున్నారని తెలుస్తోంది. నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. సూరత్ బ్యాక్‌డ్రాప్‌తో సాగే ఓ లవ్‌స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కనుందని, ఇందులో నాగచైతన్య బోటు డ్రైవర్ పాత్ర చేయనునున్నారనీ టాక్. ► హీరో విజయ్ దేవరకొండ కెరీర్లో ప్రేమ, మాస్ కథలు సమానంగా కనిపిస్తాయి. కానీ విజయ్‌కు ఇండస్ట్రీలో మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది మాత్రం మాస్ లవ్‌స్టోరీ ‘అర్జున్‌రెడ్డి’, క్లాస్ లవ్‌స్టోరీస్ ‘పెళ్ళి చూపులు’, ‘గీతగోవిందం’ వంటి సినిమాలే. దీంతో విజయ్ మరోసారి లవ్‌స్టోరీస్‌పై ఫోకస్ పెట్టినట్లు ఉన్నారు. దర్శకుడు శివ నిర్వాణతో విజయ్ ప్రస్తుతం ‘ఖుషి’ అనే లవ్‌స్టోరీ చేస్తున్నారు. ఇందులో సమంత హీరోయిన్. అలాగే ‘గీత గోవిందం’ తర్వాత దర్శకుడు పరశురామ్‌తో మరో సినిమా చేస్తున్నారు విజయ్. ఇది కూడా ప్రేమకథా చిత్రమేనన్నది ఫిల్మ్‌నగర్ టాక్. ► ‘డీజే టిల్లు’తో మరింత పాపులారిటీని సాధించిన సిద్ధు జొన్నలగడ్డ కెరీర్లో ‘కృష్ణ అండ్ హిజ్ లీల’, ‘మా వింత గాథ వినుమా’ వంటి ప్రేమకథా చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం సిద్ధు ‘డీజే టిల్లు స్క్వేర్’తో బిజీగా ఉన్నారు. అలాగే దర్శకురాలు నందినీ రెడ్డితో ఓ సినిమా కమిట్ అయ్యారు. ఓ డిఫరెంట్ లవ్‌స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కనుందని టాక్. ► ‘దొరసాని’ వంటి ప్రేమకథతో పరిచయం అయిన ఆనంద్ దేవరకొండ ఆ తర్వాత ‘హైవే’ వంటి క్రైమ్ థ్రిల్లర్ చేశారు. ఆనంద్ నటించిన మరో లవ్‌స్టోరీ ‘బేబీ’. ప్రేమకథా చిత్రంగా సాయిరాజేష్ తెరకెక్కించిన ఈ చిత్రం జూలై 14న రిలీజ్ కానుంది. మరికొందరు హీరోలు కూడా ఆడియన్స్‌ను ప్రేమలో పడేసేందుకు ప్రేమకథలు వింటున్నట్లు తెలుస్తోంది. ► ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’... ఇలా కొన్ని ప్రేమకథల్లో నటించారు అఖిల్. అయితే అఖిల్ గత చిత్రం ‘ఏజెంట్’ ఫుల్ యాక్షన్ ఫిల్మ్. దీంతో తన తర్వాతి చిత్రాన్ని లవ్ జానర్లోనే చేయాలనుకుంటున్నారట అఖిల్. ఈ క్రమంలోనే అనిల్‌కుమార్ అనే ఓ కొత్త దర్శకుడి కథకు అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనీ, ఫ్యాంటసీ లవ్‌స్టోరీ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా కథనం ఉంటుందని, ‘ధీర’ టైటిల్‌ను పరిశీలిస్తున్నారనీ టాక్. -
అందమైన భామలు.. అదిరిపోయే స్టెప్పులు
సినిమా సీరియస్‌గా సాగుతున్నప్పుడు జరగాలి ఓ మ్యాజిక్. స్పెషల్ సాంగ్ ఆ మ్యాజిక్ చేస్తుంది. ఒక్కసారిగా ప్రేక్షకులకు మంచి రిలీఫ్ ఇస్తుంది. అందుకే విడుదలవుతున్న ప్రతి సినిమాలోనూ దాదాపు ఓ స్పెషల్ సాంగ్ ఉండటం కామన్ అయింది. అలా రానున్న రోజుల్లో సిల్వర్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేయనున్న ‘స్పెషల్ సాంగ్స్’ గురించి, ఆ పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేసిన అందమైన భామల గురించి తెలుసుకుందాం. తెలుగు మాస్ ప్రేక్షకులకు డబుల్ ధమాకా ఇవ్వనున్నారు హిందీ భామ ఊర్వశీ రౌతేలా. ‘భాగ్ జానీ’, ‘కాబిల్’ వంటి హిందీ చిత్రాల్లో ఇప్పటికే స్పెషల్ సాంగ్స్ చేసిన ఈ బ్యూటీ తెలుగులో ఒకేసారి రెండు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేయడం విశేషం. చిరంజీవి టైటిల్ రోల్లో, రవితేజ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’లో ఊర్వశి స్టెప్స్ చూడనున్నాం. శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకుడు. ఈ చిత్ర సంగీతదర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన స్పెషల్ సాంగ్‌లో చిరంజీవితో కలిసి సూపర్ స్పెషల్ స్టెప్పులేశారు ఊర్వశి. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం విడుదల కానుంది. కాగా ఊర్వశి చేసిన మరో స్పెషల్ సాంగ్ చిత్రీకరణ కూడా పూర్తయింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ హీరోగా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్‌లో రామ్‌తో కలిసి స్టెప్పులేశారు ఊర్వశి. ఊర్వశీ రౌతేలా ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవికి రిలీజ్ కానుంది. ఇక ఊర్వశీ రౌతేలా హీరోయిన్గా నటించిన ‘బ్లాక్ రోజ్’ సినిమా రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. మోహన్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దర్శకుడు సంపత్ నంది కథ అందించారు. మరోవైపు బుల్లితెర ప్రేక్షకుల్లో సూపర్ క్రేజ్‌ను సంపాదించుకున్న రష్మీ గౌతమ్ స్పెషల్ డ్యాన్స్ మూమెంట్స్‌ను ‘బోళా శంకర్’ చిత్రంలో చూడొచ్చు. చిరంజీవి హీరోగా మోహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్. అప్సరా రాణి ఈ చిత్రంలో చిరంజీవితో కలిసి ఓ స్పెషల్ సాంగ్‌కి డ్యాన్స్ చేశారు రష్మీ. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ కానుంది. ఇంకోవైపు భారత మాలాలు ఉన్న ఆస్ట్రేలియన్ నటి చంద్రికా రవి ‘వీరసింహారెడ్డి’లో బాలకృష్ణతో కలిసి స్పెషల్ డ్యాన్స్ వేశారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న సినిమా ‘వీరసింహా రెడ్డి’. చిత్ర సంగీతదర్శకుడు తమన్ స్వరపరచిన స్పెషల్ సాంగ్‌లో బాలకృష్ణతో కలసి చంద్రికా రవి మాస్ స్టెప్పులేశారు. చంద్రికా రవి ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. అలాగే రామ్ ‘రెడ్’ చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో మెరిసిన హెబ్బా పటేల్ ‘శాసన సభ’లో కూడా తళుక్కుమననున్నారు. ఇంద్రసేన హీరోగా నటించిన ఈ సినిమాకు వేణు మడికంటి దర్శకుడు. ఈ సినిమాలో ‘నన్ను పట్టుకుంటే...’ అనే పాటలో నర్తించారు హెబ్బా పటేల్. ఈ సినిమాకు ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీత దర్శకుడు. ఇక గత ఏడాది సంక్రాంతికి ‘క్రాక్’లో ‘బూమ్ బద్దల్’ అంటూ సిల్వర్ స్క్రీన్‌ని షేక్ చేసిన అప్సరా రాణి గుర్తుండే ఉంటారు. ఈ బ్యూటీ ఇప్పుడు ‘హంట్’ చిత్రంలో సుధీర్‌బాబుతో కలిసి ‘పాపతో పైలం’ అనే స్పెషల్ సాంగ్ చేశారు. సుధీర్ బాబు హీరోగా శ్రీకాంత్, భరత్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘హంట్’. మహేశ్ సూరపనేని దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతదర్శకుడు. వీళ్లే కాదు.. ఇంకా స్పెషల్ సాంగ్స్‌లో మెరవనున్న తారలు కొందరున్నారు. సినిమాకి స్పెషల్‌గా నిలిచే ఈ సాంగ్స్ అందాల తారల కెరీర్లోనూ స్పెషల్‌గా నిలిచిపోతాయి. అందుకే శ్రుతీహాసన్, తమన్నా వంటి అగ్ర తారలు కూడా అప్పుడప్పుడూ స్పెషల్ సాంగ్స్ చేస్తుంటారు. -
వెండితెర, బుల్లితెర తారలకు అవార్డులు..
చెన్నై సినిమా: డితెర, బుల్లితెర తారల అవార్డుల వేడుక ఆదివారం చెన్నైలోని స్థానిక వడపళనిలోని శిఖరం హాల్లో జరిగింది. మహా ఆర్ట్స్ డా. అనురాధ జయరాం, యునైటెడ్ ఆర్టిస్ట్ ఆఫ్ ఇండియా కలైమామని డాక్టర్ నెల్లై సుందరరాజన్ సంయుక్తంగా నిర్వహించారు. ఈ వేడుకకు చెన్నై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఎస్కే కృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నటుడు గుహన్ చక్రవర్తి, వయ్యాపురి, బుల్లితెర నటుడు పాండికమల్, విఘ్నేష్, శ్యామ్, సాయి శక్తి, నటి హన్సాదీపన్, స్మాలిన్ మోనిక, నిరంజన్, మిస్ తమిళనాడు శాంత సౌర్భన్, హరితకు అవార్డులు అందజేశారు. చదవండి:👇 చిత్రపరిశ్రమలో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత మిస్ ఇండియా కిరీటం.. 21 ఏళ్ల అందం సొంతం హీరో విశాల్‌కు మరోసారి గాయాలు.. షూటింగ్ నిలిపివేత.. బాధాకరమైన పెళ్లిళ్లకు మీరే కారణం.. సమంత కామెంట్స్ వైరల్ వేశ్య పాత్రలో యాంకర్ అనసూయ..! -
Maternity Photoshoot: ట్రెండ్.. ప్రెగ్నెన్సీకి గ్లామర్ .. ఫొటోషూట్‌కు అదే అనువైన సమయం!
అమ్మ అవడం అనే వరాన్ని ముందస్తుగా పదిలం చేసుకోవాలనే ఆరాటం ఇటీవల సోషల్ మీడియా పోస్టుల్లో విరివిగా కనిపిస్తోంది. తమ జీవితంలోకి కొత్త అతిథి రాబోతున్నాడనే సూచనను నలుగురికి తెలియజేయాలనే తపనతో పాటు, గర్భంతో ఉన్న అందమైన ఫొటోలను సంతోషంగా షేర్ చేస్తున్నారు. వెండితెర, బుల్లితెర నటీమణులు కూడా ఈ ఆసక్తిని మరింతగా పెంచుతున్నారు. గర్భం అనేది స్త్రీకి జీవితంలో ఒక ప్రత్యేక దశ. తల్లిగా మారే ఈ ప్రయాణంలో కొన్ని కష్టాలు ఎదురైనా ఆనందాన్ని నింపుతుంది. ఇటీవల నటి కాజల్ అగర్వాల్, శ్వేతా అగర్వాల్‌ల బేబీ బంప్ ఫొటోలు నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. వారిలాగే ఫొటో షూట్స్ చేసుకోవడానికి ఆసక్తి చూపేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మెటర్నిటీ ఫొటోషూట్ ఎప్పుడూ గుర్తుండిపోయేలా, ప్రత్యేకంగా ఉండాలనుకునే ట్రెండ్ జోరందుకుంది. కాలేజీ, ఉద్యోగం, పెళ్లిరోజులను ఎంజాయ్ చేయడం ఎంతగా ఇష్టపడతారో అదేవిధంగా ప్రెగ్నెన్సీని పండగలా జరుపుకోవడం నేటి రోజుల్లో అతి ముఖ్యమని ఈ ఫొటోలు చూపుతున్నాయి. ఈ ఫొటోషూట్స్ కోసం ఫొటోగ్రాఫర్లు తమ స్టూడియోలను ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారు. విభిన్న రకాల డ్రెస్ డిజైన్లనూ గర్భవతుల కోసం రూపొందిస్తున్నారు. అనువైన సమయం ‘బేబీ బంప్ ఫొటో షూట్‌కి ఏడు–ఎనిమిది నెలల సమయం అనువైనది’ అంటున్నారు హైదరాబాద్‌లో బేబీ, ప్రెగ్నెన్సీ ఫొటోగ్రాఫర్‌గా పేరొందిన మనోజ్ఞ. ‘ఈ సమయంలో పొట్టభాగం బాగా కనిపిస్తుంది. పసిపిల్లలను ఫొటోషూట్ చేయడం కన్నా ఇది త్వరగా పూర్తవుతుంది కాబట్టి గర్భవతులకు అలసట ఏమీ ఉండదు. డ్రెస్ కలర్స్, డిజైన్స్ కోసం మాత్రం ప్రత్యేక శ్రద్ధ పెడతాం. ఒక కలర్ థీమ్‌తో అన్ని సైజుల డ్రెస్సులను డిజైన్ చేసి ఉంచుతాను. ఇందుకు విదేశీ డిజైనర్స్‌తోనూ చర్చలు జరుపుతాను’ అంటారీమె. ఎందుకు పెరుగుతోంది అంటే.. ‘కాబోయే తల్లితండ్రులు తమ జీవితంలోకి అడుగిడబోయే కొత్త అతిథిని విభిన్న రకాలుగా ఆహ్వానించడానికి ఆసక్తి చూపుతుంటారు. కొందరు తమ చేతులపై పసిపాప మెహెందీ డిజైన్ చేయించుకొని, ఆ ఫొటోను పోస్ట్ చేస్తూ తాము తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని పంచుకుంటారు. తమ ప్రెగ్నెన్సీ వార్తలను రకరకాలుగా షేర్ చేయడం లాగే మెటర్నిటీ ఫొటోలను కూడా పంచుకుంటున్నారు’ అంటారు ఫొటోగ్రాఫర్లు. ఇందుకు సంబంధించి తమ స్టూడియోని ప్రెగ్నెన్సీ షూట్‌కి అనువుగా మార్చుకున్నామని చెబుతున్నారు. థీమ్‌లకు పెరిగిన డిమాండ్ కాన్సెప్ట్ షూట్, బ్యాక్‌డ్రాప్ మొత్తం సాదాగా ఉండేలా, ఒంటరిగా దిగే సొలో థీమ్, బోహో థీమ్, డ్రేప్ షాట్.. వంటి థీమ్స్ ప్రస్తుతం డిమాండ్‌లో ఉన్నాయి అంటున్నారు ఫొటోషూట్స్ ఏర్పాటు చేసేవాళ్లు. ఈ ఫొటో షూట్ల సమయంలో హెయిర్ స్టైల్, మేకప్, డ్రెస్ వరకూ ప్రతి దానికీ తమ ప్రొడక్షన్ హౌజ్ నుంచే బాధ్యత తీసుకుంటున్నారు. ఫొటోషూట్ ఖర్చు కూడా ప్రొడక్షన్ హౌజ్, థీమ్, అందులో ఉపయోగించే వస్తువులపైన ఆధారపడి ఉంటుంది. అయితే, ఈ ప్రెగ్నెన్సీ ఫొటో షూట్ విషయంలో ఖర్చుకు వెనకాడటం లేదన్నది వాస్తవం. ఫ్లయింగ్ డ్రెస్ స్టైల్లో.. ప్రీ వెడ్డింగ్ షూట్ వీలుపడనివారు ఈ ప్రెగ్నెన్సీ షూట్ పట్ల మరింత ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రసవం తర్వాత కంటే గర్భంతో ఉన్నప్పుడు జంటగా ఫొటోలు తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. చాలావరకు బ్రైట్ కలర్స్, ఫ్లయింగ్ డ్రెస్ స్టైల్‌కి మొగ్గు చూపుతున్నారు. ప్రెగ్నెన్సీ ఫొటోషూట్‌కి 2 నుంచి 3 గంటల సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఔట్‌డోర్ అయితే గర్భిణులు త్వరగా అలసిపోయే అవకాశం ఉంది. అదే, స్టూడియోలో అయితే విశ్రాంతి తీసుకుంటూ ఫొటోషూట్ పూర్తి చేయవచ్చు. దానికి తగిన విధంగా స్టూడియో థీమ్ ఉంటుంది. శారీస్‌తోనూ ఫొటోషూట్ చేస్తాం. కానీ, సీమంతం సమయంలో తీసే ఫొటోలతో గర్భిణులు సంతృప్తిపడతారు. అందుకే చాలా వరకు వెస్ట్రన్వేర్లో కనిపించాలనుకుంటారు. లాంగ్ ఫ్లయింగ్ స్టైల్ ప్లెయిన్ గౌన్లను బాగా ఇష్టపడుతున్నారు. – మనోజ్ఞారెడ్డి, ఫొటోగ్రాఫర్ అండ్ స్టైలిస్ట్, హైదరాబాద్ -
భర్త రితేష్ దర్శకత్వంలో జెనీలియా రీ ఎంట్రీ
పదేళ్ల తర్వాత జెనీలియా మళ్లీ వెండితెరపై కనిపించనున్నారు. 2012లో రితేష్ దేశ్‌ముఖ్‌ని పెళ్లి చేసుకున్నాక ఓ మరాఠీ సినిమాలో అతిథి పాత్రలో కనిపించారామె. ఇప్పుడు మరాఠీ సినిమాతోనే ఆమె రీ ఎంట్రీ షురూ అయింది. మరాఠీలో జెనీలియా కథానాయికగా చేస్తున్న తొలి చిత్రం ఇది. అది కూడా ఆమె భర్త రితేష్ దర్శకత్వం వహించనున్న సినిమా కావడం విశేషం. దర్శకుడిగా రితేష్‌కి ఇది తొలి సినిమా కావడం మరో విశేషం. ‘వేద్’ పేరుతో ఈ చిత్రం రూపొందనుంది. ‘‘నేను మహారాష్ట్రలో పుట్టి, పెరిగాను. కానీ మరాఠీలో పూర్తి స్థాయి నిడివి ఉన్న పాత్ర చేయలేదు. ఆ కొరత తీరుతున్నందుకు సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు జెనీలియా. వచ్చే ఏడాది ఆగస్ట్ 12న ఈ చిత్రం విడుదల కానుంది. -
ఆనాటి నుంచి పన్నెండు మెట్ల కిన్నెర పాట వరకు.. సూపర్ సక్సెస్
‘సారంగదరియా’.. ‘రాములో రాములా’.. ‘నాది నక్కిలీసు గొలుసు’.. ‘గున్నా గున్నా మామిడి’... జనం పాటలు జోరు మీదున్నాయి. వెండితెరపై మోత మోగిస్తున్నాయి. పన్నెండు మెట్ల కిన్నెర కళాకారుడు మొగిలయ్య వంటి వారిని వెతికి మరీ సినిమాలకు పదాలిమ్మంటున్నాయి. కల్పించే పాటకు అంగీకారం డౌట్. జానపదానిది గ్యారంటీ సక్సెస్‌రేట్. అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకూ జానపదం ఝల్లుమంటూనే ఉంది. ఘల్లుమంటూనే ఉంది. సండే స్పెషల్... జానపదం జనం నాల్కల మీద ఉంటుంది. అందుకే వెండితెర మీద కనపడి వినిపించగానే కనెక్ట్ అయ్యి కాసుల వర్షం కురిపిస్తూ ఉంటుంది. జానపద గీతం ఆర్గానిక్‌గా పుడుతుంది. తరాలపాటు నిలిచే శక్తిని కలిగి ఉంటుంది. అందుకే సినిమాల్లోకి రాగానే ఆ శక్తితో సూపర్‌హిట్ అవుతూ ఉంటుంది. సినిమాల్లో సన్నివేశాలు ఉంటాయి. సన్నివేశాలకు తగినట్టు పాటలు కడతారు. ఆ అన్ని సన్నివేశాలకు జానపదాలు సూట్ కావు. కాని కుదిరే సన్నివేశాలలో జానపదాలు పెట్టడానికి నిర్మాత దర్శకులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే ఆ పాటలు తెర మీద మొక్కజొన్నల్ని పండిస్తాయి. భుజం మీద కడవలతో మెరుస్తాయి. మావ మావ మావా... ‘మంచి మనసులు’ సినిమాలో ‘మావ మావ మావా’ పాట కలెక్షన్ల దుమారం రేపింది. అయితే జానపద గీతాల్లో శృంగారం వాచ్యంగా, అవసరంగా ఉంటుంది. ఆ రోజుల్లో ఈ పాటను కొందరు అశ్లీలంగా భావించారు కూడా. కాని సామాన్య ప్రేక్షకుడు ఉత్సాహపడ్డాడు. కేరింతలు కొట్టాడు. తెలుగు సినిమాల్లో కొసరాజు జానపద గీతాలను రసాత్మకంగా ప్రవేశపెట్టారు. జానపదం అంటే కొసరాజు వైపు చూడాల్సి వచ్చేది. ‘పెద్దమనుషులు’ సినిమా కోసం ‘నందామయా గురుడ నందామయా’, ‘శివశివమూర్తివి గణనాథ’... జానపదాల నుంచి ఇచ్చారు. ‘జేబులో బొమ్మ జేజేలా బొమ్మ’ (రాజు–పేద), ‘ఏరువాక సాగారో’, ‘ఒలియ ఒలి పొలియ పొలి’... (రోజులు మారాయి), ‘రామన్న రాముడు కోదండ రాముడు’ (లవకుశ).. ఇవన్నీ కొసరాజు కలం చివర నుంచి సిఖను అంటించుకున్నాయి. మరోవైపు పింగళి వంటి పెద్దలు జానపదం నుంచి తీసుకుని ‘కాశీకి పోయాను రామా హరే’ సరదా గీతాలను ఇచ్చారు. ఆరుద్ర ‘అత్తా ఒకింటి కోడలు’ సినిమాలో ‘తడికో తడిక’ అంటూ తడికను అడ్డం పెట్టుకుని జానపదులు చేసే సంవాదాన్ని పాట చేశారు. కొనకళ్ల వెంకటరత్నం ‘అదృష్టవంతులు’ సినిమాలో ‘మొక్కజొన్నతోటలో ముసిరిన చీకట్లలో’తో భవిష్యత్ ముఖ్యమంత్రి జయలలితకు ఒక అచ్చతెలుగు హిట్ పాట ఇచ్చారు. పట్నంలో షాలిబండ కలర్, బ్లాక్ అండ్ వైట్ సంధికాలపు సినిమాలు వచ్చే సరికి ఈ దూకుడు తగ్గింది. సినారె కొన్ని జానపద వరుసలను పాటలకు వాడి మెరిపించారు. ‘లగ్గమెప్పుడ్రా మామా అంటే’ (అమ్మమాట), ‘మాయ చేసి పోతివిరో నాగులు’ (జీవితం)... తదితరాలు జానపదాల రెక్కలను రేకులను తొడుక్కున్నాయి. అప్పుడే ‘అమాయకుడు’ సినిమాలో ఏ.వేణుగోపాల్ రాసిన జానపద వరుస ‘పట్నంలో షాలిబండ’ తెలంగాణ పదాలతో చమ్కాయించింది. ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’లో ‘వచ్చే వచ్చే వానజల్లు యాల్మది యాల’, ‘మంగమ్మగారి మనవడు’లో ‘నోమో నోమన్నలాల’... ఆ మట్టినెత్తావులను కొనసాగించాయి. ఆ తర్వాత తొంభైలలో కూడా అడపా దడపా ఈ పాటలు వినిపించాయి. ‘మొండి మొగుడు పెంకిపెళ్లాం’లో సాహితి రాసిన ‘లాలూ దర్వాజ లస్కర్ బోనాల్ పండగ’ పాట హిట్ అయ్యింది. ‘తమ్ముడు’ సినిమాలో ‘తాటిచెట్టు ఎక్కలేవు.. తాటికల్లు తెంపలేవు’, ‘ఖుషి’లో ‘బైబైయ్యే బంగారు రమణమ్మ’ వంటి జానపదాలు సందర్భానుసారం వినిపిస్తాయి. ‘కాలేజ్’ సినిమాలో ‘మాయదారి మైసమ్మో’ కుర్రకారును గెంతులేయించింది. జానపద బాణీలను తీసుకుని మలిచిన విప్లవ గీతాలు కూడా ఈకాలంలో వచ్చాయి. ‘నాంపల్లి టేషను కాడ రాజలింగో’, ‘హే లిగజిగిడి లంబాణి’, ‘ఎర్రజెండెర్రజెండెన్నీయలో’, ‘బండెనక బండి కట్టి’, ‘జంజంబల్ మర్రి వేయికాళ్ల జెర్రి’... ఇవన్నీ జనం నోళ్లలో నేటికీ నానుతున్నాయి. గాజులోళ్లమే పిల్లా మేము ఆర్.పి.పట్నాయక్ వంటి సంగీత దర్శకుల హయాంలో ఉత్తరాంధ్ర జానపదాలు వినిపించడం మొదలెట్టాయి. ‘నువ్వు–నేను’లో ‘గాజులోళ్లమే పిల్లా మేము’ పెద్ద హిట్ అయ్యింది. ‘మగధీర’లో ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవా’ లైన్లు మెరిసి మాస్ అట్రాక్షన్‌గా నిలిచాయి. ఇది చాలారోజుల తర్వాత తిరిగి ‘పలాసా’ సినిమాతో మళ్లీ ఉత్తరాంధ్ర జానపదాల వైపు అందరూ చూస్తున్నారు. నాది నక్కిలీసు గొలుసు గత ఐదారేళ్లుగా మళ్లీ జానపదాలు ఊపు మీదున్నాయి. పెద్ద బడ్జెట్, చిన్న బడ్జెట్ సినిమాలు కూడా సందర్భం వస్తే జానపదాన్ని వదలడం లేదు. ‘అత్తారింటికి దారేది’లో ‘కాటమరాయుడా కదిరి నర్సింహుడా’ హల్చల్ చేసింది. ‘కృష్ణార్జున యుద్ధం’లో పెంచలదాసు రాసి పాడిన ‘దారి చూడు దమ్ము చూడు’ పెద్ద హిట్ అయ్యింది. ‘రాజా ది గ్రేట్’లో ‘గున్నా గున్నా మామిడి’, ‘పలాసా’లో ‘నాది నెక్కిలీసు గొలుసు’, ‘బావొచ్చాడోలమ్మ’, ‘శ్రీకారం’ లో ‘వస్తానంటివో పోతానంటివో’ హిట్ అయ్యాయి. శేఖర్ కమ్ముల ‘లవ్‌స్టోరీ’లో ‘సారంగ దరియా’ పాట ఆ సినిమా రిలీజ్ కాక ముందే పెద్ద హిట్ అయ్యింది. ‘అల వైకుంఠపురంలో’ నుంచి ‘రాములో రాములా’, ‘రంగస్థలం’లో ‘ఆగట్టునుంటావా’... ఇవన్నీ కొత్త సినిమా సక్సెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాయి. రాబోయే ‘వరుడు కావలెను’ లో ‘దిగు దిగు దిగు నాగ’, ‘భీమ్లా నాయక్’లో మొగిలయ్య సాకీ ఇవన్నీ జానపదం శక్తిని, అవసరాన్ని చూపుతున్నాయి.తెలుగు పల్లెల్లో, తెలుగు సినిమాల్లో జానపదం జెండా ఎగురుతూనే ఉండాలి. -
స్క్రీన్‌పై తొలిసారి
ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ సిల్వర్ స్క్రీన్ వెనక చాలా ఏళ్లుగా సందడి చేస్తూనే ఉంది. ఆయన మ్యూజిక్‌ని ఇన్నాళ్లూ వింటూనే ఉన్నాం. త్వరలోనే ఆయన్ను సిల్వర్ స్కీన్ మీద కూడా చూడబోతున్నాం. అయితే పూర్తి స్థాయి పాత్రలో కాదు అతిథి పాత్రలో అని తెలిసింది. అట్లీ దర్శకత్వంలో విజయ్ హీరోగా నటిస్తున్న తమిళ చిత్రం ‘బిగిల్’. అంటే విజిల్ అని అర్థం. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. ఈ సినిమాలో మొదటి పాట ‘సింగపెన్నే..’ రిలీజై మంచి విజయం సాధించింది. ఈ పాటలో విజయ్‌తో కలసి రెహమాన్ స్క్రీన్ మీద కనిపిస్తారట. మ్యూజిక్ ఆల్బమ్స్‌లో ఇదివరకు రెహమాన్ చాలాసార్లు నటించారు. కానీ సినిమాలో కనిపించడం ఇదే తొలిసారి కావడం విశేషం.