మళ్లీ బుల్లితెరకు? | sridevi re-entry with english vinglish second indings | Sakshi
Sakshi News home page

మళ్లీ బుల్లితెరకు?

Published Sat, Oct 18 2014 1:09 AM | Last Updated on Wed, Sep 18 2019 2:56 PM

మళ్లీ బుల్లితెరకు? - Sakshi

మళ్లీ బుల్లితెరకు?

శ్రీదేవి మళ్లీ నటిస్తే? బాగుంటుందని కోరుకున్నవారందరినీ ఆనందపరుస్తూ ఆమె ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించారు.

శ్రీదేవి మళ్లీ నటిస్తే? బాగుంటుందని కోరుకున్నవారందరినీ ఆనందపరుస్తూ ఆమె ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించారు. దాదాపు పధ్నాలుగేళ్ల తర్వాత వెండితెరపై ఆమె కనిపించిన చిత్రం ఇది. అదే నటన, అదే అందం.. శ్రీదేవిలో ఏ మాత్రం మార్పు లేదని ఆ సినిమా చూసినవాళ్లు కితాబులిచ్చేశారు. ఓ విజయవంతమైన చిత్రం ద్వారా రీ-ఎంట్రీ అయిన శ్రీదేవి మళ్లీ అదే స్థాయి చిత్రంలో నటించాలని తదుపరి చిత్రం ఎంపిక విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నారు. ఇప్పటికే తమిళంలో ఓ చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపారామె.

ఇటీవల శ్రీదేవికి బుల్లితెర నుంచి ఓ ఆఫర్ అందిందట. ‘మై లక్ష్మీ తేరీ ఆంగన్ కీ’ అనే ధారావాహికకు సంబంధించిన రెండో సీజన్‌లో ఓ కీలక పాత్రను శ్రీదేవితో చేయించాలని నిర్మాతలు అనుకున్నారని సమాచారం. ఇటీవల శ్రీదేవితో చర్చించారని భోగట్టా. అయితే, ఇంకా ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ అందుకోలేదట. ఇదిలా ఉంటే.. గతంలో ‘మాలిని అయ్యర్’ అనే కామెడీ షో ద్వారా బుల్లితెరపై మెరిశారు శ్రీదేవి. ఆ తర్వాత ఓ షోకి న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఇది జరిగి దాదాపు పదేళ్లయ్యింది. ఒకవేళ తాజా ప్రతిపాదనను ఆమె అంగీకరిస్తే... ఇంటిల్లిపాదీ ఆనందపడతారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement