వెండితెర వెలవెల | cinema theaters are ready to close | Sakshi
Sakshi News home page

వెండితెర వెలవెల

Published Sat, Sep 28 2013 12:38 AM | Last Updated on Mon, Aug 13 2018 4:19 PM

cinema theaters are ready to close

ఆకివీడు, న్యూస్‌లైన్ :
 జిల్లాలో వెండితెర ప్రాభవం తగ్గుతోంది. సిని మాలను ప్రదర్శించే థియేటర్లు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. రెండు దశాబ్దాల క్రితం టీవీల రాక.. ప్రస్తుతం పైరసీ వంటి కారణాలు, ప్రభుత్వ విధానాలు వెండితెర వెలుగుల్ని మింగేస్తున్నాయి. తాజాగా ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం సినిమా థియేటర్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అసలే నష్టాలతో నడుస్తున్న సినిమా హాళ్లు ఉద్యమం కారణంగా వ్యాపారం సాగక మూతపడుతున్నారుు. రెండేళ్ల క్రితం జిల్లాలో 115 థియేటర్లు ఉండేవి. ఒక్కొక్కటిగా మూతపడగా, ఈ ఏడాది ప్రారంభం నాటికి 98 థియేటర్లు మిగిలారుు. విభజన ప్రకటన నేపథ్యంలో యువత దృష్టి పూర్తిగా ఉద్యమం వైపు మళ్లింది. దీంతో సినిమాలు చూసే ప్రేక్షకులు కరువయ్యారు. పెద్ద హీరోల కొత్త సినిమాలు విడుదలకు నిర్మాతలు సాహసించలేకపోతున్నారు. చిన్న సినిమాలకు, పాత సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ కరువైంది. దీంతో థియేటర్లను మూసివేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. గడచిన రెండు నెలల్లో మెట్ట ప్రాంతంలో ఉన్న సుమారు 40 థియేటర్లలో 25 వరకు మూతపడ్డాయి. డెల్టా ప్రాంతంలో 58 థియేటర్లు ఉండగా, ఇప్పటికే 20 థియేటర్ల వరకు మూతపడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మెట్ట ప్రాంతంలో 15, డెల్టాలో 38 కలిపి మొత్తం ప్రస్తుతం జిల్లాలో 53 థియేటర్లు మాత్రమే నడుస్తున్నాయి.
 
 ఒక్కో థియేటర్‌కు రూ.20 లక్షల ఆదాయ నష్టం
 జిల్లాలో సినిమా థియేటర్ల మూసివేత ప్రభావంతో గడచిన రెండు నెలల్లో సగటున ఒక్కొక్క థియేటర్‌కు రూ.20 లక్షల మేర ఆదాయ నష్టం సంభవించినట్టు అంచనా. అంటే 45 థియేటర్లు మూతపడటం వల్ల ఇప్పటికే రూ.9 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఇదిగాక బంద్‌లు, కలెక్షన్లు లేకపోవడం వంటి కారణాలతో కనీసం రూ.కోటికి పైగా నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా.
 
 ఆదాయ గణాంకాలు ఇలా
 ఏలూరు నగరం, భీమవరం, తణుకు పట్టణాల్లో ఒక్కొక్క థియేటర్ నెలకు రూ.10 లక్షలకు పైగా కలెక్షన్లు వసూలు చేస్తుందని అంచనా. సినిమాను బట్టి ఈ మొత్తం పెరుగుతుందే తప్ప అంతకంటే తగ్గుదల మాత్రం ఉండదు. ద్వితీయ శ్రేణి పట్టణాలైన పాలకొల్లు, జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం వంటి పట్టణాలలో నెలకు రూ.6లక్షల నుంచి రూ.7లక్షలు, ‘సీ’ గ్రేడ్ పట్టణాల్లో నెలకు రూ.3 నుంచి రూ.4 లక్షల వరకు కలెక్షన్లు ఉంటారుు. పెద్ద హీరోల సినిమాలు ఎక్కువ విడుదలైతే కలెక్షన్లు రెట్టింపు అవుతారుు.
 
 ప్రభుత్వ ఆదాయూనికి చిల్లు
 సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభమై రెండు నెలలు కావస్తోంది. థియేటర్లు మూతపడటంతో దాని ప్రభావం కార్మికులపైన, ప్రభుత్వంపైనా పడుతోంది. 55 థియేటర్లు మూతపడటంతో థియేటర్‌కు 10 మంది చొప్పున కనీసం 550 మందికి కార్మికులు జీవనాధారం కోల్పోయి రోడ్డునపడ్డారు. ప్రభుత్వానికి లక్షల రూపాయల్లో నష్టం వాటిల్లింది. విద్యుత్ వినియోగించుకున్నందుకు గాను ఒక్కొక్క ఏసీ థియేటర్‌కు నెలకు రూ.లక్షకు పైగా ఆ శాఖకు బిల్లు రూపంలో చెల్లిస్తారు. మూతపడిన వాటిలో 10 ఏసీ థియేటర్లు కూడా ఉన్నారుు. ఈ లెక్కన గడచిన రెండు నెలల్లో విద్యుత్ శాఖకు రూ.20 లక్షల వరకూ ఆదాయ నష్టం వాటిల్లినట్టు అంచనా. ఏసీ లేకపోతే ఒక్కొక్క థియేటర్‌కు సగటున రూ.25 వేలకు పైగా బిల్లు చెల్లిస్తారు. మూతపడిన వాటిలో ఈ తరహా థియేటర్లు 35 ఉండగా, రెండు నెలలకు కలిపి రూ.17.50 లక్షల మేర విద్యుత్ శాఖకు ఆదాయ నష్టం ఏర్పడింది. అంటే విద్యుత్ శాఖకు రూ.37.50 లక్షల మేర ఆదాయ నష్టం కలిగింది. ఆదాయం కోల్పోతున్న జాబితాలో వాణిజ్య పన్నుల శాఖ కూడా ఉంది. వాణిజ్య పన్నుల శాఖకు రోజుకు ఏసీ థియేటర్‌కు రూ.1,500, సాధారణ థియేటర్లకు రూ.500 చొప్పున పన్నులు నిలిచిపోతున్నారుు. మరోవైపు నగరపాలక సంస్థ, మునిసిపాలిటీలు వినోద పన్నును నష్టపోతున్నారుు.
 
 తీవ్రంగా నష్టపోయాం
 సినిమా వ్యాపారం నష్టాల్లో ఉంది. నష్టాలను భరించలేక సినిమా థియేటర్లను మూసివేయూల్సి వస్తోంది. ఇందుకు టీవీలు కాగా, పైరసీ మరో ప్రధాన కారణం కారణం. తాజాగా సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావం థియేటర్లపై తీవ్రంగా ఉంది. జిల్లాలో 43 థియేటర్ల వరకు మూతపడ్డాయి. అరుునా సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా నిలుస్తాం. ఉద్యమకారులకు పూర్తి సహకారం అందిస్తాం.       - ముదునూరి శ్రీహరిరాజు, సినీ ఎగ్జిబిటర్, ఆకివీడు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement