భర్త రితేష్‌ దర్శకత్వంలో జెనీలియా రీ ఎంట్రీ | Genelia Deshmukh To Make Acting Comeback With Riteish Deshmukh | Sakshi
Sakshi News home page

భర్త రితేష్‌ దర్శకత్వంలో జెనీలియా రీ ఎంట్రీ

Published Tue, Dec 14 2021 5:41 AM | Last Updated on Tue, Dec 14 2021 12:07 PM

Genelia Deshmukh To Make Acting Comeback With Riteish Deshmukh - Sakshi

పదేళ్ల తర్వాత జెనీలియా మళ్లీ వెండితెరపై కనిపించనున్నారు. 2012లో రితేష్‌ దేశ్‌ముఖ్‌ని పెళ్లి చేసుకున్నాక ఓ మరాఠీ సినిమాలో అతిథి పాత్రలో కనిపించారామె. ఇప్పుడు మరాఠీ సినిమాతోనే ఆమె రీ ఎంట్రీ షురూ అయింది. మరాఠీలో జెనీలియా కథానాయికగా చేస్తున్న తొలి చిత్రం ఇది. అది కూడా ఆమె భర్త రితేష్‌ దర్శకత్వం వహించనున్న సినిమా కావడం విశేషం.

దర్శకుడిగా రితేష్‌కి ఇది తొలి సినిమా కావడం మరో విశేషం. ‘వేద్‌’ పేరుతో ఈ చిత్రం రూపొందనుంది. ‘‘నేను మహారాష్ట్రలో పుట్టి, పెరిగాను. కానీ మరాఠీలో పూర్తి స్థాయి నిడివి ఉన్న పాత్ర చేయలేదు. ఆ కొరత తీరుతున్నందుకు సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు జెనీలియా. వచ్చే ఏడాది ఆగస్ట్‌ 12న ఈ చిత్రం విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement