Marathi movie
-
భయపెట్టేందుకు వచ్చేస్తున్న మహారాష్ట్ర జాంబీలు.. చూసేందుకు సిద్ధమా !
Zombivli Marathi Film Will Streaming On Zee5: డిఫరెంట్ జోనర్ చిత్రాలలో 'జాంబీస్' ఒకటి. ఒక వైరస్ సోకిన వ్యక్తి మరో మనిషిని చంపి తినేవారినే జాంబీస్ అంటారు. మనుషులను పీక్కు తినేందుకు వెంటపడే జాంబీస్ వెన్నులో వణుకుపుట్టిస్తాయి. ఈ తరహా సినిమాలు యాక్షన్, హార్రర్, ఎమోషన్స్‌తో కలగలపి ఎన్నో వచ్చాయి. తెలుగులో ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో 'జాంబీ రెడ్డి' మూవీ వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓటీటీలోకి ఈ జోనర్లో ఓ సినిమా రానుంది. ప్రముఖ మరాఠీ మూవీ డైరెక్టర్ ఆదిత్య సర్పోట్డార్ తెరకెక్కించిన హారర్ కామెడీ చిత్రం 'జాంబీవిలీ'. ఈ మూవీ జనవరి 26న థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ 'జాంబీవిలీ' చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో మే 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని జీ5 ఇండియా అధికారిక ట్విటర్లో పేర్కొంది. 'మహారాష్ట్ర జాంబీలు మీకోసం వచ్చేస్తున్నాయి. యాక్షన్ కామెడీతో నిండి ఉన్న ఈ చిత్రం చూసేందుకు సిద్ధంగా ఉండండి' అని ట్వీట్ చేసింది. ఓ నగరంలో జాంబీ వైరస్ వ్యాప్తి కావడంతో అక్కడి ప్రజలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారనేదే సినిమా కథ. అలాగే మరాఠీ భాషలో తొలిసారిగా జాంబీ జానర్లో వచ్చిన చిత్రం ఇది. ఇందులో అమీ వాఘ్, వైదేహి పరశురామి, తృప్తి ఖమ్కర్, జానకి పాఠక్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. చదవండి: అతిగా భయపెట్టే 'జాంబీ' వెబ్ సిరీస్‌లు ఇవే.. Watch out, Maharashtra! The zombies are coming for you. Catch Marathi’s first-ever Zombie-filled, action-comedy #Zombivli Premieres 20th May on #ZEE5 pic.twitter.com/yAdPtvWY1z — ZEE5 (@ZEE5India) May 10, 2022 -
భర్త రితేష్ దర్శకత్వంలో జెనీలియా రీ ఎంట్రీ
పదేళ్ల తర్వాత జెనీలియా మళ్లీ వెండితెరపై కనిపించనున్నారు. 2012లో రితేష్ దేశ్‌ముఖ్‌ని పెళ్లి చేసుకున్నాక ఓ మరాఠీ సినిమాలో అతిథి పాత్రలో కనిపించారామె. ఇప్పుడు మరాఠీ సినిమాతోనే ఆమె రీ ఎంట్రీ షురూ అయింది. మరాఠీలో జెనీలియా కథానాయికగా చేస్తున్న తొలి చిత్రం ఇది. అది కూడా ఆమె భర్త రితేష్ దర్శకత్వం వహించనున్న సినిమా కావడం విశేషం. దర్శకుడిగా రితేష్‌కి ఇది తొలి సినిమా కావడం మరో విశేషం. ‘వేద్’ పేరుతో ఈ చిత్రం రూపొందనుంది. ‘‘నేను మహారాష్ట్రలో పుట్టి, పెరిగాను. కానీ మరాఠీలో పూర్తి స్థాయి నిడివి ఉన్న పాత్ర చేయలేదు. ఆ కొరత తీరుతున్నందుకు సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు జెనీలియా. వచ్చే ఏడాది ఆగస్ట్ 12న ఈ చిత్రం విడుదల కానుంది. -
తెలుగు వాళ్లూ కలిసి పరిగెత్తారు
మొన్నటి 67వ జాతీయ అవార్డుల హడావిడిలో ఒక బక్కచిక్కిన ముసలమ్మ, ఇద్దరు కరీంనగర్ కుర్రాళ్లు పత్రికలలో స్థలాభావం వల్ల కనపడకుండా పోయారు. ఆ అవార్డులలో వీరికీ స్థానం ఉంది. భర్త గుండె పరీక్షల కోసం 67 ఏళ్ల వయసులో మహరాష్ట్రలో మారథాన్ చేసిన ‘లతా భగవాన్ కరే’ జీవితాన్ని ఆమెతోనే సినిమా తీశారు దర్శకుడు నవీన్ దేశబోయిన, నిర్మాత అర్రబోతు కృష్ణ. 2020లో మరాఠీలో రిలీజ్ చేస్తే ఇప్పుడు దానికి జాతీయ ఉత్తమ చిత్రం (ప్రత్యేక ప్రస్తావన) దక్కింది. ఆమె విజయమూ వారి విజయమూ మనకు బాగా కనపడాలి... వినపడాలి. ‘నా దృష్టిలో ఆర్ట్ సినిమా, కమర్షియల్ సినిమా అనేవి లేవు. కథను నిజాయితీగా చెప్పే సినిమాయే ఉంది. కమర్షియల్‌గా కొలతలు వేసుకుని సినిమాలు తీస్తే అవన్నీ హిట్ అవ్వాలి కదా. నూటికి ఒకటో రెండో మాత్రమే ఎందుకు హిట్ అవుతున్నాయి?’ అంటారు దర్శకుడు నవీన్ దేశబోయిన. ఈ కరీంనగర్ సృజనశీలి ఇప్పుడు జాతీయస్థాయిలో తన ప్రతిభ చాటుకున్నాడు. మొన్న ప్రకటితమైన జాతీయ సినిమా అవార్డులలో ఇతను దర్శకత్వం వహించిన ‘లతా భగవాన్ కారే’ మరాఠీ సినిమాకు ఉత్తమ చిత్రం (స్పెషల్ మెన్షన్) అవార్డు దక్కింది. నిజానికి ఇది ఒక తెలుగువాడికి దక్కిన గౌరవం. దాంతో పాటు ఒక సామాన్యురాలి పట్టుదలకు దక్కిన గౌరవం కూడా. ఎవరా సామాన్యురాలు? అంత అసమాన్యమైన పని ఏమి చేసింది? 2013లో పరుగు లతా కారేది మహారాష్ట్రలోని బారామతి. ఆమె భర్త భగవాన్ సెక్యూరిటీ గార్డు. వారికి ముగ్గురు కుమార్తెలు. ముగ్గురి పెళ్లిళ్లు చేసే సరికి వారి దగ్గర ఉన్న చివరి రూపాయి అయిపోయింది. ఆ సమయంలోనే భగవాన్‌కు గుండె జబ్బు పట్టుకుంది. డాక్టర్లు స్కానింగ్‌లు ఇతర పరీక్షలు చేయాలి అందుకు 5 వేలు ఖర్చు అవుతుంది అని చెప్పారు. ఆ సమయానికి లతా కారే వయసు 60 సంవత్సరాలు. ఏదో గుట్టుగా బతికిందే తప్ప ఒకరి దగ్గర చేయి చాపింది లేదు. కాని భర్త కోసం ప్రయత్నాలు చేస్తే ఏమీ సాయం దక్కలేదు. ఆ సమయంలోనే ఒక కాలేజీ కుర్రాడి ద్వారా బారామతిలో ‘సీనియర్ సిటిజెన్స్ మారథాన్’ జరగనుందని తెలిసింది. అందులో గెలిచిన వారికి 5 వేల రూపాయలు ఇస్తారని కూడా తెలిసింది. భర్త ప్రాణాల కోసం ఆ 5 వేల రూపాయలు గెలవాలని నిశ్చయించుకుందామె. 9 గజాల చీరలో పోటీ సంగతి తెలిసిన నాటి నుంచి లతా కారే తెల్లవారు జామునే లేచి ఊళ్లో ఎవరూ చూడకుండా పరిగెత్తడం మొదలెట్టింది. చాలాసార్లు కింద పడింది. అయినా సరే పట్టుదలగా సాధన చేసింది. పోటీ రోజు స్లిప్పర్లు వేసుకుని 9 గజాల చీర కట్టుకుని వచ్చిన ఆమెను అందరూ వింతగా చూశారు. మిగిలిన వారు ట్రాక్సూట్లలో, షూలలో ఉండేసరికి ఆమె కూడా కంగారు పడింది. నిర్వాహకులు మొదట అభ్యంతరం చెప్పినా తర్వాత ఆమె పరిస్థితి తెలుసుకుని అనుమతి ఇచ్చారు. 3 కిలోమీటర్ల మారథాన్ అది. అందరూ పరిగెత్తడం మొదలెట్టారు. లతా కారే కూడా పరిగెత్తింది. వెంటనే ఒక స్లిప్పర్ తెగిపోయింది. ఆమె రెండో స్లిప్పర్ కూడా వదిలిపెట్టి పరుగు అందుకుంది. కొద్ది సేపటిలోనే పోటీదారులంతా వెనుకపడ్డారు. జనం కరతాళధ్వనుల మధ్య ఆమె గెలుపు సాధించింది. అయితే ఆమె ఏ కారణం చేత పరిగెత్తిందో తెలుసున్న జనం పెద్ద ఎత్తున సాయం చేశారు. సంస్థలు కూడా ఆర్థికంగా ఆదుకున్నాయి. భర్త ఆరోగ్యం మెరుగుపడింది. ఆమె ఇప్పుడు నిశ్చింతగా ఉంది. ఆ తర్వాత 2014లో, 2016లో కూడా ఆమె మారథాన్లు గెలిచింది. సినిమాగా ఈ వార్తను టీవీ రిపోర్టర్‌గా పని చేస్తున్న నవీన్ దేశబోయిన చూసి 2017లో ఆమెను సంప్రదించి తన తొలిసినిమాగా ఆమె కథను 2019లో తీశారు. ఆమె పాత్రను ఆమె చేతే పోషింప చేయడానికి ఆమెను ఒప్పించారు. మరాఠీలో తయారైన ఈ సినిమా ‘లతా భగవాన్ కారే’ పేరుతో 2020 జనవరిలో విడుదల అయ్యింది. కారే జీవితాన్ని సినిమాగా తీసేందుకు నవీన్ మిత్రుడు కరీంనగర్ వాసి అర్రబోతు కృష్ణ నిర్మాతగా వ్యవహరించారు. ఆ తెలుగువారి ప్రయత్నం లతా కారేను వెండి తెర మీద శాశ్వతం చేసింది. ఇప్పుడు జాతీయ అవార్డుతో మరింత గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఈ తెలంగాణ మిత్రులు ఇద్దరూ మరాఠి, తెలుగు భాషల్లో లతా కారే జీవితాన్ని సీక్వెల్‌గా తీస్తున్నారు. ఆ సినిమా కూడా ఇలానే ప్రశంసలు పొందాలని ఆశిద్దాం. -
రయ్ రయ్‌మంటూ...
ఎన్ని ఉన్నాయ్ మీ లైఫ్‌లో. మీరు మనసారా చేయాలనుకుని వీలుపడక పెండింగ్‌లో ఉన్న పనులెన్ని ఉన్నాయ్. అది.. ఓ ట్రిప్ కావచ్చు. వర్షంలో తడవటం అయ్యిండొచ్చు. చలికాలంలో ఐస్‌క్రీమ్ తినడం కావచ్చు. ఎండలో వేడి వేడిగా టీ తాగటం అయ్యిండొచ్చు. ఏంటీ.. ఫన్నీగా ఉన్నాయ్ కదూ. అవును.. ఇలాంటి సరదా సరదా కోరికలు చాలామందికి ఉంటాయి. రొటీన్‌గా ఉంటే అది ఫన్నీ ఎందుకు అవుతుంది? అందుకే లైఫ్‌లో ఆస్వాదించాలనుకున్న సరదాలను ఓ లిస్ట్‌గా చేసుకుని లైఫ్ రైడ్‌ను ఎంజాయ్ చేయడానికి రయ్ రయ్‌మంటూ బయల్దేరారు మాధురీ దీక్షిత్. అయితే ఇది పర్సనల్ రైడ్ కాదు. ఇదే కాన్సెప్ట్ మీద ఆమె ఓ మరాఠీ సినిమా చేస్తున్నారు. తేజాస్ ప్రభ విజయ్ దర్శకత్వంలో కరణ్‌జోహర్ నిర్మాణంలో మాధురీ దీక్షిత్ ముఖ్య తారగా ‘బక్కెట్ లిస్ట్’ పేరుతో ఈ చిత్రం రూపొందుతోంది. లైఫ్‌లో సెల్ఫ్ డిస్కవరీ అండ్ ఫన్నీ మూమెంట్స్‌ను ఎంజాయ్ చేసే కాన్సెప్ట్‌పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇది మాధురీకి తొలి మరాఠి మూవీ కావడం విశేషం. అంతేకాదు ఆల్మోస్ట్ నాలుగేళ్ల తర్వాత మాధురీ దీక్షిత్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించనున్న సినిమా ఇదే. 2014లో ‘గులాబ్ గ్యాంగ్’ సినిమాలో సిల్వర్ స్క్రీన్‌పై కనిపించారు మాధురి. ‘‘మరాఠీ సినిమాల్లో మంచి కంటెంట్ ఉంటుంది. ఈ సినిమాలో నటించడం హ్యాపీగా ఉంది. నా పాత్ర కొత్తగా ఉంటుంది’’ అన్నారు మాధురి. ఈ సినిమా మే 25న రిలీజ్ కానుంది. -
అట్టా బెదరగొట్టొద్దు సారూ
జూనియర్ శ్రీదేవి జాన్వీ కపూర్ కెమెరాకు కొత్త కాదు. ఎక్కడికెళ్లినా ‘శ్రీదేవి కూతురు’ అంటూ వెంటాడే కెమెరాలు ఎన్నో. కానీ, కెమెరా ముందు నటనకు ఆమె కొత్త. ఇషాన్ కట్టర్, జాన్వీ కపూర్ జంటగా శశాంక్ కేతన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ధడక్’. మరాఠి చిత్రం ‘సైరట్’కు ఈ సినిమా రీమేక్. ‘ధడక్’ షూటింగ్ రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఇటీవల మొదలైన సంగతి తెలిసిందే. షూటింగ్లో భాగంగా జాన్వీ కపూర్ పై మండిపడ్డారట శశాంక్ కేతన్. అంతేకాదు.. ఎక్కవ టేక్స్ తీసుకోకుండా యాక్ట్ చేయాలని ఇషాన్, జాన్వీలకు వార్నింగ్ ఇచ్చారట ఆయన. ఇన్సెట్లో ఉన్న ఫొటో చూస్తే.. ఎవరికైనా ఇలాంటి ఫీలింగే కలుగుతుంది. ఇషాన్ దండం పెట్టడం, జాన్వీ బెదురు చూపులు చూస్తే ఎవరైనా ఇలానే అనుకుంటారు. ‘సార్.. కాస్త సుకుమారంగా హ్యాండిల్ చేయండి. పాపం.. పాప బెదిరిపోతోంది’ అని రిక్వెస్ట్ చేస్తున్నారట శ్రీదేవి ఫ్యాన్స్. ఫొటో చూసి శశాంక్ వార్నింగ్ ఇచ్చారని ఊహించుకున్నారేమో కానీ, అక్కడ అలాంటిదేం జరిగి ఉండకపోవచ్చు. సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే సరదాగా ఇషాన్ దండం పెట్టినప్పుడు, జాన్వీ శ్రద్ధగా వింటున్నప్పుడు ఎవరైనా క్లిక్‌మనిపించిన ఫొటో అయ్యుండొచ్చు. -
రజనీ... మమ్ముట్టి... ఓ మరాఠీ సినిమా!
రజనీకాంత్ మాతృభాష ఏంటో తెలుసా? మరాఠీ! కానీ, ఆయన జన్మించింది ఒకప్పటి మైసూర్ రాష్ట్రంలో! అదేనండీ... ఇప్పటి కర్ణాటకలో! ఇంతై వటుడింతై అన్నట్టు ఎవ్వరికీ అందనంత ఎత్తుకి ఎదిగింది మాత్రం తమిళనాడులో! దర్శకుడు బాలచందర్ తీసిన ‘అపూర్వ రాగంగాళ్’ (తెలుగులో ‘తూర్పు–పడరమ’)తో నటుడిగా పరిచయమైన రజనీ, ఆ తర్వాత పలు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలు చేశారు. కానీ, ఇప్పటివరకూ మాతృభాష మరాఠీలో ఒక్క సినిమా కూడా చేయలేదు. త్వరలో చేయనున్నారని ముంబయ్ టాక్! రాజకీయ నాయకుడు, నిర్మాత బాలకృష్ణ సుర్వే నిర్మించనున్న ‘పసాయదన్’లో రజనీ నటిస్తారట! అంతే కాదండోయ్... అందులో ఆయనతో పాటు మలయాళ స్టార్ మమ్ముట్టి కూడా నటించనున్నారని అక్కడి జనాలు చెబుతున్నారు. సుమారు పాతికేళ్ల క్రితం వచ్చిన ‘దళపతి’లో రజనీ, మమ్ముట్టి నటించారు. తర్వాత వీళ్లిద్దరూ ఏ సినిమాలోనూ కనిపించలేదు. మొన్నా మధ్య రజనీకాంత్ ‘కాలా’లో మమ్ముట్టి అతిథి పాత్ర చేస్తున్నారనే వార్త బయటకొచ్చింది. కానీ, అందులో నిజమెంత? అనేది ఇంకా తెలియలేదు. ఇంతలో దీపక్ భావే దర్శకుడిగా పరిచయం కానున్న ఈ మరాఠీ సినిమా వార్త! దీపక్ భావే కో–రైటర్‌గా పని చేసిన ‘ఇడక్’ను 48వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ)లో ప్రదర్శించారు. ఆ తర్వాత రజనీ, మమ్ముట్టి కాంబినేషన్లో మరాఠీ సిన్మా అనే వార్త రావడం గమనార్హం!! -
లబ్ డబ్ కాదు... ధడక్!
అవును. శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ని చూస్తే కుర్రకారు గుండె వేగంగా కొట్టుకోవడం ఖాయం. ఆ జనరేషన్లో శ్రీదేవి గొప్ప అందగత్తె అయితే ఈ తరంలో ఆమె కుమార్తె జాన్వీ కూడా గొప్ప అందగత్తెల లిస్టులో ఉంటుంది. అందుకే జాన్వీని పరిచయం చేస్తూ, నిర్మించనున్న చిత్రానికి ‘ధడక్’ అని టైటిల్ పెట్టాలని నిర్మాత కరణ్ జోహార్ అనుకున్నారేమో. ధడక్ అంటే హార్ట్ బీట్ అని అర్థం. మరాఠీ బ్లాక్‌బస్టర్ మూవీ ‘సైరాట్’కి ఇది రీమేక్. ఈ సినిమా గురించి ప్లాన్ జరిగి చానాళ్లయింది. కానీ, ఇంకా పట్టాలెక్కలేదు. దాంతో ‘సైరాట్’ రీమేక్ లేనట్లే అనే వార్తలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్లో సినిమాని స్టార్ట్ చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయని, ‘ధడక్’ టైటిల్ కన్ఫర్మ్ చేశారనే వార్త వచ్చింది. ‘బద్రినాథ్ కీ దుల్హనియా’ ఫేమ్ శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ‘సైరాట్’ మహారాష్ట్ర నేపథ్యంలో ఉంటుంది. హిందీ రీమేక్‌ని మాత్రం హర్యానా బ్యాక్‌డ్రాప్‌లో తీయనున్నారు. అన్నట్లు.. ఈ చిత్రంలో హీరో ఎవరో తెలుసా? ప్రముఖ హీరో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ కట్టర్. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదలవుతుంది. ఇప్పటికే జాన్వీ పలు కార్యక్రమాల్లో చిట్టి పొట్టి దుస్తుల్లో దర్శనమిచ్చి, కుర్రాళ్ల మతులు పోగొట్టారు. ఇక.. సిల్వర్ స్క్రీన్‌పై ఈ అందాల రాశిని చూశాక.. వాళ్ల గుండె లబ్ డబ్కి బదులు ధడక్ ధడక్... అని కొట్టుకుంటుందేమో! -
బడ్జెట్ 4కోట్లు, కలెక్షన్లు 75 కోట్లు
అంఛనాలను తలకిందులు చేస్తూ ఓ మరాఠీ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. స్టార్ హీరోలు కూడా వంద కోట్ల కలెక్షన్ల కోసం అష్టకష్టాలు పడుతుంటే.. ఓ చిన్న సినిమా శరవేగంగా వందకోట్ల మార్క్ వైపు అడుగులు వేస్తుంది. నూతన నటీనటులు ఆకాష్ తోసర్, రింకూ రాజ్‌గురు హీరో హీరోయిన్లుగా మరాఠీలో తెరకెక్కిన చిన్న సినిమా సైరత్. నాగరాజ్ మంజులే స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్కడ సంచలన విజయం సాధించింది. కేవలం 4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్, 63వ జాతీయ అవార్డుల వేదిక మీద కూడా సత్తా చాటింది. ఎలాంటి అంఛనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా స్పెషల్ జ్యూతీ అవార్డును సొంతం చేసుకుంది. సాధారణంగా అవార్డు సినిమాలకు కలెక్షన్లు రావన్న అపవాదు ఉంది. అలాంటి అనుమానాలను కూడా దూరం చేస్తూ సైరత్ భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. 4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా 31 రోజుల్లో 75 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇప్పటికీ మంచి కలెక్షన్లు సాధిస్తుండటంతో వంద కోట్ల క్లబ్లో చేరడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. -
ఆ సినిమా రీమేక్ రైట్స్‌కు భారీ పోటీ
ఫిలిం ఇండస్ట్రీలో సక్సెసే కీలకం అందుకే చాలా మంది దర్శక నిర్మాతలు కొత్త కథలతో ప్రయోగాలు చేసేకన్నా, వేరే భాషలో సక్సెస్ అయిన సినిమాలను రీమేక్ చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. టాప్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు కూడా ఇలా రీమేక్ సినిమాల మీద ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఓ మరాఠీ సినిమా రీమేక్ రైట్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. కేవలం 5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి 60 కోట్లు పైగా వసూలు చేసిన ఓ చిన్న సినిమాను తెలుగులో తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరాఠీలో ఘన విజయం సాధించిన సైరత్ సినిమా, తెలుగు రీమేక్ రైట్స్ కోసం చాలామంది నిర్మాతలు పోటీ పడుతున్నారు. నాగరాజ్ మంజులే దర్శకత్వంలో జీ స్టూడియోస్ సంస్థ నిర్మించిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఏప్రిల్ 29న రిలీజ్ అయిన ఈ అందమైన ప్రేమకథ తెలుగు ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకుంటుందన్న నమ్మకంతో ఉన్నారు దర్శక నిర్మాతలు. ప్రస్తుతానికి రీమేక్ రైట్స్ ఎవరూ సొంతం చేసుకోకపోయినా త్వరలోనే సైరత్ తెలుగు రీమేక్ పై క్లారిటీ రానుంది. -
'ఆ సినిమా తప్పక చూడాలి'
ముంబై: నటుడు, దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ తెరకెక్కించిన మరాఠీ సినిమా 'నటసామ్రాట్'ను ఆమిర్ ఖాన్ ప్రశంసించాడు. నానాపటేకర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను అందరూ తప్పక చూడాలని కోరారు. 'మంగళవారం రాత్రి నటసామ్రాట్ చిత్రం చూశాను. సినిమా చాలా బాగుంది. నానాపటేకర్ నటన అద్భుతంగా ఉంది. నిజంగా నానా నటన సూపర్బ్. విక్రమ్ గోఖలే నటన ఆకట్టుకుంది. అందరూ తప్పక చూడాల్సిన సినిమా ఇది. ఇంత మంచి సినిమా తీసినందుకు మంజ్రేకర్, నానాపటేకర్, విక్రమ్ జీ, చిత్రయూనిట్ కు థ్యాంక్స్' అని ఆమిర్ ఖాన్ ట్విటర్ లో పేర్కొన్నాడు. స్వర్గీయ వివి శిరవాద్కర్ ప్రముఖ నాటకం కుసుమగ్రాజ్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. 'నటసామ్రాట్'లో గణపతి రామచంద్ర బెల్ వాకర్ పాత్రలో నానాపటేకర్ నటించాడు. విలియం షేక్స్ స్పియర్ నాటకాలతో నటసామ్రాట్ గా ఎదిగిన సీనియర్ ధియేటర్ ఆర్టిస్టు ఆ తర్వాత ఎలా పతనమైయ్యాడనే కథతో ఈ సినిమా సాగుతుంది. మేధా మంజ్రేకర్, మృణ్మమయి దేశ్ పాండే, అజిత్ పరబ్, సుశీల్ బార్వే తదితరులు ఈ చిత్రంలో నటించారు. I saw Natsamrat last night. What a film! And what an amazing performance by Nana, truly 'ase nat hone nahi'! (1/3) — Aamir Khan (@aamir_khan) February 17, 2016 A must watch for all who love performances! And Vikramji has done no less. Outstanding! Both Nana& Vikramji kept me riveted throughout!(2/3) — Aamir Khan (@aamir_khan) February 17, 2016 Thank you Mahesh, Nana, Vikramji, and to the entire team. (3/3) — Aamir Khan (@aamir_khan) February 17, 2016 -
'అంచనాలు లేకుండానే సంచలనంగా బరిలోకి'
అంతా కొత్తవారితో ఎలాంటి అంచనాలు లేకుండా తెరకెక్కిన సినిమా 'కోర్టు'. 2015లో రిలీజ్ అయిన ఈ సినిమా ఓ 'కోర్టు' డ్రామా. దర్శకుడు చైతన్య తమానే తొలి ప్రయత్నంతోనే ఆస్కార్ నామినేషన్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. చిత్ర నిర్మాత వివేక్ గొంబేర్ ప్రధాన పాత్రలో నటించగా, మరాఠి స్టేజ్ ఆర్టిస్ట్ విరా సాథిదర్, ప్రదీప్ జోషిలు ఇతర పాత్రల్లో నటించారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శించిన కోర్టు.. 2014 వెనిస్ ఫిలిం ఫెస్టివల్ లో హారిజన్స్ కేటగిరిలో ఉత్తమ చిత్రంగా ఎంపిక అయ్యింది. 116 నిమిషాల ఈ సినిమా భారత్ లో ఏప్రిల్ 17న విడుదలైంది. మరాఠీతో పాటు హిందీ, ఇంగ్లిష్, గుజరాతీ భాషల్లోనూ రిలీజ్ అయ్యింది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే తన రచనలు, పాటలతో ఓ మున్సిపల్ కార్మికుడిని ఆత్మహత్యకు ప్రేరేపిస్తాడో ఓ వ్యక్తి. ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా అతడు భారత న్యాయవ్యవస్థపై ఎలాంటి ప్రశ్నలు సంధించాడు. అందుకు బదులుగా పబ్లిక్ ప్రాసిక్యూటర్, న్యాయమూర్తి ఎలా స్పందించారు అన్నదే సినిమా కథ. అతి తక్కువ పాత్రలతో మినిమమ్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ వేదికల మీద సత్తా చాటింది. ఎలాంటి అంచనాలు లేకుండానే తాజాగా సంచలనం సృష్టించి భారత్ తరపున ఆస్కార్ ఎంపికలో నిలిచింది. పికె, బాహుబలి, హైదర్, మసాన్ లాంటి సినిమాలు బరిలో ఉన్నా వాటన్నింటిని వెనక్కి నెట్టి ప్రాంతీయ భాషా చిత్రం 'కోర్టు' ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరిలో నామినీగా ఎంపిక అయ్యింది. పోటీలో ఉన్న సినిమాలన్ని నామినీగా ఎంపిక చేయటానికి అర్హత ఉన్న సినిమాలే అయిన ఒక్క సినిమా మాత్రమే ఎంపిక చేయక తప్పని పరిస్థితుల్లో సృజనాత్మకత, సాంకేతిక విలువలు, నటీనటుల ప్రతిభ లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని కోర్టు సినిమాను ఎంపిక చేసినట్టుగా ఆస్కార్ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ అమోల్ పాలేకర్ ప్రకటించారు. జ్యూరిలోని 15 సభ్యులు ఏకాభిప్రాయంతో కోర్టు సినిమాను నామినీగా ఎంపిక చేసినట్టుగా ప్రకటించారు. -
రేణూ దేశాయ్ 'ఇష్క్ వాలా లవ్' వర్కింగ్ స్టిల్స్
-
మరాఠీలో రేణూ డెరైక్షన్
‘మంగళాష్టక్ వన్స్ మోర్’ అనే మరాఠీ చిత్రం ద్వారా నిర్మాతగా మారిన రేణూ దేశాయ్ ఇప్పుడు దర్శకురాలిగా తన ప్రతిభ చాటుకోవడానికి రెడీ అయ్యారు. తొలి ప్రయత్నంగా ‘ఇష్క్ వాలా లవ్’ అనే సినిమాని స్వీయదర్శకత్వంలో రూపొందించనున్నారు రేణు. ఈ చిత్రానికి దర్శకుడు, నటుడు ఎస్.జె. సూర్య పాటలు స్వరపరచడం విశేషం. రెండు పాటలకు స్వరాలందించారాయన. వైశాలీ సమంత్ ఓ పాట పాడగా రికార్డ్ చేశారు. ఆదినాథ్ కొతారే కథానాయకునిగా నటించనున్న ఈ చిత్రానికి ముందుగా అమృతా కన్విల్కర్ని కథానాయికగా తీసుకున్నారు. అయితే ఇప్పుడామె స్థానంలో సులగ్నా పాణిగ్రాహిణిని హీరోయిన్గా ఎంపిక చేశారు రేణూ దేశాయ్. హిందీలో పలు టీవీ సీరియల్స్ చేసి, ‘మర్డర్ 2’లో నటించిన సులగ్నాకి మరాఠీలో ఇది మొదటి సినిమా. నిర్మాతగా ‘మంగళాష్టక్ వన్స్ మోర్’ రేణూకి మంచి అనుభూతినే మిగిల్చింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కాకపోయినా ‘భేష్’ అనిపించుకుంది. మరి... దర్శకురాలిగా ఆమెకు ఎలాంటి అనుభూతి ఎదురవుతుందో కాలమే చెప్పాలి.