
జూనియర్ శ్రీదేవి జాన్వీ కపూర్ కెమెరాకు కొత్త కాదు. ఎక్కడికెళ్లినా ‘శ్రీదేవి కూతురు’ అంటూ వెంటాడే కెమెరాలు ఎన్నో. కానీ, కెమెరా ముందు నటనకు ఆమె కొత్త. ఇషాన్ కట్టర్, జాన్వీ కపూర్ జంటగా శశాంక్ కేతన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ధడక్’. మరాఠి చిత్రం ‘సైరట్’కు ఈ సినిమా రీమేక్. ‘ధడక్’ షూటింగ్ రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఇటీవల మొదలైన సంగతి తెలిసిందే. షూటింగ్‌లో భాగంగా జాన్వీ కపూర్ పై మండిపడ్డారట శశాంక్ కేతన్. అంతేకాదు.. ఎక్కవ టేక్స్ తీసుకోకుండా యాక్ట్ చేయాలని ఇషాన్, జాన్వీలకు వార్నింగ్ ఇచ్చారట ఆయన.
ఇన్‌సెట్‌లో ఉన్న ఫొటో చూస్తే.. ఎవరికైనా ఇలాంటి ఫీలింగే కలుగుతుంది. ఇషాన్ దండం పెట్టడం, జాన్వీ బెదురు చూపులు చూస్తే ఎవరైనా ఇలానే అనుకుంటారు. ‘సార్.. కాస్త సుకుమారంగా హ్యాండిల్ చేయండి. పాపం.. పాప బెదిరిపోతోంది’ అని రిక్వెస్ట్ చేస్తున్నారట శ్రీదేవి ఫ్యాన్స్. ఫొటో చూసి శశాంక్ వార్నింగ్ ఇచ్చారని ఊహించుకున్నారేమో కానీ, అక్కడ అలాంటిదేం జరిగి ఉండకపోవచ్చు. సీన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే సరదాగా ఇషాన్ దండం పెట్టినప్పుడు, జాన్వీ శ్రద్ధగా వింటున్నప్పుడు ఎవరైనా క్లిక్‌మనిపించిన ఫొటో అయ్యుండొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment