బడ్జెట్ 4కోట్లు, కలెక్షన్లు 75 కోట్లు
అంఛనాలను తలకిందులు చేస్తూ ఓ మరాఠీ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. స్టార్ హీరోలు కూడా వంద కోట్ల కలెక్షన్ల కోసం అష్టకష్టాలు పడుతుంటే.. ఓ చిన్న సినిమా శరవేగంగా వందకోట్ల మార్క్ వైపు అడుగులు వేస్తుంది. నూతన నటీనటులు ఆకాష్ తోసర్, రింకూ రాజ్గురు హీరో హీరోయిన్లుగా మరాఠీలో తెరకెక్కిన చిన్న సినిమా సైరత్. నాగరాజ్ మంజులే స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్కడ సంచలన విజయం సాధించింది.
కేవలం 4 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్, 63వ జాతీయ అవార్డుల వేదిక మీద కూడా సత్తా చాటింది. ఎలాంటి అంఛనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా స్పెషల్ జ్యూతీ అవార్డును సొంతం చేసుకుంది. సాధారణంగా అవార్డు సినిమాలకు కలెక్షన్లు రావన్న అపవాదు ఉంది. అలాంటి అనుమానాలను కూడా దూరం చేస్తూ సైరత్ భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. 4 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 31 రోజుల్లో 75 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇప్పటికీ మంచి కలెక్షన్లు సాధిస్తుండటంతో వంద కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.