Rinku Rajguru
-
శారీలో మెస్మరైజ్ చేస్తున్న రింకూ రాజ్‌గురు... ఆకట్టుకుంటున్న (ఫొటోలు)
-
నటి అవుతానని కలలో కూడా ఊహించలేదు
రింకు రాజ్‌గురు అకా ప్రేరణ రాజ్‌గురు.. ఎక్కడో చూసినట్టు ఇంకా చెప్పాలంటే మనింట్లోని అమ్మాయే అనిపించేట్టుంది కదా! 2016లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓ మరాఠీ సినిమా గుర్తుందా.. అదే ‘సైరాట్’. అందులో కథానాయికే ఈ రింకు రాజ్‌గురు. ‘సైరాట్’ తర్వాత దాని కన్నడ రీమేక్ ‘మనసు మల్లిగే’, కిందటేడు ‘కాగర్’ అనే ఇంకో మరాఠీ, ‘ఝుండ్’ హిందీ సినిమాల్లోనూ నటించాక ఓటీటీ ప్లాట్‌ఫామ్ మీదా తన ప్రతిభను పరిచయం చేసుకుంది. డిస్నీ హాట్ స్టార్ వెబ్ సిరీస్ ‘హండ్రెడ్’లో. పుట్టింది, పెరిగింది మహారాష్ట్ర, షోలాపూర్ జిల్లాలోని అక్లూజ్‌లో. తల్లిదండ్రులు.. ఆశా రాజ్‌గురు, మహాదేవ్ రాజ్‌గురు. ఇద్దరూ టీచర్లే. రింకూకు ఓ తమ్ముడు సిద్ధార్థ రాజ్‌గురు. ‘సైరాట్’ విడుదలయ్యే సమయానికి రింకూ తొమ్మిదో తరగతిలో ఉంది. ఆ సినిమా విజయంతో ఇబ్బడిముబ్బడి అవకాశాలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసినా చదువు మీద దృష్టి మరల్చలేదు. పదవ తరగతిలో స్కూల్ ఫస్ట్‌గా నిలిచింది. భద్రతా కారణాల దృష్ట్యా స్కూల్‌కి వెళ్లి చదువు కొనసాగించలేకపోయింది. ప్రైవేట్ ట్యూషన్స్తోనే పన్నెండో తరగతీ పూర్తి చేసింది. 82 శాతం మార్కులు తెచ్చుకొని. సినిమా, వెబ్ సిరీస్ బిజీ షెడ్యూల్‌నే నిర్ణయించినా చదువును నిర్లక్ష్యం చేయట్లేదు. జంతువులంటే ప్రాణం పెట్టే ఈ ఆమ్మాయికి వెటర్నరీ డాక్టర్ కావాలనేదే భవిష్యత్ లక్ష్యం. కథక్ నేర్చుకుంది. సంగీతంలోనూ ప్రవేశం, పెయింటింగ్‌లో నైపుణ్యం ఉన్నాయి. ప్రయాణాలు, పుస్తక పఠనం ఆమె అభిరుచులు. ‘హండ్రెడ్’ అనే వెబ్ సిరీస్‌లో లారా దత్తాతో పోటీపడి నటించిందనే ప్రశంసలు పొందింది. చదువు, నటన రెండిటిలోనూ హండ్రెడ్ పర్సెంట్‌కి పోటీ పడగలదని నిరూపించుకుంది. ‘సినిమా నటినవుతానని కలలో కూడా ఊహించలేదు. ‘సైరాట్’ డైరెక్టర్ నాగరాజ్‌ది, మాది ఒకే ఊరు. మా కుటుంబానికి తెలిసిన వ్యక్తి. ఆడిషన్స్ కోసం మా ఊరొచ్చాడు. నన్ను చూసి.. మా అమ్మ, నాన్నతో మాట్లాడి లీడ్ రోల్‌కి ఓకే చేశాడు. అప్పుడు నేను ఎయిత్ క్లాస్ చదువుతున్న’ అంటూ తెరంగేట్ర నేపథ్యాన్ని గుర్తు చేసుకుంది రింకు రాజ్ గురు. -
ఆ హీరోయిన్‌కు ఇంటర్లో 82%
మరాఠిలో తెరకెక్కిన సైరత్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిన విషయమే. ఈ చిత్రంలో ఆర్చీగా రింకూ రాజ్‌గురు కనబర్చిన నటన ప్రేక్షకుల్ని అబ్బురపరిచింది. పిన్న వయస్సులోనే అద్భుతమైన అభినయం కనబర్చిన రింకూకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. 2016లో సినిమా విడుదలైన సమయంలో రింకూ పాఠశాల విద్యను అభ్యసిస్తున్నారు. తాజాగా రింకూ తన ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఇటీవలే విడుదలయిన మహారాష్ట్ర ఇంటర్ ఫలితాల్లో ఆమె 82 శాతం మార్కులు సాధించారు. ఆర్ట్స్ విభాగంలో ఆమెకు 650 మార్కులకుగాను 533 మార్కులు వచ్చాయి. ఈ సందర్భంగా రింకూ తండ్రి మహాదేవ్ రాజ్‌గురు షోలాపూర్‌లో మీడియాతో మాట్లాడారు. రింకూ సినిమాలు కొనసాగిస్తూనే గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తుందన్నారు. రింకూ పదవ తరగతిలో 66 శాతం మార్కులు సాధించారని గుర్తుచేశారు. ప్రస్తుతం రింకూ కర్ణాటకలోని బెల్గామ్‌లో జరుగుతున్న సినిమా షూటింగ్లో పాల్గొంటుందని చెప్పారు. స్వచ్ఛమైన ప్రేమకథతో సహజమైన టేకింగ్ తో తెరకెక్కిన 'సైరత్' సినిమా యావత్ దేశాన్ని మరాఠి చిత్రపరిశ్రమ వైపు చూసేలా చేసింది. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ. వందకోట్లు వసూలు చేసింది. -
స్కార్ఫ్‌తో ఉన్నా భయపడుతూనే!: నటి
ముంబై: అభిమానం హద్దులుదాటితే హీరోయిన్లు కాస్త వెనకడుకు వేస్తారు. అందరిలోకి అంత సులువుగా వచ్చి కలిసిపోవడానికి కాస్త ఇబ్బంది పడతారు. ప్రస్తుతం మారాఠీ బ్లాక్ బస్టర్ మూవీ 'సైరత్' హీరోయిన్ రింకూ రాజ్‌గురు పరిస్థితి అలాగే ఉంది. ఎనిమిదో తరగతి చదువుతుండగానే నటించిన ఆ మూవీ తొమ్మిదో తరగతి చదువుతుండగా గతేడాది విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న ఈ చిన్నది బయటకు రావాలంటే మాత్రం వణికిపోతోంది. ఎందుకంటే గతేడాది మూవీ విడుదలైనప్పటినుంచీ షోలాపూర్ జిల్లా అక్లుజ్ గ్రామంలో ఆమె ఇంటికి అభిమానులు ఎక్కువగా రావడంతో తల్లిదండ్రులు ఇంటినుంచి బటయకు పంపేందుకు పదే పదే ఆలోచిస్తున్నారు. సైరత్ విడుదలై ఏడాది ముగుస్తున్న సందర్భంగా చిన్నది రింకూ మీడియాతో ముచ్చటించింది. 'సైరత్ విడుదల తర్వాత నన్ను చూసేందుకు జనాలు ఇంటి ముందు క్యూ కడుతున్నారు. బజారుకు వెళ్తే కూడా కొందరు గుర్తించి ఫాలో అవడం భయపెడుతుంది. నన్ను గుర్తుపట్టి నాతో మాట్లాడాలని కొందరు చూస్తుంటారు. నా ఆటోగ్రాఫ్ తీసుకోవాలని కొందరు వెంబడించడం మాత్రం తీవ్ర ఆందోళనకు గురిచేసింది. స్కార్క్ ధరించి బయటకు వెళ్లాలంటే కూడా భయంగా ఉంది. నా కళ్లను చూసి చాలామంది ఇట్టే గుర్తుపట్టేస్తున్నారు. దీంతో నా సమస్యలు మళ్లీ మొదటికి వచ్చాయనిపిస్తోంది. అసలే నాది చిన్న వయసు కావడంతో వచ్చిన వారు నాతో ఎలా ప్రవర్తిస్తారోనని, వారితో మాట్లాడుతూ కూర్చుంటే ఎలాంటి సమస్యలు తలెత్తుతాయోనని చాలా సందర్భాల్లో బయటకు రావడం మానేశాను' అని రింకూ చెప్పుకొచ్చింది. -
మళ్లీ స్కూలుకు వెళుతున్న హీరోయిన్!
ముంబై: మరాఠీ బ్లాక్ బస్టర్ 'సైరత్' సినిమాలో హీరోయిన్ గా నటించిన రింకూ రాజ్ గురు మళ్లీ స్కూల్ బాట పట్టింది. మరాఠీ చిత్రపరిశ్రమలోనే అతి పెద్ద హిట్ గా రికార్డు సృష్టించిన 'సైరత్' చిత్రంలో ఆర్చీగా రింకూ కనబర్చిన నటన ప్రేక్షకుల్ని అబ్బురపరిచింది. పిన్న వయస్సులోనే అద్భుతమైన అభినయం కనబర్చిన రింకూకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. రింకూ ప్రస్తుతం పది పదో తరగతి చదువుతున్నది. ఆమె బుధవారం స్నేహితులతో కలిసి షోలాపూర్ జిల్లాలోని అక్లుజ్ గ్రామంలోని తన పాఠశాలకు వెళ్లింది. స్వచ్ఛమైన ప్రేమకథతో సహజమైన టేకింగ్ తో తెరకెక్కిన 'సైరత్' సినిమా యావత్ దేశాన్ని మరాఠి చిత్రపరిశ్రమ వైపు చూసేలా చేసింది. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ. వందకోట్లు వసూలు చేసింది. ఈ సినిమా ఆడినన్ని రోజులు థియేటర్ల వద్ద పండుగ వాతావరణం కనిపించింది. కనీవినీ ఎరుగని రికార్డుల మోతమోగించడంతో నిన్నమొన్నటి వరకు ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్, టీవీ కార్యక్రమాలతో బిజీగా గడిపిన రింకూ రాజ్ గురు మళ్లీ తిరిగి తరగతి గదికి చేరింది. తన పాత పాఠశాలలోనే ఆమె పదో తరగతి పూర్తి చేయాలనుకుంటోంది. ఈ నెల 12న తన స్వగ్రామం అక్లుజ్ కు వచ్చిన రింకూ రాజ్ గురుకు గ్రామంలో అద్భుతమైన స్వాగతం లభించింది. -
బడ్జెట్ 4కోట్లు, కలెక్షన్లు 75 కోట్లు
అంఛనాలను తలకిందులు చేస్తూ ఓ మరాఠీ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. స్టార్ హీరోలు కూడా వంద కోట్ల కలెక్షన్ల కోసం అష్టకష్టాలు పడుతుంటే.. ఓ చిన్న సినిమా శరవేగంగా వందకోట్ల మార్క్ వైపు అడుగులు వేస్తుంది. నూతన నటీనటులు ఆకాష్ తోసర్, రింకూ రాజ్‌గురు హీరో హీరోయిన్లుగా మరాఠీలో తెరకెక్కిన చిన్న సినిమా సైరత్. నాగరాజ్ మంజులే స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్కడ సంచలన విజయం సాధించింది. కేవలం 4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్, 63వ జాతీయ అవార్డుల వేదిక మీద కూడా సత్తా చాటింది. ఎలాంటి అంఛనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా స్పెషల్ జ్యూతీ అవార్డును సొంతం చేసుకుంది. సాధారణంగా అవార్డు సినిమాలకు కలెక్షన్లు రావన్న అపవాదు ఉంది. అలాంటి అనుమానాలను కూడా దూరం చేస్తూ సైరత్ భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. 4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా 31 రోజుల్లో 75 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇప్పటికీ మంచి కలెక్షన్లు సాధిస్తుండటంతో వంద కోట్ల క్లబ్లో చేరడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.