మళ్లీ స్కూలుకు వెళుతున్న హీరోయిన్! | Sairat star Rinku Rajguru returns to school | Sakshi
Sakshi News home page

మళ్లీ స్కూలుకు వెళుతున్న హీరోయిన్!

Published Wed, Jun 22 2016 3:54 PM | Last Updated on Mon, Sep 4 2017 3:08 AM

మళ్లీ స్కూలుకు వెళుతున్న హీరోయిన్!

మళ్లీ స్కూలుకు వెళుతున్న హీరోయిన్!

ముంబై: మరాఠీ బ్లాక్ బస్టర్ 'సైరత్' సినిమాలో హీరోయిన్ గా నటించిన రింకూ రాజ్ గురు మళ్లీ స్కూల్ బాట పట్టింది. మరాఠీ చిత్రపరిశ్రమలోనే అతి పెద్ద హిట్ గా రికార్డు సృష్టించిన 'సైరత్' చిత్రంలో ఆర్చీగా రింకూ కనబర్చిన నటన ప్రేక్షకుల్ని అబ్బురపరిచింది.  పిన్న వయస్సులోనే అద్భుతమైన అభినయం కనబర్చిన రింకూకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి.

రింకూ ప్రస్తుతం పది పదో తరగతి చదువుతున్నది. ఆమె బుధవారం స్నేహితులతో కలిసి షోలాపూర్ జిల్లాలోని అక్లుజ్ గ్రామంలోని తన పాఠశాలకు వెళ్లింది. స్వచ్ఛమైన ప్రేమకథతో సహజమైన టేకింగ్ తో తెరకెక్కిన 'సైరత్' సినిమా యావత్ దేశాన్ని మరాఠి చిత్రపరిశ్రమ వైపు చూసేలా చేసింది. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ. వందకోట్లు వసూలు చేసింది. ఈ సినిమా ఆడినన్ని రోజులు థియేటర్ల వద్ద పండుగ వాతావరణం కనిపించింది. కనీవినీ ఎరుగని రికార్డుల మోతమోగించడంతో నిన్నమొన్నటి వరకు ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్, టీవీ కార్యక్రమాలతో బిజీగా గడిపిన రింకూ రాజ్ గురు మళ్లీ తిరిగి తరగతి గదికి చేరింది. తన పాత పాఠశాలలోనే ఆమె పదో తరగతి పూర్తి చేయాలనుకుంటోంది.  ఈ నెల 12న తన స్వగ్రామం అక్లుజ్ కు వచ్చిన రింకూ రాజ్ గురుకు గ్రామంలో అద్భుతమైన స్వాగతం లభించింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement