ఇరగదీసింది! | Janhvi Kapoor will have a sultry solo dance sequence in Dhadak | Sakshi
Sakshi News home page

ఇరగదీసింది!

Published Thu, Feb 8 2018 12:47 AM | Last Updated on Thu, Feb 8 2018 12:47 AM

Janhvi Kapoor will have a sultry solo dance sequence in Dhadak  - Sakshi

తుషార్‌ కలియా, జాన్వీ కపూర్‌

అవును..డ్యాన్స్‌ను ఇరగదీసింది శ్రీదేవి తనయ జాన్వీ. మరాఠీ సూపర్‌ హిట్‌ ‘సైరట్‌’ చిత్రం హిందీలో ‘థడక్‌’ అనే టైటిల్‌తో రూపొందుతున్న సంగతి తెలిసిందే. శశాంక్‌ కేతన్‌ దర్శకత్వంలో ఇషాన్‌ కట్టర్, జాన్వీ కపూర్‌ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం రీసెంట్‌గా ఓ సోలో సాంగ్‌ను ముంబైలో జాన్వీ కపూర్‌పై చిత్రీకరించారు.  కొరియోగ్రాఫర్‌ తుషార్‌ కలియా డిజైన్‌ చేసిన ఈ రేసీ సాంగ్‌లో డ్యాన్స్‌ కుమ్మేసిందట జాన్వీ.

ఈ సాంగ్‌ షూట్‌కు రెండు రోజుల ముందు నుంచే ఫుల్‌గా ప్రాక్టీస్‌ చేసి లొకేషన్‌లోకి వచ్చిందట జాన్వీ. ‘‘చాలా కాన్ఫిడెంట్‌గా డ్యాన్స్‌ చేసింది జాన్వీ. ఏ డ్యాన్స్‌ మూమెంట్‌లో చేంజ్‌ అడగలేదు. సాంగ్‌ బ్రేక్‌ టైమ్‌లోనూ నెక్ట్స్‌ స్టెప్‌ కోసం ప్రాక్టీస్‌ చేస్తూనే ఉంది’’ అని జాన్వీని పొగిడేశారు తుషార్‌. ఈ సినిమాను జూలై 20న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. హీరోయిన్‌గా నటిస్తున్న తొలి సినిమాలోనే కొరియోగ్రాఫర్‌ను మెప్పించే రేంజ్‌లో జాన్వీ డ్యాన్స్‌ చేయడం విశేషమే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement