Sairat
-
ఆ హీరోయిన్‌కు ఇంటర్లో 82%
మరాఠిలో తెరకెక్కిన సైరత్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిన విషయమే. ఈ చిత్రంలో ఆర్చీగా రింకూ రాజ్‌గురు కనబర్చిన నటన ప్రేక్షకుల్ని అబ్బురపరిచింది. పిన్న వయస్సులోనే అద్భుతమైన అభినయం కనబర్చిన రింకూకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. 2016లో సినిమా విడుదలైన సమయంలో రింకూ పాఠశాల విద్యను అభ్యసిస్తున్నారు. తాజాగా రింకూ తన ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఇటీవలే విడుదలయిన మహారాష్ట్ర ఇంటర్ ఫలితాల్లో ఆమె 82 శాతం మార్కులు సాధించారు. ఆర్ట్స్ విభాగంలో ఆమెకు 650 మార్కులకుగాను 533 మార్కులు వచ్చాయి. ఈ సందర్భంగా రింకూ తండ్రి మహాదేవ్ రాజ్‌గురు షోలాపూర్‌లో మీడియాతో మాట్లాడారు. రింకూ సినిమాలు కొనసాగిస్తూనే గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తుందన్నారు. రింకూ పదవ తరగతిలో 66 శాతం మార్కులు సాధించారని గుర్తుచేశారు. ప్రస్తుతం రింకూ కర్ణాటకలోని బెల్గామ్‌లో జరుగుతున్న సినిమా షూటింగ్లో పాల్గొంటుందని చెప్పారు. స్వచ్ఛమైన ప్రేమకథతో సహజమైన టేకింగ్ తో తెరకెక్కిన 'సైరత్' సినిమా యావత్ దేశాన్ని మరాఠి చిత్రపరిశ్రమ వైపు చూసేలా చేసింది. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ. వందకోట్లు వసూలు చేసింది. -
సైరట్ జింగాత్ పాట
-
ఇరగదీసింది!
అవును..డ్యాన్స్‌ను ఇరగదీసింది శ్రీదేవి తనయ జాన్వీ. మరాఠీ సూపర్ హిట్ ‘సైరట్’ చిత్రం హిందీలో ‘థడక్’ అనే టైటిల్‌తో రూపొందుతున్న సంగతి తెలిసిందే. శశాంక్ కేతన్ దర్శకత్వంలో ఇషాన్ కట్టర్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం రీసెంట్గా ఓ సోలో సాంగ్‌ను ముంబైలో జాన్వీ కపూర్‌పై చిత్రీకరించారు. కొరియోగ్రాఫర్ తుషార్ కలియా డిజైన్ చేసిన ఈ రేసీ సాంగ్‌లో డ్యాన్స్ కుమ్మేసిందట జాన్వీ. ఈ సాంగ్ షూట్‌కు రెండు రోజుల ముందు నుంచే ఫుల్‌గా ప్రాక్టీస్ చేసి లొకేషన్లోకి వచ్చిందట జాన్వీ. ‘‘చాలా కాన్ఫిడెంట్‌గా డ్యాన్స్ చేసింది జాన్వీ. ఏ డ్యాన్స్ మూమెంట్లో చేంజ్ అడగలేదు. సాంగ్ బ్రేక్ టైమ్‌లోనూ నెక్ట్స్ స్టెప్ కోసం ప్రాక్టీస్ చేస్తూనే ఉంది’’ అని జాన్వీని పొగిడేశారు తుషార్. ఈ సినిమాను జూలై 20న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. హీరోయిన్గా నటిస్తున్న తొలి సినిమాలోనే కొరియోగ్రాఫర్‌ను మెప్పించే రేంజ్లో జాన్వీ డ్యాన్స్ చేయడం విశేషమే. -
ఎవరేమనుకున్నా నా నిర్ణయం అదే
బాలీవుడ్లో ఎవరైనా టాప్ సెలబ్రిటీస్ వారసులను పరిచయం చేయాలంటే ముందుగా వినిపించేది దర్శక–నిర్మాత కరణ్ జోహార్ పేరు. ప్రస్తుతం అందాల తార శ్రీదేవి తనయ జాన్వీ కపూర్, షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ కట్టర్‌ను హిందీ తెరకు పరిచయం చేస్తున్నారు కరణ్ జోహార్. ‘ధడక్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాకు కరణŠ జోహార్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. మరాఠి సూపర్ íß ట్ సినిమా ‘సైర ట్’కు ఇది అఫీషియల్ రీమేక్. న్యూ ఇయర్ సందర్భంగా జాన్వీ, ఇషాన్‌కు కరణ్ జోహార్ ఓ లేఖ రాశారు. ‘కాలింగ్ కరణ్’ షోలో దాన్ని చదివి వినిపించారు కూడా. ‘‘మై డియర్ జాన్వీ, ఇషాన్ ఈ సంవత్సరంతో మీ లైఫ్‌లో సరికొత్త జర్నీ మొదలు కాబోతోంది. ఈ ఇయర్ మీకు చాలా ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్‌లు ఇవ్వనుంది. తొలి సినిమా రిలీజ్, ప్రమోషన్స్, లింక్ అప్స్, క్రిటిసిజం, పొగడ్తలు, ఫేమ్, ఫెయిల్యూర్ ఇలా ఎన్నో చూడబోతున్నారు. మీకో చిన్న సలహా ఇవ్వాలనుకుంటున్నాను. వీటన్నింటిని అంత సీరియస్‌గా తీసుకోకండి. ఈ ఇనిషియల్ డేస్‌ను బాగా ఆస్వాదించండి. ఇవి మళ్లీ తిరిగి రావు. మీలోని బెస్ట్ క్వాలిటీస్ ఏంటంటే మీరింకా విద్యార్థులే. మీ నమ్మకాలు, మీ ఇన్నోసెన్స్ కోల్పోకుండా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు కరణ్. నో మోర్ డిప్లోమసీ: బాలీవుడ్ అగ్ర దర్శక–నిర్మాత కరణ్ జోహార్ న్యూ ఇయర్ సందర్భంగా కొన్ని న్యూ రిజల్యూషన్స్ తీసుకున్నారు. ఈ సంవత్సరం నుంచి నా మిత్రుల బర్త్డేస్కు స్వయంగా కలిసి విష్ చేయాలనుకుంటున్నాను. ఇక నుంచి ట్రైలర్స్ అయినా, సినిమాలైనా నాకు మనస్ఫూర్తిగా నచ్చితేనే పొగుడుతాను. ఇది వరకు డిప్లొమసి ప్రదర్శించినందుకు సారీ. నా సినిమాల ప్రమోషన్ విరివిగా చేసుకోవాలనుకుంటున్నాను... ఎవ‡రేమనుకున్నా సరే... అంటూ తన నిర్ణయాలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు కరణ్. -
స్కార్ఫ్‌తో ఉన్నా భయపడుతూనే!: నటి
ముంబై: అభిమానం హద్దులుదాటితే హీరోయిన్లు కాస్త వెనకడుకు వేస్తారు. అందరిలోకి అంత సులువుగా వచ్చి కలిసిపోవడానికి కాస్త ఇబ్బంది పడతారు. ప్రస్తుతం మారాఠీ బ్లాక్ బస్టర్ మూవీ 'సైరత్' హీరోయిన్ రింకూ రాజ్‌గురు పరిస్థితి అలాగే ఉంది. ఎనిమిదో తరగతి చదువుతుండగానే నటించిన ఆ మూవీ తొమ్మిదో తరగతి చదువుతుండగా గతేడాది విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న ఈ చిన్నది బయటకు రావాలంటే మాత్రం వణికిపోతోంది. ఎందుకంటే గతేడాది మూవీ విడుదలైనప్పటినుంచీ షోలాపూర్ జిల్లా అక్లుజ్ గ్రామంలో ఆమె ఇంటికి అభిమానులు ఎక్కువగా రావడంతో తల్లిదండ్రులు ఇంటినుంచి బటయకు పంపేందుకు పదే పదే ఆలోచిస్తున్నారు. సైరత్ విడుదలై ఏడాది ముగుస్తున్న సందర్భంగా చిన్నది రింకూ మీడియాతో ముచ్చటించింది. 'సైరత్ విడుదల తర్వాత నన్ను చూసేందుకు జనాలు ఇంటి ముందు క్యూ కడుతున్నారు. బజారుకు వెళ్తే కూడా కొందరు గుర్తించి ఫాలో అవడం భయపెడుతుంది. నన్ను గుర్తుపట్టి నాతో మాట్లాడాలని కొందరు చూస్తుంటారు. నా ఆటోగ్రాఫ్ తీసుకోవాలని కొందరు వెంబడించడం మాత్రం తీవ్ర ఆందోళనకు గురిచేసింది. స్కార్క్ ధరించి బయటకు వెళ్లాలంటే కూడా భయంగా ఉంది. నా కళ్లను చూసి చాలామంది ఇట్టే గుర్తుపట్టేస్తున్నారు. దీంతో నా సమస్యలు మళ్లీ మొదటికి వచ్చాయనిపిస్తోంది. అసలే నాది చిన్న వయసు కావడంతో వచ్చిన వారు నాతో ఎలా ప్రవర్తిస్తారోనని, వారితో మాట్లాడుతూ కూర్చుంటే ఎలాంటి సమస్యలు తలెత్తుతాయోనని చాలా సందర్భాల్లో బయటకు రావడం మానేశాను' అని రింకూ చెప్పుకొచ్చింది. -
యస్...అన్నారండోయ్!
‘ఇందుమూలంగా యావన్మంది భారతీయ సినీ ప్రేక్షకులకూ తెలియజేయునది ఏమనగా... అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాహ్నవీ కపూర్ త్వరలో కథానాయిగా తెరంగేట్రం చేస్తున్నారహో!’ - అంటూ చాలాసార్లు బీ-టౌన్ మీడియా ఈ టైపు దండోరా వేసింది. ప్రతిసారి బోనీ కపూర్-శ్రీదేవి దంపతుల నుంచి ‘సారీ’ అనే సమాధానమే వినిపించింది. ఈసారి మాత్రం ‘యస్’ అన్నారండోయ్! ‘‘జాహ్నవిను వెండితెరకు పరిచయం చేసే బాధ్యత ప్రముఖ బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ తీసుకున్నారు. ఈ ఏడాది వందకోట్ల వసూళ్లు సాధించిన మరాఠీ చిత్రం ‘సైరాట్’ రీమేక్ ద్వారా జాహ్నవి తెరంగేట్రం చేస్తున్నారు’’ అని బీ-టౌన్ మీడియా తాజా దండోరా సారాంశం. దీనిపై జాహ్నవి తండ్రి బోనీ కపూర్ స్పందిస్తూ - ‘‘నిజమే. మా అమ్మాయి త్వరలో కథానాయికగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది’’ అని స్పష్టం చేశారు. అయితే.. అమ్మాయి నటించబోయేది ‘సైరాట్’ రీమేకా? కాదా? అనేది చెప్పలేదు. ఆయన మాట్లాడుతూ - ‘‘జాహ్నవి పరిచయ చిత్రం గురించి కరణ్ జోహార్‌తో చర్చలు జరుగుతున్నాయి. కానీ, ఏ సినిమాతో మా అమ్మాయి పరిచయం అవుతుందనేది చెప్పలేం. ఇటీవల కరణ్ జోహార్ ‘సైరాట్’ హిందీ రీమేక్ రైట్స్ తీసుకోవడంతో అందరూ ఆ సినిమానే జాహ్నవి చేస్తుందని అనుకుంటున్నారు’’ అన్నారు. మొత్తానికి శ్రీదేవి ఓ టెన్షన్ నుంచి గట్టెక్కేశారు. అమ్మాయి వెండితెరపై పరిచయమయ్యే తొలి సినిమా కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు ముద్దుల కూతురు ఎలా నటిస్తుందనే టెన్షన్ మొదలై ఉంటుంది!! -
మళ్లీ స్కూలుకు వెళుతున్న హీరోయిన్!
ముంబై: మరాఠీ బ్లాక్ బస్టర్ 'సైరత్' సినిమాలో హీరోయిన్ గా నటించిన రింకూ రాజ్ గురు మళ్లీ స్కూల్ బాట పట్టింది. మరాఠీ చిత్రపరిశ్రమలోనే అతి పెద్ద హిట్ గా రికార్డు సృష్టించిన 'సైరత్' చిత్రంలో ఆర్చీగా రింకూ కనబర్చిన నటన ప్రేక్షకుల్ని అబ్బురపరిచింది. పిన్న వయస్సులోనే అద్భుతమైన అభినయం కనబర్చిన రింకూకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. రింకూ ప్రస్తుతం పది పదో తరగతి చదువుతున్నది. ఆమె బుధవారం స్నేహితులతో కలిసి షోలాపూర్ జిల్లాలోని అక్లుజ్ గ్రామంలోని తన పాఠశాలకు వెళ్లింది. స్వచ్ఛమైన ప్రేమకథతో సహజమైన టేకింగ్ తో తెరకెక్కిన 'సైరత్' సినిమా యావత్ దేశాన్ని మరాఠి చిత్రపరిశ్రమ వైపు చూసేలా చేసింది. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ. వందకోట్లు వసూలు చేసింది. ఈ సినిమా ఆడినన్ని రోజులు థియేటర్ల వద్ద పండుగ వాతావరణం కనిపించింది. కనీవినీ ఎరుగని రికార్డుల మోతమోగించడంతో నిన్నమొన్నటి వరకు ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్, టీవీ కార్యక్రమాలతో బిజీగా గడిపిన రింకూ రాజ్ గురు మళ్లీ తిరిగి తరగతి గదికి చేరింది. తన పాత పాఠశాలలోనే ఆమె పదో తరగతి పూర్తి చేయాలనుకుంటోంది. ఈ నెల 12న తన స్వగ్రామం అక్లుజ్ కు వచ్చిన రింకూ రాజ్ గురుకు గ్రామంలో అద్భుతమైన స్వాగతం లభించింది. -
ఆ సినిమా రీమేక్ రైట్స్‌కు భారీ పోటీ
ఫిలిం ఇండస్ట్రీలో సక్సెసే కీలకం అందుకే చాలా మంది దర్శక నిర్మాతలు కొత్త కథలతో ప్రయోగాలు చేసేకన్నా, వేరే భాషలో సక్సెస్ అయిన సినిమాలను రీమేక్ చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. టాప్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు కూడా ఇలా రీమేక్ సినిమాల మీద ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఓ మరాఠీ సినిమా రీమేక్ రైట్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. కేవలం 5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి 60 కోట్లు పైగా వసూలు చేసిన ఓ చిన్న సినిమాను తెలుగులో తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరాఠీలో ఘన విజయం సాధించిన సైరత్ సినిమా, తెలుగు రీమేక్ రైట్స్ కోసం చాలామంది నిర్మాతలు పోటీ పడుతున్నారు. నాగరాజ్ మంజులే దర్శకత్వంలో జీ స్టూడియోస్ సంస్థ నిర్మించిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఏప్రిల్ 29న రిలీజ్ అయిన ఈ అందమైన ప్రేమకథ తెలుగు ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకుంటుందన్న నమ్మకంతో ఉన్నారు దర్శక నిర్మాతలు. ప్రస్తుతానికి రీమేక్ రైట్స్ ఎవరూ సొంతం చేసుకోకపోయినా త్వరలోనే సైరత్ తెలుగు రీమేక్ పై క్లారిటీ రానుంది.