ఆ సినిమా రీమేక్ రైట్స్కు భారీ పోటీ | marathi movie sairat to get telugu remake | Sakshi
Sakshi News home page

ఆ సినిమా రీమేక్ రైట్స్కు భారీ పోటీ

Published Sat, May 21 2016 12:45 PM | Last Updated on Mon, Sep 4 2017 12:37 AM

ఆ సినిమా రీమేక్ రైట్స్కు భారీ పోటీ

ఆ సినిమా రీమేక్ రైట్స్కు భారీ పోటీ

ఫిలిం ఇండస్ట్రీలో సక్సెసే కీలకం అందుకే చాలా మంది దర్శక నిర్మాతలు కొత్త కథలతో ప్రయోగాలు చేసేకన్నా, వేరే భాషలో సక్సెస్ అయిన సినిమాలను రీమేక్ చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. టాప్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు కూడా ఇలా రీమేక్ సినిమాల మీద ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఓ మరాఠీ సినిమా రీమేక్ రైట్స్కు భారీ డిమాండ్ ఏర్పడింది. కేవలం 5 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి 60 కోట్లు పైగా వసూలు చేసిన ఓ చిన్న సినిమాను తెలుగులో తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

మరాఠీలో ఘన విజయం సాధించిన సైరత్ సినిమా, తెలుగు రీమేక్ రైట్స్ కోసం చాలామంది నిర్మాతలు పోటీ పడుతున్నారు. నాగరాజ్ మంజులే దర్శకత్వంలో జీ స్టూడియోస్ సంస్థ నిర్మించిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఏప్రిల్ 29న రిలీజ్ అయిన ఈ అందమైన ప్రేమకథ తెలుగు ఆడియన్స్ను కూడా ఆకట్టుకుంటుందన్న నమ్మకంతో ఉన్నారు దర్శక నిర్మాతలు. ప్రస్తుతానికి రీమేక్ రైట్స్ ఎవరూ సొంతం చేసుకోకపోయినా త్వరలోనే సైరత్ తెలుగు రీమేక్ పై క్లారిటీ రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement