ఇన్‌కమ్‌టాక్స్‌ ఆఫీసర్‌గా రవితేజ.. ఆ హిట్‌ సినిమానే టార్గెట్‌ | Raviteja Will Be Doing A Ajay Devagan Raid Movie Telugu Remake | Sakshi
Sakshi News home page

ఇన్‌కమ్‌టాక్స్‌ ఆఫీసర్‌గా రవితేజ.. ఆ హిట్‌ సినిమానే టార్గెట్‌

Published Mon, Jul 17 2023 6:24 AM | Last Updated on Mon, Jul 17 2023 7:14 AM

Raviteja Will Be Doing A Ajay Devagan Raid Movie Telugu Remake - Sakshi

హీరో రవితేజ ఇన్‌కమ్‌టాక్స్‌ ఆఫీసర్‌గా చార్జ్‌ తీసుకునే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. అజయ్‌దేవగన్‌ హీరోగా రాజ్‌ కుమార్‌ గుప్తా దర్శకత్వం వహించిన ‘రైడ్‌’ (2018) సినిమా హిందీలో ఘన విజయం సాధించింది. నిజాయితీ గల ఓ ఇన్‌కమ్‌టాక్స్‌ ఆఫీసర్‌ అమీ పట్నాయక్‌ (అజయ్‌ దేవగన్‌) తనకు ఎదురైన సవాళ్లను ఏ విధంగా సాల్వ్‌ చేశాడన్నదే ‘రైడ్‌’ కథాంశం.

ఈ సినిమా తెలుగులో రీమేక్‌ కానుందంటూ వార్తలు వచ్చాయి. కొందరు హీరోల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. తాజాగా మరోసారి ‘రైడ్‌’ రీమేక్‌ ప్రస్తావన టాలీవుడ్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ రీమేక్‌లో రవితేజ హీరోగా నటిస్తారని, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తుందని టాక్‌. మరి.. ‘రైడ్‌’ రీమేక్‌లో రవితేజ నటిస్తారా? లేదా? తెలియాలంటే వేచి చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement