Ajay devagan
-
బాలీవుడ్ లో మరో సంచలనం
-
Bollywood: మల్టీస్టార్స్.. బాక్సాఫీస్‌పై వార్!
ఒక్కోసారి ఒక్కో ఇండస్ట్రీలో ఒక్కో ట్రెండ్ కనిపిస్తుంటుంది. ప్రస్తుతం బాలీవుడ్లో మల్టీస్టారర్ ట్రెండ్ కనిపిస్తోంది. గతంలో కూడా బాలీవుడ్ తెరపై మల్టీస్టారర్ ట్రెండ్ ఉంది. కానీ ఇప్పుడు ఈ తరహా చిత్రాలు చాలానే నిర్మాణంలో ఉన్నాయి. ఇలా మల్టీస్టార్స్‌తో బాక్సాఫీస్‌పై వార్‌కు రెడీ అవుతున్న చిత్రాల గురించి, ఆ చిత్రాల్లో నటిస్తున్న హీరోల గురించి తెలుసుకుందాం. పోలీస్ పవర్ఓ సినిమాలో ఇద్దరు స్టార్ యాక్టర్స్ కనిపిస్తే మల్టీస్టారర్ అనేస్తుంటారు సినీ అభిమానులు. అలాంటిది ఏడుగురు స్టార్స్ కలిసి ఓ సినిమా చేస్తే... అది బడా మల్టీస్టారర్ అన్నమాట. ఈ ప్రస్తావన ‘సింగమ్ ఎగైన్’ సినిమా గురించే. బాలీవుడ్ హిట్ ఫ్రాంచైజీలో ఒకటైన ‘సింగమ్’ సిరీస్ నుంచి ‘సింగమ్ ఎగైన్’ రానుంది. అజయ్ దేవగన్, కరీనా కపూర్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు రోహిత్ శెట్టి దర్శకుడు. పోలీస్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్ ఇతర లీడ్ రోల్స్‌లో కనిపిస్తారు. అర్జున్ కపూర్ విలన్‌గా నటిస్తున్నారని బాలీవుడ్ సమాచారం. రోహిత్ శెట్టి, అజయ్ దేవగణ్, జ్యోతి దేశ్ పాండే ఈ ‘సింగమ్ ఎగైన్’ సినిమాను నిర్మిస్తున్నారు. తొలుత ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేయాలనుకున్నారు... కానీ వాయిదా వేశారు. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని బీ టౌన్ టాక్. ఇక హీరో అజయ్ దేవగన్, దర్శకుడు రోహిత్ శెట్టిల కాంబినేషన్లో ‘సింగమ్’ సిరీస్‌లో ఇప్పటికే వచ్చిన ‘సింగమ్’ (2011), ‘సింగమ్ రిటర్న్స్’ (2014) సినిమాలు హిట్స్‌గా నిలవడంతో ‘సింగమ్ ఎగైన్’పై బాలీవుడ్లో భారీ అంచనాలు ఉన్నాయి. పైగా అక్షయ్ కుమార్‌తో రోహిత్‌శెట్టి ‘సూర్యవన్షీ’, రణ్వీర్ సింగ్‌తో ‘సింబ’ వంటి పోలీస్ యాక్షన్ సినిమాలను తీసి హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు అజయ్ దేవగన్, ఈ ఇద్దరూ, మరికొందరు స్టార్స్‌తో కలిసి రోహిత్ శెట్టి అందించనున్న ఈ ‘సింగమ్ ఎగైన్’ ఏ రేంజ్లో వసూళ్లు కొల్లగొడుతుందో చూడాలి. స్పై వార్వెండితెరపై హృతిక్ రోషన్‌తో స్పై వార్ చేస్తున్నారు ఎన్టీఆర్. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొంది, 2019లో విడుదలై బాక్ల్బస్టర్గా నిలిచిన చిత్రం ‘వార్’. వైఆర్ఎఫ్ (యశ్ రాజ్ ఫిలింస్) స్పై యూనివర్స్‌లో భాగంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘వార్’ సినిమాకు సీక్వెల్‌గా ‘వార్ 2’ తెరకెక్కుతోంది.‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో కాస్త నెగటివ్ షేడ్స్ ఉంటాయని బాలీవుడ్ సమాచారం. ఇక ‘వార్ 2’ సినిమాను తొలుత 2025 జనవరిలో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం రిలీజ్‌ను 2025 ఆగస్టు 14కు వాయిదా వేశారు. ఎన్టీఆర్ హిందీలో చేస్తున్న తొలి స్ట్రయిట్ ఫిల్మ్ కూడా ‘వార్ 2’ కావడం విశేషం.ఢీ అంటే ఢీ‘కింగ్’తో ఢీ అంటున్నారు అభిషేక్ బచ్చన్. షారుక్ ఖాన్, ఆయన తనయ సుహానా ఖాన్ లీడ్ రోల్స్‌లో ‘కింగ్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమా రూపొందనుంది. సుజోయ్ ఘోష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. నిజ జీవితంలో తండ్రీకూతుళ్లు అయిన షారుక్ ఖాన్, సుహానా ఈ సినిమాలో గురు శిష్యులుగా కనిపిస్తారట. అలాగే ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్ విలన్‌గా నటించనున్నారు. ‘కింగ్’ సినిమాలో తాను విలన్‌గా నటించనున్న విషయాన్ని ఇటీవల సోషల్ మీడియాలో పరోక్షంగా కన్ఫార్మ్ చేశారు అభిషేక్ బచ్చన్. గతంలో ‘కబీ అల్విదా నా కెహనా (2006)’, ‘హ్యాపీ న్యూ ఇయర్ ’(2014) వంటి సినిమాల్లో షారుక్ ఖాన్, అభిషేక్ బచ్చన్ కలిసి నటించారు. కానీ ఈ చిత్రాల్లో ఈ ఇద్దరు హీరో తరహా పాత్రల్లో నటించారు. ఇప్పుడు ‘కింగ్’ సినిమా కోసం షారుక్ ఖాన్, అభిషేక్ ఒకరితో ఒకరు ఢీ అంటే ఢీ అంటూ తలపడనుండటం విశేషం. ప్రస్తుతం ‘కింగ్’ మూవీ ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ ఏడాదిలోనే చిత్రీకరణను ప్రారంభించాలనుకుంటున్నారు. వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని ΄్లాన్ చేస్తున్నారట.సైనికుల పోరాటంసన్నీ డియోల్ నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘బోర్డర్’ (1997). 1971లో జరిగిన ఇండియా–΄ాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. ఈ చిత్రం విడుదలై ఇరవయ్యేడేళ్లయిన సందర్భంగా ఇటీవల ‘బోర్డర్’కు సీక్వెల్‌గా ‘బోర్డర్ 2’ చిత్రాన్ని ప్రకటించారు. కాగా ‘బోర్డర్ 2’ సినిమాలో బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ కూడా మరో లీడ్ రోల్ చేయనున్నారు. ఈ విషయాన్ని ఇటీవల చిత్రబృందం ప్రకటించింది. అలాగే ఆయుష్మాన్ ఖురానా కూడా మరో లీడ్ రోల్లో కనిపించనున్నారట. అయితే ‘బోర్డర్’కు జేపీ దత్తా దర్శకత్వం వహించగా, సీక్వెల్‌కు మాత్రం అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించనున్నారు. 2026 జనవరి 23న ‘బోర్డర్ 2’ను రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.ట్రయాంగిల్ లవ్స్టోరీలవ్ అండ్ వార్ అంటున్నారు ఆలియా భట్. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్ లీడ్ రోల్లో నటించనున్న హిందీ చిత్రం ‘లవ్ అండ్ వార్’. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది జనవరిలో ప్రకటించారు. కానీ చిత్రీకరణ ఇంకా ప్రారంభం కాలేదు. సెప్టెంబరు చివర్లో లేదా అక్టోబరులో ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించనున్నారని బాలీవుడ్ టాక్. ఈ సినిమా ముక్కోణపు ప్రేమకథగా సాగుతుందట. మరి.. రణ్‌బీర్ కపూర్–ఆలియాల ప్రేమకు మధ్యలో విక్కీ కౌశల్ వస్తారా? లేక ఆలియా భట్– విక్కీ కౌశల్‌ల మధ్యలోకి రణ్‌బీర్ కపూర్ వస్తారా? అనే చర్చ బాలీవుడ్లో జరుగుతోంది. పైగా వివాహం చేసుకున్న తర్వాత రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ కలిసి చేయనున్న సినిమా కూడా ఇదే కావడంతో ‘లవ్ అండ్ వార్’పై బాలీవుడ్లో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు ఆల్రెడీ చిత్రయూనిట్ ప్రకటించింది. హౌస్‌ఫుల్ ఎంటర్టైన్మెంట్ బాలీవుడ్‌లోని హిట్ ఫ్రాంచైజీలో ‘హౌస్‌ఫుల్’ ఒకటి. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీ నుంచి నాలుగు సినిమాలు రావడం, ప్రేక్షకుల్లో ఈ ఫ్రాంచైజీకి ఉన్న ఆదరణను స్పష్టం చేసింది. తాజాగా ‘హౌస్‌ఫుల్ 5’ కూడా రెడీ అవుతోంది. సంజయ్ దత్, అక్షయ్ కుమార్, జాన్ అబ్రహాం, అభిషేక్ బచ్చన్, కృతీ సనన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇందులో నటిస్తున్నారు. తరుణ్ మన్సుఖాని దర్శకుడు. ఈ కామెడీ ఎంటర్టైనర్ మూవీని తొలుత ఈ ఏడాది చివర్లోనే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఆ తర్వాత 2025 జూన్ 6న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రమే కాకుండా అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న ‘వెల్కమ్ టు ది జంగిల్’, ‘జాలీ ఎల్ఎల్బీ 3’ సినిమాల కూడా మల్టీ స్టారర్ మూవీసే! ఈ చిత్రాలు కూడా 2025లోనే విడుదల కానున్నాయని బాలీవుడ్ సమాచారం.ఈ చిత్రాలే కాదు.. కార్తీక్ ఆర్యన్, ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి దిమ్రీ జంటగా నటిస్తున్న ‘భూల్ భూలయ్యా 3’లో మాధురీ దీక్షిత్, విద్యాబాలన్ కీ రోల్స్‌లో నటిస్తున్నారు. ‘రేస్ 4’ మూవీలో సైఫ్ అలీఖాన్, సిద్ధార్థ్ మల్హోత్రా లీడ్ రోల్స్‌లో కనిపిస్తారని బాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. ఇలా మరికొన్ని మల్టీస్టారర్ మూవీస్ బాలీవుడ్లో ఉన్నాయి.– ముసిమి శివాంజనేయులు -
హిందీలో ‘మర్యాద రామన్న’ సిక్వెల్.. సోనాక్షి ప్లేస్‌లో మృణాల్!
సన్నాఫ్ సర్దార్‌గా అజయ్ దేవగన్ అతి త్వరలో స్కాట్లాండ్ వెళ్లనున్నారని బాలీవుడ్ సమాచారం. అజయ్ దేవగన్, సోనాక్షీ సిన్హా, సంజయ్ దత్ లీడ్ రోల్స్‌లో అశ్వినీ ధీర్ దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రం ‘సన్నాఫ్ సర్దార్’ (2012). రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మర్యాద రామన్న’కు హిందీ రీమేక్‌గా ఈ చిత్రం రూపొందింది. ఇప్పుడు పన్నెండేళ్ల తర్వాత ‘సన్నాఫ్ సర్దార్’కు సీక్వెల్‌గా ‘సన్నాఫ్ సర్దార్ 2’ చిత్రం రానుందని సమాచారం. తొలి భాగంలో లీడ్ రోల్స్‌లో నటించిన అజయ్ దేవగన్, సంజయ్ దత్ సీక్వెల్లోనూ నటించనున్నారని, హీరోయిన్గా మాత్రం సోనాక్షీ సిన్హా ప్లేస్‌లో మృణాల్ ఠాకూర్ కనిపించనున్నారని భోగట్టా. ఈ చిత్రానికి సంబంధించిన ఎక్కువ శాతం షూటింగ్‌ని స్కాట్లాండ్లో జరిపేలా ప్లాన్ చేశారట. ఈ షెడ్యూల్ దాదాపు యాభై రోజులకు పైగా ఉంటుందని, అజయ్ దేవగన్–మృణాల్ ఠాకూర్ల కాంబినేషన్ ట్రాక్ అంతా విదేశాల్లోనే చిత్రీకరిస్తారని టాక్. ఈ సినిమాకు అజయ్ దేవగనే దర్శకత్వం వహిస్తారనే వార్త కూడా ప్రచారంలో ఉంది. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
పుష్ప-2తో పోటీ పడనున్న మూవీ.. షూటింగ్లో స్టార్ హీరోకు గాయాలు!
బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగణ్ నటిస్తోన్న తాజా చిత్రం సింగం-3. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ముంబయిలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో ఫైట్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఓ ఫైట్ సీన్ చేస్తుండగా అజయ్ దేవగణ్ గాయపడినట్లు తెలుస్తోంది. పొరపాటున అజయ్ కంటికి గాయమైనట్లు సమాచారం. అయినప్పటికీ అజయ్ దేవగణ్ వెంటనే షూటింగ్‌ని తిరిగి ప్రారంభించినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా.. ఇటీవలే సింగం-3 చిత్రంలో అజయ్ దేవగణ్ ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరించారు. ఈ చిత్రంలో కరీనా, దీపికా పదుకొణె, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, రణవీర్ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఆగస్టు 15న రిలీజ్ కానుంది. అయితే అదే రోజు టాలీవుడ్ హీరో మూవీ పుష్ప-2 కూడా రిలీజ్ కానుంది. దీంతో పుష్ప-2తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది. కాగా.. గతంలో రిలీజైన సింగం, సింగం రిటర్న్స్ బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకున్నాయి. మరోవైవు అజయ్ దేవగన్ బోనీ కపూర్ నిర్మిస్తోన్న మైదాన్‌లో కనిపించనున్నారు. -
శక్తీ శెట్టి.. లేడీ సింగమ్
లేడీ సింగమ్ శక్తీ శెట్టిగా మారారు దీపికా పదుకోన్. ‘సింగమ్’, ‘సింగమ్ రిటర్న్స్’ చిత్రాల తర్వాత బాలీవుడ్ ‘సింగమ్’ ఫ్రాంచైజీలో రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘సింగమ్ ఎగైన్’. అజయ్ దేవగన్ మెయిన్ లీడ్ హీరోగా, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్, కరీనా కపూర్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా నుంచి దీపికా పదుకోన్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ‘సింగమ్ ఎగైన్’ చిత్రంలో లేడీ సింగమ్ పోలీసాఫీసర్ శక్తీ శెట్టి పాత్రలో దీపికా నటిస్తున్నారని, కథ రీత్యా క్రూరమైన, హింసాత్మక ధోరణిలో శక్తీ శెట్టి పాత్ర ఉంటుందని రోహిత్ శెట్టి పేర్కొన్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల కానుంది. -
ఇన్‌కమ్‌టాక్స్ ఆఫీసర్‌గా రవితేజ.. ఆ హిట్ సినిమానే టార్గెట్
హీరో రవితేజ ఇన్‌కమ్‌టాక్స్ ఆఫీసర్‌గా చార్జ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్‌నగర్ టాక్. అజయ్‌దేవగన్ హీరోగా రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహించిన ‘రైడ్’ (2018) సినిమా హిందీలో ఘన విజయం సాధించింది. నిజాయితీ గల ఓ ఇన్‌కమ్‌టాక్స్ ఆఫీసర్ అమీ పట్నాయక్ (అజయ్ దేవగన్) తనకు ఎదురైన సవాళ్లను ఏ విధంగా సాల్వ్ చేశాడన్నదే ‘రైడ్’ కథాంశం. ఈ సినిమా తెలుగులో రీమేక్ కానుందంటూ వార్తలు వచ్చాయి. కొందరు హీరోల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. తాజాగా మరోసారి ‘రైడ్’ రీమేక్ ప్రస్తావన టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ రీమేక్‌లో రవితేజ హీరోగా నటిస్తారని, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తుందని టాక్. మరి.. ‘రైడ్’ రీమేక్‌లో రవితేజ నటిస్తారా? లేదా? తెలియాలంటే వేచి చూడాలి. -
అజయ్ దేవగన్ డైరెక్షన్లో పోలీస్ ఆఫీసర్‌గా టబు! ఫస్ట్‌లుక్ రిలీజ్
అజయ్ దేవగన్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘భోలా’. అజయ్ దేవగన్ ఫిలిమ్స్, టీ–సిరీస్ ఫిలిమ్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌పై అజయ్ దేవగన్, భూషణ్ కుమార్, కృషణ్ కుమార్, ఎస్ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో టబు కీలక పాత్ర చేస్తున్నారు. ఆమె చేస్తున్న పోలీస్ ఆఫీసర్ లుక్‌ని అజయ్ దేవగన్ తన సోషల్ మీడియాలో షేర్ చేసి, ‘ఏక్ ఖాకీ.. సౌ సైతాన్స్’(ఒక పోలీసు.. వంద మంది దెయ్యాలు) అంటూ రాసుకొచ్చారు. పోలీస్ డ్రెస్, చేతిలో గన్‌తో టబు పవర్‌ఫుల్‌గా, స్టైలిష్‌గా కనిపించారు. కార్తీ నటించిన ‘ఖైదీ’ చిత్రానికి హిందీ రీమేక్‌గా ‘భోలా’ తెరకెక్కుతోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం మార్చి 30న విడుదల కానుంది. Ek khaaki. Sau shaitaan.#TabuInBholaa #Bholaain3D #Tabu pic.twitter.com/W5wLWqENyQ — Ajay Devgn (@ajaydevgn) January 17, 2023 -
పుట్టినరోజుకి ముందు అవార్డు అందుకున్నాను: నటి ఆశా పారేఖ్
68వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం శుక్రవారం ఢిల్లీలో జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ అవార్డులను ప్రదానం చేశారు. 2020కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును నటి ఆశా పారేఖ్ అందుకున్నారు. ‘‘నా 80వ పుట్టినరోజుకు ముందు ఈ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది’’ అన్నారు ఆశా పారేఖ్. జాతీయ ఉత్తమ నటులుగా సూర్య (‘సూరరై పోట్రు’), అజయ్ దేవగన్ (తన్హాజీ) అవార్డులు అందుకున్నారు. తమిళ ‘సూరరై పోట్రు’ ఉత్తమ సినిమా అవార్డుతో పాటు ఐదు అవార్డులు గెలుచుకుంది. ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డును ఈ చిత్రదర్శకురాలు సుధ కొంగర, బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అవార్డును జీవీ ప్రకాష్ కుమార్, ఉత్తమ నటిగా అపర్ణా బాలమురళి అవార్డులు అందుకున్నారు. ‘అల వైకుంఠపురములో..’కి గాను జాతీయ ఉత్తమ సంగీతదర్శకుడిగా ఎస్ఎస్ తమన్, బెస్ట్ తెలుగు ఫిలిం ‘కలర్ ఫొటో’కు దర్శకుడు అంగిరేకుల సందీప్ రాజు, నిర్మాత సాయి రాజేశ్ అవార్డులు అందుకున్నారు. ‘నాట్యం’ సినిమాకు బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డును నటి సంధ్యారాజు, బెస్ట్ మేకప్ ఆరి్టస్ట్ అవార్డును రాంబాబు అందుకున్నారు. ⇔ సినీ రంగంలో ప్రస్తుతం సృజనాత్మకతకు స్వేచ్ఛ ఉంది. సినీ నిర్మాణం, కథా రచయితలు సినిమాను చూసే విధానానికి ఇది స్వర్ణ యుగంలాంటిది -సుధ కొంగర ⇔ ‘అల వైకుంఠపురములో..’ అనుకున్న మొదటి రోజు నుంచి త్రివిక్రమ్, బన్నీ (అల్లు అర్జున్) ఇచి్చన ఎనర్జీ వల్లే ఈ అవార్డు సాధ్యమైంది. ఈరోజు ఇక్కడ అవార్డు అందుకోవడం గ్రేట్‌గా అనిపిస్తోంది. ఇదంతా దేవుడి దయ- ఎస్.ఎస్. తమన్ ⇔ వర్ణ వివక్ష గురించి తీసిన మా ‘కలర్ ఫొటో’కు అవార్డు రావడం ఆనందంగా ఉంది. కోవిడ్ వల్ల థియేటర్లలో సినిమా విడుదల చేయలేదు. ఆ బాధ ఈ జాతీయ అవార్డు రావడంతో పోయింది -నీలం సాయి రాజేష్ ⇔ ప్రతీ మూడు నెలలకోసారి మా సినిమాకు ఏదో ఒక రూపంలో అవార్డులు రావడం హ్యాపీగా ఉంది. – సందీప్ రాజు ⇔ లాక్డౌన్ కారణంగా రెండేళ్లు సినిమా కోసం కష్టపడ్డాం. మా కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. – రాంబాబు -
అజయ్ దేవగన్‌కు షాక్, అక్కడ ‘థ్యాంక్ గాడ్’పై నిషేధం
బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘థాంక్ గాడ్’. తాజాగా ఈ చిత్రానికి కువైట్ ప్రభుత్వం షాకిచ్చింది. కాగా ఇటీవలె షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ క్రమంలో మూవీ ట్రైలర్ విడుదల చేయగా.. దీనిపై కువైట్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. చదవండి: కాస్టింగ్ కౌచ్‌పై నోరు విప్పిన విష్ణుప్రియ, నన్ను కూడా అలా అడిగారు.. మత విశ్వాసాలను దెబ్బ తీసేలా సినిమా ట్రైలర్ ఉందనే కారణంతో ఈ చిత్రంపై అక్కడి సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. సినిమాపై నిషేధం విధించింది. అభ్యంతరకరమైన సన్నివేశాలను తీసేస్తేనే... సినిమా విడుదలకు అనుమతిస్తామని తెలిపింది. ఫాంటసీ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రంలో చిత్రగుప్తుడిగా అజయ్ దేవగణ్ నటించగా.. సిద్ధార్థ్ మల్హోత్రా, రకుల్ ప్రీత్ సింగ్‌లు కీలక పాత్రలను పోషించారు. అక్టోబర్ 24న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. చదవండి: గుర్తుపట్టలేనంతగా ‘సీతారామం’ హీరోయిన్.. షాకింగ్ లుక్ వైరల్ -
ఆ మాటే నాకు నచ్చదు: రకుల్ ప్రీత్ సింగ్
Rakul Preet Singh About Working With Amitabh Bachchan Ajay Devgn: టాలీవుడ్లో అతికొద్ది సమయంలోనే స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది కూల్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఈ ఫిట్నెస్ బ్యూటీ నటించిన తాజా హిందీ చిత్రం 'రన్ వే 34'. ఈ మూవీలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగణ్ వంటి స్టార్స్ నటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ మూవీకి అజయ్ దేవగణ్ దర్శకత్వం వహించడం విశేషం. ఈ మూవీ ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా విశేషాలను ఇటీవల పంచుకుంది రకుల్. ఈ క్రమంలో రకుల్‌ను ఒకేసారి ఇద్దరు పెద్ద స్టార్లతో పని చేయడం నటిగా కష్టమనిపించిందా ? అని ప్రశ్నించగా ఆసక్తికర సమధానం ఇచ్చింది. నిజానికి కష్టం అనే మాటే నాకు అస్సలు నచ్చదు. నాకంటే ప్రతిభావంతులైన నటులతో కలిసి పనిచేస్తున్నప్పుడు నాకు చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. ఇక ఇద్దరు పెద్ద స్టార్లతో కలిసి నటిస్తున్నాన్నంటే ఆ ఉత్సాహం మరింత రెట్టింపు అవుతుంది. ఎందుకంటే నేను మరింత మెరుగ్గా, బెస్ట్ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. అని రకుల్ ప్రీత్ సింగ్ పేర్కొంది. ఇదిలా ఉంటే రకుల్ ప్రీత్ ఛత్రివాలీ, డాక్టర్ జీ, థ్యాంక్ గాడ్ చిత్రాల్లో నటిస్తోంది. చదవండి: ఆ స్టార్ హీరోకు జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ ? -
హిందీ భాష వివాదంపై కంగనా షాకింగ్ కామెంట్స్
Kangana Ranaut Response On Hindi Language Controversy: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్‌ల మధ్య నెలకొన్న ట్విటర్ వార్ గురించి తెలిసిందే. హిందీ జాతీయ భాష కాదని సుదీప్ చేసిన వ్యాఖ్యలు పరిశ్రమలో వివాదస్పదమయ్యాయి. ఈ వివాదంపై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు స్పందించగా.. తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ స్పందించింది. ఈ సందర్భంగా ఆమె హిందీ జాతీయ భాష కాదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. చదవండి: హీరోయిన్ రష్మిక రోజూ ఏం తింటుందో తెలుసా? ఆమె లేటెస్ట్ మూవీ ‘ధాకడ్’ నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో కంగనా మీడియాతో మాట్లాడుతూ హిందీ భాష వివాదంపై స్పందించింది. ‘హిందీ కంటే సంస్కృతం పాతది. సంస్కృతం జాతీయ భాషగా ఉండాలి. అయితే, హిందీని జాతీయ భాషగా తిరస్కరించడం పరోక్షంగా కేంద్ర ప్రభుత్వాన్ని, భారత రాజ్యాంగాన్ని అగౌరవపరచడమే’ అని ఆమె అభిప్రాయపడింది. అయితే మొదట మన భాష, మూలాలు, సంస్కృతి గురించి గర్వపడే హక్కు మనందరికీ ఉందని వ్యాఖ్యానించింది. చదవండి: ‘ఆచార్య’ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే.. ఈ మేరకు ఆమె ‘మన దేశం సాంస్కృతికంగా, భాషల వారీగా చాలా వైవిధ్యమైనది. కాబట్టి వాటిని తీసుకురావడానికి మనకు ఒక ఉమ్మడి భాష అవసరం. భారత రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు హిందీని జాతీయ భాషగా చేశారు. నిజానికి హిందీ కంటే తమిళం పాత భాష. కానీ పురాతనమైనది సంస్కృత భాష. కాబట్టి, నా అభిప్రాయం ప్రకారం, సంస్కృతం జాతీయ భాషగా ఉండాలి కానీ హిందీ కాదు’ అని కంగనా వివరణ ఇచ్చింది. అనంతరం హిందీని జాతీయ భాషగా ఎందుకు ఎంచుకున్నారనేదానికి తన దగ్గర సమాధానం లేదని, కానీ ఇప్పుడు దానిని పాటించకపోతే రాజ్యాంగాన్ని తిరస్కరించినట్లవుతుందని కంగనా పేర్కొంది. -
హానికరం అయితే ఎందుకు అమ్ముతున్నారు: అజయ్ దేవగణ్
Ajay Devgn Reaction Controversy Pan Masala Ad: బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ పాన్ మాసాల ప్రకటన నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోలైన అజయ్ దేవగన్, షారుక్ ఖాన్‌తో కలిసి అక్షయ్ ఈ ప్రకటనలో నటించాడు. తాజాగా అక్షయ్ ఈ యాడ్ ఎండార్స్మెంట్ వివాదంపై అజయ్ దేవగన్ స్పందించాడు. ఆయన తాజాగా నటించిన ‘రన్‌వే 34’ మూవీ ఏప్రిల్ 29న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్ భాగంగా అజయ్ ఓ ఇంటర్య్వూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పాన్ మాసాల ఎండార్స్మెంట్ వివాదంపై, అక్షయ్ దీని నుంచి తప్పుకోవడంపై ఆయనకు ప్రశ్న ఎదురైంది. చదవండి: కన్నడ ప్రేక్షకులకు సారీ చెప్పిన నాని, అసలేం జరిగిందంటే.. దీనిపై అజయ్ దేవగన్ స్పందిస్తూ.. ‘నేను దీనిపై పెద్ద మాట్లాడాలనుకోవడం లేదు. దాని గురించి చర్చించడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ప్రకటనల ఎంపిక అనేది వారి వ్యక్తిగత విషయం. ప్రతి ఒక్కరికి తమకు తాముగా నిర్ణయం తీసుకునే అధికారం ఉంది. అయితే అదే సమయంలో అది హానికరమా? కాదా? అనేది కూడా చూసుకోవాలి. ఎందుకంటే అందులో కొన్ని హానికరమైనవి ఉండోచ్చు.. మరికొన్ని ఉండకపోవచ్చు’ అని పేర్కొన్నాడు. అలాగే ‘ఇది మాత్రమే కాకుండా హాని కలిగించే ఉత్పత్తులు ఇంకా ఉన్నాయి. ఇప్పుడు వాటి పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఈ విధంగా కూడా వాటిని నేను ప్రమోట్ చేయాలనుకోవడం లేదు. అయితే నేను చేసింది ఎలైచి బ్రాండ్ యాడ్ మాత్రమే’ అని సమాధానం ఇచ్చాడు. చదవండి: ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్ ఎలివేషన్ సీన్‌ను డిలీట్ చేశారు: బయటపెట్టిన నటుడు అనంతరం ఇదంతా పక్కన పెడితే ఈ ప్రకటనలు అనేవి పెద్ద విషయం కాదనేది తన అభిప్రాయమని, మరి అవి అంతటి హానికరమైన ఉత్పత్తులు అయితే.. వాటిని విక్రయించకూడదని అజయ్ అభిప్రాయ పడ్డాడు. అవి హానికరం అయితే ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించారు. కాగా అజయ్ దేవగన్ ఎంతో కాలంగా ఇదే బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అక్షయ్ కుమార్ ఈ యాడ్‌లో నటించడంపై ఆయన ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. ఆరోగ్యానికి హాని కలిగించే ఇలాంటి ఉత్పత్తులను తమ అభిమాన నటుడు ప్రమోట్ చేయడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. దీంతో అక్షయ్‌ని ట్రోల్ చేయడం ప్రారంభించారు. అవి చూసిన అక్షయ్ ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పి ఈ ప్రకటన నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించాడు. అయితే కాంట్రాక్ట్ నిబంధనల ప్రకారం కొంతకాలం వరకు ఆ ప్రకటన ప్రసారమవుతూనే ఉంటుందని అక్షయ్ స్పష్టం చేశాడు -
ఆ తప్పులు చేసి రెండు సార్లు జైలుకు వెళ్లాను: అజయ్ దేవగణ్
Ajay Devgn Says He Has Been In Jail Twice For His Mistakes: బాలీవుడ్లో మంచి స్టార్డమ్ ఉన్న హీరోల్లో అజయ్ దేవగణ్ ఒకరు. అటు బీటౌన్‌లో వరుస సినిమాలు చేస్తూనే టాలీవుడ్‌లోనూ కీలక పాత్రలు పోషిస్తూ తన పాపులారిటీ పెంచుకుంటున్నాడు. ఇటీవల విడుదలైన 'ఆర్ఆర్ఆర్' సినిమాలో కనిపించి మెప్పించాడు అజయ్ దేవగణ్. ఆయన తాజాగా హిందీలో చేస్తున్న చిత్రం 'రన్ వే 34'. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్, ఆకాంక్ష సింగ్ నటిస్తున్న ఈ మూవీకి అజయ్ దేవగణ్ డైరెక్ట్ చేశాడు. 2008లో వచ్చిన 'యూ మే ఔర్ హమ్', 2016లో వచ్చిన 'శివాయ్' చిత్రాల తర్వాత అజయ్ మళ్లీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. 'రన్ వే 34' చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నాడు అజయ్ దేవగణ్. ఈ క్రమంలో తన చిన్నతనంలో అజయ్ చేసిన తప్పులను ఒప్పుకున్నాడు. 'ఈ విషయాలు ఇప్పుడుల చెప్పకూడదు. కానీ ఇదివరకూ చాలాసార్లు వీటి గురించి చెప్పాను. ప్రతి ఒక్కరూ తమ చిన్నతనంలో చాలా తప్పులు చేస్తుంటారు. కానీ నేను అంతకన్నా ఎక్కువే చేశాను. ఫలితంగా ఒక్కసారి కాదు రెండుసార్లు జైలుకు కూడా వెళ్లాను. ఒకసారి మా నాన్న గన్ను ఆయనకు తెలియకుండా దొంగలించి జైలుకు వెళ్లాను. ఇంకోసారి తప్పు చేసి రెండోసారి కూడా వెళ్లాల్సి వచ్చింది. నేను కాలేజ్ రోజుల్లో గూండాలా ప్రవర్తించేవాన్ని. నేటి జనరేషన్‌కు తెలియదు కానీ ఆ రోజుల్లో మేము చాలా ఎంజాయ్ చేశాం.' అని తను చేసిన తప్పులు తెలిపాడు అజయ్ దేవగణ్. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. చదవండి: ఆమె.. అజయ్ దేవగణ్ బలహీనత.. ఎవరంటే ? చదవండి: అజయ్ దేవగన్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ.. ఎమోషనల్ అయిన సింగం -
'ఆర్ఆర్ఆర్'లో అలరించే కీలక పాత్రధారులు వీరే..
RRR Movie Main Key Characters: ప్రస్తుతం యావత్ భారతదేశం వేయి కళ్లతో ఎదురుచూసిన తరుణం సమీపించింది. ఓటమెరుగని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ మల్టీస్టారర్ చిత్రం 'రౌద్రం.. రణం.. రుధిరం'. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పవర్ఫుల్ నటనను వీక్షించేందుకు ఇంకా ఒక్క రోజే మిగిలింది. ఎన్నో వాయిదాల అనంతరం ఎట్టకేలకు ఈ శుక్రవారం అంటే మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది ఆర్ఆర్ఆర్. ఈ మూవీలో అల్లూరి సీతారామరాజుగా చెర్రీ, కొమురం భీమ్‌గా తారక్, సీతగా బాలీవుడ్ క్యూట్ బ్యూటీ అలియా భట్ అలరించనున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్లో ఈ ఇద్దరే కాకుండా ఇతర కీలక పాత్రలు కూడా సందడి చేయనున్నాయి. ఆ పాత్రలేంటో చూద్దామా ! 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంతోనే ఆయన తెలుగు ప్రేక్షకులకు చేరువకానున్నాడు. ఇందులో ఆయనది పవర్ఫుల్ రోల్ అని తెలుస్తోంది. 'యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతటవే వస్తాయ్..', 'నేనంటేనే ఓ పోరాటం' అంటూ తన చుట్టూ ఉన్న ప్రజల కోసం భార్యాబిడ్డల్ని వదిలి యుద్ధభూమిలోకి అడుగు పెట్టిన పోరాటయోధుడిగా అజయ్ దేవగన్ కనిపించనున్నారు. ఈ రోల్‌కు అజయ్ ఎలాంటి రెమ్మ్యునరేషన్ తీసుకోలేదని సమాచారం. అజయ్ దేవగన్‌కు సతీమణిగా సరోజిని పాత్రలో అలరించనుందని స్టార్ హీరోయిన్ శ్రియ సరన్. 'ఛత్రపతి' తర్వాత రాజమౌళి సినిమాలో మళ్లీ కనిపిస్తోంది శ్రియ. భర్త అడుగుజాడల్లో పోరాటంలోకి అడుగుపెట్టిన స్త్రీగా ఆమె పండించిన హావాభావాలు ప్రేక్షకులు భావోద్వేగానికి లోనయ్యేలా ఉన్నాయి. పాన్ ఇండియాగా తెరకెక్కిన ఈ సినిమాలో కోలీవుడ్ నటుడు, డైరెక్టర్ సముద్రఖని నటించారు. ఇందులో ఆయన పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో రామ్‌చరణ్‌కు సన్నిహితుడిగా కనిపించనున్నట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. బ్రిటీష్ వారికి ఎదురుతిరిగేందుకు చెర్రీ సిద్ధమవుతుండగా 'చాలా ప్రమాదం.. ప్రాణాలు పోతాయిరా..' అని ఆయన ఎమోషనల్‌గా చెప్పిన డైలాగ్ మెప్పించింది. ఇంకా ఈ మూవీలో రాజీవ్ కనకాల నటిస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళికి ఆయనకు మధ్య ఎంతో మంచి స్నేహబంధం ఉంది. జక్కన్న తెరకెక్కించిన ఎన్నో చిత్రాల్లో కీలకపాత్రల్లో నటించారు. ఇప్పుడు చాలా కాలం తర్వాత ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేయనున్నట్లు తెలుస్తోంది. వీళ్లే కాకుండా ఎన్టీఆర్‌కు లవర్‌గా విదేశీ భామ ఒలివీయా మోరీస్ కొన్ని సన్నివేశాల్లో తళుక్కున మెరిసి ఆకట్టుకోనుంది. విలనిజంతో కూడకున్న పాత్రలో ఐరిష్ నటి అలిసన్ డూడీ నటించారు. లేడీ స్కాట్‌గా ఆమె తన విలనిజాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. కమెడియన్, నటుడు రాహుల్ రామకృష్ణ ఈ సినిమాలో ఎన్టీఆర్ వెంట ఉండే వ్యక్తిగా కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. -
ఆ తెలుగు మూవీ రీమేక్ కోసం పోటీ పడుతున్న బాలీవుడ్ అగ్ర హీరోలు
నేచురల్ స్టార్ నాని హీరోగా ద్విపాత్రిభినయనం చేసి విజయం సాధించిన సినిమా ‘శ్యామ్ సింగరాయ్’. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. గతేడాది క్మిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా మంచి టాక్ సంపాదించుకుంది. థియేటర్లలో సందడి చేసిన ఈ మూవీ ఓటీటీలో సైతం రికార్డు వ్యూస్‌ను రాబట్టింది. ఇప్పుడు ఈ మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: Prabhas-Pooja Hegde: ఎడమొహం పెడమొహంగా ప్రభాస్-పూజా? అయితే ఈ రీమేక్ ఇద్దరు బాలీవుడ్ స్టార్ హీరోలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలుగు సినిమాలను రీమేక్ చేసి మంచి హిట్స్ అందుకుంటున్న హీరో షాహిద్ కపూర్ రీమేక్ హక్కును తీసుకునే ఆలోచనలలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆర్ఆర్ఆర్తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అగ్ర హీరో అజయ్ దేవగన్ సైతం శ్యామ్ సింగరాయ్ రీమేక్‌కు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఒకే దర్శకుడిని రీమేక్ కోసం వీరిద్దరు సంప్రదించినట్లు బి-టౌన్లో వినికిడి. మరి ఇందులో ఎవరి ప్రయత్నాలు ఫలించి శ్యామ్ సింగరాయ్ హక్కులను పొందుతారో చూడాలి. -
రన్‌వే 34గా మారిన మేడే.. 3 ఫస్ట్ లుక్‌లు విడుదల
Mayday Movie Name Change Into Runway 34: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న 'మేడే' చిత్రానికి 'రన్‌వే 34'గా పేరు మార్చారు. ఈ విషయాన్ని సోమవారం నిర్మాతలు ప్రకటించారు. అయితే ఈ చిత్రానికి హీరో అజయ్ దేవగన్ దర్శకత్వం వహిస్తున్నారు. 2008లో వచ్చిన 'యూ మే ఔర్ హమ్', 2016లో వచ్చిన 'శివాయ్' చిత్రాల తర్వాత అజయ్ మళ్లీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఈ సినిమా విడుదల తేదిని సోషల్ మీడియా వేదికైన ఇన్‌స్టా గ్రామ్‌లో ప్రకటించారు. View this post on Instagram A post shared by Ajay Devgn (@ajaydevgn) అజయ్ దేవగన్ ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ 'మేడే ఇప్పుడు రన్‌వే 34గా మారింది. నిజ జీవిత సంఘటనల నుంచి ప్రేరణ పొంది తెరకెక్కించిన చిత్రం. ఇది నాకు చాలా ప్రత్యేకమైనది. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఈ థ్రిల్లర్ మూవీ ఏప్రిల్ 29, 2022న ఈద్‌కు ల్యాండ్ కానుంది.' అని రాసుకొచ్చారు. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన మూడు ఆసక్తికరమైన పోస్టర్లను కూడా పంచుకున్నారు మేకర్స్. అందులో అజయ్ దేవగన్‌తోపాటు అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్ ఫస్ట్ లుక్‌లను విడుదల చేశారు. View this post on Instagram A post shared by Ajay Devgn (@ajaydevgn) గత డిసెంబర్లో సెట్స్‌పైకి వెళ్లిన ఈ చిత్రం ఏప్రిల్ 2022న వెండితెరపైకి రానుంది. ఇందులో బొమన్ ఇరానీ, అంగీరా ధర్, ఆకాంక్ష సింగ్, యూట్యూబ్ సంచలనం క్యారీ మినాటి కూడా నటించారు. 2015లో ఇండియాలో చోటుచేసుకున్న పలు సంఘటనల నుంచి ప్రేరణ పొంది తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని అజయ్ బ్యానర్, అజయ్ దేవగన్ ఎఫ్ ఫిల్మ్స్ నిర్మించగా, సినిమాటోగ్రఫీ అసీమ్, సందీప్ కెవ్లానీ స్క్రిప్ట్ అందించారు. View this post on Instagram A post shared by Ajay Devgn (@ajaydevgn) -
థియేటర్లలో 'థ్యాంక్ గాడ్' సందడి చేయనుంది ఆ రోజే..
Thank God Movie Theater Release Date Out: బాలీవుడ్ హీరోలు అజయ్ దేవగన్, సిద్ధార్థ్ మల్హోత్రా, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కలిసి నటిస్తున్న చిత్రం 'థ్యాంక్ గాడ్'. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు కొంచెం బ్రేక్ ఇచ్చేలా సినిమా విడుదల తేదిని ప్రకటించారు. ఈ చిత్రం జూలై 19, 2022న థియేటర్లలో సందడి చేయనున్నట్లు సినిమా తారాగణం సోషల్ మీడియా వేదికగా తెలిపింది. 'ఎంతగానో ఎదురుచూస్తున్న 'థ్యాంక్ గాడ్' చిత్రం వచ్చే సంవత్సరం మీకు సంతోషాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. 'సంతోషకరమైన జీవితం' అనే సందేశంతో కూడిన ఈ సినిమా 29 జూలై 2022న విడుదల కానుంది.' అని రకుల్ పోస్ట్ చేసింది. అజయ్ దేవగణ్, సిద్ధార్థ్ మల్హోత్రా మొదటిసారిగా స్క్రీన్ షేర్ చేసుకుంటున్న చిత్రం 'థ్యాంక్ గాడ్'. ఈ సినిమాకు ఇంద్ర కుమార్ దర్శకత్వం వహించగా, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, అశోక్ థాకేరియా, సునీర్ ఖేటర్‌పాల్, దీపక్ ముకుత్, ఆనంద్ పండిట్, మార్కంద్ అధికారి నిర్మించారు. సహ నిర్మాతగా యష్ షా వ్యవహరిస్తున్నారు. డైరెక్టర్ ఇంద్ర కుమార్ గతంలో తీసిన బ్లాక్‌బస్టర్ చిత్రాలకంటే 'థ్యాంక్ గాడ్' భిన్నంగా ఉంటుందట. ఇంద్ర కుమార్ ఈ సినిమాను కొత్త తరహాలో నవ్వులు పూయిస్తూ, చివరిలో సందేశంతో రూపొందించారు. నేటి ప్రపంచానికి తగినట్లుగా, కుటుంబాలకు కనెక్ట్ అవుతుందని మేకర్స్ తెలిపారు. View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) ఇంద్ర కుమార్ మస్తీ, ధమాల్ వంటి హాస్య ఫ్రాంచైజీలకు దర్శకత్వం వహించారు. ఇది ఒక సుందరమైన సందేశంతో ఉంటుందని సిద్ధార్థ్ మల్హోత్ర గతంలోని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. 'ఈ సినిమా ఒక సందేశాన్ని ఇస్తుంది. ప్రేక్షకులు ఆశ్చర్యపోతారని నేను హామీ ఇస్తున్నాను. కృతజ్ఞత భావం గురించి, గతంలో కంటే ఇప్పుడు ఏది ముఖ్యమో చెప్పే చిత్రం థ్యాంక్ గాడ్.' అని షేర్షా హీరో సిద్ధార్థ్ పేర్కొన్నారు. చదవండి: వర్షం ఎప్పుడైన కురుస్తుంది.. గొడుగును సిద్ధంగా ఉంచుకోండి: రకుల్ -
నో థియేటర్..ఓన్లీ ‘ఓటీటీ’: నష్టాలకే మొగ్గు!
ఓవైపు థియేటర్ యాజమాన్యాల హెచ్చరికలు.. మరోవైపు సంగ్ధిగ్ధ స్థితిలో నిర్మాతలు ఓటీటీ రిలీజ్ వైపు అడుగులు వేస్తున్నాయి. వెరసి.. ‘పెద్ద సినిమాల రిలీజ్’ వివాదాస్పదంగా మారుతోంది. అయితే సౌత్‌తో పోలిస్తే.. నార్త్‌లో ఇందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. క్రమం తప్పకుండా పెద్ద సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతూ వస్తున్నాయి. మరి ‘డిజిటల్’ రిలీజ్‌లతో నిర్మాతలు నిజంగా అంత లాభపడుతున్నారా? సాక్షి, వెబ్‌డెస్క్: కిందటి ఏడాది కరోనా-లాక్డౌన్ టైం నుంచే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అవుతున్నాయి హిందీ సినిమాలు. నెలకు కమ్‌సేకమ్ ఒకటి, రెండు సినిమాలు కచ్చితంగా ఉంటుండగా, అందులో స్మాల్, మీడియం బడ్జెట్ సినిమాలు, అప్పుడప్పుడు భారీ బడ్జెట్ సినిమాలు ఉంటున్నాయి. అయితే చాలాకాలం నుంచి థియేటర్లు తెరుస్తారనే సంకేతాలు ప్రభుత్వాల నుంచి వెలువడుతున్నాయి. త్వరలో పూర్తిస్థాయిలో దేశవ్యాప్తంగా థియేటర్లు తెరుచుకునే అవకాశాలూ కనిపిస్తున్నాయి. అయినప్పటికీ స్ట్రీమింగ్ సర్వీసులకే ప్రాధాన్యం ఇస్తోంది బాలీవుడ్. ‘భుజ్’ లాంటి భారీ ప్రాజెక్టు ఓటీటీ రిలీజ్‌కే మొగ్గు చూపడం అందుకు నిదర్శనం. కొసమెరుపు ఏంటంటే.. ఇలా ఓటీటీ రిలీజ్ ద్వారా ఫిల్మ్‌మేకర్స్ పెద్దగా వెనకేసుకుంటోంది ఏం లేకపోగా.. కొందరైతే నష్టాలతోనే అమ్మేసుకుంటున్నారు. ఒరిగిందేం లేదు ఆలస్యం చేయకుండా ఓటీటీ ద్వారా రిలీజ్ చేస్తే జనాలకు ఎక్కువ రీచ్ ఉంటుందని నిర్మాతలు పైకి చెప్పుకుంటున్నప్పటికీ.. ఆర్థికంగా ఆ నిర్ణయం వాళ్లను పెద్ద దెబ్బే తీస్తోంది. కిందటి ఏడాది లాక్డౌన్ టైంలో రిలీజ్ అయిన భారీ బడ్జెట్ మూవీ అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మీ. డిస్నీ హాట్ స్టార్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా ఫలితం ‘డిజాస్టర్’. కానీ, ఆ సీజన్లో వచ్చిన సినిమాలతో పోలిస్తే.. ఓటీటీ హక్కుల ద్వారా వంద కోట్ల దాకా వెనకేసుకుంది. ఈ సినిమా ఇచ్చిన ధైర్యంతో వరుణ్ ధావన్ ‘కూలీ నెం.1’ క్రిస్మస్ సీజన్లో అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయ్యింది. నిజానికి టాక్‌తో సంబంధం లేకుండా ఈ సినిమాలు గనుక థియేటర్లలో రిలీజ్ అయ్యి ఉంటే.. మినిమమ్ వంద కోట్ల బిజినెస్.. మాగ్జిమం 250 కోట్ల దాకా ఫుల్‌రన్ బిజినెస్ చేసి ఉండేవేమో. అటుపై టాక్‌ను బట్టి శాటిలైట్, ఓటీటీ రైట్స్‌తో అదనంగా ఆదాయం వచ్చి ఉండేది. అదే విధంగా ఈ ఏడాదిలో సల్మాన్ ఖాన్ ‘రాధే’, ఫర్హాన్ అక్తర్ ‘తూపాన్’ కూడా రిలీజ్ అయ్యాయి. కానీ, వీటి రేంజ్‌కి థియేట్రికల్ రిలీజ్‌తో పోలిస్తే.. డిజిటల్ స్ట్రీమింగ్ ద్వారా పెద్దగా వచ్చిన లాభం ఏం లేదని బాలీవుడ్ ట్రేడ్ గణాంకాలే చెప్తున్నాయి. అయినను ఓటీటీకే.. అక్షయ్ కుమార్ బాలీవుడ్ సీనియర్ హీరో. ఆయన సినిమా మినిమమ్ వంద కోట్ల బిజినెస్ చేస్తుంటుంది. అలాగే అజయ్ దేవగన్‌కి కూడా వంద కోట్ల మార్కెట్ ఉంది. ఫర్హాన్ అక్తర్, సిద్ధార్థ్ మల్హోత్రా లాంటి స్టార్లకు రేంజ్ 75 కోట్ల రూపాయల పైనే. ఇక స్టార్ కాస్టింగ్ ఉన్న సినిమాలు ఎలాగూ 30 కోట్ల మార్క్‌ను ఈజీగా దాటేస్తుంటాయి. ఇలాంటి టైంలో లాభాలు తెచ్చే థియేటర్ బిజినెస్‌ను కాదని.. ఓటీటీకే ఫిక్స్ అవుతున్నారు నిర్మాతలు. త్వరలో బాలీవుడ్లో ‘భుజ్ ది ప్రైడ్’, సిద్దార్థ్ మల్హోత్రా ‘షేర్ షా’లు ఓటీటీ ద్వారా రిలీజ్ కాబోతున్నాయి. మరో నాలుగైదు సినిమాలు కొన్ని రిలీజ్ కాగా, మరికొన్ని కూడా ఓటీటీ ద్వారా ప్రేక్షకులనే అలరించబోతున్నాయి. మొత్తంగా థియేటర్ బిజినెస్‌తో ఇవి ఐదారు వందల కోట్ల దాకా బిజినెస్ చేయొచ్చు. కానీ, కేవలం 150 కోట్ల డీల్‌తో ముగించుకుని డిజిటల్ తెరపై సందడి చేయబోతున్నాయి. ఇందులో భుజ్.. భారీ కాస్టింగ్, బడ్జెట్‌తో తెరకెక్కింది. అయితే నిర్మాణ ఖర్చుల కంటే తక్కువ ధరకు ఓటీటీ రిలీజ్‌కు వెళ్తుండడం ఇప్పుడు బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. అలాగే షేర్షా కూడా బడ్జెట్ కంటే తక్కువ మార్కెట్‌తోనే ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. ఈ లెక్కన లాభాల మాటేమోగానీ.. లాస్‌తోనే ఈ రెండు సినిమాలు థియేటర్లను కాదనుకుని రిలీజ్ అవుతున్నాయి. అయితే పరిస్థితులు చక్కబడితే తిరిగి థియేటర్లో భారీ సంఖ్యలో స్క్రీన్లపై రిలీజ్ చేయాలన్న ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు సమాచారం. మరి ఇందుకు థియేటర్-మల్టీఫ్లెక్సుల యాజమాన్యాలు అంగీకరిస్తాయా? అనేది ప్రశ్నార్థకమే. బ్యాడ్మార్క్ వల్లే.. కరోనా టైం నుంచే బాలీవుడ్‌కు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది. సుశాంత్ మరణానంతరం బాలీవుడ్ పరిణామాలు విపరీతంగా మారిపోయాయి. ఆడియొన్స్‌లో ఇండస్ట్రీ పట్ల నెగెటివిటీ కొనసాగుతోంది. ఉదాహరణగా సడక్-2కు ఎంత దారుణంగా తిప్పి కొట్టారో తెలిసిందే. అలాగే మంచి సినిమాలకు ఆదరణ కూడా అంతంతగా మాత్రంగానే దక్కింది. అనూహ్యంగా.. ఓటీటీలో సౌత్ సినిమాలకు ఎక్కువ ఆదరణ లభించడం విశేషం. ఈ తరుణంలోనే థియేట్రికల్ రిలీజ్‌కు బడా ఫిల్మ్ మేకర్లు వెనుకంజ వేస్తున్నారనేది ముంబైకి చెందిన ఓ సీనియర్ క్రిటిక్ అభిప్రాయం. అయితే ఇందులో నిజం లేదని, పరిస్థితులు చక్కబడ్డాక థియేటర్లు ఓపెన్ అయ్యాక పరిస్థితి మునుపటిలా మారుతుందనేది బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ చెబుతున్నాడు. ఏదేమైనా బాలీవుడ్ మునుపటిలా కలెక్షన్లు కొల్లగట్టే స్థితికి చేరేది అనుమానమనేది చాలామంది విమర్శకుల అంటున్న మాట. -
Rashi Khanna: హీరోయిన్ చేతిలో రెండు వెబ్ సిరీస్‌లు!
డిజిటల్ ఎంటర్టైన్మెంట్పై మరింత ఫోకస్ పెట్టినట్లున్నారు హీరోయిన్ రాశీ ఖన్నా. ఇప్పటికే ‘ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్’ ఫేమ్ రాజ్ అండ్ డీకే దర్శకద్వయం రూపొందిస్తున్న ఓ వెబ్ సిరీస్‌లో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతితో పాటు ఓ లీడ్ క్యారెక్టర్ చేస్తున్నారు రాశీ ఖన్నా. తాజాగా అజయ్ దేవగణ్ నటించనున్న ‘రుద్ర’ (ప్రచారంలో ఉన్న టైటిల్) వెబ్ సిరీస్‌లో ఓ మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేసేందుకు ఈ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ‘వెంటిలేటర్’ ఫేమ్ ఎమ్. రాజేష్ ‘రుద్ర’ సిరీస్‌ను డైరెక్ట్ చేయనున్నారు. ఇంగ్లిష్ సైకలాజికల్ క్రైమ్ డ్రామా ‘లూథర్’ ఆధారంగా ఈ హిందీ వెబ్ సిరీస్ రూపొందనుంది. ‘లూథర్’ సిరీస్‌లో రూథ్ విల్సన్ పోషించిన పాత్రలో రాశీ కనిపిస్తారట. ‘రుద్ర’ షూటింగ్ ఈ నెల 21న ప్రారంభం అవుతుందని బాలీవుడ్ సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే... ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో రాశీ ఓ లీడ్ క్యారెక్టర్ చేసే చాన్స్ దక్కించుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక తెలుగులో నాగచైతన్య ‘థ్యాంక్యూ’, గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. అలాగే తమిళంలో మూడు ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఇలా కెరీర్లో టాప్ గేర్‌తో దూసుకెళ్తున్నారు రాశీ ఖన్నా. -
బంపర్ ఆఫర్ కొట్టేసిన రకుల్..
కెరటం సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఢిల్లీ భామ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగుతోపాటు, కన్నడ, తమిళ్, హిందీ భాషల్లోనూ నటించారు. తన అందం, నటనతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల రకుల్ నటించిన చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్ద ఢీలా పడటంతో సినిమాల ఎంపిక విషయంలో కాస్తా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు బాలీవుడ్ డ్రగ్ కేసులో రకుల్‌ను అధికారులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అయితే ఈవేవి ఆమె కెరీర్‌పై ప్రభావం చూపించలేదు. చదవండి: ఏం జరిగినా పని ఎప్పటికీ ఆగదు: రకుల్ ఇక రకుల్ ఓ వైపు తెలుగులో నటిస్తూనే బాలీవుడ్‌లోనూ అప్పుడప్పుడు తళుక్కుమంటున్నారు. అందులో భాగంగా ఈ భామకు బీ టౌన్ నుంచి మరో అవకాశం వచ్చింది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో 'మేడే' అనే థ్రిల్లర్ డ్రామా చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాకు స్టార్ హీరో అజయ్ దేవగన్ దర్శకత్వం వహించనున్నాడు. డైరెక్షన్‌తో పాటు ఓ కీలక పాత్రలోనూ అజయ్ నటిస్తున్నారు. ఈ చిత్రంతో చాలా సంవత్సరాల తరువాత సీనియర్ స్టార్ అమితాబ్, అజయ్‌లు కలిసి పనిచేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ డిసెంబర్లో హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. చదవండి: అజయ్ దర్శకత్వంలో అమితాబ్ కాగా ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశాన్ని రకుల్ కొట్టేశారు. ఈ సినిమాలో రకుల్.. అజయ్‌కు కో పైలట్ పాత్రలో నటించబోతున్నారు. ఈ విషయంపై రకుల్ ట్విటర్లో స్పందిస్తూ.. సినిమాలో నటించడం ఆనందంగా ఉందన్నారు. ‘మేడేలో కో-పైలేట్‌గా నటించడం ఎంత ఆనందంగా ఉందో చెప్పటేను. అమితాబ్ సార్‌తో కలిసి పనిచేయాలనే కల నిమైంది. అజయ్ దేవగన్‌కు ధన్యవాదాలు. షూటింగ్ కోసం సిద్ధంగా ఉన్నాను.’ అని ట్వీట్ చేశారు. కాగా అజయ్ దేవగన్‌తో రకుల్‌కు ఇది మూడో సినిమా. ఇప్పటి వరకు దే దే ప్యార్ దే, ఓ మై గాడ్ (షూటింగ్ స్టార్ట్ కావాల్సి ఉంది) సినిమాలో జోడి కట్టారు. చదవండి: బెస్ట్ సిటీగా మార్చుకుందాం: ఈషా రెబ్బ Can’t express how thrilled iam to be on board ( literally 😝) as a copilot in #MAYDAY . It’s a dream come true to work with @SrBachchan sir . @ajaydevgn thankyouuu and preparing for takeoff ✈️ 💪🏼💪🏼 https://t.co/SLBLVEpTg4 — Rakul Singh (@Rakulpreet) November 19, 2020 -
స్టార్ హీరో కూతురు అదిరే స్టెప్లు చూశారా!
సాక్షి, ముంబై: బాలీవుడ్ ‘సింగం’ అజయ్ దేవగణ్-కాజోల్ దంపతుల గారాల పట్టి నైసా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ప్రస్తుతం సింగపూర్‌లో తన విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా నైసా తన స్నేహితులతో కలిసి సరదాగా డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో నైసా తన ఇద్దరు స్నేహితులకు సులభంగా డ్యాన్స్ స్టెప్పులు ఎలా వేయాలో నేర్పిస్తుంది. ఈ వీడియో పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే అనేకమంది వీక్షించారు. ఈ వీడియో చూసిన వారంతా ‘డ్యాన్స్ మెలుకువలు నేర్పుతూ ఎంతైనా నటుడి కుమార్తె అనిపించుకుంది’ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. (చదవండి: అతనితో జాగ్రత్తగా ఉండమన్నారు: కాజోల్) కాగా నైసా స్టార్ సెలబ్రిటీ కూతురు అయినప్పటికీ ఆమె చాలా సాధారణంగా ఉంటారు. ఇతర సెలబ్రిటీల్లా లాగా సోషల్ మీడియాలో కూడా ఎక్కవ కనిపించరు. తన విషయాలు, ఫోటోలు అందరికి కనిపించకుండా గోప్యంగా ఉంచుతారు. ఇక కాజోల్, అజయ్ దేవగణ్ 1999లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి 2003లో కూతురు నైసా, 2010లో కుమారుడు యుగ్ దేవగణ్ జన్మించారు. సుశాంత్ సింగ్ ఆత్మహత్య నేపథ్యంలో బాలీవుడ్లో నెపోటిజంపై చర్చలు, స్టార్ కిడ్స్ పై ట్రోలింగ్ చర్చ సందర్భంగా నైసా దేవగణ్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించాయి. ‘.స్టార్ హీరోల పిల్లలగా ఉండటం స్టార్డమ్ తో పాటు ఒక్కోసారి ఇబ్బందులు తెస్తాయి. తాము ఏ చిన్న తప్పు చేసినా విమర్శించేందుకు సమాజంలో చాలా మంది ఉంటార’ని సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసింది. (చదవండి: క్షమాపణ కోరిన ప్రముఖ ర్యాప్ సింగర్) View this post on Instagram oh @nysadevgan girl hmu and I’ll teach u how to twerk...for free! • #nysadevgan A post shared by ♡ (@nysadevganx) on Nov 11, 2020 at 10:34am PST -
‘గల్వాన్’పై అజయ్ దేవగన్ సినిమా
ముంబై: గల్వాన్ వ్యాలీ ఘటన ఆధారంగా సినిమా రూపొందించనున్నట్లు బాలీవుడ్ హీరో-నిర్మాత అజయ్ దేవగన్ వెల్లడించాడు. జూన్15న లడక్‌లోని గాల్వన్ వ్యాలీ వద్ద చైనా అర్మీ, భారత సైన్యంపై జరిపిన దాడిలో 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఆధారంగా అజయ్ దేవగన్ సినిమాను తెరకెక్కించనున్నారు. అయితే ఇందులో అజయ్ నటిస్తారా లేదా అనేది స్ఫష్టత లేదు. కానీ ఇప్పటికే ఈ చిత్రం కోసం తారాగణాన్ని ఖరారు చేసినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. అజయ్ దేవగన్ ఫిల్మ్స్, సెలెక్ట్ మీడియా హైల్డింగ్ ఎల్ఎల్పీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. (వినూత్నంగా వర్మ 12'0' క్లాక్ ట్రైలర్) ఇప్పటికే అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో 1975లో అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా పీపుల్స్ ఆర్మీ, భారత సైన్యంపై జరిపిన మెరుపుదాడిలో భారత సైన్యం మొట్టమొదటి సారిగా ఎదుర్కొన్న ప్రాణనష్టం ఆధారంగా ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ పేరుతో చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆగస్టులో ఓటీటీలో ప్లాట్‌ఫ్లాంలో విడుదల కానుంది. అభిషేక్ దుధయ్య రచించి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంజయ్ దత్, సోనాక్షి సిన్హా, అమ్మి విర్క్, శరద్ కేల్కర్, రానా, దక్షిణాది భామ ప్రణతిలు ప్రధాన పాత్రల్లో నటించారు. (దేశీ టచ్‌తో విదేశీ కథలు) -
రణ్వీర్తో గుంజీలు తీయించిన అక్షయ్..
రోహిత్ శెట్టి దర్శకత్వంలో, ‘కిలాడి’ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న ‘సూర్య వంశీ’ సినిమా ట్రైలర్ నిన్న(సోమవారం) విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అక్షయ్‌తో పాటు హీరో అజయ్ దేవగన్, రణ్వీర్ సింగ్‌లు ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా నిన్న జరిగిన ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమానికి రణ్వీర్ 40 నిమిషాలు లేటుగా వచ్చాడు. దీంతో అక్కీ, రణ్వీర్ను క్రమశిక్షణ లేదంటూ... గుంజీలు తీయిస్తూ సరదాగా ఆటపట్టించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అక్షయ్.. ‘రణ్వీర్తో గుంజీలు తీయుస్తూ.. 40 నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకు శిక్షగా గుంజీలు తీయాల్సిందే’ అని అనడంతో వెంటనే అజయ్ దెవగన్ ‘పాపం క్షమించు.. తన భార్య ఇంట్లో ఉంది అందుకే’ అని చెప్పాడు. ఈ వీడియోను చూసిన రణ్వీర్ భార్య, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ‘భార్య ఇంట్లో ఉంది.. కానీ సమయానికి వస్తుంది’ అని ఫన్నీగా కామెంటు పెట్టారు. అక్షయ్ ఔదార్యం.. కోటిన్నర విరాళం View this post on Instagram #ranveersingh gets punishment from Discipline King #akshaykumar who calls press at six in the morning for interviews 😜🙈 #viralbhayani @viralbhayani A post shared by Viral Bhayani (@viralbhayani) on Mar 2, 2020 at 1:02am PST కాగా.. బాలీవుడ్ పరిశ్రమలో అక్కిని క్రమశిక్షణకు మారుపేరుగా అందరూ అంటుంటారు. ఎందుకంటే అక్కీ షూటింగ్లో నిబద్ధత పాటిస్తూ తగిన సమయంలో పనిని పూర్తి చేసుకుంటాడని చాలా సందర్బాల్లో తన సహ నటి, నటులు ప్రశంసిస్తుంటారు. కాగా నిన్న విడుదలైన ‘సూర్యవంశీ’ ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. దర్శకుడు రోహిత్ శెట్టి ఇదివరకే అజయ్ దేవగన్‌తో ‘సింగం’, ‘సింగం రిటర్న్స్’, రణ్వీర్ ‘సంబ’ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. కాగా ఈ సినిమాను మార్చి 24న విడుదల చేయనున్నట్లు సమాచారం. -
‘ మైదాన్’ విడుదల మార్పు..
బాలీవుడ్ హీరో అజయ్‌దేవగన్ ఫుట్‌బాల్ కోచ్‌గా నటిస్తున్న సినిమా ‘మైదాన్’. ఈ సినిమాలో అజయ్ ఇండియన్ ఫుట్‌బాల్ కోచ్, మేనేజర్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ పాత్రలో నటిస్తున్నారు. ‘మైదాన్’ చిత్రం అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ మూవీలో అజయ్ భార్యగా ప్రియమణి నటిస్తున్నారు. ‘ మైదాన్’ సినిమాకు ‘బదాయిహో’ ఫేమ్ అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. బోనీ కపూర్, ఆకాశ్ చావ్లా, అరునవ జోయ్ గుప్తా నిర్మిస్తున్నారు. చదవండి: బాక్సాఫీస్‌పై తాన్హాజీ దండయాత్ర ‘మైదాన్’ చిత్రం హింది, తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో 11 డిసెంబర్ 2020కి విడుదల కానుందని చిత్ర బృందం ప్రకటించింది. గతంలో 27 నవంబర్ 2020కి ప్రేక్షకుల ముందు వస్తుందని.. ‘మైదాన్’ చిత్రం బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ, కొన్ని కారణాల వల్ల ‘మైదాన్’ విడుదల తేదీని మార్పు చేశారు. తాజాగా ఈ మూవీ యూనిట్ కొత్త విడుదల తేదితో కూడిన ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. అదేవిధంగా ‘మైదాన్’ మూవీ విడుదల విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తన ట్విటర్ ఖాతాలో పేర్కొన్నాడు. #AjayDevgn's #Maidaan gets a NEW release date: 11 Dec 2020... Will release in #Hindi, #Tamil, #Telugu and #Malayalam... Directed by Amit Ravindernath Sharma... Produced by Zee Studios, Boney Kapoor, Arunava Joy Sengupta and Akash Chawla. pic.twitter.com/sxWDN8NKYL — taran adarsh (@taran_adarsh) February 3, 2020 -
ఆర్ఆర్ఆర్ ప్రపంచానికి స్వాగతం
రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలు. ఈ సినిమాలో హిందీ నటుడు అజయ్ దేవగన్ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ మధ్యే ‘ఆర్ఆర్ఆర్’ సెట్లో అడుగుపెట్టారు అజయ్. లొకేషన్లో అజయ్ దేవగన్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, రాజమౌళి కలిసి దిగిన ఫోటో ఒకటి బయటికొచ్చింది. ‘‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం అజయ్‌సార్’’ అన్నారు ఎన్టీఆర్. ‘‘మీ పని అంటే నాకు ఇష్టం. వ్యక్తిగా అంతకంటే ఇష్టం అజయ్‌సార్’’ అన్నారు చరణ్. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఇందులో కొమరమ్ భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటిస్తున్నారు.