
బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్ దేవగన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో 20 ఏళ్ల ఛాలెంజ్ పేరిట ఓ ఫొటోను షేర్ చేశారు. 20 ఏళ్ల క్రితం నాటి ఫొటోతో పాటు, తన తాజా చిత్రాన్ని గ్రాఫిక్స్ ఇంటర్ చేంజ్ ఫార్మాట్‌లో ఇన్‌స్టాలో షేర్ చేశారు ఈ 45 ఏళ్ల నటి. సోమవారం షేర్ చేసిన ఈ పోస్టులో ఒకటి 1999 నాటిది అయితే మరొకటి గతేడాదికి చెందినది. ఒకే రకం స్టైల్‌లో పోజ్‌లో ఉన్న ఈ ఫొటోలకు.. "మిమ్మల్ని ఆశ్చర్యపరిచే విషయమే మీ గొప్ప ఆస్తి’ అనే క్యాప్షన్‌ను కాజోల జతచేశారు. ఇక ఆమె పోస్టుకు ఫిదా అయిన అభిమానులు.. ‘అప్పుడు, ఇప్పుడు ఒకేలా ఉన్నారు.. మీ అందం ఇప్పటికీ ఏమాత్రం చెక్కు చెదరలేదు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.(తరచూ గర్భస్రావం.. వేదనకు గురయ్యాం: నటి)
ఇక కాజోల్ దాదాపు 10 ఏళ్ల తర్వాత తన భర్త అజయ్ దేవగన్‌తో కలిసి నటించిన చిత్రం ‘తాన్హాజీ’. హిస్టారికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో కాజోల్, అజయ్ దేవగన్, సైఫ్ అలీఖాన్‌లు కీలక పాత్రలో నటించారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం బాక్స్‌ఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment