
సన్నాఫ్ సర్దార్‌గా అజయ్ దేవగన్ అతి త్వరలో స్కాట్లాండ్ వెళ్లనున్నారని బాలీవుడ్ సమాచారం. అజయ్ దేవగన్, సోనాక్షీ సిన్హా, సంజయ్ దత్ లీడ్ రోల్స్‌లో అశ్వినీ ధీర్ దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రం ‘సన్నాఫ్ సర్దార్’ (2012). రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మర్యాద రామన్న’కు హిందీ రీమేక్‌గా ఈ చిత్రం రూపొందింది.
ఇప్పుడు పన్నెండేళ్ల తర్వాత ‘సన్నాఫ్ సర్దార్’కు సీక్వెల్‌గా ‘సన్నాఫ్ సర్దార్ 2’ చిత్రం రానుందని సమాచారం. తొలి భాగంలో లీడ్ రోల్స్‌లో నటించిన అజయ్ దేవగన్, సంజయ్ దత్ సీక్వెల్‌లోనూ నటించనున్నారని, హీరోయిన్‌గా మాత్రం సోనాక్షీ సిన్హా ప్లేస్‌లో మృణాల్ ఠాకూర్ కనిపించనున్నారని భోగట్టా. ఈ చిత్రానికి సంబంధించిన ఎక్కువ శాతం షూటింగ్‌ని స్కాట్లాండ్‌లో జరిపేలా ప్లాన్ చేశారట. ఈ షెడ్యూల్ దాదాపు యాభై రోజులకు పైగా ఉంటుందని, అజయ్ దేవగన్–మృణాల్ ఠాకూర్‌ల కాంబినేషన్ ట్రాక్ అంతా విదేశాల్లోనే చిత్రీకరిస్తారని టాక్. ఈ సినిమాకు అజయ్ దేవగనే దర్శకత్వం వహిస్తారనే వార్త కూడా ప్రచారంలో ఉంది. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment