బంపర్‌ ఆఫర్‌ కొట్టేసిన రకుల్‌.. | Rakul Preet Singh Joins Amitabh Bachchan and Ajay Devgn Mayday | Sakshi
Sakshi News home page

అమితాబ్‌తో నటించే ఛాన్స్‌ కొట్టేసిన రకుల్‌

Published Thu, Nov 19 2020 12:40 PM | Last Updated on Thu, Nov 19 2020 2:23 PM

Rakul Preet Singh Joins Amitabh Bachchan and Ajay Devgn Mayday - Sakshi

కెరటం సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఢిల్లీ భామ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తెలుగుతోపాటు, కన్నడ, తమిళ్‌, హిందీ భాషల్లోనూ నటించారు. తన అందం, నటనతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల రకుల్‌ నటించిన చిత్రాలన్ని బాక్సాఫీస్‌ వద్ద ఢీలా పడటంతో సినిమాల ఎంపిక విషయంలో కాస్తా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు బాలీవుడ్ డ్రగ్ కేసులో రకుల్‌ను అధికారులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అయితే ఈవేవి ఆమె కెరీర్‌పై ప్రభావం చూపించలేదు. చదవండి: ఏం జరిగినా పని ఎప్పటికీ ఆగదు: రకుల్‌

ఇక రకుల్ ఓ వైపు తెలుగులో నటిస్తూనే బాలీవుడ్‌లోనూ అప్పుడప్పుడు తళుక్కుమంటున్నారు. అందులో భాగంగా ఈ భామకు బీ టౌన్‌ నుంచి మరో అవకాశం వచ్చింది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో 'మేడే' అనే థ్రిల్లర్‌ డ్రామా చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాకు స్టార్ హీరో అజయ్ దేవగన్ దర్శకత్వం వహించనున్నాడు. డైరెక్షన్‌తో పాటు ఓ కీలక పాత్రలోనూ అజయ్‌ నటిస్తున్నారు. ఈ చిత్రంతో చాలా సంవత్సరాల తరువాత సీనియర్ స్టార్ అమితాబ్, అజయ్‌లు కలిసి పనిచేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ డిసెంబర్‌లో హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. చదవండి: అజయ్‌ దర్శకత్వంలో అమితాబ్‌

కాగా ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశాన్ని రకుల్ కొట్టేశారు. ఈ సినిమాలో రకుల్.. అజయ్‌కు కో పైలట్ పాత్రలో నటించబోతున్నారు. ఈ విషయంపై రకుల్‌ ట్విటర్‌లో స్పందిస్తూ.. సినిమాలో నటించడం ఆనందంగా ఉందన్నారు. ‘మేడేలో కో-పైలేట్‌గా నటించడం ఎంత ఆనందంగా ఉందో చెప్పటేను. అమితాబ్‌ సార్‌తో కలిసి పనిచేయాలనే కల నిమైంది. అజయ్‌ దేవగన్‌కు ధన్యవాదాలు. షూటింగ్‌ కోసం సిద్ధంగా ఉన్నాను.’ అని ట్వీట్‌ చేశారు. కాగా అజయ్ దేవగన్‌తో రకుల్‌కు ఇది మూడో సినిమా. ఇప్పటి వరకు దే దే ప్యార్ దే, ఓ మై గాడ్ (షూటింగ్ స్టార్ట్ కావాల్సి ఉంది) సినిమాలో జోడి కట్టారు. చదవండి:  బెస్ట్‌ సిటీగా మార్చుకుందాం: ఈషా రెబ్బ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement