టేకాఫ్‌కి రెడీ | Rakul Preet Singh begins shooting for MayDay | Sakshi

టేకాఫ్‌కి రెడీ

Jan 4 2021 6:35 AM | Updated on Jan 4 2021 6:35 AM

Rakul Preet Singh begins shooting for MayDay - Sakshi

టేకాఫ్‌కి సిద్ధమయ్యారు రకుల్‌ ప్రీత్‌సింగ్‌. కో పైలట్‌గా తన డ్యూటీని సరిగ్గా చేయడానికి రెడీ అయ్యారు. అజయ్‌ దేవగణ్‌ దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న థ్రిల్లర్‌ చిత్రం ‘మే డే’. ఇందులో అమితాబ్‌ బచ్చన్, రకుల్‌ ప్రీత్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అజయ్‌ దేవగన్‌ కీలక పాత్ర చేస్తున్నారు. అమితాబ్‌ పైలట్, రకుల్‌ కో పైలట్‌ పాత్రలు చేస్తున్నారు. ఇటీవలే కోవిడ్‌ బారినపడ్డారు రకుల్‌. అందులోంచి బయటపడి, షూటింగ్స్‌కి సిద్ధమయ్యారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారామె. ‘‘పనిలో ఉంటేనే సంతోషంగా ఉంటాను’’ అంటూ సెట్లో మేకప్‌ చేసుకుంటున్న ఫొటో షేర్‌ చేశారు రకుల్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement