
అజయ్ దేవగణ్, బాలు మున్నంగి
బిగ్ బి అమితాబ్ బచ్చన్–అజయ్ దేవగణ్ కాంబినేషన్‌లో రూపొందనున్న ‘మే డే’ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సినిమాలో అమితాబ్ ప్రధాన పాత్రలో నటించనుండగా కీలక పాత్ర పోషిస్తూ, స్వీయ దర్శకత్వంలో అజయ్ దేవగణ్ నిర్మిస్తుండడం ఓ విశేషం. రకుల్ ప్రీత్‌సింగ్, అంగీరా ధార్ కథానాయికలు. తొలి సన్నివేశానికి అజయ్ దేవగణ్ స్నేహితుడు, తెలుగు జోతిష్యులు బాలు మున్నంగి క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా అజయ్ దేవగణ్ మాట్లాడుతూ– ‘‘మే డే’ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను శుక్రవారమే మొదలుపెట్టాం. సినిమా పూర్తయ్యేవరకూ నాన్ స్టాప్‌గా షూటింగ్ చేస్తాం. అమితాబ్ గారిని తొలిసారి దర్శకత్వం వహిస్తుండటం ఎగ్జయిటింగ్‌గా ఉంది. 2022 ఏప్రిల్ 29న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అసీమ్ బజాజ్, సహ నిర్మాతలు: కుమార్ మంగత్, విక్రాంత్ శర్మ, హస్నైన్ హుస్సేనీ, జయ్ కనూజియా, సందీప్ కెవ్లానీ, తార్‌లోక్ సింగ్.
Comments
Please login to add a commentAdd a comment