mayday
-
సింగపూర్‌లో ఘనంగా కార్మిక దినోత్సవ వేడుకలు
సింగపూర్‌లో కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సింగపూర్ తెలుగు సమాజం నూతన కార్యవర్గం బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి కమిటీ ఆధ్వర్యంలో మే1న స్థానిక తెరుసన్ రిక్రియేషన్ సెంటర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత, తెలంగాణ శాసనమండలి సభ్యులు గోరటి వెంకన్న హాజరయ్యారు. ప్రముఖ జానపద గాయని చైతన్య తన పాటలతో, వైవిధ్య కళాకారుడు రవి మాయాజాలంతో మంత్రముగ్ధులను చేశారు. ప్రత్యేక అతిథిగా,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రవాసాంధ్ర వ్యవహారాల సలహాదారు, మాజీ పార్లమెంట్ సభ్యులు జ్ఞానేంద్రరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అందరినీ ఒకతాటి మీదకు తీసుకొచ్చి కార్మికసోదరులకు తెలుగు సమాజం చేస్తున్న కార్యక్రమాలను ప్రశంసించారు. ఏపీఎన్ఆర్టీ ప్రవాస బీమా గురించి వివరించటంతో పాటు, ప్రభుత్వం అవసరమైనప్పుడు ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. అలాగే సింగపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్ లో వివిధప్రాంతాలకు విమానసర్వీసులకై తన పరిధిలో కృషిచేస్తానని హామి ఇచ్చారు. సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ, కార్మిక సోదరుల వృత్తి నైపుణ్య పరీక్షలకై తెలుగు సమాజం కార్యవర్గం చేస్తున్న కృషి ఫలించిందని అన్నారు. తొలిదశలో 5 కోర్సులు ఆమోదం పొందాయని ప్రకటించారు. అలాగే సింగపూర్‌లో నివశించే వలస కార్మిక సోదరులను ఆపత్కాలంలో ఆదుకునేలా బీమాతో పాటు ఇతర దీర్ఘకాలిక సౌకర్యాలను కల్పించేలా ఓ ప్రణాళికను సింగపూర్ తెలుగు సమాజం సిద్ధం చేసిందని అన్నారు. అందుకు భారత దేశ హైకమిషన్ సైతం బీమా ప్రయోజనాలు కల్పించేందుకు మొగ్గచూపడం శుభపరిణామమని అన్నారు. విధి విధానాలు సైతం చివరి దశకు వచ్చిందని సింగపూరులో భారత హై కమిషనర్ పెరియసామి కుమరన్ సైతం ఈ కార్యక్రమంలో ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని విజయంతం చేసినందుకు నిర్వాహకులు మేరువ కాశిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ నూతన కమిటీ గతంలో సాధించిన విజయాల్ని పునాదిగా చేసుకొని మరెన్నో వినూత్న కార్యక్రమాల్ని చేపట్టబోతున్నట్లు గౌరవ కార్యదర్శి అనిల్ పోలిశెట్టి వెల్లడించారు. -
May Day: కార్మికుల హక్కులు, కష్టాలను తెలియజేసే పాటలు
కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చిందించి పోరాడి సాధించిన రోజు నేడు(మే 01). ఈ రోజును మేడేగా కార్మికులు ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. సమాజ గతిని, పురోగతిని శాసించేది, నిర్ధేశించేది శ్రామిక వర్గం. అలాంటి వర్గాన్ని మనమంతా గౌరవించాల్సింది. శ్రామిక వర్గం కష్టాలు, హక్కులపై తెలుగు చాలా సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా ఆర్ నారాయణ మూర్తి సినిమాలన్నీ శ్రామికుల హక్కులకు సంబంధించినవే. ఆయన పాటలకు కూడా వారి కష్టాలను తెలియజేసేవిగా ఉంటాయి. మేడే సందర్భంగా శ్రామిక వర్గాలకు సంబంధించిన తెలుగు సినిమా పాటలు మీకోసం. > -
ఇండిగో విమానానికి తప్పిన భారీ ప్రమాదం
సాక్షి, బెంగళూరు: లక్నో నుండి బెంగళూరుకు వస్తున్న ఇండిగో విమానానికి భారీ ప్రమాదం తప్పింది. ల్యాండిగ్‌కు కొన్ని క్షణాల ముందు క్యాబిన్ డిప్రెజరైజేషన్కు గురి కావడంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అయితే పైలట్, సిబ్బంది అప్రమత్తతతో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో అధికారులు, ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. తాజా నివేదికల ప్రకారం ఇండిగో విమానం బెంగళూరుకు 240 కిలోమీటర్ల దూరంలో, 11,000 అడుగుల ఎత్తులో ఉండగా ఇండిగో ఫ్లైట్ 6ఈ-6654 క్యాబిన్లో ఇబ్బంది ఎదురైంది. దీంతో విమాన సిబ్బంది అత్యవసర ప్రమాద సంకేతం మేడేను ప్రకటించారు. తక్షణమే ప్రయాణీకులకు ఆక్సిజన్ మాస్క్‌లు అందించారు. అనంతరం బెంగళూరు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ను సంప్రదించి విమాన లాండింగ్ క్లియరెన్స్ కోరారు. వారి అనుమతి మేరకు విమానాన్ని సురకక్షితంగా ల్యాండ్ చేయడంతో పెనుప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఈ విమానాన్ని బెంగళూరు సాంకేతిక బృందం తనిఖీ చేస్తోంది. అలాగే ఈ అంశంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దర్యాప్తు చేస్తోంది. క్యాబిన్ డిప్రెషరైజేషన్ ఇబ్బంది ఏర్పడితే అత్యవసర పరిస్థితిని తెలియజేస్తూ...‘మేడే’ లేదా ‘పాన్ పాన్’ అనే ప్రమాద సంకేతాన్నివ్వాలి. సంబంధిత ఏటీసీ అధికారుల అనుమతితో ల్యాండ్‌కావాలి. ప్రయాణీకులందరికీ ఆక్సిజన్ మాస్క్‌లు అందజేయాలి. కాగా గత ఏడాది మే నెలలో పాకిస్తాన్‌లోని కరాచీ ఎయిర్పోర్ట్ సమీపంలో ల్యాండ్ అవ్వడానికి ఒక్క నిమిషం ముందు మేడే మేడే సందేశం ఇస్తూనే.. విమానం కుప్పకూలిన ప్రమాదంలో 97 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. -
ఆ విమానాన్ని ఇండియా ఏం చేయబోతోంది?
ఢాకా నుంచి మస్కట్ కు 173 మంది ప్రయాణికులతో బయలుదేరిన బంగ్లాదేశ్ విమానం ‘మెక్ డానెల్ డగ్లాస్ ఎం.డి. 83’.. ఐదున్నరేళ్ల క్రితం రాయ్‌పుర్ (ఛత్తీస్‌గఢ్) లోని స్వామి వివేకానంద విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఆరోజు నుంచీ ఈరోజు వరకు ఆ విమానం అదే ప్లేస్ లోనే ఉండిపోయింది! తీసుకెళ్లమంటే బంగ్లాదేశ్ తీసుకెళ్లడం లేదు! పోనీ పార్కింగ్ చార్జీలైనా కట్టమంటే కట్టడం లేదు. (1.25 కోట్లు). ‘ఓర్నాయనోయ్.. అంతా!’ అంటోంది. ఎందుకు ఆ విమానం ఇంకా అక్కడ ఉంది? వాళ్ల అధికారులెవరూ ఎందుకు వచ్చి తీసుకెళ్లడం లేదు! ఇప్పుడా విమానాన్ని ఇండియా ఏం చేయబోతోంది? ఇది పాత కథ మాత్రమే కాదు, ఇప్పటికైతే అంతులేని కథ కూడా! ఐదున్నరేళ్ల క్రితం 2015 ఆగస్టు 7 తేదీ రాత్రి ఏడు గంటలకు ‘మెక్ డానెల్ డగ్లస్ ఎండి 83’ అనే బంగ్లాదేశ్ బోయింగ్ విమానం మన దేశంలో దిగే పని లేకుండానే దిగింది! బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో బయల్దేరిన ఆ విమానం నేరుగా ఒమన్ రాజధాని మస్కట్ వెళుతున్నప్పుడు గగనతలంలో ఒక ఇంజిన్ చెడిపోయింది. పైలట్ ఆ సంగతిని గుర్తించేటప్పటికి వారణాసి, రాయ్‌పుర్ మధ్య గగనతలంలో ఉంది. అప్పటికప్పుడు అత్యవసర ల్యాండింగ్‌కి దగ్గరగా ఉన్న రాయ్‌పుర్ (ఛత్తీస్ గఢ్) లోని స్వామి వివేకానంద విమానాశ్రయంలో విమానాన్ని దింపేశాడు. లోపల ఉన్న 173 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. తర్వాత వాళ్లంతా తమ గమ్యస్థానానికి చేరుకున్నారు. అయితే ఈ ‘డగ్గాస్ 83’ విమానం మాత్రం తిరిగి బంగ్లాదేశ్ చేరుకోలేదు. ఆనాడే కాదు, మర్నాడు, ఆ మర్నాడు, ఆ నెల, ఆ తర్వాతి నెల, ఆ ఏడాది, తర్వాతి ఏడాదీ.. పైకి లేవనే లేదు. ఇవాళ్టికీ ఉన్నచోటే ఉండిపోయింది. ఎయిర్‌పోర్ట్స్ ఆధారిటీ ఆఫ్ ఇండియా (ఎ.ఎ.ఐ.) పార్కింగ్ స్థలం అది. అక్కడ పార్క్ చేసినందుకు బంగ్లాదేశ్ వాళ్ల ‘యునైటెడ్ ఎయిర్వేస్’ (ఈ డగ్లాస్ 83 విమానం వాళ్లదే) కోటీ 25 లక్షల రూపాయల పార్కింగ్ చార్జీలను ఎ.ఎ.ఐ.కి బకాయీ పడింది. ఇమ్మంటే ఇవ్వదు. విమానాన్ని తీసుకుపొమ్మంటే పోదు. చూసి చూసి ఏదో ఒకటి తేల్చమని ఈ జనవరి 18న ఎ.ఎ.ఐ. మరొకసారి గుర్తుచేసింది. విజ్ఞప్తులు, ఆదేశాలు పని చేయకపోవడంతో ఇప్పుడు లీగల్‌గా తేల్చుకునేందుకు సిద్ధమైంది. రాయ్‌పుర్ స్వామి వివేకానంద విమానాశ్రయంలో ఉన్నవే ఎనిమిది పార్కింగ్ బేస్‌లు. వాటిల్లో ఒక విమానం అక్కడే ఫిక్స్ అయిపోవడంతో ఇబ్బందిగా ఉన్నప్పటికీ గత ఐదున్నరేళ్లు గా ఆ ఎయిర్పోర్ట్ సర్దుకుపోతోంది. ఎంత సర్దుకుపోయినా ఒక హద్దయితే ఉంటుంది. ఆ హద్దు కూడా దాటి, ఇప్పుడిక ఆ విమానాన్ని అక్కడి నుంచి లేపే ప్రయత్నం మొదలుపెట్టింది ఎ.ఎ.ఐ. డంప్ యార్డ్‌కు పంపడానికి లేదు. పార్కింగ్ ప్లేస్‌లో అలా పడి వుంటుందిలే అనుకోడానికీ లేదు. పైగా రెండు మూడు మరమ్మతులు చేస్తే పైకి ఎగిరే విమానమే అది. ‘కొనేవాళ్ల కోసం చూస్తున్నాం. కాస్త టైమ్ ఇవ్వండి’ అని మాత్రం బంగ్లాదేశ్ యునైటెడ్ ఎయిర్వేస్ అంటోంది. ‘‘ఏమైనా ఇంకో వారం మాత్రమే చూస్తాం’’ అని రాయ్‌పుర్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ రాకేశ్ సహాయ్ అంటున్నారు. అని రెండు రోజులు అయింది. అసలు డగ్లాస్ 83 అత్యవసరంగా ల్యాండ్ అయిన మూడు వారాల తర్వాత గానీ బంగ్లాదేశ్ పౌర విమానయాన శాఖ అధికారులు పర్యవేక్షణ కోసం రాయ్‌పుర్ రాలేదు! వాళ్లొచ్చి వెళ్లిన కొన్ని నెలల వరకూ మళ్లీ అట్నుంచొకరు ఇటు రాలేదు. ఆ వచ్చినవాళ్లు చెడిపోయిన ఇంజన్ తీసి కొత్తది బిగించారు. ఇక అక్కడి నుంచి విమానాన్ని తీసుకెళ్లాలంటే బంగ్లాదేశ్ విమానయాన శాఖ నుంచి తప్పనిసరిగా ‘ఎగిరే యోగ్యత పత్రం’ రావాలి. అది రాలేదు. ఇది ఎగర లేదు! ఏళ్లు గడిచిపోతున్నాయి. మనవాళ్లు ఇప్పటికి ఉత్తరాలు, ఈమెయిళ్లు కలిపి సుమారుగా ఓ 50 వరకు పంపారు. నెల నెలా గుర్తు చేస్తూనే ఉన్నారు. ఎప్పుడూ ఒకటే సమాధానం.. ‘ఎగిరే యోగ్యత పత్రం’ అందగానే తీసుకెళతాం అని! రాయ్‌పుర్ ఎయిర్పోర్ట్ ఇబ్బందులు రాయ్‌పుర్‌కు ఉన్నాయి. ఇక్కడి నుంచి రోజూ 27 విమానాలు పైకి లేస్తాయి. 27 విమానాలు కిందికి దిగుతాయి. ఉదయం 8–10 గంటల మధ్య, సాయంత్రం 4–6 మధ్య మొత్తం నాలుగు గంటల పాటు ఎనిమిది పార్కింగ్ బేస్‌లు విమానాలకు అవసరం అవుతాయి. డగ్లాస్ 83 కారణంగా ఆ సమయంలో వేరొక ప్రదేశంలో విమానాలను ఉంచవలసి వస్తోంది. ఇది మన వైపు ఇబ్బంది. ఇక వాళ్ల వైపు.. యుౖ¯ð టెడ్ ఎయిర్వేస్ నష్టాల్లో కూరుకుపోయి ఉంది. 2016 నుంచి ఒక్క విమానం కూడా పొయ్యి లోంచి లేవని పిల్లిలా పైకి ఎగరనేలేదు. ఎనిమిది విమానాలను తీసుకెళ్లి ఢాకా హజ్రత్ షాజాలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ‘కార్గో అప్రోచ్ ఏరియా’లో వదిలేశారు. అవి కూడా అక్కడ కార్గో ఫ్లయిట్స్ కాలికీ చేతికీ అడ్డం పడుతున్నాయి. ఈ పరిస్థితిలో రాయ్‌పుర్ విమానాశ్రయానికి పార్కింగ్ చార్జీలు చెల్లించలేక, విమానాన్ని తీసుకెళ్లలేక.. చివరికి.. ‘మీరే ఓ గిరాకీని వెతికి పట్టుకుని, డగ్లాస్ 83ని అమ్మేసి, మీ పార్కింగ్ ఛార్జీలను మినహాయించుకుని, మిగతా డబ్బును పంపించండి’ అని యునైటెడ్ ఎయిర్వేస్.. మన ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియాను కోరవచ్చు. ఆ రోజు ఏం జరిగింది? విమానం బంగ్లాదేశ్లోంచి పైకి లేచింది. వారణాసి–రాయ్‌పుర్ గగనతల హద్దులోకి వచ్చేసరికి ఇంజిన్ పాడైంది. లోపల 173 మంది ప్రయాణికులు ఉన్నారు. అత్యవసరంగా ల్యాండ్ అవకపోతే గాల్లోనే పేలిపోయే ప్రమాదం ఉందని పైలట్ షాబాజ్ ఇంతియాజ్ ఖాన్ గ్రహించాడు. భూమికి 32 వేల అడుగుల ఎత్తున విమానం గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇంజన్‌లోంచి మంటలు వచ్చి, ఇంజన్ బద్దలెపోయింది. లోపల కూర్చొని ఉన్న ప్రయాణికులకు ఇదేమీ తెలియదు. విమానం కుదుపులకు లోనవడం మొదలైనప్పుడేమైనా కొందరు గ్రహించగలిగారేమో. లక్కీగా విమానంలో లోపల ఒక ఫ్లయిట్ ఇంజినీరు ఉన్నాడు. పరిస్థితి మరింత క్షీణించకుండా అతడు చేయగలిగిందేదో చేశాడు. పైలట్ వెంటనే తొలి ‘మేడే కాల్’ను గాలిలోకి పంపించాడు. మేడే కాల్ అంటే ‘ప్రమాదంలో ఉన్నాం. ల్యాండింగ్‌కి అనుమతి ఇవ్వండి’ అని విజ్ఞప్తి చేసే సంకేతం. ఆ సంకేతాన్ని కోల్‌కతా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కి పంపితే దురదృష్టవశాత్తూ అది చేరలేదు! కోల్‌కతా చెబితేనే రాయ్‌పుర్ చేస్తుంది. ఏమైతే అయిందని రాయ్‌పుర్‌లో దించేయాలని పైలట్ నిర్ణయించుకున్నాడు. అయితే ఒక విమానాన్ని అత్యవసరంగానే అయినా ల్యాండ్ చేయించే అధికారం రాయ్‌పుర్ ఎయిర్‌పోర్ట్‌కు లేదు. కోల్‌కతా నుంచి ఆర్డర్స్ రావాలి. దురదృష్టంతోపాటే అదృష్టమూ వారి వెంట ఉన్నట్లుంది. పైలెట్ ఇచ్చిన మేడే కాల్‌ను ముంబై నుంచి కోల్‌కతా వెళుతున్న ఇండిగో ఫ్లయిట్ పైలట్ పికప్ చేసుకుని ఆ సమాచారాన్ని కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌కు అందించారు. కోల్‌కతా ఎయిర్పోర్ట్ అధికారులు వెంటనే రాయ్‌పుర్ అధికారులకు సమాచారం ఇచ్చి ల్యాండ్‌కి అనుమతి ఇవ్వమని కోరారు. రాయ్‌పుర్ ఎయిర్‌పోర్ట్‌లో ఎలా దిగాలో తెలిపే నేవిగేషన్ చార్ట్ లేకుండానే విమానం సురక్షితంగా దిగేందుకు ఇండిగో పైలట్ నిర్విరామంగా రేడియో కాంటాక్ట్‌లో ఉండి అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేశారు. విమానం అయితే దిగింది కానీ, ప్రయాణికులకు వేరే విమానం అందుబాటులో లేకుండా పోయింది. 27 గంటల పాటు వారు అక్కడే ఉండిపోవలసి వచ్చింది. బంగ్లాదేశ్ నుంచి ఆగస్టు 8 రాత్రి గం. 10.27కు ప్రత్యేక విమానం వచ్చి వారిని మస్కట్ తీసుకెళ్లింది. -
టేకాఫ్‌కి రెడీ
టేకాఫ్‌కి సిద్ధమయ్యారు రకుల్ ప్రీత్‌సింగ్. కో పైలట్‌గా తన డ్యూటీని సరిగ్గా చేయడానికి రెడీ అయ్యారు. అజయ్ దేవగణ్ దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న థ్రిల్లర్ చిత్రం ‘మే డే’. ఇందులో అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అజయ్ దేవగన్ కీలక పాత్ర చేస్తున్నారు. అమితాబ్ పైలట్, రకుల్ కో పైలట్ పాత్రలు చేస్తున్నారు. ఇటీవలే కోవిడ్ బారినపడ్డారు రకుల్. అందులోంచి బయటపడి, షూటింగ్స్‌కి సిద్ధమయ్యారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారామె. ‘‘పనిలో ఉంటేనే సంతోషంగా ఉంటాను’’ అంటూ సెట్లో మేకప్ చేసుకుంటున్న ఫొటో షేర్ చేశారు రకుల్. -
నేను చాలా లక్కీ
‘‘నా కల నెరవేరినట్లుగా అనిపిస్తోంది. ఇది నిజమేనా? అన్నంత ఉద్వేగంగా ఉంది’’ అన్నారు ఆకాంక్షా సింగ్. ఈ బ్యూటీ ఇంతగా ఎగ్జయిట్ అవ్వడానికి కారణం ‘మే డే’ సినిమాలో అవకాశం దక్కడమే. అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగణ్, రకుల్ ప్రీత్‌సింగ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి అజయ్ దేవగణే దర్శకుడు. ఇందులో అజయ్ భార్య పాత్రలో నటిస్తున్నారు ఆకాంక్ష. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ – ‘‘అమితాబ్ సార్, అజయ్ సార్ కాంబినేషన్ సినిమాలో నేను నటించడం ఆనందంగా ఉంది. పైగా ఈ చిత్రం ప్రారంభోత్సవం సందర్భంగా తీసిన ముహూర్తపు సన్నివేశంలో నేను ఉండటం చాలా లక్కీ. నాది చాలా కీలక పాత్ర’’ అన్నారు. ‘మళ్ళీ రావా’ సినిమాతో తెలుగుకి పరిచయమైన ఆకాంక్షా సింగ్ ఆ తర్వాత నాగార్జున సరసన ‘దేవదాస్’లో నటించారు. -
ఏప్రిల్‌లో మే డే
బిగ్ బి అమితాబ్ బచ్చన్–అజయ్ దేవగణ్ కాంబినేషన్లో రూపొందనున్న ‘మే డే’ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సినిమాలో అమితాబ్ ప్రధాన పాత్రలో నటించనుండగా కీలక పాత్ర పోషిస్తూ, స్వీయ దర్శకత్వంలో అజయ్ దేవగణ్ నిర్మిస్తుండడం ఓ విశేషం. రకుల్ ప్రీత్‌సింగ్, అంగీరా ధార్ కథానాయికలు. తొలి సన్నివేశానికి అజయ్ దేవగణ్ స్నేహితుడు, తెలుగు జోతిష్యులు బాలు మున్నంగి క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా అజయ్ దేవగణ్ మాట్లాడుతూ– ‘‘మే డే’ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను శుక్రవారమే మొదలుపెట్టాం. సినిమా పూర్తయ్యేవరకూ నాన్ స్టాప్‌గా షూటింగ్ చేస్తాం. అమితాబ్ గారిని తొలిసారి దర్శకత్వం వహిస్తుండటం ఎగ్జయిటింగ్‌గా ఉంది. 2022 ఏప్రిల్ 29న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అసీమ్ బజాజ్, సహ నిర్మాతలు: కుమార్ మంగత్, విక్రాంత్ శర్మ, హస్నైన్ హుస్సేనీ, జయ్ కనూజియా, సందీప్ కెవ్లానీ, తార్లోక్ సింగ్. -
అజయ్ దర్శకత్వంలో అమితాబ్
అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగన్ కలసి పలు సినిమాలు చేశారు. ఈ చిత్రాల్లో వాళ్ల ఈక్వేషన్ కేవలం యాక్టర్–యాక్టర్‌గా.. అంతే. ‘మేజర్ సాబ్, ఖాకీ, సత్యాగ్రహ (2013)’ సినిమాలు చేశారు అమితాబ్, అజయ్. ఏడేళ్ల గ్యాప్ తర్వాత ఈ ఇద్దరూ కలసి ఓ సినిమా చేయబోతున్నారు. కానీ ఈసారి యాక్టర్–డైరెక్టర్ ఈక్వేషన్లో. అజయ్ దేవగన్ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో ఓ సినిమా తెరకెక్కనుంది. ‘మే డే’ టైటిల్‌తో తెరకెక్కే ఈ సినిమాలో అజయ్ దేవగన్ పైలెట్ పాత్రలో నటించనున్నారు. థ్రిల్లర్ జానర్లో రూపొందనున్న ఈ సినిమా డిసెంబర్లో ప్రారంభం కానుంది. ఈ సినిమాను అజయ్ తన సొంత బ్యానర్ అజయ్ దేవగన్ ఫిల్మ్స్‌పై నిర్మించనున్నారు. గతంలో ‘యూ మీ ఔర్ హమ్, శివాయ’ సినిమాలకు దర్శకత్వం వహించారు అజయ్. -
మళ్లీ ప్రపంచ మార్కెట్లు క్రాష్..!
టోక్యో/న్యూయార్క్: కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల వృద్ధికి తీవ్రంగానే విఘాతం కలిగిందన్న తాజా గణాంకాల కారణంగా ఆస్ట్రేలియా, జపాన్, బ్రిటన్, అమెరికా మార్కెట్లు శుక్రవారం పతనమయ్యాయి. కార్మికుల దినోత్సవం సందర్భంగా చాలా మార్కెట్లలో ట్రేడింగ్ జరగలేదు. మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కారణంగా మన మార్కెట్‌కు సెలవు కావడంతో భారీ పతనం తప్పిందని నిపుణులంటున్నారు. పతనం ఎందుకంటే...: ఆస్ట్రేలియాలో తయారీ రంగం 11 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. అంతేకాకుండా కరోనా వైరస్ మూలం ఎక్కడో విచారణ చేయాలన్న అంశంపై ఆస్ట్రేలియా, చైనాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఆస్ట్రేలియా నుంచి దిగుమతులపై ఆంక్షలు వి«ధించడం వంటి చర్యలు తీసుకుంటామని చైనా హెచ్చరించింది. మరోవైపు నిరుద్యోగ భృతి కోసం అమెరికాలో దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య భారీగా పెరిగింది. నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ఆరు వారాల్లో మూడు కోట్లకు చేరింది. ఈ ఏడాది మార్చిలో అమెరికాలో వినియోగదారుల వ్యయం రికార్డ్ స్థాయికి పడిపోయింది. కాగా యూరోజోన్ వృద్ధి ఈ క్యూ1లో 3.8 శాతం తగ్గింది. ఈ గణాంకాలు మొదలైనప్పటి (1995) నుంచి చూస్తే, ఇదే అత్యంత అధ్వాన క్షీణత. ఆస్ట్రేలియా స్టాక్ సూచీ 5 శాతం పడిపోగా, జపాన్ నికాయ్ 3 శాతం నష్టపోయింది. బ్రిటన్ ఎఫ్టీఎస్సీ 2 శాతం మేర క్షీణించింది. రాత్రి గం.11.30 ని.సమయానికి అమెరికా స్టాక్ సూచీలు 3–4 శాతం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మన నిఫ్టీకి ప్రతిరూపమైన ఎస్‌జీఎక్స్ నిఫ్టీ పగటి పూట ట్రేడింగ్‌లో 5 శాతం మేర నష్టపోయి, 9,300 పాయింట్ల దరిదాపుల్లోకి వచ్చింది. గురువారం నిఫ్టీ 306 పాయింట్లు లాభపడి 9,860 పాయింట్ల వద్ద ముగిసిన విషయం తెలిసిందే. కాగా శుక్రవారం మన మార్కెట్లో ట్రేడింగ్ జరిగిఉంటే, సెన్సెక్స్ 1,000 పాయింట్లు, నిఫ్టీ 400 పాయింట్ల మేర నష్టపోయి ఉండేవని నిపుణులంటున్నారు. -
మేడే రోజు శ్రామిక్ రైళ్లు
రాంచి/న్యూఢిల్లీ: లాక్డౌన్ కారణంగా పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు, విద్యార్థులు, పర్యాటకులను స్వస్థలాలకు చేర్చే శ్రామిక్ రైళ్ల ప్రయాణం కార్మిక దినోత్సవమైన మేడే రోజు ప్రారంభమైంది. తొలి రైలు 1200 మంది కార్మికులతో శుక్రవారం తెల్లవారుజామున తెలంగాణ నుంచి జార్ఖండ్‌కు ప్రయాణమైంది. భౌతిక దూరం పాటించేందుకు వీలుగా ప్రతీ కోచ్‌లో 54 మందిని మాత్రమే అనుమతించారు. జార్ఖండ్‌లోని హతియాకు చేరుకున్నాక స్థానిక అధికారులు నిబంధనల ప్రకారం వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, అనంతరం స్వస్థలాలకు చేరుస్తారు. ఇళ్లల్లో కాని, ప్రత్యేక కేంద్రాల్లో కానీ వారిని క్వారంటైన్ చేస్తారు. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన కార్మికులను సొంత ప్రాంతాలకు చేర్చేందుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలు కేంద్రాన్ని కోరిన విషయం తెలిసిందే. కార్మికులను స్వస్థలాలకు చేర్చేందుకు ఈ రైలు కాకుండా శుక్రవారం మరో 5 శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేశారు. అవి నాసిక్(మహారాష్ట్ర)– లక్నో(యూపీ), అలువ(కేరళ)– భువనేశ్వర్(ఒడిశా), నాసిక్–భోపాల్(మధ్యప్రదేశ్), జైపూర్(రాజస్తాన్)– పట్నా(బిహార్), కోట(రాజస్తాన్)–హతియాకు కార్మికులను చేరుస్తాయి. ఈ ప్రత్యేక రైళ్లన్నీ మధ్యలో ఎక్కడా ఆగవని, ప్రయాణీకులకు రైళ్లలోనే భోజనం అందిస్తామని అధికారులు తెలిపారు. -
ఈ రోజు మహారాష్ట్రకు ఎంతో ప్రత్యేకం
సాక్షి, న్యూఢిల్లీ : మే 1, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అని తెల్సిందే. మహారాష్ట్రకు సంబంధించి ఈ రోజుకు మరింత ప్రత్యేకత ఉంది. అదే రాష్ట్ర అవతరన దినోత్సవం. 1960లో సరిగ్గా ఈ రోజునే మహారాష్ట్ర అవతరించింది. దీనికోసం సాగిన ‘సంయుక్త మహారాష్ట్ర ఉద్యమం’ను స్ఫూర్తిగా తీసుకొని దానిపై తీసీన వెబ్ సిరీస్ ‘హుతాత్మ (అమరవీరులు)’ను ఈ రోజు ‘జీ5’ ప్రసారం చేస్తోంది. జయ్‌ప్రద్ దేశాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అంజలి పాటిల్, వైభవ్ తత్వవాది, అభయ్ మహాజన్‌తోపాటు ప్రముఖ మరాఠీ నటులు అశ్విణి కల్సేకర్, మోహన్ అగశ్య్, సచిన్ ఖెడేకర్లు నటించారు. మీనా దేశ్‌పాండే రాసిన ‘హుతాత్మ’ మరాఠీ నవల ఆధారంగానే దీన్ని తెరకెక్కించారు. బ్రిటీష్ కాలం నాటి బాంబే స్టేట్‌ను విడగొట్టి మరాఠీ భాషా ప్రాతిపదికన ప్రత్యేక మహారాష్ట్రను ఏర్పాటు చేయాలనే డిమాండ్ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఉంది. అయితే 1955లో తొలి రాష్ట్రాల పునర్విభజన కమిషన్‌ను ఏర్పాటు చేసినప్పుడు ఈ డిమాండ్ ఊపందుకుంది. పాలనాపరమైన సౌలభ్యాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకున్న ఆ కమిషన్ భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రతిపాదనను వ్యతిరేకించింది. దాంతో ప్రత్యేక మహారాష్ట్ర సాధన కోసం కమ్యూనిస్టులు, సోషలిస్టులు, మేథావులు, సామాజిక కార్యకర్తలు ఏకమై ‘సంయుక్త మహారాష్ట్ర సమితి’ని ఏర్పాటు చేశారు. కేశవ్‌రావ్ జెఢే, ఎస్ఎం జోషి, ఆచార్య ఆత్రే, ప్రభోదాంకర్ థాకరే, శ్రీపాద్ అమృత్ డాంగే లాంటి మహుమహులు సమితి తరఫున ఉద్యమించారు. అదే సమయంలో బొంబాయి స్టేట్‌లో భాగంగా ఉన్న గుజరాతీలు కూడా మహాగుజరాత్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆర్థికంగా ఎంతో ముఖ్యమైన బొంబాయి నగరం రాజధానిగానే ప్రత్యేక రాష్ట్రం కోసం ఆ రెండు ఉద్యమాలు కొనసాగాయి. 1955, 56 మధ్య ఈ ఉద్యమాల కోసం దాదాపు 100 మంది ప్రాణాలర్పించారు. 1955, నవంబర్ 21వ తేదీన దక్షిణ ముంబైలోని కోట వద్ద మహారాష్ట్ర ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 15 మంది చనిపోయారు. ఆ తర్వాత అక్కడే అమరుల సంస్మరణార్థం ‘హుతాత్మ చౌక్’ ఏర్పడింది. మొదటి నుంచి భాషాప్రయుక్త రాష్ట్రాలను వ్యతిరేకిస్తూ వస్తోన్న ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1959లో బొంబాయి రాజధానిగా మహారాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించారు. అలాగే ప్రత్యేక గుజరాత్ రాష్ట్రం ప్రతిపాదనను కూడా అంగీకరించిన ఆయన రాజధానిగా మరో నగరాన్ని ఎంపిక చేసుకోవాల్సిందిగా సూచించారు. మతం ప్రాతిపదిక దేశం విడిపోవడాన్ని చూసిన నెహ్రూ, భాషా ప్రయుక్త రాష్ట్రాలకు అంగీకరిస్తే భాషల ప్రాతిపదికన దేశం ముక్కలవుతుందని భయపడ్డారట. అప్పటి సీపీఐ నాయకుడు శ్రీపాద్ అమృత్ డాంగే సూచన మేరకు పండిట్ నెహ్రూ 1960, మే ఒకటవ తేదీన ప్రత్యేక రాష్ట్రంగా మహారాష్ట్ర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావంతో ‘సంయుక్త మహారాష్ట్ర సమితి’ ఆధ్యాయం ముగిసింది. అయితే వలసలకు వ్యతిరేకంగా మహారాష్ట్ర ప్రత్యేకంగా మరాఠీల గడ్డంటూ ప్రభోదాంకర్ థాకరే, ఆయన కుమారుడు బాల్ థాకరే నాయకత్వాన ‘శివసేన’ పేరిట కొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. శివసేన అధికారికంగా ఏర్పాటయింది మాత్రం 1966లో. ‘హుతాత్మ’ వెబ్ సిరీస్‌లో ఈ వివరాలు ఏమేరకు ఉన్నాయో చూడాలి! -
ఘనంగా కార్మిక దినోత్సవ వేడుకలు
రెబ్బెన : మండలంలోని గోలేటి, రెబ్బెన మండల కేంద్రంలో మంగళవారం కార్మిక దినోత్సవ వేడుకలను కార్మికులు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో గోలేటి టౌన్షిప్ లోని తెలంగాణ భవన్ వద్ద టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాస్‌రావు ఎర్రజెండాను ఎగురవేసి కార్మిక అమరవీరులకు నివాళి అర్పించారు. స్థానిక కేఎల్ మహేంద్రభవన్ వద్ద ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్, సింగరేణి బస్టాండ్ వద్ద సీపీఐ పట్టణ కార్యదర్శి జగ్గయ్య,రమణారెడ్డి నగర్లో సీపీఐ సహాయ కార్యదర్శి కిషన్ ఆధ్వర్యంలో మేడే దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా పతాకాన్ని ఎగురవేసి అమరవీరులు నివాళులర్పించారు. గోలేటి ఎక్స్‌రోడ్ వద్ద సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పొన్న శంకర్, రెబ్బెన మండల కేంద్రంలో మండల కార్యదర్శి రాయిల్ల నర్సయ్య జెండాలను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఉపేందర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని ఆరో పించారు. కార్మిక సంఘాలు పోరా టాలతో సాధించిన కార్మిక చ ట్టాలను తుంగలో తొక్కుతూ కార్మిక లోకా నికి ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయ ని అన్నారు. చికాగో అమరవీరుల పో రాట స్ఫూర్తితో కార్మికులంతా హక్కుల కోసం పోరాడాలని సూచించారు. కార్యక్రమాల్లో సిక్స్మె న్ కమిటీ సభ్యులు రాంరెడ్డి ,నాయకులు సాంబగౌడ్, చంద్రశేఖర్, కుమార్, ఏఐటీయూసీ నాయకులు శేషు, కిరణ్‌బాబు, సీపీఐ రెబ్బెన పట్టణ కార్యదర్శి శంకర్, నాయకులు అశోక్, దుర్గం తిరుపతి ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కా ర్యదర్శి దుర్గం రవీందర్ పాల్గొన్నారు. -
నంది అవార్డులు జిల్లాకే గర్వకారణం
– ‘నంది’ కళాకారుల ర్యాలీలో ఎస్పీ ఆకే రవికృష్ణ కర్నూలు(కల్చరల్): కర్నూలు లలిత కళాసమితి కళాకారులు ప్రమీలార్జున పరిణయం నాటకానికి ఏడు నంది అవార్డులు సాధించడం అభినందనీయమని కర్నూలు ఎస్పీ ఆకే రవికృష్ణ తెలిపారు. స్థానిక కలెక్టరేట్ వద్ద ఆయన కళాకారుల ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ప్రతిభావంతులైన కళాకారులున్నారని, రాష్ట్రస్థాయిలో ఉత్తమ కళాకారులుగా రాణిస్తున్నారన్నారు. రంగస్థల కళాకారులకు ఆదరణ, ప్రోత్సాహం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. లలిత కళాసమితి అధ్యక్షుడు పత్తి ఓబులయ్య మాట్లాడుతూ మే డే సందర్భంగా కార్మికులతో కలసి కర్నూలు కళాకారులు నందుల పండుగ చేసుకుంటున్నారన్నారు. ప్రమీలార్జున పరిణయం నాటకానికి సహకరించిన సాంకేతిక నిపుణులు, నటులందరికీ ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ర్యాలీలో కళాకారుల పద్యాలు... పాటలు... కర్నూలు కలెక్టరేట్ వద్ద ప్రారంభమైన కళాకారుల ర్యాలీ మద్దూర్‌నగర్ మీదుగా సి.క్యాంప్ వరకూ సాగింది. ర్యాలీలో పాల్గొన్న కళాకారులు పద్యాలు, పాటలు పాడుతూ చూపరులను ఆకట్టుకున్నారు. దారి పొడవునా బాణసంచా కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో ప్రమీలార్జున పరిణయంలో నంది అవార్డులు సాధించిన ఓబులయ్య, బాలవెంకటేశ్వర్లు, రామలింగం, శామ్యూల్, లలిత కళాసమితి కార్యదర్శి మహమ్మద్ మియా, ఉపాధ్యక్షులు సి.వి.రెడ్డి, ప్రముఖ రంగస్థల నటుడు చంద్రన్న, ప్రజానాట్యమండలి ఇన్చార్జి శేషయ్య, పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉవ్వెత్తున ఎగిసిన కార్మిక జెండా
ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా సోమవారం మే డే వేడుకలు అంబరాన్నంటాయి. ఎక్కడిక్కడ కార్మికులు, కార్మిక నాయకులు పతాకాలను ఎగురవేసి ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించడంతో జిల్లా మొత్తం ఎరువు వర్ణంతో నిండిపోయింది. ఈ సందర్భంగా కార్మిక నాయకులు సర్కారు అనుసరిస్తున్న కార్మిక విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాటాలను తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. -
ఉత్తమ అవార్డులకు ఎంపిక
కర్నూలు (రాజ్‌విహార్): కార్మిక శాఖ ఆధ్వర్యంలో మేడే సందర్బంగా ఇచ్చే అవార్డులకు జిల్లా నుంచి ముగ్గురిని ఎంపిక చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ యూ.మహేశ్వరకుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అదులో ఓం సాయి ప్రొఫెషనల్స్ డిటెక్టివ్, సెక్యూరిటీ సర్వీసెస్ యజమాని పిల్లి కనకారావు, గ్రీన్కో ఎనర్జీ (గని) ప్రతినిధి అనిల్‌కుమార్‌లకు ఉత్తమ యజమానులుగా, టీఎన్టీయూసీ జిల్లా అ«ధ్యక్షుడు అశోక్‌కుమార్‌ను శ్రమశక్తి అవార్డు కింద ఎంపిక చేసినట్లు ఆయన పేర్కొన్నారు. వీరికి మేడే రోజున విజయవాడలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డులు అందజేస్తారని తెలిపారు. -
మేడే నేర్పుతున్న పాఠం..!
అది దశాబ్దాలుగా కార్మికులు కట్టుబానిసలుగా జీవితం గడిపిన కాలం. 19వ శతాబ్దం చివర్లో శ్రామిక ప్రజానీకం తమ యాజమాన్యాల ఉక్కుపాదాల కింద నలుగుతున్న రోజులవి. పారిశ్రామిక విప్లవంతో మనుషులే యంత్రాలుగా మారిన దుస్థితి. చట్టాల్లేవు, హక్కులు లేవు. అత్యంత అభద్రతా స్థితిలో రోజుకు 14 నుంచి 16 గంటల పాటు చట్ట బద్ధంగానే పనిచేయవలసి వచ్చిన ఆ రోజుల్లో పనిస్థలాల్లో గాయాలు, మరణాలు సర్వ సాధారణంగా ఉండేవి. అమెరికాలో ఆప్టన్ సింక్లెయిర్ రాసిన ‘ది జంగిల్’, జాక్లండన్ రచన ‘ది ఐరన్ హీల్’ నాటి కార్మికుల దుస్థితిని కళ్లకు కట్టినట్లు చిత్రించాయి. వేతనంలో కోతలేకుండానే తక్కువ పనిగంటల కోసం 1860ల మొదట్లోనే కార్మికులు ఆందోళనలు చేశారు కానీ, 1880ల చివరికి సంఘటిత కార్మికవర్గం 8 గంటల పనిదినాన్ని డిమాండ్ చేయగలిగిన శక్తిని సాధించుకుంది. అదే సమయంలో సోషలిజం ఒక నూతన, ఆకర్షణీయ భావనగా కార్మికులను ఆకట్టు కుంది. వస్తూత్పత్తిపై, సకల వస్తుసేవల పంపిణీపై కార్మికవర్గం యాజమాన్యం అనే భావన శ్రామికులను ఆకర్షించింది. వేలాది మంది స్త్రీ పురుషులు, బాలబాలికలు ప్రతి సంవత్సరం పనిస్థలాల్లోనే కన్నుమూస్తున్న భయానక పరిస్తితుల్లో సోషలిజం వారిలో ఆశలు రేపుతూ పలుకరించింది. ఆ సమయంలోనే అమెరికా, ఐరోపా దేశాల్లో హక్కులు ఊపిరి పోసుకున్నాయి. 1885 మే 1వ తేదీన చికాగో నగరంలో హే మార్కెట్ ప్రాంతంలో 8 గంటల పనిదినం కోసం లక్షలాది కార్మికులు ఆందోళనకు దిగారు. మే 3వ తేదీన చికాగోలోని మెకార్మిక్ వర్క్స్‌లో ఆందోళన చేస్తున్న 3 లక్షల మంది కార్మికులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో వందలాదిమంది నేలకొరిగారు. కార్మిక హక్కుల పోరులో మైలు రాయిగా నిలిచిన ఆ ఘటనకు గుర్తుగా ప్రతి ఏటా అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని నేడు వందకు పైగా దేశాల్లో అధికా రికంగా జరుపుకుంటున్నారు. ఎనిమిది గంటల పనిదినాన్ని కల్పించాలని ఇంకా ఇతర డిమాం డ్లతో శ్రామిక ప్రజలు తమ రక్తం చిందించి సాధించుకున్న డిమాం డ్లకు 21వ శతాబ్దంలో కాల దోషం పడుతోందా? అనే అనుమానం ప్రబలుతోంది. 127 ఏళ్ల తర్వాత కూడా కార్మికుల జీవితాలకు భద్రత దినదిన గండంలా మారింది. భారత్ వంటి దేశాల్లోని కోట్లాది అసంఘటిత రంగ కార్మి కులు.. హక్కులు అనే భావనకూ దూరమైపోయారు. 1990ల వరకు బలంగా ఉన్న ట్రేడ్ యూనియన్ల కారణంగా సంఘటిత రంగంలో కార్మికులకు ఉన్న కాసింత భద్రత కూడా నేడు లోపిస్తోంది. ఇక అసంఘటిత రంగంలో నేటికీ కార్మికులు బానిసల్లా గానే బతుకుతు న్నారు. దుస్తుల ఫ్యాక్టరీ వంటి చోట్ల రోజువారీ లక్ష్యం కాస్త తగ్గినా యాజమాన్యం విరుచు కుపడుతూ అదనపు పని గంటల్లో పనిచేయించడం నేడు సైతం నిత్య కృత్యంగా మారింది. పనిస్థలంలో నీళ్లుండవు. ఉద్యోగ భద్రత లేదు. ఇక దేశ మంతా విస్తరించిన పారిశ్రామిక సెజ్‌లలో యజమానులు ఏది చెబితే అదే నిబంధనలా మారిపోయింది. ప్రైవేట్ రంగం తొలినుంచి పీడక స్వభావంతో ఉందనేది కాదనలేని సత్యమే కానీ.. ప్రభుత్వాలు సైతం కార్మికుల కనీస హక్కులను కూడా కాలరాస్తుండటం దారుణం. కార్మికులకు పదవీ విరమణానంతరం కాసింత భద్రతనిస్తున్న భవిష్యనిధినే మార్కెట్ పరం చేసే ధోరణులు పొడసూపుతున్నాయి. పీఎఫ్‌పై వడ్డీని తగ్గిస్తూ మోదీ ప్రభుత్వం కొద్ది రోజుల వ్యవధిలోనే ఎన్ని పిల్లిగంతులు వేసిందో చూశాం. భవిష్యత్తులో ప్రభుత్వో ద్యోగాలు ఉండవని ఏలికలు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. భవిష్యనిధిని ఎప్పుడు కావాలంటే అప్పుడు వెనక్కు తీసుకోవడంపై కూడా కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడంపై బెంగళూరు నగరంలో కార్మికులు, ఉద్యోగులు హింసాత్మక ప్రదర్శనలు చేస్తే ఆగని ఆ ఆంక్షలు రద్దు కాలేదు. సుపరిపాలన, పారదర్శక విధానాలు, ప్రజానుకూల ప్రభుత్వం వంటి కొత్త భావనలన్నీ పైపై చక్కెర పూతలేనని పీఎఫ్‌పై వడ్డీ తగ్గింపు వంటి చర్యలు నిరూపిస్తున్నాయి. చట్టాలున్నపుడే కనీస వేతనాల చట్టం అమలు చేయడం లేదు. పని భద్రత అమలు కావడంలేదు. అసంఘటిత కార్మికులకు మేలు జరగడంలేదు. ఇప్పుడు వాటి సవరణలు చేసి కార్మికులను మరింత కష్టాల్లోకి నెట్టారు. పరిస్థితి మరింత క్లిష్టమైంది. ఎన్నో ఏళ్ళుగా సాధించుకున్న కార్మిక హక్కులు, ప్రయోజనాలు హరించుకుపోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుతున్న కార్మిక వర్గ వ్యతిరేక విధానాలనుంచి, కార్మిక వ్యతిరేకమైన ఈ చట్టాల నుంచి వారికి రక్షణ కల్పించడమే నేటి కార్మిక సంఘాల కర్తవ్యం. ఇలాంటి ప్రమాద ఘంటికలను కార్మిక సోదరులు ఐకమత్యంతో అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనాఉంది. లేదంటే రాబోయే రోజుల్లో కార్మిక సంక్షేమం, అవసరాలు, కనీస సదుపా యాల కల్పన వంటివి ఎండమావులుగా మారే ప్రమాదం ఉంది. రక్త ప్లావిత ఆచరణతో మేడే నేర్పిన, నేర్పుతున్న గుణపాఠం ఇదే. (నేడు మేడే సందర్భంగా) కె. రాజశేఖరరాజు -
ప్రమాదానికి ముందు 'మేడే మేడే' అన్నాడు
తైపీ: ట్రాన్స్ ఏషియా విమాన ఇంజిన్‌లో మంటలు అంటుకునే కొన్ని నిముషాల ముందు పైలట్ మేడే మేడే అని సాంకేతాలు ఇచ్చాడని తైవాన్ పౌర విమానయాన శాఖ ఉన్నతాధికారులు గురువారం వెల్లడించారు. అయితే ఈ విమాన ప్రమాదానికి ఇంజన్లో మంటలు కారణం కాదని వారు అభిప్రాయపడ్డారు. అదికాక విమాన ముందుభాగంలో మంటలు ఎగసిపడినట్లు ఎక్కడ ఏ కెమెరాలో నిక్షిప్తం కాలేదని వారు స్పష్టం చేశారు. ఇంతకీ మేడే అంటే ఆపదలో ఉన్నాం... రండి ...మమ్మల్ని రక్షించండి అని అర్థం ట్రాన్స్ ఏసియా 'ఫ్లైట్ జీఈ 235' విమానం ఐదుగురు సిబ్బంది సహా మొత్తం 58 మంది ప్రయాణికులతో ఉత్తర తైపీలోని సాంగ్షాన్ విమానాశ్రయం నుంచి కిన్మెన్ ద్వీపానికి వెళ్లేందుకు టేకాఫ్ తీసుకుంది. బయలుదేరిన కొద్ది నిమిషాలకే విమానం ఓ పక్కకు ఒరిగి ఫైఓవర్ను ఢీ కొట్టి... ముందుకు దూసుకెళ్లి... ముక్కలుగా విడిపోయి... నదిలో పడిపోయింది. అధికార యంత్రంగా వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టింది. దాంతో 15 మందిని రక్షించారు. ఆ విమాన ప్రయాణికుల్లో 31 మంది చైనా పర్యాటకులు ఉన్నా సంగతి తెలిసిందే.