ప్రమాదానికి ముందు 'మేడే మేడే' అన్నాడు
తైపీ: ట్రాన్స్ ఏషియా విమాన ఇంజిన్లో మంటలు అంటుకునే కొన్ని నిముషాల ముందు పైలట్ మేడే మేడే అని సాంకేతాలు ఇచ్చాడని తైవాన్ పౌర విమానయాన శాఖ ఉన్నతాధికారులు గురువారం వెల్లడించారు. అయితే ఈ విమాన ప్రమాదానికి ఇంజన్లో మంటలు కారణం కాదని వారు అభిప్రాయపడ్డారు. అదికాక విమాన ముందుభాగంలో మంటలు ఎగసిపడినట్లు ఎక్కడ ఏ కెమెరాలో నిక్షిప్తం కాలేదని వారు స్పష్టం చేశారు. ఇంతకీ మేడే అంటే ఆపదలో ఉన్నాం... రండి ...మమ్మల్ని రక్షించండి అని అర్థం
ట్రాన్స్ ఏసియా 'ఫ్లైట్ జీఈ 235' విమానం ఐదుగురు సిబ్బంది సహా మొత్తం 58 మంది ప్రయాణికులతో ఉత్తర తైపీలోని సాంగ్‌షాన్ విమానాశ్రయం నుంచి కిన్మెన్ ద్వీపానికి వెళ్లేందుకు టేకాఫ్ తీసుకుంది. బయలుదేరిన కొద్ది నిమిషాలకే విమానం ఓ పక్కకు ఒరిగి ఫైఓవర్ను ఢీ కొట్టి... ముందుకు దూసుకెళ్లి... ముక్కలుగా విడిపోయి... నదిలో పడిపోయింది. అధికార యంత్రంగా వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టింది. దాంతో 15 మందిని రక్షించారు. ఆ విమాన ప్రయాణికుల్లో 31 మంది చైనా పర్యాటకులు ఉన్నా సంగతి తెలిసిందే.