
అమృత్‌సర్: అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను తీసుకువస్తున్న విమానాలు పంజాబ్‌లోని అమృత్‌సర్‌కే ఎందుకు వస్తున్నాయి. గుజరాత్,హర్యానా, దేశ రాజధాని ఢిల్లీకి ఎందుకు వెళ్లడం లేదు. ఇప్పుడు ఈ విషయం మీదే రాజకీయ వివాదం ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం కావాలనే ఆ విమానాలను అమృత్‌సర్‌కు పంపిస్తోందని పంజాబ్ సీఎం భగవంత్‌మాన్‌సింగ్ విమర్శించారు.
పంజాబ్ పేరు చెడగొట్టేందుకే బీజేపీ ఉద్దేశపూర్వకంగా విమానాలను అమృత్‌సర్ పంపిస్తోందని మాన్ ఆరోపించారు. శనివారం(ఫిబ్రవరి15) రానున్న మరో విమానంలోని వారికి భగవంత్‌మాన్ స్వయంగా స్వాగతం పలకనున్నారు. ఇందుకుగాను ఆయన ఇప్పటికే అమృత్‌సర్ చేరుకున్నారు. కాంగ్రెస్ కూడా కేంద్రంపై మాన్ తరహాలోనే ఆరోపణలు చేస్తోంది. అయితే బీజేపీ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తోంది.
ఈ అంశాన్ని రాజకీయం చేయడం మంచిదికాదని హితవు పలుకుతోంది. ఆదివారం(ఫిబ్రవరి16) కూడా భారతీయులతో కూడిన మరో విమానం అమెరికా నుంచి రానుంది. ఇప్పటికే అమెరికా నుంచి వచ్చిన తొలి విమానంలో అమెరికాలో అక్రమంగా ఉంటున్న 104 మంది భారతీయులు తిరిగి వచ్చారు. తొలి విమానం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోనే ల్యాండ్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment