Deportation
-
సంకెళ్లు.. కాళ్లకు గొలుసులు
హోషియార్పూర్/పటియాలా/చండీగఢ్: అమెరికా తిప్పి పంపిన రెండో విమానంలోనూ భారతీయ వలసదారుల పట్ల అమానవీయంగా ప్రవర్తించింది. చేతులకు సంకెళ్లు.. కాళ్లను గొలుసులతో కట్టేశారు. 116 మందిలో ముగ్గురు మహిళలు, ముగ్గురు పిల్లలు మినహా అందరిదీ ఇదే పరిస్థితి. మరోవైపు వలసదారుల్లోని సిక్కులు తలపాగా ధరించడానికి అమెరికా అనుమతించకపోవడాన్ని ఎస్జీపీసీ ఖండించింది. అమెరికా నుంచి భారత్‌కు తిరిగొచ్చిన వలసదారులలో ఇద్దరు వ్యక్తులు అరెస్టయ్యారు. హత్య కేసుతో సంబంధం ఉన్న పటియాలా జిల్లా రాజ్‌పురాకు చెందిన ఇద్దరు యువకులను పోలీసులు శనివారం రాత్రే అరెస్టు చేశారు. సందీప్ సింగ్ అలియాస్ సన్నీ, ప్రదీప్ సింగ్‌లు 2023లో నమోదైన ఒక హత్య కేసులో నిందితులని పోలీసులు ధ్రువీకరించారు. వలసదారుల్లో సిక్కులను తలపాగా ధరించడానికి కూడా అనుమతించకపోవడంపై శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ ప్రధాన కార్యదర్శి గురుచరణ్ సింగ్ గ్రేవాల్ ఖండించారు. విషయాన్ని అమెరికా దృష్టికి తీసుకెళ్లాలని విదేశాంగ శాఖను కోరారు. రెండేళ్ల నరకం... శనివారం వచ్చిన వలసదారుల్లో పంజాబ్‌లోని హోషియార్పూర్ జిల్లా కురాలా కలాన్ గ్రామానికి చెందిన దల్జీత్ది విషాద గాధ. కుటుంబానికి మంచి జీవితం ఇవ్వాలనే ఆశతో అమెరికాకు వెళ్లాలనుకున్న దల్జీత్ ఏజెంట్ రెండేండ్ల పాటు నరకం చూపారు. గ్రామంలోని ఓ వ్యక్తి దల్జీత్‌కు 2022లో ట్రావెల్ ఏజెంట్‌ను పరిచయం చేయగా.. ఆయనకు రూ.65 లక్షలు చెల్లించారు. అవి తీసుకున్న ఏజెంట్ 2022లో దల్జీత్‌ను మొదట దుబాయ్‌కు పంపారు. 18 నెలలు అక్కడున్న తరువాత.. ఆయన ఇండియాకు తిరిగొచ్చారు. ఆ తరువాత అతన్ని అమెరికా పంపుతానని చెప్పి.. దక్షిణాఫ్రికాకు పంపించారు. అక్కడ నాలుగున్నర నెలలున్నారు. ఎట్టకేలకు గత ఏడాది ఆగస్టు 26న డంకీ మార్గం ద్వారా అమెరికా వెళ్లేందుకు ముంబై నుంచి బ్రెజిల్‌కు పంపించారు. బ్రెజిల్లో దాదాపు నెల రోజుల పాటు గడిపిన తర్వాత మూడు రోజులపాటు కాలినడక, ట్యాక్సీ, వివిధ మార్గాల ద్వారా పనామా దాటించారు. చివరకు మెక్సికోకు చేరుకున్న దల్జీత్ అక్కడా నెలరోజులపాటు ఉండాల్సి వచ్చింది. ఈ సమయంలో ట్రావెల్ ఏజెంట్ దల్జీత్‌ను ఇబ్బందులకు గురి చేశారు. అమెరికాకు పంపాలంటే.. వారి కుటుంబానికున్న నాలుగున్నర ఎకరాల భూమి యాజమాన్యాన్ని తనకు బదలాయించాలని ఒత్తిడి తెచ్చారు. బదిలీ చేసిన తరువాత జనవరి 27న దల్జీత్‌ను యూఎస్‌లోకి పంపించేశారు. అక్కడ అధికారులు అరెస్టు చేసి, డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు. బయటకు కూడా రానివ్వకుండా గదిలో బంధించారు. ఆహారంగా నీళ్లబాటిల్, చిప్స్ ప్యాకెట్, ఆపిల్ ఇచ్చారు. రెండో విమానంలో తిరిగి భారత్‌కు పంపించారు. -
డిపోర్టేషన్‌కు అమృతసర్నే ఎందుకు?: పంజాబ్ సీఎం మాన్
చండీగఢ్: భారతీయ అక్రమ వలసదారులతో కూడిన రెండో విమానం కూడా అమృత్‌సర్‌లోనే ల్యాండవడంపై పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పవిత్ర నగరాన్ని డిపోర్ట్ సెంటర్‌గా మార్చవద్దని ఆయన కేంద్రాన్ని కోరారు. శనివారం రాత్రి అమెరికా నుంచి 119 మంది వలసదారులను తీసుకుని ప్రత్యేక విమానం రానున్న నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. దేశంలో వైమానిక కేంద్రాలు చాలానే ఉన్నాయని, వలసదారుల విమానాలను అక్కడికి కూడా పంపించ వచ్చని పేర్కొన్నారు. ఇక్కడి వారిని వాటికన్ సిటీకి పంపిస్తామంటే అనుమతిస్తారా? అని ప్రశ్నించారు. మన వాళ్ల కోసం విమానాలను పంపుతామని ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు చెప్పాలని సూచించారు. ఇతన దేశాలు ఇలాగే చేస్తున్నాయన్నారు. -
ఆ విమానాలు అమృత్సర్కే ఎందుకు..?
అమృత్సర్: అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను తీసుకువస్తున్న విమానాలు పంజాబ్‌లోని అమృత్సర్కే ఎందుకు వస్తున్నాయి. గుజరాత్,హర్యానా, దేశ రాజధాని ఢిల్లీకి ఎందుకు వెళ్లడం లేదు. ఇప్పుడు ఈ విషయం మీదే రాజకీయ వివాదం ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం కావాలనే ఆ విమానాలను అమృత్‌సర్‌కు పంపిస్తోందని పంజాబ్ సీఎం భగవంత్మాన్సింగ్ విమర్శించారు.పంజాబ్ పేరు చెడగొట్టేందుకే బీజేపీ ఉద్దేశపూర్వకంగా విమానాలను అమృత్సర్ పంపిస్తోందని మాన్ ఆరోపించారు. శనివారం(ఫిబ్రవరి15) రానున్న మరో విమానంలోని వారికి భగవంత్‌మాన్ స్వయంగా స్వాగతం పలకనున్నారు. ఇందుకుగాను ఆయన ఇప్పటికే అమృత్సర్ చేరుకున్నారు. కాంగ్రెస్ కూడా కేంద్రంపై మాన్ తరహాలోనే ఆరోపణలు చేస్తోంది. అయితే బీజేపీ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తోంది.ఈ అంశాన్ని రాజకీయం చేయడం మంచిదికాదని హితవు పలుకుతోంది. ఆదివారం(ఫిబ్రవరి16) కూడా భారతీయులతో కూడిన మరో విమానం అమెరికా నుంచి రానుంది. ఇప్పటికే అమెరికా నుంచి వచ్చిన తొలి విమానంలో అమెరికాలో అక్రమంగా ఉంటున్న 104 మంది భారతీయులు తిరిగి వచ్చారు. తొలి విమానం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోనే ల్యాండ్ అయింది. -
అమెరికా నుంచి భారత్‌కు అక్రమ వలస దారులు.. ఈ సారి ఎంతమందంటే?
వాషింగ్టన్ : అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపించే కార్యక్రమం అమెరికా నిర్విరామంగా కొనసాగిస్తోంది. ఇటీవల కొందరు భారతీయులను పంపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో రెండు విమానాల్లో అక్రమ వలసదారుల్ని భారత్‌కు పంపనున్నట్లు సమాచారం. వీరందరూ ఫిబ్రవరి 15న అమృత్‌సర్‌కి రానున్నట్లు తెలుస్తోంది. . అమెరికాలో భారత అక్రమ వలసదారుల్ని గుర్తించింది. ఫిబ్రవరి 5న 104 మంది వలసదారుల్ని అమెరికా సైనిక విమానం అమృత్‌సర్‌కు తరలించింది. అక్రమ వలసదారుల అంశంపై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పందించారు. అమెరికాలో 487 మంది అక్రమ భారత వలసదారుల్ని గుర్తించింది. వారిని స్వదేశానికి తరలించేందుకు ఆదేశాలు జారీ అయ్యాయని తెలిపారు. ఇందులో భాగంగా ట్రంప్ ప్రభుత్వం మరింత మందిని భారత్‌కు పంపనుంది. మరోవైపు, అక్రమ వలసదారులను తీసుకొచ్చే విమానాలను అమృత్‌సర్‌లో దించడం విమర్శలు దారితీస్తోంది. పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ చీమా కేంద్రంపై విమర్శలు గుప్పించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పంజాబ్‌ను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు.అక్రమ వలసదారుల్ని తరలిస్తున్న విమానాలు అమృత్‌సర్‌లో దించడం ద్వారా కేంద్రం పంజాబ్‌ను అప్రతిష్టపాలు చేయాలనుకుంటోంది. హర్యానా లేదంటే గుజరాత్లో ఎందుకు దించకూడదు? అని ప్రశ్నించారు. ఇది స్పష్టంగా మా రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేందుకు బీజేపీ చేసిన ప్రయత్నమే అని మండిపడ్డారు.VIDEO | Gujarat: Indians deported from the US arrive at Ahmedabad airport. A US military aircraft carrying 104 illegal Indian immigrants landed at Amritsar, Punjab, yesterday. Sources said that 33 of the 104 deportees are from Gujarat.#GujaratNews(Full video available on PTI… pic.twitter.com/2y1P9Zoo6R— Press Trust of India (@PTI_News) February 6, 2025 -
యూకేలోనూ అక్రమ వలసదారుల ఏరివేత
లండన్: అక్రమ వలసదారుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్న వేళ.. బ్రిటన్ సైతం అదే బాటలో పయనిస్తోంది. విదేశీ నేరగాళ్లను, మరీ ముఖ్యంగా దొడ్డిదారిన ఆ దేశంలోకి వచ్చిన పనులు చేసుకుంటున్న వాళ్లను లక్ష్యంగా చేసుకుంది. ఈ క్రమంలో ప్రధానంగా భారతీయ రెస్టారెంట్లలోనే తనిఖీలు జరిపి అరెస్టులు చేస్తుండడం గమనార్హం. తాజాగా.. యూకే వైడ్ బ్లిట్జ్(UK-wide blitz) పేరుతో వలసదారులు పని చేసే భారత రెస్టారెంట్లలో పెద్ద ఎత్తున సోదాలు చేపట్టింది. వీటితో పాటు కార్ వాష్ ఏరియాలు, కన్వీనియెన్స్ స్టోర్లు, బార్లపై తనిఖీలు చేపట్టి వందల మందిని అరెస్టు చేసింది. చట్టాలను ఉల్లంఘించి వలసదారులకు అక్రమంగా ఉపాధి కల్పించే చర్యలను అడ్డుకోవడం కోసమే ఈ కఠిన చర్యలని యూకే హోంమంత్రిత్వ కార్యదర్శి వెట్టే కూపర్ చెబుతున్నారు. హంబర్సైడ్ ప్రాంతంలోని ఓ భారతీయ రెస్టారెంట్లలో జరిపిన సోదాల్లో చట్టవిరుద్ధంగా పనిచేస్తున్న ఏడుగురిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్టు చేశారు. మరో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సౌత్ లండన్‌లోని ఓ భారతీయ గ్రాసరీ వేర్‌హౌస్‌లో తనిఖీలు జరిపి ఆరుగురిని అరెస్టు చేశారు. మరికొందరిని అదుపులోకి తీసుకున్నట్లు బ్రిటన్ హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. అదుపులోకి తీసుకున్న వాళ్లను ‘ట్రంప్’ స్టైల్లోనే బంధించి వెనక్కి పంపించేస్తోంది యూకే. వాళ్ల చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులు వేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను అక్కడి అధికారులు తాజాగా విడుదల చేశారు. అయితే వాళ్లలో నేరగాళ్లు ఉండడం వల్లే అలా చేస్తున్నామని వాళ్లు సమర్థించుకుంటున్నారు. The public must have confidence in the UK's immigration system.Through our Plan for Change, we have removed almost 19,000 people including failed asylum seekers, foreign criminals and immigration offenders from the UK since July 2024. pic.twitter.com/QY4tpQDqSP— Home Office (@ukhomeoffice) February 10, 2025అటు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కూడా ఈ వ్యవహారంపై సోమవారం స్పందించిన సంగతి తెలిసిందే. ‘బ్రిటన్‌లో అక్రమ వలసలు పెరిగాయి. చాలామంది అక్రమంగా ఇక్కడ పని చేస్తున్నారు. ఈ చట్ట వ్యతిరేక వలసలను ముగిస్తాం’ అని ప్రధాని పేర్కొన్నారు. మరోవైపు, అక్రమ వలసదారుల అడ్డగింత, సరిహద్దు రక్షణ, శరణార్థులకు సంబంధించిన బిల్లుపై యూకే పార్లమెంట్లో సోమవారం చర్చ జరిగింది. అలాంటి అక్రమ వలసదారుల వల్ల బ్రిటన్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడడమే కాకుండా.. వలసలు వచ్చే క్రమంలో ఎందరో ప్రాణాలు పొగొట్టుకుంటున్నారని బ్రిటన్ అందోళన వ్యక్తం చేస్తోంది.గతేడాది జులైలో బ్రిటన్‌లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి కీర్ స్టార్మర్ ప్రభుత్వం సరిహద్దు భద్రతపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఇప్పటివరకు దాదాపు 19వేల మంది అక్రమ వర్కర్లను, విదేశీ నేరగాళ్లను అరెస్టు చేసినట్లు యూకే హోంశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఒక్క జనవరిలో దాదాపు 828 ప్రాంగణాల్లో తనిఖీలు చేపట్టి.. 609 మంది అక్రమంగా పనిచేస్తున్న వారిని అరెస్టు చేశారు. అయితే, తాజాగా భారతీయ రెస్టారెంట్లను మాత్రమే టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. -
అమెరికా కలవరం.. డిపోర్టేషన్ పరేషాన్
రూపాయి విలువ ఎక్కువున్న దేశానికి ఎందుకు వెళ్తాం? సంపాదించుకోవడానికి! చదువు పేరుతో వెళ్లినా అంతిమ లక్ష్యం అక్కడ కొలువు సాధించడమే! ఈ ప్రస్తావన అమెరికా డిపోర్టేషన్ గురించే! స్టూడెంట్ వీసా మీదున్న వాళ్లు పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసుకోకపోతే కష్టం! అక్కడున్న చట్టాల ప్రకారం చదువుకునే క్యాంపస్ లోనే కొలువులు చేయాలి. అవి దొరకడం క్లిష్టం! క్యాంపస్‌కు ఆవల ఉద్యోగాలకు వెళితే డిపోర్టేషన్ ఖాయం! ఈ క్రమంలో అక్కడున్న భారతీయ కుటుంబాలు కొన్ని.. అవసరంలో ఉన్న స్టూడెంట్స్‌కి తమ ఇళ్లల్లో డొమెస్టిక్ హెల్ప్ ఉద్యోగాలను ఆఫర్ చేస్తున్నాయి. అవి చేయడం తప్పనిసరైతే భద్రత, రక్షణను దృష్టిలో పెట్టుకుని, లీగల్ హెల్ప్ తీసుకుని అడుగేయడం మంచిది!తెలంగాణకు చెందిన నేహా (పేరు మార్చాం) అమెరికాలో ఎమ్మెస్ చదువుతోంది. వాళ్లది వ్యవసాయ కుటుంబం. అందరి పిల్లల్లాగే తమ పిల్లలూ విదేశాల్లో మంచి ఉద్యోగంలో స్థిరపడాలని నేహా తల్లిదండ్రుల ఆశ. అందుకే నేహా వాళ్ల అక్కను (యూకే), ఆమెను అప్పులు చేసి మరీ విదేశాలకు పంపారు చదివించడానికి. ఖర్చుల కోసం అమ్మా, నాన్న మీద ఆధారపడకూడదని చదువుతూనే పార్ట్ టైమ్ జాబ్స్ చేసుకుంటున్నారిద్దరూ. నేహా తన యూనివర్సిటీ దగ్గర్లోని సూపర్మార్కెట్లో సేల్స్ గర్ల్‌గా పనిచేసేది. ఆ ఏరియా పోలీసులు, ఇమిగ్రేషన్ సిబ్బంది ఆ సూపర్ మార్కెట్లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్న ఫారిన్ స్టూడెంట్స్‌ని తీసేయమని, లేదంటే ఆ షాప్ లైసెన్స్ రద్దవుతుందని యజమానికి వార్నింగ్ ఇచ్చారు. మరుక్షణమే నేహా జాబ్ పోయింది. ఖర్చులెలా? అప్పుడే నేహా స్నేహితురాలు ఆమెకు సబర్బ్‌లోని ఇండియన్ కమ్యూనిటీలో ఉన్న డొమెస్టిక్ హెల్పర్ కొలువు గురించి చెప్పింది. ‘వీకెండ్స్‌కి వెళ్లి ఇల్లు క్లీన్ చేయాలి. వాళ్లకు పిల్లలుంటే ఆడించాలి. గెట్ టు గెదర్స్కి అరెంజ్మెంట్స్ చేయాలి అంతే!’ అంటూ ఆ ఉద్యోగంలో చేయాల్సిన పనులను వివరించింది. ‘పేమెంట్ ప్రామ్ట్గానే ఉంటుంది. మన ఐడెంటిటీ ఎక్కడా రివీల్ చేయర’నే అభయమూ ఇచ్చింది. మరో ఆప్షన్ లేదని మారు మాట్లాడకుండా ఓ గుజరాతీ కుటుంబంలో డొమెస్టిక్ హెల్పర్‌గా చేరింది నేహా.ఇంకో స్టేట్‌లో...ఆంధ్రప్రదేశ్‌కి చెందిన మాలతి (పేరు మార్చాం) డిపెండెంట్ వీసా మీద అమెరికా వెళ్లింది. భర్తకు హెచ్1బీ ఉంది. ఆమె అక్కడ తమకు తెలిసిన వాళ్ల రెస్టరెంట్లో మేనేజర్‌గా పనిచేసేది. కానీ ఈ మధ్యే ఉద్యోగం మానేసింది. రెస్టరెంట్ ఓనర్ మీద ఇమిగ్రేషన్ అధికారుల ఒత్తిడి, డిపెండెంట్ వీసా మీద తాను ఉద్యోగం చేస్తున్నట్టు ఇమిగ్రేషన్ సిబ్బందికి తెలిస్తే తన భర్త హెచ్1బీ వీసా రద్దవుతుందేమోనన్న భయంతో! ఈ ఇద్దరే కాదు.. అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచి.. అమెరికాలో విజిటింగ్ వీసా, స్టూడెంట్ వీసాల మీద ఆఫ్ క్యాంపస్ (వాళ్లు చదువుతున్న యూనివర్సిటీకి ఆవల) ఉద్యోగాలు చేస్తున్నవారు, డిపెండెంట్ వీసా మీద గుంభనంగా జాబ్స్ చేసుకుంటున్న వాళ్లందరి పరిస్థితి అలాగే ఉంది. కారణం.. వర్క్ పర్మిట్ లేకుండా ఫుల్ టైమ్ జాబ్స్ చేస్తున్నవారిని, అనుమతి లేని ప్రదేశాల్లో పార్ట్ టైమ్‌కి కుదిరిన వారిని, చట్టవిరుద్ధంగా ఆ దేశంలోకి చొరబడిన వారిని వెనక్కి పంపే కార్యక్రమాన్ని ట్రంప్ కఠినంగా అమలు చేస్తున్నాడు. పాస్‌పోర్ట్‌లో ఒక్కసారి డిపోర్టెడ్ అని ముద్ర పడితే మళ్లీ ఆ దేశానికి విమానమెక్కే చాన్స్ ఉండదు. ఆ స్థితికి రావద్దని ప్రయత్నించని వారులేరు. అందుకే అది పాచి పనా.. ఇంకోటా అని చూడకుండా, పని చోట భద్రత ఉందా? రక్షణ ఎంత? అని ఆలోచించకుండా తాము పనిచేస్తున్నట్టు అమెరికన్ గవర్నమెంట్‌కు తెలియకపోతే చాలు అనుకుంటూ దొరికిన పనిలో చేరిపోతున్నారు! అమెరికా అంతటా ఇలాంటి పరిస్థితే లేదని, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు గెలిచిన రాష్ట్రాల్లోనే డిపోర్టేషన్ కఠినంగా ఉందని చెబుతున్నారు అక్కడుంటున్న తెలుగువాళ్లు కొందరు. ఇలా చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉంటున్న వాళ్లను సొంత దేశాలకు పంపించేయడం ఇదే మోదటిసారి కాదని, ఆందోళనలు.. భయాలు కొత్తేం కాదని తేలిగ్గా తీసుకుంటున్న అమెరికా పౌరసత్వం పొందిన భారతీయులూ ఉన్నారు. అయితే ఈ డిపోర్టేషన్‌ను ఆసరాగా తీసుకుని తక్కువ జీతానికే భారతీయ విద్యార్థుల చేత ఇంటి పనులు, దుస్తుల ఇస్త్రీ, తోట పని, కార్లు తుడిపించడం, పిల్లలను ఆడించడం వంటి బండెడు చాకిరీ చేయించుకుంటున్నారని వాపోతున్నవారూ ఉన్నారు. ఏమైనా సరే.. పరాయి దేశంలో ఉంటున్నప్పుడు వాళ్ల చట్టాలను గౌరవించడం, ఆ ప్రకారం నడుచుకోవడం తప్పనిసరని చెబుతున్నారు న్యాయసలహాదారులు.ఇది తెలుసుకోండివిదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం గత 15 ఏళ్లుగా 15,000కి పైగా భారతీయులను అమెరికా ప్రభుత్వం డిపోర్ట్ చేసింది. చట్టవిరుద్ధంగా ఆ దేశంలోకి ప్రవేశించినవారెవరైనా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకొని గౌరవంగా వెనక్కి రావచ్చు. చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉంటున్న మన పౌరుల్లో అక్కడ చదువుకున్నవారు, పెళ్లి చేసుకుని డిపెండెంట్ వీసా మీద వెళ్లి తర్వాత కుటుంబ కారణాల రీత్యా విడాకులు తీసుకున్నవారు, గృహహింసకు గురైనవారే ఎక్కువ. వీరు స్వచ్ఛందంగా తమ వీసా స్టేటస్‌ను మార్చుకుంటే అమెరికాలోనే ఉండవచ్చు. భర్త వేధింపులకు గురైన అమ్మాయిలు చాలామంది స్టూడెంట్ వీసాకి మారి చదువుకుంటూ అక్కడే ఉండిపోతున్నారు. కొన్ని నేరాలలో విక్టిమ్స్ అయితే వీసాకు అర్హులవుతారు. ఇలా వారికి అర్హత ఉన్న వీసా తీసుకొని అక్కడే ఉండిపోవచ్చు.అక్కడే ఉండాలనుకునేవారు చేయవలసిన పనులు1. ఆ దేశ కోర్టును ఆశ్రయించి, పరిస్థితులను వివరిస్తూ, ఆ దేశంలో ΄పౌరసత్వం కోసమో లేక వీసా కోసమో చేసిన దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటే మానవీయ కోణంలో కొంత గడువు కోరడం. 2. కొన్ని ప్రత్యేక కేసులలో.. ఏదైనా అమెరికా సంస్థ నుంచి ఉద్యోగావకాశం ఉందని చూపించగలిగితే వీసా గడువు తర్వాత కూడా మరలా వీసా వచ్చేంతవరకు ఉండొచ్చు. 3. అమెరికా ΄పౌరసత్వం లేదా శాశ్వత నివాసం (పర్మనెంట్ రెసిడెన్సీ) గల వ్యక్తి కుటుంబ సభ్యులు అంటే భార్య, పిల్లలు లేదా తల్లిదండ్రులు అయ్యుండి, సదరు ΄పౌరుడిచే లేదా అతని కుటుంబ సభ్యులచే గృహహింసకు లోనయ్యుంటే వయొలెన్స్ అగైన్స్ట్ విమెన్ యాక్ట్ (Vఅగిఅ) కింద.. గృహహింసకు గురిచేసిన వ్యక్తికి తెలియకుండానే గ్రీన్ కార్డు ΄పొందవచ్చు. 4. ప్రత్యేక పరిస్థితుల్లో ఆశ్రయం కోరవచ్చు. వీటన్నిటి కోసం ముందుగా మంచి ఇమిగ్రేషన్ అటార్నీ (లాయర్)ని కలవాలి. ఏజెంట్ల ద్వారా వెళ్తే మోసపోయే ప్రమాదం ఉంటుంది. ఇమిగ్రేషన్ చట్టం సులభంగా అర్థమయ్యేది కాదు కాబట్టి నిపుణుల ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి.– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది – సరస్వతి రమ -
త్వరలో అమెరికా నుంచి వచ్చే జాబితాలో ఎంతమంది..?
న్యూఢిల్లీ:అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను అక్కడి ప్రభుత్వం వెనక్కి పంపిస్తోంది. ఇప్పటికే మిలిటరీ విమానంలో 104 మంది భారతీయులను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే విమానంలో వచ్చిన వారికి సంకెళ్లు వేసి తీసుకురావడంపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం(ఫిబ్రవరి7) ఒక కీలక ప్రకటన చేసింది. త్వరలో మరో 487 మంది భారతీయ పౌరులను దేశం నుంచి తరలించాలన్న ఆదేశాలున్నాయని భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ఈ విషయాన్ని తమకు అమెరికా ప్రభుత్వ వర్గాలు తెలిపాయని మిస్రీ చెప్పారు.అక్రమ మార్గాల ద్వారా దేశంలోకి ప్రవేశించిన వారిని తొలుత అమెరికా తిప్పి పంపిందన్నారు. వారంతా అమెరికా భద్రతకు ముప్పుగా పరిణమించారని అక్కడి ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. అయితే భారతీయులను మిలిటరీ విమానంలో అవమానించే తరహాలో తీసుకురావడంపై దేశంలో రాజకీయ దుమారం రేపింది. కాగా, బుధవారం అమెరికా నుంచి అమృత్‌సర్‌కు వచ్చిన సైనిక విమానంలో 105 మంది వలసదారులున్నారు. వీరిలో హరియాణా రాష్ట్రానికి చెందిన వాళ్లు 33 మంది ఉన్నారు. గుజరాత్(33), పంజాబ్(30), మహారాష్ట్ర(3), ఉత్తరప్రదేశ్(3), చండీగఢ్(2) రాష్ట్రాల వాళ్లూ ఉన్నారు.అమెరికా తిరిగి పంపిన వారిలో 19 మంది మహిళలు, నాలుగేళ్ల బాలుడు, ఐదేళ్లు, ఏడేళ్ల వయసున్న బాలికలున్నారు. ఇక్కడికొచ్చాక భారత అధికారులు పోలీసు వాహనాల్లో ఈ వలసదారులను స్వస్థలాలకు తరలించారు. -
అవమానించినా మొద్దునిద్రేనా?
న్యూఢిల్లీ: అమెరికాలోని భారతీయ అక్రమ వలసదార్లకు బేడీలు వేసి స్వదేశానికి తరలించిన ఘటనపై గురువారం పార్లమెంట్ ఉభయ సభలు అట్టుడికిపోయాయి. భారతీయులను అమెరికా ప్రభుత్వం ఘోరంగా అవమానించినా కేంద్ర ప్రభుత్వంలో చలనం లేదని విపక్ష సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉభయ సభల్లో ఆందోళనకు దిగారు. మోదీ సర్కారు వెంటనే సమాధానం చెప్పాలని నిలదీశారు. లోక్‌సభలో వెల్‌లోకి దూసుకొచ్చి బిగ్గరగా నినాదాలు చేశారు. శాంతించాలని స్పీకర్ కోరినా వారు వినిపించుకోలేదు. దీంతో సభను నాలుగుసార్లు వేయాల్సి వచి్చంది. షెడ్యూల్ ప్రకారం లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌పై చర్చించాల్సి ఉంది. కానీ, భారతీయులకు జరిగిన అవమానంపై చర్చించడానికి వాయిదా తీర్మానాన్ని కోరుతూ కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గొగోయ్‌తోపాటు పలువురు విపక్ష ఎంపీలు నోటీసులు ఇచ్చారు. సభాపతి అంగీకరించకపోవడంతో వారు ఆందోళనకు దిగారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంత అవమానం జరుగుతున్నా సర్కారు మొద్దు నిద్ర వీడడం లేదని దుయ్యబట్టారు. సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సభ నాలుగు సార్లు వాయిదా పడిన పరిస్థితిలో మార్పు రాలేదు. సాయంత్రం విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ లోక్‌సభలో ఒక ప్రకటన చదివి వినిపించారు. స్వదేశానికి తరలించే భారతీయులను అవమానించకుండా అమెరికా అధికారులతో చర్చిస్తున్నామని చెప్పారు. జైశంకర్ ప్రకటన తర్వాత కూడా విపక్షాల నిరసన కొనసాగింది. సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. రాజ్యసభలోనూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. మనవాళ్ల పట్ల అమెరికా అధికారులు అమర్యాదకరంగా ప్రవర్తిస్తే మోదీ సర్కారు ఎందుకు పట్టించుకోవడం లేదని విపక్ష సభ్యులు ధ్వజమెత్తారు. పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన పార్లమెంట్ సమావేశాల ప్రారంభం కంటే ముందు ప్రతిపక్ష సభ్యులు పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కాంగ్రెస్ సభ్యులు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌తోపాటు పలువురు విపక్ష ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొందరు ఎంపీలు చేతులకు సంకెళ్లు ధరించారు. ‘ఖైదీలు కాదు... మనుషులు’ అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. భారత్‌ను, భారతీయులను అవమానిస్తే సహించబోమని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. గౌరవ మర్యాదలతో వెనక్కి తీసుకురాలేరా? అమెరికా నుంచి భారతీయుల తరలింపుపై మోదీ ప్రభుత్వం సమగ్రమైన ప్రకటన చేయాలని కాంగ్రెస్ అధ్యక్షడు మల్లికార్జున ఖర్గే ‘ఎక్స్’లో డిమాండ్ చేశారు. భారతీయులను గౌరవ మర్యాదలతో వెనక్కి తీసుకురావడానికి మన విమానాలు ఎందుకు పంపించలేదని ప్రశ్నించారు. ఆవేదన వెల్లడిస్తున్న భారతీయ వలసదారుడి వీడియోను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఈ బాధితుడి ఆవేదన వినాలని ప్రధాని మోదీకి సూచించారు. భారతీయులకు కావాల్సింది గౌరవం, మానవత్వం తప్ప సంకెళ్లు కాదని తేల్చిచెప్పారు. ప్రధానమంత్రి మోదీ ఇప్పటికైనా నోరు విప్పాలని ప్రియాంక అన్నారు. మనవాళ్లను మనం ఎందుకు తీసుకురాలేకపోయామని అన్నారు మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య మంచి స్నేహం ఉన్నప్పటికీ భారతీయులకు ఈ పరిస్థితి ఎందుకు వచి్చందో చెప్పాలని నిలదీశారు. మన దేశం నుంచి ఎవరినైనా పంపించాల్సి వస్తే ఇలాగే బేడీలు వేసి పంపిస్తారా? అని ప్రశ్నించారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, శివసేన (ఉద్ధవ్) ఎంపీ ప్రియాంక చతుర్వేది, కాంగ్రెస్ ఎంపీలు గౌరవ్ గొగోయ్, శశి థరూర్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కీర్తి ఆజాద్ తదితరులు మోదీ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. -
అమెరికా విమానంలో.. ఆ రాష్ట్రాల వారే ఎక్కువ..!
అమృత్సర్:అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్యల్లో భాగంగా అమెరికా పంపించిన ప్రత్యేక విమానంలో భారత్‌కు తిరిగి వచ్చిన వలసదారుల్లో ఎవరెవరున్నారన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బుధవారం(ఫిబ్రవరి5) మధ్యాహ్నం 1.45గంటలకు అమృత్‌సర్‌లోని గురురామ్దాస్జీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో వలసదారులతో వచ్చిన అమెరికా విమానం ల్యాండ్ అయిన విషయం తెలిసిందే.విమానంలో మొత్తం 205 మంది భారతీయలను అమెరికా నుంచి పంపించి వేశారని ప్రచారం జరిగింది. అయితే విమానంలో 104 మంది మంది భారతీయులే ఉన్నారు. 45 మంది దాకా అమెరికా అధికారులు కాగా, 11 మంది విమాన సిబ్బంది ఉన్నారు. అయితే 104మంది భారతీయుల్లో మొదటి స్థానంలో గుజరాత్,హర్యానాకు చెందిన వారు ఎక్కువగా ఉండగా తర్వాతి స్థానంలో పంజాబ్‌కు చెందిన వారు ఉన్నారు.విమానంలో వచ్చిన వారిలో 4 ఏళ్ల వయసున్న చిన్నారి కూడా ఉండడం గమనార్హం. అమెరికా నుంచి అందరు భారతీయులకు స్వాగతం పలికామని, మన దేశానికి చెందిన వారిని ఇలా పంపించి వేయడం దురదృష్టకరమని పంజాబ్ డీజీపీ వ్యాఖ్యానించారు. అమెరికాలో భారత అక్రమ వలసదారుల ఏడున్నర లక్షల మంది దాకా ఉన్నట్లు ఫ్యూ రీసెర్చ్ సెంటర్ అంచనా. ఈ లెక్కన మెక్సికో, ఎల్ సాల్వడోర్ తర్వాత అత్యధికంగా అలా ఉంటోంది భారతీయులే. వీళ్లందరినీ వెనక్కి పంపించే ప్రక్రియ కొనసాగుతుందని అక్కడి అధికారులు అంటున్నారు. ఈ క్రమంలో సుమారు 18 వేల మంది భారతీయులతో కూడిన జాబితాను అక్కడి ఇమ్మిగ్రేషన్ & కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ సిద్ధం చేసినట్లు సమాచారం. త్వరలో భారత ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. ఆ సమయంలో ట్రంప్‌తో ఆయన ఈ అంశంపైనా చర్చించే అవకాశాలున్నాయి -
అక్రమ వలసదారులతో భారత్‌లో దిగిన తొలి విమానం
న్యూఢిల్లీ: అమెరికా నుంచి అక్రమ వలసదారులతో కూడిన విమానం భారత్‌లో ల్యాండ్ అయ్యింది. అయితే ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లు విమానంలో 205 మంది లేరు. టెక్సాస్ నుంచి వచ్చిన ఈ విమానంలో కేవలం 104 మంది ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. వీళ్లతో పాటు అమెరికా ఎంబసీకి చెందిన ఓ అధికారి కూడా వచ్చారు. అక్రమ వలసదారులతో ఉన్న ఆ విమానం అమృత్‌సర్‌లో దిగినట్లు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ ప్రకటించారు. వీళ్లలో 79 మంది పురుషులు, 25 మంది మహిళలు, 13 మంది చిన్నారులు కూడా ఉన్నారు. వీళ్లలో అత్యధికులు.. అమెరికా-మెక్సికో బార్డర్ వద్ద పట్టుబడినట్లు సమాచారం. భారత్ ఇప్పుడు వీళ్లనేం నేరస్థులుగా చూడదు. అయితే.. వాళ్ల గుర్తింపులను క్షుణ్ణంగా పరిశీలించాకే.. స్వస్థలాలకు తిరిగి పంపిస్తామని చెబుతున్నారు.గడువు ముగిసినా, ఎటువంటి అధికార పత్రాలు లేకుండా తమ భూభాగంలో ఉంటున్న వలసదారుల్ని తిరిగి వాళ్ల వాళ్ల దేశాలకు పంపించే కార్యక్రమాన్ని ట్రంప్(Trump) ప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలి బ్యాచ్ కింద.. వీళ్లను అమెరికా సీ-17 సైనిక విమానం తీసుకొచ్చింది. వీళ్లలో 30 మంది పంజాబ్‌కు చెందినవాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికాలో భారత అక్రమ వలసదారులు(Indian Illegal Immigrants).. ఏడున్నర లక్షల మంది దాకా ఉన్నట్లు ఫ్యూ రీసెర్చ్ సెంటర్ అంచనా. ఈ లెక్కన మెక్సికో, ఎల్ సాల్వడోర్ తర్వాత అత్యధికంగా అలా ఉంటోంది భారతీయులే!. వీళ్లందరినీ వెనక్కి పంపించే ప్రక్రియ కొనసాగుతుందని అక్కడి అధికారులు అంటున్నారు. ఈ క్రమంలో సుమారు 18 వేల మంది భారతీయులతో కూడిన జాబితాను అక్కడి ఇమ్మిగ్రేషన్ & కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ సిద్ధం చేసినట్లు సమాచారం. త్వరలో భారత ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. ఆ సమయంలో ట్రంప్‌తో ఆయన ఈ అంశంపైనా చర్చించే అవకాశాలున్నాయి. మరోవైపు ట్రంప్ ఈ చర్యను భారత్ గతంలోనే స్వాగతించింది. అమెరికాలోనే కాదు.. ప్రపంచంలో ఏమూల ఉన్నా అక్రమ వలసదారులను తాము వెనక్కి పిలిపించుకుంటామని విదేశాంగ మంత్రి జై శంకర్(Jai Sankar) స్పష్టం చేశారు. అయితే ట్రంప్ ప్రభుత్వ నిర్ణయంపై ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కుల్దీప్ సింగ్ ధాలివాల్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అర్థిక వ్యవస్థకు దోహదపడుతున్న వ్యక్తులకు పౌరసత్వం ఇవ్వకుండా.. ఇలా వెనక్కి పంపించేయడం సరికాదని అంటున్నారాయన. ఈ విషయంపై జై శంకర్‌తో ఆయన చర్చించనున్నట్లు తెలిపారు. -
వలసదారుల విమానాలకు అంత ఖర్చా..?
వాషింగ్టన్:డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులను ప్రత్యేక విమానాల్లో వారి దేశాలకు తిప్పి పంపుతున్నారు. ఈ విమాన ప్రయాణాల కోసం అమెరికా భారీ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.పౌర విమానాల్లో కాకుండా వలసదారులను అమెరికా ప్రత్యేక సైనిక విమానాల్లో తరలిస్తుండటంతోనే ఎక్కువగా ఖర్చవుతోందన్న వాదన వినిపిస్తోంది. తాజాగా 205 మంది భారతీయులతో కూడిన మిలిటరీ విమానం బయల్దేరింది. ఈ విమాన ఖర్చు గంటకు కొన్ని వేల డాలర్లని అమెరికా అధికారులు చెబుతున్నారు.వలసదారులను వెనక్కి పంపే కేంద్ర ప్రభుత్వ వర్గాల సమన్వయం కూడా ఉన్నట్లు సమాచారం. గతంలోనూ వివిధ దేశాలకు చెందిన అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపిన సంగతి తెలిసిందే.అయితే భారత్ విషయంలో మాత్రం అమెరికాకు ఇదే తొలి అడుగు.వచ్చే వారం భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపే అంశంపైనా చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. -
భారత అక్రమ వలసదారులతో బయల్దేరిన విమానం
వాషింగ్టన్: అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపే కార్యక్రమం అమెరికాలో నిర్విరామంగా కొనసాగుతోంది. తాజాగా.. 205 మంది భారతీయులతో కూడిన మిలిటరీ విమానం బయల్దేరినట్లు తెలుస్తోంది. మరో 24 గంటల్లో విమానం భారత్‌కు చేరుకునే అవకాశం ఉంది. ఈ ప్రక్రియకు ఢిల్లీ వర్గాల సమన్వయం కూడా ఉన్నట్లు సమాచారం.ఇంతకు ముందు.. వివిధ దేశాలకు చెందిన అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. అయితే భారత్ విషయంలో మాత్రం ఇదే తొలి అడుగు. వచ్చే వారం భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపే అంశంపైనా చర్చ జరిగే అవకాశం లేకపోలేదు. అమెరికాలో సరైన పత్రాలు లేని భారతీయులు ఏడున్నర లక్షల మంది దాకా ఉన్నట్లు ఫ్యూ రీసెర్చ్ సెంటర్ అంచనా. మెక్సికో, ఎల్ సాల్వడోర్ తర్వాత అత్యధికంగా ఉంది భారతీయులే. వీళ్లందరినీ వెనక్కి పంపించే ప్రక్రియ కొనసాగుతుందని అక్కడి అధికారులు అంటున్నారు. ఈ క్రమంలో సుమారు 18 వేల మంది భారతీయులతో కూడిన తొలి జాబితాను అక్కడి ఇమ్మిగ్రేషన్ & కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ రూపొందించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. వైట్‌హౌజ్‌లో అడుగుపెట్టిన వెంటనే అమెరికా భూభూగంలో ఉన్న అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపే తీరతానని ట్రంప్ ప్రతినబూనారు. అలాంటి వారిని స్వదేశానికి రప్పించే ప్రక్రియకు తాము పూర్తిగా సహకరిస్తామని ఆ సమయంలో భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ప్రకటించారు. ఇదే అంశంపై ట్రంప్ గతంలో మోదీతోనూ ఫోన్లో మాట్లాడారు. ఆ టైంలో ‘‘సరైన చర్యలు తీసుకుంటాం’’ అని భారత ప్రధాని తనతో అన్నారని ట్రంప్ తమ చర్చల సారాంశాన్ని వివరించారు. -
గురుద్వారాల్లో తనిఖీలు.. ట్రంప్‌పై సిక్కుల ఆగ్రహం
వాషింగ్టన్:ఎన్నికల ముందు చెప్పినట్టుగానే అమెరికా(America) అధ్యక్షుడు ట్రంప్ అక్రమ వలసదారులను సాగనుంపుతున్నారు. ఈ క్రమంలో అక్రమ వలసదారులను అరెస్టు చేయడానికి ట్రంప్(Trump) అనుసరిస్తోన్న విధానాలపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అక్రమ వలసదారుల్ని గుర్తించే క్రమంలో అధికారులు న్యూయార్క్,న్యూజెర్సీల్లోని గురుద్వారాల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాము పవిత్రంగా భావించే ప్రార్ధనా మందిరాల్లో అక్రమ వలసదారుల కోసం హోం ల్యాండ్ సెక్యూరిటీ అధికారులు వెతకడంపై సిక్కు సంస్థలు మండిపడుతున్నాయి. గురుద్వారాల పవిత్రతను ట్రంప్ చర్య దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.కాగా, ట్రంప్ యంత్రాంగం అమెరికాలో ఇప్పటివరకు వందలమంది అక్రమ వలసదారులను అరెస్టు చేసింది. అరెస్టయిన వారంతా ఉగ్రవాదం,డ్రగ్స్,లైంగిక నేరాలు వంటి కేసుల్లో నిందితులుగా ఉన్నవారేనని అధికారులు చెబుతున్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ(Deportation) ఆపరేషన్ చేపట్టారు.ఇప్పటికే సైనిక విమానాల్లో వందల మంది అక్రమ వలసదారులను దేశం నుంచి బయటకు పంపించేశామని వైట్‌హౌస్ వెల్లడించింది.మరోవైపు,అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని,ఎందుకంటే అది పలురకాల వ్యవస్థీకృత నేరాలతో ముడిపడి ఉందని ఇప్పటికే భారత్ స్పష్టం చేయడం గమనార్హం. -
కొలంబియాపై ట్రంప్ కొరడా.. ఆ విమానాలు తిప్పి పంపినందుకే..
వాషింగ్టన్:తన మాట వినని దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్యలు మొదలు పెట్టారు. అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులను తీసుకువెళ్లిన విమానాలను తిప్పి పంపినందుకు కొలంబియాపై కొరడా ఝలిపించారు. త్వరలో ఆ దేశంపై భారీ దిగుమతి సుంకాలతో పాటు ట్రావెల్ బ్యాన్ లాంటి ఆంక్షలను అమలు చేయనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు ట్రంప్ తన సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్‌సోషల్‌లో ఆదివారం(జనవరి26) ఒక పోస్టు చేశారు. ‘కొలంబియా అధ్యక్షుడు పెట్రో అమెరికా జాతీయ భద్రతను ప్రమాదంలో పడేశాడు.ఇందుకే కొలంబియాపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చా. కొలంబియా నుంచి దిగుమతయ్యే వస్తువులపై ఇప్పటికిప్పుడు 25 శాతం టారిఫ్ విధిస్తాం. ఇది వారంలో 50 శాతానికి పెరుగుతుంది.కొలంబియా నుంచి అమెరికాకు రావడంపై ట్రావెల్ బ్యాన్. వీటితో పాటు ఆర్థిక ఆంక్షలు ఉంటాయి’అని ట్రంప్ వెల్లడించారు. కాగా, ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడైన తర్వాత అమెరికాలో అక్రమంగా ఉంటున్న వలసదారులను వారి దేశాలకు పంపేస్తున్న విషయం తెలిసిందే. అయితే వలసదారులను నేరస్తులుగా చిత్రీకరిస్తూ వారిని మిలిటరీ విమానాల్లో పంపడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని కొలంబియా అధ్యక్షుడు పెట్రో ఎక్స్(ట్విటర్)లో తెలిపారు. తమ దేశానికి చెందిన వారికి గౌరవమిస్తూ పౌర విమానాల్లో పంపితే తాము స్వాగతిస్తామని స్పష్టం చేశారు. గత వారం కూడా మెక్సికో కూడా కొలంబియా తరహాలోనే ట్రంప్ వలసదారులతో పంపిన మిలిటరీ విమానాలను తిప్పి పంపడం గమనార్హం. ఇదీ చదవండి: పద్ధతిగా వస్తేనే ప్రయాణం -
అమెరికా చర్రితలో అతిపెద్ద బహిష్కరణ!
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన 'డొనాల్డ్ ట్రంప్' (Donald Trump) 2025 జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తరువాత అమెరికాలోని సుమారు 18,000 మంది భారతీయులు బహిష్కరణకు గురయ్యే అవకాశం ఉంది.యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) గణాంకాల ప్రకారం.. 10.45 లక్షల మంది చట్ట విరుద్ధంగా అమెరికాలో ఉన్నట్లు, ఇందులో 17,940 మంది ఇండియన్స్ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన జాబితా సిద్దమైనట్లు సమాచారం. ట్రంప్ పదవి చేపట్టిన తరువాత వీరందరినీ వారి దేశాలకు పంపించే అవకాశం ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.సరైన పత్రాలు లేకుండా అమెరికాలో.. చట్టపరమైన హోదాను పొందటం పెద్ద సవాలు. ఇలాంటి వారే చట్టపరమైన చర్యలలో చిక్కుకుంటున్నారు. ఇలాంటి కేసుల నుంచి బయటపడటానికి సుమారు రెండు నుంచి మూడు సంవత్సరాల సమయం పడుతుంది.చాలామంది ఐసీఈ నుంచి క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తున్నప్పుడే బ్యూరోక్రాటిక్ చిక్కుల్లో చిక్కుకుంటున్నట్లు సమాచారం. గత మూడేళ్ళలో సగటున 90,000 మంది భారతీయులు అమెరికా సరిహద్దులలోకి ప్రవేశించడానికి ప్రయత్నించి పట్టుబడినట్లు తెలుస్తోంది. వీరిలో చాలామంది పంజాబ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి వచ్చినవారే అని సమాచారం.ఇదీ చదవండి: బ్యాంకులో ఉద్యోగం.. రోజూ ఒకటే సూట్: మస్క్ తల్లి ట్వీట్తాను పదవీ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్న వేళ, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాల పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటించారు. సరైన పత్రాలు లేని వలసదారుల బహిష్కరణ ప్రధాన ఎజెండాగా ఉన్నట్లు సమాచారం. అంతే కాకుండా అక్రమ వలసదారుల బహిష్కరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. అమెరికా చరిత్రలో అతిపెద్ద బహిష్కరణ ప్రక్రియను చేపడతామని ట్రంప్ ప్రతిజ్ఞ చేసినందున.. అక్రమ వలసదారుల బహిష్కరణ అనివార్యమనే తెలుస్తోంది. -
ఎన్ఆర్ఐలకు చేదువార్త : పిల్లల భవిష్యత్తేంటి?
అమెరికాలో నివాసం ఉంటున్న ప్రవాస భారతీయులకు మరో చేదు వార్త. చట్టబద్ధమైన వలసదారుల పిల్లలు, దాదాపు 2.50 లక్షలమంది అమెరికాను వీడే పరిస్థితి కనిపిస్తోంది.'డాక్యుమెంటెడ్ డ్రీమర్స్' గా పిలిచే ఈ పిల్లలు తాత్కాలిక ఉద్యోగ వీసాలపై వారి తల్లిదండ్రులతో అమెరికా వచ్చారు. కానీ ఇప్పుడు 21 ఏళ్లు నిండిన (ఏజింగ్ ఔట్) కారణంగా ఆ పిల్లలు తమ డిపెండెంట్ స్థితిని కోల్పోయే ప్రమాదం ఉందన్న అంచనాలు ఆందోళన రేపుతున్నాయి.శాసన ప్రతిష్టంభనకు రిపబ్లికన్లను వైట్ హౌస్ ఆరోపించింది. డాక్యుమెంటెడ్ డ్రీమర్స్‌కు సహాయం చేసేందుకు తాము ఒక ప్రక్రియను ప్రతిపాదించామని దాన్ని రిపబ్లికన్లు రెండుసార్లు తిరస్కరించాని అని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ చెప్పారు. చట్టసభ సభ్యులు, న్యాయవాదులు అమెరికాలో పెరిగిన పిల్లలను రక్షణకు చర్యలు చేపట్టాలని కోరారు. హెచ్ 1బీ కేటగిరీ కింద అమెరికాలో ఉండే విదేశీయుల పిల్లలకు హెచ్4 వీసా ఇస్తారు. ఇది పిల్లలకు 21 ఏళ్లు వచ్చేంతవరకు చెల్లుతుంది. భారతీయ పిల్లలు కనీసం 2.50 లక్షల మంది 21 ఏళ్లు నిండగానే అమెరికా వీడాల్సి ఉంటుంది. వారక్కడే ఉండాలంటే స్టూడెంట్ (ఎఫ్) వీసా సంపాదించాలి. లేదా కొత్త తాత్కాలిక స్థితికి మారాలి లేదా భారత్‌కు తిరిగి వచ్చేయాలి. లేదంటే యుఎస్‌లో ఉండటానికి చట్టపరమైన హోదా కోల్పోతే, అమెరికా చట్టాల ప్రకారం చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ ద్వారా అమెరికా పౌరసత్వం మరియు వలస సేవల (USCIS) డేటా విశ్లేషణ ప్రకారం, ఆధారపడిన వారితో సహా 1.2 మిలియన్లకు పైగా భారతీయులు మొదటి, రెండవ, మూడవ ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్ కేటగిరీలలో వేచి ఉన్నారు. కాగా జూన్ 13న, ఇమ్మిగ్రేషన్, పౌరసత్వం మరియు సరిహద్దు భద్రతపై సెనేట్ జ్యుడిషియరీ సబ్‌కమిటీ చైర్‌గా ఉన్న సెనేటర్ అలెక్స్ పాడిల్లా నేతృత్వంలోని 43 మంది చట్టసభ సభ్యుల బృందం, ప్రతినిధి డెబోరా రాస్, వీరిని రక్షించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని బైడెన్ ప్రభుత్వాన్ని కోరారు. -
దయనీయ స్థితిలో ఆఫ్గన్ శరణార్థులు
పొరుగుదేశం పాకిస్తాన్లో ఆఫ్గన్ శరణార్థులు దిక్కుతోచని స్థితిలో కాలం వెళ్లబుచ్చుతున్నారు. గత ఏడాది అక్టోబర్ నుండి ఇప్పటి వరకూ సుమారు ఆరు లక్షల మంది ఆఫ్ఘన్ శరణార్థులను పాకిస్తాన్ వారి స్వస్థలాలకు బలవంతంగా తిరిగి పంపింది. అయితే ఇప్పటికీ పాక్‌లో కనీసం 10 లక్షల మంది ఆఫ్గన్ శరణార్థులు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.బహిష్కరణ భయంతో ఆఫ్గన్ శరణార్థులు అజ్ఞాతంలో జీవిస్తున్నారు. పాకిస్తాన్లో తల దాచుకుంటున్న వీరు తిరిగి ఆఫ్గనిస్తాన్‌కు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. తలదాచుకున్న ప్రాంతం నుంచి బయటకు వచ్చేందుకు కూడా జంకుతున్నారు. దీంతో వీరికి జీవనోపాధి, అద్దె ఇల్లు, నిత్యావసరాల కొనుగోలు మొదలైనవి ఎంతో కష్టతరంగా మారాయి.తాజాగా కరాచీ పోలీసులు 18 ఏళ్ల ఆఫ్గన్ యువకుడి నుంచి నగదు, ఫోన్, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకుని డిపోర్టేషన్ సెంటర్‌కు పంపారు. అక్కడి నుంచి ఆ యువకుడిని ఆఫ్ఘనిస్థాన్‌కు తరలించారు. కాగా అతని తల్లిదండ్రులు 50 ఏళ్ల క్రితం ఆఫ్గనిస్తాన్ వదిలి పాక్ తరలివచ్చారు.ఆ యువకుడు ఇంతవరకూ ఎప్పుడూ ఆఫ్గనిస్తాన్‌కు వెళ్లలేదు. అతనిని ఆఫ్గనిస్తాన్ తరలించినప్పుడు అతని దగ్గర కట్టుబట్టలు తప్ప మరేమీ లేవని స్థానికులు చెబుతున్నారు. ఆఫ్గనిస్తాన్‌లో యుద్ధ పరిస్థితుల మధ్య 17 లక్షల మంది పాకిస్తాన్‌కు వచ్చి ఆశ్రయం పొందారు. ఇలా చట్టపరమైన అనుమతులు లేకుండా వచ్చినవారిని తిరిగి ఆ దేశానికి పంపేందుకు పాక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. -
యూఎస్ తెలుగు విద్యార్థుల ఉదంతంపై సీఎం జగన్ ఆరా
అమరావతి: అమెరికా నుంచి కొంత మంది తెలుగు విద్యార్ధులు వెనక్కి పంపిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. విద్యార్థుల వివరాలు తెలుసుకుని త్వరితగతిన వారి సమస్యను పరిష్కరించాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. 21 మంది భారతీయ విద్యార్థులను అమెరికా నుండి వెనక్కు పంపించిన ఘటన సంచలనం సృష్టించింది. వీరిలో తెలుగువారు కూడా ఉండటంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఉదంతంపై అరా తీశారు. విద్యార్థుల పూర్తి వివరాలతో పాటు పూర్తి సమాచారాన్ని సేకరించాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై దృష్టి సారించాలని చెబుతూనే అవసరమైతే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు కూడా జరపాలని సీఎంవో అధికారులకు సూచించారు. ఎన్నోఆశలతో ఉన్నత విద్య నిమిత్తం అమెరికా చేరుకున్న తాము అన్ని డాక్యుమెంట్లను సమర్పించామన్నారు విద్యార్థులు. ఇమ్మిగ్రేషన్ అధికారులు వారి పత్రాలను తనిఖీ చేసి, కొద్దిసేపు విచారించాక కారణం చెప్పకుండానే వారిని వెనక్కి పంపించేశారు. వారిలో అత్యధికులు అట్లాంటా, చికాగో, శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయాలలో దిగారు. చదవండి: అక్రమాల పుట్ట మార్గదర్శి.. ఆందోళనలో చందాదారులు.. రామోజీ పాపం ఫలితమే ఇదంతా! -
కెనడాలోని భారత విద్యార్ధులకు గుడ్ న్యూస్
న్యూఢిల్లీ: కెనడాలోని భారత విద్యార్థులకు గొప్ప ఉపశమనం లభించింది. విద్యాభ్యాసం నిమిత్తం కెనడా వచ్చిన భారతీయ విద్యార్ధులు ఫేక్ ఆఫర్ లెటర్లతో వచ్చారని నిర్ధారించి కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ బహిష్కరణ వేటు వేసినా విషయం తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ విక్రంజీత్ సహానీ చొరవతో స్పందించిన CBSA మానవతాదృక్పథంతో స్పందించి బహిష్కరణ ప్రక్రియను నిలిపివేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ విక్రంజీత్ సహానీ, భారత హై కమిషన్ సహాయంతో బహిష్కరణ వేటుకు గురైన విద్యార్థులకు న్యాయం చేయమని కెనడా ప్రభుత్వాన్ని అభ్యర్ధించగా అందుకు సానుకూలంగా స్పందిస్తూ 700 విద్యార్ధులపై వారు విధించిన వేటును నిలిపివేశారు. ఈ మేరకు ప్రపంచ పంజాబీ ఆర్గనైజేషన్ అంతర్జాతీయ అధ్యక్షుడు కూడా అయిన ఎంపీ విక్రంజీత్ సహానీ కెనడా ప్రభుత్వానికి కృతఙ్ఞతలు తెలిపారు. ఎంపీ మాట్లాడుతూ... విద్యార్థుల భవిష్యత్తుపై మేము కెనడా ప్రభుత్వాన్ని కోరిన ప్రకారం వారు సానుకూలంగా స్పందించడం చాలా సంతోషకరం. ఈ విద్యార్థుల తప్పేమీ లేదని ఎవరో చేసిన తప్పుకు వీరిని శిక్షించడం సరికాదని వారికి వివరించడం జరిగింది. బ్రిజేష్ మిశ్రా అని జలంధర్ కు చెందిన ఒక ఏజెంట్ తన స్వార్ధం కోసం ఫేక్ ఆఫర్ లెటర్లు, ఫేక్ రసీదులు ఇచ్చారు. దానికి విద్యార్థులు బలయ్యారు. మీరే అనుమతించారు.. ఎటువంటి తనిఖీలు చేయకుండానే కెనడా ఇమ్మిగ్రేషన్ అధికారులు కూడా వారిని అనుమతించారని వారికి జరిగింది వివరించిన తర్వాత వారు పరిస్థితిని అర్ధం చేసుకుని మొత్తం 700 విద్యార్ధులపై వేసిన వేటును నిలిపివేశారు. ఉదార స్వభావంతోనూ మానవతా దృక్పథంతోనూ స్పందించిన కెనడా ఎంపీ సీన్ ఫ్రేజర్ గారికి ప్రత్యేకంగా కృతఙ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. Sincere thanks to @seanfraserMP @Bradredekopp @jennykwanBC for their very considerate and compassionate take on 700 students who are victims of fraudulent agencies and obliging our request for staying the deportation. I am hopeful that witness testimonies will help in punishing… pic.twitter.com/eXTXBYMOQ2— Vikramjit Singh MP (@vikramsahney) June 9, 2023 Thanks for this big relief. I am happy that our request has been considered to put an hold on the deputation of students who were made victims of the connivance of their agents and counterparts in Canada for issuing fake admission letters and fee receipts on which they received… https://t.co/Sl2FvbXCGV— Vikramjit Singh MP (@vikramsahney) June 8, 2023 -
జరిమానా చెల్లించలేదని కుల బహిష్కరణ
ములకలపల్లి: కుల పెద్దలు విధించిన జరిమానా కట్టలేదనే నెపంతో ఓ కుటుంబాన్ని బహిష్కరించడమే కాక తాగునీటి పైపులైన్ తొలగించి, వారి ఇంటికి ఎవరూ వెళ్లొద్దని చాటింపు వేయించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం రాచన్నగూడెంలో ఈ ఘటన జరిగింది. రాచ న్న గూడెంకు చెందిన గిరిజనుడు పెనుబల్లి శ్రీనివాస్.. తన తల్లిదండ్రులు, తమ్ముడు, తాత పోతరాజుతో కలసి ఉంటున్నాడు. ఆయనకు దమ్మపేట మండలం ఎర్రగుంపు గ్రామా నికి చెందిన శారదతో వివాహం జరిగింది. అయితే, భా ర్యాభర్తల మధ్య మనస్పర్థలతో శారద ఏడాది కిందట పుట్టింటికి వెళ్లిపోయింది. కాగా, నెల క్రితం శ్రీనివాస్ కూడా అక్కడికే వెళ్లి కూలీ పనులు చేసుకుంటున్నాడు. ఈనెల 10వ తేదీన శ్రీనివాస్ తాత కన్ను మూయగా.. భార్య శారదతో కలసి అతను రాచన్నగూడెంలోని ఇంటికి వచ్చాడు. కుల పెద్దలకు చెప్పకుండా భార్య వద్దకు వెళ్లడం, ఏడాది క్రితం వెళ్లిపోయిన ఆమెను తీసుకువచ్చాడని శ్రీనివాస్ తాత అంత్యక్రియలు ముగియగానే కులపంచాయితీ పెట్టారు. శ్రీనివాస్ రూ.1.5 లక్షల జరిమానా కట్టాలని పెద్దలు తీర్పు చెప్పారు. కానీ పేదలమైనందున రూ.20 వేలు చెల్లిస్తామని శ్రీను తెలపడంతో కులపెద్దల సమక్షంలోనే కొందరు అతని కుటుంబీకులపై దాడి చేసి డబ్బు మొత్తం చెల్లించాలని హుకుం జారీ చేశారు. అలాగే ఇంటి తాగునీటి పైపులైన్ తొలగించారు. కరెంట్ కూడా నిలిపివేస్తామని హెచ్చరించి.. శ్రీను ఇంటికి ఎవరూ వెళ్లొద్దని చాటింపు వేయించారు. దీంతో బాధిత కుటుంబం బుధవారం పోలీసులను ఆశ్రయించగా సర్పంచ్‌కు చెప్పి తాగునీటి సరఫరాను పునరుద్ధరించారు. కానీ గురువారం చిన్నకర్మ చేస్తుండగా, వచ్చిన గ్రా మస్తులు మళ్లీ నీటి సరఫరా నిలిపివేశారు. దీంతో బాధిత కుటుంబం శుక్రవారం మరోసారి పోలీస్‌స్టేషన్‌కు రాగా, పండుగ తర్వాత మాట్లాడుదామని చెప్పి పంపించారని శ్రీనివాస్ వాపోయాడు. ఈ విషయమై ఎస్సై సురేశ్‌ను వివ రణ కోరగా శనివారం విచారణ చేపడతామని తెలిపారు. -
డిటెన్షన్ సెంటర్ @ వికారాబాద్!
సాక్షి, హైదరాబాద్: నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులకు ‘విదేశీయుల’ వేధింపులు తప్పనున్నాయి. తమ సొంత దేశాలకు బలవంతంగా తిప్పి పంపాల్సిన (డిపోర్టేషన్) వారిని ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉంచేందుకు ఉద్దేశించిన డిటెన్షన్/డిపోర్టేషన్ సెంటర్ వికారాబాద్‌కు మారనుంది. కనిష్టంగా 40 మందిని ఉంచేలా దీన్ని నిర్మిస్తున్నారు. మరో రెండు నెలల్లో ఇది అందుబాటులోకి రానుంది. నైజీరియా, సోమాలియా, టాంజానియా, ఐవరీ కోర్టు వంటి ఆఫ్రికన్ దేశాల నుంచి అనేక మంది వివిధ రకాలైన వీసాలపై హైదరాబాద్ వస్తున్నారు. వీరిలో అనేక మంది వీసా, పాస్‌పోర్టుల గడువు ముగిసినా అక్రమంగా నివసిస్తున్నారు. నకిలీ గుర్తింపుకార్డుల సహకారంతో తమ పనులు పూర్తి చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఇలా ఉంటూ చిక్కిన వారిపై ఫారెనర్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసేవాళ్లు. అనుమానాస్పద కదలికలు ఉన్నా, కొన్ని రకాలైన నేరాలకు పాల్పడినా ఇలాన చేసేవాళ్లు. దీంతో కోర్టులో ఆ కేసుల విచారణ పూర్తయ్యే వరకు డిపోర్టేషన్‌కు అవకాశం ఉండేది కాదు. బెయిల్‌పై బయటకు వచ్చే వాళ్లు సైబర్ నేరాలు, డ్రగ్స్ విక్రయిస్తున్నారు. ఇలా అత్యంత సమస్యాత్మక వ్యక్తులుగా మారుతున్న వీరి ప్రభావం సమాజంపై తీవ్రంగా ఉంటోంది. ఇది గమనించిన నగర పోలీసులు ఇలాంటి వారిని అరెస్టు చేయడానికి బదులు డిపోర్ట్ చేయడానికే ప్రాధాన్యమిస్తున్నారు. ఈ డిపోర్టేషన్ ప్రక్రియలో అనేక ఘట్టాలు ఉంటాయి. ఆయా ఎంబసీలకు సమాచారం ఇచ్చి వీరి గుర్తింపులు, ఢిల్లీ కార్యాలయం నుంచి టెంపరరీ ట్రావెల్ డాక్యుమెంట్లు పొందాలి. ఆపై విమాన టిక్కెట్లు ఖరీదు చేసి సదరు ఎయిర్వేస్ నుంచి సెక్యూరిటీ క్లియరెన్స్, ఫారెనర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్ఆర్ఓ) నుంచి ఎగ్జిట్ పర్మిట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి పట్టే రెండు నెలల కాలంలో వీరిని డిపోర్టేషన్ సెంటర్ ఉంచాల్సిందే. ఉమ్మడి రాష్ట్రంలో ఈ సెంటర్ విశాఖపట్నంలో ఉండేది. ఆపై తాత్కాలిక ప్రాతిపదికన హైదరాబాద్ సీసీఎస్ డిపోర్టేష¯న్ సెంటర్‌గా మారింది. కేవలం అయిదుగురిని మాత్రమే ఉంచడానికి సరిపోయే జైలు గదినే దీనికి వాడుతున్నారు. దీంతో పాటు వారికి అనువైన ఆహారం అందించలేకపోవడంతో ఆయా విదేశీయులు చేసే రాద్ధాంతంతో సీసీఎస్ పోలీసులకు అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. వీటిని దృష్టిలో పెట్టుకున్న నగర పోలీసు విభాగం ప్రత్యేకంగా డిపోర్టేషన్ సెంటర్ ఆవశ్యకతను వివరిస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వీటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం వికారాబాద్‌లో డిపోర్టేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తోంది. ఆయా దేశీయుల భాష తర్జుమా చేయడానికి ట్రాన్స్‌లేటర్లు, వారికి అనువైన ఆహారం వండి ఇవ్వడానికి కుక్స్‌తో సువిశాల స్థలం మధ్యలో భవంతులతో నిర్మిస్తున్నారు. కనిష్టంగా 40 మందికి సరిపోయేలా రూపొందుతోంది. (చదవండి: తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం.. రైతన్నలకు డ్రోన్లు) -
తిప్పి పంపడానికి తిప్పలెన్నో!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అక్రమంగా నివసిస్తూ పోలీసులకు పట్టుబడిన విదేశీయులను వారి దేశాలకు పంపడానికి అవసరమైన ఏర్పాట్లు చేయడానికి డిపోర్టేషన్ సెంటర్లో ఉంచుతారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ సెంటర్‌ను తాత్కాలిక ప్రాతిపదికన నగర నేర పరిశోధన విభాగంలో (సీసీఎస్) ఏర్పాటు చేశారు. సరైన వసతులు, సౌకర్యాలు లేకపోవడంతో ఇక్కడ ఉంటున్న విదేశీయులు ఇబ్బందులు పడుతున్నారు. వీరి వైఖరి పోలీసులకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఈ నేపథ్యంలోనే డిపోర్టేషన్ సెంటర్‌ను అనువైన ప్రాంతానికి మార్చాలంటూ నగర పోలీసుల దాదాపు ఏడాది క్రితం పంపిన ప్రతిపాదనలపై ప్రభుత్వం స్పందించట్లేదు. నగరంలోనే బెడద ఎక్కువ.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల కంటే నగరంలోనే ‘ఈ విదేశీయుల’ బెడద ఎక్కువగా ఉంటోంది. విద్య, వైద్య, వృత్తి, వ్యాపార, పర్యాటక రంగాల్లో గణనీయమైన అభివృద్ధి నేపథ్యంలో, కల్చర్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమంలో భాగంగానూ అనేక మంది విదేశీయులు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. స్టడీ, విజిట్, బిజినెస్, మెడికల్ వీసాలపై వచ్చిన వారిలో కొందరు ఇక్కడే అక్రమంగా ఉండిపోతున్నారు. ప్రధానంగా సూడాన్, సోమాలియా, నైజీరియా, యమెన్, కెన్యా, జిబౌటీ తదితర దేశాల నుంచి వస్తున్న వారితోనే ఇబ్బంది ఎక్కువగా ఉంటోంది. ఇలా అక్రమంగా నివసిస్తూ పట్టుబడిన విదేశీయులతో పాటు వివిధ నేరాల్లో చిక్కిన వారినీ పోలీసులు అరెస్టు చేయడం, తమ ఆధీనంలోకి తీసుకోవడం చేస్తారు. వీరిపై సంబంధిత కేసులు నమోదు చేసిన తర్వాత దాని తీరును బట్టి తదుపరి చర్యలు తీసుకుంటారు. వీరిని ఆయా దేశాలకు బలవంతంగా తిప్పి పంపడానికి (డిపోర్టేషన్) ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు డిపోర్టేషన్ సెంటర్‌గా పిలిచే చోట నిర్భంధించి ఉంచుతారు. ఉమ్మ డి రాష్ట్రంలో ఈ సెంటర్ విశాఖపట్నంలో ఉండేది. ఆపై తాత్కాలిక ప్రాతిపదికన హైదరాబాద్ సీసీఎస్ డిపోర్టేషన్ సెంటర్‌గా మా రింది. విదేశీయులు పట్టుబడితే వారిని వెంటనే వారి దేశాలకు పంపడం సాధ్యం కాదు. భాష అర్థం కాక.. ఆహారం అందించలేక.. చిక్కిన వారి వివరాలను ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు (ఎఫ్ఆర్ఆర్ఓ) పంపి, అక్కడి నుంచి ఆయా దేశాలకు చెందిన ఎంబసీలకు సమాచారం ఇవ్వడం ద్వారా వివరాలు పొంది, వారి సాయంతోనే డిపోర్ట్ చేయాలి. అప్పటి వరకు డిపోర్టేషన్ సెంటర్లోనే ఉంచాలి. డిపోర్టేషన్ సెంటర్ ఏర్పాటుకు కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. ఆయా దేశీయుల భాష తర్జుమా చేయడానికి ట్రాన్స్‌లేటర్లు, వారికి అనువైన ఆహారం వండి ఇవ్వడానికి కుక్స్ ఉండాలి. సదరు సెంటర్ సైతం సువిశాల స్థలం మధ్యలో భవంతులతో నిర్మితం కావాలని మార్గదర్శకాలు చెబుతున్నాయి. ఇవేవీ లేకుండా సీసీఎస్‌లోని ఓ సెల్‌ను డిపోర్టేషన్ సెంటర్‌గా మార్చారు. దీంతో ఇక్కడి విదేశీయుల భాష అర్థం కాక, వారు అడిగిన ఆహారం అందించలేక, వసతుల లేమి నేపథ్యంలో వాళ్లు చేస్తున్న హంగామా భరించలేక పోలీసులు తలలు పట్టుకోవాల్సి వస్తోంది. వీటిని గమనించిన ఉన్నతాధికారులు డిపోర్టేషన్ సెంటర్‌ను అనువైన ప్రాంతానికి మార్చాలంటూ దాదాపు ఏడాది క్రితమే ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆ సెంటర్ సీసీఎస్‌లోనే కొనసాగుతోంది. (చదవండి: 6 నెలల ముందే అభ్యర్థులు) -
పెళ్లి భోజనం పెట్టలేదని.. కుల బహిష్కరణ
రామారెడ్డి: కూతురు ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసుకుందన్న బాధలో ఉన్న ఆ కుటుంబానికి అండగా నిలవా ల్సిన కులపెద్దలు.. పెళ్లి భోజనం పెట్టలేదన్న సాకుతో కుల బహిష్కరణ చేశారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామంలో ఈ ఘటన జరిగింది. మద్దికుంటకు చెందిన యెల్ది పోశయ్య కూతురు ఇటీవల ఇంట్లోంచి వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసు కుంది. విషయం తెలుసుకున్న కులపెద్దలు కులానికి పెళ్లి భోజనం పెట్టాలని పోశయ్యను అడిగారు. కులాచారం ప్రకారం పెళ్లి వరుడి ఇంట్లో జరుగుతుంది కాబట్టి వాహన ఖర్చుల కింద రూ.10 వేలు ఇవ్వాలన్నారు. కూతురు తమకు చెప్పకుండా వెళ్లిపోయిందని, పెళ్లి భోజనం ఎలా పెట్టాలని ప్రశ్నించినందుకు ఆగ్రహించిన కులపెద్దలు తమ కుటుంబాన్ని బహిష్కరించారని పోశయ్య వాపోయారు. కులపెద్దల తీరును నిరసిస్తూ ఆదివారం బాధిత కుటుంబం ఇంటికి తాళంవేసి ఇంటి ముందు సాయంత్రం వరకు దీక్షచేసింది. -
ప్రేమ, కులాంతర వివాహం.. 13 జంటలపై బహిష్కరణ వేటు
పుణె: ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నందుకుగాను వారిని కొన్నేళ్ల పాటు సామాజికంగా బహిష్కరించారు కులపెద్దలు. ఆ బహిష్కరణకు గురైంది ఒకరిద్దరు కాదు ఏకంగా 13 జంటలు. బాధితుల్లో ఒకరు ఈ వెలివేతపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కులపెద్దల పంచాయతీ భాగోతం వెలుగు చూసింది. దీంతో కులపెద్దలు ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. రాష్ట్రంలోని సంగ్లీ జిల్లాలో వివిధ ప్రాంతాలకు చెందిన నాందివాలే కమ్యూనిటీకి చెందిన జాట్లు కొంతమంది ప్రేమించి కులాంతర వివాహాలను చేసుకున్నారు. అయితే వీరికి కుల పంచాయతీ పెట్టిన కుల పెద్దలు వీరిని ఊరునుంచి బహిష్కరించారు. ఇది జరిగి కొన్నేళ్లు గడిచాక వీరిని తమకులంలో చేర్చుకునే విషయమై ఈనెల 9న పలాస్లో సమావేశం నిర్వహించారు. కులం నుంచి బహిష్కరించిన వారిని తిరిగి తమ కులంలో కలుపుకునేందుకు అనుమతించాలని సమావేశంలో కొందరు ప్రతిపాదించారు. దీనికి చాలామంది కులపెద్దల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో సమావేశంలో కులాంతర వివాహాలు చేసుకున్నవారిపై సామాజిక బహిష్కరణ మరింత కాలం అమలు చేయాలని తీర్మానించారు. చదవండి: (మదనపల్లెలో దారుణం.. పొట్టేలు తల అనుకుని యువకుని తల..) అంతకుముందు ఇటువంటి తరహా సమావేశాన్ని గతేడాది డిసెంబరులో సతారా జిల్లా కరద్‌లో నిర్వహించగా..2007లో కుల బహిష్కరణకు గురైన ఓ వ్యక్తి ప్రకాష్ భోసాలే (42) ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో కూడా సామాజిక బహిష్కరణ ఎత్తివేయాలన్న ప్రతిపాదనను కొంతమంది తీసుకురాగా కుల పెద్దలు ఒప్పుకోలేదు. ఆ సమావేశం నుంచి ప్రకాశ్ భోసాలే వెనుదిరిగి వచ్చేశారు. అనంతరం స్థానికంగా పనిచేస్తోన్న ఓ స్వచ్చంద సేవా సంస్థ అంధశ్రద్ధ నిర్మూలన్ సమితిని కలసి తమ సమస్యను వివరించారు. ఆ సమితి వారి సహాయంతో ప్రకాశ్ భోసాలే నేరుగా పలాస్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో తనలా సామాజిక బహిష్కరణకు గురైన వారు 13 జంటలు ఉన్నాయని పేర్కొనడంతో పోలీసులు ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రకాశ్ భోసాలే ఫిర్యాదు మేరకు ఆరుగురు జాట్లపై కేసు నమోదు చేసినట్లు పలాస్ ఎస్సై వికాస్ జాధవ్ తెలిపారు. చదవండి: (చైనా మాంజా గొంతు కోసేసింది: కళ్లెదుటే భర్త ప్రాణాలు పోతుంటే..) -
యువతి ప్రేమించిన వాడితో వెళ్లిపోతే.. కుటుంబాన్ని వెలివేశారు
జయపురం (ఒడిశా): వేరే కులం యువకుడిని ప్రేమించిన యువతి కుటుంబాన్ని గ్రామం నుంచి బహిష్కరించిన సంఘటన బొయిపరిగుడ సమితి తాలూరు గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. దురువ కులానికి చెందిన 22ఏళ్ల యువతి, మఝిగుడ గ్రామానికి చెందిన హరిజన యువకుడిని ప్రేమించింది. తల్లిదండ్రులకు తెలపకుండా అతనితో వెళ్లిపోయింది. ఈ విషయం తెలిసిన దురువ కులస్తులు సమావేశమై ఆమె కుటుంభాన్ని జాతి నుండి వెలివేశారు. యువతిని వెతికి పట్టుకు రావాలని గ్రామ పెద్దలు తెలడంతో తల్లి దండ్రులతో బంధువులు గాలింపు చేపట్టారు. బొయిపరిగుడ పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన బాధిత కుటుంబ సభ్యులు.. తమ కుమార్తెను వెతుకుతున్నామని, తమను గ్రామంలోకి ఆనుమతించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. గ్రామస్తులతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. చదవండి: (Jayamma Panchayathi: అటవీ ప్రాంతం నుంచి టాలీవుడ్ హీరోగా..) -
అమెరికాలోనే ఉండనివ్వండి.. భారతీయ యువత అభ్యర్ధన
వాషింగ్టన్: సరైన అనుమతి పత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తూ త్వరలో డిపోర్టేషన్ (బలవంతంగా సొంతదేశానికి తరలించడం)కు గురికానున్న పలువురు భారతీయ యువతీ యువకులు వైట్‌హౌస్‌ను ఆశ్రయించారు. తమను ఎలాగైనా ఇక్కడే ఉండేందుకు అనుమతించాలని బైడెన్ ప్రభుత్వాన్ని కోరారు. దాదాపు 2లక్షల మంది యువత అమెరికాలోనే తమ బాల్యాన్ని, టీనేజ్‌ను గడిపారు. అయితే వీరికి 21 సంవత్సరాలు దాటినందున ఇకపై పేరెంట్స్ వీసాపై అమెరికాలో ఉండేందుకు అనర్హులవుతున్నారు. వీరిలో చాలామంది తల్లిదండ్రులు గ్రీన్‌కార్డు కోసం పడిగాపులు కాస్తున్నారు. ఈ కార్డున్న వారికి తమ కుటుంబంతో పాటు అమెరికాలో నివసించే హక్కు లభిస్తుంది. ఈ నేపథ్యంలో దీప్పటేల్ తదితరులు ద డ్రీమ్ పేరిట ఒక సంఘాన్ని ఏర్పరిచి ఇలాంటి యువతను అమెరికాలో ఉంచాలని ప్రభుత్వాన్ని కోరుతూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా పలువురు సెనేటర్లు, కాంగ్రెస్ సభ్యులను కలిసి ఈ విషయమై లాబీయింగ్ చేశారు. వీరి యత్నాలకు పలువురు చట్టసభ్యులు సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. డాకా(డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్) కింద తమలాంటి వారు అమెరికాలో ఉండేందుకు మార్పులు చేయాలని వీరు కోరుతున్నారు. మైనర్లుగా అమెరికా వచ్చిన వారు మేజర్లయ్యాక దేశం వదిలి వెళ్లాల్సిన పనిలేకుండా గతంలో ఒబామా ప్రభుత్వం డాకా చట్టం తెచ్చింది. కానీ, డొనాల్డ్ ట్రంప్ హయాంలో దీన్ని రద్దు చేశారు. -
జనం ఓటేయరనే ఎన్నికల బహిష్కరణ
సాక్షి, అమరావతి: టీడీపీకి ఎలాగూ ప్రజలు ఓటేయరని తెలిసే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తామని ఆ పార్టీ అంటోందని రాష్ట్ర సమాచార, రవాణా శాఖల మంత్రి పేర్ని వెంకటరామయ్య(నాని) ఎద్దేవా చేశారు. ఇప్పటికే ప్రజలు టీడీపీని బహిష్కరించారని ఆయన అన్నారు. ఇప్పటికే టీడీపీకి చెందినవారు నామినేషన్లు వేశారని, ఒకవేళ ఎన్నికలను ఆ పార్టీ బహిష్కరించినా బ్యాలెట్లో టీడీపీ గుర్తు ఉంటుందని చెప్పారు. నిన్నటి వరకు నిమ్మగడ్డను అడ్డంపెట్టుకుని ఆట ఆడారని, ఇప్పుడు ఒక మంచి ఆఫీసర్ ఎస్ఈసీగా వచ్చేసరికి ఎన్నికలు వద్దంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. పేర్ని నాని గురువారం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. నారా వారి పుత్రరత్నం లోకేశ్ ఎల్ బోర్డ్ పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని, ఇంకో 30 ఏళ్లయినా ఎల్ బోర్డ్ అలానే ఉంటుందని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదాపై లోకేశ్ మాట్లాడుతుండడాన్ని ఆయన తప్పుపట్టారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి భారీ మెజార్టీతో గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టనున్నారని నాని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ తన 20 నెలల పాలనలోనే మేనిఫెస్టోలోని అంశాల్లో 90 శాతానికిపైగా అమలు చేశారన్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి గెలుపు దేశం మొత్తం తిరుపతి వైపు చూసేలా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. -
అమానుషం: నీరు ఇవ్వలేదని సాంఘిక బహిష్కరణ
సాక్షి, తాడ్వాయి(ఎల్లారెడ్డి): గ్రామానికి బోరు నీరు ఇవ్వలేదనే ఉద్యేశంతో మాజీ కారోబారు కుటుంబ సభ్యులతో ఎవరు మాట్లాడవద్దని చాటింపు వేయించిన ఘటన తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చిట్యాల గ్రామానికి చెందిన మాజీ కారోబారు నిట్టు నాగేందర్రావు, వారి అన్నదమ్ములకు సంబందించిన వ్యవసాయ భూమిలో 20 సంవత్సరాల క్రితం గ్రామస్తులు బోరు వేయించారు. దీంతో అప్పటినుంచి బోరు నీటిని గ్రామస్తులకు సరఫరా చేస్తున్నారు. కాగా గత 15 రోజుల క్రితం బోరులో ఉన్న మోటరు చెడిపోయి భూమిలోకి కుంగిపోయి నీరు రావడం లేదు. దీంతో గ్రామ పంచాయతీ పాలకవర్గం అదే స్థలంలో వేరొక బోరు వేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని నాగేందర్రావును అడుగగా నిరాకరించారు. ఎన్నో మార్లు గ్రామంలో సమావేశాలు ఏర్పాటు చేసి బోరు విషయమై మాట్లాడుతామని చెప్పిన నాగేందర్రావు ఒప్పుకోలేదు. అంతేకాకుండా ఒక వేళ బోరు వేసినట్లయితే బోరు నీరు మూడు రోజులు గ్రామస్తులకు, మిగత మూడు రోజులు తనే వాడుకుంటానని తేల్చి చెప్పారు. అంతేకాకుండా నాగేందర్రావు లాయర్ ద్వారా సర్పంచ్ కవిత, సర్పంచ్ భర్త బాలయ్య, మరొ ఇద్దరికి నోటీసులు పంపించారు. దీంతో నాగేందర్రావు కుటుంబంతో గ్రామస్తులు ఎవరు మాట్లాడవద్దని ఒకవేళ మాట్లాడితే జరిమాన విధిస్తామని ఆదివారం రాత్రి గ్రామంలో గ్రామపెద్దలు చాటింపు వేయించారు. ఈ విషయం తెసుకున్న నాగేందర్రావు, ఆయన కుమారులు నర్సింగరావు, చందర్‌లు సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ సునీత, ఎస్సై కృష్ణమూర్తిలు చిట్యాలకు వెళ్లి గ్రామస్తులతో మాట్లాడి జరిగిన విషయాన్ని తెలసుకున్నారు. తహసీల్దార్‌ను వివరణ కోరగా రెండు రోజులలో ఇరువర్గాలతో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యేలా చూస్తామన్నారు. -
రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌ను పునరుద్ఘాటిస్తూ దేశ రైతులకు సంఘీభావం తెలియజేసేందుకు కాంగ్రెస్ సహా 18 ప్రతిపక్షాలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని నిర్ణయించాయి. ఈ మేరకు గురువారం కాంగ్రెస్, ఎన్సీపీ, జేకేఎన్సీ, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, శివసేన, ఎస్పీ, ఆర్జేడీ, సీపీఎం, సీపీఐ, ఐయూఎంఎల్, ఆర్ఎస్పీ, పీడీపీ, ఎండీఎంకే, కేరళ కాంగ్రెస్(ఎం), ఏఐయూడీఎఫ్ ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ‘దేశ జనాభాలో 60 శాతం ప్రజలు, కోట్లాది మంది రైతులు, వ్యవసాయ కూలీలు ఆధారపడిన వ్యవసాయ రంగం భవిష్యత్తుకు ప్రమాదకరంగా బీజేపీ ప్రభుత్వం ఏకపక్షంగా రుద్దుతున్న వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ సంఘటితంగా రైతులు పోరాడుతున్నారు. గడిచిన 64 రోజులుగా తీవ్రమైన చలిని, భారీ వర్షాలను లెక్కచేయకుండా దేశ రాజధానిలో రైతులు తమ హక్కులు, న్యాయం కోసం పోరాడుతున్నారు. సుమారుగా 155 మంది రైతులు తమ ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వంలో కదలిక లేకపోగా.. వాటర్ కెనాన్లతో, టియర్ గ్యాస్‌తో, లాఠీఛార్జీలతో జవాబు ఇచ్చింది. రైతుల న్యాయమైన ఉద్యమాన్ని ప్రభుత్వ ప్రాయోజిత తప్పుడు సమాచారంతో ఉద్యమాన్ని తక్కువ చేసి చూపేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. దేశ ఆహార భద్రత స్వరూపం ముక్కలవుతుంది.. ‘మూడు సాగు చట్టాలు రాష్ట్రాల హక్కులపై, రాజ్యాంగం ప్రసాదించిన సమాఖ్య స్ఫూర్తిపై దాడి. ఈ చట్టాలను వెనక్కి తీసుకోనిపక్షంలో అవి దేశ ఆహార భద్రత స్వరూపాన్ని ముక్కలు చేస్తాయి. అంతేకాకుండా కనీస మద్దతు ధర, ప్రభుత్వ ధాన్య సేకరణ వ్యవస్థలను ధ్వంసం చేస్తాయి’ అని పేర్కొన్నాయి. నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు.. ‘ప్రధాని, బీజేపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా స్పందిస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి మాకు దిగ్భ్రాంతి కలిగించింది. అందువల్ల మేం సంఘటితంగా రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌ను పునరుద్ఘాటిస్తున్నాం. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగాన్ని బహిష్కరించాలని నిర్ణయించాం’ అని కాంగ్రెస్‌సహా ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. -
న్యాయమడిగితే కుల బహిష్కరణ
సాక్షి, మోపాల్: న్యాయం చేయాలని కులపెద్దలను అడిగితే ఏకంగా కులబహిష్కరణ చేశారని నిజామాబాద్ రూరల్ మండలంలోని గుండారం గ్రామానికి చెందిన రెడ్డిసునీత ఆరోపించారు. ఈ మేరకు ఆమె మంగళవారం కలెక్టర్, పోలీసు కమిషనర్, ఆర్డీవో, ఏసీపీలకు వేరువేరుగా వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో తమకు ఉన్న వ్యవసాయ భూమిని బావ మల్లారెడ్డి కబ్జా చేస్తున్నాడని గతంలో పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. ఈ విషయం ఆయనపై కేసు నమోదైందన్నారు. అయినప్పటికీ మళ్లీ గొడవ చేయడంతో మండల సర్వేయర్‌తో సర్వే చేయించి హద్దుల ప్రకారం కంచె వేసుకున్నామన్నారు. తాజాగా తిరిగి అదే హద్దుల విషయంలో ప్రత్యర్థులు కులపెద్దలను ఆశ్రయించి మా కుటుంబాన్ని బెదిరింపులకు గురిచేశారని ఆరోపించారు. దేవాలయానికి సంబంధించిన భూమిని మాకు కట్టబెట్టి మా పట్టాభూమిని వారికి ఇవ్వాలని ఒత్తిళ్లకు గురిచేస్తున్నారని దీనికి ఒప్పుకోకపోవడంతో కులపెద్దలకు చెప్పి తమను బహిష్కరించారని తెలిపారు. అంతేకాకుండా కులపెద్దలు మా కుటుంబసభ్యులను అసభ్య పదజాలంతో దూషిస్తూ బెదిరిస్తున్నారన్నారు. తమతో ఎవరైన మాట్లాడితే రూ.5వేలు జరిమానా విధిస్తామని సంఘంలో తీర్మానం చేశారని ఆరోపించారు. వెంటనే అధికారులు జోక్యం చేసుకొని తమకు రక్షణ కల్పించాలని మా భూమిని మాకు అందించి న్యాయం చేయాలని ఆమె వేడుకున్నారు. -
రెండు రోజుల్లో కొడుకు పెళ్లి.. కులబహిష్కరణ
సాక్షి, ప్రకాశం: జిల్లాలోని కొత్తపట్నం మండలం ఈతముక్కల పల్లెలో కుల బహిష్కరణ కలకలం రేపింది. గ్రామంలోని ఒక స్థల వివాదంలో నాయుడు బ్రహ్మయ్య అనే వ్యక్తి తలదూర్చుతున్నాడనే కారణంతో గ్రామస్తులు అతనిపై బహిష్కరణ ప్రకటన చేశారు. దీంతో రెండు రోజుల్లో జరగాల్సిన ఆయన కొడుకు పెళ్లికి కూడా ఆటంకం కలిగే పరిస్థితి ఏర్పడింది. కరోనా కాలంలో బయటి వ్యక్తులు గ్రామంలోకి గ్రామంలోని వ్యక్తులు బయటికి వెళ్లవద్దని గ్రామస్తులు తీర్మానం చేసుకున్నారు. బ్రహ్మయ్య కుటుంబాన్ని బహిష్కరిస్తున్నట్లు గ్రామంలో చాటింపు వేశారు. దీంతో గ్రామంలో తనకు జరిగిన అన్యాయాన్ని బ్రహ్మయ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు గ్రామాన్ని సందర్శించి పెద్దలను పిలిచి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. -
కుల బహిష్కరణ కలకలం
-
మొండికేస్తున్న సోమాలియన్లు...
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో అక్రమంగా నివాసం ఉంటూ పోలీసులకు పట్టుబడిన సోమాలియన్లలో ఒకరు ఇంకా నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) ఆధీనంలోని డిపోర్టేషన్ సెంటర్లోనే ఉండిపోయారు. ఇతడితో సహా మొత్తం ఎనిమిది మంది తమ స్వదేశానికి వెళ్లడానికి విముఖత చూపడంతో సిటీ అధికారులు ఐక్యరాజ్య సమితి సహాయం కోరారు. యూనైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్ కౌన్సిల్ (యుఎన్‌హెచ్‌ఆర్‌సీ) జోక్యంతో ఏడుగురికి వివిధ స్కాండెనేవియన్ దేశాలు శరణార్థులుగా ఆశ్రయం కల్పించగా.. ఒకరికి మాత్రం ఎలాంటి గుర్తింపు లేకపోవడంతో అతను ఇక్కడే ఉండిపోయాడు. అతడికి తోడు మరో ఇద్దరు బంగ్లాదేశీయులు ప్రస్తుతం ఈ డిపోర్టేషన్ సెంటర్లో ఉన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో దాదాపు రెండు నెలలుగా వీరి డిపోర్టేషన్ ప్రక్రియ ఆగిపోయింది. సక్రమంగా వచ్చి అక్రమంగా మారి... నగరం విద్య, వైద్య, వృత్తి, వ్యాపార, పర్యాటక రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధిస్తున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాలతో పాటు దేశాలకు చెందిన వారు ఇక్కడికి వస్తున్నారు. స్టడీ, విజిట్, బిజినెస్, మెడికల్ వీసాలపై వచ్చిన వారిలో కొందరు అక్రమంగా ఇక్కడే ఉండిపోతున్నారు. మరికొందరు ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా వివిధ మార్గాల్లో నగరానికి చేరుకుంటున్నారు. హైదరాబాద్‌లో అక్రమంగా నివసిస్తున్న వారిలో ఆఫ్రికన్ దేశాలకు చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారు. ప్రధానంగా సూడాన్, సోమాలియా, నైజీరియా, యమన్, కెన్యా, జిబౌటీ తదితర దేశాల నుంచి వస్తున్న వారితోనే ఇబ్బంది ఎక్కువగా ఉంటోంది. ఆయా దేశాల్లో ఉన్న సామాజిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడే అక్రమంగా స్థిరపడాలనే ఉద్దేశంతో పథకం ప్రకారం వివిధ రకాలైన వీసాలపై ఇక్కడికి వచ్చేస్తున్నారు. మొండికేస్తున్న సోమాలియన్లు... ఈ ఏడాది జనవరిలో చిక్కిన సోమాలియా తదితర దేశాలకు చెందిన వారు డిపోర్టేషన్ సెంటర్‌కు చేరారు. మిలిగిన వారు తమ దేశాలకు వెళ్లిపోగా.. సోమాలియా దేశానికి చెందిన ఎనిమిది మంది మాత్రం తమ స్వదేశానికి వెళ్లేందుకు విముఖత చూపారు. దీంతో వారి విషయంలో అధికారులు యుఎన్‌హెచ్‌ఆర్‌సీ సహాయం తీసుకున్నారు. ఏడుగురి వద్ద సోమాలియా జాతీయులుగా నిరూపించడానికి అవసరమైన పత్రాలు లభించాయి. దీంతో యుఎన్‌హెచ్‌ఆర్‌సీ వీరికి వివిధ స్కాండినేవియన్ దేశాల్లో శరణార్థులుగా ఆశ్రయం కల్పించింది. ఒకరు మాత్రం దాదాపు 13 ఏళ్ల క్రితమే సోమాలియా నుంచి నగరానికి వచ్చేయడంతో ఇతడికి సంబంధించి ఆ దేశ రాయబార కార్యాలయం ఎలాంటి ధ్రువీకరణలు ఇవ్వలేకపోయింది. ఫలితంగా శరణార్థిగా మారే అర్హత లేక డిపోర్టేషన్ సెంటర్లోనే ఉండిపోయాడు. ఇతడితో పాటు దాదాపు రెండున్నర నెలల క్రితం చిక్కిన ఇద్దరు బంగ్లాదేశీయులు కూడా డిపోర్టేషన్ కోసం ఇక్కడికి వచ్చారు. లాక్డౌన్ నేపథ్యంలో డిపోర్టేషన్ ప్రక్రియలు జరగట్లేదు. ఇవి ఎప్పుడు ప్రారంభం అవుతాయో చెప్పలేమని అధికారులు పేర్కొన్నారు. అప్పటి వరకు వారు సీసీఎస్ ఆ«ధీనంలోనే ఉండాల్సి ఉంది. డిపోర్టేషన్ సెంటర్‌గా సీసీఎస్... అక్రమంగా నివసిస్తూ పట్టుబడిన విదేశీయులతో పాటు వివిధ నేరాల్లో చిక్కిన వారినీ పోలీసులు అరెస్టు చేయడం, తమ ఆధీనంలోకి తీసుకోవడం చేస్తారు. వీరిపై సంబంధిత కేసులు నమోదు చేసిన తర్వాత దాని తీరును బట్టి తదుపరి చర్యలు తీసుకుంటారు. వీరిని ఆయా దేశాలకు బలవంతంగా తిప్పి పంపడానికి (డిపోర్టేషన్) ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అప్పటి వరకు డిపోర్టేషన్ సెంటర్లో వారిని ఉంచుతారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ సెంటర్ విశాఖపట్నంలో ఉండేది. ప్రస్తుతం హైదరాబాద్‌లో సీసీఎస్ డిపోర్టేషన్ సెంటర్‌గా మారింది. విదేశీయులు పట్టుబడితే వారిని వెంటనే వారి దేశాలకు పంపడం సాధ్యం కాదు. చిక్కిన వారి వివరాలను ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు (ఎఫ్ఆర్ఆర్ఓ) పంపి, అక్కడి నుంచి ఆయా దేశాలకు చెందిన ఎంబసీలకు సమాచారం ఇవ్వడం ద్వారా వివరాలు పొంది, వారి సాయంతోనే డిపోర్ట్ చేయాలి. -
హెచ్-1బీ వీసాల గడువు : ఊరట
వాషింగ్టన్: హెచ్1-బీ వీసాపై భారత ఐటీ నిపుణులకు భారీ ఊరట లభించింది. ఈ వీసా గడువు పొడిగింపుపై ఇటీవల కఠిన నిబంధనల నేపథ్యంలో దాఖలైన పిటీషన్లపై ఫెడరల్ ఏజెన్సీ వీసాదారులకు ఉపశమనం కలిగించింది. ఇందుకోసం ఏర్పాటు చేసిన ఫెడరల్ ఏజెన్సీ ఉద్యోగ సంబంధ దరఖాస్తులు, మానవీయ అర్జీలు, పిటిషన్ల దరఖాస్తులకు ఈ కొత్త నియమం వర్తించదని తెలిపింది. హెచ్1-బీ వీసాలపై అక్కడకు వెళ్లిన విదేశీయులు.. వీసా గడువు తీరిపోయిన తర్వాత ఎక్కువ కాలం అక్కడ కొనసాగకుండా నిబంధనలు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. వచ్చే సోమవారం(అక్టోబర్1) నుంచి దీన్ని అమలు చేయాలని ప్రతిపాదించింది. ఈ నిబంధన ప్రకారం.. వీసా గడువు తీరిపోయిన వారు వీసా పొడిగింపు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవాలి. అలా దరఖాస్తు చేసుకున్న తర్వాత ఏవైనా కారణాల వల్ల అవి తిరస్కరణకు గురైతే దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. వీసా పొడిగింపునకు దరఖాస్తు చేసుకోని వారిని, దరఖాస్తు తిరస్కరణకు గురైన వారు ఇంకా దేశంలోనే ఉన్నట్లయితే వారిని మాత్రమే దేశం నుంచి బహిష్కరించే నిబంధన అక్టోబరు 1నుంచి అమలు చేసేందుకు అమెరికా సిద్ధమైంది. అయితే కొత్త నిబంధన మాత్రం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వాళ్లకు, దరఖాస్తు పెండింగ్‌లో ఉన్న వాళ్లకు వర్తించదు. అయితే ఈ కొత్త నిబంధన అమలు ప్రభావం భారతీయుల విూదే ఎక్కువగా పడనుంది. సాధారణంగా వీసా గడువు తీరిన తర్వాత సగటున 240రోజులు మాత్రమే అక్కడ ఉండటానికి అనుమతి ఉంది. ఆలోపు వీసా గడువు పెంపు దరఖాస్తు తిరస్కరణకు గురైతే వెంటనే దేశం వదిలి వెళ్లిపోవాలి. అలా కాకుండా అనధికారికంగా అక్కడే ఉండిపోతే..యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్(యూఎస్సీఐఎస్) ‘నోటీస్ టు అప్పియర్(ఎన్టీఏ) జారీ చేస్తుంది. దీంతో సదరు ఉద్యోగులు ఉద్యోగంలో కొనసాగడానికి వీలుండదు. కేవలం విచారణ జరిగే వరకు మాత్రమే అమెరికాలో ఉండటానికి అవకాశం ఉంటుంది. అలాగే వీసా గడువు తీరిన వ్యక్తి ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తి ముందు హాజరు కావాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ సమయంలో ఆవ్యక్తి అమెరికాలో లేనట్లయితే అతనిపై గరిష్ఠంగా ఐదేళ్ల పాటు అమెరికాలోకి రాకుండా నిషేధం విధిస్తారు. వీసా గడువు పెంపు దరఖాస్తు తిరస్కరణకు గురయ్యాక కూడా ఏడాది పాటు అమెరికాలో అనధికారికంగా నివసిస్తే వారిపై పదేళ్లపాటు నిషేధం అమలు చేస్తారు. వీసా గడువు పెంచుకోవడానికి లేదా, తమ స్టేటస్ మార్పుకోసం చేసుకున్న దరఖాస్తు తిరస్కరణకు గురైతే సదరు వ్యక్తులు వెంటనే స్వదేశానికి తిరిగి వచ్చేయాల్సి ఉంటుంది. వీళ్లకి ఎన్టీఏ నోటీసులు జారీ చేయరు. సుమారు 7లక్షలమంది భారతీయులు హెచ్-1బీ వీసాపై పనిచేస్తున్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. -
విమానం ఎక్కేదాకా వారు జైల్లోనే!
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు వివిధ ఆశలు చూపించి ఆన్లైన్ ద్వారా ఎర వేస్తూ వరుస నేరాలకు పాల్పడుతున్న విదేశీ నేరస్తుల విషయంలో నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) సరికొత్త వ్యూహాన్ని అనుసరించనుంది. అధిక నేరాలకు పాల్పడ్డ కేసుల్లో వీరు బెయిల్ తీసుకుని తర్వాత ఆచూకీ లేకుండా పోతుండడంతో వారు తమ దేశాలకు తిరిగి వెళ్లేదాకా జైల్లోనే ఉంచాలని నిర్ణయించింది. ఇటీవల పలు ఆన్లైన్ నేరాలకు పాల్పడ్డ నైజీరియన్ ఆచూకీ కోసం సైబర్ క్రైమ్ పోలీసులు దాదాపు ఆరు నెలల పాటు శ్రమించారు. ఎట్టకేలకు ఢిల్లీలో అతడి కదలికలు కనిపెట్టి అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం దాదాపు 15 రోజుల పాటు గాలించి పట్టుకుంది. ఇలా చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన అతగాడు వారం రోజులకు బెయిల్ తీసుకుని బయటకు వచ్చి ఆపై రెండేళ్లుగా ఆచూకీ లేకపోవడంతో కేసు పెండింగ్‌లో ఉండిపోయింది. ఇలాంటి ఉదంతాలకు తావు లేకాకుండా చూసేందుకు నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు చర్యలు ప్రారంభించారు. తీవ్రమైన నేరాల్లో అరెస్టయిన విదేశీయులకు బెయిల్ ఇవ్వొద్దని, నిర్ణీత కాలంలో తాము చార్జ్షీట్లు దాఖలు చేస్తామని న్యాయ విభాగానికి ఇటీవల ప్రతిపాదించారు. ఇందులోని అంశాలను పరిగణనలోకి తీసుకున్న ఆ విభాగం అందుకు అంగీకరించింది. దీంతో సైబర్ నేరాల్లో చిక్కిన ఇద్దరు నైజీరియన్లతో పాటు అక్రమంగా నివసించడంతో పాటు బోగస్ గుర్తింపు కార్డులు పొంది చిక్కిన పాకిస్థానీ సైతం బయటకు వచ్చే అవకాశం లేదు. వీరిపై అభియోగపత్రాలు దాఖలు చేసి ట్రయల్ నిర్వహించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రెండు రకాల చర్యలకు అవకాశం దేశంలో అక్రమంగా నివసిస్తూ చిక్కిన విదేశీయులపై రెండు రకాల చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రాథమికంగా వారి పాస్‌పోర్ట్‌పై ‘ఎగ్జిట్ స్టాంప్’ కొట్టడం ద్వారా స్వదేశానికి బలవంతంగా తిప్పిపంపే (డిపోర్టేషన్) ఆస్కారం ఉంది. అలాకానప్పుడు, ఉదంతం తీవ్రతను బట్టి వారిపై కేసు నమోదు చేసి ట్రయల్ నిర్వహించవచ్చు. ఇలా కేసు నమోదైతే మాత్రం తక్షణం డిపోర్టేషన్ చేయడానికి చట్టం అంగీకరించదు. వీరిపై అభియోగపత్రాలు దాఖలు చేసి, విచారణ పూర్తై, శిక్షపడేతే అది అనుభవించిన తర్వాతే తిప్పి పంపాల్సి ఉంటుంది. ఈలోపు బెయిల్ పొందుతున్న ఈ విదేశీయులు అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు. ఫలితంగా కేసుల విచారణ ఆగిపోవడంతో పాటు మరో ప్రాంతంలో వారు యథేచ్ఛగా నేరాలు చేస్తున్నా గుర్తించి, పట్టుకోలేని పరిస్థితి ఉంది. నగరం విషయానికి వస్తే ఇక్కడ చిక్కుతున్న వారిలో ఆఫ్రికా దేశాలతో పాటు పాక్, బంగ్లాదేశ్‌కు చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారు. వీరిలోనూ నల్లజాతీయులతోనే ఎక్కువగా ఇబ్బందులు వస్తున్నాయి. వీరు అక్రమంగా నివసిస్తున్నప్పటికీ ఏదో ఒక పోలీసు కేసు నమోదైతే తప్ప ఈ విషయం వెలుగులోకి రావట్లేదు. దీంతో వెంటనే డిపోర్టేషన్ చేసే ఆస్కారం ఉండడం లేదు. పాస్‌పోర్ట్ ‘భద్రపరిచి’ రాక.. సిటీలో జరుతున్న సైబర్ నేరాలు, డ్రగ్స్ విక్రయాల్లో ఎక్కువగా నల్లజాతీయులు అరెస్ట్ అవుతున్నారు. వీరంతా తొలిదశలో విద్య, వ్యాపార, పర్యాటక వీసాలపై దేశంలోని ఏదో ఒక మెట్రో నగరానికి చేరుకుంటున్నారు. అక్కడ ఉంటూ ఈ దందాల్లోకి దిగుతున్నప్పుడే తమ పాస్‌పోర్టులను కొందరి వద్ద భద్రపరిచి, నేరబాట పడుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఆయా నిందితులు పోలీసులకు చిక్కుతున్నప్పటికీ పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకోవడం సాధ్యం కావడం లేదు. కనీసం వాటి నంబర్లు, కొన్ని సందర్భాల్లో తమ నిజమైన పేర్లు కూడా ఈ నేరగాళ్లు బయటపెట్టడం లేదు. అవి లభిస్తే తప్ప సీజ్ చేయడానికి, రద్దు చేయించడానికో ఆస్కారం లేదు. ఈ కారణంగానే బెయిల్‌పై వచ్చిన వారు తమ దేశాలకు చెక్కేస్తున్నా గుర్తించలేని, పట్టుకోలేని పరిస్థితి. దీనివల్ల ఓపక్క కేసుల విచారణ ముందుకు సాగకపోవడంతో పాటు అనేక నాన్–బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉండిపోతున్నాయి. ఈ పరిణామాలు ఇటు న్యాయస్థానాలతో పాటు అటు పోలీసులకూ పని భారం పెంచుతున్నాయి. నేరం చేసిన వాళ్లు స్వేచ్ఛగా విహరించే ఆస్కారం ఇస్తున్నాయి. బెయిల్ ప్రాథమిక హక్కు అయినప్పటికీ.. సాధారణంగా ఏదైనా నేరంలో నిందితుడిగా అరెస్ట్ అయిన వ్యక్తి దోషిగా తేలే వరకు జైల్లోనే మగ్గిపోకుండా బెయిల్ పొందడం చట్టం కల్పించిన అవకాశం. అయినప్పటికీ విదేశీ నేరగాళ్లకు బెయిల్ ఇవ్వడం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. చట్ట ప్రకారం ఆయా కేసుల్లో నిందతులను అరెస్ట్ చేసిన తర్వాత గరిష్టంగా 90 రోజుల్లో (ప్రత్యేక కేసుల్లో మినహా) అభియోగపత్రాలు దాఖలు చేయాలి. కీలక కేసుల్లో ఈ కోణంలో పోలీసులు విఫలమైనప్పుడే న్యాయస్థానాలు నిందితులకు బెయిల్ ఇస్తూ ఉంటాయి. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు తాము నిర్ణీత కాలంలో చార్జ్షీట్లు దాఖలు చేస్తామంటూ న్యాయ విభాగం దృష్టికి తీసుకువెళ్లారు. విదేశీ నేరస్తుల విషయంలో ఇది కచ్చితంగా అమలయ్యేలా చర్యలు కుంటున్నట్లు వివరించాయి. దీనికి సమ్మతించిన న్యాయ విభాగం పూర్వాపరాల నేపథ్యంలో విదేశీ నేరస్తులకు బెయిల్ ఇచ్చే విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులకు తెలిపింది. దీంతో కేసు విచారణ, శిక్ష పూర్తయిన తర్వాత నేరుగా డిపోర్టేషన్ చేయడానికి నిర్ణయించామని సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి తెలిపారు. -
పెళ్లి చేసుకుంటే గ్రామ బహిష్కరణే..!
► కట్టుబాట్ల చెరలో శీగేబావి ► కుల పెద్దల మాటే వేదం ► తప్పు చేస్తే గ్రామ బహిష్కారం ► డిజిటల్ యుగంలో వింత ఈ గ్రామంలో ఉన్న కురుబ సముదాయ ప్రజలు.. పిల్లలైనా సరే, పెద్దలైనా సరే ఎవరూ ఎవరితో గొడవ పడరాదు. కుల పెద్దలు చెప్పినట్లు మాత్రమే నడుచుకోవాలి, కులాంతర వివాహం చేసుకోరాదు. కుల పెద్దల మాట జవదాటినా, నియమాలు ఉల్లంఘించినా వారికి జరిమానాతో పాటు గ్రామ బహిష్కార దండన తప్పదు. ఈ గ్రామం ఎక్కడో కాదు, బెంగళూరుకు సమీపంలో ఉన్న తుమకూరు జిల్లాలోని చిక్కనాయకనహళ్లి తాలూకాలో ఉన్న శీగేబాగి గ్రామంలో ఇలాంటి కఠినమైన కట్టుబాట్లే అమలవుతున్నాయి. తుమకూరు(కర్ణాటక): శీగేబాగి గ్రామంలోని కురుబ కులస్తులకు ఆ సముదాయం పెద్దలు చెప్పిందే తీర్పు. పట్టుమని వెయ్యి మంది ఉండే ఊళ్లో ఈ వర్గీయులు పెద్దసంఖ్యలోనే ఉన్నారు. ఇక్కడ గ్రామంలో ఇప్పటికి సంప్రదాయాల పేరుతో కుల పెద్దలు గీసిన లక్ష్మణరేఖను దాటడానికి ఎవరూ ధైర్యం చేయరు. మూడు సంవత్సరాల కిందట గ్రామంలోని కొందరు కురుబ పెద్దలు సముదాయం పేరుతో సంఘాన్ని ఏర్పాటు చేసి కట్టుబాట్లు విధించారు. కులంలోని వారికి సంబంధించి ఎక్కడ గొడవ జరిగినా పెద్దలు అక్కడికి వెళ్లి పంచాయతీ పెడతారు. తప్పు ఎవరిదో నిర్ధరించి వారికి జరిమానా విధిస్తారు. తప్పు తీవ్రమైనదైతే వారిని ఊరి నుంచి బహిష్కరించడం జరుగుతుంది. జీవితాంతం గ్రామంవైపు కన్నెత్తి చూడరాదు. ఒకవేళ తిరిగి వచ్చినా వారితో ఇతరులెవరూ మాట్లాడవద్దు. ఒక వేళ మాట్లాడినట్లు తెలిసిన వారికి అదేశిక్ష తప్పదు. ఇళ్ళలో ఉన్న చిన్న పిల్లలు చేసినా కూడ వారికి కూడ ఇదేశిక్ష తప్పదు. చిన్న పిల్లలు చేస్తే వారి పెద్దలకు జరిమానా విధిస్తున్నారు. ఇలాంటి పాత కాలం పద్ధతులు ఇంకా మనుగడలో ఉండడం ఇక్కడ మాత్రమే చూడగలమేమో. ప్రేమ వివాహానికి శిక్ష.. గ్రామ బహిష్కారం ఇదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి కుమార్తె ప్రభుత్వ ఉద్యోగం చేస్తోంది. ఆమె రెండేళ్ల కిందట ఒక అగ్రవర్ణ యువకునితో ప్రేమపెళ్లిచేసుకుంది. గ్రామ పెద్దలు తండ్రి ఇంటికి వచ్చి పంచాయతీ పెట్టారు. కొత్త దంపతులు ఊళ్లోకి అడుగుపెట్టరాదని, ఆమె తండ్రి కుటుంబంతో ఎవరూ మాట్లాడరాదని తీర్పు చెప్పారు. దీంతో ఎవరూ కూడా ఆ కుటుంబంతో మాట్లాడటం లేదు. ఇటీవలే ఆ వ్యక్తి మరణించగా, కడసారి చూడడానికి కూడా కూతురిని గ్రామం గడప తొక్కనివ్వలేదు. వస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని ఆమె తమ్ముణ్ని హెచ్చరించడం విశేషం. ఈ కట్టుబాట్లను ఎక్కువమంది సముదాయంవారు వ్యతిరేకిస్తున్నా పెద్దలు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. -
270 మంది భారతీయులపై ట్రంప్ వేటు
న్యూఢిల్లీ : అక్రమంగా అమెరికాలో నివసిస్తున్న 200 మందికి పైగా భారతీయులను ట్రంప్ ప్రభుత్వం టార్గెట్ చేసింది. వారిపై దేశ బహిష్కరణ వేటు వేసేందుకు సిద్ధమైంది. 270 మందికి పైగా భారతీయులపై దేశ బహిష్కరణ వేటు వేయనున్నామని ట్రంప్ కార్యాలయం చెప్పినట్టు విదేశాంగమంత్రిత్వ శాఖ వెల్లడించింది. అమెరికా బహిష్కరించడానికి ముందే ఆ 271 మంది జాబితాను తమకు అందజేయాలని ట్రంప్ ప్రభుత్వాన్ని భారత్ కోరినట్టు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో పార్లమెంట్ కు తెలిపారు. ఈ వ్యక్తులకు సంబంధించిన జాతీయతను తాము పరిశీలించకంటే ముందే, వారందరూ అక్రమంగా అమెరికాలో ఉన్నట్టు తాము ఎలా విశ్వసిస్తామని ప్రశ్నించినట్టు సుష్మా పేర్కొన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించాలని అమెరికా ప్రభుత్వాన్ని అడిగినట్టు తెలిపారు. అమెరికాలో భారతీయులపై జరుగుతున్న విద్వేషపూరిత దాడులపై కూడా భారత్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తంచేస్తోంది. అయితే బహిష్కరణ జాబితాను తమకు అందించాలనే భారత్ అభ్యర్థనపై ట్రంప్ కార్యాలయం ఇప్పటివరకు ఎలాంటి స్పందన తెలుపలేదు. 2009-114 మధ్యకాలంలో 1,30,000 మంది భారతీయులు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్టు ప్యూ రీసెర్చ్ సెంటర్ తమ సెప్టెంబర్ రిపోర్టులో పేర్కొంది. భారత్ నుంచి, ఆసియా నుంచి వచ్చిన చాలామంది అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్టు డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యురిటీ స్టాటిస్టిక్స్ తెలిపింది. ఇప్పటికే వీసా జారీలో కఠినతరం నిబంధనలను తీసుకొస్తున్న ట్రంప్ ప్రభుత్వం, అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారిపై కూడా ఉక్కుపాదం మోపేందుకు కఠిన చర్యలు ప్రారంభించింది. -
మాల్యా పాస్‌పోర్టు రద్దు
► రుణ ఎగవేత కేసుల నేపథ్యంలో విదేశాంగ శాఖ నిర్ణయం ► డిపోర్టేషన్‌కు చర్యలు వేగవంతం! న్యూఢిల్లీ: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రూ.9,400 కోట్ల రుణ ఎగవేత కేసుల్లో చిక్కుకుని దేశం విడిచిపోయిన విజయ్ మాల్యా పాస్ట్‌పోర్టును ఆదివారం భారత్ రద్దు చేసింది. దీంతో ప్రస్తుతం బ్రిటన్‌లో ఉన్న మాల్యాను వెనక్కిరప్పించే(డిపోర్టేషన్) ప్రక్రియ మొదలుపెట్టేందుకు మార్గం సుగమం కానుంది. ఐడీబీఐ బ్యాంకు రుణ ఎగవేతకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో ఇప్పటికే ముంబై కోర్టు మాల్యాకు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. విచారణ కోసం ఈడీ ముందు హాజరు కావాల్సిన మాల్యా.. దీనికి మూడుసార్లు కూడా నిరాకరించడంతో ఆయన పాస్‌పోర్టును రద్దు చేయాలంటూ ఈడీ విదేశాంగ శాఖను కోరింది. దీంతో ఈ నెల 15న విదేశాంగ శాఖ మాల్యా డిప్లొమాటిక్ పాస్‌పోర్టును సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. పాస్‌పోర్టును ఎందుకు రద్దుచేయకూడదో చెప్పాలంటూ షోకాజ్ నోటీసును కూడా జారీచేసింది. దీనికి మాల్యా ఇచ్చిన సమాధానం ఏమాత్రం సంతృప్తికరంగా లేకపోవడంతో చివరకు ఆయన పాస్‌పోర్టును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాశ్ స్వరూప్ చెప్పారు. రుణ ఎగవేత కేసులు చుట్టుముట్టడంతో మాల్యా మార్చి 2న దేశం విడిచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన బ్రిటన్‌లో ఉన్నట్లు సమాచారం. కాగా, రూ.900 కోట్ల ఐడీబీఐ రుణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో మాల్యాను స్వదేశానికి రప్పించేందుకు(డిపోర్టేషన్) ఈడీ చర్యలు ప్రారంభించింది. ఈడీ విజ్ఞప్తి మేరకు విదేశాంగ శాఖ మాల్యా డిపోర్టేషన్‌కు సంబంధించి న్యాయ నిపుణులతో సంప్రదింపులు కూడా జరుపుతోంది. ఈ ప్రక్రియ ప్రారంభమైతే.. మాల్యాను తమకు అప్పగించాల్సిందిగా భారత్ సర్కారు.. బ్రిటన్ ప్రభుత్వ సహకారాన్ని కోరనుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పాస్‌పోర్టు రద్దు, ముంబై కోర్టు జారీ చేసిన నాన్-బెయిలబుల్ వారెంట్ల ఆధారంగా మాల్యా డిపోర్టేషన్‌ను భారత్ కోరనుందని ఆయా వర్గాలు చెబుతున్నాయి. పాస్‌పోర్టు రద్దవటంతో విదేశాల్లో ఉండటం చట్టవిరుద్ధం అవుతుందని.. తప్పకుండా భారత్‌కు రావాల్సిందేననేది విదేశాంగ శాఖ వర్గాల వాదన. కాగా, ఇప్పుడు మాల్యా తనను బ్రిటన్‌లోనే ఉండేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా బ్రిటిష్ అధికారులను సంప్రదించే అవకాశం ఉంది. అదేవిధంగా పాస్‌పోర్టు రద్దును సవాలు చేస్తూ భారత్‌లోని కోర్టులను కూడా ఆశ్రయించవచ్చని భావిస్తున్నారు. రుణ ఎగవేత, మోసపూరిత కుట్ర, మనీలాండరింగ్ వంటి ఆరోపణలకు సంబంధించి ఈడీతోపాటు సీబీఐ, ఎస్ఎఫ్ఐఓ ఇతరత్రా దర్యాప్తు సంస్థలు కూడా మాల్యాపై విచారణ జరుపుతున్నాయి. యూకే ఓటర్ల జాబితాలో మాల్యా... రుణ ఎగవేత కేసుల కారణంగా బ్రిటన్‌కు పలాయనం చిత్తగించిన మాల్యా... అక్కడి పౌరుడిగా ఓటర్ల లిస్టులో కూడా ఉన్నారు. భారత్ నుంచి తానేమీ పరారైపోలేదని.. తనపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమంటూ వాదిస్తున్న మాల్యా.. హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌లోని టెవిన్ గ్రామంలో ఉన్న మూడంతస్తుల భవంతి(లేడీవాక్)ని ప్రస్తుతం తన అధికారిక అడ్రస్‌గా ధ్రువీకరించినట్లు సండేటైమ్స్ పత్రిక పేర్కొంది. ఉత్తర లండన్ నుంచి గంటన్నర ప్రయాణంతో ఇక్కడికి చేరుకోవచ్చని తెలిపింది. కాగా, ఇక్కడున్న తన చిరునామా సమాచారాన్ని భారతీయ అధికారులకు కూడా తెలియజేసినట్లు మాల్యా చెప్పారని సండేటైమ్స్ వెల్లడించింది. బ్రిటిష్ ఫార్ములా వన్ చాంపియన్ లెవిస్ హామిల్టన్ తండ్రి వద్దనుంచి మాల్యా ఈ భవంతిని 11.5 మిలియన్ పౌండ్లకు కొనుగోలు చేశారు. విదేశీ మూలాలున్న తన కంపెనీ ద్వారా ఆయన ఈ ప్రాపర్టీని దక్కించుకున్నట్లు ఆ పత్రిక పేర్కొంది. -
ఇక్కడ ఆదిల్... అక్కడ బాబాజాన్!
అఫ్రోజ్‌పై అహ్మదాబాద్‌లో కుట్ర కేసు గత నెలలో సౌదీ నుంచి డిపోర్టేషన్ గుజరాత్‌కు తరలించిన డీసీబీ అధికారులు సిటీబ్యూరో: సౌదీ అరేబియా నుంచి డిపోర్టేషన్‌పై వచ్చిన నగరవాసి మహ్మద్ ఆదిల్ అఫ్రోజ్ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నమోదైన కేసులోనూ వాంటెడ్‌గా ఉన్నాడు. బాబాజాన్ పేరుతో అక్కడి యువతకు పాకిస్థాన్‌లో ఉగ్రవాద శిక్షణ ఇప్పించాడనేది ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలోనే అఫ్రోజ్‌ను అహ్మదాబాద్ డీసీబీ అధికారులు ప్రిజనర్స్ ట్రాన్సిట్ (పీటీ) వారెంట్‌పై తీసుకువెళ్లారు. న్యాయస్థానం అనుమతి మేరకు తదుపరి విచారణ నిమిత్తం గురువారం తమ కస్టడీలోకి తీసుకున్నారు. నగరంలోని సైదాబాద్ ప్రాంతానికి చెందిన ఆదిల్ అఫ్రోజ్ సీసీఎస్ ఆధీనంలోని సిట్‌లో 2003లో నమోదైన కేసులో వాంటెడ్‌గా ఉండి దాదాపు 13 ఏళ్లు పాటు సౌదీ అరేబియాలో తలదాచుకుంటున్నాడు. సుదీర్ఘ ప్రయత్నాల తర్వాత ఇతడి ఆచూకీ కనిపెట్టిన నిఘా వర్గాలు సంబంధిత ఏజెన్సీలకు ఆధారాలను సమర్పించడం ద్వారా గత నెల 22న డిపోర్టేషన్‌పై తీసుకువచ్చాయి. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్‌పాండ్య 2003 మార్చ్‌లోహత్యకు గురయ్యారు. ఈ కేసు దర్యాప్తు చేసిన డీసీబీ అధికారులు గుజరాత్లో పేలుళ్లకు పన్నిన ఓ కుట్రను ఛేదించారు. గుజరాత్, తెలంగాణలకు చెందిన వ్యక్తులు పథకం ప్రకారం కొంత మందిని పాకిస్థాన్‌కు పంపించి ఉగ్రవాద శిక్షణ ఇప్పించారని, భారీ విధ్వంసానికి కుట్ర పన్నారన్న ఆరోపణలతో డీసీబీ అధికారులు ఇప్పటి వరకు 62 మందిని అరెస్టు చేయగా... 22 మంది దోషులుగా తేలారు. మరో 22 మందిని అహ్మదాబాద్‌లోని పోటా న్యాయస్థానం సరైన ఆధారాలు లేనికారణంగా నిర్దోషులుగా విడిచిపెట్టింది. 2003లోనే నమోదైన ఈ కేసులో ఆదిల్ వాంటెడ్‌గా ఉన్నాడు. అహ్మదాబాద్ యువతను బాబాజాన్ పేరుతో ఆకర్షించి పాకిస్థాన్‌కు పంపి ఉగ్రవాద శిక్షణ ఇప్పించాడని డీసీబీ అధికారులు ఆరోపించారు. అఫ్రోజ్‌ను డిపోర్ట్ చేసిన విషయం తెలుసుకున్న అహ్మదాబాద్ పోలీసులు గత వారం పీటీ వారెంట్‌పై గుజరాత్ తీసుకువెళ్లారు. పోటా కోర్టు రెండు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించడంతో తదుపరి విచారణ నిమిత్తం గురువారం సబర్మతి జైలు నుంచి తమ కస్టడీలోకి తీసుకున్నారు. -
సమస్యను అమెరికా దృష్టికి తీసుకెళ్లాం
తెలుగు విద్యార్థులను అమెరికా నుంచి తిప్పి పంపడం, ఎయిరిండియా అధికారులు అనుమతించకపోవడం లాంటి సమస్యలను అమెరికా దృష్టికి తీసుకెళ్లినట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. ఈ సమస్యపై పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు, టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన రావు వెళ్లి సుష్మా స్వరాజ్‌ను కలిశారు. అప్పుడు ఆమె ఈ విషయాన్ని ఇప్పటికే అమెరికా దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. విద్యార్థులకు జరిగిన అన్యాయంపై ఆమె ప్రస్తావించారు. ఇక ఈ అంశంపై కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు మీడియాతో మాట్లాడారు. మన పిల్లలు అక్కడ చదువుకోడానికి వెళ్లారని, వారికి సౌకర్యాలు ఉండాలని ఆయన అన్నారు. పిల్లలను అనుమతించబోమని అమెరికా అధికారులు సమాచారం ఇచ్చారని తెలిపారు. (అయితే, లిఖితపూర్వక సమాచారమా అని, ఎవరిచ్చారని అడిగినప్పుడు మాత్రం ఆయన సమాధానం దాటవేశారు) వెళ్లిన కొంతమంది పిల్లలను ఇప్పటికే తిప్పి పంపేశారని, విద్యార్థులను అనుమతించాలా లేదా అన్నది అక్కడి ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుందని అశోక్ గజపతి రాజు చెప్పారు. -
భారత్‌కు డాన్ ఛోటా రాజన్
-
ఛోటా రాజన్ వచ్చేది నేడు ఉదయమే!
నేడు ఉదయం ఢిల్లీకి... బాలి/న్యూఢిల్లీ: మాఫియా డాన్ చోటా రాజన్‌ను సీబీఐ, ఢిల్లీ, ముంబై పోలీసు అధికారులతో కూడిన బృందం భారత్‌కు తీసుకువస్తోంది. రాజన్‌తో ఇండోనేసియాలోని బాలి నుంచి గురువారం(భారత కాలమానం ప్రకారం) రాత్రి 7.45 గంటలకు బయల్దేరిన ప్రత్యేక విమానం శుక్రవారం ఉదయం ఢిల్లీ చేరుకోనుంది. దగ్గర్లోని అగ్ని పర్వతం బద్ధలై, పొగ, బూడిద కమ్ముకోవడంతో బాలి విమానాశ్రయాన్ని మూసేయడంతో రాజన్ తరలింపు ఆలస్యమైంది. పోలీసుల వేట తీవ్రం కావడంతో 1988లో రాజన్ దుబాయి పారిపోయాడు. అక్టోబర్ 25న ఆస్ట్రేలియా నుంచి బాలికి వచ్చిన రాజన్‌ను ఇండోనేసియా పోలీసులు విమానాశ్రయంలోనే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. భారత్‌లో రాజన్‌పై హత్య, స్మగ్లింగ్, బలవంతపు వసూళ్లు తదితర 75కు పైగా కేసులున్నాయి. వాటిలో దాదాపు 70 ముంబైలోనే నమోదై ఉన్నాయి. టాడా, ఉగ్రవాద నిరోధక చట్టం, మోకా తదితర కఠిన చట్టాల కింద ఆయనపై కేసులున్నాయి. కాగా, రాజన్‌పై ఉన్న అన్ని కేసులను సీబీఐకి అప్పగిస్తున్నట్లు గురువారం మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. అంతర్జాతీయ నేరాల విచారణలో సీబీఐకి ఉన్న నైపుణ్యాన్ని, అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర అదనపు ముఖ్య కార్యదర్శి కేపీ బక్షి తెలిపారు. రాజన్‌కు, కేంద్ర భద్రతాసంస్థలకు మధ్య కుదిరిన ఒప్పందం మేరకే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆ ఒప్పందంలో భాగంగా.. ముంబైలో తనపై ఉన్న కేసుల విచారణను ముంబై పోలీసుల నుంచి తప్పించాలని, తనను మహారాష్ట్ర జైళ్లో పెట్టకూడదని రాజన్ షరతులు విధించినట్లు తెలిపాయి. అయితే, రాజన్‌ను త్వరలో ముంబైకి తీసుకువస్తామని ముంబై పోలీస్ కమిషనర్ జావేద్ అహ్మద్ స్పష్టం చేయడం విశేషం. రాజన్ హస్తం ఉందని భావిస్తున్న జర్నలిస్ట్ జ్యోతిర్మయి డే హత్యకు సంబంధించిన కేసుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామన్నారు. తప్పుడు ధ్రువపత్రాలతో ఆస్ట్రేలియాలోని భారతీయ దౌత్య కార్యాలయం నుంచి రాజన్ పొందిన పాస్‌పోర్ట్‌ను భారత్ రద్దు చేసింది. దీనిపై విచారణకు ఆదేశించింది. తప్పుడు ధ్రువపత్రాలతో పాస్‌పోర్ట్ పొందిన ఘటనలు సాధారణమేనని, అయితే, తమ దృష్టికి వచ్చిన వాటిపై చర్యలు తీసుకుంటున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ పేర్కొన్నారు. ఒకప్పుడు అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు ప్రధాన అనుచరుడైన ఛోటా రాజన్.. 1993 ముంబై పేలుళ్లను వ్యతిరేకించి ‘డీ’ గ్యాంగ్‌కు దూరమయ్యాడు. అనంతరం దావూద్ ఇబ్రహీంకు ప్రధాన శత్రువుగా మారాడు. -
'అతను మాకు కావాలి.. మీరు బహిష్కరించండి'
న్యూఢిల్లీ: దేశంలో సంచనలం సృష్టించిన లలిత్ గేట్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు లలిత్ మోదీని వెంటనే బ్రిటన్ నుంచి బహిష్కరించాలని నాటి ఆర్థిక మంత్రి పీ చిదంబరం బ్రిటన్ కు లేఖ రాసినట్లు తెలిసింది. సమాచారం హక్కు చట్టం ద్వారా ఓ వ్యక్తి ఈ విషయంపై వివరణ కోరగా ఈ వివరాలు తెలిశాయి. భారీ కుంభకోణం అనంతరం 2010 నుంచి లలిత్ మోదీ బ్రిటన్ లోనే ఉంటున్న విషయం తెలిసిందే. అయితే, ఆయనను వెనక్కి రప్పించేందుకునాటి కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగానే ప్రయత్నించిందని చిదంబరం లేఖ ద్వారా తెలుస్తోంది. ఆ లేఖలో.. తప్పు చేసిన అపరాధి అయిన మోదీని ఇక ఎక్కువ రోజులు బ్రిటన్‌లో ఎక్కువ రోజులు ఉండనివ్వాలని అనుకోవడం లేదని, అతడిని తిరిగి వెనక్కి రప్పించే కార్యకలాపాలు ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉన్నందున వెంటనే బ్రిటన్ నుంచి బహిష్కరించాలని చిదంబరం విజ్ఞప్తి చేశారు. ఆయనపై ఉన్న తీవ్రమైన నేరాల కేసుల విచారణను భారత్ లోని కీలక విచారణ సంస్థలు పనిచేస్తున్నాయని కూడా అందులో ప్రస్తావించారు. ఆయన పాస్ పోర్టును చట్ట వ్యతిరేకమైనదిగా తాము గుర్తించినందున ఎక్కువకాలంపాటు ట్రావెలింగ్ డాక్యుమెంట్స్ పనిచేసే అవకాశం ఉండదని, అయినా అతడు బ్రిటన్ లో ఉంటున్నాడని, వెంటనే అక్కడి నుంచి బహిష్కరించాలని విన్నవించారు. ఇలాంటి తప్పిదాల పేరుతో గతంలో 3000మంది ఇండియన్స్ ను బ్రిటన్ నుంచి బహిష్కరించిన విషయం కూడా చిదంబరం గుర్తు చేశారు. దీనికి బ్రిటన్ స్పందించి తిరిగి బదులు సమాధానం కూడా ఇచ్చింది. తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. అయినా, ఇప్పటివరకు బ్రిటన్ ఈ విషయంలో చర్యలు తీసుకోకపోవడం వెనుక మతలబు ఏమిటో తెలియాలి.