అమృత్‌సర్:అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్యల్లో భాగంగా అమెరికా పంపించిన ప్రత్యేక విమానంలో భారత్‌కు తిరిగి వచ్చిన వలసదారుల్లో ఎవరెవరున్నారన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బుధవారం(ఫిబ్రవరి5) మధ్యాహ్నం 1.45గంటలకు అమృత్‌సర్‌లోని గురురామ్‌దాస్‌జీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో వలసదారులతో వచ్చిన అమెరికా విమానం ల్యాండ్ అయిన విషయం తెలిసిందే.
విమానంలో మొత్తం 205 మంది భారతీయలను అమెరికా నుంచి పంపించి వేశారని ప్రచారం జరిగింది. అయితే విమానంలో 104 మంది మంది భారతీయులే ఉన్నారు. 45 మంది దాకా అమెరికా అధికారులు కాగా, 11 మంది విమాన సిబ్బంది ఉన్నారు. అయితే 104మంది భారతీయుల్లో మొదటి స్థానంలో గుజరాత్,హర్యానాకు చెందిన వారు ఎక్కువగా ఉండగా తర్వాతి స్థానంలో పంజాబ్‌కు చెందిన వారు ఉన్నారు.
విమానంలో వచ్చిన వారిలో 4 ఏళ్ల వయసున్న చిన్నారి కూడా ఉండడం గమనార్హం. అమెరికా నుంచి అందరు భారతీయులకు స్వాగతం పలికామని, మన దేశానికి చెందిన వారిని ఇలా పంపించి వేయడం దురదృష్టకరమని పంజాబ్ డీజీపీ వ్యాఖ్యానించారు.
అమెరికాలో భారత అక్రమ వలసదారుల ఏడున్నర లక్షల మంది దాకా ఉన్నట్లు ఫ్యూ రీసెర్చ్ సెంటర్ అంచనా. ఈ లెక్కన మెక్సికో, ఎల్ సాల్వడోర్ తర్వాత అత్యధికంగా అలా ఉంటోంది భారతీయులే. వీళ్లందరినీ వెనక్కి పంపించే ప్రక్రియ కొనసాగుతుందని అక్కడి అధికారులు అంటున్నారు.
ఈ క్రమంలో సుమారు 18 వేల మంది భారతీయులతో కూడిన జాబితాను అక్కడి ఇమ్మిగ్రేషన్ & కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిద్ధం చేసినట్లు సమాచారం. త్వరలో భారత ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. ఆ సమయంలో ట్రంప్‌తో ఆయన ఈ అంశంపైనా చర్చించే అవకాశాలున్నాయి
Comments
Please login to add a commentAdd a comment