వాషింగ్టన్:డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులను ప్రత్యేక విమానాల్లో వారి దేశాలకు తిప్పి పంపుతున్నారు. ఈ విమాన ప్రయాణాల కోసం అమెరికా భారీ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.పౌర విమానాల్లో కాకుండా వలసదారులను అమెరికా ప్రత్యేక సైనిక విమానాల్లో తరలిస్తుండటంతోనే ఎక్కువగా ఖర్చవుతోందన్న వాదన వినిపిస్తోంది.
తాజాగా 205 మంది భారతీయులతో కూడిన మిలిటరీ విమానం బయల్దేరింది. ఈ విమాన ఖర్చు గంటకు కొన్ని వేల డాలర్లని అమెరికా అధికారులు చెబుతున్నారు.వలసదారులను వెనక్కి పంపే కేంద్ర ప్రభుత్వ వర్గాల సమన్వయం కూడా ఉన్నట్లు సమాచారం. గతంలోనూ వివిధ దేశాలకు చెందిన అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపిన సంగతి తెలిసిందే.
అయితే భారత్ విషయంలో మాత్రం అమెరికాకు ఇదే తొలి అడుగు.వచ్చే వారం భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపే అంశంపైనా చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment