
యువతి కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు
జయపురం (ఒడిశా): వేరే కులం యువకుడిని ప్రేమించిన యువతి కుటుంబాన్ని గ్రామం నుంచి బహిష్కరించిన సంఘటన బొయిపరిగుడ సమితి తాలూరు గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. దురువ కులానికి చెందిన 22ఏళ్ల యువతి, మఝిగుడ గ్రామానికి చెందిన హరిజన యువకుడిని ప్రేమించింది. తల్లిదండ్రులకు తెలపకుండా అతనితో వెళ్లిపోయింది. ఈ విషయం తెలిసిన దురువ కులస్తులు సమావేశమై ఆమె కుటుంభాన్ని జాతి నుండి వెలివేశారు.
యువతిని వెతికి పట్టుకు రావాలని గ్రామ పెద్దలు తెలడంతో తల్లి దండ్రులతో బంధువులు గాలింపు చేపట్టారు. బొయిపరిగుడ పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన బాధిత కుటుంబ సభ్యులు.. తమ కుమార్తెను వెతుకుతున్నామని, తమను గ్రామంలోకి ఆనుమతించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. గ్రామస్తులతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.
చదవండి: (Jayamma Panchayathi: అటవీ ప్రాంతం నుంచి టాలీవుడ్ హీరోగా..)
Comments
Please login to add a commentAdd a comment