Inter Caste
-
ప్రేమ.. పరువు.. ఆత్మహత్య.. హత్య!
ప్రేమ.. త్యాగం నేర్పుతుంది అంటారు. కానీ.. యువతీ, యువకుల మధ్య చిగురించిన ప్రేమ బలికోరుతోంది. సామాజిక సమీకరణాలు కుదరక కులాల కుంపటి రాజుకుంటోంది. గ్రామాల్లో ఈ పోకడ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాము కనీ, పెంచిన పిల్లలు తమకు దక్కకుండా పోతారన్న భయం, పరువు పోతుందన్న ఆందోళనలో తల్లిదండ్రులు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. .. ఇవి హత్యల వరకు దారితీస్తున్నాయి. మరోపక్క తమ ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించన్న భయంతో ప్రేమికులు ప్రాణత్యాగాలు చేసుకుంటున్నారు. దురదృష్టవశాత్తూ ఉమ్మడి జిల్లాలో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుండగా.. సామాజిక అంతరాలకు అద్ధం పడుతున్నా యి. వేర్వేరు కులాల యువతీ, యువకులు ప్రేమించుకుంటే వారిపై దాడులు సహజమే అయినా.. అది చంపుకునేదాకా వెళ్తుండడమే ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు ఉత్తరాదికే పరిమితమైన ఈ పోకడ ఉమ్మడిజిల్లాకు పాకడం గమనార్హం.పంతాలతో కుటుంబాలు నాశనంసామాజిక కట్టుబాట్లను ఛేదించలేక, అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లల ప్రేమను అంగీకరించలేక పెద్దలు తీసుకుంటున్న తీవ్ర నిర్ణయాలు ఆయా కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. కుటుంబ పెద్ద జైలుకు వెళ్లడంతో ఆర్థికంగా చితికిపోతున్నా యి. వాస్తవానికి ఏ సమాజంలో ఏ పరువు కోసం హత్యలు చేస్తున్నారో.. తరువాత అదే సమాజం ఆయా కుటుంబాలకు అండగా నిలబడని విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో యుక్తవయసులో ప్రేమే సర్వస్వం అంటూ జీవితంలో స్థిరపడక ముందే ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకొని ప్రాణాలు తీసుకుని, తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగుల్చుతున్నారు.ఉమ్మడి జిల్లాలోని పలు ఘటనలు⇒ మార్చి 27న పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటకు చెందిన సాయికుమార్‌ను అదే గ్రామానికి చెందిన ముత్యం సద య్య తన కుమార్తెను ప్రేమిస్తున్నాడని గొడ్డలితో నరికి చంపడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కేవలం కులాలు వేరన్న కా రణమే సాయిని చంపేలా చేసింది.⇒ ఇల్లందకుంట యువకుడు, నిర్మల్ జిల్లాకు చెందిన యువతి ప్రేమించుకున్నారు. పెద్దల ఆమోదం ఉండదన్న ఆందోళనతో మార్చి 17న జమ్మికుంట పరిధిలోని రైల్వేస్టేషన్లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.⇒ మార్చి 6న చొప్పదండికి చెందిన ప్రేమికులు ఇంట్లోవారు తమ ప్రేమను అంగీకరించరన్న భయంతో కరీంనగర్లో స్నేహితుడి ఇంట్లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.⇒ 2024 ఏప్రిల్‌లో తాను అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు కులాంతర వివాహం చేసుకుని వెళ్లిపోయిందన్న బాధతో సిరిసిల్ల జిల్లాలో ఓ తండ్రి తన కుమార్తెకు పిండ ప్రదానం చేశాడు. తమ ఆశలను అడియాశలు చేసిన కూతురు మరణించిందని ఫ్లెక్సీ పెట్టించడం సంచలనంగా మారింది.⇒ 2023 నవంబరులో సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలానికి చెందిన ప్రేమికులు విషం తాగి ప్రాణాలు తీసుకున్నారు.⇒ 2023 ఆగస్టులో కోరుట్ల పట్టణంలో తన ప్రియుడితో పరారయ్యే క్రమంలో ప్రియురాలు తన అక్కనే హత్య చేసి పరారవడం కలకలం రేపింది.⇒ 2021 ఆగస్టులో మంథనికి చెందిన ఓ ప్రేమజంటపై యువతి తండ్రి హేయంగా దాడి చేశాడు. ఈ దాడిలో ప్రేమికులు తృటిలో చావు నుంచి తప్పించుకున్నారు. ⇒ 2017లో మంథనిలో మధుకర్ అనే దళిత యువకుడి అనుమానాస్పద మరణం కూడా పరువుహత్యగా ప్రాచుర్యం పొందింది. అనుమానాస్పద మరణం అని పోలీసులు, ప్రి యురాలి బంధువులే చంపారని మధుకర్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. దళితసంఘాలు ధర్నా చేయడంతో మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించారు. అప్పట్లో ఇది జాతీయస్థాయిలో చర్చానీయాంశంగా మారింది. ఈ కేసు ఇంకా తేలాల్సి ఉంది.⇒ 2016లో తిమ్మాపూర్‌లోని ఓ గుడిలో ప్రేమ వివాహం చేసుకునేందుకు పీటల మీద కూర్చున్న జంటపై యువతి బంధువులు దాడి చేశారు. పెళ్లికూతురు కళ్లముందే పెళ్లి కొడుకును విచక్షణా రహితంగా పొడిచి చంపడం కలకలం రేపింది.ఆలోచన తీరు మారాలి కులం అహంకారంతో జరిగే దారుణాలతో ప్రాణాలుపోతున్నాయి. టెక్నాలజీలో ముందున్న మనం ఆధునికంగా ఆలోచించలేక పోతున్నాం. ఉన్నత చదువులు చదువుకునే..యువత కూడా ప్రేమించుకోవడం.. కాదన్నారని ప్రాణాలు తీసుకోవడం తగదు. ఈ ఘటనలకు కేవలం ఆలోచన తీరే కారణం. తీరుమారితే విపరీత ధోరణులు మారుతాయి. – ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత,సోషియాలజీ విభాగం అధిపతి, శాతవాహన వర్సిటీకుల వివక్షపై అవగాహన కల్పించాలి సమాజంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నా కుల,మత భేదాలు గ్రామాల్లో అలాగే కొనసాగుతున్నాయి. కులాల మధ్య వైరుధ్యాలు పెరిగేలా ప్రభుత్వాలు కులాల ఆధారంగా ప్రవేశపెడుతున్న పథకాలు ప్రజల మధ్య దూరాలను పెంచుతున్నాయి. పిల్లల ప్రేమ కన్నా పరువు, పట్టింపులే ఎక్కువ అనే భావన తొలిగేలా, కులవివక్షపై ప్రజలకు అవగాహన కలిగించేలా ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది.– కల్లెపల్లి ఆశోక్, కేవీపీఎస్ :::సాక్షిప్రతినిధి, కరీంనగర్ -
కర్నాటకలో పరువు హత్య.. దళితుడిని ప్రేమించిందని 17 ఏళ్ల కూతురిని..
బెంగళూరు: పరువు ప్రతిష్ఠ మాటున మరో అమ్మాయి హత్యకు గురైంది. దళిత యువకుడిని ప్రేమించిందనే కోపంతో కన్న కూతురిని కడతేర్చారు తల్లిదండ్రులు! ఈ దారుణం కర్ణాటకలోని పెరియపట్న తాలూకు కగ్గుండి గ్రామంలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెళ్లహళ్లి గ్రామానికి చెందిన దళిత యువకుడిని సమీప గ్రామం కగ్గుండికి చెందిన అగ్రవర్ణానికి చెందిన 17 ఏళ్ల అమ్మాయి ప్రేమించింది. ప్రేమవ్యవహారం తెల్సి అమ్మాయి తల్లిదండ్రులు కూతురుని తీవ్రంగా మందలించారు. దీంతో ఈ వ్యవహారం పోలీసుల వద్దకు చేరింది. తల్లిదండ్రులతో కలిసి ఉండబోనని అమ్మాయి తెగేసి చెప్పడంతో పెరియపట్న పోలీసుల సూచన మేరకు అమ్మాయిని రెండు నెలల క్రితం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వసతిగృహంలో ఉంచామని సీడబ్ల్యూసీ చైర్పర్సన్ హెచ్‌టీ కమల చెప్పారు. గొడవలు లేవని, ఇక ఇంటికి తీసుకెళ్తామని తల్లిదండ్రులు సర్ది చెప్పడంతో రెండు వారాల క్రితం అమ్మాయిని ఇంటికి పంపించేశారు. ఇంటికెళ్లిన కొద్దిరోజుల్లోనే హత్యకు గురవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. తల్లిదండ్రులే ఆమెను చంపేశారని, పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ ఇంకా రావాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. అమ్మాయి మృతదేహాన్ని తల్లిదండ్రులే బైక్ మీద ఊరి అవతలికి తీసుకెళ్లి పడేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ వచ్చాకే హత్య పూర్తి వివరాలు చెప్పగలమని ఎస్పీ చేతన్ అన్నారు. తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్‌చేశారు. చదవండి: Hyderabad: హైదరాబాద్‌లో మరో దారుణం -
ప్రేమించి పెళ్లాడింది.. కానీ ఆరు నెలలకే..
సాక్షి, బనశంకరి(కర్ణాటక): ఆరునెలల క్రితం ప్రేమించి పెళ్లిచేసుకున్న యువతి విగతజీవిగా మారింది. ఈ ఘటన ఆనేకల్‌లో చోటుచేసుకుంది. జిగణి సమీపంలోని రాజాపుర నివాసి యశవంత్, బెంగళూరు టీచర్స్‌కాలనీ కి చెందిన రాణి (28) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. యశవంత్ ప్రభుత్వ ఉద్యోగి కాగా ఇతడికి ఇది రెండవ పెళ్లి. బుధవారం రాణి భర్త ఇంట్లో ఉరివేసుకున్న స్థితిలో శవమైంది. భర్త, కుటుంబసభ్యులు కనీసం పట్టించుకోలేదు. కులాంతర పెళ్లి కావడంతో భర్త, అత్తమామలు చంపి ఉంటారని రాణి కుటుంబసభ్యులు ఆరోపించారు. జిగణి పోలీసులు కేసు నమోదు చేశారు. -
యువతి ప్రేమించిన వాడితో వెళ్లిపోతే.. కుటుంబాన్ని వెలివేశారు
జయపురం (ఒడిశా): వేరే కులం యువకుడిని ప్రేమించిన యువతి కుటుంబాన్ని గ్రామం నుంచి బహిష్కరించిన సంఘటన బొయిపరిగుడ సమితి తాలూరు గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. దురువ కులానికి చెందిన 22ఏళ్ల యువతి, మఝిగుడ గ్రామానికి చెందిన హరిజన యువకుడిని ప్రేమించింది. తల్లిదండ్రులకు తెలపకుండా అతనితో వెళ్లిపోయింది. ఈ విషయం తెలిసిన దురువ కులస్తులు సమావేశమై ఆమె కుటుంభాన్ని జాతి నుండి వెలివేశారు. యువతిని వెతికి పట్టుకు రావాలని గ్రామ పెద్దలు తెలడంతో తల్లి దండ్రులతో బంధువులు గాలింపు చేపట్టారు. బొయిపరిగుడ పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన బాధిత కుటుంబ సభ్యులు.. తమ కుమార్తెను వెతుకుతున్నామని, తమను గ్రామంలోకి ఆనుమతించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. గ్రామస్తులతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. చదవండి: (Jayamma Panchayathi: అటవీ ప్రాంతం నుంచి టాలీవుడ్ హీరోగా..) -
యువతిని ఇంట్లో నుంచి లాక్కెళ్లి కిడ్నాప్.. ట్విస్ట్ ఏంటంటే..
సాక్షి, ధర్మపురి(కరీంనగర్): యువతిని ఇంట్లో నుంచి లాక్కెళ్లి, కిడ్నాప్‌కు యత్నించిన ఘటన ధర్మపురిలో కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. ధర్మపురికి చెందిన ఓ యువతి(23)కి వెల్గటూర్ మండలంలోని కాంపెల్లికి చెందిన ఓ యువకుడితో సోమవారం పెళ్లి నిశ్చయమైంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టాయి. ఇది చూసిన వెంటనే సారంగాపూర్ మండలంలోని రేచపెల్లికి చెందిన మంగళారపు రాజేందర్ అనే యువకుడు తన ముగ్గురు స్నేహితులతో కలిసి మంగళవారం ఆ యువతి ఇంటికి వెళ్లాడు. లోపల ఉన్న ఆమెను లాక్కొచ్చి, కారులో ఎక్కించారు. జాతీయ రహదారి పక్కనున్న దుర్గమ్మ కాలనీ నుంచి కమలాపూర్ రూట్లో తీసుకెళ్తుండగా మార్గమధ్యలో కారు ఆగిపోయింది. బాధితురాలు రోదిస్తూ కేకలు వేయడంతో రాజేందర్ కోపోద్రిక్తుడై కత్తితో ఆమెను గాయపరిచాడు. తీవ్ర రక్తస్రావం జరగగా యువతి అరుపులు విన్న చుట్టుపక్కల వాళ్లు, సమయానికి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దీంతో ఆ నలుగురు పారిపోయారు. పోలీసులు కారును ఠాణాకు తరలించారు. యువతితోపాటు ఆమె తల్లిదండ్రులు పోలీస్‌స్టేషను చేరుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి, గాలింపు చర్యలు చేపడుతున్నట్లు సీఐ కోటేశ్వర్ తెలిపారు. ఇద్దరూ డిగ్రీ క్లాస్మేట్స్.. రాజేందర్, బాధిత యువతి డిగ్రీ క్లాస్మేట్స్. ఈ క్రమంలో రెండేళ్ల కిందట పెళ్లి చేసుకుంటానని రాజేందర్ ఆమె తల్లిదండ్రులతో చెప్పినట్లు తెలిసింది. కులాలు వేరు కావడంతో వారు నిరాకరించారని సమాచారం. రెండు రోజుల కిందట కాంపెల్లికి చెందిన ఓ యువకుడితో యువతికి పెళ్లి నిశ్చయించారు. ఇది తెలుసుకున్న రాజేందర్ తన స్నేహితులతో కలిసి ఆమెను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించి, విఫలమయ్యాడు. చదవండి: పక్కింటి వారి వేధింపులు.. ఆటోడ్రైవర్ ఆత్మహత్య -
మాకు రక్షణ కల్పించండి
-
సేమ్ సీన్ రిపీట్ అయ్యిందని...
లక్నో : ఉత్తర ప్రదేశ్‌లో షాకింగ్ ఘటన. వేరే కులం యువతిని ప్రేమించాడన్న కారణంతో ఓ యువకుడి కుటుంబాన్ని దారుణంగా అవమానించారు. బిజ్నోర్ జిల్లాలోని ఇస్లామాబాద్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొంతకాలం క్రితం గ్రామానికి చెందిన ఓ యువకుడు.. వేరే కులానికి చెందిన యువతిని ప్రేమించాడు. విషయం పెద్దలకు తెలియటంతో ఇద్దరినీ పిలిపించి మందలించారు. దీంతో నాలుగు నెలల ఆ జంట ఊరి నుంచి పారిపోయింది. ఇక ఇప్పుడు అతని తమ్ముడి వంతు వచ్చింది. అతను కూడా ఇదే తరహాలో వేరే కులానికి చెందిన యువతిని ప్రేమించాడు. దీంతో ఇద్దరు యువతుల(గతంలో లేవదీసుకున్నపోయిన అమ్మాయి తాలూకు కూడా) కుటుంబాలు.. ఆ కుటుంబాన్ని రోడ్డుకీడ్చాయి. మొత్తం కుటుంబ సభ్యులను ఇంట్లోంచి ఇడ్చుకుంటూ రోడ్డు మీదకు తీసుకొచ్చాయి. వీరికి జత కలిసిన గ్రామస్తులు ఆ కుటుంబం మెడలో చెప్పులు వేయించి చితకబాదటం చేశారు. బాధితుల్లో ఓ బాలుడు కూడా ఉండటం విశేషం. కాగా, ఘటనపై ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
నా కన్నా రెండు నెలలు పెద్దది...
జీవన గమనం నేను బీటెక్ ఫైనలియర్ చదువున్నాను. నా జూనియర్ మీద నాకు చాలా ఇష్టం పెరిగింది. తనని ప్రేమిస్తున్నానేమో అనిపిస్తోంది. కానీ తనకి చెప్పలేదు. ఎందుకంటే చదువులో జూనియర్ అయినా ఆమె నాకంటే రెండు నెలలు పెద్దది. పైగా వేరే క్యాస్ట్. అయితే మా రెండు కుటుంబాలు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవ్వడం వల్ల నాకు వాళ్ల ఫ్యామిలీతో కూడా మంచి అనుబంధం ఉంది. నా ప్రేమ విషయం తెలిస్తే ఆ అనుబంధం పాడవుతుందేమోనని భయంగా ఉంది. నిజానికి నాకు లవ్ అన్నా, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అన్నా పెద్దగా ఇష్టం లేదు. వాటి వల్ల పెద్దల్ని బాధపెట్టినట్టు అవుతుందని భయం. కానీ అనుకోకుండా తనపైన ప్రేమ పెరిగింది. ఇప్పుడు నేనేం చేయాలి? తనతో నా ప్రేమని చెప్పాలా? లేదంటే మా కుటుంబాల స్నేహం కోసం మనసు మార్చుకోవాలా? సలహా ఇవ్వండి. - సందీప్, ఊరు రాయలేదు రెండు కుటుంబాలు విడిపోకుండా ఉండటం కోసం మీ త్యాగం... ఒక మంచి బాక్సాఫీస్ చిత్రానికి సరిపోయేలా ఉంది. ‘అక్కడ లేని నల్ల పిల్లిని చీకట్లో వెతకటం’ అన్న సామెత బహుశా ఇక్కడి నుంచే పుట్టి ఉంటుంది. అంచెలంచెలుగా మీ సమస్యను విశ్లేషించుకుంటూ వెళ్దాం. ఒకవైపు ప్రేమ అంటే ఇష్టం లేదని అంటూనే, మరోైవైపు ’ప్రేమిస్తున్నానేమో అ..ని..పి..స్తుం..ది’ అన్నారు. ముందు మీది ప్రేమా? ఆకర్షణా? అన్న విషయం తేల్చుకోండి. వ్యక్తిని ప్రేమించటం ప్రేమ. ప్రేమ భావాన్ని ప్రేమించటం ఆకర్షణ. ప్రేమలో ఆలోచన, అవగాహన, స్పష్టత, భద్రతభావం ఉంటాయి. ఆకర్షణలో ఆవేశం, ఉద్వేగం, అస్పష్టత, అయోమయం ఉంటాయి. ప్రేమ అనుభూతి కోసం, ఆకర్షణ అనుభవం కోసం..! భవిష్యత్ తెలియటం ప్రేమ. కాలం తెలియకపోవటం ఆకర్షణ. ప్రేమలో రోజు రోజుకి ఎదుటి వారి గురించి ఆలోచన, నమ్మకం పెరుగుతుంది. ఆకర్షణలో రోజురోజుకీ అనుమానం పెరుగుతుంది. మిమ్మల్ని మీరు ఈ విధంగా విశ్లేషించుకున్న తర్వాత, ఆ అమ్మాయిని తన అభిప్రాయం అడగండి. ఆమె, ‘‘అసలు నాకా భావమే లేదు. నువ్వు నా కన్నా చిన్నవాడివి’’ అంటే అసలు గొడవే లేదు. మీకు కూడా వర్ణాంతర వివాహాలు ఇష్టం లేవు కదా. ఒకవేళ ఆ అమ్మాయి యస్సంటే, ఇరువైపుల పెద్దల్ని సంప్రదించండి. వారు కూడా యస్ అంటే సమస్యే లేదు. కాదంటే, పెద్దవారిని ఎదిరించి వెళ్లిపోయి వివాహం చేసుకునేటంత తీవ్రమైనదా, పెద్దల్ని బాధ పెట్టి చేసుకోవడం అవసరమా (ఈ విషయం కూడా మీరే రాశారు) అనేది ఆలోచించుకోండి. మనసులోని అస్పష్టతతో బాధ పడటం కంటే, ఏదో ఒకటి తేల్చేసుకోవటమే మంచిది కదా. పరీక్షలు దగ్గర్లోనే ఉన్నాయి కాబట్టి ముందు చదువు మీద ఏకాగ్రత నిలపండి. పరీక్షలు ఫెయిలయ్యే కుర్రాళ్లని, కాస్త ముందు చూపున్న ఏ అమ్మాయీ ప్రేమించదు. నా వయసు 21. ఎంసీఏ చేస్తున్నాను. నిజానికి నాకు మీడియా రంగంలోకి వెళ్లాలని ఉంది. కానీ కుటుంబ సమస్యల కారణంగా, త్వరగా సెటిలైతే మంచిదని అందరూ బలవంతపెట్టడంతో ఎంసీఏలో చేరాను. కానీ చదువు ఎక్కడం లేదు. ఆసక్తి కలగడం లేదు. మానేయాలని ఉంది. కానీ మరో మంచి రంగంలో సెటిలైతేనే.. ఇది మానేసినా మావాళ్లు ఏమీ అనరు. పీజీ చేస్తే మీడియాలో సెటిలయ్యే మార్గం ఉంటే చెప్పండి. - రాజేశ్, విజయనగరం ఇష్టం లేని చదువుకన్నా నరకం ఇంకొకటి ఉండదు. కానీ మీ వాళ్లు చెప్పింది కూడా నిజమే కదా. మీడియా రంగంలో ఒక స్థాయి వచ్చేవరకూ ఆర్థికంగా నిలదొక్కుకోవటం కష్టం. అన్నిటికన్నా ముందు కొన్ని విషయాల్లో ఒక కచ్చితమైన నిర్ధారణకు రండి. 1. మీరు ఏ మీడియాలో స్థిరపడాలనుకుంటున్నారు? పత్రికా రంగమా? టీవీ ఛానెల్సా? 2. పత్రికా రంగం అయితే తెలుగా? ఇంగ్లీషా? 3. ఆ రచనా రంగంలో మీకు భాషాప్రవేశం ఉందా? లేక కేవలం ఉత్సాహమేనా? 4. టీవీ ఛానెల్స్‌లో అయితే, కెమెరా ముందు ఉండాలనుకుంటున్నారా? రిపోర్టింగ్ సైడా? మీ అభిరుచి కెమెరా ముందైతే... ఉచ్చారణ, అందం అవసరం. మీ కోరిక రిపోర్టింగ్ అయితే... భాష, అవగాహన అవసరం. ఏ వృత్తిలో రాణించాలన్న, కేవలం ఇష్టమే కాదు. అర్హత, కృషి, నైపుణ్యమూ కావాలి. మొదట అభిరుచిగా ప్రారంభించి వృత్తిగా మార్చుకోండి. తమ వృత్తి చేసుకుంటూ సైడుగా పత్రికా రిపోర్టింగ్ చేస్తున్న ఎల్ఐసీ ఏజెంట్లు, ఉపాధ్యాయులు కోకొల్లలు. ఆ విధంగా ముందు ఆర్థికంగా నిలదొక్కుకోండి. మీడియాలో పని చేస్తూనే ప్రైవేటుగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చెయ్యవచ్చు కదా. లేదా జర్నలిజం కోర్సులో జాయినవ్వండి. - యండమూరి వీరేంద్రనాథ్