సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయ్యిందని... | Man and his Family beaten Up with shoe lesson | Sakshi
Sakshi News home page

కుల పిచ్చి.. యువకుడి కుటుంబం మెడలో చెప్పులు

Published Mon, Oct 30 2017 10:17 AM | Last Updated on Mon, Oct 30 2017 10:22 AM

Man and his Family beaten Up with shoe lesson

లక్నో : ఉత్తర ప్రదేశ్‌లో షాకింగ్ ఘటన. వేరే కులం యువతిని ప్రేమించాడన్న కారణంతో ఓ యువకుడి కుటుంబాన్ని దారుణంగా అవమానించారు. బిజ్‌నోర్‌ జిల్లాలోని ఇస్లామాబాద్‌ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

కొంతకాలం క్రితం గ్రామానికి చెందిన ఓ యువకుడు.. వేరే కులానికి చెందిన యువతిని ప్రేమించాడు. విషయం పెద్దలకు తెలియటంతో ఇద్దరినీ పిలిపించి మందలించారు. దీంతో నాలుగు నెలల ఆ జంట ఊరి నుంచి పారిపోయింది. ఇక ఇప్పుడు అతని తమ్ముడి వంతు వచ్చింది. అతను కూడా ఇదే తరహాలో వేరే కులానికి చెందిన యువతిని ప్రేమించాడు. దీంతో ఇద్దరు యువతుల(గతంలో లేవదీసుకున్నపోయిన అమ్మాయి తాలూకు కూడా) కుటుంబాలు.. ఆ కుటుంబాన్ని రోడ్డుకీడ్చాయి. 

మొత్తం కుటుంబ సభ్యులను ఇంట్లోంచి ఇడ్చుకుంటూ రోడ్డు మీదకు తీసుకొచ్చాయి. వీరికి జత కలిసిన గ్రామస్తులు ఆ కుటుంబం మెడలో చెప్పులు వేయించి చితకబాదటం చేశారు. బాధితుల్లో ఓ బాలుడు కూడా ఉండటం విశేషం. కాగా, ఘటనపై ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement