150 ఏళ్ల నాటి మెట్లబావి వెలుగులోకి, వారసురాలి స్పందన | 150 Year Old Stepwell Likely Discovered During Excavation In UP Sambhal, Photos And Video Goes Viral | Sakshi
Sakshi News home page

150 ఏళ్ల నాటి మెట్లబావి వెలుగులోకి, వారసురాలి స్పందన

Published Sun, Dec 22 2024 5:28 PM | Last Updated on Mon, Dec 23 2024 11:24 AM

150 Year-Old Stepwell Likely Discovered In UP's Sambhal

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో అరుదైన మెట్లబావి (Stepwell) వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని చందౌసి ప్రాంతంలో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న తవ్వకాల్లో  ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) బృందం గుర్తించింది. 46 ఏళ్ల తర్వాత రాష్ట్రంలోని  సంభాల్ జిల్లాలో శివ-హనుమాన్ ఆలయాన్ని తిరిగి   తెరిచిన  నేపథ్యంలో దీన్ని గుర్తించారు.

సంభాల్ జిల్లా కలెక్టర్‌ రాజేంద్ర పెన్సియా ఈ విషయాన్ని ధృవీకరించారు. 400 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 150 ఏళ్ల నాటి ‘బావోలి’ని కనుగొన్నట్లు ఆదివారం మీడియాకు వివరించారు. ఈ మెట్ల బావి చుట్టూ నాలుగు గదులతో కూడిన పాలరాతి నిర్మాణాలు, కొన్ని అంతస్తులు ఉన్నాయని వివరించారు. ‘ఈ అహ్-బావోలి తలాబ్‌ను బిలారి రాజు తాత కాలంలో నిర్మించినట్టుగా భావిస్తున్నామన్నారు.  రెండు, మూడు అంతస్తులు పాలరాతితో, పై అంతస్తులు ఇటుకలతో నిర్మించారనీ తవ్వకం చుట్టూ నాలుగు గదులు ఉన్నాయని తెలిపారు. మొత్తం నలుగురు సభ్యుల బృందం సంభాల్‌లో,24 ప్రాంతాల్లో సర్వే చేశామని జిల్లా మేజిస్ట్రేట్ పెన్సియా తెలిపారు. ఐదు 'తీర్థాలు', 19 బావులను,  కొత్త ఆలయాన్ని కూడా తనిఖీ చేశారు. ఈ సర్వే 8-10 గంటలపాటు జరిగిందన్నారు. (కీర్తి సురేష్‌ పెళ్లి చీర : స్పెషల్‌గా కీర్తి ఏం చేసిందో తెలుసా?)


రాణి సురేంద్ర వాలా మనవరాలు
రాణి సురేంద్ర వాలా మనవరాలు శిప్రా  స్పందించారు. ఇది తమ పొలం అని,  వ్యవసాయం చేసేవారమని, పొలాల్లో ఒక మెట్టు బావి ఉందని చెప్పారు. అలాగే లోపల గదులుండేవని  వ్యవసాయ  పనుల సమయంలో ఇక్కడ ప్రజలు  విశ్రాంతి తీసుకునేవారమని చెప్పారు.  1995లో తాము ఈ పొలాన్ని బదౌన్‌కి చెందిన అనెజాకు అమ్మేశాం. పొలం అమ్మేసిన తరువాత ఇక్కడికి మళ్లీ ఎపుడూ రాలేదని చెప్పారు. అలాగే ఆ భూమిని అతను ఎవరికి అమ్మిందీ తమకు తెలియదన్నారు.  ప్రభుత్వం దీనిని సంరక్షించాలనుకుంటే, తమకెలాంటి  అభ్యంతరం లేదని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement