
అమేథి: ఉత్తరప్రదేశ్‌లోని అమేథి జిల్లాలో గూడ్స్ రైలు(Goods train), కంటైనర్ ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. లక్నో-వారణాసి రైలు విభాగంలో రైల్వే క్రాసింగ్ వద్ద కంటైనర్ ట్రక్కు, గూడ్స్ రైలు ఢీ కొన్నాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ సంఘటనలో ట్రక్కు డ్రైవర్ సోను చౌదరి(28) తీవ్రంగా గాయపడ్డాడు. అతనికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఈ ప్రమాదం కారణంగా ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. జగదీష్‌పూర్(Jagdishpur) పోలీస్ స్టేషన్ సమీపంలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. రైల్వే గేట్ తెరిచివున్న సమయంలో ఒక ట్రక్కు గేటు దాటుతూ, ట్రాక్‌పై నిలిచిపోయింది. ఈ నేపధ్యంలో అటుగా వచ్చిన గూడ్సు రైలు కంటైనర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో కంటైనర్‌ను గూడ్సు దాదాపు 100 మీటర్ల వరకు ఈడ్చుకుపోయింది. దీంతో కంటెయినర్ పూర్తిగా ధ్వంసమైందని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
గాయపడిన డ్రైవర్ సోను చౌదరిని తొలుత జగదీష్‌పూర్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్(Community Health Center)కు చికిత్స కోసం తీసుకువెళ్లామని, అయితే అతని పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో విద్యుత్ లైన్లతో పాటు రైల్వే ట్రాక్‌లకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. ట్రాక్‌లు, విద్యుత్ లైన్లను మరమ్మతు చేసిన తర్వాత, రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తామని లక్నో డివిజన్ రైల్వే మేనేజర్ సచీంద్ర మోహన్ శర్మ తెలిపారు.
ఇది కూడా చదవండి: లాలూ, రబ్రీ, తేజ్ ప్రతాప్‌లకు ఈడీ సమన్లు
Comments
Please login to add a commentAdd a comment