jayapuram
-
జయపురం మహారాణి ఇక లేరు
జయపురం (భువనేశ్వర్): మహారాణి రమాకుమారి దేవి(92) వృద్ధాప్య అనారోగ్య కారణాలతో సోమవారం పరమపదించారు. ఆమె జయపురం ఆఖరి మహారాజు రామకృష్ణ దేవ్ పట్టపురాణి. సాహిత్య సామ్రాట్ విక్రమదేవ్ వర్మకు కోడలు. రామకృష్ణ దేవ్ వృద్ధాప్య ఛాయలతో కొన్నేళ్ల క్రితం మరణించిన విషయం తెలిసిందే. రమాకుమారి దేవి ఆంధ్రప్రదేశ్‌లోని మాడుగుల శాశనసభ నియోజకవర్గం నుంచి 1975లో ఎమ్మెల్యేగా పోటిచేసి, గెలుపొందారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం కాగా, ముగ్గురూ ఇదివరకే మృతిచెందారు. ఇద్దరు యువరాణిలు(కోడల్లు), మనుమడు విశ్వేశ్వర చంద్రచూడ్ దేవ్, మనుమరాలు ఉన్నారు. విషణ్న వదనంలో యువరాజు చంద్రచూడ్ దేవ్, అతని తల్లి మహారాణి మరణ సమయంలో కోటలోనే ఉన్న చంద్రచూడ్, రాజ కుటుంబీకులు తుది సేవలందించారు. మరణ వార్త తెలుసుకున్న జయపురం ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. సాయంత్ర జరిపిన అంతిమ యాత్రలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పట్టణ ప్రముఖులు, ప్రజలు భారీగా తరలివచ్చి, పాల్గొన్నారు. జయపురంలోని రాజుల ప్రత్యేక శ్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు రాజ లాంఛనాలతో చేపట్టారు. మహారాణి రమాకుమారి దేవి మృతికి జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. ఆఖరి రాజైన మహారాజ రామకృష్ణ దేవ్ పట్టపురాణి రమాకుమారి దేవి భహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. -
చితిలో దూకి.. దేవతగా మారి..
జయపురం: దసరా ఉత్సవాల్లో జయపురం మా పెండ్రాని దేవికి ప్రముఖ స్థానం ఉంది. నవరంగపూర్ జిల్లా ఉమ్మర్‌కోట్ ప్రాంతంలో పెండ్రాహండి ఓ కుగ్రామం. 400 ఏళ్ల క్రితం ఓ ఆదివాసీ కుటుంబంలో జన్మించిన పెండ్రానికి వివాహమైన తరువాత ఆమె తల్లిదండ్రుల ఆహ్వానం మేరకు భర్త పెండ్రా ఇల్లరికం వచ్చారు. ఇరువురినీ వారు ఎంతో ఆదరంగా చూసేవారు. అయితే పెండ్రాని నలుగురు అన్నదమ్ములకు ఈ విషయం గిట్టలేదు. దీంతో అతను పొలానికి వెళ్లిన సమయంలో పథకం ప్రకారం హతమార్చి, పాతి పెట్టారు. ఎంతటికీ భర్త ఇంటికి రాకపోవడంతో అనుమానించిన పెండ్రాని.. అతన్ని వెతుక్కుంటూ వెళ్లింది. తన సోదరులే భర్తను చంపి, పొలం వద్ద పాతి పెట్టారని గ్రహించి, సమీపంలోని చితిలో పడి మరణించింది. అనంతరం ఆమె ఆత్మ దేవతగా మారి గ్రామాల్లో సంచరిస్తూ ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ ప్రజలను కాపాడుతుంది. దీంతో తమను రక్షిస్తున్న దేవతగా విశ్వసించిన ఆదివాసీ ప్రజలు.. అక్కడే ఆమెకు గుడికట్టి, పూజించడం ప్రారంభించారు. చదవండి: (Padampur MLA: పద్మపూర్ ఎమ్మెల్యే మృతి) అమ్మవారి మహత్యం తెలుసుకున్ను జయపురం మహారాజులు.. దసరా ఉత్సవాలకు ఆమె లాఠీలను ఆహ్వానిస్తూ వచ్చారు. గత 4 దశాబ్దాలుగా ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా నవరంగపూర్ జిల్లా ఉమ్మరకోట్ నుంచి ఆదివారం రాత్రి పెండ్రాని దేవి లాఠీలు జయపురం చేరాయి. ఎంతో మహిమ గల అమ్మవారు తమ కోర్కెలు తీర్చుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ నేపథ్యలో పెండ్రాని దేవికి కోళ్లు, మేకలు, గొర్రెలు బలులు సమర్పిస్తారు. చదవండి: (దసరా ఉత్సవాల్లో అపశ్రుతి.. స్టేజ్‌పైనే కుప్పకూలిన ప్రముఖ గాయకుడు) -
తీవ్ర విషాదం.. రెండు రోజుల క్రితం తమ్ముడు.. ఇప్పడు రశ్మితా
సాక్షి, ఒడిశా(జయపురం): స్థానిక పారాబెడలో నివసిస్తున్న గదాధర నాయిక్ ఇంటిలో మరో విషాదం నెలకొంది. తన 12 ఏళ్ల కుమారుడు శిభాశిస్ నాయిక్ ఆత్మహత్య చేసుకొని మరణించి రెండు రోజులు గడవక ముందే కూతురు రశ్మితా నాయిక్(24) శనివారం ఆత్మహత్య చేసుకుంది. వరుసగా ఆ ఇంట్లో రెండు ఆత్మహత్యలు జరగడంతో కుటుంబమంతా దుఃఖ సాగరంలో మునిగిపోయింది. అసలు తమ బిడ్డలకు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం ఎందుకు పట్టిందో తెలియక ఆ తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. అయితే తమ్ముడి మరణాన్ని జీర్ణించుకోలేకే రశ్మితా నాయిక్ ఆత్మహత్య చేసుకొని ఉంటుందని అనుమానిస్తున్నారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. చదవండి: (బిగ్‌షాట్‌లే టార్గెట్: కిడ్నాపులు, హత్యలే అతడి నైజం) -
భర్త, కుమారుడి ఎదుటే మహిళపై అత్యాచారం..
జయపురం (ఒరిస్సా): స్థానిక సమితిలో భర్త, కుమారుడి ఎదుటే మహిళపై అత్యాచారం జరిపిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు ఫరారీలో ఉన్నాడు. పట్టుబడిన వ్యక్తి జయపురం సమితి కుములిపుట్ పంచాయతీ కుములిపుట్ ప్రాంతానికి చెందిన మీణా హరిజన్‌గా గుర్తించారు. దీనికి సంబంధించి ఎస్డీపీఓ అరూప్‌అభిషేక్ బెహరా వివరాలను బుధవారం వెల్లడించారు. ఘటనపై కాంగ్రెస్, బీజేపీ సహా ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేయడంతో దోషులను పట్టుకొనేందుకు ఎస్డీపీఓ నేతృత్వంలో పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. పాడువ పోలీసు స్టేషన్ పరిధిలోని ఆంధ్రప్రదేశ్ సరిహద్దు అడవిలో ఒక నిందితుడు ఉన్నట్లు సమాచారం అందింది. హుటాహుటిని అక్కడికి చేరుకున్న పోలీసులు.. చాకచక్యంగా హరిజన్‌ను అరెస్టు చేశారు. అతడిపై వివిధ పోలీస్ స్టేషన్లలో 10 కేసులు ఉన్నాయని తెలిపారు. జయపురం సదర్ పోలీసు స్టేషన్లో 4 కేసులు, పట్టణ పోలీసు స్టేషన్లో 5 కేసులు, కొరాపుట్ సదర్ పరిధిలో ఒక కేసు ఉన్నట్లు వివరించారు. పట్టుబడిన వ్యక్తిని కోర్టుకు తరలించారు. రెండో నిందితుడి కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు. చదవండి: (కన్నపేగు కారాగారంలో.. పిల్లలు పాట్నాకు) -
యువతిపై అత్యాచారం, హత్య.. కట్టెల కోసమని అడవిలోకి వెళ్లగా..
ఒరిస్సా(జయపురం): బొరిగుమ్మ సమితి చలానగుడ గ్రామ సమీపంలోని నీలగిరి అడవిలో 19 ఏళ్ల యువతి మృతదేహాన్ని పోలీసులు సోమవారం కనుగొన్నారు. ఆమెపై అత్యాచారం జరిపి, ఆపై హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. మృతురాలు చిలిగుడ గ్రామానికి చెందిన సుభద్ర అమనాత్య(19)గా గుర్తించినట్లు బొరిగుమ్మ సబ్‌డివిజనల్ పోలీసు అధికారి హరికృష్ణ మఝి తెలిపారు. సుభద్ర అమనాత్య డిసెంబరు 30న ఇల్లు విడిచి వెళ్లిపోయింది. ఆమె తిరిగి రాకపోవటంతో కుటుంబ సభ్యులు గాలించారు. జాడ తెలియరాలేదు. చదవండి: (బెదిరించి లొంగదీసుకుని.. గిరిజన బాలికలపై లైంగిక దాడి..) సోమవారం ఉదయం చిలిగుడ గ్రామ మహిళలు కట్టెల కోసమని నీలగిరి అడవిలోకి వెళ్లగా, సగం కాలిన సుభద్ర అమనాత్య మృతదేహం కనిపించింది. బొరిగుమ్మ పోలీసు అధికారి ఖురేశ్వర సాహుకు సమాచారం అందించడంతో వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. పోలీసు డాగ్, సైంటిఫిక్ టీమ్‌లు చేరుకొని దర్యాప్తు ప్రారంభించాయి. సుభద్రను దుండగులు హత్యచేసి నీలగిరి తోటలో పడేసినట్లు ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైందని హరికృష్ణ మఝి వెల్లడించారు. దుండగులను పట్టుకున్నాకనే ఆమెపై అత్యాచారం జరిగిందా, ఎందుకు హత్య చేశారనే విషయాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు. మృతురాలి సోదరుడు బలరాం అమనాత్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
యువతి ప్రేమించిన వాడితో వెళ్లిపోతే.. కుటుంబాన్ని వెలివేశారు
జయపురం (ఒడిశా): వేరే కులం యువకుడిని ప్రేమించిన యువతి కుటుంబాన్ని గ్రామం నుంచి బహిష్కరించిన సంఘటన బొయిపరిగుడ సమితి తాలూరు గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. దురువ కులానికి చెందిన 22ఏళ్ల యువతి, మఝిగుడ గ్రామానికి చెందిన హరిజన యువకుడిని ప్రేమించింది. తల్లిదండ్రులకు తెలపకుండా అతనితో వెళ్లిపోయింది. ఈ విషయం తెలిసిన దురువ కులస్తులు సమావేశమై ఆమె కుటుంభాన్ని జాతి నుండి వెలివేశారు. యువతిని వెతికి పట్టుకు రావాలని గ్రామ పెద్దలు తెలడంతో తల్లి దండ్రులతో బంధువులు గాలింపు చేపట్టారు. బొయిపరిగుడ పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన బాధిత కుటుంబ సభ్యులు.. తమ కుమార్తెను వెతుకుతున్నామని, తమను గ్రామంలోకి ఆనుమతించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. గ్రామస్తులతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. చదవండి: (Jayamma Panchayathi: అటవీ ప్రాంతం నుంచి టాలీవుడ్ హీరోగా..) -
ఖాకీలు చేసిన కల్యాణం: 'ఒకరిని విడిచి, మరొకరం ఉండలేమని..'
సాక్షి, జయపురం (ఒడిశా): పరస్పరం ప్రేమించుకొని, పెద్దల కాదనడంతో ఇంటి నుంచి పారిపోయిన ప్రేమజంటను ఒక్కటి చేశారు.. జయపురం మహిళా పోలీసులు. పెళ్లి పెద్దలుగా ఇరువురి కుటుంబాలను ఒప్పించి, స్థానిక బస్టాండ్ సమీపంలోని మందిరంలో బుధవారం వారి వివాహం జరిపించారు. జయపురం మహిళా పోలీసు స్టేషన్ అధికారి మమతా పాణిగ్రహి తెలిపిన వివరాల ప్రకారం... కందులగుడ గ్రామానికి చెందిన కృష్ణమాలి కుమార్తె గాయిత్రీ, కుంద్రా సమితి పుప్పుగాం పంచాయతీ జబాపాత్రోపుట్ గ్రామానికి చెందిన లోక్‌నాథ్ కందిలియా ప్రేమించుకున్నారు. అయితే పెళ్లికి పెద్దలు అంగీకరించక పోవడంతో ఎవరికీ చెప్పకుండా ఇరువురూ పరారయ్యారు. చదవండి: (ప్రియునికి ప్రియురాలి తండ్రి షరతు.. లాడ్జ్‌లో రూం తీసుకొని..) తన కుమార్తెను లోక్‌నాథ్ ఎత్తుకు పోయాడని యువతి తండ్రి జయపురం మహిళా పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దర్యాప్తు జరిపి, జబాపాత్రోపుట్‌లో ఇరువురినీ అదుపులోకి తీసుకున్నారు. అయితే ఒకరిని విడిచి, మరొకరం ఉండలేమని వారు తెలుపగా.. ఇద్దరూ మేజర్లు కావడంతో పోలీసులే పెళ్లి పెద్దలుగా మారారు. ఇరువైపులా కుటుంబాలను పిలిచి, పరిస్థితి వివరించడంతో వారంతా సమ్మతించారు. ఈ నేపథ్యంలో ఉభయలకు మందిరంలో వివాహం జరిపించారు. వివాహం సమయంలో గాయత్రీ తండ్రి కృష్ణమాలి, తల్లి తులామాలి, లోక్‌నాథ్ తండ్రి వంశీధర కందలియా, తల్లి రాధామణి, బంధువులు, గ్రామపెద్దలు పాల్గున్నారు. వివాహం జరిపించిన పోలీసు అధికారులను ప్రశంసించారు. చదవండి: (జైళ్లో నేత్ర.. నిర్మానుష్య బంగ్లాలో చోరీ) -
కన్నీటి వ్యథ: మిమ్మల్నే నమ్ముకుంటే.. వదిలెళ్లారా..
నర్సింహులపేట: వ్యవసాయాన్నే నమ్ముకున్న కుటుంబం అది.. సాగులో సాయంగా మూడు పశువులు ఉన్నాయి. వర్షాలు కురుస్తుండడంతో దుక్కి దున్ని వ్యవసాయానికి సిద్ధమవుతున్న ఆ రైతు కుటుంబానికి కరెంట్ రూపంలో ఆపద వచ్చింది. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని జయపురంలో గురువారం గాలిదుమారం రాగా జామాయిల్ తోటలో కరెంట్ తీగ తెగి పడింది. ఈ విషయం తెలియక రామచంద్రు మధ్యాహ్నం వరకు నాగలి దున్ని పశువులను మేతకు వదిలాడు. ఇంతలోనే పశువులు విద్యుత్ తీగను తాకి మృతి చెందాయి. రూ.1.50 లక్షల విలువైన ఒక కాడెద్దు, ఆవు, కోడె లేగ చనిపోవడంతో ఆ రైతు కుటుంబం వాటిపై పడి రోదించిన తీరు అందరినీ కన్నీరు పెట్టించింది. ఇక్కడ చదవండి: మూగజీవాలపై యమపాశం -
కరోనా మృతదేహం, కనికరం లేకుండా బయటకు పడేశారు
సాక్షి, భువనేశ్వర్(జయపురం): కరోనాతో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని అంబులెన్స్ సిబ్బంది బయట పడేసిన సంఘటన స్థానిక పట్టణ సమీపంలోని డొంగాగుడ ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకుంది. రోడ్డు పక్కనే ఉన్న ఆ మృతదేహాన్ని చూసి, స్థానికులు భయపడుతుండగా విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం పీపీఈ కిట్లతో మృతదేహాన్ని డెప్పిగుడ సమీపంలోని చంపాకుపిలి శ్మశానవాటికకు తరలించి, దహనపరిచారు. డొంగాగుడ దగ్గరి కెనాల్ వద్ద బహిర్భూమికి వెళ్లిన ఇద్దరు యువకులు అంబులెన్స్ నుంచి ఓ శవాన్ని సిబ్బంది పారవేస్తుండగా చూసినట్లు సమాచారం. చదవండి: గొప్ప మనసు; పెళ్లి మండపం నుంచి రక్తదాన శిబిరానికి.. -
కాళ్లూచేతులు లేని వింత శిశువు జననం
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొరిగుమ్మ సమితి కుములి ప్రాథమిక వైద్య కేంద్రంలో ఓ గర్భిణి శుక్రవారం వింతశిశువును ప్రసవించింది. జన్మించిన శిశువుకు కాళ్లూచేతులు లేకపోవడం గమనించిన వైద్యులు కొరాపుట్ సహిద్ లక్ష్మణ నాయక్ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. శిశువు అలా జన్మించడానికి గల కారణాలను వైద్యులు అధ్యయనం చేస్తున్నారు. అయితే జన్మనిచ్చిన తల్లి పోషకాహారం సరిగ్గా తీసుకోకపోవడంతో శిశువు ఈ విధంగా జన్మించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. చదవండి: వింత.. శిశువు కాలికి తొమ్మిది వేళ్లు -
భర్త మరణించాడని కుంగిపోలేదు.. తానే ముందుండి..
కుటుంబానికి ఆధారమైన భర్త స్వర్గస్తుడయ్యాడని కుంగిపోలేదు. కుటుంబాన్ని ఎలా ఈడ్చాలా అని దిగులు చెందలేదు. భవిష్యత్తు ఎలా ఉంటుందో తలుచుకుని భయాందోళనకు గురికాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో పట్టణంలో పుట్టి చదువుకున్న ఓ మహిళ కుటుంబ పోషణకు వ్యవసాయాన్ని ఆధారంగా ఎంచుకుంది. సొంత భూమి లేకపోయినా కౌలుకు తీసుకుని వ్యవసాయానికి శ్రీకారం చుట్టింది. వ్యవసాయంలో ఒడిదుడుకులు చవిచూస్తూ ఆదర్శ వ్యవసాయ మహిళగా ప్రజలు, పాలకులతో ప్రశంసలు అందుకుంటోంది నవరంగపూర్ పట్టణానికి చెందిన సీత. –జయపురం నవరంగపూర్ పట్టణానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు సీహెచ్ నారాయణ రావు కుమార్తె సీత ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేస్తూ పదిమందికి ఆదర్శంగా నిలుస్తోంది. దీంతో ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం నాడు జిల్లా యంత్రాంగం ఆదర్శ మహిళగా గుర్తించి సన్మానించింది. పట్టభధ్రురాలైన ఆమెకు 22 ఏళ్ల వయసులో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన రవికుమార్‌తో వివాహం జరిగింది. ఒక కుమారుడు, కుమార్తె పుట్టిన తరువాత 18 ఏళ్ల క్రితం భర్త స్వర్గస్తుడయ్యాడు. దీంతో కుటుంబ జీవనోపాధికి నవరంగపూర్ నుంచి విశాఖపట్నానికి చింతపండు, అల్లం తీసుకువెళ్లి విక్రయిస్తుండేది. వ్యవసాయ జిల్లా అయిన నవరంగపూర్‌లో పుట్టి పెరగడంతో వ్యవసాయంపై మక్కువ ఉన్నా తగిన అవకాశం, ప్రోత్సాహం లేక వ్యాపారం చేస్తుండేది. అయితే ఆంధ్రప్రదేశ్, కేరళ తదితర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వ్యవసాయం చేస్తున్న వారిని చూసి ప్రభావితురాలై తాను కూడా వ్యవసాయం చేయాలని నిర్ణయించింది. ఉత్సాహం అయితే ఉంది కానీ వ్యవసాయానికి అవసరమైన పంట భూమిలేదు. ఈ క్రమంలోభూమికోసం ప్రయత్నించి చివరికి నందాహండి సమితి దహనహండి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నుంచి 6 ఎకరాల కొండ ప్రాంత మెట్ట భూమిని కౌలుకు తీసుకుంది. ఆ భూమిని బాగు చేసి వ్యవసాయానికి అనువుగా తయారు చేసి మొదటి సారిగా 6 ఎకరాలలో అల్లం పంట వేసింది. మొదటి సారి కావడం, వర్షాలు సహకరించక పోవడంతో దాదాపు 40 శాతం పంట కుళ్లిపోవడంతో నష్టం వచ్చింది. అయినా ఆమె వెనుకంజ వేయకుండా రుణాలు తెచ్చి మళ్లీ అల్లం పంట వేసింది. అల్లంతో పాటు పలు మిశ్రమ పంటలను పండించింది. వ్యవసాయ రంగంలో అడుగుపెట్టిన తరువాత పాత పద్ధతుల్లో సాగు చేస్తే అంతగా లాభాలు రావన్న విషయం గ్రహించి ఆధునిక పద్ధతులు తెలుసుకోవాలని ప్రయత్నించింది. ఇందుకోసం పలు ప్రాంతాల్లో వ్యవసాయ వైజ్ఞానికులను కలిసి ఆధునిక పరిజ్ఞానం సంపాదించింది. ఆధునిక వ్యవసాయ పద్ధతులతో అల్లం, ఇతర పంటలకు శ్రీకారం చుట్టింది. ఆధునిక పద్ధతిలో పండించిన అల్లం ఒక మొక్కకు కేజీన్నర నుంచి రెండు కేజీల అల్లం ఉత్పత్తి కావడం ఆమె సాధించిన విజయమనే చెప్పవచ్చు. ఇలా ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ లాభాలు ఆర్జిస్తూ మరో పదిమందికి ఆదర్శంగా నిలుస్తోంది. సహాయ సహకారాల్లేవు వ్యవసాయానికి అన్ని విధాలా సహాయం అందిస్తామని రైతులకు హామీలు ఇస్తున్న ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదు. కనీసం వ్యవసాయ వైజ్ఞానిక సహాయం కూడా లేదు. అందువల్ల ఇతర రాష్ట్రాలకు వెళ్లి వైజ్ఞానిక పద్ధతులు తెలుసుకోవలసి వచ్చింది. నాలాంటి వారికి ప్రభుత్వం సహాయం అందజేస్తే మెరుగ్గా ఉంటుంది. -
నేనేమీ చేశాను పాపం?!
నేనింకా పూర్తిగా కళ్లు కూడా తెరవలేదు. ఈ లోకం ఎలా ఉంటుందో నాకు తెలియదు. నేను భూమి మీదకి రాగానే ఎందుకు పెంటకుప్పలో విసిరేశారు. నేను ఆడపిల్లగా పుట్టడం నా తప్పా? క్షమించరాని నేరమా? అందుకే నన్ను విసిరేశారా? పెద్దయ్యాక మీకు చెడ్డ పేరు తీసుకువస్తానని ఆందోళన చెందారా? మీ పరువు ప్రతిష్టలు చెడగొడతానని ఎవరైనా భయపెట్టారా? నేను పెద్దయ్యాక బాగా చదువుకుని ఉన్నత విద్యావంతురాలినయ్యే దాన్నేమో? తల్లిదండ్రులు తలెత్తుకునేలా అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకునేదాన్నేమో? అందరితోనూ బంగారు తల్లి అనిపించుకునేదాన్నేమో? ఎందుకు నన్ను విసిరేశారన్నట్లుగా నవరంగపూర్ జిల్లా ఉమ్మరకోట్ పట్టణంలోని డీఎన్‌కే జంక్షన్ గులిపట్న మధ్య గల ఒక పెంటకుప్పలో అప్పుడే పుట్టిన పసికందు రోదిస్తోంది. జయపురం: కుటుంబ సమస్యలో? ఆర్థిక పరిస్థితులో? వివాహేతర సంబంధమో కానీ మానవత్వం మంటగలిసింది. నవరంగపూర్ జిల్లా ఉమ్మరకోట్ పట్టణంలోని డీఎన్‌కే జంక్షన్, గులిపట్న మధ్య గల ఒక పెంట కుప్పపై అప్పుడే పుట్టిన బిడ్డను మంగళవారం ఎవరో పెంటకుప్పలో పారవేసి వెళ్లిపోయారు. పెంట కుప్ప నుంచి ఆ శిశువు ఏడుపు విన్న పరిసర ప్రాంత మహిళలు అక్కడికి చేరుకుని పసికందును రక్షించి అక్కున చేరుకున్నారు. తరువాత ఉమ్మరకోట్ సామాజిక హాస్పిటల్‌కు తీసుకువెళ్లి డాక్టర్లకు చూపించారు. పసికందును పరీక్షించి ఆరోగ్యంగానే ఉందని, ఐసీయూలో ఉంచామని డాక్టర్లు వెల్లడించారు. ఎవరు ఆ శిశువును పెంటకుప్పపై పారవేశారు. అందుకుగల కారణం ఏమిటా అన్నది చర్చనీయాంశమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: నిండు గర్భిణిని 3 కి.మీ. నడిపించినందుకు.. పిల్లలకు విషమిచ్చి.. తానూ తాగి! -
జీడిచెట్టుపై కూర్చున్నట్లుగా యువతి మృతదేహం
జయపురం/ఒడిశా: నవరంగపూర్ జిల్లాలోని డాబుగాం సమితి, ఘొడాఖంటి గ్రామపంచాయతీలో ఉన్న మఝిగుడ గ్రామ జీడిమామిడి తోటలో అనుమానాస్పదంగా యువతి లిలిఫా హరిజన్(22) మృతి చెందిన సంఘటన శుక్రవారం కలకలం రేపింది. సరిగ్గా వారం రోజుల క్రితం మధ్యాహ్నం భోజనం చేసి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఈమె ఒక్కసారిగా ఇలా విగతజీవిగా కనిపించడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జీడి చెట్టుపై కూర్చొని ఉన్నట్లుగా ఈమె మృతదేహం ఉండడంతో ఈమెని ఖచ్చితంగా ఎవరో హత్య చేసి ఉంటారన్న అనుమానాలకు బలం చేకూరుస్తుండడం విశేషం. ఒకవేళ ఈమె ఆత్మహత్య చేసుకుంటే చెట్టుకి మృతదేహం వేలాడుతుండాలి కదా.. అని కొంతమంది అంటుండగా, మరికొంతమంది ఎవరో ఈమెని హత్య చేసి సందేహం రాకుండా ఉండేందుకే ఇలా చెట్టుపై మృతదేహం ఉంచి వెళ్లారని ఆరోపిస్తున్నారు. ఇదే విషయం తెలుసుకున్న బాధిత తల్లిదండ్రులు కూతురు మృతదేహం చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం దగ్గరలోని డాబుగాం ఆస్పత్రికి మృతదేహం తరలించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులకు మృతదేహం అప్పగించారు. అయితే ప్రస్తుతం యువతి వారం రోజుల క్రితం ఎక్కిడికి వెళ్లింది.. ఆమె మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు డాబుగాం సబ్ఇన్స్పెక్టర్ కైలాస చంద్ర బెహరా తెలిపారు. చదవండి: వివాహేతర సంబంధం: భర్త అడ్డుతొలగించుకోవాలని.. -
ప్రేమికులను పట్టుకుని తాళ్లతో బంధించి, కొట్టి..
సాక్షి, జయపురం(ఒడిశా): వేరువేరుగా వివాహాలు జరిగిన ఓ ప్రేమజంటను తాళ్లతో కాళ్లు, చేతులు కట్టి, గ్రామస్తులు బంధించారు. సుమారు 18 కిలోమీటర్ల దూరంలోని గ్రామానికి తీసుకువచ్చి, అందరి సమక్షంలో చితక్కొట్టారు. గ్రామ కోర్టు నిర్వహించి, వారిపై విచారణ జరిపి.. శిక్షించాలని తీర్మానించుకున్నారు. దీనిపై గ్రామానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నవరంగపూర్ జిల్లా రాయిఘర్ సమితి ముండిబెడ పంచాయతీలోని బాగబెడ గ్రామానికి చెందిన ఓ యువతికి మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి రెండేళ్ల కుమార్తె ఉంది. భర్త కుటుంబాన్ని పోషించుకొనేందుకు ఢిల్లీకి వలస కార్మికుడిగా వెళ్లాడు. దీంతో ఒంటరిగా ఉన్న ఆమె.. అదే గ్రామానికి చెందిన యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. అయితే ఇద్దరికీ అంతకుముందే వివాహాలు జరిగి ఉండటంతో దీనికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో 5 రోజుల క్రితం ఎవరికీ చెప్పకుండా గ్రామం నుంచి వెళ్లిపోయారు. బిడ్డను ఆమె అత్తమామల వద్ద విడిచిపోయారు. విషయం బయటకు పొక్కడంతో గ్రామస్తులంతా జంటను వెతకడం ప్రారంభించారు. ఎట్టకేలకు డొంగరమెల గ్రామం వద్ద వారిని గుర్తించిన వ్యక్తులు.. గ్రామస్తులకు సమాచారం అందించారు. ఇరువురినీ తాళ్లతో బంధించి.. బైక్‌పై బాగబెడ గ్రామానికి తీసుకు వచ్చారు. గ్రామం మధ్యలో వారిని తీవ్రంగా కొట్టిన అనంతరం, ఏం చేయాలనే విషయంపై గ్రామకోర్టు నిర్వహించాలని తీర్మానించారు. అప్పటి వరకు యువకుడి మామ వద్ద ఇద్దరినీ ఉంచాలని ఆదేశించారు. అయితే జంటను బంధించి, కొట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం తెలుసుకున్న రాయిఘర్ పోలీసులు.. గ్రామానికి చేరుకొని, కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: కోదాడలో దారుణం: ప్రేమ జంట ఆత్మహత్య ఒకరితో పెళ్లికి, మరొకరితో ప్రేమకు రెడీ! -
ఏఎన్ఎం కక్కుర్తి.. ఇంట్లోనే ప్రసవం చేయడంతో...
జయపురం(ఒడిశా): ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగిలే చర్యలు చేపట్టి.. మాతా, శిశు మరణాలను అరికట్టాల్సిన ఆరోగ్య సిబ్బందే.. డబ్బుకు కక్కుర్తిపడి ఓ బాలింత ఉసురు తీశారు. నవరంగపూర్ జిల్లా చందాహండి సమితిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే... ఓ గర్భిణికి ఇంట్లోనే ఏఎన్ఎం డెలివరీ నిర్వహంచిన తరువాత ఆమె ఆరోగ్యం క్షీణించడంతో కొరాపుట్ సహిద్ లక్ష్మణ నాయిక్ వైద్య కళాశాల మెడికల్‌లో మరణించింది. జిల్లాలోని దేవబంధు గ్రామంలో పురుషోత్తమ కెనర్ భార్య హీరాదేయి కెనర్ ఈనెల 21న పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఈ విషయం ఆమె బంధువులు దేవబంధు మహిళా ఏఎన్ఎంకు తెలియజేశారు. అయితే ఆ సమయంలో ఏఎన్ఎం అందుబాటులో లేకపోవడంతో తమ ఇంటి పక్కనే ఉంటున్న ఖెందుబెడ సబ్‌సెంటర్ ఏఎన్ఎంకు సమాచారం అందించారు. గర్భిణి ఇంటికి వచ్చి పరిస్థితిని గమనించి ఆమె.. ఇంట్లోనే ప్రసవం చేయడం మంచిదని వారికి సలహా ఇచ్చింది. వాస్తవానికి పురిటి నొప్పులు మొదలైన సందర్భంలో గర్భిణిని 102 అంబులెన్స్‌లో హాస్పిటల్‌కు తరలించాలి. అలా కాకుండా ఇంటి వద్దే డెలివరీ చేయమని సలహా ఇవ్వడంతో మరోమార్గం లేక ఆమె బంధువులు అంగీకరించారు. 2శాతానికి పడిపోయిన హెచ్‌బీ.. 22న హీరాదేయి ఇంటి వద్దే మగబిడ్డను ప్రసవించింది. అయితే అదే రోజు సాయంత్రం రక్తస్రావం ఎక్కువ కావడంతో పరిస్థితి విషమించింది. దీంతో ఏఎన్ఎం పర్యవేక్షణలో చందాహండి సామాజిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి మరింత క్షీణించడంతో వెంటనే నవరంగపూర్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ కూడా మెరుగుపడక పోవడంతో మరోమార్గం లేక కొరాపుట్ సహిద్ లక్ష్మణనాయిక్ వైద్య కళాశాల ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ.. సోమవారం మరణించింది. అయితే పుట్టినబిడ్డ పరిస్థితి సంతృప్తి కరంగా ఉందని సమాచారం. హీరాదేయిని చందాహండి ఆస్పత్రికి తీసుకువెళ్లే సమయానికి హిమోగ్లోబిన్ కేవలం 2శాతం మాత్రమే ఉండేదట. రక్తహీనత ఉన్నా కాన్పుకు ఆస్పత్రికి తీసుకు వెళ్లకుండా ఇంట్లోనే డెలివరీకి ప్రయతి్నంచడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే... తన భార్యకు ఇది నాలుగో కాన్పని పురుషోత్తమ్ వెల్లడించాడు. హీరాదేయికి నొప్పులు ఎక్కవగా రావడంతో వెంటనే పక్కింటి ఏఎన్ఎంను సంప్రదించామని.. ఆమె ఇంట్లోనే డెలివరీ చేస్తానని రూ.వెయ్యి తీసుకుందని ఆరోపించాడు. అసురక్షిత పరిస్థితిలో కాన్పు చేయడం వల్ల తన భార్య పరిస్థితి క్షీణించిందని వాపోయాడు. శాయశక్తులా ప్రయతి్నంచినా తన భార్య దక్కలేదని విలపించాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న నవరంగపూర్ సీడీఎం.. దర్యాప్తుకు ఆదేశించారు. -
అర్ధరాత్రి యువతిపై అమానుషం!
జయపురం: ప్రపంచ వ్యాప్తంగా నూతన సంవత్సరం వేడుకల్లో మునిగి ఉండగా.. అదే సమయంలో 18ఏళ్ల ఆదివాసీ యువతిపై అత్యాచారం జరిపి, అనంతరం మారణాయుధాలతో దాడి జరిపారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నవరంగపూర్ జిల్లాలో సంచలనం రేపిన ఈ అమానుష ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే... కొత్త సంవత్సర వేడుకల్లో ఉత్సాహంగా గుడుపుతుండగా నవరంగపూర్‌కు 15 కిలోమీటర్ల దూరంలోని తెంతులికుంఠి పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. గ్రామంలో అర్ధరాత్రి సమయంలో ఇద్దరి కంటే ఎక్కువమంది యువకులు ఆమెపై దాడి జరిపి, సామూహికంగా అత్యాచారం జరిపి తీవ్రంగా గాయపరిచినట్లు అనుమానిస్తున్నారు. బాధితురాలు తీవ్రంగా గాయపడి గ్రామం సమీపంలోని జీడితోటలో సృహతప్పి ఉంది. శుక్రవారం తెల్లవారుజామున కొంతమంది గ్రామస్తులు మలవిసర్జన వెళ్లగా.. యువతి పరిస్థితిని గమనించి, బాధిత కుటుంబానికి సమాచారం అందించారు. అనంతరం యువతిని నవరంగపూర్ జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. సైగలే.. సంకేతం? ఇదిలా ఉండగా... బాధితురాలి తలపై తీవ్రంగా గాయమైంది. ఏదో ఆయుధతో తలపై గట్టిగా కొట్టడంతో ఈ విధంగా జరిగి ఉంటుందని భావిస్తున్నారు. బాధితురాలు మాట్లాడలేని స్థితిలో ఉండటం వల్ల వివరాలు తెలియ రావడం లేదు. దీనిపై ఆమె తల్లిని ప్రశ్నించగా.. యువతి రెండు చేతి వేలు చూపించడం తప్ప, ఏమీ చెప్పలేకపోతోందని కన్నీటి పర్యంతమైంది. దాడిలో ఇద్దరు యువకులు ఉన్నట్లు సంకేతం ఇచ్చినట్లు భావిస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా..ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఆస్పత్రి వర్గాల సమాచారం మేరకు నవరంగపూర్ పోలీసులు బాధితురాలిని కలిసి, వివరాలను సేకరించేందుకు ప్రయ త్నించారు. యువతి కోలుకునే వరకు వివరాల కోసం వేచి ఉండక తప్పదని పోలీసు అధికారి ఒకరు చెప్పుకొచ్చారు. -
కన్నకొడుకును అమ్మిన కసాయి తండ్రి
సాక్షి, భువనేశ్వర్ : ఏడు నెలల కన్నబిడ్డను ఓ తాగుబోతు తండ్రి రూ.10 వేలకు పరాయివారికి అమ్మేశాడు. ఈ విషాదకర సంఘటన నవరంగపూర్ జిల్లాలో చర్చనీయాంశమైంది. ఈ ఉదంతం నవరంగపూర్ జిల్లా ఉమ్మరకోట్ సమితి పూజారిగుడ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన సంగ్రామ లోహర అనే వ్యక్తి తన కన్నబిడ్డను రూ.10 వేలకు అమ్మివేశాడని ఉమ్మరకోట్ పోలీస్‌స్టేషన్‌లో సంగ్రామ లోహర భార్య ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. వివరాలిలా ఉన్నాయి. పూజారిగుడ గ్రామానికి చెందిన సంగ్రామ లోహర, భార్య సునాబరీ లోహరలు భార్యాభర్తలు. వారికి ఏకైక మగబిడ్డ జన్మించాడు. ఆ దంపతులు ఈ నెల 8 వ తేదీన ఉమ్మరకోట్‌లో గల దేవి పెండ్రానీ మాత గుడికి పూజ చేసేందుకు బిడ్డతో సహా వెళ్లారు. కుమారుడిని భర్తకు ఇచ్చి పూజా సామగ్రి కొనేందుకు భార్య బయటకు వెళ్లింది. ఈ క్రమంలో అప్పటికే అక్కడికి వచ్చి ఉన్న రమేష్ పట్నాయక్ మరి కొంతమంది ముందుగా కుదుర్చుకున్న బేరం మేరకు సంగ్రామ లోహరకు డబ్బు ఇచ్చి బిడ్డను తీసుకున్నారు. కొంతసేపటికి వచ్చిన బిడ్డ తల్లి తన కన్న బిడ్డ ఏడి అని అడగ్గా బిడ్డను అమ్మి వేశానని భర్త చెప్పడంతో గొడవ చేసింది. తన బిడ్డను తనకు ఇవ్వాలంటూ నిలదీసింది. అయితే బిడ్డ చేతిలో పడగానే బిడ్డను కొన్నవారు బిడ్డను తీసుకుని వెళ్లిపోయారు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని భార్యను భర్త హెచ్చరించాడు. అనంతరం వారు ఝోరిగాం సమితిలోని భిక్షా గ్రామ పంచాయతీ డెంగాగుడ గ్రామంలో ఉన్న సునాబరి కన్నవారింటికి వెళ్లారు. ఇంటికి వచ్చిన కుమార్తె, అల్లుడిని చూచి ఆనందించిన వారు మనుమడు ఎక్కడ అని అడిగారు. అందుకు అల్లుడు తన కుమారుడు ప్రమాదంలో మరణించాడని అత్త మామలతో చెప్పాడు. తాగుబోతు అల్లుడు చెప్పిన మాటలు వారు నమ్మకుండా కుమార్తె సనాబరిని నిలదీయడంతో జరిగిన విషయం ఆమె తెలిపింది. తన కుమారుడిని భర్త రూ.10 వేలకు అమ్మివేశాడని తెలపగానే వారు ఆశ్చర్యపోయారు. విచారణ చేస్తున్న పోలీసులు అల్లుడు చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేస్తూ అల్లుడిని పట్టుకుని కొట్టి స్తంభానికి కట్టివేశారు. అనంతరం భార్య ఈ విషయమై ఉమ్మరకోట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు గ్రామనికి వచ్చి స్తంభానికి కట్టేసి కొడుతున్న సంగ్రామ్‌ను విడిపించి స్టేషన్‌కు తీసుకువెళ్లి విచారణ చేయగా తానే తన బిడ్డను అమ్మేశానని అంగీకరించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చల్లని పానీయం ఇచ్చి.. మెల్లగా డబ్బు కొట్టేశాడు
జయపురం: రైలులో ప్రయాణం చేసేటప్పుడు కొంతమంది మోసగాళ్లు తోటి ప్రయాణికుల్లా వచ్చి మాటమాట కలిపి మత్తుమందో లేదో మరేదైనా మందు ఇచ్చి దోపిడీ చేసిన ఉదంతాలు విన్నాం. పత్రికల్లో చదువుతున్నాం.ఇటువంటివి రైలు ప్రయాణంలో జరగడం సర్వసాధారణంగా అంతా భావిస్తారు. అయితే ఇటువంటి సంఘటనలు బస్సులలో జరగడం సాధారణంగా విని ఉండరు. కానీ అటువంటి అనుభవం జయపురం సమితిలోని కుసుమి గ్రామ వాసి శ్రీనివాస పాణిగ్రహి అనే వ్యక్తికి ఎదురైంది. బస్సులో శ్రీనివాస పాణిగ్రహి పక్క సీటులో కూర్చుని తీపిగా మాట్లాడి, మత్తు మందు కలిపిన చల్లని పానీయం ఇచ్చి శ్రీనివాస పాణిగ్రహి దగ్గర గల రూ.20 వేలను ఓ దుండగుడు దోచుకుపోయాడు. శ్రీనివాస పాణిగ్రహి విలపిస్తూ ‘సాక్షి’కి చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. బరంపురం నుంచి వస్తుండగా.. బుధవారం శ్రీనివాస పాణిగ్రహి కుసుమి గ్రామం నుంచి బరంపురం వెళ్లాడు. అక్కడ పనులు ముగించుకుని గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో దిగపండి వద్ద బరంపురం–ఉమ్మరకోట్ బస్సు ఎక్కి జయపురం టికెట్ తీశాడు. టికెట్ తీసేందుకు తన వద్ద ఉన్న డబ్బు బయటకు తీసి అందులో టికెట్ డబ్బు కండక్టర్‌కు ఇచ్చాడు. తిరిగి జాగ్రత్తగా పాకెట్లో డబ్బు భద్రపరిచాడు. అతడు తనకు కండక్టర్ చూపిన సీటులో కూర్చున్నాడు. కొంత సమయం తరువాత మరో వ్యక్తి వచ్చి శ్రీనివాస పాణిగ్రహి పక్కన సీటులో కూర్చున్నాడు. తన పక్క సీటులో కూర్చున్న వ్యక్తి కిందికి దిగి ఒక కూల్ డ్రింక్‌ను తీసుకు వచ్చి తనకు ఇచ్చాడని దానిని తాను తాగానని శ్రీనివాస పాణిగ్రహి వెల్లడించాడు. కూల్‌డ్రింక్ తాగిన తాను తెలివి తప్పి పడిపోయానని బస్సు జయపురం చేరిన తరువాత దిగి తన జేబులో డబ్బులు చూడగా డబ్బులేదని వాపోయాడు. తన పక్క సీటులో కూర్చున్న వ్యక్తే తనకు మత్తు పదార్థం కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి తన డబ్బు కాజేశాడని తన డబ్బుతో పాటు మొబైల్ ఫోన్‌ను కూడా దుండగుడు దొంగిలించుకు పోయాడని వాపోయాడు. జయపురం బస్సు స్టాండ్‌లో విలపిస్తున్న శ్రీనివాస పాణిగ్రహిని చూసి విషయం తెలుసుకున్న కొంతమంది వెంటనే అతని బంధువులకు ఫోన్ చేసి రప్పించారు. వారు జరిగిన అన్యాయాన్ని తెలుసుకుని ఆందోళన వ్యక్తం చేసి శ్రీనివాస పాణిగ్రహిని హాస్పిటల్‌కు తీసుకు వెళ్లారు. ఇటువంటి సంఘటనలు బస్సులలో ఎన్నడూ జరగలేదని బస్సులలో కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయంటే ఇకపై నైట్ బస్సులలో వెళ్లడం కష్టమేనంటూ ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. -
మూడు రోజులు..రెండున్నర కోట్లు
సాక్షి, జయపురం: స్థానిక పట్టణ పరిధిలో దాదాపు మూడు రోజుల వ్యవధిలో పలు కేసుల్లో సుమారు రూ.2.5 కోట్ల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే విషయమై జయపురం సబ్‌డివిజన్ పోలీసు అధికారిణి సాగరిక నాథ్ విలేకరుల సమావేశంలో శుక్రవారం మాట్లాడారు. గత రెండు రోజుల వ్యవధిలో జయపురం, బొరిగుమ్మ, బొయిపరిగుడ పోలీస్స్టేషన్ల పరిధుల్లో సుమారు 1015 కేజీల గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులలో ఒక యువతి సహా దాదాపు 11 మంది నిందితులను అరెస్టు చేశామని ఆమె వెల్లడించారు. మల్కన్‌గిరి జిల్లాలో తక్కువ ధరకు కొనుగోలు చేసిన గంజాయిను ఛత్తీస్‌గఢ్ మీదుగా ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తున్నారని ఆమె వివరించారు. విజయవాడ–రాంచీ కారిడార్‌లో గురువారం జరిపిన పోలీసుల తనిఖీల్లో దాదాపు 110 కేజీల గంజాయి పట్టుబడిందని ఆమె తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మధ్యప్రదేశ్‌కు చెందిన దాదాపు నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుల్లో చందన నమాలి(25), అనూప్ గౌతమ్, హరిశంకర దువన్యాన్, స్థానికుడైన విష్ణు సాహు ఉన్నారని తెలిపారు. అలాగే అంబాగుడ సమీపంలో ఒక వాహనం ఒక వ్యక్తిని ఢీకొని వెళ్లిపోయిందన్న స్థానికుల సమాచారం మేరకు స్పందించిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే లోపు నిందితులు పరారీ కాగా, వాహనంలోని సుమారు 280 కేజీల గంజాయిను పట్టుకున్నారు. ఈ కేసు నుంచి తప్పించుకున్న వారిలో అనుగూలు వాసి భజనన్ సాహు, మల్కన్‌గిరికి చెందిన రామ ఖెముండులుగా పోలీసులు గుర్తించారు. 10 బస్తాల్లో.. అలాగే జయపురం సదర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని 26వ నంబర్ జాతీయ రహదారిలో నిర్వహించిన తనిఖీల్లో 10 బస్తాల్లో తరలిస్తున్న గంజాయిను పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి, మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రకాష్నాయి, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రాకేష్‌కుమార్ బర్మన్, రాజవిశ్వ బర్మలను పోలీసులు అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.2500 నగదు, 2 మొబైల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు బొయిపరిగుడలో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో సుమారు 400 కేజీల గంజాయిను పట్టుకున్నారు. ఇదే కేసుకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌కు చెందిన సచిన్‌కుమార్, టింకు కుమార్, మురతధజ్ శుక్లాలను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ గంజాయి మల్కన్‌గిరి–కొరాపుట్ ప్రాంతాల నుంచి దేశంలోని అనేక రాష్ట్రాలకు తరలిస్తున్నారని ఆమె వెల్లడించారు. గంజాయి తరలింపునకు అడ్డుకట్ట వేసేందుకు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. సమావేశంలో జయపురం పట్టణ పోలీసు అధికారి బాలేశ్వర గిడి, సదర్ పోలీసు అధికారి ధిరెన్ కుమిర్ బెహరా, అంబాగుడ పంటి అధికారి నారాయణ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. రాయగడలో.. రాయగడ: వచ్చే సాధారణ ఎన్నికల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలను ముమ్మరం చేసిన ఎక్సైజ్, పోలీస్ యంత్రాంగానికి పెద్దఎత్తున గంజాయి పట్టుబడుతోంది. జిల్లాలోని బిసంకటక్ ప్రాంతంలో భారీగా గంజాయి తరలిస్తున్న వాహనాల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా గురువారం జరిపిన తనిఖీల్లో అక్రమంగా గంజాయి తరలిస్తున్న రెండు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుని, వాటిల్లో తరలిస్తున్న సుమారు 193 కేజీల గంజాయిను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే శుక్రవారం సాయంత్రం జరిపిన వాహన తనిఖీల్లో దాదాపు 100 కేజీల గంజాయి తరలిస్తున్న ఒక కారును పోలీసులు పట్టుకున్నారు. అయితే కారులో అక్రమంగా తరలిస్తున్న ఈ గంజాయికి రక్షణగా నలుగురు వ్యక్తులు మోటారు సైకిల్‌తో ప్రయాణించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇదే విషయమై ఆ నలుగురు వ్యక్తులను పట్టుకుని, విచారణ చేపట్టగా వారంతా పద్మపూర్, గజపతి, పుటాసింగి, గుణుపురం, మునిగుడ ప్రాంతాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అనంతరం వారి వద్ద ఉన్న సెల్ఫోన్ల ఆధారంగా గంజాయి దొంగల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ఐఐసీ అధికారి జశ్వంత్ హీయల్ తెలిపారు. అయితే ముఖ్యంగా యువతకు ఉపాధి లేకపోవడంతో పాకెట్ మనీ కోసం ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తక్కువ వ్యయంతో ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాలను యువత అన్వేషిస్తోందని, ఈ క్రమంలో ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించేలా చేస్తే చాలావరకు ఇలాంటి దుశ్చర్యలను అరికట్టవచ్చని స్థానికులు పేర్కొంటున్నారు. -
తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదని...
సాక్షి, జయపురం: తమ ప్రేమను పెద్దలు నిరాకరించారన్న మనస్థాపంతో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన నవరంగపూర్ జిల్లాలోని ఉమ్మర్‌కోట్ సమితిలో సోమవారం చోటుచేసుకుంది.విషయం తెలుసుకున్న ఉమ్మర్‌కోట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేశారు. తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదన్న కారణంతో ఆ జంట ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.వివరాలిలా ఉన్నాయి.. హీరాఫూల్ గ్రామ పంచాయతీలోని నువాగుడ గ్రామానికి చెందిన సనమత భొత్ర(21), భగవతి కొలార్(19)లు కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. భగవతి తండ్రి తులారాం కొలార్, సమీపంలోని ఓ గ్రామానికి శనివారం వెళ్లాడు. పనులు ముగించుకుని, తిరిగి ఇంటికి రాగా, ఆ ఇంటి తలుపులు మూసి ఉన్నాయి. తలుపు తట్టి, కూతురును పిలవగా, ఎంతసేపైనా రాకపోయేసరికి పక్క ఇంటి వారి సాయంతో తులారాం తలుపులు విరగ్గొట్టాడు. అనంతరం ఇంట్లో ఒక దూలానికి వేలాడుబడుతున్న ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. కూతురి శవమైన కనిపించడంతో తులారాం అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఈ నేపథ్యంలో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
క్రీడా మైదానంలో యువకుడి మృతదేహం
జయపురం : జయపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో శనివారం ఉదయం ఒక యువకుడి మృతదేహం ఫుట్‌బాల్ గోల్ స్తంభానికి వేలాడుతూ కనిపించింది. అయితే మృతి చెందిన యువకుడు ఎవరన్నది ఇంతవరకు గుర్తించ లేదు. మృతదేహం కింద ఒక ప్లాస్టిక్ స్టూల్ పడి ఉంది. మృతదేహం ఉన్న పరిస్థితిని బట్టి ప్లాస్టిక్ స్టూల్ ఎక్కి దానిపై నుంచి ఫుట్‌బాల్ గోల్ స్తంభానికి ఉరి వేసుకున్నట్లు కనిపిస్తోందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే మృతి చెందిన యువకుడు ఎవరు? ఎక్కడి నుంచి ఈ ప్రాంతానికి వచ్చాడు? ఆత్యహత్య చేసుకుని ఉంటే ఎందుకు చేసుకున్నాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేదంటే యువకుడిని ఎవరైనా హత్య చేసి స్వంభానికి వేలాడదీశారా? అన్న అనుమానాలను మరికొందరు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆత్మహత్య చేసుకున్నాడా? హత్యకు గురయ్యాడా? అన్నది ఏది పోస్ట్‌మార్టం జరిగిన తరువాత వెల్లడి కావచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మంచమే అంబులెన్స్
జయపురం : ప్రతి వారికి అందుబాటులో వైద్యసౌకర్యం. ప్రతి గ్రామానికి పంచాయతీ కార్యాలయం. సమితులకు కనెక్టివిటీ రోడ్లు. గర్భిణులకు పురిటి నొప్పులు వస్తే ఫోన్ చేసిన వెంటనే 102 అంబులెన్స్ కుయ్‌కుయ్ మంటూ వచ్చి ఆస్పత్రిలో చేర్చుతుంది. ఈ మాటలు ఎంతో కాలంగా ప్రజలు వింటూనే ఉన్నారు. ప్రభుత్వం ఇలా ఎన్నో హామీలు ఇచ్చింది. కానీ అవిభక్త కొరాపుట్ జిల్లాలో గర్భిణులు పడుతున్న పాట్లు మాత్రం వర్ణనాతీతం. చాలా సందర్భాల్లో రోగులు, గర్భిణులను డోలీలలోనూ, మంచాలపైనా, సైకిళ్ల పైన తీసుకువెళ్తూ నదులు, కొండలు దాటిస్తూ ఆస్పత్రికి వెళ్లిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అటుంటి సంఘటనే బొరిగుమ్మ సమితి రణస్పూర్ గ్రామ పంచాయతీలో శుక్రవారం తాండవించింది. పంచాయతీలోని రాణిగడ గ్రామ నివాసి మిశ్రా ముదులి భార్య మోతి ముదులి(19) గురువారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె ప్రసవించిన తరువాత ఆరోగ్యం క్షీణించడంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లాలని ఆశా వర్కర్ రుకుణ సూచించింది. రాణిగుడ కొండపై ఉన్న ఈ గ్రామానికి రహదారి లేదు. దీంతో ఆమె బంధువులు మోతి ముదులిని మంచంపై కూర్చుండ బెట్టి మోసుకుంటూ బొరిగుమ్మ ఆస్పత్రికి బయలుదేరారు. మూడు కొండలు దాటుతూ మూడు కిలోమీటర్లు మోసుకుని బి.సింగపూర్ చేరారు. అక్కడినుంచి ఆటోలో బొరిగుమ్మ కమ్యూనిటీ వైద్య కేంద్రానికి చేర్చారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమెకు సరిపడా రక్తం ఇక్కడ లేదని, వెంటనే జయపురం సబ్‌డివిజన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలని సూచించారు. దీంతో వెంటనే ఆమెను జయపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు అవసరమైన రక్తం సమకూర్చి వైద్యం చేసిన తరువాత ఆమె సృహలోకి వచ్చింది. దీంతో బంధువులు ఊపిరిపీల్చుకున్నారు. సర్కారు కనికరించాలి ఇలాగే ™రాణిగుడ గ్రామంతో పాటు నాలుగైదు గ్రామాలు కొండలపై ఉన్నాయని, ఆ గ్రామాలకు రహదారులు వేయాలని ఎంతో కాలంగా అధికారులను కోరుతూ వస్తున్నామని అయినా ఎవరూ పట్టించుకోవడంలేదని గ్రామస్తులు వాపోయారు. కొండలపై ఉన్నç గ్రామాలలో రోగులు, మహిళలు, గర్భిణులకు వైద్య సౌకర్యం కోసం డోలీకట్టో, మంచాలపైనో మోసుకుంటూ కొండలు దాటుతూ వెళ్లాల్సిందేనని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు తమ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని వెంటనే తమ గ్రామాలకు రహదారులు వేయాలని కోరుతున్నారు. -
అరుదైన సర్పం
జయపురం : జయపురం పట్టణానికి స్నేక్ పారడైజ్ అని పేరు ఉంది. ఈ ప్రాంత ప్రజలంతా జయపురాన్ని పాముల స్వర్గం అంటారు. ఈ ప్రాంతంలో అనేక రకాల పాములు సంచరించడమే ఇందుకు కారణం. జయపురం వన్యప్రాణి పరిరక్షణ కమిటీ జయపురం పరిసర ప్రాంతాలలో అనేక రకాల పాములను పట్టుకుంటూ వాటిని సమీప అడవులలో విడిచిపెడుతోంది. ముఖ్యంగా వన్యప్రాణి çపరిరæక్షణలో ప్రముఖ పాత్ర వహిస్తున్న కృష్ణ కేశవ షడంగి జయపురంలోను, గ్రామీణ ప్రాంతాలలో, ఇళ్లలోను కనిపించే పాములను సునాయాసంగా బంధించి వాటిని అడవిలో విడిచిపెడుతుంటారు. ఏప్రాంతంలో పాము కనిపించినా ఆయనకు ఫోన్ చేస్తే వెంటనే వచ్చి పట్టుకుని సురక్షిత ప్రాంతాలలో విడిచి పెడతారు. గురువారం ఆయన జిల్లా కోర్టు ఆవరణలో సంచరిస్తున్న అపూర్వమైన పామును పట్టుకున్నారు. ఆ పామును పట్టుకున్న షడంగి అటువంటి పాములు కేవలం ఒడిశాలోనే కనిపిస్తాయని వెల్లడించారు. దానిని ట్రింకెట్ స్నేక్ అని అంటారని చెప్పారు. ఒడిశాలో దీనిని కౌడియ చిట్టి అని పిలుస్తారన్నారు. -
ఓట్ల కోసం బోగస్ పట్టాలు
జయపురం : జయపురంలో ప్రజాస్వామ్యం హత్యకు గురవుతోంది. ఎన్నికలలో నెగ్గేందుకు అధికార పార్టీ రాజకీయ నేతలు ఎటువంటి నేరాలకైనా వెనుకాడడంలేదని జయపురం ఎంఎల్ ఏ, విధానసభలో కాంగ్రెస్ చీఫ్‌విప్ తారాప్రసాద్ బాహిణీపతి ధ్వజమెత్తారు. జయపురంలోని నివాస గృహంలో గల పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తారాప్రసాద్ బాహిణీపతి మాట్లాడుతూ జయపురం నియోజకవర్గంలో బోగస్ భూమి పట్టాలను ప్రజలకు అందజేసి మోసగించారని ఆరోపించారు. కేవలం జయపురం సమితిలో 10 వేల మందికి బోగస్ భూమి పట్టాలను అధికార పార్టీకి చెందిన మాజీమంత్రి అందజేశారని, పట్టాలు పొందిన లబ్ధిదారులు జయపురం తహసీల్దార్ వద్దకు వెళ్లి తమకు ఇచ్చిన పట్టాల భూములు అందజేయాలని అడుగగా అసలు ఆ పట్టాలు తాము ఎవరకీ ఇవ్వలేదని, ఆ పట్టాల వివరాలు తమ కార్యాలయం రికార్డులలో లేవని స్పస్టం చేయడంతో లబ్ధిదారులు కంగుతిన్నారని ఆయన వెల్లడించారు. 2011 పంచాయతీ ఎన్నికల సమయంలోను, 2014 విధానసభ ఎన్నికల సమయంలోను బోగస్ పట్టాలను ఆనాటి మాజీమంత్రి ప్రజలకు పంచారని ఆరోపించారు. బయటపడిన 10 వేల పట్టాలు ఇంతవరకు 10 వేల బోగస్ పట్టాలు బయటపడ్డాయని ఇంకా అనేకం బయటపడవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికలలో లబ్ధిపొందేందుకు బోగస్ భూమి పట్టాలతో ప్రజలను ప్రలోభపరిచారని ఎద్దేవా చేశారు. కేవలం జయపురం సమితిలోనే కాదని జయపురం నియోజకవర్గంలో అంతర్భాగమైన బొరిగుమ్మ సమితిలో కూడా ఎన్నికల సమయంలో ప్రజలకు బోగస్ భూమి పట్టాలు పంచి ఓటర్లను ప్రభావితం చేశారని ఆరోపించారు. జయపురం విధానసభ నియోజకవర్గంలో దాదాపు 25 వేల మందికి బోగస్ భూమిపట్టాలు పంచారని ధ్వజమెత్తారు. అనేక పట్టాలపై తహసీల్దార్ సంతకాలు లేవని, అలాగే పట్టాలపై తేదీలు కూడా లేవంటూ కొన్ని పట్టాలను విలేకరులకు చూపించారు. బాధితులకు పట్టాలు అందజేయాలి ఈ వ్యవహారం తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి తెలిసే జరిగిందా? లేదా పట్టాలు పంచిన వారు బోగస్ పట్టాలు ముద్రించి ప్రజలను మోసగించారా? అన్నది తేలాలని అందుచేత ప్రభుత్వం వెంటనే దర్యాప్తు జరిపించి బోగస్ పట్టాలు పంచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోసపోయిన లబ్ధిదారులకు వెంటనే భూములు, స్థలాలు సమకూర్చి అసలైన పట్టాలు అందజేయాలని కోరారు. జయపురం నియోజకవర్గంలో బోగస్ భూమి పట్టాల సంఘటనకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.15 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి సంబంధిత నిందితులను అరెస్టు చేయని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాందోళన చేపట్టి జయపురం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తుందని హెచ్చరించారు. దర్యాప్తు జరిపి నిందితలను అరెస్టు చేయకపోతే బోగస్ పట్టాలు ప్రజలకు పంచి మోసగించిన వారిపై కాంగ్రెస్ పార్టీ తరఫున పోలీస్‌స్టేషన్‌లో కేసులు పెడతామని, అలాగే రాజధానిలో ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఎంఎల్ఏ తారాప్రసాద్ విలేకరుల సమావేశం పూర్తిచేసిన తరువాత పలువురు గ్రామీణ ప్రజలు బోగస్ భూమి పట్టాలతో వచ్చి తాము మోసపోయినట్లు వాపోయారు. బోగస్ పట్టాలు ప్రజలు పంచిన నేత మాజీ మంత్రి రవినారాయణ నందో అని ఆయన పరోక్షంగా తారాప్రసాద్ బాహిణీపతి ఆరోపించారు. పట్టాలు పంచిన సమయంలో ఉన్న తహసీల్దార్ సిబ్బంది ఇతర నేతలు కూడా నిందితులేనని స్పష్టం చేశారు. సమావేశంలో జయపురం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నరేంద్ర కుమార్ మíహంతి, జిల్లా కాంగ్రెస్ కోశాధికారి నిహార్ బిశాయి పాల్గొన్నారు. -
తెలుగు కార్టూన్ పితామహుడు తలిశెట్టి రామారావు
జయపురం: తెలుగు కార్టూన్ జయపురంలో జన్మించిందని గర్వంగా చెప్పుకుంటున్నామని పలువురు వక్తలు ఆనందం వ్యక్తం చేశారు. జయపురంలో జన్మించిన తలిశెట్టి రామారావు కార్టూన్‌కు శ్రీకారం చుట్టి వ్యంగ్య చిత్ర శకానికి ఆద్యులయ్యారని పలువురు వక్తలు కొనియాడారు. తలిశెట్టి రామారావు 122వ జయంతి సందర్భంగా ఆదివారం రాత్రి స్థానిక 180 డిగ్రీ సభాగృహంలో భారతి సాహిత్యవేదిక జయపురం వారు నిర్వహించిన కార్యక్రమంలో పలువురు వక్తలు వ్యంగ్య చిత్ర పితామహుడు తలిశెట్టి రామారావు ప్రతిభను కొనియాడారు. ఆయన పాలనా దక్షునిగా, సాహితీ వేత్తగా, రచయితగా, న్యాయవాదిగా, చిత్రకారునిగా, వ్యంగ్య చిత్ర పితామహునిగా సమాజానికి అనేక సేవలు అందించడమే కాకుండా తెలుగు వ్యంగ్య చిత్రాలను సమాజానికి అందించిన మహానీయుడు అని పలువురు వక్తలు పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి పోటీలు ఈ సందర్భగా ప్రతి ఏడాదీ వ్యంగ్య చిత్ర దినోత్సవం రోజున వ్యంగ్య చిత్రకళా ప్రదర్శనలు నిర్వహించాలని కొంతమంది సూచించగా సభికులు హర్షధ్వానాలతో మద్దతు పలికారు. వచ్చే ఏడాది నుంచి వ్యంగ్య చిత్రకళా ప్రదర్శన నిర్వహించాలని, అలాగే వ్యంగ్య చిత్ర పోటీలు నిర్వహించి ఉత్తమ చిత్రకారులను సన్మానించి ప్రోత్సహించాలని కొంతమంది సూచించగా నిర్వాహకులు అంగీకారం తెలిపారు. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన తెలుగు వ్యంగ్య చిత్ర దినోత్సవంలో జయపురం నివాసి ఆరిశెట్టి సుధాకర్‌కు సన్మానం అందుకున్న సందర్బంగా సభికులు ఆనందం వ్యక్తం చేస్తూ సుధాకర్‌కు అభినందనలు తెలిపారు. భారతి సాహిత్య వేదిక నిర్వాహకుడు కె.వి.రమణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కవి తాజుద్దీన్, కార్యక్రమ నిర్వహణకు కారకుడైన అంగజాల రామకృష్ణ, సీనియర్ పాత్రికేయుడు వి.భాస్కర రావు, ఉపాధ్యాయుడు మౌళి, కె.నాగేశ్వర రెడ్డి, పి.రోజా తదితరులు ప్రసంగించారు. -
భర్త వాట్సాప్‌కు భార్య అశ్లీల వీడియోలు
సాక్షి, జయపురం: ఓ ఆదివాసీ వివాహిత బాయ్‌ఫ్రెండ్ ఆమె అశ్లీల చిత్రాలను భర్తకు పంపిన సంఘటన ఒడిశాలో వెలుగుచూసింది. ఆమె వివాహం జరిగిన పది రోజుల్లోనే ఇటువంటి సంఘటన జరగడంతో ఆ కుటుంబంలో వివాదాలు తలెత్తాయి. జయపురం సదర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక గ్రామానికి చెదిన యువకుడికి, బొరిగుమ్మకు చెందిన ఓ యువతికి గడిచిన ఏప్రిల్ 20వ తేదీన వివాహం జరిగింది. వారు ఇంకా వైవాహిక జీవితం ఆరంభించకుండానే వారి మధ్య చిచ్చు పెట్టేందుకు ఓ యువకుడు అశ్లీలంగా ఉన్న వధువు ఫొటోలను ఆమె భర్త వాట్సాప్‌కు పోస్ట్చేశాడు. ఆ ఫొటోలు వాట్సాప్‌లో పెట్టిన వ్యక్తి ఆమె బాయ్‌ఫ్రెండ్ అని తెలుస్తోంది. తన వాట్సాప్‌కు వస్తున్న అశ్లీల ఫొటోలను చూసిన వరుడు జయపురం సదర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా తాను భార్యతో ఉండలేనని స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా వీడియో క్లిప్పింగ్‌లు వాట్సాప్‌కు పోస్టు చేసిన వ్యక్తి గురువారం అస్కాలో పట్టుబడినట్లు తెలిసింది. -
మరణదండన తప్పదు
జయపురం : కొరాపుట్ జిల్లా బొయిపరిగుడ సమితి దండాబడి గ్రామం సమీపంలో మావోయిస్టుల పోస్టర్లు వెలి శాయి. దండాబడి గ్రామ పంచాయతీ కలియఝోలి గ్రామం జంక్షన్‌కు, రామగిరి పంచాయతీ దాదరఖొ ల గ్రామం జంక్షన్ మధ్య సుమారు 50 చోట్ల పో స్టర్లు అంటించారు. సీపీఐ(మావోవాది)ఎం, కేవీ బీ డివిజన్ కమిటీ పేరుతో వెలిసిన ఈ పోస్టర్లలో కాంట్రాక్టర్లకు, యువకులకు హెచ్చరికలు చేశారు. ఐదుగురు కాంట్రాక్టర్లు, ఐదుగురు యువకుల పేర్లు, వారి చిరునామాలు వెల్లడిం చారు. ఈ 10 మందికి మరణ శిక్ష విధిస్తామని పోస్టర్లలో హెచ్చరించారు. ఈ ఐదుగురు యువకులు ఆ ప్రాంతంలోని నిరుపేదలకు శ త్రువులని పేర్కొన్నారు. ఐదుగురు కాంట్రాక్టర్లలో ముగ్గురికి అతి వేగంగా మరణదండన విధిస్తామని హెచ్చరించారు. అలాగే గ్రామాల అభివృద్ధికి నేతలు, అధికారులు ఎంతో చేస్తున్నామని చెపుతున్నారని అయితే ఆ అభివృద్ధి ఎక్కడా కనిపించటం లేదని వెల్లడిస్తూ, ఈ వ్యవస్థను అందరూ వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదిలావుండగా గత ఆదివారం ఇదే ప్రాంతంలో వారపు సంతలో సాయంత్రం తుపాకుల తూటాల వర్షం కురిసింది. మాజీ సర్పంచ్ భర్త ఆనంద నాయిక్ అనే కంట్రాక్టర్‌పై మవోయిస్టులు విచక్షనా రహితంగా కాల్పులు జరిపి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన మరువకముందే ఇదే ప్రాంతంలో ఇప్పుడు మావోయిస్టుల పోస్టర్లు వెలియడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. పలు చోట్ల పోస్టర్లు చూచి ప్రజలు భయంతో వణుకుతున్నారు. మావోయిస్టుల హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ఎప్పుడు ఎవరిని హతమార్చుతారో అన్న భయం అందరిలో నెలకొంది. మావోల పోస్టర్ల విషయం తెలిసిన వెంటనేపోలీసులు, బీఎస్ఎఫ్ బెటాలియన్ జవాన్లు వెళ్లి పోస్టర్లను తొలగించారు. ఈ పోçస్టర్లపై దర్యాప్తు జరుపుతున్నట్టు బొయిపరిగుడ పోలీసు అధికారులు వెల్లడించారు. బొయిపరిగుడ ఒకప్పుడు మావోల అడ్డాగా ఉన్నా కొంత కాలం నుంచి ఇక్కడ వారి ఉనికి కనిపించలేదు. అయితే కొద్ది రోజులుగా మరలా మావోయిస్టులు ఈ సమితిలో సంచరిస్తూ తమ ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుందని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. -
కాంగ్రెస్ ఆఫీసుకు తాళాలు
జయపురం : జయపురంలో గల జిల్లా కాంగ్రెస్ కార్యాలయం భవనాలకు తాళాలు వేలాడుతున్నాయి. అయితే తాళాలు ఎవరు వేశారోనని కాంగ్రెస్ శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతి రోజూ కార్యాలయానికి వచ్చి కూర్చునే పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు రెండు రోజుల నుంచి పార్టీ కార్యాలయానికి తాళాలు వేసి ఉండడంతో చూసి షాక్ అయ్యారు. ముఖ్యంగా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణ చంద్ర నేపక్, ఎస్సీ కాంగ్రెస్ సెల్ జిల్లా మాజీ అధ్యక్షుడు రామనాయక్, పట్టణ పార్టీ మాజీ అధ్యక్షుడు కాంత పాఢి, ఇటీవల ఏఐసీసీ సభ్యుడిగా నియమితుడైన రవీంద్ర మహాపాత్రో, రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ చీఫ్ బిరెన్ మోహన్ పట్నాయక్ తదితర ముఖ్యలతో పాటు కొంతమంది పార్టీ కార్యకర్తలు ప్రతిరోజు పార్టీ కార్యాలయంలో కూర్చుని ముచ్చటించుకోవడం పరిపాటి. అలా గే పార్టీ కార్యాలయానికి వచ్చే వార్తా పత్రికలను చదివేవారు. వీరి లో ఎక్కువమంది ఎంఎల్ఏ గురించే చర్చించుకునే వారు. అయితే బుధవారం వారు వచ్చే సరికి కార్యాలయ ప్రధాన గేటుతో పాటు లోపల గేటుకు, కార్యాలయ తలుపులకు తా ళాలు వేసి ఉండడంతో కంగుతున్నారు. అసలు ఈ కార్యాలయానికి ఎవరు తాళాలు వేశారన్నది చర్చనీయా ంశమైంది. ఈ పని స్థానిక ఎంఎల్ఏ తారాప్రసాద్ బాహిణీపతి అనుచరులదేనని కొంత మంది అనుమానిస్తున్నారు. అయితే ఇంతవరకు తాళాలు ఎవరు వేశారో వెల్లడి కాలేదు. ఈ పరిణామం జయపురంలో కాంగ్రెస్ పార్టీలో విభేదాలకు దర్పణం పడుతోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. నేటి వరకు కొరాపుట్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఒకరిద్దరు తప్ప మిగతా వారంతా పార్టీలోనే కొనసాగుతున్నారు. అయితే పార్టీలో విభేదాలు మాత్రం కొనసాగుతున్నాయి. -
ప్రేమజంట ఆత్మహత్య
తెలిసీ తెలియని పసిమనసులు వారివి. కళ్లు..కళ్లు..కలిశాయి. మాటామాట కలిపారు. అదే ప్రేమ అనుకున్నారు. పెద్దలను ఏమార్చి ఇళ్లు విడిచి వెళ్లిపోయారు. పెద్దలకు ఆగ్రహం తెప్పించారు. పోలీసుల దర్యాప్తుతో మళ్లీ ఇళ్లకు వచ్చారు. కొద్ది రోజుల దూరాన్నే విరహ వేదన అని భావించారు. చివరికి ఆ ప్రేమజంట ప్రాణాలు తీసుకుని కన్నవారికి కడుపుకోత మిగిల్చారు. జయపురం : నవరంగ్‌పూర్ జిల్లా ఝోరిగాం పోలీస్ స్టేషన్ పరిధి బుణువగుడ గ్రామ పంచాయతీ దేవులకోట గ్రామం సమీపంలో గల ఒక జీడి మామిడి తోటలో ప్రేమికుల జంట చెట్టుకు ఉరిపోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వీరిద్దరూ దేవులకోట గ్రామానికి చెందినవారు. ఇద్దరూ మైనర్లు కావడం గమనార్హం. వీరిద్దరికీ గత ఏడాది నుంచి పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన బాలిక తండ్రి తన కుమార్తెను మరోసారి కలవవద్దంటూ బాలుని హెచ్చరించాడు. గత ఏడాది బాలిక పాఠశాల నుంచి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో బాలుడు ఆమెను ఎత్తుకుపోయాడు. ఈ విషయం తెలిసిన బాలిక తండ్రి ఝోరిగాం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం ఆ బాలుడు ఆ బాలికను తీసుకువచ్చి ఆమె ఇంటిలో విడిచిపెట్టాడు. ఈ కేసులో పోలీసులు బాలుడిని అదుపులోనికి తీసుకుని జువైనల్ కోర్టుకు పంపారు. రెండు నెలల కిందట నిందిత బాలుడు తిరిగి ఇంటికి వచ్చాడు. మళ్లీ వాళ్లిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం పెరిగింది. తరువాత ఏమైందో గానీ గురువారం ఆ గ్రామ సమీపంలో గల జీడి మామిడి తోటలో ఇద్దరూ గావంచాతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటనపై ఇద్దరి తల్లిదండ్రులు ఝోరిగాం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇరుపక్షాల వారి ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని రెండు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జయపురం, కొట్‌పాడ్‌లలో విస్తృతంగా దర్యాప్తు
జయపురం/కొరాపుట్: కొరాపుట్ జిల్లా కుందులి గ్యాంగ్‌రేప్ బాధితురాలి కేసులో నిజానిజాలు వెలికితీసేందుకు జాతీయ మానవ హక్కుల కమిషన్ పంపించిన దర్యాప్తు బృందం జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తూ దర్యాప్తు చేస్తోంది. కొరాపుట్, కుందులి, బాధితురాలి గ్రామం ముషి గుడలను సందర్శించి ఆయా ప్రాంతాలలో అనేక మందిని, ముఖ్యంగా ఆమె బంధువర్గాన్ని ఆమెకు వైద్యసేవలందించిన డాక్టర్లను, పోలీసులు విచారణ చేసిన తరువాత జయపురం, కొట్‌పాడ్‌లలో పర్యటించింది. ఈ పర్యటనలో ఆమెను ఉంచిన ప్రాంతాలను, వైద్య చికిత్స చేసిన జయపురం ప్రభుత్వ సబ్‌డివిజన్ ఆస్పత్రిని సందర్శించి అనేక విషయాలను తెలుసుకుంది. ఢిల్లీ నుంచి వచ్చిన జాతీయ మానవ హక్కుల కమిషన్ టీమ్‌లో కొంతమంది జయపురం, కొట్‌పాడ్‌లలో పర్యటించి అనేక విషయాలపై దర్యాప్తు జరిపినట్లు సమాచారం. రవిసింగ్ నేతృత్వంలో టీమ్ మొదట కొట్‌పాడ్ వెళ్లి అక్కడ శిశు పరిరక్షణ కేంద్రాన్ని సందర్శించింది. ఆ కేంద్రంలో కుందులి బాధితురాలిని అధికారులు కొన్ని రోజులు ఉంచారు. ఆమె అక్కడ ఉన్న సమయంలో ఇతరులతో ఎలా ఉండేది, ఆమె మానసిక పరిస్థితి ఏ విధంగా ఉండేది. ఆమె అక్కడ ఉన్న వారితో ఏమైనా చెప్పిందా? ఎన్నాళ్లు కేంద్రంలో ఉంది? తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ పూర్తి వివరాలు సేకరించిన టీమ్ జయపురం వచ్చి బాధితురాలిని అధికారులు కొద్దిరోజులు ఉంచిన స్టేహోంను సందర్శించింది. అక్కడ ఉన్నవారిని బాధితురాలి వివరాలు అడిగి తెలుసుకుంది. వైద్యాధికారి విచారణ ఆమె స్టేహోంలో ఉన్న సమయంలో అనారోగ్యానికి గురైతే వైద్యం కోసం ఎక్కడికి తీసుకు వెళ్లారని స్టే హోం నిర్వాహకులను అడిగి తెలుసుకుంది. ఆ సమయంలో బాధితురాలిని జయపురం సబ్‌డివిజన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన విషయం తెలుసుకుని ఆస్పత్రిని సందర్శించింది. హాస్పిటల్లో బాధితురాలు ఉన్న సమయంలో ఆమెకు ఎవరు ట్రీట్మెంట్ చేశారు. ఆమె పరిస్థితి ఎలా ఉండేదని అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంలో టీమ్ ప్రతినిధులు పలువురు ఆస్పత్రి ఉద్యోగులను విచారణ చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా జయపురం హాస్పిటల్లో ఉన్న సమయంలో బాధితురాలు ఆత్మహత్యకు ప్రయత్నించిన విషయంపై సబ్‌డివిజన్ ప్రభుత్వ హాస్పిటల్ అధికారి డాక్టర్ దొధిబామణ త్రిపాఠిని ప్రశ్నించినట్లు తెలిసింది. అక్కడి నుంచి జాతీయ మానవ హక్కుల కమిషన్ టీమ్ భరిణిపుట్ గ్రామ పంచాయతీ బి.మాలిగుడలో బాధితురాలి బంధువుల ఇంటికి వెళ్లి వారికి తెలిసిన వివరాలు సేకరించారు. ఈ పర్యటనలో మానవ హక్కుల కమిషన్ బృందంతో పాటు కొరాపుట్ జాల్లా శిశు సురక్షా సమితి అధికారి, పోలీసులు ఉన్నారు. -
భారీగా గంజాయి స్వాధీనం
జయపురం: కొరాపుట్ జిల్లా లమతాపుట్ సమితి మాచ్‌ఖండ్–లమతాపుట్ మార్గంలో పోలీసులు పెద్ద ఎత్తున గంజాయి పట్టుకున్నారు. లమతాపుట్, మాచ్‌ఖండ్, ఒనకఢిల్లీ, మొదలగు ప్రాంతాలలో గంజాయి అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతుండడంతో పోలీసులు ఆయా ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించారు. మాచ్‌ఖండ్, లమతాపుట్, జోళాపుట్ పోలీసులు సంయుక్తంగా పెట్రోలింగ్ జరుపుతుండగా లమతాపుట్–మాచ్‌ఖండ్ మార్గంలో సిందిపుట్ నదీ ఘాట్ వద్ద కొంతమంది గంజాయి తరలించేందుకు యత్నిస్తున్నారు. ఆ సయంలో పోలీసులు అటువైపు రావటం చూచిన వారు గంజాయిని, వాహనాన్ని వదిలిపెట్టి పరారీ అయ్యారు. పోలీసులు గంజాయిని, వాహనాన్ని స్వాధీన పరచుకొన్నారు. మాచ్‌ఖండ్ తహసీల్దార్, మెజిస్ట్రేట్ కర్ణదేవ్ సమర్ధర్, నందపూర్ ఎస్డీపీవో శివరాం నాయిక్ సమక్షంలో తూయగా 40 క్వింటాళ్ల 40 కేజీలు ఉన్నట్టు వెల్లడైంది. పట్టుబడిన గంజాయి విలువ దాదాపు రూ. 20 లక్షలు ఉంటుందని అంచనా. ఈ దాడిలో మాచ్‌ఖండ్ పోలీసు అధికారి తపన కుమార్ నాహక్, జోలాపుట్ పోలీసు అధికారి మహేశ్ కిరిససాని, లమతాపుట్ పోలీసు అధికారి శివప్రసాద్ షొడంగి, తదితర సిబ్బంది పాల్గొన్నారు. -
బాలిక కిడ్నాప్ కేసులో ముద్దాయిలకు యావజ్జీవం
జయపురం: ఒక బాలికను కిడ్నాప్ చేసిన కేసులో 16 ఏళ్ల తరువాత కొరాపుట్ జయపురం జిల్లా జడ్జి ఐదుగురు ముద్దాయిలకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ సంచలనాత్మక తీర్పునిచ్చారు. శిక్ష పడిన ముద్దాయిలు జయపురం పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సి. భుజంగఆచారి, కె. స్వామికృష్ణ, టి. రాకేష్ కుమార్,సి. కిరణ్ కుమార్, సుమేష్ శెట్టిలు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. కొరాపుట్ టెలికాం డివిజన్ మేనేజర్ కె. రాజశేఖర్ 4 యేళ్ల కుమార్తె 2002 డిసెంబర్ 18వ తేదిన ఉదయం 11.15గంటల సమయంలో పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న సమయంలో కిడ్నాప్ చేసి తండ్రి రాజశేఖర్‌కు ఫోన్ చేసి రూ. 10 లక్షలు డిమాండ్ చేశారు. కిడ్నాపర్లు సూచించిన ప్రకారం రాజశేఖర్ డబ్బుతో ఘాట్‌గుమార్ సమీపంలోగల కారభైరవ మందిరం వద్దకు వెళ్లారు. అయితే అక్కడ ఎవరూ లేకపోవడంతో రాజశేఖర్ తిరిగి వెళ్లిపోయారు. ఈ మేరకు రాజశేఖర్ కొరాపుట్ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఆ మరునాడు 19వ తేదీన కొరాపుట్ కాఫీబోర్డు ప్రాంతంలో ఒక విద్యార్థినిని చూసి ఆమెను రాజశేఖర్ ఇంటికి తీసుకువచ్చి అప్పగించారు. తరువాత పోలీసులు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఇద్దరు నిందితులు నిర్దోషులుగా విడుదల కేసును సుదీర్ఘంగా విచారించిన జిల్లా జడ్జి విద్యుత్ కుమార్ మిశ్రా 24 మంది సాక్షులను విచారించి ఐదుగురు నిందితులను దోషులుగా నిర్ధారించి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. అంతేకాకుండా ఒక్కొక్కరికి రూ. 10వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించలేకపోతే మరో రెండేళ్ల జైలు జీవితం గడపాలని తీర్పులో స్పష్టం చేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులు ఎస్. కామేశ్వర రావు, కైలాశ ఖొరలను నిర్దోషులుగా విడిచిపెట్టారు. మరో నిందితుడు ఉమానాయక్ మరణించాడు. ఈ కేసును ప్రభుత్వ న్యాయవాది కైలాస్‌పట్నాయక్ వాదించారు. -
ముగ్గురు యువతుల అదృశ్యం
జయపురం: వారపు సంతకు వెళ్లిన ముగ్గురు యువతులు 5 రోజులుగా కనిపించడం లేదని వారి కుటుంబసభ్యులు చందాహండి పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. తమ పిల్లల కోసం అన్ని ప్రాంతాలలోను వెతికినా ఆచూకీ తెలియరాలేదని పోలీసుల ముందు వాపోయారు.. బాధితులు పోలీసులకు తెలిపిన ఫిర్యాదు ప్రకారం వివరాలిలా ఉన్నాయి. నవరంగ్‌పూర్ జిల్లా చందాహండి పోలీస్‌స్టేషన్ పరిధిలోని బటిపడ గ్రామానికి చెందిన విక్రమనాయక్ కుమార్తె తహీరామణి నాయక్, అదే గ్రామానికి చెందిన సజన్ మఝి కుమార్తె రంజుల మఝి, కౌశల్య బాగ్ కుమార్తె ధనమతి బాగ్‌లు చందాహండిలో జరిగే వారపు సంతకు వెళ్లారు. అయితే సంత ముగిసినా వారు ఇంటికి తిరిగి రాలేదు. సంతలోను, బంధువుల ఇళ్లలోను స్నేహితులను, అడిగామని అంతేకాకుండా అన్ని ప్రాంతాలలోను వెతికినా వారి జాడ తెలియలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ బిడ్డల జాడ తెలుసుకోవాలని పోలీసులను కోరారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చందాహండి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఇంతకీ 5 రోజులుగా కనిపించని ఆయువతులు ఏమయ్యారన్నది చ్చనీయాంశమైంది. -
సెక్స్‌రాకెట్ గుట్టురట్టు
భువనేశ్వర్(జయపురం): ఒడిశాలోని జయపురంలో ఓ సెక్స్‌రాకెట్ గుట్టు రట్టయింది. పట్టణ శివారులో గల కుంభారిసాహిలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని కొంతకాలంగా బ్రోతల్ హౌస్‌ను నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వారు ఆకస్మిక దాడులు నిర్వహించి ఆరుగురు మహిళలతో పాటు ముగ్గురు విటులను పట్టుకున్నారు. పట్టుబడిన మహిళలలో కేంద్రపడ, మల్కన్‌గిరి, జయపురంలకు చెందిన యువతులు ఉన్నారని పట్టణ పోలీసు అధికారి తపణ నారాయణ రథ్ విలేకరులకు వెల్లడించారు. పట్టుబడిన విటులలో గోవింద హల్వ(28) తిరుపతి బాగ్(21)కృష్ణ బెహర(32)లు ఉన్నట్లు తెలియజేశారు. పట్టుబడిన మహిళలో ఒకామెకు బిడ్డ కూడా ఉంది. తాము మహిళా పోలీసులతో పాటు దాడి జరిపామని వారి వద్ద 18 అశ్లీల సీడీలతో పాటు కండోమ్‌లు, రూ.11వేలు లభించాయని వెల్లడించారు. వారిని జయపురం ప్రభుత్వఆస్పత్రికి తరలించి వైద్యపరీక్షలు జరిపించామని అనంతరం కోర్టులో హాజరుపరిచామని తెలిపారు. ఈ దాడిలో జయపురం పట్టణ పోలీసులు, సదర్ పోలీసులతో పాటు మహిళా పోలీసులు పాల్గొన్నారు. ఈ దాడులకు జయపురం ఏఎస్పీ ప్రభాత్ కుమార్ ప్రధాన్, పట్టణ పోలీసు అధికారి తపణ నారాయణ రథ్ నాయకత్వం వహించారు. సమాచారం అందిస్తే ఆట కట్టిస్తాం ఇంటి యజమాని తెలిపిన వివరాల ప్రకారం రెండు నెలల కిందట గోవింద హల్వ అనే వ్యక్తి వారి వద్దకు వచ్చి తాను భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ)జయపురంలో పనిచేస్తున్నానని చెప్పి ఇంటిని అద్దెకు అడిగాడని వెల్లడించారు. కుటుంబంతో ఉంటామని చెప్పాడని తమకు తెలిసిన కొంత మందిని వాకబు చేయగా అతడు మంచి వాడని తెలపడంతో ఇంటిని అద్దెకు ఇచ్చామని ఆయన వెల్లడించాడు. తమ ఇంటిని వ్యభిచార గృహంగా చేస్తాడని ఊహించలేక పోయామని వాపోయాడు. జయపురం పట్టణంలో కొన్ని ప్రాంతాల్లో కొంత మంది వ్యభిచార గృహాలను నడుపుతునారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయని పక్కా సమాచారం అందితే దాడులు జరిపి ఆటకట్టిస్తామని పోలీసులు అధికారులు తెలిపారు. ఈ సెక్స్ రాకెట్‌కు ప్రధాన సూత్రదారి గోవిందహల్వ అని భావిస్తున్నారు. విలేకరుల సమావేశంలో జయపురం సబ్‌డివిజనల్ పోలీసు అధికారి రాజేష్ కుమార్ శనాపతి కూడా పాల్గొన్నారు.