
కాళ్లూచేతులు లేని శిశువు
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొరిగుమ్మ సమితి కుములి ప్రాథమిక వైద్య కేంద్రంలో ఓ గర్భిణి శుక్రవారం వింతశిశువును ప్రసవించింది. జన్మించిన శిశువుకు కాళ్లూచేతులు లేకపోవడం గమనించిన వైద్యులు కొరాపుట్ సహిద్ లక్ష్మణ నాయక్ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. శిశువు అలా జన్మించడానికి గల కారణాలను వైద్యులు అధ్యయనం చేస్తున్నారు. అయితే జన్మనిచ్చిన తల్లి పోషకాహారం సరిగ్గా తీసుకోకపోవడంతో శిశువు ఈ విధంగా జన్మించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
చదవండి: వింత.. శిశువు కాలికి తొమ్మిది వేళ్లు