భువనేశ్వర్: చిమ్మచీకటి.. జోరు వర్షంలో బస్తాలో చుట్టి, పసికందును విసిరేసిన తల్లిదండ్రుల కాఠిన్యానికి పిడుగులు కూడా మిన్నకుండిపోయాయి. జనం కంట కనిపించే వరకు మెరుపులే తోడుగా నిలిచి, ముక్కు పచ్చలారని చిన్నారిని కాపాడుకున్నాయి. మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న ఈ ఘటన మానవత్వానికి మాయని మచ్చగా తారస పడింది.
వివరాల్లోకి వెళ్లే శనివారం వేకువజామున మల్కన్‌గిరి తోలాసాహి(దిగువ వీధి) వైపు వెళ్తున్న స్థానికులకు ఏడుపు వినిపించడంతో వెళ్లి చూడగా, చెత్తకుప్ప వద్ద బియ్యం బస్తాలో చుట్టి ఉన్న పసికందు కనిపించింది. వెంటనే చైల్డ్‌లైన్ సిబ్బందికి సమాచారం అందించడంతో పాటు మల్కన్‌గిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. బిడ్డ ఆరోగ్యంగానే ఉందని, పుట్టి ఒక రోజే కావస్తుందని తెలిపారు. ఆస్పత్రికి చేరుకున్న ఐఐసీ రీగాన్ కీండో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పసికందు తల్లిదండ్రుల వివరాలపై ఆరా తీస్తున్నారు.
చదవండి విదేశీయుని వద్ద రూ.5000 చలానా వసూలు చేసిన పోలీసు.. రిసిప్ట్ ఇవ్వకుండానే.. వీడియో వైరల్..
Comments
Please login to add a commentAdd a comment