Garbage
-
హైదరాబాద్ మహానగరంలోని చెత్త ఇక్కడికే..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్ (Pyaranagar)లో ఏర్పాటు చేస్తున్న వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టుపై స్థానికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. నగరంలో ప్రతీరోజు సుమారు 7,500 టన్నుల చెత్త ఉత్పత్తి కాగా ఇందులో శేరిలింగంపల్లి, కూకట్పల్లి (Kukatpally) జోన్ల పరిధిలో నిత్యం ఉత్పత్తి అయ్యే సుమారు 1,900 టన్నుల చెత్తను ప్యారానగర్ డంప్‌యార్డుకు తరలించనున్నారు. ఈ భారీ డంప్‌యార్డుతో తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందని, ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానికులు పోరాటం చేస్తున్నారు.గుమ్మడిదల (Gummadidala) మండలం ప్యారానగర్, నల్లవల్లి, మాంబాపూర్ తదితర గ్రామాలతోపాటు, మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే శివంపేట, నావపేట గ్రామస్తులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అఖిలపక్షంగా ఏర్పడి ఈ యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు మంగళవారం అర్ధరాత్రి దాటాక ఈ యార్డు నిర్మాణానికి అవసరమైన మెటీరియల్‌ను తరలించడంతో స్థానికులు ఒక్కసారిగా నిరసనకు దిగారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని భారీ ఎత్తున మోహరించిన పోలీసులు నిరసన వ్యక్తం చేస్తున్న వారిని వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు.పచ్చని పంట పొలాల్లో ఈ డంప్‌యార్డు (Dump Yard) ఏర్పాటు చేస్తున్న ప్యారానగర్ చుట్టుపక్కల మొత్తం పచ్చని పంట పొలాలే ఉన్నాయి. వ్యవసాయమే జీవనాధారమైన మా పంట పొలాల్లో చెత్త డంప్‌యార్డు పెట్టొదంటూ రైతులు వాపోతున్నారు. ఈ యార్డుతో వెలువడే కాలుష్యంతో చెరువులు, కుంటలే కాదు, భూగర్భ జలాలు కూడా కలుషితమై పంటలు పండించుకునే పరిస్థితి లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణం ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.చదవండి: ‘టక్కరి దొంగ’.. ఎవరికీ అర్థం కాకుండా కొట్టేశాడునాయకుల ముందస్తు అరెస్ట్ డంపింగ్‌యార్డ్ నిర్మాణ పనులను అడ్డుకోకుండా కొంతమంది నాయకులను పోలీసులు అర్ధరాత్రి ముందస్తు అరెస్టు చేసి కంది మండలంలోని బేగంపేట్ పోలీస్ శిక్షణ కేంద్రానికి తరలించారు. ఇక అదేసమయంలో జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు డంపింగ్‌యార్డ్ నిర్మాణం చేపట్టడానికి ప్రయత్నించారు. డంపింగ్‌యార్డ్ పనులతోపాటు అక్రమ అరెస్టులను వ్యతిరేకిస్తూ అఖిలపక్ష నాయకులు, గ్రామస్తులతో కలసి ఆందోళనకు దిగారు. పోలీసులు ఆందోళనకారులందర్నీ అరెస్టు చేశారు. ప్యారానగర్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. -
గార్బేజ్ ఎంజైమ్ : పండ్లు, కూరగాయ మొక్కలకు ఈ ద్రవం ఇచ్చారంటే!
కూరగాయల వ్యర్థాలను మురగ బెడితే గార్బేజ్ ఎంజైమ్ తయారవుతుంది. భూసార వర్థినిగా, పురుగుల మందుగా ఉపయోగపడుతుంది. థాయ్‌లాండ్‌కు చెందిన డాక్టర్ రోసుకాన్ పూమ్ పాన్వాంగ్ ఈ ఎంజైమ్‌ను తొలుత తయారు చేశారు. కూరగాయలు, పండ్ల తొక్కలు, ముక్కలు.. మార్కెట్లలో చెత్తకుప్పలో పోసిన మిగలపండిన పండ్లు, కూరగాయలు వంటివి ఎందుకూ పనికిరాని వ్యర్థాలే కదా అని అనుకోనక్కర్లేదు. వీటికి కొంచెం నల్లబెల్లం లేదా మొలాసిస్ లేదా సేంద్రియ పంచదార కలిపితే 90 రోజుల్లో గార్బేజ్ ఎంజైమ్ తయారవుతుంది.గార్బేజ్ ఎంజైమ్ తయారీ ఇలా.. మూత బిగుతుగా పెట్టడానికి వీలుండే గాజు లేదా పలాస్టిక్/ఫైబర్ డ్రమ్ముల్లో దీన్ని తయారు చేయవచ్చు. కావాల్సిన పదార్థాలు : కూరగాయలు, పండ్ల వ్యర్థాలు (తొక్కలు, ముక్కలు, కుళ్లినవి) 3 పాళ్లు + నల్ల బెల్లం లేదా మొలాసిస్ లేదా సేంద్రియ (బ్రౌన్) పంచదార 1పాలు + నీరు 10 పాళ్ల చొప్పున కలపాలి.మార్కెట్లు, దుకాణాల్లో మిగిలిపోయిన, కుళ్లిపోయిన కూరగాయలు, పండ్లను ముక్కలు చేసి వాడుకోవచ్చు. మిగిలిపోయిన అన్నం, కూరలు కూడా కలపవచ్చు. అయితే, జారుగా ఉండే గ్రేవీ కలపకూడదు. మాంసం, మందంగా ఉండే పనస పండ్ల తొక్కలు కలపకూడదు. ఈ మిశ్రమాన్ని ప్లాస్టిక్ డబ్బాలో వేసి గాలి చొరబడకుండా గట్టిగా మూత బిగించాలి. ఎండ తగలకుండా సాధారణ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ ఉంచాలి. 90 రోజులకు గార్బేజ్ ఎంజైమ్ సిద్ధమవుతుంది. మొదటి 30 రోజుల పాటు.. రోజుకోసారి మూత తీసి వాయువులు బయటకు వెళ్లాక, మళ్లీ గట్టిగా మూత బిగించాలి. ఆ తర్వాత 60 రోజుల పాటు మూత తీయనక్కర్లేదు. ద్రావణం పులియటం వల్ల తెల్లటి పొర ఏర్పడుతుంది. మొత్తం 90 రోజులు గడిచాక ద్రావణాన్ని వడకట్టి, నిల్వ చేసుకొని అక్కడి నుంచి 60 రోజుల వరకు వాడుకోవచ్చు. వడపోతలో వచ్చే వ్యర్థాలను ఎండబెట్టి మొక్కలకు ఎరువుగా వాడవచ్చు లేదా మళ్లీ గేర్బేజ్ ఎంజైమ్ తయారీకి వాడుకోవచ్చు. (ఫ్యామిలీ ఫార్మింగ్ : విద్యార్థులకు ప్రకృతి సేద్య శిక్షణ)పలు ప్రయోజనాలుగార్బేజ్ ఎంజైమ్ లో ఉన్న సూక్ష్మజీవరాశి, ఔషధ గుణాలు నేలను సారవంతం చేస్తాయి. ఇది సహజ భూసార వర్థినిగా, కీటకనాశనిగా పనిచేస్తుంది. తెగుళ్లు బారి నుంచి పంటలను కాపాడుకోవచ్చు. దీన్ని వాడితే పంట మొక్కల్లో నత్రజనిని గ్రహించే శక్తి పెరుగుతుంది. గార్బేజ్ ఎంజైమ్‌ను నీటిలో తగినపాళ్లలో కలిపి వాడుకోవాలి. ఎరువుగా.. 1:1000 పాళ్లలో(అంటే.. 1 మిల్లీలీటరు ఎంజైమ్‌కు 100 మిల్లీలీటర్ల నీరు) కలిపి నేలలో పోయవచ్చు లేదా పిచికారీ చేయవచ్చు. పురుగులు/ తెగుళ్ల నాశినిగా.. 1:100 మోతాదులో కలిపి పిచికారీ చేయాలి. దిగుబడి పెంపుదలకు.. 1:500 పాళ్లలో కలిపి పిచికారీ చేయాలి. -
తెల్లవారితే కూడు దక్కక.. పొద్దు వాలితే గూడు లేక.. బతకు ‘వ్యర్థ’మేనా?
తెల్లవారితే కూడు దక్కక.. పొద్దు వాలితే గూడు చిక్కక బాధలు మోసే అభాగ్యులకు వ్యర్థాలే జీవనాధారంగా మారుతున్నాయి. పిడికెడు మెతుకుల కోసం పేగులు మెలిపెట్టే దుర్వాసన వెదజల్లుతున్న మురుగునీటిలో వస్తువుల కోసం అన్వేషిస్తున్నఈ వ్యక్తి చిత్రాన్ని విశాఖ కాన్వెంట్ జంక్షన్ వద్ద సాక్షి కెమెరా క్లిక్ మనిపించింది.– పీఎల్ మోహన్‌రావు, సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
ట్రంప్ పుట్టిని ప్యూర్టోరీకో ముంచుతుందా?
విశాలమైన రహదారిపై ప్రయాణం సాఫీగా సాగుతున్న వేళ జరిగే ఓ చిన్న పొరపాటు పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చిట్టచివరి భారీ బహిరంగ సభ అనూహ్యంగా పెద్ద వివాదానికి, జాత్యహంకార వ్యాఖ్యలు వేదికగా మారింది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో జరిగిన ప్రచార కార్యక్రమం చివరకు లాటిన్ అమెరికన్లు, యూదులు, ఆఫ్రో అమెరికన్లపై జాత్యహంకార వ్యాఖ్యలతో వివాదాస్పదంగా ముగిసింది.దీంతో రిపబ్లికన్ పార్టీ పట్ల ఆయా వర్గాల ఓటర్లలో ఆగ్రహం కట్టలు తెంచుకుందని కథనాలు వెలువడుతున్నాయి. వివాదం చిలికిచిలికి గాలివానగా వ్యతిరేక ఓట్ల దుమారంగా మారితే ట్రంప్ విజయావకాశాలు సన్నగిల్లే ప్రమాదముంది. కరేబియన్ దీవుల్లో ఒకటైన ప్యూర్టోరీకో అమెరికా అ«దీనంలో ఉంది. ఇక్కడి ద్వీపవాసులకు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటువేయకపోయినా పెద్దసంఖ్యలో ప్యూర్టోరికో వారసులు అమెరికాలోని 50 రాష్ట్రాల్లో ఓటర్లుగా నివసిస్తున్నారు. తమ ద్వీపాన్ని అవహేళన చేయడంతో వాళ్లంతా ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటేసే అవకాశముంది.అసలేం జరిగింది?ఆదివారం జరిగిన ఈ సభలో ట్రంప్, భార్య మెలానియా ప్రసంగించారు. వీరితోపాటు ప్రపంచకుబేరుడు ఎలాన్ మస్క్ సైతం పాల్గొన్నారు. కార్యక్రమానికి ఊపు తెచ్చేందుకు ప్రచారానికి మరింత పాపులారిటీ వచ్చేందుకు స్టాండప్ కమేడియన్ టోనీ హించ్క్లిఫ్తో మాట్లాడించారు. నవ్వించాల్సిన ఆయన పలు వర్గాల ఓటర్లలో ఆగ్రహజ్వాలలు రగిల్చారు. ‘‘సముద్రం మధ్యలో కదిలే చెత్త కుప్ప ఒకటుంది. అదేంటో తెలుసా?. అదే ప్యూర్టోరీకో’’ అని హించ్‌క్లిఫ్ చేసిన వ్యాఖ్యలతో అమెరికాలోని ప్యూర్టోరికన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.లక్షలాది మంది ప్యూర్టోరీకన్లకు అమెరికా పౌరసత్వం ఉంది. దశాబ్దాలుగా పోలింగ్‌లో క్రియాశీలకంగా ఉన్నారు. 2022 గణాంకాల ప్రకారం ప్యూర్టోరికో మూలాలున్న అమెరికా ఓటర్లు ఏకంగా 60 లక్షల మంది ఉన్నారని తెలుస్తోంది. 1898లో స్పానిష్–అమెరికా యుద్ధం తర్వాత స్పెయిన్ వలసరాజ్యమైన ఫ్యూర్టోరీకోను అమెరికా తన వశం చేసుకుంది. 1917లో తొలిసారిగా అక్కడి వారికి అమెరికా పౌరసత్వం ఇచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్యూర్టోరికన్లు అమెరికాకు లక్షలాదిగా వలసవచ్చారు. అమెరికా ఓటర్లలో మెక్సికన్ల తర్వాత హిస్పానియన్ మూలాలున్న ఓటర్లలో రెండో అతిపెద్ద వర్గంగా ప్యూర్టోరికన్లు నిలిచారు. సొంత ద్వీపం కంటే అమెరికా గడ్డపై నివసించే వాళ్లే ఎక్కువ. కీలక రాష్ట్రాల్లో వీరి ప్రభావమెంత?ఏ పార్టీ కీ మద్దతు తెలపని తటస్థ ఓటర్లు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలనే స్వింగ్ స్టేట్స్ అంటారు. మద్దతు పలికే రాష్ట్రాలను ఆయా పార్టీ లు ఎలాగూ గెల్చుకుంటాయి. కానీ స్వింగ్ రాష్ట్రాల ఓటర్లు ఎవరికి ఓటేస్తారో తెలీదుకాబట్టి వీళ్లను ప్రసన్నం చేసుకోవడమే ట్రంప్, హారిస్‌కు ముఖ్యం. పెన్సిల్వేనియా స్వింగ్ రాష్ట్రంలో 3.7 శాతం రాష్ట్రజనాభాకు సమానమైన 4.86 లక్షల మంది ప్యూర్టోరికన్లు ఉన్నారు. 19 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్న ఈ రాష్ట్రాన్ని గెల్చుకోవడం తప్పనిసరి. ఇక్కడ హారిస్‌పై ట్రంప్ కేవలం 0.2 శాతం ఆధిక్యతతో కొనసాగుతున్నారు. తాజా ఉదంతంలో ఈ ఆధిక్యత మటుమాయమై ట్రంప్ వెనుకంజ వేయడం ఖాయమని వార్తలు వస్తున్నాయి. జార్జియాలోనూ 1.31 లక్షల మంది ప్యూర్టోరికన్లు ఉన్నారు. ఇక్కడ కూడా హారిస్‌పై ట్రంప్ ఆధిక్యత స్వల్పంగా ఉంది. వీళ్ల కోపంతో ఆ ఆధిక్యత పోవచ్చని విశ్లేషణలు వస్తున్నాయి. నార్త్ కరోలినా రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి ఉందని తెలుస్తోంది. స్వింగ్యేతర రాష్ట్రాల పరిస్థితి ఏంటి ? ఏదో ఒక పార్టీ కే మద్దతు పలికే రాష్ట్రాల్లోనూ ప్యూర్టోరికన్ల ప్రభావం ఉండొచ్చని తెలుస్తోంది. ఫ్లోరిడా రాష్ట్రంలో వీళ్లు ఏకంగా 12 లక్షల మంది ఉన్నారు. కనెక్టికల్ రాష్ట్ర జనాభాలో 8 శాతానికి సమానంగా 3 లక్షల మంది ప్యూర్టోరికన్లు ఉన్నారు. మసాచుసెట్స్లోనూ 3.26 లక్షల మంది వీళ్లే ఉన్నారు. న్యూయార్క్ రాష్ట్రంలో ఏకంగా పది లక్షల మంది వీళ్లే ఉన్నారు. ఇన్నేసి లక్షల మంది ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటేస్తే హారిస్ విజయం నల్లేరుపై నడకేనని కథనాలు వెలువడుతున్నాయి. గతంలో జాత్యహంకార వ్యాఖ్యలుట్రంప్ జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన ఘటనలు గతంలోనూ ఉన్నాయి. 2018లో ఎల్‌సాల్విడార్, హైతీ, ఆఫ్రికా ఖండ దేశాలను దారుణంగా కించపరుస్తూ ట్రంప్ మాట్లాడారు. గత వారం సైతం వలసలపై ప్రసంగంలో ‘‘అమెరికా చెత్తకుప్పనా ఏంటి?. వ్యర్థాలు(వలసలు) అన్నీ అమెరికాకే వస్తున్నాయి’’ అని వ్యాఖ్యానించడం తెల్సిందే. తాను అధికారంలోకి వచ్చాక దేశ చరిత్రలో కనీవినీ ఎరుగనిరీతిలో అనధికార వలసదారుల బహిష్కరణ కార్యక్రమం చేపడతానని ట్రంప్ అన్నారు. దీనికితోడు ఆదివారం హించ్‌క్లిఫ్ చేసిన వ్యాఖ్యలు ప్యూర్టోరీకో మూలాలున్న ప్రముఖుల్లో ఆగ్రహజ్వాలలను ఎగసేలా చేసింది. జెన్నీఫర్ లోపేజ్, రికీ మార్టిన్, బ్యాడ్ బన్నీ ఇలా పలువురు ప్యూర్టోరికో సంగీత దిగ్గజాలూ తమ నిరసన వ్యక్తంచేశారు. ‘‘ ట్రంప్ సంగతి తెల్సిందే. గెలిస్తే తానెంత ప్రమాదకరమో, దేశ ప్రజల మధ్య ఎంతగా విభజన తీసుకురాగలరో మరో సారి నిరూపించుకున్నారు’’ అని కమలా హారిస్ విమర్శించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పట్టణాల్లో 83 లక్షల టన్నుల చెత్త
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సమస్యగా మారిన చెత్త తొలగింపును యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సీఎం చంద్రబాబు మునిసిపల్ అధికారులను ఆదేశించారు. పట్టణాల్లో 83 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త ఉందని, దీనిని వచ్చే జూన్ నాటికి పూర్తిగా తొలగించాలన్నారు. శుక్రవారం రాత్రి సచివాలయంలో మునిసిపల్ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, వేస్ట్ మేనేజ్మెంట్, టౌన్ ప్లానింగ్, టిడ్కో ప్రాజెక్టులపై చర్చించారు. ఈ సందర్భంగా వేస్ట్ టు ఎనర్జీ, చెత్త నుంచి సంపద కేంద్రాలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చి చెత్త సమస్యకు పరిష్కారం చూపాలని సీఎం ఆదేశించారు. సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పక్కాగా జరగాలని, మార్పు రాష్ట్రంలో ప్రతిచోట కనిపించాలన్నారు. వచ్చే గాంధీ జయంతి నాటికి సాలిడ్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గాడిలో పడాలని సూచించారు. టీడీఆర్ బాండ్లలో జరిగిన అక్రమాలపై సమగ్ర సమాచారం సేకరించాలని, ఇప్పటికే వెలుగు చూసిన ఘటనపై మరింత సమాచారం సేకరించడంతో పాటు ఇతర కార్పొరేషన్లలో జరిగిన అక్రమాలను సైతం బయటకు తీయాలన్నారు. యూఎల్బీల్లో 50 లక్షల గృహాలు ఉండగా, 30 లక్షల ఇళ్లకు నీటి కుళాయి సౌకర్యం ఉందని, మరో 7.5 లక్షల ఇళ్లకు అమృత్ పథకం కింద కుళాయి ద్వారా నీరు ఇచ్చేందుకు పనులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. తిరుపతి, రాజమండ్రి, కాకినాడ, నెల్లూరులో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ టెండర్లు, ఇతర ప్రక్రియ వెంటనే పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని సీఎం ఆదేశించారు. టిడ్కో ఇళ్ల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దీనిపై ప్రత్యేకంగా సమీక్ష చేసి నిర్ణయాలు తీసుకుందామని చంద్రబాబు తెలిపారు. సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా చేయండిపార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శనివారం నుంచి అన్ని ప్రాంతాల్లోనూ ప్రారంభించాలని చంద్రబాబు పార్టీ నేతలు, శ్రేణులకు సూచించారు. ఉండవల్లిలోని తన నివాసంలో బుధవారం ఆయన పార్టీ నేతలతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. రూ.100 సభ్యత్వం తీసుకున్న పార్టీ కార్యకర్తలకు రూ.5 లక్షల వరకు ప్రమాద బీమా ఇస్తున్నామని తెలిపారు.ప్రమాద బీమా రూ.2లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచామని.. రూ.లక్ష కట్టిన వారికి టీడీపీ శాశ్వత సభ్యత్వం కల్పిస్తామని చెప్పారు. ఎవరైనా కార్యకర్త మృతిచెందితే అంత్యక్రియలకు రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు కూడా ఆయన తెలిపారు. త్వరలో రెండో విడత నామినేటెడ్ పోస్టులను భర్తీచేస్తానని చంద్రబాబు తెలిపారు. అమరావతి అభివృద్ధికి రూ.11 వేల కోట్లుఅమరావతి అభివృద్ధికి రూ.11 వేల కోట్ల ఆర్థిక రుణ సాయం అందించేందుకు హౌసింగ్, అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హడ్కో) అంగీకరించినట్లు చంద్రబాబు వెల్లడించారు. అమరావతిలో పదెకరాల్లో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్‌ను అభివృద్ధి చేసేందుకు కూడా హడ్కో సంసిద్ధత వ్యక్తంచేసిందని ఆయన తెలిపారు. హడ్కో చైర్మన్ సంజయ్ కుల్ శ్రేష్ఠ, ఇతర ప్రతినిధులతో శుక్రవారం ముఖ్యమంత్రి సచివాలయంలో భేటీ అయ్యారు. కాగా రాష్ట్రంలోని 55 వేల అంగన్వాడీ కేంద్రాల్లో వంటగ్యాస్ వినియోగాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టౌలను వినియోగించాలని, అందుకోసం ఎనర్జీ ఎఫిసియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్)ద్వారా సమన్వయం చేసుకోవాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
‘చెత్త’ పన్ను..చంద్రన్న ఘనతే
సాక్షి, అమరావతి: నిజం చెబితే తల వెయ్యి ముక్కలైపోతుందని చంద్రబాబుకు ముని శాపం ఉందంటారు! అందుకే ఆయన ఎప్పుడూ నిజం చెప్పరు. పైగా తాను చేసిన తప్పులను ఇతరులపై నెట్టేసి మంచిని మాత్రం తన ఖాతాలో వేసుకుంటారు. గత ప్రభుత్వం పురపాలక సంఘాల్లో చెత్త పన్ను విధించి ప్రజలను ఇబ్బంది పెట్టిందని డైవర్షన్ పాలిటిక్స్‌కు తెర తీసిన సీఎం చంద్రబాబు అసలు విషయాన్ని దాచిపెట్టి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అసలు ఇళ్ల నుంచి చెత్త సేకరణకు యూజర్ చార్జీల పేరుతో డబ్బులు వసూలు ప్రారంభించిందే తానేననే విషయాన్ని కప్పిపుచ్చి మభ్యపెడుతున్నారు.⇒ 2014లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సమాజాన్ని సమూలంగా మార్చేస్తామని, వీధుల్లో చెత్త అనేది లేకుండా చేస్తానని గొప్పగా ప్రకటించారు. తీరా కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చుపెట్టి వీధుల్లో చెత్తను తీసుకెళ్లి నగరం నడి»ొడ్డున గుట్టలుగా వేశారు. దాంతో అవి కొండల్లా పెరిగిపోయి ప్రజలకు రోగాలను తెచ్చిపెట్టాయి. ఈ పని చేసినందుకు ప్రతి ఇంటి నుంచి చెత్త పన్ను వసూలును ఆయన ఆనాడే ప్రారంభించారు. మున్సిపాలిటీల్లో చెత్త సేకరణకు ప్రజల నుంచి చార్జీల వసూలుకు ఆయా పాలక మండళ్లలో తీర్మానాలు చేయించారు. మున్సిపాలిటీలకు కేంద్రం నుంచి నిధులు రావాలంటే చెత్త సేకరణ చార్జీలు చెల్లించాలని నాడు చంద్రబాబే ప్రచారం చేశారు. 2016లో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లోను చెత్త సేకరణకు ఫీజు (చెత్త పన్ను) విధించి అమలు చేశారు. ⇒ గుంటూరులో దుకాణాలు, థియేటర్లు, ప్రైవేట్ హాస్టళ్లు, ఫంక్షన్ హాళ్లు, సూపర్ మార్కెట్లు, టీస్టాళ్ల నుంచి చెత్త తరలించేందుకు యూజర్ చార్జీలు వసూలు చేయాలని నాటి టీడీపీ సర్కారు ఉత్తర్వుల మేరకు నగరపాలక సంస్థ 2015 ఏప్రిల్‌లో తీర్మానించింది. విస్తీర్ణం, జనాభాను బట్టి గరిష్టంగా రూ.6 వేలు, కనిష్టంగా రూ.200 వసూలు చేయాలని నిర్ణయించారు. అదే ఏడాది మే నెలలో చెత్తను రోడ్లపై వేసినా, తగులబెట్టినా భారీగా జరిమానా విధిస్తూ నిర్ణయించారు. ఈమేరకు 2016 జూన్ 1వ తేదీ నుంచి అమలు చేస్తున్నట్టు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.⇒ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ)లో 2018 డిసెంబర్ నుంచి మున్సిపల్ సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్ రూల్స్–2016 ప్రకారం స్వచ్ఛ భారత్ మిషన్‌కు అనుబంధంగా ఘన వ్యర్థాల నిర్వహణను పటిష్టంగా అమలు చేసేందుకు యూజర్ చార్జీలు వసూలు చేయాలని చట్టం చేశారు. ప్రతి ఇంటికీ నెలకు రూ.50 చొప్పున, వాణిజ్య సముదాయాలైన సినిమాహాళ్లు, హోటళ్ల నుంచి రూ.5 వేలు, ఇతర సంస్థల నుంచి రూ.1,500 వసూలు చేశారు. ‘క్లాప్’తో మార్పు తెచ్చిన జగన్ ప్రభుత్వం పట్టణాలు, గ్రామాల్లో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు స్వచ్ఛ భారత్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌ను స్వచ్ఛంగా తీర్చిదిద్దేందుకు 2021 అక్టోబర్ 2న వైఎస్ జగన్ ప్రభుత్వం ‘క్లీన్ ఆంధ్రప్రదేశ్–జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 123 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని సుమారు 43 లక్షల గృహాల్లో ప్రతి ఇంటికీ రెండు చొప్పున 1.20 కోట్ల చెత్త డబ్బాలను పంపిణీ చేసింది.చెత్తను ఇంటివద్దే సేకరించి గార్బేజ్ స్టేషన్లకు తరలించేందుకు పీపీపీ విధానంలో 3,097 డీజిల్ ఆటో టిప్పర్లను, మరో 1,123 ఎలక్ట్రిక్ ఆటోలను రూ.60 కోట్లకు కొనుగోలు చేశారు. ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను శుద్ధి చేసేందుకు మున్సిపాలిటీల్లో 243 గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లను(జీటీఎస్) రూ.227.89 కోట్లతో నిర్మాణం చేపట్టింది. మురుగు శుద్ధికి ఎస్టీపీల నిర్మాణం, ఎప్పటి నుంచో పట్టణాల్లో పేరుకుపోయిన చెత్త డంపింగ్ యార్డ్ల్లోని లెగస్సీని తరలించే ప్రక్రియను సైతం చేపట్టింది. ఏడాది కాలంలోనే సుమారు రూ.2 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను అందుబాటులోకి తెచ్చి పట్టణాలు, నగరాలకు కొత్త రూపు తీసుకొచ్చింది. బాబు తప్పును సరిదిద్దిన జగన్⇒ టీడీపీ హయాంలో పన్ను విధించి మరీ వసూలు చేసిన చెత్తను జనావాసాల మధ్యే డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసి పారేయడంతో 123 మున్సిపాలిటీల్లో దాదాపు 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది. దుర్వాసనతో పాటు ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా పరిణమించడంతో గత ప్రభుత్వ హయాంలో తరలింపునకు చర్యలు చేపట్టడంతో పాటు 243 గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లను(జీటీఎస్) ఏర్పాటు చేసింది. వివిధ రకాల చెత్తను వేరుచేసి ఎరువు, విద్యుత్ కోసం వినియోగించారు. గుంటూరు, విశాఖపట్నం వద్ద చెత్త నుంచి విద్యుత్ తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేసింది. ⇒ జగన్ ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛతా కార్యక్రమాలు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నాయి. గతంలో కొండల్లా పేరుకుపోయిన చెత్తలో దాదాపు 50 లక్షల మెట్రిక్ టన్నులను వివిధ రూపాల్లో కరిగించారు. పట్టణాల్లో మధ్యలో ఉన్న డంపింగ్ యార్డులను పూర్తిగా తొలగించారు. 2021లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌లో విజయవాడ తిరుపతి, విశాఖపట్నంతో పాటు పుంగనూరు, నెల్లూరు బెస్ట్ అవార్డులు అందుకున్నాయి. 2022లో కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో టాప్–10 నగరాల్లో ఆరు రాష్ట్రానికే దక్కాయి. 2023లోనూ రాష్ట్రంలోని పలు నగరాలు అవార్డులను సొంతం చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించిన ఎన్జీటీ బృందం ఉత్తమ పారిశుధ్య విధానాలు, చెత్త నిర్వహణను అభినందించింది. ఎన్జీటీ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించని రాష్ట్రాలకు భారీస్థాయిలో జరిమానా విధించింది. -
పట్టపగలే రోడ్డు పక్కన మహిళపై అత్యాచారం
ఉజ్జయిని(మధ్యప్రదేశ్): చెత్త సేకరించే మహిళను పెళ్లి పేరుతో నమ్మించి మద్యం తాగించాడు. మత్తులో ఉన్న ఆమెపై పట్టపగలే రోడ్డు పక్కన షెల్టర్‌లో అత్యాచారానికి పాల్పడ్డాడు. దారిన వెళ్లే వారు ఆ ఘటనను తమ ఫోన్లలో చిత్రీకరించారే తప్ప, అడ్డుకోలేదు. తీవ్ర రాజకీయ దుమారానికి కారణమైన ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో చోటుచేసుకుంది. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే కోయ్లా పాఠక్ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం లోకేశ్ అనే వ్యక్తి చెత్త ఏరుకునే ఓ మహిళతో మాటలు కలిపాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఆమెకు మద్యం తాగించాడు. మత్తులో ఉన్న ఆమెను సమీపంలోనే రోడ్డు పక్కన షెల్టర్‌లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి వెళ్లాడు. అయితే, రోడ్డు పక్కన వెళ్లే వారు అసాంఘిక కృత్యాన్ని తమ సెల్ ఫోన్లలో బంధించారే తప్ప, అడ్డుకోలేదు. పైపెచ్చు, ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారు. వైరల్‌గా మారిన ఒక వీడియో పోలీసుల కంటబడింది. బాధిత మహిళ ఫిర్యాదుతో ఆ వీడియో ఆధారంగా పోలీసులు లోకేశ్‌ను అరెస్ట్ చేశారు. వీడియోలను సోషల్ మీడియాలో పెట్టిన నలుగురు అనుమానితుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు నగర పోలీస్ కమిషనర్ ప్రకాశ్ మిశ్రా తెలిపారు. బాధిత మహిళ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆమె ఇంట్లోనే ఉందని సీపీ చెప్పారు. -
ఊరూ.. వాడా.. చెత్తగుట్టలు
సాక్షి, అమరావతి: రాష్ట్రమంతటా వ్యాధులు ప్రబలుతున్నా పారిశుద్ధ్యం ప్రభుత్వానికి పట్టడం లేదు. ఎక్కడపడితే అక్కడ చెత్త కుప్పలు పేరుకుపోవడంతో అంటు రోగాలు, విష జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పట్టణాలు, నగరాల మాదిరిగానే రాష్ట్రంలోని దాదాపు 90 శాతానికి పైగా గ్రామాల్లో గత మూడేళ్లు కనీసం రెండు రోజులకు ఒకసారి ఇంటింటా చెత్త సేకరణ జరిగింది. గ్రామ పంచాయతీల్లో పనిచేసే క్లాప్ మిత్రలు ప్రతి రోజూ తమ పరిధిలోని ఇళ్ల వద్దకు వెళ్లి చెత్తను సేకరించేవారు. రాష్ట్రంలో 13,326 గ్రామ పంచాయతీలు ఉండగా గత రెండున్నర నెలలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటా చెత్త సేకరణ చేపట్టే పంచాయతీల సంఖ్య నామమాత్రంగా ఉంది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ వెబ్సైట్ ప్రకారం శనివారం (ఆగస్టు 24వ తేదీ) రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామ పంచాయతీలోనూ ఇంటింటి నుంచి చెత్త సేకరణ జరగలేదని గణాంకాలు పేర్కొంటున్నాయి.ఐదేళ్ల క్రితం కూడా ఇవే పరిస్థితులు నెలకొనగా మాజీ సీఎం వైఎస్ జగన్ 2021లో క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం ద్వారా ఇంటింటా చెత్త సేకరణను ప్రారంభించారు. గ్రామ పంచాయతీలపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు దాదాపు 14 వేల దాకా మూడు చక్రాల రిక్షాలు, వెయ్యి చెత్త సేకరణ ఆటోలతో పాటు గ్రామాల్లో దోమలు నియంత్రణకు ఫాగింగ్ కోసం 10,628 యంత్రాలు, 10,731 హైప్రెజర్ టాయిలెట్ క్లీనర్లు, 6,417 శానిటరీ వేస్ట్ ఇన్సినేటర్స్లను ప్రభుత్వ నిధులతో మంజూరు చేశారు. అధికారిక గణాంకాల ప్రకారం గత మూడేళ్లలో దాదాపు 75 వేల కోట్ల టన్నుల తడి, పొడి చెత్తను గ్రామాల్లో ఇంటింటా సేకరించారు. దీన్ని వర్మీ కంపోస్టుగా మార్చి విక్రయించడం ద్వారా ఆయా గ్రామాలు ప్రాథమిక దశలో రూ.5 కోట్ల మేర అదనపు ఆదాయాన్ని పొందాయి. ఇప్పుడు గ్రామాల్లో ఇంటింటా చెత్త సేకరణ నిలిచిపోవడంతో రోగాలు ముసురుకుంటున్నాయి.మంకీపాక్స్ నిర్ధారణ కిట్ తయారీసాక్షి, విశాఖపట్నం: ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న మంకీపాక్స్ వ్యాధిని గుర్తించేందుకు దేశంలోనే తొలిసారిగా ఆర్టీపీసీఆర్ కిట్ విశాఖలో తయారైంది. ఏపీ మెడ్‌టెక్‌జోన్‌లో ఉన్న ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్ సంస్థ ఎర్బా ఎండీఎక్స్ పేరుతో ఈ కిట్‌ను రూపొందించింది. ఈ ఆర్టీ–పీసీఆర్ టెస్టింగ్ కిట్‌కు భారత వైద్య పరిశోధన మండలి ధ్రువీకరణపత్రం అందించగా, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి అనుమతిని పొందింది. గంటలో మంకీపాక్స్ వ్యాధి నిర్ధారణ ఫలితాలు ఈ కిట్ ద్వారా తేలనుంది. కోవిడ్–19 మాలిక్యులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాబ్‌లలో వీటిని తయారు చేసి ప్రయోగాలు నిర్వహించినట్లు సంస్థ వ్యవస్థాపక చైర్మన్ సురేష్ వజిరానీ వెల్లడించారు. నేడు, రేపు దక్షిణ కోస్తా, సీమలో వానలుసాక్షి, విశాఖపట్నం: అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం కారణంగా తేమ గాలులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోకి నైరుతి దిశగా వస్తున్నాయి. ఈ కారణంగా ఆది, సోమ వారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ముఖ్యంగా తూర్పు గోదావరి నుంచి గుంటూరు జిల్లా వరకూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాల్లో రెండు రోజులపాటు వర్షాలకు ఆస్కారముంది. రాయలసీమ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు, అక్కడక్కడా మోస్తరు వానలు పడే సూచనలున్నాయి. ఈ నెల 27న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి 29, 30, 31 తేదీలు, సెప్టెంబర్ మొదటి వారంలో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.మార్చి 31లోపు రిటైరయ్యే వారికి బదిలీ వద్దు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది మార్చి 31లోగా పదవీ విరమణ చేసే ఉద్యోగులను బదిలీ చేయవద్దని, వారికి బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే ఏడాది మార్చి 31లోగా పదవీ విరమణ చేసే ఉద్యోగులను బదిలీ చేయాలంటే ప్రజా ప్రయోజనం దృష్ట్యా ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఉద్యోగులకు కూడా బదిలీలను వర్తింప చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. గతంలో జారీ చేసిన ఉత్తర్వుల్లో 15 శాఖలకు బదిలీలు వర్తింప చేయగా ఇప్పుడు 16వ శాఖగా ప్రాసిక్యూషన్ డైరెక్టరేట్‌కు వర్తింప చేశారు.మలేరియాలో కుప్పం మహిళ గల్లంతు తగిన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశం సాక్షి, అమరావతి: మలేరియా రాజధాని కౌలాలంపూర్‌లో ఫుట్‌పాత్ కుంగిపోవడంతో కుప్పం అనిమిగానిపల్లెకు చెందిన విజయలక్ష్మి (45) అనే మహిళ మురుగు కాలువలో పడి గల్లంతయ్యారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు తక్షణం గాలింపు చర్యలు చేపట్టే విధంగా మలేషియా అధికారులతో సంప్రదింపులు జరపాల్సిందిగా ఏపీ ఎన్ఆరీ్టఎస్ను ఆదేశించారు. మహిళ కుటుంబ సభ్యులకు తోడుగా ఉంటూ, గాలింపు చర్యలు పగడ్బందీగా జరిగేలా చూడాలన్నారు. మలేషియాలో గాలింపు చర్యలు జరుగుతున్నాయని, శనివారం రాత్రి వరకు గల్లంతైన విజయలక్ష్మి ఆచూకీ తెలియలేదని ఏపీ ఎన్ఆరీ్టఎస్ అధికారులు వెల్లడించారు. -
Amarnath Yatra 2024: యాత్రా మార్గంలో చెత్తకు చెక్ పెట్టేలా ఏర్పాట్లు
అమర్నాథ్ ధామ్ యాత్ర అంత్యంత వైభవంగా జూన్ 29న ప్రారంభంకానుంది. ఈ నేపధ్యంలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారయంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. సాధారణంగా అమర్నాథ్ యాత్రా మార్గంలో ప్రతీయేటా మూడు నుంచి నాలుగు వందల టన్నుల చెత్త పేరుకుపోతుంటుంది. అయితే ఈసారి అందుకు భిన్నమైన వాతావరణం కనిపించనుంది.ఒకవైపు అమర్నాథ్ యాత్ర జరుగుతుండగానే మరోవైపు ఈ మార్గంలో చెత్తను పారవేసే ప్రక్రియ కొనసాగనుంది. ఇందుకోసం స్వచ్ఛంద సంస్థలు, గ్రామీణాభివృద్ధి శాఖ సభ్యులు సేవలు అందించనున్నారు. యాత్రా మార్గంలో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా భక్తులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే భక్తులకు చెత్తవేసుకునే కిట్ అందించనున్నారు.యాత్రా మార్గంలో వ్యర్థాలను తొలగించేందుకు యంత్రాలను ఏర్పాటు చేశారు. బేస్ క్యాంప్, లంగర్, గుహ వరకు వ్యర్థ పదార్థాలను ఎక్కడపడితే అక్కడ పడవేయకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యాటక శిబిరాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని కూడా నిలిపివేశారు.అమర్నాథ్ యాత్రా మార్గంలో 2850 మరుగుదొడ్లు, 516 స్నాన ఘాట్లు నిర్మించారు. పరిశుభ్రతను ప్రోత్సహించేందుకు బేస్ క్యాంప్‌లలోని వివిధ ప్రదేశాలలో పోర్టబుల్ బాత్రూమ్లను కూడా ఏర్పాటు చేశారు. కశ్మీర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) వికె బిర్డి తాజాగా అమర్నాథ్ యాత్ర ప్రారంభమయ్యే ప్రదేశమైన చందన్వాడిని సందర్శించారు. ఈ సందర్భంగా పోలీసులు, సీఎపీఎఫ్ అధికారులతో భద్రతా చర్యలపై సమీక్ష నిర్వహించారు. -
ఆనంద్ మహీంద్రాను బాధించిన వీడియో.. అందులో ఏముందంటే..?
ముంబయి: సోషల్ మీడియాలో చురుకుగా ఉండే మహీంద్రా గ్రూప్ ఛైర్మెన్ ఆనంద్ మహీంద్రా తాజాగా ఓ వీడియోను షేర్ చేశారు. ఇందులో కొందరు వ్యక్తులు వ్యర్థాలను సముద్రంలో పడేస్తున్న దృశ్యాలు కనిపిస్తాయి. ఈ వీడియో తనను ఎంతగానే బాధించినట్లు ఆనంద్ మహీంద్రా ఆవేదన వ్యక్తం చేశారు. గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద సముద్రంలో కొందరు వ్యక్తులు వ్యర్థాలను పడేశారు. కార్లలో వచ్చి బస్తాల్లో తీసుకొచ్చిన వ్యర్థాలను సముద్ర నీటిలో వేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పర్యావరణాన్ని కలుషితం చేయడంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలింపు చేపట్టారు. నగర మున్సిపాలిటీ అధికారులు నిందితులకు రూ.10,000 జరిమానా కూడా విధించారు. The Good Citizens of Mumbai Early Morning at Gateway of India pic.twitter.com/FtlB296X28 — Ujwal Puri // ompsyram.eth 🦉 (@ompsyram) November 21, 2023 సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు. ఈ వీడియోలోని దృశ్యాలు తనను ఎంతగానో బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణం పట్ల ప్రజల అభిప్రాయం మారకపోతే.. జీవన నాణ్యతా ప్రమాణాలు పెరగబోవని పేర్కొంటూ ట్వీట్ చేశారు. కాగా.. ఈ వీడియోపై నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అయితే.. నగరాన్ని శుభ్రంగా ఉంచడం కష్టమని అభిప్రాయపడ్డారు. బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరారు. ఇదీ చదవండి: 'అలా అయ్యుంటే టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్లో గెలిచేది! -
అది చెత్తకుండి కాదు..! కంట్రోల్ వాల్వ్..!!
కరీంనగర్: నగరంలోని పలు రిజర్వాయర్లకు తాగునీటిని సరఫరా చేసే మెయిన్ కంట్రోల్ వాల్వ్ అది. కానీ చెత్తచెదారం.. మూత్రవిసర్జనకు నిలయంగా మారింది. నగరంలోని ఫిల్టర్‌బెడ్ నుంచి తాగునీటి ప్రధాన పైప్‌లైన్ భగత్‌నగర్‌లోని అంబేడ్కర్ స్టేడియం నుంచి రిజర్వాయర్లకు వెళ్తుంది. అంబేడ్కర్ స్టేడియం మెయిన్ గేట్ సమీపంలోని నాలా పక్కన దీనికి కంట్రోల్ వాల్వ్ ఉంది. దీని నిర్వహణపై అధికారులు ఇన్నాళ్లు దృష్టి పెట్టకపోవడంతో డస్ట్‌బిన్‌గా మారింది. సమీపంలోని వ్యాపారులు చెత్తాచెదారాన్ని ఇందులో పడేస్తుండటంతో గుట్టలుగా పేరుకుపోయింది. అలాగే ఈ ప్రాంత వాసుల కువాల్వ్ చాంబర్ సులభ్ కాంప్లెక్స్‌గా మారింది. రిజర్వాయర్లకు సరఫరా చేసే తాగునీరు కలుషితమ య్యే ప్రమాదం ఏర్పడింది. శనివారం నగరపాలక సంస్థ సిబ్బంది వాల్వ్‌కు మరమ్మతు చేసేందుకు వచ్చారు. వారు చెత్త గుట్టను చూసి, ఖంగుతిన్నారు. వెంటనే దాన్ని తొలగించారు. వాల్వ్‌కు భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితి రాకూడదంటే చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. -
చెత్తబండి నడుపుతుంది.. అమెరికా వెళ్లొచ్చింది.. జయలక్ష్మి ఒక స్పూర్థి
మూసారాంబాగ్ సమీపంలోని సలీం నగర్లో తెల్లవారుజామున ‘చెత్తబండొచ్చిందమ్మా’ అని అరుస్తూ కనిపిస్తుంది జయలక్ష్మి. డిగ్రీ చదువుతూ తల్లి నడిపే చెత్తబండిలో సాయం చేస్తుంది జయలక్ష్మి. ‘ఎదగాలనుకుంటే చెత్త నుంచి కూడా ఎదగొచ్చు’ అంటుందా అమ్మాయి. తాను నివాసం ఉండే మురికివాడ పిల్లల కోసం ట్యూషన్లు చెబుతూ, వాలంటీర్‌గా పని చేస్తూ,ప్రతిష్ఠాత్మక ‘గాంధీ – కింగ్ స్కాలర్లీ ఎక్స్చేంజ్ ఇనిషియేటివ్’లో భాగంగా జూన్‌లో అమెరికా వెళ్లి వచ్చింది జయలక్ష్మి. చిన్న చితకా సవాళ్లకే డీలా పడుతున్న యూత్‌కు జయలక్ష్మి ఇచ్చే స్ఫూర్తి చాలానే ఉంది. యునైటెడ్ స్టేట్స్– ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (యు.ఎస్.ఐ.ఇ.ఎఫ్) వారి ‘గాంధీ– కింగ్ ఎక్స్చేంజ్ ఇనిషియేటివ్’ స్కాలర్షిప్ పొంది, అమెరికా వెళ్లి రెండు వారాల పాటు మార్టిన్ లూధర్ కింగ్ మార్గంలో అహింసా పద్ధతితో ప్రజా ఉద్యమాలు ఎలా నిర్వహించాలో అధ్యయం చేసి రావడానికి దరఖాస్తులు కోరినప్పుడు మన దేశవ్యాప్తంగా 4 వేల అప్లికేషన్లు వచ్చాయి. వారిలో కేవలం 10 మందిని మాత్రమే ఎంపిక చేస్తారు. ఆ పది మందిలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురు ఉన్నారు. వారిలో ఒకరు అరిపిన జయలక్ష్మి. హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్ సమీపంలో అతి పెద్ద మురికివాడ– సింగరేణి కాలనీలో ఉంటూ, చెత్త బండి లాగుతూ చదువుకుంటున్న ఈ అమ్మాయి ఇలా అమెరికా వరకూ చేరుకోవడం సామాన్యం కాదు. పోరాడే తత్వం, సాధించాలనే పట్టుదల ఉండటం వల్లే ఇది సాధ్యమైంది. జయలక్ష్మిలోని అసాధారణమైన చొరవ, తపన ఆమెను ఇలా ముందుకు నడుపుతున్నాయి. Dear Aripina Jayalakshmi @j_aripina Congratulations to you for This Changemaker Award you Received in Delhi!💐 Telangana Bidda we are proud of you!!🌹@KTRTRS @trspartyonline #JaiTelangana pic.twitter.com/lTZhxJ6E8n — (A*R) (@iNTeLHyd) July 11, 2022 ముగ్గుపిండి అమ్మే దళిత కుటుంబం అరిపిన జయలక్ష్మిది రాయలసీమ ప్రాంతానికి చెందిన దళిత కుటుంబం. తండ్రి రామ్మోహన్, తల్లి హుసేనమ్మ చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని హైదరాబాద్ వలస వచ్చారు. వీరి ఇళ్లల్లో ముగ్గుపిండి అమ్ముకుని తరాలుగా జీవనం సాగిస్తున్నారు. అయితే జయలక్ష్మి తల్లిదండ్రులు చెత్తబండి నడపడాన్ని ఉపాధి చేసుకున్నారు. ‘అమ్మ ఒక బండి, నాన్న ఒక బండి నడుపుతారు. కాలనీ వాళ్లు నెలకు ఇంతని ఇచ్చే డబ్బులే మాకు జీవనాధారం. గవర్నమెంట్ నుంచి ఏమీ జీతం రాదు. చెత్త తీయడం చాలా కష్టమైన పని. నాన్న తానొక్కడే చెత్త తీయగలిగినా అమ్మకు కష్టమని నేను ఏడో క్లాస్ నుంచి ఇవాళ్టి వరకూ ఆమెకు తోడు వెళుతూనే ఉన్నాను. చెత్త సేకరించడం, తడిచెత్త పొడిచెత్త వేరు చేయడం, డంపింగ్ యార్డ్‌లో పడేయడం అన్నీ చేస్తాను. ఇది చాలా దారుణమైన పని అని కొందరు అంటారు. కాని నా మటుకు నాకు ఇది అన్నం పెట్టే వృత్తి. నేను దానిని గౌరవిస్తాను. మా ఇంట్లో నేను కాకుండా అన్నయ్య, చెల్లెలు ఉన్నారు. అందరూ మంచిగా చదువుకుని ఉద్యోగాల్లో స్థిరపడాలని మా అమ్మ తపన. అంతవరకు ఈ పని చేయకతప్పదు’ అంటుంది జయలక్ష్మి. Since this young lady from a Hyderabad slum community told me in a class of peers aged 13 who aspired for worthy professions as nurses, teachers & police how she WOULD one day be an IAS officer (turning many heads) I have followed her achievements in awe. Every wish @j_aripina! https://t.co/V1X47W2i1t — Dr Andrew Fleming 🇬🇧 🏴 (@Andrew007Uk) August 23, 2023 ఎన్.జి.ఓ దృష్టిలో పడి జయలక్ష్మి చిన్నప్పటి నుంచి చురుగ్గా ఉండేది. కాలనీలోని సమస్యలపై మాట్లాడేది. స్కూల్లో ఒకసారి ఇలాగే మాట్లాడితే ‘మాంట్‌ఫోర్ట్ సోషల్ ఇన్స్టిట్యూట్’ అనే ఎన్.జి.ఓ దృష్టిలో పడింది. పేదవర్గాల కోసం పని చేసే ఆ సంస్థ జయలక్ష్మిని తన కార్యకలాపాల్లో భాగం చేస్తూ ప్రోత్సహించింది. ‘స్లమ్స్‌లో ఉండే పిల్లల వికాసం కోసం నేను పని చేశాను. హైదరాబాద్‌లో 56 స్లమ్స్ ఉంటే వాటిలో 21 చోట్ల అంగన్వాడీ కేంద్రాలు లేవు. మేమందరం మహిళా సంక్షేమ శాఖ దగ్గరకు వెళ్లి మాట్లాడి వాటిని సాధించాం’ అంటుంది జయలక్ష్మి. ఇంగ్లిష్ మీడియంలో చదవాలనుకుని తన వాడ నుంచి నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్లి చదువుకున్న జయలక్ష్మి తన వాడలోని పిల్లలకు సాయంత్రాలు ట్యూషన్ చెప్తూ వారి చదువుకు మేలు చేస్తోంది. ‘కోవిడ్ సమయంలో మా కాలనీలో నేను కార్యకర్తగా పని చేశాను. కోవిడ్ రాకుండా చాలా వరకు సక్సెస్ అయ్యాను’ అంది. ఐ.ఏ.ఎస్ కావాలని ‘యువతకు నాయకత్వ లక్షణాలు ఉండాలి. హక్కుల కోసం పోరాడాలి. అమెరికాలో శాంతియుత పోరాటాల విజయగాథలను అధ్యయనం చేయగలగడం నా అదృష్టం. ఒక యువ ప్రతినిధిగా పోరాడుతూనే ప్రజల సేవ కోసం ఐ.ఏ.ఎస్ సాధించాలనుకుంటున్నాను. అందుకు కావలసిన సహాయం పొందగలననే అనుకుంటున్నాను. నాకు ఎంతమంచి పేరున్నా చెత్త అమ్మాయి అనే పిలుస్తారు కొందరు. వారి చేత ఉత్తమ అమ్మాయి అనిపించుకునేందుకు, లక్ష్యం లేని వారి బుర్రలే చెత్త అని నిరూపించేందుకు మరింత కష్టపడతాను’ అంది జయలక్ష్మి. – సాక్షి ఫీచర్స్ డెస్క్ In 5 years in Hyderabad this young lady is one of the most inspiring people I met. She turned every head in the room in 2018 when at an event she announced her intention to be an IAS Officer. I pray she succeeds - she is a true #changemaker full of only kindness & good intent. https://t.co/5khoCxNjjj — Dr Andrew Fleming 🇬🇧 🏴 (@Andrew007Uk) December 11, 2022 -
చెత్తకుప్పల నుంచి చదువులమ్మ ఒడికి..
హనుమకొండ: చెత్త ఏరే చిట్టిచేతులు నోట్‌బుక్స్ పట్టాయి. చెదిరిన నెత్తి, చిరిగిన బట్టలతో ఉండే పిల్లలు శుభ్రంగా తయారై బడిబాట పట్టారు. 11 మంది బాలలు చెత్తకుప్పలను వీడి చదువులమ్మ ఒడికి చేరుకున్నారు. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయానికి చెత్త ఏరుకునే బాలలతోపాటు తల్లిదండ్రులను పిలిపించారు. చదువు ప్రాముఖ్యత గురించి వారికి అవగాహన, చైతన్యం కల్పించారు. దీంతో పిల్లలను పాఠశాలకు పంపేందుకు తల్లిదండ్రులు అంగీకరించారు. వెంటనే జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి మేన శ్రీనును పిలిపించి 11 మంది బాల కార్మికులను గురుకులాల్లో చేర్చించారు. పిల్లలకు నోట్‌బుక్స్ అందించారు. బాలలకు, తల్లిదండ్రులకు వినయ్‌భాస్కర్ భోజనం వడ్డించారు. వారితో కలిసి భోజనం చేశారు. -
చిమ్మచీకటి.. జోరు వర్షం.. పసికందును విసిరేసిన తల్లిదండ్రులు
భువనేశ్వర్: చిమ్మచీకటి.. జోరు వర్షంలో బస్తాలో చుట్టి, పసికందును విసిరేసిన తల్లిదండ్రుల కాఠిన్యానికి పిడుగులు కూడా మిన్నకుండిపోయాయి. జనం కంట కనిపించే వరకు మెరుపులే తోడుగా నిలిచి, ముక్కు పచ్చలారని చిన్నారిని కాపాడుకున్నాయి. మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న ఈ ఘటన మానవత్వానికి మాయని మచ్చగా తారస పడింది. వివరాల్లోకి వెళ్లే శనివారం వేకువజామున మల్కన్‌గిరి తోలాసాహి(దిగువ వీధి) వైపు వెళ్తున్న స్థానికులకు ఏడుపు వినిపించడంతో వెళ్లి చూడగా, చెత్తకుప్ప వద్ద బియ్యం బస్తాలో చుట్టి ఉన్న పసికందు కనిపించింది. వెంటనే చైల్డ్‌లైన్ సిబ్బందికి సమాచారం అందించడంతో పాటు మల్కన్‌గిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. బిడ్డ ఆరోగ్యంగానే ఉందని, పుట్టి ఒక రోజే కావస్తుందని తెలిపారు. ఆస్పత్రికి చేరుకున్న ఐఐసీ రీగాన్ కీండో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పసికందు తల్లిదండ్రుల వివరాలపై ఆరా తీస్తున్నారు. చదవండి విదేశీయుని వద్ద రూ.5000 చలానా వసూలు చేసిన పోలీసు.. రిసిప్ట్ ఇవ్వకుండానే.. వీడియో వైరల్.. -
సఫాయి సర్పంచ్
-
సింగర్‌కు షాక్.. ఆ పని చేయలేదని భారీ జరిమానా!
ప్రముఖ హాలీవుడ్ సింగర్, గేయ రచయిత టేలర్ స్విఫ్ట్‌కు న్యూయార్క్ మున్సిపల్ అధికారులు షాకిచ్చారు. ఆమెకు తన ఇంటిముందు ఉన్న ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచలేదని ఏకంగా 2.4 లక్షల జరిమానా విధించారు. అయితే ఆమెకు ఇప్పటికే అధికారులు 32 సార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదని వెల్లడించారు. అయితే ఈ జరిమానాలు మొత్తం ఐదేళ్ల కాలానికి సంబంధించినదిగా తెలుస్తోంది. ఆమె భవనం ముందు చెత్త ఉంచినందుకు జనవరి 2018 నుంచి 2023 వరకు పలుసార్లు ఫైన్ విధించారు. (ఇది చదవండి: నిహారిక-చైతన్యల విడాకులు.. ముందుగా పిటిషన్ వేసింది ఎవరంటూ..) టేలర్ తన మూడు అంతస్తుల భవనం ముందు చెత్తను సరిగా తీసివేయడం లేదని అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానికి మీడియా కథనం ప్రకారం టేలర్ ఇంటి వెలుపల వార్తాపత్రికలు, సీసాలు, కార్డ్బోర్డ్, నాప్కిన్స్ కుప్పలు కుప్పలుగా పేరుకుపోయినట్లు తెలుస్తోంది. వాటితో పాటు చెల్లా చెదురుగా పడి ఉన్న యాష్ట్రేలు, సిగరెట్ కార్టన్ కూడా ఉన్నాయని నివేదికలో పేర్కొంది. అయితే పలువురు అభిమానులు మాత్రం అధికారుల తీరును తప్పుబడుతున్నారు. ఆమెకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని చెబుతున్నారు. టేలర్ సిగరెట్స్, మందు తాగడం చేయదని అంటున్నారు. (ఇది చదవండి: బేబీ డైరెక్టర్‌కు బ్రో షూ గిఫ్ట్.. వేలల్లో కాదు లక్షల్లో!) View this post on Instagram A post shared by Taylor Swift (@taylorswift) -
ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న ‘గార్బేజ్ క్వీన్స్’ : వైరల్ ఫోటోలు
సాక్షి,ముంబై: ఆర్టిఫిషిల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆర్ట్ ఇంటర్నెట్ను కుదిపేస్తోంది. ఎస్కే ఎండీ అబు సాహిద్ అనే అర్టిస్ట్ మిడ్‌జర్నీ ఏఐ టూల్‌తో సృజనాత్మక చిత్రాలు పోస్ట్ చేస్తున్నారు. తాజాగా గార్బేజ్ క్వీన్స్ పేరుతో కొన్ని అద్భుతమైన చిత్రాలను ఇన్‌స్టాలో షేర్ చేశారు.భయంకరమైన చెత్తలో అందమైన మోడల్స్‌ను సృష్టించిడం ఈ సిరీస్ ప్రత్యేకత. (సింపుల్ వన్: లాంగెస్ట్ రేంజ్ స్కూటర్ వచ్చేసింది, ధర ఎంతో తెలుసా?) కాగా ఏఐ ఆర్ట్‌తో సునామీ సృష్టిస్తున్న సాహిద్ ఇప్పటికే పలు పిక్స్‌తో ఆకట్టుకున్నారు. ప్రముఖ క్రికెటర్లు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ వృద్ధాప్యంలో, స్థూలకాయులుగా మారిపోతే ఎలాంటి ఉంటారనే చిత్రాలను పోస్ట్ చేశారు. అలాగే బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ ముసలివాళ్లుగా ఎలా ఉంటారు? బిజినెస్ టైకూన్స్ జిమ్‌లో ఎలా ఉంటారనే ఊహకు ప్రాణం పోస్తూ మరికొన్ని పిక్స్‌ను షేర్ చేశారు. ఒకవిధంగా చెప్పాలంటే ఇలాంటి ఆసక్తికరమైన, ఊహాజనిత చిత్రాలు చాలానే చూడొచ్చు సాహిద్ ఇన్‌స్టాలో. ఇదీ చదవండి: వార్నీ.. రేఖలా మారిపోయిన అమితాబ్, అందంగా సల్మాన్ ఖాన్ View this post on Instagram A post shared by SAHID (@sahixd) -
పోలీస్టేషన్‌కు చెత్త పంచాయితీ..పారిశుధ్య కార్మికులపై తుపాకీ ఎక్కుపెట్టి..
చెత్త విషయంలో తలెత్తిన వివాదం కాస్త పోలిస్టేష్టన్లో ఫిర్యాదు చేసేంత వరకు వెళ్లింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఇండోర్‌కు చెందిన వ్యాపారవేత్త, పెట్రోల్ పంప్ యజమాని మహేష్ పటేల్‌కి పారిశుధ్య కార్మికులకు మధ్య చెత్త విషయమై వివాదం తలెత్తింది. అతడి ఇంటి వద్ద చెత్తను సేకరిస్తున్నప్పుడూ ఈ ఘటన చోటు చేసుకుంది. పటేల్ భార్య పొడి, తడి చెత్తను వేరు చేయనందున గొడవ జరిగింది. దీంతో ఆమె భర్త పటేల్, అతడి కుమారుడు పారిశుధ్య కార్మికులతో వాగ్వాదానికి దిగారు. ఇంతలో ఆ మహేష్ లోపలి నుంచి తుపాకీ తీసుకుని వచ్చి బెదిరింపులకు గురిచేశాడు. దీంతో అక్కడ నుంచి పారిశుధ్య కార్మికులు ఒక్కసారిగా పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసు అధికారి సంఘటనా స్థలానికి చేరకుని ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదర్చారు కూడా. గానీ చెత్త వ్యాన్లను నడుపుతున్న డ్రైవర్ల సంఘం సభ్యులు బెదిరింపులకు గురైన పారిశుధ్య కార్మికులతో కలిపి పోలీసులను ఆశ్రయించి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ వ్యాపారి బీజేపీ మాజీ శాసనసభ్యుడు మనోజ్ పటేల్ బంధువు కావడంతోనే పోలీసులు ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోలేదంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐతే అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడంతో స్పందించిన పోలీసు అధికారి ఆశిష్ మిశ్రా ఆ ఘటనపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ముందుగా అక్కడ అసలేం జరిగిందే నిర్థారించడానికి ఫిర్యాదుదారుణ్ణి సంప్రదించి తదుపరి దర్యాప్తు ప్రారంభిస్తామని చెప్పారు. (చదవండి: పులి భయంతో హడలిపోతున్న గ్రామాలు..దెబ్బకు కర్ఫ్యూ, పాఠశాలలు మూసివేత) -
సిద్దిపేట ‘సేంద్రియ ఎరువు’.. పేరేంటో తెలుసా?
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట మున్సిపాలిటీలో సేకరించిన తడి చెత్త ద్వారా తయారైన నాణ్యమైన సేంద్రియ ఎరువు త్వరలో మార్కెట్లోకి రానుంది. మున్సిపాలిటీలో సేకరించిన తడి చెత్తను సిద్దిపేట రూరల్ మండలం బుస్సాపూర్‌లోని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ఈ తడి చెత్తతో ఇప్పటికే సీఎన్జీని తయారు చేసి విక్రయిస్తుండగా.. తాజాగా ఎరువును కూడా తయారు చేసి విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సేంద్రియ ఎరువును సిద్దిపేట కార్బన్ లైట్స్ బ్రాండ్ పేరుతో ఈ నెల 21న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చేతుల మీదుగా మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. ప్రతి ఇంటినుంచి చెత్త సేకరణ.. సిద్దిపేట పట్టణంలోని 43 వార్డుల్లో 41,322 కుటుంబాలు ఉండగా 1,57,026 మంది నివసిస్తున్నారు. ఇక్కడ తడి, పొడి, హానికర చెత్తను ఇంటింటి నుంచి సేకరించడాన్ని డిసెంబర్ 2020లో ప్రారంభించారు. ఈ చెత్తను సేకరించేందుకు 52 వాహనాలను ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ పరిధిలో రోజుకు 60 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా ఇందులో 70 శాతం తడి, 30 శాతం పొడి చెత్త ఉంటోంది. ఈ లెక్కన 42 మెట్రిక్ టన్నుల తడి చెత్త, 18 మెట్రిక్ టన్నుల పొడి చెత్తను సేకరిస్తున్నారు. తడి చెత్తతో ఎరువు తయారీ బుస్సాపూర్ డంపింగ్ యార్డులో రూ.6 కోట్ల వ్యయంతో బయో – సీఎన్జీ ప్లాంట్, సేంద్రియ ఎరువుల కేంద్రం నిర్మించారు. ఈ ప్లాంట్ నిర్వహణ బాధ్యతలను కార్బన్ లైట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అప్పగించారు. రాష్ట్రంలోనే మొదటిదైన ఈ ప్లాంట్‌ను 2021 డిసెంబర్ 20న బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్‌తో కలసి మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఇళ్ల నుంచి సేకరించిన 42 మెట్రిక్ టన్నుల తడి చెత్త నుంచి ఆహార వ్యర్థాలు, కురగాయలు, ఇతర వ్యర్థాలను వేరు చేస్తున్నారు. ఇలా వేరుచేసిన తర్వాత 10 మెట్రిక్ టన్నుల తడి చెత్తను బయో–సీఎన్జీ తయారు చేయడానికి మిగతా 32 మెట్రిక్ టన్నుల చెత్తను సేంద్రియ ఎరువులను తయారు చేయడానికి వినియోగిస్తున్నారు. సిద్ధం చేసిన సేంద్రియ ఎరువును 40 కేజీల చొప్పున బ్యాగుల్లో ప్యాక్ చేసి విక్రయించేందుకు సిద్ధం చేశారు. ఒక్కో బ్యాగు అసలు ధర రూ.600 కాగా సిద్దిపేట రైతులకు రూ.300కే విక్రయించనున్నారు. 21న రైతులకు అవగాహన సదస్సు సేంద్రియ ఎరువుల ఆవశ్యకతపై రైతులకు ఈ నెల 21న సిద్దిపేట వ్యవసాయ మార్కెట్లోని పత్తి యార్డులో అవగాహన కల్పించనున్నారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా రైతులకు పంపిణీ చేయనున్నారు. సిద్దిపేట బ్రాండ్‌తో సేంద్రియ ఎరువు: మంత్రి హరీశ్‌రావు మంత్రి హరీశ్‌రావు ఆదివారం సాయంత్రం సిద్దిపేట నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన సిద్దిపేట బ్రాండ్‌తో చెత్త ద్వారా తయారు చేసిన ఎరువును రైతులకు అందించబోతున్నామన్నారు. సిద్దిపేట ప్రజలు రోజు వేసే చెత్తతో ఒక గొప్ప సంపదను తయారు చేసి రైతులకు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఈ సేంద్రియ ఎరువుతో అన్నీ పంటల నుంచి అధిక దిగుబడి, నాణ్యమైన ఉత్పత్తులు పొందే అవకాశం ఉందని చెప్పారు. -
Neeru Yadav: హాకీ వాలీ సర్పంచ్
రాజస్తాన్‌లో ఆడపిల్ల పుడితే ఇంకా కొన్ని పల్లెల్లో బంధువులు వెళ్లి ‘శోక్ ప్రకటన్’ (శోక ప్రకటన) చేసే ఆనవాయితీ ఉంది. మొదట కొడుకు పుట్టేశాక రెండో సంతానంగా ఆడపిల్ల పుడితే బిడ్డ బాగోగులు నిర్లక్ష్యం చేసే ఆనవాయితీ ఉండటంతో ప్రభుత్వం ఏకంగా రెండో సంతానం కోసమే ‘మాతృత్వ పోషణ్ యోజన’ పేరుతో తల్లికి 6 వేల రూపాయలు ఇస్తోంది. అలాంటి చోట ఒక మహిళా సర్పంచ్ హల్చల్ చేస్తోంది. తను సర్పంచ్ కావడమే ఊరిలోని ఆడపిల్లలతో ఒక హాకీ టీమ్ ఏర్పాటు చేసి ‘హాకీ వాలీ సర్పంచ్’ అనే పేరు గడించింది. తాజాగా హాకీ బ్యాట్ పట్టుకుని తిరుగుతూ పెళ్లిళ్లలో చెత్త చెదారం వేసినా, ఆహారాన్ని వ్యర్థం చేసినా డొక్క చించుతానని కొత్త ఆర్డర్ పాస్ చేసింది. ప్రజల కోసం సొంత డబ్బు కూడా ఖర్చు పెడుతున్న నీరూ యాదవ్ పరిచయం. జిల్లా అధికారులతో ఎప్పుడు మీటింగ్ జరిగినా నీరూ యాదవ్ లేచి గట్టిగా మాట్లాడుతుంది. అక్కడున్న వాళ్లు ఆమెను ‘మహిళ అయినా’ ఎంత గట్టిగా మాట్లాడుతోందని ఆశ్చర్యంగా, మెచ్చుకోలుగా చూస్తారు. ‘నేను మహిళనే. కాని బాగా చదువుకున్నాను. మీరు గోల్మాల్ చేసిన బిల్లుల మీద సంతకం పెట్టమంటే పెట్టను. అవినీతి చేయను. నా పంచాయితీలో జరగనివ్వను’ అని తిరగబడుతుంది. అంతే కాదు అది వీడియో తీసి యూట్యూబ్‌లో పెడుతుంది కూడా. రాజస్థాన్‌లోని ‘ఝుంజును’ జిల్లాలోని ‘లంబి అహిర్’ అనే పంచాయితీ ఈ నీరూ యాదవ్ అనే సర్పంచ్ వల్ల అందరినీ ఆకర్షిస్తోంది. లంబి అహిర్ రాజస్థాన్‌లో ఉన్నా హర్యాణ సరిహద్దులో ఉంటుంది. ఆ ఊళ్లో యాదవులు ఎక్కువ. నీరూ యాదవ్ ఊళ్లోకెల్లా బాగా చదువుకోవడం వల్ల సర్పంచ్‌గా సులభంగా ఎంపికైంది. మరి... ఎం.ఎస్సీ, ఎం.ఇడి చేసి పిహెచ్.డి కూడా చేసిన నీరూ ఊరికి సేవ చేస్తానంటే ఎవరు వద్దంటారు? ► అమ్మాయిల ప్రగతే ముఖ్యం 2020లో సర్పంచ్ అయిన నాటి నుంచి నీరూ యాదవ్ ముఖ్యంగా అమ్మాయిల ప్రగతి గురించి దృష్టి పెట్టింది. తన పంచాయతీలోని స్త్రీల పట్ల ఉన్న కట్టుబాట్లను బాగ ఎరిగిన నీరూ వారు అన్ని విధాలుగా వికాసం చెందాలంటే విద్యతో పాటు ఇంటి నుంచి బయటకు కదలడం ముఖ్యమే అని ఊరికి చూపించదలుచుకుంది. అందుకే స్కూలు, కాలేజీ వయసున్న ఆడపిల్లల ఇంటింటికి వెళ్లి వారికి, తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారిని ఒక మహిళా హాకీ జట్టుగా జమ చేసింది. సర్పంచ్‌గా తనకొచ్చే జీతంతో ఒక కోచ్‌ను ఏర్పాటు చేసింది. పంచాయతీ నిధులతో గ్రౌండ్‌ను శుభ్రం చేసి ఏర్పాటు చేసింది. ‘మీరు ఉత్తమ హాకీ టీమ్‌గా విజయాలు సాధించాలి’ అనంటే ఆ ఆడపిల్లలు ఉదయం, సాయంత్రం ప్రాక్టీసు చేస్తూ, ఆటను ఆస్వాదిస్తూ ఇవాళ జిల్లా స్థాయిని దాటి స్టేట్ లెవల్లో ఆడేదాకా ఎదిగారు. ఇది ఊరందరికీ నచ్చి నీరూ యాదవ్ అసలు పేరు మరిచి ‘హాకీ వాలీ సర్పంచ్’ అని పిలవడం మొదలెట్టారు. అయితే ఆటలు మాత్రమే కాదు బాలికల చదువుకు, టెక్నికల్ విద్యకు కూడా నీరూ ప్రోత్సాహం అందిస్తోంది. కొంతమంది యువతులను షార్ట్‌టెర్మ్ టెక్నికల్ కోర్సులకు పంపి వారికి ఉద్యోగాలు దొరికేలా చూస్తోంది. తన సొంత డబ్బుతో చదివిస్తోంది. ► పెళ్ళిళ్ల వృధాకు విరుగుడు ఊళ్లో పెళ్లిళ్లు, మీటింగులు, ఇతర ఫంక్షన్ల వల్ల భోజనాల సమయంలో పేరుకు పోతున్న చెత్తను గమనించిన నీరూ యాదవ్ తాజాగా ‘చెత్త రహిత వివాహాలు’ అనే ప్రచారాన్ని మొదలెట్టింది. పెళ్లిళ్ల సమయంలో ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, బాటిళ్లు వాడి పారేయడం వల్ల పేరుకుపోతున్న చెత్తకు విరుగుడుగా స్టీలు పళ్లేలు, గ్లాసులు, బకెట్లు, వంట పాత్రలు కొని పంచాయితీ ఆఫీసులో పెట్టింది. ఊళ్లో ఏ ఫంక్షన్‌కైనా వీటిని ఉచితంగా ఇస్తారు. అయితే నీరూ యాదవ్ తయారు చేసిన మహిళా కార్యకర్తలు వచ్చి వడ్డిస్తారు. ఎంత తింటే అంత పెట్టడం వల్ల ఆహారం వృధా కాకుండా చూడాలనేది ఆలోచన. అంతేకాదు ఒకవేళ ఆహారం వృధా అయితే దానిని ఎరువుగా మార్చి రైతులకు ఇవ్వాలనే కార్యాచరణ కూడా నీరూ మొదలెట్టింది. ‘మన దేశంలో ఒక మనిషి సంవత్సరానికి సగటున 50 కిలోల ఆహారాన్ని వృధా చేస్తున్నాడు. ప్రపంచంలో చైనా తర్వాత ఆహారాన్ని వృధా చేస్తున్నది మనమే’ అంటుంది నీరూ. పిల్లల ఆట కోసం చేతిలో సరదగా హాకీ బ్యాట్ పట్టుకున్నా అది పట్టుకుని ఆమె చేస్తున్న సంస్కరణలు జనం వింటున్నారు. ► రైతుల కోసం నీరూ యాదవ్ పల్లెకు ఆయువుపటై్టన రైతును ఎలా నిర్లక్ష్యం చేస్తుంది. రైతులకు కావాలసిన ఎరువులు, విత్తనాలు, క్రిమి సంహారక మందుల ఏర్పాటు కోసం పండించిన పంటకు సరైన మద్దతు ధర దొరకడం కోసం ఊరి రైతులతో ఎఫ్.పి.ఓ (ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్) ఏర్పాటు చేసింది. దాంతో రైతులు సంతృప్తిగా ఉన్నారు. నీరూ యాదవ్‌ను మెచ్చుకుంటున్నారు. ‘హాకీ వాలీ సర్పంచ్’ నీరూ యాదవ్ రాబోయే రోజుల్లో సర్పంచ్ కంటే పై పదవికి వెళ్లకుండా ఉండదు. ఆమె చేయాలనుకున్న మంచి పనుల లిస్టులో ఇవి కొన్నే. అన్ని పనులు జరగాలంటే అలాంటి వాళ్లు ఇక్కడితో ఆగకపోవడమే కరెక్ట్. మన దేశంలో ఒక మనిషి సంవత్సరానికి సగటున 50 కిలోల ఆహారాన్ని వృధా చేస్తున్నాడు. ప్రపంచంలో చైనా తర్వాత ఆహారాన్ని వృధా చేస్తున్నది మనమే. -
వందే భారత్ రైళ్లలో ఇది పరిస్థితి.. భారతీయ రైల్వేస్ రిక్వెస్ట్
Viral News: ఇతర దేశాల్లో బుల్లెట్ ట్రైన్లు, మాగ్నటిక్ బుల్లెట్ ట్రైన్ల టెక్నాలజీతో రైల్వే రంగాలు దూసుకుపోతున్నాయి. మన దగ్గర అంతస్థాయిలో కాకపోయినా మెట్రో, ఈ మధ్యకాలంలో వందే భారత్ లాంటి సెమీ స్పీడ్ రైళ్లను పట్టాలెక్కించింది కేంద్రం. అయితే.. భారత్‌లో ఇప్పటిదాకా హైక్లాస్ రైలుగా వందే భారత్ ఓ ఫీట్ సాధించగా.. వసతులు, ఆధారంగా భూతల విమానంగా అభివర్ణిస్తున్న వందే భారత్ రైలులో పరిస్థితి ఇది అంటూ తాజాగా కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వందే భారత్ రైలు కంపార్ట్మెంట్లో మొత్తం వాటర్ బాటిళ్లు, చెత్తా చెదారం, కవర్లు నిండిపోయి ఉన్నాయి. ఓ వర్కర్ దానికి శుభ్రం చేస్తుండగా తీసిన ఫొటో ఇది. ఐఏఎస్ అధికారి అవానిష్ శరణ్ తన ట్విటర్లో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. పైగా ‘వీ ద పీపుల్’ అంటూ మన జనాల్లోని కొందరి మైండ్ సెట్‌ను ఉదాహరించారాయన. “We The People.” Pic: Vande Bharat Express pic.twitter.com/r1K6Yv0XIa — Awanish Sharan (@AwanishSharan) January 28, 2023 ఆయన పోస్ట్‌కు రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ప్లాస్టిక్ నిషేధం లేన్నన్నాళ్లూ ఇలాంటి పరిస్థితి తప్పదంటూ కొందరు.. జనాలకు స్వీయ శుభ్రత అలవడితేనే పరిస్థితి మారుతుందంంటూ మరికొందరు.. ఏది ఏమైనా మన దేశంలో ఇలాంటి పరిస్థితిలో మార్పురాదని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఓవైపు చెత్తాచెదారం శుభ్రం చేశాక కూడా.. సిబ్బంది ముందే చెత్తా పారబోస్తున్నారు. వందే భారత్ రైళ్లు గమ్యస్థానం నుంచి ప్రారంభం అయ్యే లోపే ప్రయాణికులు వేస్తున్న చెత్తాచెదారంతో నిండిపోతోందని సిబ్బంది వాపోతున్నారు. ఇదిలాఉంటే సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళ్లే వందేభారత్ రైలులో చెత్తాచెదారం దర్శనమివ్వగా.. దయచేసి శుభ్రతను పాటించాలంటూ భారతీయ రైల్వేస్ సంస్థ వందేభారత్ ప్రయాణికులకు ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికుల వైఖరి, మనస్తతత్వం మారనంత కాలం.. స్వచ్ఛ భారత్ సాధించడం కష్టం. కాబట్టి, మెరుగైన సేవలను అందుకోవడానికి రైల్వేస్‌తో సహకరించండి. దయచేసి చెత్తచెదారం వేయకండి. డస్ట్బిన్లలోనే చెత్త వేయండంటూ అంటూ ప్రకటనలో పేర్కొంది భారతీయ రైల్వేస్. హైక్లాస్ రైలు.. అత్యాధునిక, సాంకేతిక వ్యవస్థలతో పనిచేసే వందే భారత్ రైళ్లలో.. విమానాల్లో మాదిరి ఇంటీరియర్ కనిపిస్తుంది. కోచ్‌లన్నీ ఫ్లైట్ ఇంటీరియర్‌తో పోలి ఉంటాయి. సీటింగ్ కూడా అదే విధంగా ఉంటుంది. ఆటోమేటిక్ డోర్లు ఉండటమే కాక అవన్నీ రొటేట్ అవుతుంటాయి. సీట్ల వద్ద ఉండే బటన్ ప్రెస్ చేసి ఎవరితోనైనా మాట్లాడవచ్చు. సీసీ కెమెరాలుంటాయి. ప్రయాణికుల కదలికలను సెంట్రల్ స్టేషన్ నుంచి మానిటరింగ్ చేస్తారు. భద్రతకు ప్రాధాన్యత.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా భద్రతా వ్యవస్థ సత్వరం స్పందిస్తుంది. ఎమర్జన్సీ అలారం ఉంటుంది. మరుగుదొడ్లు స్టార్ హోటల్లో ఉన్నట్టుగా తలపిస్తాయి. ఇంజిన్ కాక్‌పిట్ అత్యద్భుతంగా ఉంటుంది. ఈ-డిస్‌ప్లేలుంటాయి. గంటకు వంద కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకుపోయినా గ్లాసులో వాటర్ ఒలకదు. గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సగటు వేగం 88 కిలోమీటర్ల మేర ఉంటుంది. సున్నితంగా ఉంటుంది ఈ రైలులో ప్రయాణం. -
Hyderabad: సమస్యకు చెక్.. చెత్త దూరం.. కరెంటు లాభం!
సాక్షి, హైదరాబాద్: రోజురోజుకు మరింతగా జనాభా పెరిగిపోతున్న గ్రేటర్ హైదరాబాద్ నగరంలో వెలువడుతున్న చెత్త కూడా అంతే స్థాయిలో పెరిగిపోతోంది. ఈ చెత్తను డంప్ చేస్తే కాలుష్యం, మురికి, అనారోగ్య సమస్యలు. ఈ క్రమంలోనే అటు చెత్త సమస్యకు చెక్ పెట్టడం, ఇటు విద్యుత్‌ను ఉత్పత్తి చేసి ప్రయోజనం పొందడం లక్ష్యంగా జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లను ప్రోత్సహిస్తోంది. జవహర్‌నగర్‌లో తొలుత 19.8 మెగావాట్ల ఉత్పత్తితో ప్రారంభమైన రాంకీ సంస్థ (రీసస్టెయినబిలిటీగా పేరు మారింది) ప్లాంట్ సామర్ధ్యం ప్రస్తుతం 24 మెగావాట్లకు పెరిగింది. మరో 24 మెగావాట్ల ఉత్పత్తికి ప్రభుత్వం అనుమతించింది. ఈ సంస్థ మార్చి చివరినాటికి దుండిగల్‌లో 14.5 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ప్రారంభించనుంది. ఇదిగాక నగర శివార్లలో ఏర్పాటు కానున్న పలు ప్లాంట్లతో రెండేళ్లలో వంద మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు చెత్త ప్రాసెస్ చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే చెత్తగుట్టలు పోగుపడవు. ఘన వ్యర్థాలు (చెత్త) ఎప్పటికప్పుడు ప్రాసెస్ అవుతాయి. శివార్లలోని పలు ప్రాంతాల్లో చెత్త ట్రీట్మెంట్తోపాటు ఆ సమీపంలోనే ఉండే ప్లాంట్లతో విద్యుత్ ఉత్పత్తి జరగనుంది. మున్సిపల్ కార్మికులు సేకరించే చెత్తలో విద్యుత్‌కు పనికొచ్చేది దాదాపు 50 శాతం ఉంటుంది. మిగతా చెత్తను కంపోస్టు, రీసైక్లింగ్‌తో ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీ వంటి వాటికి వినియోగిస్తారు. అంతిమంగా ఎందుకూ పనికిరానిదాన్ని పాతిపెడతారు. మరోవైపు చెత్తనుంచి విద్యుత్ ఉత్పత్తిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అది అంత శ్రేయస్కరం కాదని, ఖర్చు కూడా ఎక్కువని పర్యావరణవేత్తలు చెప్తున్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా.. హైదరాబాద్ నగరంలో ఏటికేడు పెరుగుతున్న చెత్తను, తద్వారా ఉత్పత్తి చేయగల విద్యుత్‌ను జీహెచ్ఎంసీ అధికారులు 2018లో అంచనా వేశారు. ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి 70–100 టన్నుల చెత్త అవసరమవుతుంది. వంద మెగావాట్ల ఉత్పత్తికి దాదాపు పదివేల టన్నులు కావాలి. ప్రస్తుతం నగరంలో రోజూ 7000 టన్నుల చెత్త వెలువడుతోంది. పరిసర మున్సిపాలిటీలను కలిపితే ఇది పదివేల టన్నులకు చేరుకుంటుందని అంచనా. దీనికి తగినట్టుగా విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. సిటీ శివార్లలోని విద్యుత్ ప్రాజెక్టుల పరిస్థితి ఇదీ.. ►యాచారంలో శ్రీవెంకటేశ్వర గ్రీన్ పవర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌కు 12 మెగావాట్ల ఉత్పత్తికి ప్రభుత్వ అనుమతి ఉంది. మరో 2 మెగావాట్లు పెంచి 14 మెగావాట్లకు అనుమతించాల్సిందిగా ఆ సంస్థ కోరింది. అనుమతి వస్తే 14 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. ►బీబీనగర్‌లో ఆర్డీఎఫ్ పవర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ 11 మెగావాట్ల ప్లాంట్ పనులు ప్రారంభమై చాలాకాలమైనా వివిధ కారణాలతో జాప్యం జరుగుతోంది. ఇటీవల యాజమాన్య మార్పు జరగడంతో పనులు వేగంగా అవుతాయని అధికారులు చెప్తున్నారు. ►‘రీసస్టెయినబిలిటీ లిమిటెడ్’ ప్యారానగర్లో 15 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ►జవహర్‌నగర్‌లో ప్రస్తుతం 24 మెగావాట్లు, అదనంగా రానున్న 24 మెగావాట్లు, దుండిగల్‌లో 14.5 మెగావాట్లతోపాటు కొత్తగా రానున్న ప్లాంట్లన్నీ కలిపితే మొత్తం 102.5 మెగావాట్లకు ‘చెత్త విద్యుత్’ ఉత్పత్తి సామర్థ్యం పెరగనుంది. మున్సిపల్ వ్యర్థాల నుంచి తక్కువే.. గత సంవత్సరం కేంద్ర మంత్రి ఆర్కేసింగ్ రాజ్యసభలో ఇచ్చిన సమాచారం మేరకు దేశంలో చిన్నవి, పెద్దవి కలిపి 249 ప్లాంట్లు చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. వీటిలో మున్సిపల్ వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసేవి 11 ప్లాంట్లే. వీటి సామర్ధ్యం 132.1 మెగావాట్లు. ఇటీవల మరికొన్ని ప్లాంట్లు ఏర్పాటు చేయడంతోపాటు మరికొన్ని ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకున్నాయి. ఇక దేశంలోని అన్ని నగరాల్లో భారీగా చెత్త వెలువడుతున్నా.. దాన్ని విద్యుత్‌గా మార్చే ప్లాంట్లు కొన్ని నగరాల్లోనే ఉన్నాయి. జీరో వేస్ట్ లక్ష్యంగా.. హైదరాబాద్ నగరంలో చెత్తను వివిధ రకాలుగా వేరు చేయడంతో బయోగ్యాస్, కంపోస్టు ఎరువు వంటివాటితోపాటు విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ‘జీరో వేస్ట్’ లక్ష్యంతో పనులు చేస్తున్నాం. తద్వారా చెత్త పేరుకు పోదు. చెత్త వస్తున్న చోటనే తడి–పొడిగా వేరుచేయడంలో ఇంకా కృషి జరగాల్సి ఉంది. మిగతా దశలకు సంబంధించి చాలా నగరాల కంటే మనం ముందంజలో ఉన్నాం. – బి.సంతోష్, అడిషనల్ కమిషనర్ (పారిశుధ్యం, ఆరోగ్యం), జీహెచ్ఎంసీ వ్యయమెక్కువ.. శ్రేయస్కరం కాదు.. చెత్త నుంచి విద్యుదుత్పత్తికి అధిక వ్యయం అవుతుంది. వాతావరణ కాలుష్యం సమస్య కూడా ఉంటుంది. విద్యుత్ కోసమే అయితే సోలార్ పవర్ ఖర్చు తక్కువ. చెత్త కుప్పలు కనిపించకుండా ఉండేందుకు విద్యుత్ ఉత్పత్తికి మొగ్గుచూపుతున్నారు. దీనికి ఎక్కువ ఇంధనం అవసరమవుతుంది. ఏర్పాటు చేసే కంపెనీలకు రాయితీలిస్తారు. ఇది శ్రేయస్కరం కాదు. చెత్తను ప్రాథమికంగానే వేరు చేయడం ఉత్తమ మార్గం. రీసైకిల్, రీయూజ్, రెడ్యూస్ విధానమే మేలైనది. దానివల్ల ఎక్కువమందికి జీవనోపాధి లభిస్తుంది. – ప్రొఫెసర్ దొంతి నరసింహారెడ్డి, పర్యావరణవేత్త -
తాగిన మత్తులో చిన్నారిని చెత్తబుట్టలో వేయబోయిన యాచకురాలు
-
ఇటు పరిశుభ్రం.. అటు రాబడి
దాదాపు రెండు వేల జనాభా ఉండే పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లిలో 15 రోజుల నుంచి వర్మీ కంపోస్టు తయారీ మొదలైంది. మే నుంచి ఆ ఊరిలో ప్రతి ఇంటి నుంచి సేకరించిన తడి చెత్తను 45 రోజుల పాటు కుళ్లబెట్టి వర్మీ కంపోస్టును తయారు చేస్తున్నారు. సేకరించిన చెత్తలో అట్టముక్కలు, ప్లాస్టిక్ బాటిల్స్, గాజు వస్తువులు వంటి పొడి చెత్తను వేరు చేసి 217 కిలోలు విక్రయించారు. వీటిపై వచ్చిన రూ.2,800ను గ్రామ పంచాయతీకి జమ చేశారు. పల్నాడు జిల్లాలో గ్రామ పంచాయతీలు తయారు చేసే వర్మీని ‘పల్నాడు వర్మీ’ అనే బ్రాండ్ నేమ్‌తో మార్కెటింగ్ చేసేందుకు జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారుల అనుమతి కోరారు. పల్నాడు జిల్లాలో 527 గ్రామ పంచాయతీలు ఉండగా 83 గ్రామాల్లో పూర్తి స్థాయిలో వర్మీ కంపోస్టు తయారీ ప్రారంభమైంది. అలాగే 186 గ్రామాల్లో తయారీ ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. సాక్షి, అమరావతి: ‘క్లీన్ ఆంధ్రప్రదేశ్’ లక్ష్యంగా గతేడాది అక్టోబర్ 2న ప్రారంభించిన జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంతో గ్రామాలు పరిశుభత్రతో కళకళలాడుతున్నాయి. మరోవైపు సేకరించిన చెత్తతో వర్మీ కంపోస్టు తయారీ చేయడం ద్వారా మంచి ఆదాయం కూడా పొందుతున్నాయి. జగనన్న స్వచ్ఛ సంకల్పం ప్రారంభించాక రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో ప్రతి ఇంటి నుంచి సేకరించిన చెత్తతో దాదాపు 1,314 టన్నుల వర్మీ కంపోస్టును తయారుచేశాయి. అంతేకాకుండా ఇందులో 742 టన్నులను విక్రయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు అన్ని గ్రామాల్లో పంచాయతీల ఆధ్వర్యంలో ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరిస్తున్నారు. 4,043 గ్రామాల్లో సేకరించిన చెత్తను.. అవే గ్రామాల్లో ప్రత్యేకంగా నిర్మించిన షెడ్లకు తరలిస్తున్నారు. అక్కడ తడి, పొడి చెత్తలను వేరు చేసి.. తడి చెత్తతో వర్మీ కంపోస్టు తయారీ చేస్తున్నారు. అలాగే పొడి చెత్తను నేరుగా విక్రయిస్తున్నారు. ఆయా గ్రామాల్లో సేకరించిన చెత్తలో ఇప్పటిదాకా 1290.544 టన్నుల పొడి చెత్తను అమ్మారు. వర్మీ కంపోస్టు, పొడి చెత్త అమ్మకం ద్వారా ఆయా గ్రామ పంచాయతీలకు రూ.1.41 కోట్ల ఆదాయం సమకూరిందని పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు. మార్కెటింగ్ వ్యూహాలపై అధికారుల కసరత్తు.. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో వర్మీకంపోస్టు తయారీ ప్రారంభమైతే ఒకట్రెండు సంవత్సరాల్లోనే 20–30 రెట్లు పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్మీ కంపోస్టును సకాలంలో అమ్మడానికి ప్రత్యేక మార్కెటింగ్ వ్యూహం అవసరమని పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు కొన్ని మార్కెటింగ్ ఏజెన్సీలతో ఒప్పందం కుదుర్చుకోవాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగా పల్నాడు జిల్లాలో తయారుచేస్తున్న వర్మీ కంపోస్టును పల్నాడు బ్రాండ్ పేరుతో విక్రయించాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ స్థాయిలోనే స్థానిక రైతులు వర్మీ కంపోస్టును కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పంటల సాగులో వర్మీ కంపోస్టు వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలపై మరింత అవగాహన కల్పించనున్నారు. అలాగే భవిష్యత్‌లో ప్లాస్టిక్, గాజు వ్యర్థాలను రోడ్ల తయారీలో, సిమెంట్ పరిశ్రమలో వినియోగించేలా చర్యలు మొదలుపెట్టారు. ప్రతివారం సమీక్ష ఒకప్పుడు అపరిశ్రుభ వాతావరణం కారణంగా గ్రామాల్లో మలేరియా, టైఫాయిడ్ వంటివి సంభవించేవి. ఇప్పుడు జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో వీటికి అడ్డుకట్ట పడింది. వారంలో ఒక రోజు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ కోన శశిధర్ అన్ని జిల్లాల కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, డీపీవోలతో ఈ కార్యక్రమ పురోగతిపై సమీక్ష నిర్వహిస్తున్నారు. దాదాపు అన్ని గ్రామాల్లో చెత్తను సేకరించే ప్రక్రియ ప్రారంభం కావడంతో.. సేకరించిన చెత్తను తుది దశకు చేర్చడంపై దృష్టిసారిస్తున్నారు. అక్టోబర్ 2 నాటికి అన్ని గ్రామాల్లో వర్మీ తయారీ.. అక్టోబర్ 2 నాటికి అన్ని గ్రామాల్లో ఇంటింటి నుంచి చెత్తను సేకరించడం.. ఆ చెత్తను ఆ గ్రామంలో నిర్మించిన షెడ్లకు తరలించి వర్మీ తయారు చేయడం.. వేరు చేసిన పొడి చెత్తను రీసైక్లింగ్ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం. తర్వాత వర్మీ కంపోస్టు కామన్ బ్రాండ్ నేమ్ తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నాం. – కోన శశిధర్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ -
చెత్త వేస్తే.. ఫైన్ కట్టాల్సిందే!
తాండూరు : పారిశుద్ధ్యంపై మున్సిపల్ యంత్రాంగం కఠిన నిర్ణయం తీసుకోనుంది. వీధిలో చెత్త వేసినట్లు కనిపించిన వారికి జరిమానా వేసేందుకు మున్సిపాలిటీ సిద్ధమవుతోంది. జులై నుంచి మున్సిపల్ అధికారులు పారిశుద్ధ్యంలో కొత్త నిబంధనలు అమలుచేసేందుకు సిద్ధమవుతున్నారు. వ్యాపారస్తులకు రూ.5 వేలు, నివాస గృహాలకు రూ.500 జరిమానా వేయనున్నారు. తాండూరు మున్సిపల్ పరిధిలో 31 మున్సిపల్ వారుల్లో 12వేల నివాస గృహాలున్నాయి. మొత్తం సూమారు 65 వేల జనాభా ఉంది. మున్సిపల్ పరిధిలో ఉన్న వార్డులలో పారిశుద్ధ్యం రోజురోజుకు అధ్వానంగా మారుతోంది. వార్డుల్లోని ప్రజలకు ఇళ్లలో నుంచి చెత్తను వీధుల్లో వేయకూడదని మున్సిపల్ సిబ్బంది పలుమార్లు అవగహన కల్పించారు. గతేడాది నవంబర్, డిసెంబర్ నెలలతో పాటు ఈ ఏడాది జనవరి నెలలో స్వచ్ఛ సర్వేక్షన్ పథకానికి ఎంపికయ్యేందుకు వార్డులలోని ప్రజలకు అవగహన కల్పించారు. అయినా పారిశుద్ధ్యంపై ప్రజల్లో ఎలాంటి మార్పు రాలేదు. వార్డుల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడంతో ప్రధాన రోడ్డు అపరిశుభ్రంగా కనిపిస్తోంది. అయినా ఈ మార్గంలోని దుకాణదారులు రోడ్డుపై చెత్త వేస్తున్నారు. దీంతో కాలనీలు, మార్గాలు చెత్తమయంగా మారుతున్నాయి. తడి చెత్త కారణంగా పారిశుద్ధ్యం లోపిస్తుంది. చెత్తను పారిశుద్ధ్య కార్మికులు సేకరిస్తారని అధికారులు పలుమార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో పారిశుద్ధ్య వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు చర్యలకు ఉపక్రమించారు. చెత్త వేస్తే జరిమానా.. మున్సిపల పరిధిలో ఇష్టారాజ్యంగా వీధుల్లో, ప్రధాన రోడ్డు మార్గాల్లో చెత్త వేస్తున్న వారిపై జరిమానా వేసేందుకు సిద్ధమయ్యారు. సెక్షన్ 336 మున్సిపల్ చట్టం ప్రకారం మున్సిపల్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే చర్యలు తీసుకునే అవకాశం కల్పించింది. అందులో భాగంగా వ్యాపారస్తులు చెత్తను రోడ్లపై వేస్తే రూ.500 నుంచి రూ.5000 వరకు జరిమానా విధించేందుకు అధికారాలు ఇచ్చింది. నివాస గృహాలకు రూ.50 నుంచి రూ.500 వరకు చెత్త వేసిన వారిపై జరిమానా విధించనున్నారు. అందుకోస మున్సిపల్ అధికారులు నోటీసులను ముద్రించారు. జులై నుంచి ఈ నిబంధనలు అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. స్వచ్ఛతగా మార్చేందుకే.. తాండూరు మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో ఇష్టానుసారంగా చెత్త వేస్తున్నారు. ఈ విషయమై పలుమార్లు వార్డు ప్రజలకు చెప్పినా ప్రయోజనంలేదు. వ్యాపారస్తులు రాత్రి సమయాల్లో రోడ్లపైనే చెత్త వేసి వెళ్తున్నారు. చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేస్తున్న వ్యాపారులపై, నివాస గృహాల ప్రజలకు జరిమానా వేస్తాం. తీరు మారకపోతే మున్సిపల్ చట్టం ప్రకారం కేసు పెట్టి కోర్టుకు పంపిస్తాం. – విక్రంసింహారెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్,తాండూరు -
చెత్తను కొంటాం.. ఆన్లైన్లో!
పాత పేపర్లు అమ్మే వ్యక్తి వస్తే గానీ ఇంట్లో చెత్త తరగదు!!. కొట్టుకెళ్లి అమ్మితే గానీ ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలూ కదలవు!!. రెండూ కష్టమైన పనులే. మరి ఒక్క క్లిక్‌తో ఆ సమస్య తీరిపోతే? ఆ వెసులుబాటునే వ్యాపారంగా మార్చుకున్నారు ఇద్దరు స్నేహితులు. హలోడస్ట్‌బిన్.కామ్‌ను ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు సంస్థ కో–ఫౌండర్ వసంత్ రెడ్డి మాటల్లోనే.. ♦ నేను, రాజమహేంద్ర రెడ్డి ఇద్దరం ఉస్మానియా వర్సిటీ నుంచి స్నేహితులం. చదువులో భాగంగా మేం ప్లాస్టిక్, ఈ–వేస్ట్‌లపై చేసిన ప్రాజెక్ట్ వర్కే చదువు పూర్తయ్యాక మాకు వ్యాపార వేదికయింది. చెత్త సేకరణ, పునఃవినియోగంపై పరిశోధన చేసి రూ.15 లక్షల పెట్టుబడితో 2016 మేలో హలోడస్ట్‌బిన్.కామ్‌ను ప్రారంభించాం. ♦ పాత పేపర్లు, మ్యాగజైన్లు, స్క్రాప్, అల్యూమినియం, పుస్తకాలు ఏవైనా సరే కిలోల చొప్పున కొంటాం. ఇళ్లతో పాటు సొసైటీలు, పరిశ్రమలు, కంపెనీల నుంచి కూడా ఈ–ప్లాస్టిక్, పాత ఇనుము తీసుకుంటాం. ధరలు కిలో పేపర్‌కు రూ.7, ప్లాస్టిక్, ఈ–వేస్ట్‌లకు రూ.8, టిన్నులు రూ.6, ఇనుముకు రూ.12 ఉంటాయి. ♦ యాప్ ద్వారా గానీ వెబ్సైట్ ద్వారా గానీ కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసి గానీ మా సేవలను వినియోగించుకోవచ్చు. ఆర్డర్ రాగానే డిజిటల్ వెయింగ్ మిషీన్, వాహనం వెంట తీసుకెళతాం. ప్రస్తుతం రోజుకు టన్ను చెత్తను కొంటున్నాం. మేం సేకరించిన చెత్తను రీసైక్లింగ్ కంపెనీలకు విక్రయిస్తాం. హైదరాబాద్‌కు చెందిన 10 కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాం. ♦ ప్రస్తుతం 10 మంది ఉద్యోగులున్నారు. ఇప్పటివరకు 500 టన్నుల చెత్తను కొన్నాం. ఏడాదిలో రూ.10 లక్షల టర్నోవర్ నమోదు చేశాం. డబ్బులు నేరుగా ఇవ్వకుండా హలోడస్ట్‌బిన్.కామ్ వాలెట్లో వేస్తాం. దీని ద్వారా మాతో ఒప్పందం చేసుకున్న పలు సూపర్ మార్కెట్లలో షాపింగ్ చేసుకోవచ్చు. పాత ఫోన్ల యాక్ససరీలూ దొరుకుతాయ్ ఇక్కడ..! విపణిలోకి కొత్తగా వచ్చిన సెల్ఫోన్ల యాక్ససరీలు దొరకడం పెద్దగా కష్టం కాదు. కానీ, ఐదు, పదేళ్ల కిందటి ఫోన్ల యాక్ససరీలు కొనాలంటే చాలా కష్టం. ఒక్కోసారి దొరకవు కూడా. కానీ, డయల్ మామలో వెతికితే దొరికేస్తాయి. పదేళ్ల కిందటివే కాదు. తొట్టతొలి మోడల్ మొబైల్ యాక్ససరీలూ దొరుకుతాయిక్కడ. ఇదే తమ ప్రత్యేకత అంటున్నారు డయల్ మామా కో–ఫౌండర్ ఎం.హర్షవర్ధన్‌రెడ్డి. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. ♦ నేను, స్నేహితుడు కిరణ్ కుమార్ కలిసి 2014 డిసెంబర్లో అమీర్‌పేట కేంద్రంగా డయల్ మామా మొబైల్ సొల్యూషన్స్‌ను ఆరంభించాం. ఇప్పటివరకు రూ.25 లక్షల పెట్టుబడి పెట్టాం. రిటైలర్లకు మాత్రమే మొబైల్ యాక్ససరీలు విక్రయిస్తాం. రూ.5 వేల లోపు సెల్‌ఫోన్లనూ విక్రయిస్తాం. ♦ సెల్‌ఫోన్ ఫ్లిప్ కవర్స్, బ్యాటరీలు, చార్జర్ల వంటి 4 వేల కేటగిరీల్లో 1.75 లక్షల యాక్ససరీలున్నాయి. వీటిని ముంబై నుంచి దిగుమతి చేసుకుంటాం. దీనికోసం 450 మంది డీలర్లతో ఒప్పందం చేసు కున్నాం. తెలంగాణ, ఏపీల్లో 20 వేల మంది రిటైలర్లున్నారు. ఇందులో 1250 మంది యాక్టివ్ రిటైలర్లు కస్టమర్లుగా ఉన్నారు. ♦ ప్రస్తుతం రోజుకు లక్ష రూపాయల వరకు ఆర్డర్లొస్తున్నాయి. యాక్ససరీలను సనత్‌నగర్‌లోని గోడౌన్లో నిల్వ చేస్తాం. ఆర్డర్ రాగానే ఇక్కడి నుంచే ప్యాకేజింగ్ చేసి.. 3 రోజుల్లో డెలివరీ చేస్తాం. ఇందుకు ప్రధాన కొరియర్ సంస్థలతో జట్టుకట్టాం. ♦ ప్రస్తుతం 13 మంది ఉద్యోగులున్నారు. జనవరి నాటికి కనీసం 5 వేల మంది రిటైలర్లకు రూ.25 కోట్ల వ్యాపారానికి చేరుకోవాలని లకి‡్ష్యంచాం. త్వరలోనే వ్యక్తిగత కస్టమర్లకు సేవలందించేందుకు వెబ్‌సైట్‌ను ప్రారంభించనున్నాం. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఏపీ ఆన్లైన్ సెంటర్ల ద్వారా కూడా నగదును పంపించే వీలుంది. ఒకటేమో చెత్తను ఆన్లైన్లో కొనుగోలు చేసే కంపెనీ. మరొకటేమో పాత మొబైల్ ఫోన్లకు కూడా చక్కని యాక్సెసరీస్‌ను విక్రయించే కంపెనీ. రెండింటి ఆలోచనలూ వినూత్నమే. ‘సాక్షి’ స్టార్టప్ డైరీకి వస్తున్న మెయిల్స్ నుంచి ఈ రెండూ మీ కోసం... -
కలంకం!
కడుపు పండితే.. ఆ ఇంట్లో ఆనందాల పంట నెలలు నిండుతుంటే..కలల లోకంలో విహారంవెన్ను విరిగే బరువు.. ఆమెకు గాలి పిందె కడుపున బిడ్డ కదిలితే..ఆ కళ్లలో ముసిముసి నవ్వుతొలుచూరు కాన్పయితే.. ఇక పండగేపుట్టినిల్లు.. మెట్టినిల్లు ఒక్కటయ్యే వేడుక ఆ సంబరం.. విషాదమైతే!బిడ్డ కడుపులోనే కన్నుమూస్తే..వదిలించుకుంటారా ఆ పసిగుడ్డు భారమవుతుందా?పుట్టుక సంబరమైతే..‘చావు’ను సాగనంపలేరా..తొమ్మిది నెలల కల..మానవత్వం చూపించదేలా..ఒక్క క్షణం.. ఆలోచించండి.ఆ ప్రేమ అజరామరం.. ఎందుకీ శాపం! అనంతపురం సెంట్రల్(అనంతపురం): మృత శిశువు ఆ తల్లిదండ్రులకు భారమైంది. పేగు బంధం మరిచి చెత్తకుప్పలో పడేశారు. చిన్నపాటి కవర్లో చుట్టి వదిలించుకున్నారు. వీధి కుక్కలు సగభాగం తినేయగా.. మానవత్వం మౌనంగా రోదించింది. ఈ ఘటన శుక్రవారం నగరంలోని మారుతీనగర్‌లో చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలోని మున్సిపల్ చెత్తకుప్ప వద్ద శుక్రవారం ఉదయం కొన్ని కుక్కలు ఓ కవర్లోని మాంసం ముద్ద చుట్టూ గుమికూడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. అప్పుడే పుట్టిన.. రక్తపు మరకలు కూడా ఆరని మృత శిశువును చూసి నివ్వెరపోయారు. వెంటనే కుక్కలను పక్కకు తోలి.. పోలీసు, మున్సిపల్ అధికారులకు సమాచారం చేరవేశారు. ఈ కాలనీలో ఆసుపత్రులు లేకపోవడంతో.. మృత శిశువును తీసుకొచ్చి ఇక్కడ పడేసినట్లుగా అనుమానిస్తున్నారు. అయితే.. కడుపులోనే చనిపోయినా, మృత శిశువు జన్మించినా.. ఖననం చేయడం కనీస ధర్మం. అలాంటిది.. కర్కశంగా చెత్తకుప్పలో పడేసి వెళ్లిన తీరుతో సభ్య సమాజం మౌనంగా రోదించింది. చివరకు మున్సిపల్ అధికారులు ఆ మృత శిశువును స్వాధీనం చేసుకుని ‘చివరి’ మజిలీ పూర్తి చేశారు. ఇదిలాఉంటే.. తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నా వైద్య, ఆరోగ్య శాఖ.. పోలీసు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. కనీసం ప్రయివేట్ ఆసుపత్రులైనా సామాజిక బాధ్యతగా మృత శిశువుల ఖననానికి ముందుకు రాకపోవడం పట్ల సభ్య సమాజం తలదించుకుంటోంది. ఎంపీఈవో సస్పెన్షన్ అనంతపురం అగ్రికల్చర్: పెట్టుబడి రాయితీ(ఇన్పుట్ సబ్సిడీ)ని రైతుకు ఇవ్వకుండా తన బ్యాంకు ఖాతాలో జమ చేసుకున్న చిలమత్తూరు మండలం ఎంపీఈవో జగదీష్ కుమార్‌ను కలెక్టర్ జి.వీరపాండియన్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్లు వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అంతేకాక ఇన్పుట్ సొమ్మును ఆ రైతుకు చెల్లించినట్లు పేర్కొన్నారు. ఇన్పుట్ పంపిణీలో అక్రమాలు, అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
పద్మావతి... ఏమిటీ దుర్గతి !
కృష్ణా పుష్కరాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేసి పద్మావతి ఘాట్‌ను అద్భుతంగా తయారు చేశారు. బస్టాండ్, రైల్వేస్టేషన్లకు దగ్గరగా ఉండటంతో ఇక్కడ రికార్డు స్థాయిలో కోట్లాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. అయితే, పది నెలల్లోనే పరిస్థితి మారిపోయింది. పద్మావతి ఘాట్ ఇప్పుడు డ్రెయినేజీ కన్నా అధ్వానంగా తయారైంది. భక్తులు స్నానమాచరించాల్సిన ప్రాంతం మురికికూపంగా మారింది. మెట్ల పైన, దిగువన ప్లాట్‌ఫాం మీద చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయి దుర్భరంగా దర్శనమిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి అతి పెద్దదైన ఈ ఘాట్‌ను శుభ్రం చేయాల్సిన అవసరం ఉంది. – ఫొటోలు : విజయకృష్ణ, సాక్షి, విజయవాడ -
రూ.73 కోట్లు ‘చెత్త’లో..
► మండూరు చెత్త ప్లాంట్‌లో భారీ స్కాం ► ప్రైవేటు సంస్థతో అధికారుల కుమ్మక్కు ► తేల్చిచెప్పిన శాసనసభ స్థాయీ సమితి ► ఏసీబీ దర్యాప్తునకు సిఫార్సు సాక్షి, బెంగళూరు: నగరంలోని మండూరు పాలికె చెత్త సేకరణ కేంద్రం నుంచి విద్యుత్, ఇంధన ఉత్పత్తి పథకంలో భారీఎత్తున అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ఏ.బీ మాలకరెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన శాసనసభ స్థాయీ సమితి స్పష్టం చేసింది. రూ. 73 కోట్లు ప్రజాధనం ఖర్చుపెట్టినా ఒక్క మెగావాట్ కూడా విద్యుత్ తయారు చేయలేదని తెలిపింది. ఈ విషయంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు కూడా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని తెలిపింది. మరింత లోతుగా శోధించడానికి ఏసీబీతో దర్యాప్తు చేయించాని సిఫార్సు చేసింది. ఇదీ పథకం.. ఇలా వైఫల్యం అందులో ఉన్న వివరాల ప్రకారం మండూరులో రోజుకు వెయ్యి టన్నుల చెత్త ద్వారా 8 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం కోసం 2002లో గ్లోబల్ టెండర్లు పిలిచారు. 2007 ఏప్రిల్‌లో శ్రీనివాస గాయత్రీ రిసోర్స్ రికవరి లిమిటెడ్ బీబీఎంపీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం కుదిరి విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన భూమిని బీబీఎంపీ సదరు సంస్థకు అప్పగించిన తర్వాత 20 నెలల్లోపు ప్రాజెక్టు కార్యరూపం దాల్చాలి. ఈ క్రమంలో బీబీఎంపీ జులై నుంచి ప్రతి రోజూ 300 నుంచి 400 టన్నుల చెత్తను సదరు సంస్థకు అందించింది. అయితే ఒప్పందం ప్రకారం రోజుకు వెయ్యి టన్నుల చెత్తను సరఫరా చేయాల్సిందేనని శ్రీనివాసగాయిత్రీ పేర్కొంది. అయితే ఇది సాధ్యం కాకపోవడంతో చెత్తను ఎరువుగా మార్చడానికి వీలుగా 50 ఎకరాల స్థలాలన్ని పాలికె అందజేసింది. అయినా ఎరువు తయారు కాకపోవడంతో మండూరు ప్రాంతం విషతుల్యంగా మరిపోయింది. మా ప్రాంతాన్ని నాశనం చేయొద్దని స్థానికులు భారీ ఆందోళనలు చేపట్టారు. మొత్తంగా ఈ పథకం కోసం బీబీఎంపీ 2014 ఫిబ్రవరి వరకూ 73.34 కోట్ల ఖర్చు చేసింది. అవన్నీ వృథా అయిపోయాయి. ఇంత జరిగిన ఒక్క మెగావాట్ విద్యుత్ కూడా ఉత్పత్తి కాలేదు. అంతేకాకుండా గాయత్రి సంస్థకు సర్కారు ఇచ్చిన భూముల్లో ఆరు ఎకరాలను అక్రమంగా బ్యాంకుల్లో కుదువ పెట్టి రుణాలు పొందినట్లు తెలుస్తోంది. ఇవేవీ తమకు తెలియవని పాలికె అధికారులు తప్పించుకుంటున్నారు. ఈ కుంభకోణంలో మరిన్ని నిజాలు బయటకి రావాలంటే ఏసీబీతో దర్యాప్తు చేయించాలని సమితి సిఫార్సు చేసింది. -
చెత్త వేశారో.. తిక్క కుదురుస్తారు
సీసీ కెమెరాలతో గుర్తిస్తారు పెనాల్టీలు.. కఠిన చర్యలు సిటీబ్యూరో: మీకు తెలిసో .. తెలియకో ఖాళీ ప్రదేశం ఉందని రోడ్లపై చెత్త వేశారో కెమెరా కళ్లు గుర్తిస్తాయ్. చెత్త వేసిన వారికి పెనాల్టీలు విధిస్తారు. పదే పదే అదే ‘చెత్త’పని చేస్తే జీహెచ్ఎంసీ చట్టం మేరకు ఇతర కఠిన చర్యలు తీసుకుంటారు. గడిచిన ఏడాది కాలంగా స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా వివిధ కార్యక్రమాలు చేపట్టిన జీహెచ్ఎంసీ బహిరంగ ప్రదేశాల్లో కుప్పలుగా పేరుకుపోయిన చెత్తను తొలగించింది. ఇలాంటి 1,116 ప్రదేశాల్లో గుట్టలుగా పోగైన చెత్తను తొలగించడంతో పాటు ఆయా సందర్భాల్లో అక్కడ ముగ్గులు వేశారు. దీపావళి వంటి పండుగలు నిర్వహించారు. ఖాళీ అయిన ఆ ప్రదేశాల్లో తిరిగి చెత్త వేస్తుండటం అధికారుల దృష్టికి వచ్చింది. ఎన్ని విధాలుగా చెప్పినా, ఎంతగా అవగాహన కల్పించినా మారని వారికోసం కఠిన చర్యలు తప్పవనే నిర్ణయానికొచ్చారు. అందులో భాగంగా చెత్త తొలగించిన 1,116 ప్రాంతాల (ఓపెన్ గార్బేజ్) వద్ద సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిందిగా సిటీ పోలీస్ కమిషనర్‌ను కోరనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. నగరవ్యాప్తంగా పోలీసు విభాగం సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఓపెన్ గార్బెజ్ పాయింట్ల వద్ద వాటిని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతూ, ఆ ప్రాంతాల జాబితాతో కూడిన లేఖ పంపనున్నట్లు పేర్కొన్నారు. మలిదశలో ఇతర బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసేవారిని గుర్తించేందుకు కూడా సీసీ కెమెరాలను వినియోగించుకోవాలని భావిస్తున్నారు. సీసీ ఫుటేజీల్లో చెత్త వేస్తున్నవారిని గుర్తించి, ఒకటి రెండు పర్యాయాలు హెచ్చరిస్తారు. అప్పటికీ వినకపోతే జరిమానాలు, కఠిన చర్యలు తీసుకుంటారు. విధులకు రాని స్వచ్ఛ ఆటో డ్రైవర్ల తొలగింపు.. జీహెచ్ఎంసీ దాదాపు రూ.200 కోట్లతో 2000 స్వచ్ఛ ఆటోలు కొనుగోలు చేసి, చెత్త తరలించే వారికి వాటిని ఉచితంగా అందజేసింది. వారిలో దాదాపు 500 ఆటోల డ్రైవర్లు తాము పని చేయాల్సిన ప్రాంతంలో విధులు నిర్వర్తించడం లేదు. వరుసగా పదిరోజులు విధులకు గైర్హాజరయ్యేవారిని గుర్తించి నోటీసులు జారీ చేసి, వారిని విధుల నుంచి తొలగించాల్సిందిగా కమిషనర్ సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం పారిశుధ్యం, రవాణా అంశాలపై సంబంధిత అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. సమావేశంలో దృష్టికొచ్చిన అంశాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. నగరాన్ని బహిరంగ మల, మూత్ర విసర్జన రహితంగా(ఓడీఎఫ్) తీర్చిదిద్దేందుకు చేపట్టిన కార్యక్రమం ఫలితాలివ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం కూడా ఆశించినంత వేగంగా జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని ఫలితం స్వచ్ఛ సర్వేక్షణ్ ఫలితాల్లో ప్రతిబింబించే అవకాశం ఉందన్నారు. కార్మికుల సంక్షేమానికి పెద్దపీట.. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కీలకపాత్ర పోషించే పారిశుధ్య కార్మికుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. కార్మికులందరికీ బీమా సదుపాయం కల్పించడంతోపాటు వైద్యశిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. బయోమెట్రిక్ హాజరును పకడ్బందీగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. -
బీజేపీకి ఓటేస్తే.. చెత్తకుప్పలో వేసినట్టే!
కీలకమైన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ’న్యూస్18’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి ఉండకపోతే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘనవిజయం సాధించి ఉండేదని పేర్కొన్నారు. రానున్న ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓటువేస్తే.. చెత్తకుప్పలో వేసినట్టేనని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ హవా సాగుతున్న నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆ ప్రభావం కనిపిస్తుందా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘ఢిల్లీ ప్రజలు రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. ఎంసీడీలో బీజేపీ పదేళ్లు అధికారంలో ఉంది. ఈ పదేళ్లకాలంలో తీవ్ర ప్రజావ్యతిరేకతను అది మూటగట్టుకుంది. బీజేపీ ఎంసీడీ పాలకపక్షం చెత్త నిర్వహణ వల్ల డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధులతోపాటు వీధుల్లో చెత్త బాగా పెరిగిపోయింది. ఎలాంటి అభివృద్ధీ చేపట్టలేదు. అయినా, బీజేపీకి ఓటు వేస్తే అది చెప్పకుప్పలో వేసినట్టే. ఎలాంటి మార్పు ఉండబోదు. బీజేపీ ఎలాంటి అభివృద్ధి పనులు చేయదు. ఢిల్లీ అంతా చెత్త పేరుకుపోతుంది. ఇక, బీజేపీ ప్రధాని మోదీజీ ఫొటోలు ఉపయోగించుకొని ఓట్లు అడుక్కుంటున్నది. మోదీ ఎంసీడీని పాలించబోరు. ఆ పార్టీ అవినీతిపరులు పాలిస్తారు. కాబట్టి మోదీ హవా ఇక్కడ ఉండబోదు’ అని కేజ్రీవాల్ అన్నారు. -
ముం'చెత్త'తోంది
⇒ ఇంట్లో చెత్త బయట పడేస్తున్నాం.. ఇల్లు శుభ్రమైందని చేతులు దులిపేసుకుంటున్నాం.. ⇒ ట్రక్కుల కొద్దీ చెత్తను ఊరి శివార్లలో పడేస్తున్న అధికారులూ.. ఓ పనైపోయిందని అంటున్నారు.. ⇒ అంతా బాగానే ఉంది.. కానీ పీల్చే గాలి.. తాగే నీరు.. తినే తిండి.. అన్నీ ఇప్పుడు కాలుష్య కాసారాలే.. ⇒ డెంగీ, చికున్ గున్యా ప్రాణాలు తీస్తూనే ఉన్నాయి.. అసలు ఎక్కడుంది సమస్య? పరిష్కారం ఏమిటి? సాక్షి నాలెడ్జ్ సెంటర్ : నిజం ఏమిటంటే.. దేశంలో ఎంత చెత్త ఉత్పత్తి అవుతోందో ప్రభుత్వానికీ స్పష్టంగా తెలియదు. తెలిసిందల్లా.. ఒక్కో మనిషి రోజుకు కనిష్టంగా 300 గ్రాములు.. గరిష్టంగా 600 గ్రాములు చెత్త ఉత్పత్తి చేస్తాడని.. దీన్ని జనాభా సంఖ్యతో హెచ్చవేసి.. ఫలానా నగరంలో రోజుకు ఇంత చెత్త ఏర్పడుతోందన్న అంచనాలే! 2012 నాటి కస్తూరి రంగన్ నివేదిక ప్రకారం దేశంలో ఏటా 5.2 కోట్ల టన్నుల చెత్త ఉత్పత్తి అవుతున్నట్లు అంచనా. అంటే.. ప్రతి రోజూ దాదాపు 1.5 లక్షల టన్నుల చెత్తన్నమాట. దక్షిణాదిని మాత్రమే తీసుకుంటే రోజుకు 36,400 టన్నులు. ప్రభుత్వ యంత్రాంగం ఇందులో మూడో వంతును మాత్రమే డంపింగ్ యార్డ్‌లకు చేరుస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇంకో ముప్ఫై ఏళ్లలో చెత్త పారబోసేందుకే దాదాపు నాలుగు లక్షల ఎకరాల స్థలం కావాలి! ఇది ముంబై, చెన్నై, హైదరాబాద్ మూడింటినీ కలిపితే వచ్చేంత భూ భాగం! అంతా కలగాపులగం.. రెండేళ్ల క్రితం ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్(సీఎస్ఈ) ఈ ‘చెత్త’సమస్యపై ఒక అధ్యయనం చేసింది. దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో చెత్త సేకరణ ఎలా జరుగుతోంది? నిర్వహణ ఎలా ఉంది? అన్న అంశాలపై జరిగిన ఈ అధ్యయనంలో ఎన్నో ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. నాట్ ఇన్ మై బ్యాక్‌యార్డ్ పేరుతో విడుదలైన పుస్తకంలో భారతదేశంలోని నగరాల్లో చెత్త సమస్యను సవివరంగా ప్రస్తావించింది. వంటింటి వ్యర్థాలు, ప్లాస్టిక్, లోహపు వస్తువులు, కాగితం, రబ్బర్ వంటి వాటన్నింటినీ కలగలిపి పారబోస్తూండటం.. చెత్తను సమర్థంగా నిర్వహించడంలో ఎదురవుతున్న అతిపెద్ద సమస్య. కాలుష్యాన్ని తగ్గించేందుకు అనుసరించాల్సిన 3ఆర్ సూత్రాల (రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్)ను పాటించకపోవడం కూడా సమస్య తీవ్ర రూపం దాల్చేందుకు ఇంకో కారణం. అంతేకాక చెత్తనంతా ఒకేదగ్గరకు చేర్చి భారీ యంత్రాలు, టెక్నాలజీల సాయంతో సమస్యను అధిగమించాలన్న ఆలోచన కూడా సరికాదని అంటున్నారు సీఎస్ఈ డైరెక్టర్ సునీతా నారాయణ్. వెలుగు దివ్వెలు ఇవిగో.. చెత్త సమస్యను అధిగమించేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేరళలోని అలెప్పీ, గోవా రాజధాని పణజి, బెంగళూరు, మైసూరు, ఆంధ్రప్రదేశ్‌లోని బొబ్బిలి వంటివి ఆశాకిరణాలుగా కనిపిస్తున్నాయి. అలెప్పీ విషయాన్నే తీసుకుంటే.. ప్రతి ఇంట్లోనూ తడి, పొడి చెత్తలు వేర్వేరు చేయాల్సిందేనని.. లేదంటే ఇళ్ల నుంచి చెత్త సేకరించమని స్పష్టం చేసింది. ప్రజలు కొంత కాలం అసంతృప్తి వ్యక్తం చేసినా.. నెమ్మదిగా దీని ప్రాముఖ్యతను గుర్తించారు. ఫలితంగా ప్రస్తుతం అలెప్పీ స్వచ్ఛమైన పట్టణాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. సేకరించిన తడి చెత్తను వివిధ పద్ధతుల ద్వారా కుళ్లబెట్టి ఎరువుగా మార్చి రైతులకు తక్కువ ధరకు అమ్ముతున్నారు. పొడిచెత్తను కూడా ఇదే రకంగా నిర్దిష్ట కేంద్రాల్లో వర్గీకరించి.. ఏవిధంగానూ రీసైకిల్ చేయలేమనుకున్న చెత్తను మాత్రమే డంపింగ్ యార్డ్‌కు పంపుతున్నారు. పణజి, మైసూరుల్లోనూ ఇదే పరిస్థితి. బెంగళూరులో మాత్రం ‘హసిరుదళ’అనే స్వచ్ఛంద సంస్థ నగరంలో చెత్త ఏరుకునే వారిని ఒక ఛత్రం కిందకు తీసుకువచ్చింది. చెత్త సేకరణ వర్గీకరణల ద్వారా వారు నెలకు దాదాపు రూ.15 వేల వరకూ ఆర్జించేందుకు అవకాశం కల్పించింది. ప్రభుత్వ అధికారులతో మాట్లాడి గుర్తింపు కార్డులు లభించేలా చేయడంతో పోలీసుల వేధింపులు తగ్గి వారు గౌరవప్రదమైన జీవితం గడిపేందుకు అవకాశం లభించిందని అంటున్నారు హసిరుదళ డైరెక్టర్ నళినీ శేఖర్. అక్కడకక్కడా చెదురుమదురుగా జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాలు దేశవ్యాప్తంగా ప్రతిచోటా ఆచరణలోకి వచ్చినప్పుడే చెత్త సమస్యను అధిగమించవచ్చు. ఇందుకు కావాల్సింది మన ఆలోచనల్లో కొంచెం మార్పు.. రాజకీయ నాయకులు, అధికారుల చిత్తశుద్ధి మాత్రమే. -
సమస్యలకు నిలయం పెద్దాస్పత్రి
► పనిచేయని లిఫ్టులు.. గోడలపై గుట్కా మరకలు ► ముక్కు మూసుకోనిదే నోఎంట్రీ ఎదులాపురం: జిల్లా కేంద్రంలోని పెద్దాస్పత్రి అయిన రిమ్స్ సమస్యలకు నిలయంగా మారింది. చెత్త కుండీల్లో చెత్త పేరుకుపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో ముక్కు మూసుకోనిదే ఆస్పత్రిలోనికి వెళ్లే పరిస్థితి లేదు. ఆస్పత్రిలో లిఫ్టులు పనిచేయకపోవడంతో రక్త పరీక్షలు, స్కానింగ్, ఎక్స్‌రే, ఇతర పరీక్షల కోసం రోగులను పైఅంతస్తు నుంచి కిందికి, కింది నుంచి పైఅంతస్తుకు తీసుకెళ్లాలంటే అవస్థలు ఎదురవుతున్నాయి. కొన్ని వార్డుల్లో గోడలు, మెట్లపై గుట్కా మరకలు దర్శనమిస్తున్నాయి. ఆయా వార్డుల్లోని కిటికీలకు అట్ట ముక్కలతో తాత్కాళికంగా తలుపులు అమర్చారు. అపరిశుభ్ర వాతారణం కారణంగా రోగుల వెంబడి వచ్చే వారు రోగాల బారిన పడే అవకాశాలు లేకపోలేదు. పనిచేయని లిఫ్ట్‌లు రిమ్స్ ఆస్పత్రిలో మొత్తం నాలుగు లిఫ్ట్‌లు ఉన్నాయి. అందులో మూడు పనిచేయడం లేదు. ఒక లిఫ్ట్ మాత్రమే పనిచేస్తుండటం, నాలుగు లిఫ్ట్‌లలో నుంచి ఏ లిఫ్ట్ ఎప్పుడు పనిచేస్తుందో సిబ్బందికే తెలియదంటే ఇక పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పై అంతస్తుల్లో చికిత్స పొందుతున్న రోగులైతే రోజుకోసారైనా పరీక్షల నిమిత్తం కిందికి దిగాల్సి ఉంటుంది. దీంతో వారు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. కనీసం రోగులను తీసుకెళ్లే విధంగానైనా లిఫ్ట్‌లను అందుబాటులోకి తీసుకురావాలని రోగుల బంధువులు కోరుతున్నారు. గోడలు, మెట్లపై గుట్కా మరకలు పలు వార్డుల్లోని గోడలు, మూలలు, మెట్లపై గు ట్కా మరకలు దర్శనమిస్తున్నాయి. గతంలో ఆ స్పత్రిలోనికి వెళ్లేవారిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన సెక్యూరిటీ సిబ్బంది ఇప్పుడు పట్టించుకోవడం లేదు. ప్రజలను తనిఖీ చేసి మరీ వారి వద్ద ఉన్న గుట్కాలు, అంబర్ లాంటి మత్తు పదార్థాలను లోనికి అనుమతించలేదు. దీంతో ఆ సమయ ంలో ఇలాంటివి చోటుచేసుకోలేదు. ప్రస్తు తం గోడలు మరకలతో నిండుగా కనిపిస్తున్నాయి. వెదజల్లుతున్న దుర్గంధం ఆస్పత్రిలో ఎటు వెళ్లినా దుర్గంధం వెదజల్లుతోంది. మరుగుదొడ్లను శుభ్రం చేయకపోవ డం, రోజుల తరబడి చెత్తాచెదారం నిల్వ ఉండడంతో ఈ దుస్థితి నెలకొంది. నిత్యం వందల సంఖ్యలో వచ్చే ప్రజలు దుర్వాసనతో ఇబ్బ ందులు ఎదుర్కొంటున్నారు. నోటిపై గుడ్డను అడ్డుగా పెట్టి ఆస్పత్రిలోనికి వెళ్తున్నారు. -
ఇక నుంచి చెత్తపై పన్ను
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెత్తను తగ్గించడానికి జీహెచ్ఎంసీ ముందడుగు వేసింది. ఇక నుంచి చెత్తపై కూడా పన్ను వసూలు చేయాలని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ నిర్ణయించింది. ప్రతిరోజు 100కిలోలకు పైగా చెత్తను ఉత్పత్తిచేసే వారి నుంచి కిలోకు రూ. 2.25చొప్పున నిర్వహణ చార్జీలు వసూలు చేయడానికి ప్రవేశపెట్టిన తీర్మానానికి ఆమోదం లభించింది. -
రోడ్లపై చెత్త వేస్తే భారీ జరిమానా
ఉప్పల్: ఎవరైనా రోడ్లపై చెత్త విసిరేసినా, కూడళ్లలో చెత్త జమచేసినా భారీగా జరిమానా విధించనున్నట్లు ఉప్పల్ డీసీ విజయకృష్ణ గురువారం హెచ్చరించారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా నగరాన్ని చెత్తరహిత నగరంగా అభివృద్ధి చేసే దిశలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పారు. చిలుకానగర్‌లో రోడ్డుపై చెత్తపడేసిన ఓ వ్యారికి రూ.500 జరిమానా విధించారు. -
మంట కలిసిన మానవత్వం
-
రామాంతపూర్‌లో దారుణం
హైదరాబాద్: అప్పుడే పుట్టిన పసికందును గుర్తుతెలియని వ్యక్తులు చెత్తకుండి పక్కన పడేసి వెళ్లారు. ఈ సంఘటన నగరంలోని రామాంతపూర్ వెంకట్‌రెడ్డి నగర్లో ఆదివారం వెలుగుచూసింది. స్థానిక బస్టాప్ పక్కన ఉన్న చెత్తకుండి వద్ద అప్పుడే పుట్టిన చిన్నారి ఏడుస్తుండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు శిశువును వైద్య చికిత్సల నిమిత్తం నీలొఫర్ ఆస్పత్రికి తరలించారు. పసికందు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. -
గ్రేటర్ హైదరాబాద్‌లో చెత్తపై ఛార్జ్
-
దసరా ముగిసింది.. చెత్త మిగిలింది
రోడ్లు, మార్కెట్ల వద్ద పేరుకుపోయిన చెత్త దిబ్బలు బెంగళూరు(బనశంకరి): దసరా.. ఆయుధపూజ, విజయదశమి పండుగ నేపథ్యంలో బీబీఎంపీ పరిధిలో నగరంలోని ప్రముఖ మార్కెట్లు, రోడ్లతో పాటు ప్రముఖ వీధుల్లో చెత్తపేరుకుపోయి రాసులు దర్శనమిస్తున్నాయి. ఆయుధపూజ నేపథ్యంలో రెండు రోజులుగా ప్రజలు నగరంలో ఉన్న ప్రముఖ మార్కెట్లలో గుమ్మడికాయలు, పూలు, అరటిపిలకలు కొనుగోలు చేసి వాహనాలకు పూజలు నిర్వహించిన అనంతరం వాటిని రోడ్లుపై పడేశారు. దీంతో నగరవ్యాప్తంగా రోడ్లపై ఎక్కడ చూసినా చెత్తకుప్పలు పేరుకుపోయాయి. వీటితో పాటు నగరంలో యశవంతపుర, కేఆర్.మార్కెట్, ఏపీఎంసీ.యార్డు, యలహంక, మల్లేశ్వరం, సదాశివనగర, జయనగర,జేపీ.నగర, బసవనగుడి, బనశంకని, సారక్కి, మడివాళ తదితర మార్కెట్లు వద్ద గుమ్మడికాయలు, అరటిపిలకలు, పూలు, వ్యర్ధాలు కుప్పలుగా పేరుకుపోయాయి. దీంతో పౌరకార్మికులు పేరుకుపోయిన చెత్తను తొలగించడానికి నానాపాట్లు పడుతున్నారు. మామూలు రోజుల కంటే అధికంగా చెత్తపేరుపోవడంతో కొన్నిచోట్ల జేసీబీ యంత్రాల సాయంతో చెత్తను తొలగిస్తున్నారు. సోమ, మంగళ వారాల్లో చెత్తలారీలకు పూజలు చేసి నిలిపివేశారు. బుధవారం నుంచి లారీలను బయటకు తీసిన పౌరకార్మికులు చెత్తను తరలించే పనిలో నిమగ్నమయ్యారు. మంగళవారం రాత్రి నగరంలో వర్షం కురవడంతో చెత్తరాశుల వద్ద నీరు నిలిచిపోయి అధ్వాన్నకరంగా మారిపోయింది. దీంతో నగరవ్యాప్తంగా పేరుకుపోయిన చెత్తను తొలగించడానికి పౌరకార్మికులు తీవ్రంగా శ్రమిస్తుండగా పూర్తిస్థాయిలో చెత్తను తొలగించడానికి కనీసం వారం రోజులు పట్టే అవకాశం ఉంది. -
చెత్త కనిపిస్తే సస్పెండ్ చేస్తా..!
పారిశుద్ధ్య పనుల విషయంలో అలసత్వం వద్దు జిల్లా కలెక్టర్ ఎస్.సుజాతశర్మ మద్దిపాడు మండలంలో పారిశుద్ధ్య పనులు పరిశీలన కాలనీల్లో పేరుకున్న చెత్త చూసి అసహనం సస్పెండ్ చేస్తానంటూ గ్రామ కార్యదర్శికి వార్నింగ్ రాజకీయూలు చేస్తే చెక్‌పవర్ రద్దు చేస్తానని సర్పంచ్‌కి హెచ్చరిక తాగునీరు కలుషితం అవుతోందని స్థానికుల ఫిర్యాదు గుండ్లకమ్మ వద్ద సీపీడబ్ల్యు స్కీమ్‌లో తాగునీటి పరిశీలన మద్దిపాడు (సంతనూతలపాడు) : గ్రామంలో ఇంత చెత్త పేరుకుపోతే ఏమీ పట్టనట్టు తిరుగుతారా..? పారిశుద్ధ్యంపై అలసత్వం వహిస్తే సస్పెండ్ చేస్తా.. నంటూ జిల్లా కలెక్టర్ సుజాతశర్మ మద్దిపాడు మండలం రాచవారిపాలెం గ్రామ కార్యదర్శికి వార్నింగ్ ఇచ్చారు. గ్రామ సర్పంచ్‌ని సైతం చెక్ పవర్ రద్దు చేస్తాన ని హెచ్చరించారు. పారిశుద్ధ్యం విషయంలో రాజకీయాలొద్దని, ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోనని మందలించారు. ఎవరి ఇంటి ముందు వారు శుభ్రం చేసుకోలేరా.. వీధుల్లో చెత్తవేస్తా ఎలాగ అంటూ కాలనీ వాసులపై అసహనం వ్యక్తం చేశారు. శనివారం మద్దిపాడు మండలంలో పర్యటించిన కలెక్టర్ పలు గ్రామాల్లో పారిశుద్ధ్య పనుల నిర్వహణ, తాగునీటి సరఫరా వంటి మౌలిక వసతులను పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణపై అసంతృప్తి.. రాచవారిపాలేనికి మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చిన కలెక్టర్ అధికారులను పరుగులు తీయించారు. గ్రామంలోని పారిశుద్ధ్య నిర్వహణపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేయాలని గ్రామ కార్యదర్శి జాన్బాషాను ఆదేశించారు. అలసత్యం వహిస్తే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. గ్రామంలో ఇలా చెత్త పేరుకుపోతుంటే మీరేమి చేస్తున్నారంటూ సర్పంచ్ పిట్టల ఆంజనేయులును నిలదీశారు. ఇలాగైతే చెక్‌పవర్ తీసేస్తానని హెచ్చరించారు. స్పందించిన సర్పంచ్ మాట్లాడుతూ తాను సర్పంచ్‌నని కూడా గుర్తించకుండా కార్యదర్శి ఇస్టానుసారం వ్యవహరిస్తున్నాడని, ఒక పార్టీ వారికే పనులు చేస్తానని చెబుతున్నాడని ఆరోపించారు. పారిశుద్ధ్య పనుల విషయంలో రాజకీయూలొద్దని కలెక్టర్ హితవు పలికారు. అనంతరం ఎస్సీ కాలనీలో పర్యటించిన ఆమె కాలనీలలో చెత్త నయిదిబ్బలు వేసి ఉంటే ఎలాగని కాలనీ వాసులను ప్రశ్నించారు. ఎవరి ఇంటి ముందు వారు, ఎవరివీధి వారు శుభ్రం చేసుకోలేరా..? అని ప్రశ్నించారు. కార్యదర్శి విషయం పక్కనబెట్టి పారిశుధ్య పనులు దగ్గర ఉండి చేయించాలని సర్పంచ్‌కు సూచించారు. పనులు పర్యవేక్షించాలని డీపీఓ ప్రసాద్‌ను ఆదేశించారు. గ్రామ కంఠంలోని స్థలాన్ని వైద్య ఆరోగ్యశాఖ సబ్సెంటర్కు ఇవ్వటానికి తీర్మానం చేయనీయకుండా గ్రామ కార్యదర్శి, మరికొందరు కలిసి ఇబ్బంది పెడుతున్నారని సర్పంచ్ ఆరోపించారు. గ్రామానికి సీపీడబ్ల్యు స్కీమ్ ద్వారా నీరు వస్తున్నా దానిలో గుండ్లకమ్మ నదిలోని నీరు కలుపుతుండటంతో నీరు వాసన వేస్తుందని, గాజులపాలెం వద్ద ఏర్పాటు చేసిన రొయ్యల ఫ్యాక్టరీలో వ్యర్ధపు నీరు శుద్ధి చేయకుండా గుండ్లమ్మ నదిలోకి వదలడంతో జబ్బులు వస్తున్నాయని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తేవడంతో తిరుగు ప్రయాణంలో ఆ గ్రామానికి ఏర్పాటు చేసిన సంప్ వద్ద నీరు లీక్ అవుతుండటాన్ని పరిశీలించారు. తాగునీటి సరఫరా పరిశీలన.. గాజులపాలెం, కీర్తిపాడు గ్రామస్తులు తమ గ్రామంలో రోడ్లులేవని, ఆదేవిధంగా రొయ్యల ఫ్యాక్టరీవారు గుండ్లకమ్మ నదిలోని నీటిని కలుషితం చేస్తున్నారని ఆరోపించారు. దీంతో కలెక్టర్ ఫ్యాక్టరీ వెనుక భాగంలో ఫ్యాక్టరీ నుంచి వదులుతున్న నీటిని పరిశీలించారు. ప్యాక్టరీ నుంచి వస్తున్న దుర్వాసనకు ముక్కు మూసుకున్నారు. వెంటనే పొల్యూషన్ కంట్రోల్ వారితో వచ్చి పూర్తి స్థాయిలో పరిశీలన చేయూల్సిందిగా ఆమె ఆర్డీవో కమ్మ శ్రీనివాసరావును ఆదేశించారు. ప్రతి చోటా తాగునీటిపై ఫిర్యాదులు వస్తుండటంతో ఆమె గుండ్లకమ్మ రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన సీపీడబ్ల్యు స్కీమ్ వద్దకు వె ళ్లి అక్కడి పరిస్థితులను గమనించారు. క్లోరోమీటర్ ద్వారా నీటిలో క్లోరినేషన్ చేశారా లేదా అని పరిశీలించారు. గుండ్లకమ్మ సీపీడబ్ల్యు స్కీమ్ ద్వారా 76 గ్రామాలకు నీరు సరఫరా అవుతోందని ఏఈ రవికుమార్ కలెక్టర్‌కు తెలిపారు. స్కీమ్ నుంచి చివరి ట్యాప్ వరకూ ఎంత పీపీఎం నమోదైనది తనకు ఆదివారం సాయంత్రానికల్లా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నీటి నమూనాలు తీసుకోవాల్సిందిగా డీఎంహెచ్ఓ జాస్మిన్ను ఆదేశించారు. సీపీడబ్ల్యు స్కీమ్ వద్ద క్లొరినేషన్ పెంచాల్సి ఉంటుందని కలెక్టర్ అభిప్రాయం వ్యక్తం చేయగా అసలు క్లోరినేన్ చేస్తేనే కదా అంటూ స్థానికులు చర్చించుకోవడం కనిపిం చింది. కార్యక్రమంలో తహశీల్దార్, ఎంపీడీవో, ఇతర మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
రైల్వేస్టేషన్లో చెత్తవేస్తే జరిమానా
సీఎంఎం సత్యనారాయణ నెల్లూరు(సెంట్రల్) : రైల్వేస్టేషన్లో ప్రయాణికులు నిబంధనలకు విరుద్ధంగా చెత్త వేస్తే రూ.500 వరకు జరిమానా విధిస్తామని సికింద్రాబాద్ డివిజన్ చీఫ్ మెటీరియల్ మేనేజర్ (సీఎంఎం) సత్యనారాయణ అన్నారు. నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్లో గురువారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వారంరోజుల పాటు దేశంలోని అన్ని రైల్వేస్టేషన్లలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రయాణికులకు స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఆ తర్వాత కూడా ఎవరైనా స్టేషన్లో చెత్త వేస్తే జరిమానా వేస్తామని చెప్పారు. అంతకుముందు స్వచ్ఛ నాటిక ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ టికెట్ మేనేజర్ సాగర్, రమేష్, మునీర్, నాయక్, ఇన్చార్జి ఎస్ఎస్ కుమార్ పాల్గొన్నారు. -
‘కంపు’లో.. ‘అనంత’ వినాశనం!
– నగరంలో ఇప్పటి వరకూ రూ.70 కోట్లు ఖర్చుచేసిన పాలకవర్గం – అధికశాతం నిధులు నేతల జేబుల్లోకే – ‘అధికార’ పక్షానికి యంత్రాంగం జీహుజూర్ – కలుషిత నీరు, అపరిశుభ్రతే రోగాలకు ప్రధాన కారణం – చిన్నారుల మతి తర్వాత జిల్లా అధికారుల హడావుడి నగరంలో నివసించే ప్రతి ఒక్కరూ ప్రభుత్వం నుంచి ఆశించేది ప్రధానంగా రెండే. ఒకటి స్వచ్ఛజలం, మరొకటి మెరుగైన పారిశుద్ధ్యం. ఈ రెండూ సక్రమంగా ఉంటే సగం రోగాలు దరిచేరవు. కానీ వీటిపై కార్పొరేషన్ వైఖరి దారుణంగా ఉంది. ప్రస్తుత పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి నేటి వరకూ రూ.72 కోట్ల ప్రజాధనం ఖర్చు చేశారు. కానీ కనీస మౌలిక వసతులు కూడా కల్పించలేకపోయారు. ప్రతిపనిలో ‘ఎంత వస్తుందనే’ కోణంలోనే ఆలోచించారు. ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేశారు. దీని పర్యవసానమే.. ఇద్దరు చిన్నారులు మత్యువాత. బయటికి తెలిసింది వీరిద్దరే కానీ.. వెలుగులోకి రాని మతుల సంఖ్య ఎక్కువగానే ఉంది. కార్పొరేషన్ నిర్లక్ష్యంపై పత్రికల్లో వచ్చిన కథనాలకు స్పందించని అధికారులు, పాలకవర్గం...కనీసం చిన్నారుల మతితోనైనా కళ్లు తెరవాలని ప్రజలు కోరుతున్నారు. -
బక్రీద్ వ్యర్థాల కోసం కవర్ల పంపిణీ
బక్రీద్ పండుగ సందర్భంగా తయారయ్యే వ్యర్థాలను ప్లాస్టిక్ కవర్లలో మాత్రమే పడేయాలని చాంద్రాయణగుట్ట ఎస్సై చంద్రమోహన్ అన్నారు. స్టేషన్ పరిధిలోని అల్ జుబేల్ కాలనీలో స్థానిక నాయకులతో కలిసి సోమవారం ఆయన ప్లాస్టిక్ కవర్లను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....బక్రీద్ పండుగ సందర్భంగా ఖుర్బానీ నిర్వహించే వ్యర్థాలను రోడ్లపై పడేస్తే ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తాము అందజేసే కవర్లలో వ్యర్థాలను పడేసి చెత్త కుండీలలో, లేకుండే జీహెచ్ఎంసీ వాహనాలలో పడేయాలని ఆయన సూచించారు. తమ కార్యక్రమానికి స్థానికుల నుంచి మంచి స్పందన వచ్చిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. -
భార్య చితి కోసం చిత్తుకాగితాలు, చెత్త..
ఇండోర్: అంబులెన్స్ దారి మధ్యలోనే వదిలేయడంతో భార్య మృతదేహాన్ని 10 కిలోమీటర్ల దూరం భుజాన మోస్తూ తీసుకెళ్లిన ఒరిస్సాలోని ఓ వ్యక్తి ఉదంతం మరువక ముందే.. మధ్యప్రదేశ్‌లో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. శ్మశానంలో భార్య మృతదేహానికి దహనసంస్కారాలు చేయడానికి పంచాయితీ పెద్దలు నిర్ణయించిన డబ్బు లేకపోవడంతో.. ఏం చేయాలో పాలుపోని ఆ భర్త, దహనానికి చుట్టుపక్కల చిత్తుకాగితాలు, చెత్త, పాతటైర్లు సేకరిస్తూ నరకం చూశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఇండోర్‌కు 250 కిలోమీటర్ల దూరంలోని మారుమూల ప్రాంతం రతన్గర్ గ్రామంలో చోటుచేసుకుంది. గత శుక్రవారం రతన్గర్ గ్రామ సమీపంలోని గిరిజన గ్రామంలో నోజీభాయ్ అనే మహిళ మృతి చెందింది. దీంతో ఆమె భర్త జగదీష్ దహనసంస్కాలు చేయడానికి రతన్గర్ శ్మశానవాటికకు మృతదేహాన్ని తీసుకెళ్లాడు. రతన్గర్ పంచాయితీ పెద్దలు మాత్రం రూ. 2500 చెల్లిస్తేనే దహనసంస్కారాలకు అవకాశం అని తెగేసి చెప్పారు. తన దగ్గర అంత డబ్బులేదని జగదీష్ చెప్పినా వారు కనికరించలేదు. దీంతో ఏం చేయాలో తోచని జగదీష్.. సుమారు మూడు గంటల పాటు సమీపంలో దొరికిన వాటితో చితికి ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న వారిలో కొందరు శవాన్ని నదిలో పడేయమంటూ ఉచిత సలహా కూడా ఇచ్చారని జగదీష్ వాపోయాడు. చివరకు గ్రామంలో ఓ వ్యక్తి కొంత కలపను సహాయం చేసినట్లు వెల్లడించాడు. ఈ ఘటన అధికారుల దృష్టికి వెళ్లడంతో జిల్లా కలెక్టర్ స్పందించారు. రతన్గర్ గ్రామపెద్దలపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
చెత్తకుండీలో శిశువు మృతదేహం
ఒంగోలు: ఒంగోలు భాగ్యనగర్ 4వ లైన్‌లోని ఓ చెత్తకుండీలో పురిటి శిశువు మృతదేహాన్ని గురువారం స్థానికులు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని... ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చెత్తకుప్పలో పసికందు
హైదరాబాద్: అప్పుడే పుట్టిన శిశువును చెత్తకుప్ప పాలు చేశారు. కాప్రా మున్సిపాలిటీ పరిధిలో ఈఘటన చోటుచేసుకుంది. హెచ్‌బీ కాలనీలో గల చెత్తకుప్పలో శనివారం ఉదయం స్థానికులకు పసికందు ఏడుపు వినిపించింది. వెళ్లి చూడగా చిత్తుకాగితాల మధ్య చుట్టి ఉన్న మగశిశువు ఏడుస్తోంది. దీంతో వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వారు శిశువును వెంటనే 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
చెత్తకూ ఓ యాప్..!
- త్వరలో అందుబాటులోకి తేనున్న జీహెచ్ఎంసీ - నెలరోజుల్లో 1116 క్లీన్ ప్రాంతాలు సిటీబ్యూరో: నగర ప్రజలకు ఓ శుభవార్త.. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో చెత్త పేరుకుపోతే విసుక్కోనవసరం లేదు.. తరలింపు సిబ్బంది కోసం ఎదురు చూడాల్సిన పనీలేదు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. ఒక్క ఫొటో తీసి గ్రేటర్ శానిటేషన్ విభాగానికి పంపితే చాలు తొలగింపు, తరలింపు పనులు వెంటనే వారే చూసుకుంటారు. ఇందుకోసం ప్రత్యేకంగా ‘యాప్’ సైతం అందుబాటులోకి రానుంది. ఈ యాప్ అందుబాటులోకి వస్తే.. ప్రజలు ఎక్కడ తమకు చెత్త కనిపించినా.. ఫొటో తీస్తే గూగుల్ మ్యాప్స్ ద్వారా సదరు చెత్త ఎక్కడ ఉందో.. ఏ లాంగిట్యూట్, లాటిడ్యూడ్లో పేరుకుపోయిందో వివరాలన్నీ సంబంధిత పరిధిని పర్యవేక్షించే సహాయ వైద్యాధికారి (ఏఎంఓహెచ్) కి చేరతాయి. ఏఎంఓహెచ్ వెంటనే చర్యలకు ఉపక్రమిస్తారు. తద్వారా ఇప్పటికే చెత్త ప్రాంతాలుగా ఉన్న ప్రాంతాలను శుభ్రం చేయడంతో పాటు.. కొత్తగా చెత్త ప్రాంతాలు ఏర్పడకుండా చూడవచ్చునని అధికారులు భావిస్తున్నారు. దాదాపు నెలరోజుల్లో ఇది అందుబాటులోకి రాగలదని అంచనా వేస్తున్నారు. మరోవైపు గ్రేటర్లో రెండువేలకు పైగా ప్రాంతాల్లో బహిరంగంగా, రోడ్లపైనే చెత్త వేయడాన్ని గుర్తించిన జీహెచ్ఎంసీ.. అందులో 1116 ప్రాంతాలను చెత్త ర హిత ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకుంది. ఈమేరకు మంత్రి కేటీఆర్‌కు సైతం మాట ఇచ్చారు. వందరోజుల్లో 1116 ప్రదేశాలను చెత్త రహితంగా మారుస్తామని హామీ ఇచ్చారు. ఆ దిశగా ఇప్పటికే చర్యలు ప్రారంభించిన అధికారులు దాదాపు 200 ప్రదేశాల్లోని చెత్తను తరలించడమే కాకుండా తిరిగి అక్కడ చెత్త వేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా ఇక్కడ చెత్త వేసిన వారికి వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని ప్రకటన బోర్డులు సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఓవైపు ఈ పనులు చేస్తూనే మరోవైపు యాప్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇంటిగ్రేటెడ్ యాప్.. నగరంలోని ప్రధాన సమస్యలైన పారిశుద్ధ్యం, తాగునీరు, మురుగునీరు, రహదారులతో పాటు ఇతరత్రా సేవలన్నీ జీహెచ్ఎంసీ, వాటర్‌బోర్డు రెండు విభాగాల పరిధిలోనే ఉండటం తెలిసిందే. ఏ సమస్యను ఎవరు పరిష్కరిస్తారో తెలియక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా, వాటర్‌బోర్డు ఎండీగా డాక్టర్ బి. జనార్దన్‌రెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. అందుకు అనుగుణంగా రెండు విభాగాల సేవలనూ ఒకే యాప్ ద్వారా అందుబాటులోకి తేవాలని ప్రయత్నిస్తున్నారు. మే నెలాఖరు నాటికి దీన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. -
చెత్త సేకరిస్తున్న ఐఐటీ విద్యార్థులు...
వెస్ట్ బెంగాల్ః వ్యర్థాలను రీ సైకిల్ చేయడం ఇప్పుడు ఖరగ్ పూర్ పట్టణంలో ఫోన్ చేసి పిజ్జా ఆర్డర్ ఇవ్వడం అంత సులభం అయిపోయింది. ఖరగ్ పూర్ ఐఐటీలో చదువుతున్న విద్యార్థులు చెత్తను రీ సైక్లింగ్ చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 'కబాడీ ఆన్ కాల్' పేరున ఓ ప్రత్యేక సేవను ఏర్పాటు చేసి, అటు పట్టణ వాసులకు సేవలు అందించడంతోపాటు వ్యాపారంగా కూడా మలచుకొన్నారు. పశ్చిమ బెంగాల్ లోని ఖరగ్ పూర్ ఐఐటీలో చదువుతున్న కొందరు విద్యార్థులు ఓ బృందంగా ఏర్పడి, చుట్టుపక్కల ప్రాంతాల్లో పేరుకున్న చెత్తను శుభ్రం చేయడం ఓ కార్యక్రమంగా చేపట్టారు. 'కబాడీ ఆన్ కాల్' పేరున క్యాంపస్ లోపల, చుట్టుపక్కల ఉండే ప్రజల నుంచి చెత్తను సేకరించేందుకు ఓ ఫోన్ నెంబర్ ద్వారా అపాయింట్ మెంట్ తీసుకొని ట్రక్ ను పంపించే సౌకర్యాన్నిఅందుబాటులోకి తెచ్చారు. పీహెచ్ డీ విద్యార్థి అభిమన్యుకర్ అతని స్నేహితులతో కలసి 'గెయిన్ వేస్ట్' పేరున ప్రారంభించిన సామాజిక వ్యవస్థాపక వెంచర్ ఇప్పుడు ఎంతో పేరు తెచ్చుకుంది. పొడి చెత్త, బాటిల్స్, పేపర్లు, ప్లాస్టిక్ వస్తువులు వంటివి సేకరించి వాటిని ఈ విద్యార్థులు రీ సైక్లింగ్ చేసి అమ్ముతున్నారు. 2014లో ప్రారంభించిన వ్యాపారంలో విద్యార్థులు నెలకు కనీసం 20 వేల రూపాయల వరకు సంపాదిస్తున్నారు. చెత్తను సేకరించేందుకు కొంతమంది కూలీలను పెట్టుకొన్నామని, వారితో ఓ డిజిటల్ వేయింగ్ మెషీన్ ను కూడా పంపించి, రేటు కార్డు ప్రకారం ఒక్కో చెత్తకు ఒక్కోరకమైన రేటును వసూలు చేస్తామని ఓ మెకానికల్ విద్యార్థి చెప్తున్నారు. ప్రస్తుతం చాలామంది ప్రొఫెసర్లు కూడా విద్యార్థులకు కస్టమర్లుగా ఉన్నారు. మొదట్లో చెత్తను వేరు చేయడం కొంత కష్టమైందని ప్రస్తుతం అటువంటి సమస్యలు పెద్దగా లేవని ఓ విద్యార్థి పేర్కొన్నాడు. -
ఓట్ల కోసం మురికి సేవ..!
నాచారం: నాచారం డివిజన్లో ప్రధాన సమస్య.. పెద్ద నాలా శుక్రవారం సాయంత్రం పొంగి ప్రవహించింది. నాచారం పోలీస్‌స్టేషన్ సమీపంలోని పోలేరమ్మ ఆలయం పక్కనే ఉన్న నాలాలో చెత్తాచెదారం పేరుకుపోయి మురుగు నీరు ఒక్కసారిగా ప్రధాన రోడ్డుపైకి చేరింది. అదే సమయంలో స్కూల్ వదలడంతో విద్యార్థులు, ద్విచక్ర వాహనదారులు రోడ్డు దాటేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్ నాయకులు సాయిజెన్ శేఖర్, టీఆర్ఎస్ నాయకులు మేడల మల్లికార్జున్ గౌడ్, టీడీపీ నాయకులు అక్కడకు చేరుకుని తమ అనుచరగణంతో కలిసి మురుగు నీటిలోకి దిగారు. పేరుకుపోయిన చెత్తను తొలగించారు. పిల్లలను రోడ్డు దాటించారు. మున్సిపల్ సిబ్బంది రాకముందే రోడ్డుపై మురుగు సమస్యను పరిష్కరించారు. గెలిచాక ఇదే స్ఫూర్తి ఉంటుందా..! అని స్థానికులు గుసగుసలాడుకున్నారు. -
డిప్యూటీ సీఎం ఇంటిముందు చెత్తవేసి మరీ...
ఢిల్లీ: ఢిల్లీలోని పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన సెగ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి తీవ్రంగా తాకుతోంది. వేతనాలు రెగ్యులర్‌గా చెల్లించాలంటూ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న ఆందోళన ఉధృతరూపం దాలుస్తోంది. తమ డిమాండ్ల సాధనకు వినూత్న రూపంలో ఆందోళనకు దిగారు. నిన్నముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేసిన ఆందోళనకారులు తమ పోరాట వేదికను ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇంటికి మార్చారు. చెత్తా చెదారాన్ని మనీష్ ఇంటి లోపలకి విసిరేసి.... నిరసన తెలిపారు. నినాదాలతో హోరెత్తించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులకు, ఆందోళకారులకు మధ్య తోపులాట జరిగింది. మున్సిపల్ కార్మికుల ఆందోళనలతో ఢిల్లీ హోరెత్తుతోంది. పెండింగ్ వేతనాలు విడుదల చేయాలంటూ మున్సిపల్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. ఏడెనిమిది నెలలుగా జీతాలు ఇవ్వకపోతే.... బతికేదెలా అని ప్రశ్నించారు. తమను పస్తులు ఉంచుతున్నారంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తిట్టిపోశారు. డిమాండ్లు సాధించే వరకు పోరాటాన్ని ఆపబోమని తేల్చిచెప్పారు. అటు కార్మికులు చేస్తున్న సమ్మెపై వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
డిప్యూటీ సీఎం ఇంటి ముందు చెత్తవేసి మరీ...
-
మొదటి మహిళా చెత్త ట్రక్ డ్రైవర్..!
చెత్త ఏరుకోవడంతో మొదలైన ఆమె జీవితం... ఇప్పుడు ఓ నగరంలో తొలి మహిళా ట్రక్ డ్రైవర్ స్థాయికి చేరింది. ఆత్మ విశ్వాసంతో ఆమె వేసిన ప్రతి అడుగూ అభివృద్ధి పథంలో నడిపించింది. ఇరుగు పొరుగు సాయం కూడా అందడంతో లక్ష్యాన్ని చేరుకోగలిగింది. 'హసరు డాల' అనే సంస్థ కూడా ఆమెకు వెన్నుదన్నుగా నిలిచింది. హసరు డాల అనే సంస్థ బెంగళూరులో చెత్త ఏరుకునే వారి జీవితాలను బాగుచేసేందుకు పనిచేస్తోంది. ఇప్పుడు ఇదే సంస్థ బెంగళూరుకు చెందిన లక్ష్మి అనే ఓ మహిళ జీవితంలో వెలుగులు నింపింది. కెంపెగౌడ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో హౌస్ కీపింగ్ వర్కర్ గా పనిచేస్తున్న లక్ష్మికి చేయూతనిచ్చింది. చెత్తను ఏరుకొంటూ బతుకు బండిని ఈడుస్తున్న లక్ష్మికి.. ముగ్గురు పిల్లలు. చిన్న వయసులోనే వివాహం ఆమెకు వివాహం అయింది. భర్త మద్యానికి బానిస కావడంతో తీవ్ర కష్టాలను ఎదుర్కొంటుంది. కూతురు ప్రతిభ కూడ స్కూల్ డ్రాపవుట్ గా మారింది. దీంతో 15 ఏళ్ళ వయసున్న ప్రతిభను కూడ లక్ష్మి హసిరు డాలలో చేర్పించింది. అక్కడ ఆమె కుట్టు పనిలో శిక్షణ పొందుతోంది. ఇద్దరు కొడుకుల్లో పన్నెండేళ్ళ ధనుష్, పదేళ్ళ ఆకాష్ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకుంటున్నారు. అయితే, చెత్త ఏరుకునే లక్ష్మికి ఎలాగైనా డ్రైవింగ్ నేర్చుకోవాలన్న ఆశ ఉండేది. కానీ డ్రైవింగ్ స్కూల్ కు ఫీజు కట్టలేకపోవడంతో ఆమెకు తెలిసిన ఓ మహిళ ద్వారా హసిరు డాల సంస్థలో చేరి డ్రైవింగ్ నేర్చుకోవడమే కాకుండా డ్రైవింగ్ లైసెన్స్ కూడా పొందింది. అంతేకాకుండా త్వరలో బెంగళూరు నగరంలోనే మొదటి మహిళా చెత్తలారీ డ్రైవర్‌గా మారనుండటంతో ఆమె ఎంతో సంతోషిస్తోంది. ప్రస్తుతం లక్ష్మి ఒక టన్ను బరువైన ట్రక్ నడిపేందుకు డ్రైవింగ్ లో శిక్షణ పొందింది. వాణిజ్య పరమైన వాహనాలను నడిపేందుకు అనుమతిని పొందాల్సి ఉంది. చెత్త ఏరుకునే తనకు హసరుడాల సంస్థ సహకారం అందించడం వల్లే తన కల నెరవేరిందని చెప్తోంది. బెంగళూరుకు చెందిన హసిరుడాల సంస్థ వ్యర్థ పదార్థాలను సేకరించే కార్మికులకు చేయూతనిచ్చి వారిని వేస్ట్ మేనేజ్మెంట్ ఉద్యోగులుగా మార్చేందుకు కృషి చేస్తోంది. అంతేకాదు నగరంలో వ్యర్థ పదార్థాల నిర్వహణ సేవలను కూడా అందిస్తోంది. స్థానిక కార్మికులు విభజించిన వ్యర్థాలను సేకరించి, వాటిని ప్రాసెసింగ్ యూనిట్లకు రవాణా చేస్తోంది. -
గ్రేటర్.. పవర్
కార్పొరేషన్ ఆఫీస్‌కు సంప్రదాయేతర విద్యుత్ చెత్తతో విద్యుత్ ఉత్పత్తి తడిచెత్తకు తోడుగా సౌర శక్తి మరిన్ని ప్లాంట్ల ఏర్పాటు దిశగా ‘గ్రేటర్ వరంగల్’ ప్రయత్నాలు హన్మకొండ : రాష్ట్రంలోనే తొలిసారిగా సంప్రదాయేతర విద్యుత్‌తో నడిచే కార్యాలయంగా గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఖ్యాతి పొందింది. నిత్యం నగరం నుంచి వెలువడే తడి చెత్త, ప్రకృతి నుంచి ఉచితంగా లభించే సౌరశక్తి సాయంతో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ కార్యాలయ అవసరాలకు వినియోగిస్తున్నారు. ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణలో భాగంగా తడిచెత్త ఆధారిత బయోగ్యాస్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసి వీధి దీపాలు వెలిగించే దిశగా మరో ప్రయోగానికి కూడా కార్పొరేషన్ సిద్ధమవుతోది. మూడు అంతస్తులు ఉన్న గ్రేటర్ వరంగల్ కార్యాలయానికి సగటున నిత్యం 70 కిలోవాట్ల విద్యుత్తు అవసరం. ఇందులో 51 కిలోవాట్ల విద్యుత్‌ను సౌరశక్తి, తడిచెత్త ఆధారిత విద్యుత్ ప్లాంట్ ద్వారా కార్యాలయ ప్రాంగణంలోనే ఉత్పత్తి చేస్తున్నారు. వరంగల్ నగర పాలక సంస్థ భవనంపై 2013 ఆగస్టులో రూ. 48 లక్షల వ్యయంతో సోలార్ యూనిట్ నెలకొల్పారు. దీని నుంచి 27 కిలోవాట్ల విద్యుత్‌ఉత్పత్తి అవుతోంది. తాజాగా 2015 డిసెంబరు 5 నుంచి కార్యాలయ ఆవరణలో రూ. 24 లక్షల వ్యయంతో నిర్మిం చిన బయోగ్యాస్ ప్లాంట్ పని చేయడం ప్రారంభించింది. దీనినుంచి 24 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఈ రెండు పద్ధతుల్లో ఉత్పత్తి అయిన 51 కిలోవాట్ల విద్యుత్తుతో మూడు అంతస్తులు గల కార్పొరేషన్ కార్యాల యంలోని 104 ఫ్యాన్లు, 232 ట్యూబ్‌లైట్లు, 83 డీఎస్ఎల్, 11 వాట్ ఎల్ఈడీ బల్బ్స్, ఒక వాటర్ కూలర్, 54 కంప్యూటర్లు పనిచేస్తున్నాయి. ప్రస్తుతం 31 ఏసీలకే సంప్రదాయ విద్యుత్ ఉపయోగిస్తున్నారు. డిమాండ్ లేనప్పుడు ఉత్ప త్తి అయ్యే సౌర, తడిచెత్త ఆధారిత విద్యుత్‌ను గ్రిడ్‌కు పంపిం చేందుకు నెట్ మీటరింగ్ కోసం దరఖాస్తు చేశారు. తగ్గిన కరెంటు బిల్లు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కార్యాలయూనికి సగటున ప్రతీనెల రూ.1.10 లక్షల కరెంటు బిల్లు వచ్చేది. కానీ, 27 కేవీ సోలార్ పవర్ యూనిట్ అందుబాటులో వచ్చిన తర్వాత బిల్లు ఒక్కసారిగా రూ.60 వేలకు పడిపోయింది. తాజాగా 24 కేవీ తడిచెత్త విద్యుత్తు అందుబాటులోకి రావడంతో ప్రతీనెల కరెంటు బిల్లు రూ.20 వేల కు కిందకు పడిపోనుంది. పైగా నెట్‌మీటర్ అందుబాటులోకి వస్తే ఈ బిల్లు కూడా మరింత తగ్గుతుంది. మరిన్ని తడిచెత్త ప్లాంటు ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణలో భాగంగా తడిచెత్త ఆధారిత బయోగ్యాస్ విద్యుత్తు ఉత్పత్తి ప్లాంటుకు రెండేళ్ల కిందట గ్రేటర్ అధికారులు రూపకల్పన చేశారు. ఇందులో ఒక టన్ను తడిచెత్త సామర్థ్యంతో 2013లో బాలసముద్రంలో రూ.13.75 లక్షల వ్యయంతో తొలి తడిచెత్త ఆధారిత బయోగ్యాస్ ప్లాంటు ఏర్పా టు చేశారు. ఈ ప్లాంటు నుంచి 12 కిలోవాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. ఈ విద్యుత్‌ను సమీపంలో ఉన్న చిల్డ్రన్స్‌పార్కులో 70 లైట్లతో పాటు మూడు 5 హెచ్‌పీ మోటార్లకు ఉపయోగిస్తున్నారు. కార్పొరేషన్ ఆవరణలో రెండు టన్నుల చెత్త 24 కేవీ సామర్థ్యంతో ఏర్పాటు చేసిన రెండో ప్లాంటు సైతం విజయవంతంగా పనిచేస్తోంది. ప్రతీరోజు నగరంలో నిత్యం 40 టన్నుల తడి చెత్త ఉత్పత్తి అవుతోంది. ఇందులో కేవలం మూడు టన్నుల చెత్త ఈ రెండు ప్లాంట్లకు వెళ్తుంది. మిగిలిన చెత్త డంపింగ్ యార్డు చేరుతోంది. దీంతో నగరంలో కనీసం పది చోట్ల తడి చెత్త ఆధారిత విద్యుత్‌ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. వీటిద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును వీధి దీపాలకు సరఫరా చేయాలని నిర్ణయించారు. తద్వారా పరిశుభ్రతతో పాటు ఏకకాలంలో కాలుష్య, వ్యయ నియంత్రణ చేయవచ్చని అంచనా వేస్తున్నారు. -
చెత్తకుప్పలో పురిటిబిడ్డ మృతదేహం
-
చెత్తేరుతున్న తల్లికి కాళ్లు మొక్కిన ‘బ్యూటీ క్వీన్’
బ్యాంకాక్: నెత్తిన ధగధగలాడే కిరీటం, భుజాల మీదుగా నడుముకు సిల్కు పట్టా, హైహీల్స్ తొడిగిన ఓ 17 ఏళ్ల సుందరాంగి....రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై చెత్తేరుకుంటున్న ఓ మహిళ వద్దకు వెళ్లి హఠాత్తుగా మోకాళ్లను నేలకానించి వంగి ఆమె పాదాలకు మనస్ఫూర్తిగా నమస్కరించింది. ఆమె వెన్నంటే వచ్చిన మీడియా ఫొటోగ్రాఫర్ ఒకరు ఈ దృశ్యాన్ని క్లిక్ మనిపించారు. ఇప్పుడా ఫోటో ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. థాయ్‌లాండ్‌కు చెందిన ఆ సుందరాంగి పేరు కనిత్తా మింట్ ఫాసేంజ్. ఆమె ‘మిస్ అన్సెన్సార్డ్ న్యూస్ థాయ్‌లాండ్-2015’ పేరిట జరిగిన అందాల పోటీలో టైటిల్ గెలుచుకొంది. ఆమె కాళ్లు మొక్కింది ఎవరికోకాదు, తనను కనీపెంచి ఇంతటిదాన్ని చేసిన తల్లికే. వీధి వీధి తిరుగుతూ చెత్తను సేకరించి, దాన్ని రీసైక్లింగ్‌కు పంపించడం తన తల్లి చేస్తున్న వృత్తిని, చిన్నప్పటి నుంచి తనను ఎంతో కష్టపడి పెంచడమే కాకుండా డిగ్రీ వరకు చదివించిందని ఫాసేంజ్ గర్వగా చెప్పుకున్నారు. చేస్తున్న వృత్తి పట్ల తన తల్లికిగాని, తనకుగానీ ఏనాడు చులకన భావం కలగలేదని ఆమె చెప్పారు. కుటుంబ పరిస్థితుల కారణంగా ఇంకా పై చదువులకు వెళ్లలేని పరిస్థితుల్లో అనుకోకుండా సెప్టెంబర్ 25వ తేదీన జరిగిన అందాల పోటీల్లో తనకు అవకాశం లభించిందని ఆమె వివరించారు. డిగ్రీ పూర్తి చేసిన ఫాసేంజ్, అందాల పోటీకి ముందు తాను కూడా వీధి వీధి తిరుగుతూ చెత్తేరడంలో తల్లికి సహకరిస్తూ వచ్చారు. తన చిన్నప్పుడే తండ్రి నుంచి తల్లి విడాకులు తీసుకోవడంతో తామిద్దరమే ఒకరికొకరు తోడుగా బతుకుతున్నామని తెలిపారు. సినిమాల్లో నటించేందుకు, టీవీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తనకు ఇప్పుడు బోలడన్ని అవకాశాలు వచ్చాయని, తనతోపాటు తన తల్లిని నగరానికి తీసుకెళ్లి ఆమెకు మంచి విశ్రాంత జీవితాన్ని కల్పించాలన్నది తన తాపత్రయం ఆని ఆమె చెప్పారు. అయితే అందుకు తల్లి ఒప్పుకోవడం లేదని, ఇంతకాలం తిండిపెట్టిన వృత్తినే ఓపికున్నంత కాలం చేస్తానని చెబుతోందని అన్నారు. -
చెత్త రహితానికి నజరానా
బీబీఎంపీ కార్పొరేటర్లకు సీఎం తాయిలం బెంగళూరులో ప్లాస్టిక్ నిషేధానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటన కపై 15 రోజులకొకసారి నగర పర్యటన బెంగళూరు(బనశంకరి) : బృహత్ బెంగళూరు మహా నగర పాలికె (బీబీఎంపీ) పరిధిలోని వార్డులను చెత్త రహితంగా తీర్చిదిద్దిన కార్పొరేటర్లకు పారితోషకం అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. జాతీయ నగర ఆరోగ్య మిషన్ కార్యక్రమం అమలుపై పాలికె సభ్యులకు వికాససౌధలో బుధవారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బెంగళూరులో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకు బీబీఎంపీ సభ్యులు పూర్తిగా సహకరిం చాలని అన్నారు. రహదారులపై చెత్తను తొల గించడంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని, ఫలితంగా అపరిశుభ్రత పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. చెత్తను తొలగించేందుకు పాలికె సభ్యులు తొలి ప్రాధాన్యతనివ్వాలని అన్నారు. నగరంలో రోజూ నా లుగున్నర టన్నుల చెత్త పోగవుతోందని, ఇంత చెత్త సేకరణ కష్టమవుతోందని తెలిపారు. గార్డెన్‌సిటీగా పేరుపొందిన బెంగళూరు నగరం ప్ర స్తుతం గార్బేజ్‌సిటీ అనే పేరుపొందిందని ఈ చెడ్డ పేరును తొలగించడానికి కృషి చేయాలన్నారు. చెత్తసేకరణ సంస్కరణలకు తమ ప్రభుత్వం అవసరమైన సహయసహకారాలు అందిస్తుందని పేర్కొన్నారు. ఆక్రమణలకు గురైన నగరంలోని చెరువులు, రాజకాలువలను గుర్తించి తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. ఒకపై ప్రతి 15 రోజులకొకసారి తాను బెంగళూరులోని వీధుల్లో పర్యటిస్తానని, ఆ సమయంలో చెత్త సేకరణ, విధుల్లో నిర్లక్ష్యం కనబరిచిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడే అధికారులకు మద్దతు ఇవ్వరాదంటూ పాలికె సభ్యులకు సూచించారు. నగర పరిధిలో తాగునీటి లీకేజీలను అరికట్టాలన్నారు. అనంతరం బీబీఎంపీ ప్రతిపక్షనేత పధ్మనాభరెడ్డి మాట్లాడుతూ నగరంలో పూర్తిగా ప్లాస్టిక్ ను నిషేదించడం సాధ్యం కావడం లేదన్నారు. గతంలో ప్లాస్టిక్ నిషేదించాలని ప్రభుత్వానికి ప్రస్తావించామని, ప్రస్తుతం ప్రభుత్వం ప్లాస్టిక్ ను నిషేదిస్తే తామంతా సహకరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు యు.టి.ఖాదర్, రామలింగారెడ్డి, దినేశ్‌గుండూరావు, మేయర్ మం జునాథరెడ్డి, డిప్యూటీ మేయర్ హేమలతాగోపాలయ్య, కమిషనర్ కుమార్‌నాయక్, ఎమ్మెల్యేలు అశ్వత్థనారాయణ, గోపాలయ్య, బీ బీఎంపీ ఆర్థిక స్థాయీ సమితి అధ్యక్షుడు ముజాహిద్దిన్‌పాషా, బీబీ ఎంపీ పాలనా విభాగం నేత అశ్వత్థనారాయణ, కుటుంబసంక్షేమ శాఖా ప్రధాన కార్యదర్శి అతుల్‌కుమార్ తివారీ పాల్గొన్నారు. -
చెత్త ఇక హాట్ గురూ..!
చెత్త నుంచి విద్యుత్ ప్రాజెక్ట్‌కు కదలిక డీపీఆర్ తయారీకి కన్సల్టెన్సీ కోసం జీవీఎంసీ అన్వేషణ ఆనందపురం మండలంలో 200 ఎకరాలు కేటాయింపు విశాఖపట్నం సిటీ: నగరంలో చెత్త సమస్యకు పరిష్కారం దొరికింది. చెత్తే కదా అని పారేసి రోజులు పోతున్నాయి. త్వరలోనే చెత్తకూ ఓ ధర పలికే అవకాశం ఉంది. ఘన, ద్రవ వ్యర్థాల కోసం ఇప్పటికే వేర్వేరుగా సేకరిస్తున్నారు. ఇకపై ఇలాంటి చెత్తకు మరింత డిమాండ్ రాబోతుంది. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టు విశాఖ మహా నగరంలో పట్టాలెక్కబోతోంది. అందుకు ప్రభుత్వం నుంచి సానుకూలంగా సిగ్నల్ రావడంతో పాటు సెప్టెంబర్ మాసంలోనే సమగ్ర పథక నివేదిక(డీపీఆర్) రూపొందించాలని ఆదేశించింది. దీంతో చెత్త విద్యుత్ ప్రాజెక్టుకు కదలిక వ చ్చినట్టయింది. త్వర లోనే డీపీఆర్ తయారు చేసే కన్సల్టెన్సీని నియమించాలని జీవీఎంసీ ఉన్నతాధికారులు సన్నాహాలు చేస్తున్నారు. భూమిలో పాతిపెట్టే వ్యర్థాలను ఇకపై తగ్గించి విద్యుత్ ఉత్పత్తి చేపట్టాలని చూస్తోంది. రాష్ట్రంలో విజయవాడ, విశాఖల్లో ఘన వ్యర్థాల నుంచి విద్యుత్తయారు చేసే ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు జపాన్, సింగపూర్‌కు చెందిన సంస్థలు ఆసక్తి చూపుతుండడంతో ప్రభుత్వం ఆ మేరకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. విశాఖ మహా నగరంలో 400 మురికివాడలున్నాయి. వీటి నుంచి భారీ ఎత్తున రోజూ వెయ్యి టన్నులకు పైగా చెత్త ఉత్పత్తి అవుతోంది. ఈ చెత్తనంతా కాపులుప్పాడకు తరలిస్తున్నారు. ఇప్పుడా ప్రాంతం నుంచి చెత్తను మరో ప్రాంతానికి తరలించేందుకు జీవీఎంసీ సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగానే చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టు కోసం కూడా ప్రభుత్వానికి నివేదిక పంపింది. ఆనందపురం మండలం తంగుడుబిల్లి గ్రామంలో 200 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు నెలకొల్పేందుకు జీవీఎంసీ ఆసక్తి చూపుతోంది. చెత్తతో పాటు నీరు కూడా అదే ప్రాంతానికి తరలించేందుకు జీవీఎంసీ సన్నాహాలు చేస్తోంది. అప్పుడే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుందని అధికారిక వర్గాలు అంటున్నాయి. విశాఖ మహా నగరం నుంచే వెయ్యి టన్నుల చెత్త ఉత్పత్తి కానుండడంతో విద్యుత్ ఉత్పత్తి కూడా మెరుగ్గానే ఉండే అవకాశాలుంటాయని అంటున్నారు. భీమిలి, ఆనందపురం, గాజువాక, అనకాపల్లి, పెందుర్తి ప్రాంతాలన్నీ కలుపుకుంటే మరో అయిదారొందల టన్నుల చెత్త ఉత్పత్తి కావొచ్చని అంటున్నారు. సెప్టెంబర్ మాసం తర్వాతే ఈ ప్రాజెక్టు రిపోర్టు పూర్తి స్థాయిలో రూపొందే అవకాశం ఉందని అధికార వర్గాలు అంటున్నాయి. -
చెత్తా బంగారమే!
- వ్యర్థాల నుంచి విద్యుదుత్పత్తికి కసరత్తు - జిల్లాలో తొలిసారిగా తిరుపతిలో యూనిట్ - ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న యంత్రాంగం - ఈ నెలాఖరులోపు నివేదిక ఇవ్వాలని ఆదేశం చిత్తూరు (అర్బన్): ‘ చెత్త చెత్త కాదు. సద్వినియోగపరిస్తే మళ్లీ ఉపయోగపడుతుంది. చెత్తను రీసైకిల్ చేద్దాం. రీ యూస్ చేద్దాం. చేయిచేయి కలుపుదాం. చెత్తపై సమరం సాగిద్దాం..’ అంటూ మునిసిపల్ అధికారులు, సిబ్బంది సెల్ఫోన్లలో వినిపించే రింగ్‌టోన్ నిజం కానుంది. జిల్లాలో ఉపయోగపడదని మనం పారబోసే చెత్త నుంచి విద్యుత్ తయారు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. తిరుపతి నగరంలో ఈ యూనిట్ ఏర్పాటు చేయడానికి చకచకా పనులు సాగుతున్నాయి. జిల్లాలోని ఆరు మునిసిపాలిటీలు, రెండు కార్పొరేషన్ల నుంచి రోజుకు 600 మెట్రిక్ టన్నుల చెత్త రోడ్లపైకి వచ్చి పడుతోంది. ఈ మొత్తం వ్యర్థాలను ఆయా పరిధిల్లోని డంపింగ్ యార్డుల్లో వేయడం.. వీటిని తడి, పొడి చెత్తగా వేరుచేసి తడి చెత్త నుంచి వర్మీ కంపోస్టు తయారు చేయడం, పొడి చెత్తను మళ్లీ ఇతర ప్రాంతాల్లో పడేయడం స్థానిక సంస్థలకు భారంగా మారుతోంది. అయితే ఇలా వచ్చే చెత్త నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలనే ఆలోచన ఆరేళ్ల క్రితమే తెరపైకి వచ్చింది. కానీ వ్యయం ఎక్కువ అవుతుందని, చెత్త సైతం భారీ మొత్తంలో కావాలని గతంలో కొందరు అధికారులు ఇచ్చిన సమాచారంతో ప్రాజెక్టును ప్రభుత్వం పక్కన పడేసింది. అయితే ఇటీవల సింగపూర్‌కు వెళ్లొచ్చిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ అక్కడ చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టును చూసి.. ఇదే తరహాలో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కనీసం ఒక్కో చోట ఏర్పాటు చేయాలని కమిషనర్లను ఆదేశించారు. రెండు రోజుల క్రితం హైదరాబాదులో జరిగిన మునిసిపల్ కమిషనర్ల సమావేశంలో ఈ మేరకు ఆదేశాలిచ్చారు. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తికి తక్కువ మొత్తం వ్యర్థాలు చాలని, జిల్లాలో తొలిగా తిరుపతి నగరంలో ఈ ప్రాజెక్టు నెలకొల్పడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కమిషనర్ వినయ్‌చంద్‌కు చెప్పారు. ఈ వ్యవహారంపై కలెక్టర్ సమీక్షించాలని సైతం ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రాజెక్టు ఏర్పాటుకు జోరుగా పనులు ప్రారంభమవుతున్నాయి. ఇలా తయారీ... చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే 350 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు అవసరం. తిరుపతి కార్పొరేషన్లో రోజుకు సగటున 234 మెట్రిక్ టన్నుల చెత్త వస్తోంది. దీంతో పాటు చిత్తూరులో 80 టన్నులు, శ్రీకాళహస్తి నుంచి 42 టన్నులు, పుత్తూరు నుంచి 30 టన్నులు, నగరి నుంచి 22 టన్నుల చెత్తను తిరుపతికి తరలించేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రోజుకు మొత్తం 400 మెట్రిక్ టన్నుల చెత్తను తిరుపతికి తరలిస్తారు. ఆ చెత్తను మండించి రోజుకు 2 నుంచి 8 మెగా వాట్ల విద్యుత్ తయారు చేస్తారు. ప్రాజెక్టు ఏర్పాటుకు తిరుపతిలో 3 నుంచి 6 ఎకరాల స్థలం వెంటనే సిద్ధం చేయాలని ప్రభుత్వం కలెక్టర్, తిరుపతి కమిషనర్‌ను ఆదేశించింది. నిధులు సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను ఇవ్వగానే నెలాఖరులోపు భూమి పూజ చేసి పనులు ప్రారంభించడానికి అధికారులు సైతం ప్రయత్నాలు చేస్తున్నారు. -
రూ. 41.40 కోట్లతో చెత్త డబ్బాలు
గ్రేటర్ ప్రజలకు త్వరలో అందుబాటులోకి ఇంటింటికీ రెండు రంగుల డబ్బాలు మొత్తం 44,04,568 డబ్బాలు తడి చెత్తకు గ్రీన్, పొడి చెత్తకు బ్లూ కలర్లో... సిటీబ్యూరో గ్రేటర్ పరిధిలో ఇంటింటి నుంచి చెత్తను తరలించేందుకు రెండు రంగుల చెత్తడబ్బాలు త్వరలోనే నగర ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. జీహెచ్ంఎసీ ఉచితంగానే వీటిని నగర ప్రజలకు అందజేయనుంది. తొలి విడత స్వచ్ఛ హైదరాబాద్ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తడి, పొడి చెత్తలను వేర్వేరుగా వేసేందుకు ప్రభుత్వమే ఉచితంగా రెండు డబ్బాలను అందజేస్తుందని హామీ ఇవ్వడం తెలిసిందే. అందుకనుగుణంగా జీహెచ్ఎంసీ అధికారులు అప్పటినుంచే చర్యలు ప్రారంభించారు. గ్రేటర్‌లోని కుటుంబాల సంఖ్య, అదనపు అవసరాలు, తదితరమైనవి దృష్టిలో ఉంచుకొని మొత్తం 44,04,568 చెత్త డబ్బాలు అవసరమని అంచనా వేశారు. నిర్ణీత ప్రమాణాల మేరకు ఒక్కో చెత్తడబ్బాకు కనీసంగా రూ. 94 ఖర్చు కానుందని స్థానిక మార్కెట్ నుంచి పొందిన కొటేషన్ల ద్వారా అంచనా వేశారు. ఆ మేరకు గ్రేటర్‌లోని అన్ని కుటుంబాల ప్రజలకు అందజేసేందుకు రూ. 41 కోట్ల 40 లక్షల 29 వేల 392 ఖర్చు కాగలదని ప్రతిపాదించారు. సదరు నిధులు వినియోగించేందుకు పరిపాలనపర అనుమతులివ్వాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ ప్రభుత్వానికి లేఖ రాశారు. అన్నీ పరిశీలించిన ప్రభుత్వం ఆ మేరకు బుధవారం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. మునిసిపల్ ఘనవ్యర్థాల నిర్వహణకు సంబంధించి అమల్లో ఉన్న నిబంధనలను పాటించాలని జీవోలో పేర్కొంది. చెత్తడబ్బాల కొనుగోలుకు జీహెచ్ఎంసీ నిధులను వినియోగించాలని స్పష్టం చేసింది. నిధుల వినియోగానికి ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో ఇక ఈ ప్రొక్యూర్మెంట్ విధానంలో టెండర్లను ఆహ్వానించనున్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తయ్యాక నగర ప్రజలకు అవి అందుబాటులోకి రానున్నాయి. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం జీహెచ్ఎంసీలో 19,57,585 కుటుంబాలున్నాయి. అదనపు అవసరాలు, తదితరమైనవాటిని పరిగణనలోకి తీసుకొని ఇంటికి రెండు డబ్బాల చొప్పున (అదనపు అవసరాల దృష్ట్యా 12.5 శాతం అదనపు డబ్బాలతోసహ) మొత్తం 44,04,568 డబ్బాలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇళ్లనుంచి చెత్తను తరలించేందుకు సిపెట్ ప్రమాణాల మేరకు చెత్త డబ్బాలను సరఫరా చేయగల సంస్థలనుంచి టెండర్లు ఆహ్వానించనున్నారు. ఘనవ్యర్థాల నిర్వహణ నిబంధనలు-2000, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(న్యూఢిల్లీ), హైకోర్టు ఆదేశాల మేరకు ఇళ్లనుంచి తడి, పొడి చెత్తలను వేర్వేరుగా సేకరించాల్సి ఉంది. ఘనవ్యర్థాల నిర్వహణ, 2014 ముసాయిదా నిబంధనల మేరకు తడి వ్యర్థాలకు ఆకుపచ్చ(గ్రీన్), పొడి వ్యర్థాలకు నీలి(బ్లూ) రంగు డబ్బాలు వినియోగించాలి. జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్కో కుటుంబానికి సగటున ఐదుగురు వ్యక్తుల చొప్పున లె క్కించి 12 నుంచి 15 లీటర్ల సామర్ధ్యం కలిగిన చెత్తడబ్బాలు అవసరమని ప్రతిపాదించారు. -
టెర్రార్...
- గ్రామీణుల పాలిట శాపంగా టెర్రాఫార్మా - చెరువులు, కుంటలకు చేరుతున్న కెమికల్ నీరు - మృత్యువాత పడుతున్న పశుపక్షాదులు - అస్వస్థత బారిన ప్రజలు లక్ష్యం సమున్నతం... ఆచరణే అధమం.. ఫలితం గ్రామీణుల బతుకు ఛిద్రం! ఇది దొడ్డబళ్లాపురం సమీపంలో ఏర్పాటు చేసిన టెర్రాఫార్మా ప్రస్తుత ముఖచిత్రం. చెత్తనుంచి ఎరువులు తయారు చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ప్రస్తుతం దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామీణుల పాలిట శాపంగా మారింది. నిబంధనలు తుంగలో తొక్కి అడ్డగోలుగా ఇక్కడ చెత్తను డంప్ చేస్తుండడంతో వింత రోగాల బారిన పడి గ్రామీణులు విలవిల్లాడుతున్నారు. పశుపక్షాదుల మృత్యుఘోషకు అంతులేకుండా పోతోంది. ఒక ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలనే పాలకుల నీతి.. మరో ప్రాంత ప్రజలను అన్యాయానికి గురిచేస్తోంది. దొడ్డబళ్లాపురం : బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) పరిధిలో నిత్యం పోగవుతున్న టన్నుల కొద్ది చెత్తను దొడ్డబళ్లాపురం తాలూకాలోని గుండ్లహళ్లి వద్ద టెర్రాఫార్మాలో డంపింగ్ చేస్తున్నారు. చెత్త నుంచి ఎరువులు తయారు చేయాలనే లక్ష్యంతో టెర్రాఫార్మాను ఏర్పాటు చేశారు. బెంగళూరు నుంచి తరలివస్తున్న చెత్త మొత్తాన్ని రీసైక్లింగ్ చేసేందుకు ఇక్కడి యంత్రాలకు తగిన సామర్థ్యం లేకపోవడంతో రోజూ చెత్త పేరుకుపోతూ వస్తోంది. నిబంధలను ఉల్లంఘిస్తూ ఇక్కడ చెత్తను డంప్ చేస్తున్నారు. వాస్తవానికి తడి, పొడి చెత్తను ఇక్కడ రీసైక్లింగ్ చేయడం ద్వారా ఎరువులను తయారు చేస్తారు. అయితే బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న లెక్కకు మించిన రసాయనిక పరిశ్రమల వ్యర్థాలను సైతం ఇక్కడ డంప్ చేస్తున్నారు. నిబంధనల ప్రకారమైతే రసాయనిక వ్యర్థాలను ఆయా పరిశ్రమల వద్దనే రీసైక్లింగ్ చేసి తరలించాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి రీసైక్లింగ్ చేయని రసాయనిక వ్యర్థాలను ఇక్కడ డంప్ చేస్తుండడంతో అవి భూమిలో కలిసి విషపూరితంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో కురుస్తున్న వర్షాలకు విషపూరితమైన రసాయనిక నీరుగా మారి సమీపంలోని చెరువులు, కుంటల్లోకి చేరుకుంటున్నాయి. అంతేకాక భూగర్భ జలాల్లో సైతం ఇవి కలిసి బోరుబావుల్లోకి చేరుకుంటున్నాయి. ఇటీవల చుట్టపక్కల పాతిక గ్రామాలకు చెందని పశువులు చెరువులు, కుంటల్లోని నీరు తాగి చూస్తుండగానే పొట్ట ఉబ్బి వృత్యువాత పడుతుండడంతో గ్రామీణుల వేదనకు అంతులేకుండా పోయింది. మేతకు వెళ్లిన పశువులు తిరిగి ఇంటికి చేరుకునే క్రమంలో మార్గమధ్యలోనే మరణిస్తుండడం పాడిరైతులను మరింత కృంగదీస్తోంది. మరో వైపు వాన నీటికి చెత్త తడిసి మరింత దుర్వాసన వ్యాపిస్తోంది. ఈ వాసన భరించలేక నాలుగు రోజుల్లోనే పదుల సంఖ్యలో గ్రామీణులు ఆస్పత్రుల పాలయ్యారు. ఇదంతా టెర్రాఫార్మాకు అతి సమీపంలో ఉన్న సక్కరెగొల్లహళ్లి, కాశీపాల్య, గుండ్లహళ్లి గ్రామాల్లో మరీ ఎక్కువగా ఉంది. పశువులు, మేకలు, గొర్రెలతో పాటు కోళ్లు, పిట్టలు కూడా వృత్యువాత పడుతున్నాయి. నీరు తాగిన కొద్ది సేపటికి పొట్ట ఉబ్బి, ముక్కు, నోటి వెంట రసాయనిక మిశ్రీత నీరు కారుతుండగా విలవిల్లాడుతూ తమ కంటి ముందే పశువులు మరణిస్తున్నాయని గ్రామీణులు వాపోతున్నారు. దుర్వాసన వెదజల్లుతుండడంతో భరించలేక ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న పొలాలను దుక్కి చేసుకోలేక పోతున్నట్లు రైతులు తెలిపారు. ప్రశాంతంగా భోజనం కూడా చేయలేని స్థితిలో ఉన్నామని, ఇప్పటికైనా అధికారులు స్పందించి టెర్రాఫార్మా బారి నుంచి తమను కాపాడాలని పలువురు గ్రామీణులు వేడుకుంటున్నారు. కాగా, పాడి పశువులను కోల్పోయిన బాధిత రైతులు నాగరాజు, ముద్దన్న, జరీనా తదితరులు టెర్రాఫార్మా డంపింగ్ సెంటర్ నిర్వాహకులపై బెళవంగల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
చెత్త కూడా తీయలేమా?
నగరాల్లో చెత్తను తొలగించే పనులకు కూడా మన ప్రభుత్వాలు భారీ నిధులతో అమెరికన్ కార్పొరేట్ కంపెనీల ముందు సాగిలబడుతున్నాయి. మరో వైపున మునిసిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేత నాలను ఇవ్వడానికి కూడా వెనుకాడుతున్నాయి. దీని ఫలితంగానే తెలుగు రాష్ట్రాల్లోని మునిసిపల్ కార్మి కులు చెత్త తొలగింపు పనులకు బంద్ పెడుతున్నారు. వారి వెతలను పట్టించుకోవడానికి కాసింత సమ యం దొరకని మన ఇద్దరు సీఎంలూ గోదావరి పుష్క రాల సేవలో తరించిపోతున్నారు. విజయవాడ, గుం టూరులను నాజూకు నగరాలుగా మార్చడానికి ఏపీ సీఎం వాషింగ్టన్కు చెందిన గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ సంస్థను ఆహ్వానించారు. కాలుష్యాన్ని నివారించి 2018 నాటికి ఈ రెండు నగరాలను స్వచ్ఛ నగరాలుగా తీర్చిదిద్దటమే విదేశీ సంస్థ లక్ష్యమట. చివరకి మనం చెత్త ఎత్తివేయడానికి కూడా పనికిరా మా? అందుకు కూడా అమెరికా అంగబలం, ఆర్థిక సాయం కావాలా? విదేశాల నుంచి సాంకేతిక పరిజ్ఞా నం తెచ్చుకోవటం తప్పు కాదు. కానీ ఆ పేరుతో ఎంఎన్సీలకు తలుపులు తెరవడం కాకుండా మన కార్మికులకు విదేశీ యంత్రాలను ఉపయోగించడం నేర్పాలి. తమ కమీషన్ పోతుందని బాధపడకుండా మధ్య దళారీలను రద్దు చేసి, ఒప్పంద కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చాలి. వారి జీవన భృతి ని పెంచాలి. చెత్తను ఎత్తివేయించుకోవడానికి కూడా అమెరికా చుట్టూ ఎందుకు తిరుగుతారు? ఇలాగే ముందుకు పోతే మన రాష్ట్రాలే కాదు. దేశమే పరా ధీనం కాక తప్పదు. పారిశుద్ధ్య కార్మికులకు కాసింత జీవనభృతిని పెంచలేని ప్రభుత్వాలు పుష్కరాలకు వందల వేల కోట్లు ఎలా ఖర్చుపెడుతున్నాయి? - ఎస్. హనుమంతరెడ్డి రిటైర్డ్ బీఎస్ఎన్ఎల్ డివిజనల్ ఇంజనీర్. 9490204545 -
సానుకూలంగా స్పందించనున్న కేసీఆర్!
హైదరాబాద్ : గత ఎనిమిది రోజులుగా తమ డిమాండ్ సాధన కోసం విధులు బహిష్కరించిన మున్సిపల్ కార్మికుల సమ్మెను తెలంగాణ ప్రభుత్వం విరమింపచేసే ప్రయంత్రంలో ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం కార్మికుల డిమాండ్లపై నిర్ణయం తీసుకోన్నట్లు సమాచారం. జీతాల పెంపుతో పాటు ఇతర డిమాండ్లపై కేసీఆర్ సానుకూలంగా స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్మిక సంఘాలు తమ అంతర్గత రాజకీయాలను పక్కనపెట్టి సహకరించాలని ప్రభుత్వం కోరనుంది. మరోవైపు కార్మికులతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు కొలిక్కిరాకపోవడంతో సమ్మె కొనసాగిస్తామని మున్సిపల్ కార్మికులు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కాగా పారిశుద్ధ్య కార్మికుల సమ్మె రెండోవారానికి చేరుకోవడంతో రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్ నగరం చెత్తమయంగా మారింది. పలు కూడళ్లు, రహదారులు చెత్తకుప్పలతో దుర్గంధభరితంగా మారాయి. -
భాగ్యనగరం.. చెత్తమయం..
ఏడో రోజుకు చేరిన పారిశుద్ధ్య కార్మికుల సమ్మె పలు ప్రాంతాల్లో క్షీణించిన శుభ్రత చార్మినార్ ప్రాంతంలో అధికారుల స్వచ్ఛహైదరాబాద్ అడ్డుకున్న కార్మికులు.. ఉద్రిక్తత హైదరాబాద్: పారిశుద్ధ్య కార్మికుల సమ్మె ఏడో రోజుకు చేరుకోవడంతో రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్ నగరం చెత్త మయంగా మారింది. పలు కూడళ్లు, రహదారులు చెత్తకుప్పలతో దుర్గంధభరితంగా మారాయి. కార్మికులతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు కొలిక్కిరాకపోవడంతో సమ్మె కొనసాగిస్తామని మున్సిపల్ కార్మికులు స్పష్టంచేస్తున్నారు. నేటికి(సోమవారంరోజున) కార్మికుల సమ్మె రెండో వారంలోకి చేరుకోనుంది. కాగా ఆదివారం ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పలు ప్రాంతాల్లో సీఎం కేసీఆర్, ప్రభుత్వానికి వ్యతి రేకంగా దిష్టిబొమ్మలు దహనం చేసి కార్మికులు తమ నిరసన తెలిపారు. పాతనగరంలో దక్షిణ మండలం పోలీసుల ఆధ్వర్యంలో చార్మినార్ నుంచి మదీనా చౌరస్తా వరకు నిర్వహించిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని పారిశుద్ధ్య కార్మికులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పోలీసులు 30 మంది పారిశుధ్య కార్మికులను అదుపులోకి తీసుకొని కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం పోలీసులు శాలిబండ చౌరస్తా నుంచి మక్కా మసీదు, చార్మినార్ నుంచి మదీనా చౌరస్తా వరకు రోడ్లను శుభ్రపరిచారు. మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచే విషయంలో సీఎం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో మూసారంబాగ్ చౌరస్తాలో రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. కాగా రహమత్‌నగర్ డివిజన్లో జీహెచ్ఎంసీ అధికారులు ప్రైవేటు మహిళలతో చెత్తను తరలిస్తుండగా.. రెగ్యులర్ పారిశుద్ధ్య సిబ్బంది వారితో గొడవకు దిగారు. కార్మికనగర్‌లో నివాసం ఉంటున్న సదరు ప్రైవేటు మహిళల చీపురు కట్టలని రెగ్యులర్ కార్మికులు తగులబెట్టడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ప్రత్యామ్నాయంగా.. కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆదివారం జీహెచ్ఎంసీకి చెందిన 466 వాహనాల్లో 1815 మెట్రిక్ టన్నుల చెత్తను తరలించినట్లు జీహెచ్ఎంసీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మరో 300 స్వచ్ఛ హైదరాబాద్ యూనిట్లు నగరంలో పారిశుద్ధ్య పనులు చేపడుతున్నాయన్నారు. రంజాన్ పర్వదినం నేపథ్యంలో కార్మికులు సమ్మె విరమించాలని కోరారు. -
గ్రేటర్ హైదరాబాద్ మురికి పాలన!
-
గ్రేటర్ హైదరాబాద్ మురికి పాలన!
- మున్సిపల్ కార్మికుల సమ్మెతో పేరుకుపోతున్న వేల టన్నుల చెత్త - వీరికి తోడు వీధిదీపాలు, నీటిసరఫరా తాత్కాలిక సిబ్బందీ సమ్మెలోకి.. - పట్టు వీడని కార్మిక జేఏసీ.. మెట్టు దిగని సర్కారు - ఇరువర్గాల మధ్య నిలిచిపోయిన చర్చలు - సమ్మె నుంచి నిష్ర్కమించిన టీఆర్ఎస్కేవీ - మరింత ఉద్ధృతం చేసిన మిగతా సంఘాలు - నేటి నుంచి అత్యవసర సేవలు కూడా బంద్ - నేడు ఇందిరా పార్కు వద్ద భారీ బహిరంగ సభ - చెత్తాచెదారంతో ప్రజలకు తప్పని సహవాసం సాక్షి, హైదరాబాద్: మునిసిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల సమ్మె పరిష్కార మార్గాలు మూసుకుపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం, కార్మిక ఐక్య సంఘాలు పట్టు విడుపులకు పోవడంతో ఉభయపక్షాల మధ్య గత రెండు రోజులుగా చర్చలు ఆగిపోయాయి. 10వ పీఆర్సీ సిఫారసులకు తగ్గట్లు కనీస వేతనాల పెంపుపై నిర్ధిష్ట హామీ ఇవ్వాలని కార్మిక సంఘాలు కోరడంతో గత బుధవారం చివరిసారిగా జరిగిన మూడో దఫా చర్చలు విఫలమయ్యాయి. ఆర్థికపరమైన ఈ డిమాండ్లపై సీఎం కేసీఆరే నిర్ణయం తీసుకుంటారని, అప్పటి వరకు కొంత సమయం ఇవ్వాలన్న మంత్రుల ప్రతిపాదనలను కార్మిక నేతలు తిరస్కరించడంతో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. ఆ తర్వాత ప్రభుత్వం, కార్మిక జేఏసీ మధ్య గురు, శుక్రవారాల్లో చర్చలు జరగలేదు. కాగా, అధికార పార్టీ అనుబంధ టీఆర్ఎస్కేవీ సమ్మె నుంచి నిష్ర్కమించింది. టీఆర్ఎస్కేవీ-జీహెచ్ఎంఈయూ నేతలతో శుక్రవారం మంత్రి నాయిని ప్రత్యేక సమావేశం జరపగా.. సమ్మె విరమణకు యూనియన్ ఒప్పుకుంది. గురువారమే సమ్మెలోకి దిగిన టీఆర్ఎస్కేవీ ఒక్క రోజులోనే అస్త్ర సన్యాసం చేసిందని, దీని ప్రభావం సమ్మెపై ఉండదని మిగిలిన కార్మిక సంఘాలు ప్రకటించాయి. మరోవైపు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్.. సీఎంను కలసి హైదరాబాద్‌లోని పరిస్థితులను వివరించారు. కార్మికుల డిమాండ్లపై సీఎం సానుకూలంగా వున్నారని, ఈ నెల 30 లోగా ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసి అందుకు సంబంధించిన ఉత్తర్వులు చేస్తామని సీఎం తెలిపినట్లు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే, ఈ ప్రతిపాదనను కార్మిక సంఘాలు తిరస్కరించాయి. నేటి నుంచి అత్యవసర సేవలు బంద్... సమ్మెను ఉధృతం చేసేందుకు శనివారం నుంచి అత్యవసర సేవలను సైతం నిలిపివేస్తామని కార్మిక జేఏసీ హెచ్చరించింది. జల మండలితో సహా రాష్ట్ర వ్యాప్తంగా నీటి సరఫరా, వీధి దీపాలు, పరిపాలన విభాగాల తాత్కాలిక ఉద్యోగులూ సమ్మెలోకి దిగుతారని ప్రకటించింది. దీంతో రాష్ట్రంలోని నగర, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు కనీస సౌకర్యాలు స్తంభించనున్నాయి. నేడు ఇందిరా పార్కు వద్ద మహాధర్నా... మునిసిపల్ కార్మికుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా శనివారం ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు ‘ఏడు కార్మిక సంఘాల ఐక్య వేదిక’ ప్రకటించింది. సీఐటీయు, ఎఐటీయుసీ, టీఐటీయుసీ, హెచ్ఎంఎస్, బీఎంఎస్, ఎఐయుటీయూసీ, ఐఎఫ్టీయూ సంఘాల ప్రతినిధులు పాలడుగు భాస్కర్, జె.వెంకటేష్, ఎం.కె.బోస్, రెబ్బరామారావు, ఏసురత్నం, సుధీర్, ప్రదీప్, ఎ.శంకర్లు శుక్రవారం విలేకరులతో ఈ విషయాన్ని వెల్లడించారు. మహాధర్నాలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వెంకట్ రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కార్మిక నేతలు పాల్గొంటారని తెలిపారు. చెత్తతో జనం సహవాసం... ఈ నెల 6 నుంచి సాగుతున్న సమ్మెతో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని 67 చిన్నా పెద్దా నగరాలు, పట్టణాల్లో వేలాది టన్నుల వ్యర్థాలు పేరుకుపోయాయి. రోడ్లు, వీధులు, జన ఆవాసాల మధ్య చెత్తా చెదారమే కనిపిస్తోంది. దుర్గంధం వెదజల్లుతున్న చెత్తతో ప్రజలు సహవాసం చేయక తప్పడం లేదు. మరో వైపు ప్రభుత్వం చేపట్టిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. పనులను అడ్డుకున్న కార్మికులు... గ్రేటర్లో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోరుుంది. అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో జీహెచ్ఎంసీ ప్రత్యామ్నాయ చర్యలకు దిగింది. ప్రైవే టు వాహనాలు.. తాత్కాలిక(ప్రైవేటు) కార్మికులతో చెత్త తరలింపు పనులు చేపట్టింది. ఈ పనులను కార్మికులు అడ్డుకున్నారు. దాడులు చేశారు. ఇరువర్గాల వారు పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేసుకున్నారు. టోలీచౌకి, వూసబ్ట్యాంక్, కుత్బుల్లాపూర్, తార్నాక ప్రాంతాల్లో తాత్కాలిక కార్మికులను అడ్డుకున్నారు. జీహెచ్ఎంసీలోని గుర్తింపు యూనియన్ జీహెచ్ఎంఈయూ మాత్రం సమ్మె విరమించినట్లు ప్రకటించింది. చెత్తకుప్పలతోపాటు వివిధ ప్రాంతాల్లో మ్యాన్‌హోల్స్ పొంగిపొర్లుతున్నాయి. ఎస్మా ప్రయోగించే అవకాశం... కార్మికుల సమ్మె కారణంగా తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా రెండో శనివారమైనప్పటికీ నేడు జీహెచ్ఎంసీ పనిచేస్తుందని స్పెషలాఫీసర్ సోమేశ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజారోగ్యం దృష్ట్యా ప్రభుత్వం సమ్మె చేస్తున్న కార్మికులపై ఎస్మాను ప్రయోగించే అవకాశం ఉందని హెచ్చరించారు. శనివారం నుంచి విధులకు హాజరయ్యే ఔట్సోర్సింగ్ డ్రైవర్లకు రెట్టింపు వేతనం ఇస్తావుని తెలిపారు. జీహెచ్ఎంసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్రప్రభుత్వం సానుకూలంగా స్పందించినందున సమ్మెలోని కార్మికులంతా వెంటనే విధులకు హాజరు కావాల్సిందిగా సోమేశ్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. -
ఏది చెత్త? ఏది కొత్త? మహాత్మా!
అక్షర తూణీరం చెత్త... చెత్త... ఎక్కడ విన్నా ఇదే మాట. ఎక్కడ చూసినా ఇదే మాట. ఏమాటకామాటే చెప్పుకోవాలి. మోదీ ప్రధాని గా వచ్చాకనే ‘చెత్త స్పృహ’ దేశంలో పెరిగింది. అయితే అన్ని చెత్తలూ వ్యర్థాలు కావు. అన్ని వ్యర్థాలు చెత్తకావు. అసలు చెత్తంటే ఏంటి? దీన్ని అద్వైత సిద్ధాంతానికి అన్వ యించి వింగడిస్తే, చెత్త మూలాలు మనల్ని ఆశ్చర్య పరుస్తాయి. రేడియోని చెత్తగా భావించి అటకల మీద పారేశాం. ‘మనసులో మాట’ అంటూ మోదీ, బ్రదర్ ఒబామా రేడియోలో తెగ మాట్లాడేసుకోవడం విని, అట కల మీంచి దింపి రేడియోల దుమ్ము దులిపాం. ఇప్పుడు పున్నమికీ, అమావాస్యకీ మోదీ రేడియోలోనే మనసు విప్పుతున్నారు. దాంతో చెత్త కాస్తా కొత్తగా మారింది. ‘చెత్త’ సాపేక్షం. అప్పటిదాకా ఒక పార్టీలో కింగ్‌పిన్‌గా ఉన్నాయన పార్టీ ఫిరాయించగానే ఉత్త చెత్త మూట అవుతాడు. అదే చెత్త మూట మారిన పార్టీలో జాకబ్ వజ్రంలా మెరుస్తుంటాడు. ఒక సాములారు ఎదురైతే చెత్త ప్రస్తావన తెచ్చి, అనుగ్రహ భాషణానికి అర్థిం చాను. స్వామి చిరునవ్వు నవ్వి, ఈ సృష్టిలో సత్యం, అసత్యం తప్ప ఇంకోటేమీ లేదన్నారు. ఇంతకీ మీరు సత్యమా, అసత్యమా అంటూ తెగించి అడిగాను. ‘‘అస త్యం’’ అంటూ కదిలారు స్వామి. రూపం నాకు కనిపిం చలేదు. అసలిదంతా నా భ్రమ కావచ్చు, పరమ చెత్త కావచ్చు. కొన్ని చెత్త ఉదాహరణల్ని పరిశీలిద్దాం. చదివేసిన పేపర్లు మనకు పరమ చెత్త. పాత పేపర్ల వ్యాపారికి అదే బతుకు. టన్నుల కొద్దీ తలనీలాలు శ్రీ వేంకటేశ్వర స్వామికి భక్తులు సమర్పించుకుంటారు. కేశాలను స్వీక రించి, క్లేశాలను తొలగిస్తాడని నమ్మకం. అవి శ్రీవారికి కోట్ల ఆదాయాన్నిస్తాయి. ప్రసిద్ధ సాహితీవేత్త వేటూరి ప్రభాకరశాస్త్రి ఇంటికి ఆయన శిష్యుడు వెళ్లాడు. మాటా మంచీ అయ్యాక శిష్యుడు రాత్రి భోజనం చేశాడు. ఎంగిలి విస్తరి పారెయ్య డానికి ఇంటి వెనక్కి వెళ్లి చీకట్లో చూడక గుంటలో దభేల్ మని పడ్డాడు. గురువు గారు సంగతి గ్రహించి ‘‘మా చెత్తగుంట ఇలా ఒక్కసారి నిండుతుందనుకోలేదోయ్!’’ అంటూ సంతోషం వ్యక్తం చేశారట. సాహిత్య విష యంలో ‘చెత్త’ని బాగా వాడతారు. జీవితకాలంలో చాలా చెత్త ఉత్పత్తి చేశాడు. ‘అగ్ని దహించలేదు. జల ము హరించలేదు. చెదలారగించలేవు’’ అంటూ హాలా హలం లాంటిదని చెబుతారు. కొన్ని గొప్ప గొప్ప మ్యూజియమ్స్‌లో చాలా ఖరీదైన చెత్త ఉంటుందని ఒక పెద్దాయన అనుభవం మీద చెప్పాడు. నిజానికి చెత్తలోనే వ్యాపారం నడుస్తుంది. ‘‘పాత చెత్త కుక్కర్, చెత్త గ్యాస్ స్టౌ, చెత్త మిక్సీలను సగౌర వంగా స్వీకరిస్తాం. కొత్త వాటిని సమర్పిస్తాం’’ అనే ప్రకటన కనిపిస్తే చాలు. కేక! ఆఖరికి పాత లోఉడుపులు తీసుకురండి, సరికొత్తవి తీసుకువెళ్లండి అనగానే భూకంపం వచ్చినట్టు ఇంట్లోంచి పరుగులు పరుగులు. చెత్తని ఎవ్వరూ భరించరు. పక్కింటి హద్దులో పడేసి చేతులు దులుపుకుంటాం. తిరిగి వాళ్లూ అంతే చేస్తారు. సృష్టిలో ఏ పదార్థాన్నీ సృష్టించలేం, నాశనం చేయలేం. అది మాత్రం సత్యం. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
చీపుర్లకు స్వస్తి.. రోడ్లకు సుస్తీ..
బంజారాహిల్స్ (హైదరాబాద్) : జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె శుక్రవారం నాటికి ఐదవ రోజుకు చేరింది. కార్మికులు చీపుర్లకు స్వస్తి పలకడంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. టన్నులకొద్దీ చెత్త డంపర్ బిన్ల వద్ద నిండిపోయి రోడ్లను ఆక్రమిస్తోంది. గాలికి చెత్తంతా కొట్టుకొచ్చి ఇళ్లను కూడా ముంచెత్తుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమ్మె పరిష్కార దిశగా ముందుకు సాగకపోవడంతో సమస్య మరింత జఠిలమవుతోంది. జీహెచ్ఎంసీ సర్కిల్ -10 పరిధిలో శుక్రవారం ఒక్కో నోడల్ అధికారి పరిధికి ఒక లారీని కేటాయించినట్లు అధికారులు పేర్కొంటున్నా ఇది అమలు కాకపోవడంతో చెత్త సమస్య తీరలేదు. దీంతో వ్యాధులు విజృంభిస్తాయేమోనని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దోమలు, ఈగలు స్వైర విహారం చేస్తున్నాయి. అంటువ్యాధులు ప్రబలకముందే అధికారులు మేల్కొనాల్సిన అవసరం ఉంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో అత్యధికంగా చెత్తకుప్పలు పేరుకుపోగా ప్రధాన రహదారులకు రెండువైపులా లారీలకొద్దీ చెత్త కనిపిస్తుండటంతో వీవీఐపీలు రాకపోకలు సాగించే ఈ ప్రాంతమంతా అధ్వాన్నంగా మారింది. -
'పేరుకుపోయిన చెత్తను తొలగిస్తాం'
హైదరాబాద్ : గత ఐదు రోజులుగా జంట నగరాల్లో పేరుకుపోతున్న చెత్తను తొలగించేందుకు జీహెచ్ఎంసీ తగిన చర్యలు తీసుకోవడంలేదంటూ దాఖలైన పిల్‌పై గురువారం హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ విచారణలో.. జంట నగరాల్లో పేరుకుపోతున్న చెత్తను తొలగించేందుకు చర్యలు చేపట్టామని గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) గురువారం హైకోర్టుకు నివేదించింది. ప్రైవేటు ఏజెన్సీల ద్వారా చెత్తను తొలగిస్తున్నామని, ఇందుకు పారిశుద్ధ్య కార్మికుల సేవలను కూడా వాడుకుంటున్నామని జీహెచ్ఎంసీ తరఫు న్యాయవాది పి.కేశవరావు కోర్టుకు వివరించారు. ఈ వివరాలను నమోదు చేసుకున్న కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
చెత్త బయట వేస్తే జరిమానా
స్వచ్ఛ భారత్ పటిష్ట అమలుకు కొత్త చట్టం న్యూఢిల్లీ: ఆరు బయట చెత్త వేస్తున్నారా? ఎక్కడ పడితే అక్కడ మూత్రం పోస్తున్నారా? పాన్లు నమిలి రోడ్డుపై ఉమ్మి వేస్తున్నారా? అయితే ఇకపై జాగ్రత్తగా ఉండండి. లేదంటే జరిమానా, శిక్ష తప్పదు. పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ కేంద్రం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం తెలిసిందే. దీన్ని పటిష్టంగా అమలు చేసేందుకు న్యాయపరమైన మద్దతు ఇవ్వాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు న్యాయ శాఖ బిల్లును తయారు చేస్తోంది. కానీ పారిశుద్ధ్యం, పరిశుభ్రత అంశాలు రాష్ట్రాల పరిధిలోనివి కావడంతో చట్టం అమలు సాధ్యం కాకపోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో రాష్ట్రాలు తమ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా చట్టంలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి కేంద్రం వెలుసుబాటు కల్పిస్తోంది. అయితే పరిశుభ్రత, పారిశుద్ధ్యం అనే వాటికి పరిధి ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు. ఏదైనా ఒక ప్రాంతంలో స్వైన్‌ఫ్లూ వస్తే అది దేశం మొత్తం వ్యాపిస్తుందని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. అక్కడికక్కడే చలానాలు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు అప్పటికప్పుడు చలానాల రూపంలో జరిమానా విధిస్తున్నట్లే దీని విషయంలో కూడా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. పారిశుద్ధ్యం, పరిశుభ్రత విషయంలో నిబంధనలు అతిక్రమించిన వారికి అక్కడికక్కడే జరిమానా వేయనున్నారు. -
నాగ్‌పూర్‌లో పర్యటించిన GHMC కమిటీ
-
కాలు తీసి చెత్తకుండీలో వేశారని సమన్లు
ఫ్లోరిడా: తన కాలు తీసి చెత్తకుండీలో వేసినందుకు ఓ ఆస్పత్రికి సమన్లు పంపించిన ఘటన దక్షిణ ఫ్లొరిడాలో చోటుచేసుకుంది. జాన్ టిమిరియాసైఫ్(56) అనే వ్యక్తికి ఇన్ ఫెక్షన్ కారణంగా మొకాలి నుంచి కిందివరకు కాలును ఫ్లొరిడా ఆస్పత్రి వైద్యులు తొలగించారు. అక్కడి చట్ట ప్రకారం ఒక పద్ధతి ప్రకారం నిర్వీర్యం చేయాల్సి ఉంటుంది. అయితే, తన కాలు బాగాన్ని చెత్తకుప్పలో గమనించిన జాన్ టిమిరియాసైఫ్ తన మనోభావం దెబ్బతినడంతో సదరు ఆస్పత్రికి సమన్లు పంపించాడు. -
తెల్లవారక ముందే రోడ్లూడిస్తే జైలుశిక్ష
స్వచ్ఛ భారత్ కోసం సాక్షాత్తు ప్రధాన మంత్రే చీపురుపట్టి రోడ్లూడుస్తుంటే...జార్జియాలోని శాండీ స్ప్రింగ్స్ నగరంలో మాత్రం ఓ పారిశుద్ధ్య కార్మికుడు చెత్త 'శుద్ధి' ఎక్కువై తెలతెలవారక ముందే రోడ్లు ఊడుస్తుంటే బొక్కలోతోశారు పాపం! 30 రోజులు జైలు శిక్ష కూడా విధించారు. ఆ నగరంలో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల మధ్యనే రోడ్లూడవాలనేది అక్కడ రూల్. అంతుకుముందు రోడ్లూడుస్తుంటే మేడలు, మిద్దెల్లో నివసించే విలాసవంతుల నిద్రకు భంగం కలుగుతుందని నగర మున్సిపల్ అధికారులు ఈ రూల్ తీసుకొచ్చారట. మూడు నెలల క్రితమే పనిలో చేరిన పారిశుద్ధ్య కార్మికుడు మ్యాక్గిల్ ఓ రోజు ఉదయం ఐదు గంటల ప్రాంతంలో రోడ్లూడుస్తూ అధికారుల కంటపడ్డాడు. అంతే అతని పెడరెక్కలు విరిచి పట్టుకొని తీసుకెళ్లి బొక్కలో వేశారు. మ్యాక్గిల్కు సొంతంగా లాయరును పెట్టుకొనే స్థామత లేకపోవడంతో అధికారుల తరఫున చీఫ్ ప్రాసిక్యూటర్ బిల్ రిలే కోర్టులో వీరంగం వేశారు. చట్టాలను అతిక్రమించి తెల్లవారుజామునే పారిశుద్ధ్య కార్మికులు రోడ్లూడవడం తరచూ జరుగుతోందని, నష్టపరిహారంతో దారికి రావడం లేదని, జైలు శిక్ష వేయడమే తగిన శిక్షంటూ తెగవాదించారు. ఆయన వాగ్ధాటికి కోర్టులో ఆసీనులైవున్న జడ్జీగారు మురిసిపోయారో, భయపడ్డారో తెలదుగానీ మ్యాక్గిల్కు 30 రోజుల జైలు శిక్ష విధిస్తూ ఇటీవల తీర్పు చెప్పారు. అయితే ఆ తర్వాత మ్యాక్ గిల్ శిక్షను కోర్టు తగ్గించింది. -
చెత్తపై పోరు
తమ గ్రామంలో చెత్త వేయొద్దంటూ అజ్జగొండనహళ్లి వాసుల నిరసన అధికారులు స్పందించకపోవడంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న రైతు తీవ్ర ఉద్రిక్తత పోలీసుల ఘర్షణ పోలీసుల కళ్లల్లో కారం కొట్టి దాడులు చేసిన గ్రామస్తులు ఇద్దరు ఎస్సైలతో సహా 11 మందికి తీవ్రగాయాలు అజ్జగొండనహళ్ళి.. ఆగ్రహంతో మండింది. తమ గ్రామంలో చెత్త వేయొద్దంటూ ఆ గ్రామస్తులు హెచ్చరించారు. అయినా అధికారులు స్పందించకపోవడంతో... ఓ రైతు శనివారం రాత్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ గ్రామస్తులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పోలీసుల కళ్లల్లో కారం కొట్టి.. వారిని చితకబాదారు. వారిని అదుపు చేయడంలో భాగంగా పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘర్షణలో పోలీసులతో సహా గ్రామస్తులూ గాయపడ్డారు. కలెక్టర్, ఎస్పీ సహా కీలక అధికారులందరూ ఆ గ్రామంలో తిష్ట వేశారు. ఆ గ్రామంలో బంద్ వాతావరణం నెలకొంది. తుమకూరు: తాలూకాలోని అజ్జగొండనహళ్ళి గ్రామంలోని ప్రభుత్వ భూమిలో తుమకూరు నగర పాలికే చెత్తను వేయడానికి స్థలాన్ని కేటాయించింది. దీంతో అజ్జగొండనహళ్ళి గ్రామస్తులు గత కొంత కాలంగా తుమకూరుకు చెందిన చెత్తను ఇక్కడ వేయవద్దని నిరసనలు తెలుపుతున్నారు. అధికారులు మాత్రం అక్కడే చెత్త వేస్తామని తెలిపారు. దాంతో గ్రామస్తులు నాలుగు రోజుల నుంచి తీవ్ర స్థాయిలో ధర్నా చేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన శివకుమార్ (30) ఇక్కడ చెత్తను వేయవద్దని లేదంటే ఆత్మహత్య చేసుకుంటామని అధికారులను హెచ్చరించారు. అయినా వారు స్పందించకపోవడంతో శివకుమార్ శనివారం రాత్రి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో గ్రామస్తుల్లో ఆగ్రహం మిన్నంటింది. వృతదేహాన్ని ఆస్పత్రి ముందు ఉంచుకొని ధర్నా చేశారు. సంఘటణ స్థలానికి వచ్చిన పోలీసులు ఆ గ్రామస్తులకు నచ్చజెప్పె ప్రయత్నం చేశారు. గ్రామంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి నిరసనలను చేయవద్దని హెచ్చరించారు. కాని గ్రామస్తులు అందరు కలిసి రాత్రి తొమ్మిది గంటల సమయంలో గ్రామంలో కరెం టును నిలిపేసి.. పోలీసులపై దాడులు చేశారు. కొంత మంది కారం తీసుకొవచ్చి పోలీసుల కళ్లల్లో చల్లి దాడి చేశారు. ఈదాడిలో సీఐ రవి, అబ్దుల్ ఖాదర్లతో పాటు మొత్తం 11 మంది పోలీసులు గాయపడ్డారు. అబ్దుల్ ఖాదర్ తలకు తీవ్ర గాయం కావడంతో సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. మరో ముగ్గురు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్తులు దాడి చేసిన కొంది సేపటికి మరింత పోలీసు బలగాలను అధికారులు ర ప్పించారు. ఆందోళనకారులను అదుపు చేయడానికి పోలీసులు గాలిలో కాల్పులను జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు గ్రామస్తులు గాయపడ్డారు. వారిని కూడా గ్రామస్తులు ఆస్పత్రిలో చేర్పిం చారు. మరింత ఆగ్రహించిన గ్రామస్తులు రెండు పోలీస్ వాహనాలకు నిప్పు చెప్పారు. మరో మూడు పోలీస్ జీపులను ధ్వంసం చేశారు. జిల్లా ఎస్పీ రమణగుప్త ఆ గ్రామానికి చేరుకొని.. పరిస్థితిని అదులోకి తెచ్చారు. గ్రామంలో బంద్ వాతారణం నెలకొంది.ఆదివారం ఉదయం ఆ గ్రామంలో ఎక్కడ చూసినా పోలీసులే కన్పిస్తున్నారు. మగవారు ఇళ్లలో నుంచి బయటికి రావడంలేదు. అక్కడక్కడ మహిళలు కన్పిస్తున్నారు. ఇప్పటికే సుమారు 19 మంది గ్రామస్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లాధికారి సత్యమూర్తి కూడా ఆ గ్రా మంలో తిష్టవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామస్తు లు ఆందోళనకు గురి కావద్దని, ప్రభుత్వంతో మాట్లాడి శివకుమార్ కు టుంబానికి న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఎవరూ పోలీ సులపై దాడి చేయవద్దని కోరారు. కాగా ఆదివారం కూడా ఆ గ్రామంలో మహిళలు నిరసన చేపట్టారు. సుమారు రెండు వేల మంది ఒకచోట చే రి.. ఆందోళన చేపట్టారు. గ్రామంలో చెత్త ఘటకాన్ని ఏర్పాటు చేయబోమని జిల్లా ఇన్చార్జ మంత్రి హామీ ఇచ్చేంతవరకూ ఆందోళన విరమించేది లేదని భీష్మించారు. జిల్లాదికారి సత్తమూర్తి ఎంత చెప్పినా వారు వినలేదు. -
ఇలాగైతే ఎలా?
అనంతపురం నగరం. తెల్లవారుజామున 5.30 గంటలు. కొందరు నిద్రపోతున్నారు. మరికొందరు వాకింగ్, జాకింగ్‌కు బయలుదేరారు. అదే సమయంలో రోడ్లపై పడిన చెత్తాచెదారంతో పాటు మురుగు కాలువలను శుభ్రం చేసేందుకు పారిశుద్ధ్య కార్మికులు సమాయత్తమయ్యారు. నగరాన్ని నిత్యం క్లీన్‌గా ఉంచేందుకు పాటుపడుతున్న వీరికి ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు అంతంత మాత్రమే. చేతికి గ్లౌజులు లేవు. ముక్కుకు మాస్క్‌ల్లేవు. కాళ్లకు గంబూట్లూ లేవు. అయినా అలానే మురుగు కాలువల్లోకి దిగుతున్నారు. చేతులతో మురుగు ఎత్తేస్తున్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు తమ ఆరోగ్యాలను ఫణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న వీరి కష్టసుఖాలను ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా ఎమ్మెల్సీ డాక్టర్ మీసరగండ గేయానంద్ స్పృజించారు. గేయానంద్ : నీ పేరేంటమ్మా? పారిశుద్ధ్య కార్మికురాలు : బాల ఓబుళమ్మ సార్... గేయానంద్ : రోజూ ఎన్ని గంటలు పని చేస్తావమ్మా? బాల ఓబుళమ్మ : ఉదయం ఐదున్నరకు వచ్చి పది గంటల వరకు పనిచేస్తాం. గేయానంద్ : పని చేస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి తల్లీ? బాల ఓబుళమ్మ : ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. గేయానంద్ : చేతులకు వేసుకునేవి ఇస్తున్నారా? బాల ఓబుళమ్మ : చాలా రోజుల కిందట ఇచ్చారు. అవి అప్పుడే పాడైపోయాయి. గేయానంద్ : జీతమెంత వస్తోంది? బాల ఓబుళమ్మ :15 ఏళ్ల నుంచి పనిచేస్తున్నా. మొదట్లో రూ.800 ఇచ్చారు. ఇప్పుడు రూ.7,600 ఇస్తున్నారు. సరిపోవడం లేదు. ----------------------------------- గేయానంద్ : నీ పేరేంటి? పారిశుద్ధ్య కార్మికుడు : నారాయణస్వామి సార్.. గేయానంద్ : పని చేస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు కల్గుతున్నాయి? నారాయణస్వామి : కసువు ఎత్తేప్పుడు నోట్లోకి, ముక్కలోకి పోతోంది. ఆరోగ్యం పాడవుతోంది. అయినా తప్పదు. మా పనే ఇది. అలాగే చేస్తున్నాం. ----------------------------------- గేయానంద్ : ఏమి పేరమ్మా? కార్మికురాలు : బాలమ్మ అయ్యా... గేయానంద్ : చేతులకు గ్లౌజులు, ముక్కుకు మాస్క్ లేకపోతే ఎలా పని చేస్తున్నారమ్మా? బాలమ్మ : ఏమి చేస్తామయ్యా.. తప్పదు! ఇదో ఈ రేకుతో గంపలోకి నెట్టుకుంటాం. దుమ్ము లోపలికి పోతుంది. ఇబ్బందిగానే ఉంటుంది. గేయానంద్ : ఏవైనా రోగాలు వస్తే ఎలాగమ్మా? బాలమ్మ : రోగాలు వస్తే పెద్దాస్పత్రికి పోతాం. ప్రైవేటు ఆస్పత్రికి పోయేందుకు మా కాడ అంత స్తోమత ఏడిది? గేయానంద్ : వస్తున్న జీతం సరిపోతోందా? బాలమ్మ : సరిపోకపోయినా సర్దుకోవాల్సిందే. అన్ని ఖర్చులూ పెరిగాయి.. మా కష్టం చూసి పెంచితే సంతోషమే. ----------------------------------- గేయానంద్ : నీ పేరేంటి? కార్మికుడు : వెంకటేశులు గేయానంద్ : ఏం పని చేస్తావ్? వెంకటేశులు : రెగ్యులర్ మేస్త్రీని సార్.. గేయానంద్ : ఎంత మందితో పని చేయిస్తావ్? వెంకటేశులు : పదకొండు మందితో.. గేయానంద్ : ఎంత మంది పిల్లలు ? వెంకటేశులు :ముగ్గురు కొడుకులు. ఇద్దరు పిల్లలు కార్పొరేషన్లోనే కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్నారు. గేయానంద్ : సెలవులు ఇస్తారా? వెంకటేశులు : ఎక్కడి సెలవులు సార్.. ఇది రోజు ఉండే పని. చాలా తక్కువగానే ఇస్తారు. నేను కూడా సెలవులు పెద్దగా తీసుకోను. ----------------------------------- గేయానంద్ : నీ పేరేంటయ్యా..? కార్మికుడు : మల్లికార్జున గేయానంద్ : ప్రస్తుత జీతమెంత? మల్లికార్జున: రూ.6,800 గేయానంద్ :ఎన్నేళ్లుగా పనిచేస్తున్నావు? మల్లికార్జున: తొమ్మిదేళ్ల నుంచి.. గేయానంద్ : చేతులకు గ్లౌజులు ఇవ్వకపోతే ఎలా చేస్తున్నారు? మల్లికార్జున:గ్లౌజులే కాదు.. పనిముట్లు కూడా పెద్దగా ఇవ్వడం లేదు. ఉన్న వాటితోనే సర్దుకుపోతున్నాం. ----------------------------------- గేయానంద్ : నీ పేరు ఏంటమ్మా? కార్మికురాలు : ఇమాంబీ గేయానంద్ : జీతమెంత ఇస్తున్నారు? ఇమాంబీ: ఆరు వేల రూపాయలు గేయానంద్ : ఇది సరిపోతుందా? ఇమాంబీ: పిల్లల చదువుకు, ఖర్చుకు కూడా సరిపోదు. ఏమి చేస్తాం సార్.. వచ్చేదాంతోనే సర్దుకుని బతుకుతున్నాము. గేయానంద్ : పిల్లలెంతమంది? ఏమి చదివిస్తున్నావు? ఇమాంబీ: ఒక కొడుకు. కాన్వెంట్లో చదివిస్తున్నా. ఏడాదికి ఏడు వేల రూపాయల ఫీజు కడుతున్నా. గేయానంద్ : ఆరోగ్యం ఎలా ఉంటోంది? ఇమాంబీ: మాకు ఆరోగ్య సమస్యలు ఎక్కువగానే వస్తాయి. పెద్దాస్పత్రికి వెళ్లి చూపించుకుంటాం. ----------------------------------- గేయానంద్ : నీ పేరు? కార్మికుడు : గుర్రప్ప గేయానంద్ : ఎప్పటి నుంచి పని చేస్తున్నావ్? గుర్రప్ప: 25 ఏళ్లుగా.. గేయానంద్ : ఎలాంటి ఇబ్బందులు పడుతున్నావ్? గుర్రప్ప: జబ్బులు వస్తున్నాయి. ఈఎస్ఐ కార్డు ఇవ్వనేలేదు. అదిస్తే కాస్త ఊరట ఉంటుంది. ----------------------------------- గేయానంద్ : ఏం పేరు బాబూ? కార్మికుడు : ప్రసాద్ సార్.. గేయానంద్ : జీతమెంత? ప్రసాద్: రూ.8,300 గేయానంద్ : పీఎఫ్, ఈఎస్ఐ జమ అవుతున్నాయా? ప్రసాద్: జీతం నుంచి కట్ చేస్తున్నారు. అయితే.. జమ చేయడం లేదు. ----------------------------------- గేయానంద్ : నీ పేరేంటి? కార్మికుడు : నాగలింగం గేయానంద్ : జీతం సరిపోతోందా? నాగలింగం: సరిపోదు. అయినా తప్పదు కదా! వచ్చే కొద్ది జీతంతోనే బతుకుతున్నాం. గేయానంద్ : జీతం నెలనెలా ఇస్తున్నారా? నాగలింగం: మూడు నెలలైంది.. ఇప్పటికీ ఇవ్వలేదు. గేయానంద్ : నెలనెలా రాకపోతే ఇల్లు ఎలా గడుస్తుంది? నాగలింగం: వడ్డీకి అప్పు చేస్తున్నాం. మూడు నెలలకు ఒకసారి ఇస్తే వచ్చేదాంట్లో వడ్డీకే కొంత పోతోంది. అలా కాకుండా ప్రతి నెలా ఇస్తే బాగుంటుంది. ----------------------------------- గేయానంద్ : నీ పేరేంటయ్యా? కార్మికుడు : మల్లేష్ గేయానంద్ : ఇంత వాసన భరించి పని చేస్తుంటారు రోగాలు రావా? మల్లేష్: ఏమి చేయాల సార్! మాకు ఇదే జీవితం. పనిచేయకపోతే ఇల్లు గడవదు. వాసనొచ్చినా.. ఏమొచ్చినా చేయాల్సిందే కదా! గేయానంద్ : ఇన్ని ఏళ్లుగా పని చేస్తున్నారు కదా? ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? మల్లేష్: మాకు వచ్చే జీతంతో కుటుంబాలే గడవవు. పక్కా గృహాలు ఇస్తే అద్దె అయినా తగ్గుతుంది. ఈఎస్ఐ కార్డు కూడా ఇవ్వాలి. ----------------------------------- గేయానంద్ : నీ పేరేంటి బాబూ? కార్మికుడు : నాగేంద్ర గేయానంద్ : ఎన్నేళ్లుగా పని చేస్తున్నావ్? జీతం ఎంత వస్తోంది? నాగేంద్ర: 1996 నుంచి పనిచేస్తున్నా. మొదట్లో రూ.800 వచ్చేది. ఇప్పుడు రూ.8,300 ఇస్తున్నారు. గేయానంద్ : సమస్యలేవైనా ఉన్నాయా? నాగేంద్ర: జ్వరాలు వస్తున్నాయి. గవర్నమెంటు ఆస్పత్రికి పోయి చూపించుకుంటాం. రోగాలొస్తున్నా అలాగే చేస్తున్నాం. గేయానంద్ : ప్రభుత్వం నుంచి ఏమి కోరుకుంటున్నారు? నాగేంద్ర: ఏళ్లగా పనిచేస్తున్నాం. పర్మినెంట్ చేయాలని కోరుతున్నాం. జీతభత్యాలు కూడా పెంచాలి. ----------------------------------- గేయానంద్ : నీ పేరు చెప్పమ్మా? కార్మికుడు : లక్ష్మినరసమ్మ సార్.. గేయానంద్ : పనిభారం ఉందా? లక్ష్మినరసమ్మ : చాలా ఉంది సార్. ఇక్కడా పని చేయిస్తారు. ఇంటింటికీ వెళ్లి చెత్త తీసుకొచ్చేందుకు పంపిస్తారు. సరిపడా కార్మికులు లేరు. ఎక్కువ మందిని తీసుకోమని అడుగుతున్నా పట్టించుకోవడం లేదు. గేయానంద్ : సొంతిల్లు ఉందా? లక్ష్మినరసమ్మ : లేదు సార్.. గేయానంద్ : ఇల్లు ఇవ్వాలని ప్రభుతాన్ని అడిగారా? లక్ష్మినరసమ్మ : చాలా ఏళ్ల కిందట కంపోస్ట్ యార్డు వద్ద ఇస్తామని చెప్పారు కానీ ఇవ్వలేదు. ఇప్పటికీ అడుగుతూనే ఉన్నాం. ఎవరూ పట్టించుకోవడం లేదు. గేయానంద్ : మీ పిల్లలనూ ఈ పనిలోనే కొనసాగిస్తారా? లక్ష్మినరసమ్మ : మా బాధలు పిల్లలకు వద్దు. ఈ కష్టం మాతోనే పోవాలె. అందుకే ఉన్నదాంట్లో వారికి ఖర్చు చేసి చదివించుకుంటున్నాం. -
మా జీవితాలు ‘చెత్త' బతుకులేనా?
‘‘చెత్త తీసేందుకు మేము కావాలె... డ్రైనేజీ పనికి మేమే కావాలె... ఆఖరికి ఇంటిముందు కుక్కలు, పందులు చచ్చినా మేమే వచ్చి తీయాలె... కానీ గుక్కెడు నీళ్లడిగితే మాత్రం మీరియ్యరు. బుక్కెడు బువ్వ కూడా పెట్టరు. మమ్ముల్ని చూస్తే ఈసడించుకుంటరు. కనీసం మమ్మల్ని మనుషులుగా కూడా సూత్తలేరు. మేమేం పాపం చేసినం సారూ... మేము మనుషలం కాదా?’’ పారిశుధ్య కార్మికురాలు యశోద గుండెల్లో నుంచి వచ్చిన మాటలివి. నిజానికి కార్మికులందరి గుండెల్లో ఉన్న వేదన ఇది. రోడ్లపై చెత్తను, డ్రైనేజీల్లో పేరుకుపోయిన అశుద్ధిని చిత్తశుద్ధితో ఏరిపారేస్తూ నగరాన్ని ఎప్పటికప్పుడు సుందరంగా ఉంచుతున్న కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుధ్య కార్మికులు పడుతున్న బాధలను, ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు బల్దియా మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ ‘సాక్షి’ తరఫున రిపోర్టర్‌గా మారారు. శనివారం తెల్లవారుజామునే వీధుల్లోకి వచ్చి పారిశుధ్య కార్మికులను పలకించారు. సమస్యలను అడిగారు. వారి గుండెల్లో గూడుకట్టుకున్న బాధను, వేదనను పాఠకుల ముందు ఆవిష్కరించారు. మేయర్ హామీలివీ.. పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ వెంటనే మాస్కులు, గ్లౌజులు, బూట్లు అందిస్తామన్నారు. ఇప్పటికే 125 పర్మినెంట్, 681 కాంట్రాక్టు, 66 మంది గ్రూపు కార్మికుల కోసం వీటిని తెప్పించామన్నారు. వారం రోజుల్లోగా వీటిని కార్మికులకు పంపిణీ చేయాలని శానిటరీ సూపర్వైజర్ రాజమనోహర్‌కు సూచించారు. పదిహేను రోజులకోసారి చీపుర్లు అందించాలని శానిటరీ జవాన్‌ను ఆదేశించారు. పీఎఫ్ జమ చేయడంలో బల్దియా అధికారుల నిర్లక్ష్యం ఉంటే వెంటనే సమస్య పరిష్కరిస్తానని అన్నారు. కార్మికులకు వేతనాలు ప్రతి నెల పదో తేదీలోగా అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ‘‘మా నౌకర్లు పర్మెంటు గావాలె. తెలంగాణ అచ్చినంక జేత్తమన్నరు. ఈ కాంటాక్టు జీతాలద్దు మాకు. గౌర్మెంటు జీతాలే గావాలే. పక్క ఊర్లల్లకెల్లి అత్తన్నం. రోజుకు యాబై అటో కిరాయిలైతన్నయ్. మాకు ఇక్కన్నే ఇండ్ల స్థలాలియ్యాలె. - శంకరమ్మ రవీందర్‌సింగ్ : అందరూ బాగున్నారా? లక్ష్మి : అంతా మీ దయ సారూ.. ఇప్పుడైతే ఇట్టున్నం. రవీందర్‌సింగ్ : ఆరోగ్య సమస్యలేమైనా ఉన్నాయా? శోభరాణి : 24 గంటలు దుమ్ముల, వాసనల బతికోటోళ్లం. రోగాలు, నొప్పులు వస్తన్నయ్. అన్ని భరించుకుంటున్నం. చాతగాని నాడు సెలవువెట్టుకుంటున్నం. మళ్ల తెల్లారి తప్పదన్నట్టు పనికత్తన్నం. రవీందర్‌సింగ్ : దవాఖానాకు పోతుండ్రా మరి? ప్రేమలత : జరమచ్చి, రోగమచ్చి సర్కారు దవఖానకెళ్తే ఎవ్వలు పట్టించుకుంటలేరు. మున్సిపాలిటీ డ్రెస్సేసుకొని పోయినా కానుతలేరు. మున్సిపలోల్లు అచ్చినప్పుడు పట్టించుకునేటట్లు చెయ్యాలె. జరాలు, రోగాలు అచ్చినప్పుడు ఇబ్బందయితంది. రవీందర్‌సింగ్ : పనికి తగ్గట్టు వసతులు మంచిగున్నయా? హన్మంతు : మోరీలల్ల దిగినప్పుడు గాజు వక్కలు, సూదులు గుచ్చుకపొయ్యి గాయాలైతన్నయ్. చెత్త తీసేటప్పుడు చేతులకు గుచ్చుకుంటన్నయ్. మోరీలు తీసేటప్పుడు, చచ్చిపోయిన పందులను, కుక్కలను తీసేటప్పుడు వాసన భరించలేకపోతున్నం. కక్కచ్చినట్లయితంది. మాకు మాస్కులు, చేతులకు గ్లౌజులు, బూట్లు ఇయ్యాలె. అవ్వి లేకపోతే పనిజేసేటప్పుడు చాన కట్టమైతంది. రవీందర్‌సింగ్ : ప్రైవేటు హాస్పిటల్స్‌లో వేస్టేజ్, చెత్త అన్నీ మీరే తీస్తున్నరా? అనిల్ : లైన్ ప్రకారం తీస్తన్నం. ఎసోంటి పనైనా మేమే చెయ్యాలెగదా. పని నచ్చినప్పుడు చాయమందం పైసలిత్తరు. ఒక్కొక్కలు ఇయ్యనే ఇయ్యరు. అయినా మాపని మేం జేసుకుంటనేపోతం. రవీందర్‌సింగ్ : మీకు ఏం కావాలనుకుంటున్నరు? యశోద : మమ్ములను మంచిగ జూసుకుంటే మేము రోడ్లను, వాడలను మంచిగ ఊడుత్తం. దోమలు పెరగకుండ జూత్తం. చీపుర్లు ఇస్తలేరు, మాస్కులు ఇత్తలేరు. నూనెలు, సబ్బులు, చెప్పులు ఇయ్యాలె. చీపుర్లు బయటకొంటె ఇరవై రూపాలు అయితన్నయ్. పదిగేను రోజులకోసారైనా చీపుర్లు ఇయ్యాలె. రవీందర్‌సింగ్ : జీతాలు నెలనెల వస్తున్నాయా? బాలవ్వ : జీతాలు రెన్నెళ్లకు, మూన్నెళ్లకు అత్తన్నయ్. ఏ నెల జీతం ఆనెల ఇత్తె మంచిగుంటది. ఇంటి ఖర్చులకు, పోరగాండ్ల చదువులకు తిప్పలైతాంది. రోజురోజుకు ఖర్చులు పెరుగుతన్నయ్. జీతాలు కూడా పెరుగాలె. రవీందర్‌సింగ్ : వేతనాలు రూ.6700 నుంచి ఆర్నెల్ల క్రితం రూ.8300 పెరిగినయి కదా.. పీఎఫ్ నెంబర్లు వచ్చినయా? అంజనేయులు : ఏమో సారూ... అందరికీ పీఎఫ్ నంబర్లు ఇచ్చినమని చిట్టీలైతే ఇచ్చిండ్రు. బుక్కులియ్యలే. మాకైతే నంబర్లు తెలువయిగని, కట్‌చేసిన పైసలు కడుతలేరని చెబుతుండ్రు. మాకు అన్యాయం కావద్దు. రవీందర్‌సింగ్ : మీకు ఇంకా ఏమేం కావాలో చెప్పండి? శంకరమ్మ : మా నౌకర్లు పర్మెంటు గావాలె. తెలంగాణ అచ్చినంక జేత్తమన్నరు. ఈ కాంటాక్టు జీతాలద్దు మాకు. గౌర్మెంటు జీతాలే గావాలే. పక్క ఊర్లల్లకెల్లి అత్తన్నం. రోజుకు యాబై అటో కిరాయిలైతన్నయ్. మాకు ఇక్కన్నే ఇండ్ల స్థలాలియ్యాలె. రవీందర్‌సింగ్ : తెల్లకార్డులున్నయా.. ఆహారభద్రతకు దరఖాస్తు చేసుకున్నరా? లక్ష్మి : అందరికీ తెల్లకార్డులున్నయ్. ఆహారభద్రత కార్డుల కోసం గూడ దరఖాస్తు పెట్టుకున్నం. ఎప్పుడిత్తరో ఏమో. మాకైతే పెద్ద దవఖాన్లకు సూపించుకునేతట్లు సౌకర్యం చెయ్యాలె. దవాఖాన కార్డులియ్యాలె. రవీందర్‌సింగ్ : పోచయ్య డల్లుగున్నవ్... జ్వరమొస్తందా? పోచయ్య : అవును సారూ.. నిన్న మొన్న జరముండే. ఇయ్యల్ల కొంచెం తగ్గింది. రెండు రోజులు సెలవుపెట్టిన. నాకు వయసైపోతంది. బాగ చాతకాకపోతే నా కొడుకును నౌకరికి ఎక్కిత్తననుకుంటన్న. ఇంకేంజెయ్యాలె. రవీందర్‌సింగ్ : ఎవ్వరైనా ఇబ్బంది పెడుతున్నారా? ప్రభాకర్ : చెప్పిన పని చేస్తన్నం. పనికాడ, ఆజిరికాడ మమ్ములను ఇబ్బందేం పెడుతలేరు. కానీ పనిభారం ఎక్కువైతాంది. ఇద్దరు చేసేకాడ ఒక్కరితోనే చేయిత్తాండ్రు. మనుషులు తక్కువైన కాడ జబ్బలు, కాల్లు పోతన్నయ్. ఇబ్బంది అయితంది. సిబ్బందిని పెంచితే ఇంకా మంచిగ పనిచేస్తం. రవీందర్‌సింగ్ : ట్రాక్టర్ డ్రైవర్‌గా ఎన్నాళ్ల నుంచి చేస్తున్నవ్, లెసైన్స్ ఉందా? వెంకటయ్య : సారు మొదట్ల లేబర్‌గానే పనికెక్కిన. డ్రైవింగ్ నేర్చుకున్నంక లెసైన్స్ తీసుకున్న. ఐదేండ్ల నుంచి డ్రైవర్‌గా జేత్తన్న. సందులల్లకు పోయినప్పుడు ట్రాక్టర్ తిరుగుటానికి కొద్దిగ ఇబ్బంది అయితది. మేన్రోడ్లమీద ఫర్వలేదు. రవీందర్‌సింగ్ : డివిజన్లకు వెళ్లినప్పుడు ఎలా ఉంటుంది? శోభారాణి : పనైతే చేయించుకుంటరు గని, మంచినీళ్లు అడిగినా శానిటేషనోల్లమని ఇయ్యడానికి ఎనుకముందు జేత్తండ్రు. కుక్కజచ్చినా, పిల్లిజచ్చినా పిలుత్తరు. పనిచేయడానికి మేం కావాలెగని, మమ్మల్ని పట్టిచ్చుకోరు. రవీందర్‌సింగ్ : రిక్షాలకు చెత్త ఇస్తుండ్రా? వెంకటేష్ : వాడలల్లకు పోయి విజిల్ వేస్తే ఇండ్లల్లకెళ్లి చెత్త తెచ్చి ఇస్తరు. రిక్షాలు రిపేరుకొస్తే పట్టిచ్చుకుంటలేరు. మేము రిపేరు చేయించుకుందామన్నా పైసలిత్తలేరు. పంచరైన రిక్షాలను గుంజుకపోతంటే చాతిల నొప్పత్తంది. రవీందర్‌సింగ్ : సీఎం కేసీఆర్ మన నగరాన్ని స్మార్ట్ సిటీ చేస్తానంటుండు. నగరాన్ని సుందరంగా ఉంచుటానికి ఏం చేస్తే బాగుంటది? యశోద : సార్... మేం లచ్చలు, కోట్లు అడగం. మమ్ముల్ని మనుషులుగా చూడాలని కోరుతున్నం. ఏం సార్... మేం మనుషులం కాదా? మీరు మాకు గౌరవం కల్పిస్తే కేసీఆర్ సార్ చెప్పినట్లు కరీంనగర్‌ను అందంగా ఉంచుతం. అందుకోసం ఎంత పనైనా చేస్తం. తెలంగాణలో మనమే ఫస్టుంటం. సార్... మేం లచ్చలు, కోట్లు అడగం. మమ్ముల్ని మనుషులుగా చూడాలని కోరుతున్నం. ఏం సార్... మేం మనుషులం కాదా? మీరు మాకు గౌరవం కల్పిస్తే కేసీఆర్ సార్ చెప్పినట్లు కరీంనగర్‌ను అందంగా ఉంచుతం. అందుకోసం ఎంత పనైనా చేస్తం. తెలంగాణలో మనమే ఫస్టుంటం. - యశోద -
వందలకొద్ది ఫిర్యాదులు వస్తున్నాయి
తిరుపతి : తిరుపతిలో పారిశుధ్యంపై మంత్రి నారాయణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం ఆయన పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ తిరుపతిలో పారిశుధ్యంపై వందలకొద్ది ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. దీనిపై అధికారులు సమీక్ష సమావేశాలు నిర్వహించుకోవాలని, మరోసారి ఫిర్యాదులు వస్తే అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌లో పట్టణాల ఆధునీకరణకు ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని నారాయణ తెలిపారు. పట్టణ ప్రజల మౌలిక వసతులు మెరుగు పరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. పట్టణాల్లో అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకుంటామని నారాయణ స్పష్టం చేశారు. -
చేయి చేయి కలుపుదాం..చెత్తకు టాటా చెబుదాం..
ఖైరతాబాద్: చారిత్రక నేపథ్యమున్న భాగ్యనగరం ఎన్నో అందాలు నెలవు. హైటెక్ సిటీగా గుర్తింపు పొందిని గ్రేటర్లో రోజు రోజుకు పేరుకుపోతున్న చెత్తను అరికట్టి క్లీన్ అండ్ గ్రీన్‌గా చేసేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ఇందుకోసం నగరంలో 36 కిలోమీటర్ల మేర ప్రధాన రోడ్లను గుర్తించి ఆయా రోడ్లలో ‘చెత్త రహిత సమాజం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మంగళవారం జీహెచ్ఎంసీ సెంట్రల్ జోన్ పరిధిలోని నెక్లెస్ రోడ్డు నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సెంట్రల్ జోన్ కమిషనర్ డాక్టర్ సత్యనారాయణ, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ (శానిటేషన్) రవికిరణ్, డీఎంసీ సోమరాజుతో పాటు నెక్లెస్ రోడ్డులో వ్యాపారాలు చేస్తున్నవారితో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. చెత్తను ఎప్పటికప్పుడు వ్యాపారులు రోడ్లపై పడకుండా బ్యాగుల్లో వేసుకోవాలని, రోజూ మెక్లిన్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సిబ్బంది, వాహనాలలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు ఆ చెత్తను ఆయా వాహనాలలో వేయాలని సూచించారు. మెక్లిన్ సంస్థ ఎండీ ప్రేమానంద్ మాట్లాడుతూ రోజూ షిఫ్ట్‌ల వారీగా వాహనాలు తిరుగుతాయని తెలిపారు. సమావేశంలో సెంట్రల్ జోన్ ఏఎంహెచ్ఓలు డాక్టర్ దామోదర్, మనోహర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ముందస్తుగా ఈ ప్రాంతాల్లో అమలు.. మహా నగరానికి దేశ విదేశాల నుంచి ఎంతో మంది ప్రముఖులు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చెత్త రహిత సమాజ నిర్మాణంలో భాగంగా తొలుత ఏడు ప్రధాన రోడ్లను గుర్తించి ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. * బంజారాహిల్స్ రోడ్ నెంబర్. 2 నుంచి నాగార్జున సర్కిల్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ వరకు * జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36 నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మీదుగా పెద్దమ్మ ఆల యం, మాదాపూర్ పోలీస్ స్టేషన్ వరకు * జూబ్లీహిల్స్ రోడ్ నెం. 92 నుంచి కళింగ ఫంక్షన్ హాల్, సి.వి.ఆర్ న్యూస్ చానెల్ మీదుగా చెక్‌పోస్ట్ వరకు * బంజారాహిల్స్ రోడ్ నెం. 12 పెన్షన్ ఆఫీస్, ఇన్కమ్ టాక్స్ కార్యాలయం మీదుగా కళింగ ఫంక్షన్ హాల్ వరకు * బంజారాహిల్స్ రోడ్ నెం.1 నుంచి జీవీకే మాల్, జలగం వెంగళరావు పార్కు మీదుగా పెన్షన్ ఆఫీస్ వరకు * ఖైరతాబాద్ చౌరస్తా నుంచి సోమాజిగూడ, సీఎం క్యాంపు కార్యాలయం, బేగంపేట్ ఫ్లై ఓవర్ వరకు * బేగంపేట్ మీదుగా గ్రీన్‌ల్యాండ్, ఐమాక్స్, నెక్లెస్ రోడ్డు, అసెంబ్లీ పరిసర ప్రాంతాల ప్రధాన రోడ్లలో అమలు చేస్తున్నారు. అతిక్రమిస్తే జరిమానా వచ్చే నెల 1న చెత్త రహిత సమాజ నిర్మాణంపై నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. అదే రోజు నుంచి అమలులోకి వస్తుంది. ఆ తరువాత షాపులు, తోపుడు బండ్లు.. ఇలా వ్యాపారాలు చేసుకునేవారి షాపుల ముందు చెత్త కనిపిస్తే మొదటి తప్పిదం కింద రూ.500, రెండోసారి రూ.1000, మూడోసారి రూ.3000, నాలుగోసారి రూ.4000, ఐదోసారి రూ. 10 వేల జరిమానా విధిస్తామన్నారు. ఆ తరువాత కూడా అదే తప్పిదం చేస్తే మూడు నెలల జైలు శిక్ష తప్పదు. -
చెత్తపై చైతన్యం కోసం...
అడ్డమైన చెత్తా చెదారం మధ్య కుటుంబం అంతా హాయిగా ఎంజాయ్ చేస్తోందేమిటా అని అనుకుంటున్నారా? ఈ చెత్తంతా వాళ్లదే. వారం రోజులపాటు వారి కుటుంబం నుంచి వచ్చిన చెత్తని సమీకరిస్తే ఇంతైందన్నమాట. ప్రస్తుత రోజుల్లో జనం జీవనశైలి కారణంగా విపరీతంగా చెత్త పేరుకుపోతోంది. సగటున ఒక్కో అమెరికన్ వల్ల రోజుకు రెండు కిలోల చెత్త పేరుకుంటోంది. దీంతో ఈ అంశంపై వారిని చైతన్యం చేసేందుకు కాలిఫోర్నియా ఫొటోగ్రాఫర్ గ్రెగ్ సేగల్ ‘వారం రోజుల చెత్త’ పేరుతో ఇలాంటి ఫొటోలు తీశారు. చాలామంది వ్యక్తులు ఈ ఫొటోలు చూసైనా అనవసరంగా ఎంత చెత్త పేరుకుపోవడానికి కారణమవుతున్నామో తెలుసుకుని, దాన్ని తగ్గించుకునేందుకు చర్యలు తీసుకుంటారనే ఉద్దేశంతో సేగల్ ఈ చిత్రాలు తీశారు. -
పారిశుధ్య కార్మికుల సమ్మె, ఎక్కడ చెత్త అక్కడే
హైదరాబాద్: జీహెచ్ఎంసీ కార్మికుల సమ్మెతో గ్రేటర్ హైదరాబాద్‌లో ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోయింది. జీహెచ్ఎంసీలోని పారిశుధ్య విభాగంలోని కార్మికులతోపాటు రవాణ, ఎంటమాలజీ, బయోడైవర్సిటీ, వెటర్నరీ సహ మొత్తం 13 కేటగిరీల్లోని కార్మికులకు కూడా 27 శాతం ఇంక్రిమెంట్‌ను ఇవ్వాలనే ప్రధాన డిమాండ్‌తో అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. దీంతో నగరంలో చెత్తను తరలించే 850 వాహనాలు నిలిచిపోయాయి. తమ డిమాండ్లను నెరవేర్చేవరకూ సమ్మెను కొనసాగిస్తామని కార్మిక సంఘాలు తేల్చి చెప్పాయి. కాగా జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్....గురువారం ఉదయం పారిశుధ్య కార్మికు సంఘాలతో చర్చలు జరుపుతున్నారు. సమ్మె విరమించాలని ఆయన కోరారు. మరోవైపు కార్మికుల సమ్మె కారణంగా చెత్త తరలింపు విషయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జోనల్ కమిషనర్లకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. -
పనికిరాని చెత్త తొలగించాలంతే!
పద్యానవనం కల్మషంబుడుగక కాన్పింపదందున్న రూపమెవ్వరికైన రూడితోడ తామసంబు లణగ తగవెల్గు జ్ఞానంబు విశ్వదాభిరామ వినుర వేమ! లో చూపు గురించి చాలా మంది తత్వవేత్తలు అద్భుతంగా చెప్పారు. ముఖ్యంగా వేమన. పైపై అవగాహన, మిడిమిడి జ్ఞానం కాకుండా ప్రతి విషయంలోనూ అంతర్లీనంగా ఉండే మర్మాన్నెరగాలంటారు. ఎరుక గొప్పది. అంటే, ఏదైనా ఎరుక కలిగి, కాస్త లోతుగా తెలుసుకొని సదా ప్రజ్ఞతో ఉండమని అర్థం. ఆ ఎరుక సాధించడానికి జ్ఞానం అవసరం. మనం కష్టపడనవసరం లేకుండానే ప్రాపంచికమైన అనేక విషయాలను దృవపడిన ప్రాకృతిక సత్యాలతో సాపేక్షంగా చెప్పాడాయన. పిరికివాని బింకమిదీ అని మేడిపండును ఒలిచినా, తింటూ ఉంటే వేపాకూ తియ్యన అని సాధన మర్మమెరిగించినా, ఉప్పు-కప్పురం లాంటి పురుషుల్లోని వ్యత్యాసాల్ని విడమర్చినా, దేవుడైనా తెలివి ఉంటేనే లెఖ్క అని లాజిక్ చెప్పినా.... వేమనకు వేమనే సాటి! అలతి అలతి పదాల ఆటవెలది అస్త్రాలతో సామాజిక రుగ్మతల మీద ఆయన యుద్దమే ప్రకటించాడు. గడచిన వెయ్యేళ్ల కాలంలో, జన సాహిత్యాన్ని ఉపకరణంగా వాడిన వేమనంతటి సాధాసీదా సంఘ సంస్కర్త మరొకరు లేరంటే అతిశయోక్తి కాదేమో! ఈ చిన్న పద్యంలోనే చూడండి... జ్ఞానం ఎలా లభిస్తుందో చాలా సులభంగా చెప్పాడు. తమస్సు అంటే చీకటి, అజ్ఞానపు చీకటి తొలగాలట. అప్పుడే జ్ఞానమనే వెలుగు ప్రస్పుటమౌతుంది. పద ప్రయోగం కూడా... జ్ఞానం ‘తగవెల్గు' అంటాడు. అంటే, ఎంత అవసరమో అంత అని. జ్ఞానం ఎక్కువయితే కూడా ప్రమాదమే! మేధోశక్తి పరిమితి మించి అతి(పర్వర్షన్)గా వ్యవహరించే ఎంత మంది అతిగాళ్లని మనం చూడట్లేదు! ‘అతి సర్వర్త్ర వర్జయేత్’ అన్నది ఆర్యోక్తి. అవసరాలకు సరిపడా జ్ఞానం అందరికీ కావాల్సిందే. అందుకే, అజ్ఞానాంధకారం తొలగాలన్న ఆశతోనే మనం, ఓ దేవా! నన్ను చీకటి నుంచి వెలుగువైపు నడిపించు, ‘తమసోమా జ్యోతిర్గమయా!’ అని వేడుకుంటాము. అజ్ఞానాన్ని సంపూర్ణంగా తొలగించుకోవడమూ సాధ్యపడదనే భావనతోనే కావచ్చు, ‘అణగాలి' అనే పద ప్రయోగం చేశారు వేమన. తామసంబులు అన్న బహువచన భావనని మరో అర్థంలోనూ ప్రయోగించి ఉంటాడు. మానవుల గుణాలన్ని మూడు రకాలుగా విభజిస్తారు లాక్షణికులు. రజోగుణం, తమోగుణం, సత్వగుణం. వాటి వాటి పాళ్లు, హెచ్చు తగ్గుల స్థాయిని బట్టి వ్యక్తుల వ్యక్తిత్వాల నిర్మాణం జరుగుతుందనీ చెబుతారు. రజోగుణం రాజసానికి, గర్వానికి, సాహస-పౌరుషాలకి ప్రతీక అయితే, తమో గుణం రాక్షసత్వానికి, దౌర్జన్యానికి, అతిశయ-అహంకారాలకు ప్రతినిధి అంటారు. ఇక సత్వ గుణం.... వినయం, వివేచన, ఓపిక-సద్యోచన వంటి సకల విధ సాత్వికతకు ప్రతీక. ఈ మూడు, ‘స'త్వ, ‘త'మో, ‘ర'జో గుణాల (అదే క్రమం) మేలు కలయిక ‘స్త్రీ' అని పెద్దలెవరో చెప్పిన మాట అక్షర సత్యమనిపిస్తుంది. స్త్రీ అన్న ఏకాక్షర పదంలో స, త, ర కారాలకు ఎంతెంత వాటా ఉందో, సగటు మహిళలో కూడా దాదాపు అదే పాళ్లలో ఆయా గుణాలుంటాయేమో అనిపిస్తుంది. చుట్టూ ఉండే చెత్తా చెదారం తొలగిపోతే కాని, అందులో దాగి ఉండే రూపం స్పష్టత ఏర్పడదు అని ఒక ప్రకృతి పరమైన సత్యాన్ని సాపేక్షంగా చెబుతూ జ్ఞానమెలా ఆవిష్కృతమౌతుందో వేమన పోల్చి చూపాడు. నిజమే, లోన రూపుదిద్దుకొని ఉన్న ఆకృతిని చూడాలంటే చుట్టూ ఉన్న చెత్తను తొలగించాలి. జ్ఞానాజ్ఞానాలు కూడ అలాంటివే! అయిదారు వందల సంవత్సరాల కింద గొప్ప శిల్పిగా, చిత్రకారుడిగా, కవిగా జగత్ప్రసిద్ధి పొందిన మైఖలాంజిలో చెప్పిన మాట ఈ సందర్భంగా గుర్తొస్తుంది. ఎదిగిన కొద్దీ ఒదిగే గుణం మహనీయులకే సాధ్యమన్నట్టు, తన ప్రతిభకన్నా ప్రకృతికే పెద్ద పీట వేస్తూ ఆయన చెప్పిన మాట వినయానికి పరాకాష్ట వంటిది. ఆయన శిల్పనైపుణ్యానికి అబ్బురపోయిన ఓ పెద్ద మనిషి ‘అబ్బ ఎంత గొప్పగా చెక్కారు!’ అని ప్రశంసిస్తుంటే, మైఖలాంజిలో చాలా వినయంగా స్పందించారట. ‘అబ్బే! అందులో నే చేసిన గొప్ప పనేం లేదు. ఆ శిల్పం అప్పటికే ఆ రాయిలో ఉన్నట్టుంది. అనవసరమైన చెత్తంతా నే తొలగిస్తే, అదుగో... ఆ శిల్పం అలా మిగిలింది!’ - దిలీప్‌రెడ్డి